అడిదము సూరకవి/సంపాదకీయ భూమిక

వికీసోర్స్ నుండి

సంపాదకీయ భూమిక.


కావ్యకర్తల (Men of Letters.) జీవితచరితముల నాను పూర్వీకముగను సవిమర్శ ముగ ను వర్ణించు పుస్తకములాంగ్లమున నెన్నియో కలవు. కవులను వారికవనములకునుగల యన్యోన్యాశ్రయము నవి యెంతసమంజసముగనో " విశదశపరచును ఆట్టి కావ్యము లాంద్రమున లేకుండుట యొక గొప్పలోపమని. విమర్శకులయభిప్రాయము. ఈ "అడిదము సూరకవి" యను కావ్యము నాంధ్రమున నట్టిగ్రంథముగ వ్రాయించి మాయాంధ్ర పారిజాత గ్రంథావళియందు రెండవ ప్రచురముగ ప్రకటింపసాహసించితిమి.

ఆడిదము సూరక వినిగూర్చి వంశ పారంపర్వముగను, ఈప్రాంతమందు . " ప్రజలలో సంప్రదాయముగను నిలిచియున్న గాధలను, చాటువులను, ముచ్చటలను, వృత్తాంతములను చేర్చి విమర్శించి యోగ గ్రంథమును మl!రా || రా|| ఆడిదము రామారావు పంతులు గారు రచించి యాంధ్రుల కృతజ్ఞతకు పాత్రు లైనారు. ఆంధ్ర కవులనుగూర్చి యిట్టివిపులములగు జీవితచరిత ములాంధ్రమున లేవనియే చెప్పవచ్చును. ఇది యీ విషయమున ప్రథమప్రయత్నము.

దీనిని చదివినతరువాత సూరకవి యెట్టివాడో, ఆతనిశీల మెట్టిదో, అతని కవనములన్న నదియెంతవరకు నూహించదగి యున్నదో, " సూరకవి పొండిత్య మెట్టిదో అది యతని కవిత్వమున కెట్లు వన్నె తెచ్చినదో, సూరకవి వాగ్దాటియెట్టిదో, అదియాతని జీవితమునందె ట్లుపయోగ పడినదో ; ---ఇట్టి యంశముల నేకములు స్పష్ట పడగలవు, జీవితమందలి పోత్సాహములననుసరించి .. కవుల కల్ప నావిశేషములు 'సాగుచుండు నను సాహిత్య శాస్త్రమా సూరకవిపట్ల సిద్ధాంతమగుచున్న దనుటకు సందియము లేదు . ఇట్లు విపులముగ కవిజీవితమును రచించునపుడు కలగుకష్టములలో ముఖ్యమైనది . సమంజసములగు - గాథలచేర్చి , తాత్కాలిక ప్రయోజనము గలవాటిని విసర్జించుట. మొత్తము పయి నీకష్టమును కృతికర్తను సుళువుగా దాటెననియే.ఇందలి గాధలన్నియు రసవంతములైవినదగియే యున్నవి. కీస్తు శక ప్రారంభమునకు పూర్వము రెండు మూడువండల సంవత్సర ములనుండియు నాంథ్ర కళింగ రాజ్యములు 'తెలుగు ప్రజలకు నిలయములై ప్రసిద్ధి గాంచినను, ఆంధ్ర రాజ్య మందలి కవితా విజృంభణ మే ప్రస్తుతము 'ప్రచారమందున్న కవిజీవితముల " వల్ల తెలియుచున్నది గాని, కళింగ . రాజ్యమందలి. కవితావి శేషములనుగూర్చి యంతగా తెలియుటలేదు. ఈ - కవిజీవితముల " ను బట్టి కళింగ రా జ్యమందలి యాంధ్రకములలో కావ్యాలంకార చూడామణికర్త యగు విన్నకోట పెళ్లి రాజు గారే ప్రధముడైనను శాసనములనుబట్టి నన్నయ రాజమహేంద్రవరమున ప్రబలిన నాటికే కళింగరాజ్యమున నాంధ్ర కవిత్వము శాసనములలోనికి గూడ నెక్కి నట్లు స్పమగు చున్నది. అయినను కళింగ రాజ్యపుఁ గవులలో కీ|| శ|| 18 వ శతాబ్దమున నుండి కవిత్వమునకు బ్రసిద్ధి గాంచినవా డీయడిదము సూర కవి.

