అపరాధి నపరాధిని రామయ్య
స్వరూపం
పల్లవి:
అపరాధి నపరాధిని రామయ్య, నే
అనుపల్లవి:
అపరాధి నపరాధి నపరాధి నోరామ
నెపము లెంచక ప్రోచు నెరదాత వీవె
చరణము(లు):
దిన మెనిమిదిజాముల నొక్క గడియయైన
మనసు నిలిపి నీదు మహిమ వర్ణించి
ఘనులసంగతిఁ గూడి కాలముఁ గడవక
కడు మదమున ముందు గననైతి నకటా
అరిషడ్వర్గముచే నలసటఁ జెందుచు
దురితములకు లొంగి దుఃఖ మందుచును
పరమభక్తులఁ జూచి పరియాచకముఁజేసి
అరసి సద్గురు నెరుగనైతి గటకటా
వాసిగ భద్రాద్రివాసుని దాసాను
దాసుఁడనఁగ భువి భాసిల్లి వేడు
ఆశచే నరసింహదాసుఁడనై భవ
పాశము లెడ జిమ్మి దోసిలొగ్గితిని