అదె లంక సాధించె
స్వరూపం
అదె లంక సాధించె (రాగం: ) (తాళం : )
అదె లంక సాధించె అవని భారము దించె
విదితమై ప్రతాపము వెలయించెనితడు // పల్లవి //
రవివంశ తిలకుడు రాముడితడు
భువి పుట్టె దశరథ పుత్రుడితడు
భవుడెంచె తారక బ్రహ్మమీతడు
పవనజు గిచ్చినాడు బ్రహ్మ పట్టమితడు ||అదె లంక||
బలువుడు సీతాపతి యీతడు
అలగొన్న వాలి మర్దనుడీతడు
విలసిల్లె ఏకాంగ వీరుడితడు
చలమని కోదండ దీక్షాపరుడితడు ||అదె లంక||
శరణాగత వజ్రపంజరుడితడు
సరిలేని అసుర భంజకుడీతడు
వరదుడు శ్రీవేంకటేశ్వరుడితడు
అరయ విజయనగరాధీశుడితడు ||అదె లంక||