క్రీ|| శ|| 18 వ శతాబ్దపుఁ బూర్వా మందు మాడుగులసంస్థానమున -శ్రీకృష్ణ భూపతి దేవు మహారాజుంగారి యాస్థాన కవియగు మంత్రి ప్రగడ సూర్యప్రకాశకవి తనకృష్ణార్జున చరిత్రమున నీయడిదము సూరకవిని---

క. ఆడిదము వంశాం బుధీరా ..
డుడు పతీయన ధరణి వెలసి యుర్వీకులచే
 గడుమన్ననగొని యెన్నం
బడు సూరక వీంద్రుంద్దలఁకుఁ బటుగుణసాంద్రున్ .

అని స్తుతించి యున్నాడు ఈ స్తుతికనుగుణముగ నే యిటీవలి సాహిత్య విమర్శకులు సూరకవి రచనలను గూర్చి ప్రశంసించిరి.

ఈ 'సూరకవి జీవిత ' 'మందలి యూహలనుగూర్చి యభిప్రాయె భేదములక వకాశము లేకపోలేదు. ఉదాహరణము :- అడిదము " అంది గృహనామమును గురించిన యూహ. శ్రీ రామారావు పంతులు గారి వాక్యము .. లీసందర్భమున సమంజనములే యైనను, కేవలము 'లోక వాడుకనను సరించి యున్నది అడిదము " అనునది సౌరుష నామమనుట లోక వాడుక . విమర్పించి చూడగా శాసనములం దడిదమునాడను "మండలము 'పూర్వముండినట్లు కనబడుచున్నది. అడిదమను గ్రామము సుగలదు. సాధారణము - తెనుగు బ్రాహ్మణులగృహనామములు గ్రామనామములై యుండుటవలననీ యడిదము నదియు గ్రామనామ మే యైయుండును. కాని నీలాద్రికవినాడది . యాక

పరాక్రమాతిశయములవలన నన్వర్థ నామ మైయుండును. గ్రంథ పారణమునునది పామరులనోట బడి రూపుమారిన 'గండవారణ' యను బిరుదము. ఇది నీలాద్రి కవికి సేనాధిపతిత్వమువలన చెల్లియుండును. ఆతని తరువాతివారు గ్రంధ వారణమువారయి యుందురు. అట్లే గోదావరి మండలమందలి మోదుకూరు కాపురమువచ్చిన యడిదము వారికుటుంబము మొదట మోదుకూరి యడిదమువారయి రాను రాను. మోదుకూరువారయి యుందురు. ఇట్లు గృహనామములు: మారుట కెన్ని యో నిదర్శనములు కలవు. కాని సూరకవిగారి . కుటుంబమువారు మాత్రము నీలాద్రికవి గారి కోవలోనివారే.

సూరకవికీ తొమ్మిదవ పురుషుడగు నీలాద్రికవినాటి నుండి ఈ కళింగ భూపతుల' (అనగా విజయనగర పూసపాటి వంశమును). నాశ్రయించిన వారమని సూరకవి చెప్పిన. చాటువుతో నీ గ్రంథము ప్రారంభింపబడినది. ఈ నీలాద్రికవినేలిన పూసపాటి ప్రభువు రాచిరాజు గారో (1) అతని కుమారుడగు తమ్మ రాజు గారో కాపలెను. వీరి ప్రసిద్ధినిగూర్చియు, ప్రతాప మును గూర్చియు పూసపాటి రాజకవులు రచించిన ప్రబంధములలో, నీ క్రింది విధమున బ్రశంసలు కలవు. --

శ్రీమన్మహామండలేశ్వర శ్రీ పూసపాటి రాచిరాజు (1) గారు.

