అబ్బురంపుశిశువు ఆకుమీఁద శిశువు
స్వరూపం
అబ్బురంపుశిశువు ఆకుమీఁద శిశువు
దొబ్బుడు రోల శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి
పుట్టు శంఖు చక్రములఁ బుట్టిన యాశిశువు
పుట్టక తొల్లే మారుపుట్టువైన శిశువు
వొట్టుక పాలు వెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోని శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి
నిండిన బండి దన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణఁచిన శిశువు
కొండలంతేశ సురులఁ గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి
వేఁగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌఁగిటి యిందిర దొలఁగని శిశువు
ఆఁగి పాలజలధిలో నందమైన పెనుఁబాము
తూఁగు మంచము శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి 5-220