Jump to content

అధిక్షేపశతకములు/శ్రీ భర్గశతకము-పీఠిక

వికీసోర్స్ నుండి

కూచిమంచి తిమ్మకవి - భర్గ శతకము

కూచిమంచి వారిది విద్వత్కుటుంబము. వారిలో పండిత కవులుగ సత్కావ్య కర్తలుగ ప్రశ ప్తి వహించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గకవి అనువారు సుప్రసిద్ధులు. పాండితీ వైభవము - అనర్గళ కవితాధార మూర్తీభ వించినవారు వీరు. కూచిమంచి తిమ్మకవి కౌండిన్యస గోత్రుడు. గంగమంత్రి సుతుడు. కుక్కు దేశ్వర కారుణ్యకటాక్ష కవితా సామ్రాజ్య ధౌరేయుఁడు. దెందులూరి లింగన సద్గురుని శిష్యుడు - ఈతడశేష కవితావిలాస భాసురుడనియు, నవీన శబ్ద శాసనాభిధానుడనియు జగ్గకవి ప్రస్తుతించెను. నీలాద్రి మాధవరాయ సృపతిచే తిమ్మకవి కవిసార్వభౌమ బిరుదము నొందెను. క్రీ.శ. 1700–1780 మధ్యకాలమున జీవించెనని శతక వాజ్మయ చరిత్రకారుల అభిప్రాయము-రుక్మిణీ పరిణయము - సారంగధర చరిత్ర - రసికజన మనోభిరామము - నీలా నుందరీ పరిణయము - అచ్చతెనుగు రామాయణము అను కావ్యములను కొన్ని శతకములమ రచించెను. ఈ కవి రచించిన శతకములలో భw కుక్కుటేశ్వర శతకములు ప్రసిద్ధి నొందినవి. బహుళ ప్రబంధ నిర్మాతగ విద్వత్కవిగ ఈతడు శ్రీనాథాదులను, స్వతంత్ర ప్రవృత్తిలో పోతనాదులను స్మరింపజేయును, ప్రభువుల ఆదరాభిమానములకు పాత్రుడై , పొరిచే సన్మానముల నొందియు వారికి కృతు లంకీత మొసగక , పిఠాపురము నందలి కుక్కుటేశ్వరస్వామి పేరనే తన కావ్యములను రచించెను. మానవ మాత్రులకు కావ్యమొసగి తుచ్ఛభోగముల నాసించక వారొసగు ఘనవిభవములన్నియు నస్థిరములని తిమ్మకవి తలచెను. కుక్కుదేశ్వరు నుద్దేశించి వ్రాసిననే కుక్కుటేశ్వర శతకము. ఈ శతక రచనకు ముందే దాదాపు క్రీ.శ. 176-8 లో తిమ్మకవి భర్గశతకమును రచించెను.

భర్గశతకము భక్తి నీతి ఆధిక్షేప ప్రధానమైనది. భక్తి ప్రధానమైన పద్యములలో భక్తి శతక సామాన్య లక్షణములు, భగవన్నామ స్తుతిసంకీర్తనాదులు, గుణకీర్తనము పరమేశ్వర లీలా భివర్ణనము - భక్త ప్రశంస - ఆత్మసివేదనము మున్నగునవి కలవు. ఈ పద్యములందే కొన్నిట నీత ఆధ్ చేప పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/17 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/18 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/19