 మ. దిననాధద్యుతి రాచిరాజు రణధా - త్రిందా మెరాధీశు తి
మ్మ ననోడించెఁ జళుక్యవీర ఘనరా , జ్యస్థాపనాచార్యతన్ -
గనియెన్ మ్లే చ్చు: గెల్చి తద్వివిధ దు ర్గగ్రాహియై ప్రౌడదే
వనృపాది ప్రభు భీషణ ప్రధిత ది. ఈ వ్యద్విక్రమ ప్రౌధిచేన్ .
(విష్ణుభక్తి సుధాకరము)

ఉ. వారలలోన రాచనృప వర్యుఁడు దామెర తిమ్మభూవరున్
చౌరుషనృత్తి గెల్చి తన ఆ బంటుగఁ జేకొని మ్లేచ్చరాజులన్ -
బోరుల గెల్చి దుగన్ ముల , నుంగొని మాళవరాజు'గెల్చె త ..
త్పౌరుషులబ్ద మన్యనుల , తాన్ బిరుదంబు సహించే నెంతయున్ .

అ!! వె! పౌఢ దేవ రాయ • బహుమతుండైనుంచే
ధర చళుక్యవంశ • వరసృపాలు - .
రాజ్యలాభమునఁ బెలంగిం చటం దదంక
బిరుదనాను మొంది పేరుగాంచె

క. దీరతంబు శివషడక్షరి
పరిపఠన మొసర్చి త • త్ప్రభానంబున ను
ద్దుగ సైరిపురము లేర్చెను
హరునిక కణి సుమనసుల్ మ • హాశ్చర్యపడన్ .
.ఉషాభ్యుదయము}..

శ్రీమన్మహామండలేశ్వర శ్రీ పూసపాటి తమ్మిరాజు (3)గారు.

సీ. హరిలోఁ దమ్మ భూపతిమౌళి దోగ్గండ
తతల సామగ్రి దరమె యెన్న
చండిమై బెల్లము కొండసాధించెను
ప్రౌడిగెల్చెను రంగ • రాజుకొండ
త్రిభువన రాయాంక • దీపితు రావు సిం
గనను బరాజితిగానొనర్చే
సని శరణన్నబా హాతి ఖానును గాచె .
బటుళక్తి చే నోడ, పల్లి గొనియె ..

కఠిన రిపుజాల భయదని క్రమము గలిగి
ప్రాజ్య సామ్రాజ్య విభవ ధూ • ర్వహత గనియె
నౌర ! యస్సద్వశిష్ట గో , త్రాని పనీళ
కోటి కాతం డె మేటీ కి రీటీ విభుడు.
(విష్ణుభక్తి సుధాకరము.) .

మ. అనిసం దాపుర శైలసన్నిధి గజేం , ద్రానీకమున్ గూల్చి యం.
దెన సెన్. శ్రీగజపత్య భిఖ్య గుడ శై, లేందుండు శ్రీరంగరా
జ నరేంద్రుండల యోడపల్లి విభుఁడున్ జన్యంబులందోడఁగై.:
కొనియెన్. పొరలపట్టణం బుల శిరుల్ • ఘోరప్రతాపంబునన్ ..

గీ: త్రిభువనీరుషనీ రాయబిరుచ ప్ర - దీప్తుడైన
రావు సింగని సంగర రంగమందు
దుని మెఁ బెదనీటి చెంత స ద్వినుతుఁడగుచు
కలన శరణన్న బాహాది ఖానుగాచె.


