అతి ధీరవేకాని

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చిత్రం: ప్రమీలార్జునీయం (1965)

రచన: పింగళి నాగేంద్ర రావు

గానం: ఘంటసాల

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు


అతి ధీరవే గాని మాట మాట

ప. అతి ధీరవే గాని, అపురూప రమణివే

అతి ధీరవే గాని, అపురూప రమణివే

జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త


చ. నీ సుకుమార ఠీవికి మురిసి ఓ...

నీ సుకుమార ఠీవికి మురిసి

నీ అసమాన ధాటికి దడిసి

ఎవని కనులు చెదరునో,

నీకు దిష్టి తగులునొ తరుణీ ||అతి ధీరవే||


చ. నీ నయగారమే సెలయేరుగా,

నీ అనురాగమే సుడిగాలిగా ఆ..ఆ..

నీ నయగారమే సెలయేరుగా,

నీ అనురాగమే సుడిగాలిగా

ఎవడు మూర్ఛ మునుగునో,

నీ మనసు కరుగునొ జవ్వనీ ||అతి ధీరవే||


చ. నీ క్రీగంట విరిసిన చూపులు ఓ..ఓ..

నీ క్రీగంట విరిసిన చూపులు

అహ ప్రాణాల నొరిసే చూపులే

ఎవని గుండెలదరునో

నీకు జాలి కలుగునొ రమణీ ||అతి ధీరవే||