... (ఉ షాభ్యుదయము) :

ఇందు ముఖ్యముగా పసిష్టగోత్రావనీశకోటికి మేటి కిరీటి విభుండు." గా సుతింపబడిన శీతమ్మ రాజమహామండలేశ్వరుని కొలువున నే 'సన్మానియై పరాక్ర మముచూపి యడిదమునీలాద్రి కవి యదము' ను కానుకగా గొనుటయు, రణగంగవిజయ' కావ్యమును (తనయేలిక విజయమునుగూర్చి) రచిం చుటయు జరిగియుండునని నాయూహ. ఈ మన్మహామం డలేశ్వర మహీమం . డల రాయ మన్నె సుల్తాన్ శ్రీ పూసపాటి గాచి రాజయ్య దేపు .మహారాజులుం గారి మారుడగు . . .తమ్మి రాజులు గారు స్వస్తి శ్రీ జయాభ్యుదయశాలి వాహకశకవర్షంబులు . 'వేయిన్ని మున్నూటయ న భైయగు నా........ .యన్ తమపూర్వస్థానమైన బెజవాడకు తమబంధువులైన న్యూసోమవంశపు రాజు లున్ను తామున్ను . వచ్చి అక్కడ యింద్రకీలాద్రి యందున పాండవులగుళ్ల దక్షిణభాగమందు కృష్ణ వేణిమల్లిఖార్జున సరిసిం హులు సాక్షి గాను విజయశాశన శీలా స్తంభంబు' వేయించిరి.


అనగా కీ|| శ|| 1458 సం.ర. ప్రాంతమును నీయడీదము నీలాద్రి కవి పూసపాటి భూపతుల సన్మానమున పాత్రుడైన ఫోటరియ క: యునై తన యేలిక యగు తమ్మి రా జమహ మండ లేశ్వరుని విజయములనుగ్గడించుచు రణరంగవిజయ " కావ్యమును రచించియుండెను, పూసపాటి భూపతుల కృతినందిన సవభారతాది గ్రంధములవలె . నీరణరంగ జయమున నామా వశిష్టమై పోయినది. కాని యీ తమ్మి గాజు గారినిగూర్చి.. మాత్రము చక్కని పద్యములు గలవు. అందు కొన్ని యైనను రణరంగ విజయములోవై యుండవలెను. (సూరకవి తనయేలికనుగూర్చి చెప్పిన పద్యములట్లే భలు పద్యములైనవి). కాన సువాహరణమునకై కొన్ని యిందు చేర్చబడినవి,

 సీ|| "హేమాచలము దాక , యేక చక్రంబుగా .. .
భువి నేల మీతాత ఆ బుగ్గవర్మ
మీ తాత గురియించె • మెరసి మాధవపర్మ,
గరిమచే 'బెజవాడ • కనక వృష్టి
పాండ్య కేకయ చోళ పరవీరసృపతుల
తెగటార్చె మీతాత , దేవవర్మ.
పీడుగు ముత్తునియగా , వడి నేసి మీ తాత
భీకరంబుగ చిక్క.. భీమానృపతి

చండ విక్రమ యనపంగ జలధి చంద్ర.
బాపు మగధీర. రణరంగ • థైరవాంక
పొసగ నెవ్వరు. నీసాటి • పూసపాటి . .
పగరక్షనుదిమ్మ, రాచభూ , ధవుని తిమ్మ.

మ!! అతిగౌర్యుండగు పూసపాటికుల. రా చాధీశుతమ్మయ్య కు
న్నతి గావింపుచు నాశ్రయించిరిల ప ర్నా టీ పరిచ్చేదికా
కతకోట ప్రభురాత్మ బాంధవతనో గెల్వంగ లేకోమహా
చతురుండంచును ఖద్విపాగ్ని శశభృచ్ఛాకాబ్దాదకాలంబునన్.

 ఉ || కొందరు రాజులప్పనము • కొమ్మని యియ్యగ బంధు వర్గమై...
కొందరు గొల్వ పేరులిడి • కొందరు - మొక్కగ సూడిగంబులన్
ముందట కొందరంబిరుదు - మ్రోవగ రాజుల పూజలింగ మై
'అందునమించే రాఛమను - జాధీపు తమ్మనరాజ మాత్రుడే.

సీ|| మెం ద్దెండ రాజుల • గుండెలో గాలాము
విరసించు రాజుల వెన్ను తరటు. ...
కలహించు గాజులు • కడుపులోపల కత్తి
గర్వించు రాజులు కాలయముడు
మార్కొన్న రాజులు • మత్తేభ, సింహంబు
మదవైరి రాజుల • మగల మగడు
క్రోధించు గాజులు • కొన మీసములమిండ:
నిరసించు రాజులు • నెత్తి పిడుగు
సకల సౌజన్య రాజన్య చక్రవర్తి,
రాజుకబళేశ్వరస్వామి , రాజ్యధున్యు .
భూసురారామ తగువాటి పూసపాటి.
'రాచభుతిమ్మ వుద్ధండ - రాచమాస.

(ఇవి భట్టు పద్యములు. పాఠములు వికృతములైయున్నవి. కాని తమ్మి రాజు మహామండ లేశ్వరునిగూర్చినపనుట స్పష్టము )


ఈ పూసపాటి వంశమువారు కళింగ దేశమునకు వచ్చినప్పుడు వీరితో నీ ప్రాంతమునకు వచ్చిన నియ్యోగి. కుటుంబములలో నీయడిదమువారు కవిత్వ" మునకును మాబు ర్రావారు రాజ కార్య నిర్వహణచక్షు తకును ప్రసిద్ధులు. ఈ

రెండు కుటుంబములకును 'నాటినుండియు బాంధవ్యము - కలదు. . 'వీరిజనాతులీ కళింగ రాజ్యమునతప్ప నాంధ్రమండలమందితర స్థలములయందంతరించిపోయిరి.

సూరకవి తండ్రియగు బాలభాస్కరుడే సూరకవికి విద్యాగురువనియు, నీ బాలభాస్కరుడు శుద్ధాంధ్ర రామాయణమను గ్రంధము దేవాంకితముగ రచించెననియు నీంగ్రంథమున చెప్పబడినది. శుద్ధాంధ్రరామాయణము దొర కలేదు గాని బాలభాస్కర విరచితమగు లక్షణసొరమను నొకగ్రంథము. దొరికినది ఒకప్రతి మ!! రా|| రా|| శ్రీ మండపాక పార్వ తీశ్వరశాస్త్రి, భి.A. గారి కుటుంబము వారిది. రెండవది "మాకాలేజీ లో ' నుపొధ్యాయులుగానుండి కీర్తి శేషులైన కూరెళ్ల చంద్రశేఖరము గారి కుటుంబమువారిది. ఈ పంతులు రెండును తెప్పించి చూచితిని. అందు కూరెళ్ల వారిది ముఖ్యమైనది. అది పూసపాటి రేగ కాపులస్తులగు ఓరుగంటి. రామన్న గారు వ్రాసుకొనినది. వ్రాత చక్క గానున్నని దానినిబట్టి ఈలక్షణసారము శ్రీ రామతీర్థక్షేత్ర మందు వెలసియున్న కామస్వామికి కం కితముగా రచింపబడినట్లు తేలుచున్నది. ఇది యా నాటి దేయగు రంగబా : ట్చందమువంటిది. అడిదము నారి కుటుంబపు బ్రాచ్యలిఖిత తాళపత్రములందు అనంతుని . ఛందస్సు కలదు, ఇవి బాలభాస్కరుని లక్షణసారమునకు మార్గదర్శక మై యుండును. బాలభాస్కరుని కవి తాశైలికుదాహరణముగ "నీలక్షణ సారమునుండి కొన్ని పద్యములిందు చేర్చుచున్నాను.

క||'సామజపలాబ్దిసోమన్
సామజవరవద నీల జలదక్యామా
కామాఅరి వినుతనామా
శ్రీ మందిర రామతీర్థ సీతా రామా .

గీ. రఘువరాయన నగ మొప్పు • నదునిదూర
రఘువరయనంగ నలము పు • రాణ పురుష
సలము రఘువీర, యనగ .రా జన్యతిలక
రాక్షసవిరామ రామతీర్థగిరిధామ.

.

 శా. పద్మప్రోద్బవ. సన్నిభుల్మసజసజన ప్రవ్యక్తాతాగంబులన్ ,
పద్మా ప్తాంచిత విశ్రమం బుగ సము • త్పాదింతురుద్యన్మతిన్ .
పద్మాదాయనిజాంఘ్రి సంస్రిత మహా పద్మాయ యోగీంద హృ
త్సర్మస్థాయ నమోస్తు తేయనుచు . ల విక్రీతల్

ఉ. శ్రీరమణీ ముఖాంబురు హ • సేవనసుబ్బద నాద యంచు శృం -
గాకర సేశయంచు ధృత కౌస్తుభ యంచు భ రేఫనంబులన్ -
భారలగం బులంగదియ బల్కు చు మత్పలమాలికాకృతుల్.
గారవ మొప్పఁ జెప్పుదురు. ఈ కావ్య వికల్ యతి తొమ్మిదింటరాన్

గీ. కరుణతోడ మమ్ము , గాచి రక్షించుము . -
ఝషముఖావతార . జలజ నేత్ర .
తరణీకులలలామ • ధాగాధరశ్యా మ
దేవ దేవ రామ • తీక్షథామ

ఈ బాలభాస్కరుని కాలమున నే శ్రీ రామతీర్థక్షేత్ర మందు శ్రీ రాము స్వామి కొత్తగా ప్రష్టింప బడియుండును.. ఆకాలమున పూసపాటి - రాజవంశ పుఁ గవులును " వారియాశ్రితులును గూడ నీ రామస్వామికిఁ గృతులిచ్చి యుందురు, యుషాభ్యుదయమును విష్ణుభ క్తిసుధాక రమును, హోకాలక్షణ ముసుళీ రామతీర్థశ్రీ రామస్వామి కంకితముగ నుండుటవలన స్థిరపడుచున్నది, ఇట్లేబాలభాస్క రకవి లక్షణసారమును రామతీర్ధ శ్రీ రామస్వామికి కృతి యైనది. ఈ లక్షణమును సమకాలీనమగు గంగా పాట్చందముతో పోల్చి లమర్శి గా చూచితిని. సర్వవిధముల తులతూగుచున్నది.. ఇ ట్టిలక్షణవేత్తయు శుద్ధాంధ్రకవియు, రామభక్తుడునునగు తం డ్రిక డ శుక్రూష చేసి సంపాదించిన కవనము గనుక నే నూరకవి కవనమంతగా, శోభించి యాచంద్రాగస్థాయి యయినది. . . . సూరకవిసంస్కృతభాషా పాండిత్యమునుగూర్చి కృతికర్థ చేసిన యూహలు సరియేయైనను, సూరకవీ తనక విత్వమునకుపచరించు శాస్త్రములు మాత్రమే శ్రద్ధగా సభ్యసించెననవలసియున్నది. . . . .. .

రెళ్లవలసలో పోగామిగిలియున్న యధీనము వారి తాళ పత్రగంధము లను తెప్పించి చూడగా నందువారభ్యసించిన సంస్కృత వ్యాకరణ ఫక్కి యొక టి కనబడినది. ఇందాంధ్రసంస్కృతముల కారద్యుములు చూపుచు గ్రంథము విస్తరించబడినది. ఇట్లాంధ్ర గీశ్వాణ భాషలను తారతమ్యదృష్టి (Comparative view) నభ్యసించుటవలననే గాబోలు నూరకవి పద్య ములయందాంధ్ర గీ ర్వాణభాషా ప్రయోగములంత చక్కగా నొకటికొకటి యమడియున్నవి. నూరకవి యిట్లు వ్యాకరణ మే గాక , కొన్యశాస్త్రమును, సౌముద్రికమును, ఛందో లక్షణమును నేర్పియుండును. ఇందుకు తార్కాణముగా నీశాస్త్ర భాగములు పైనుదహరించిన రెల్లివలస గ్రంథపత్రములందు కనబడుచున్నని.

బాలభాస్కరకని శుద్ధాంధ్ర రామాయణము రచించుటచే వెల్లడించి, న శుద్ధాంధ్రప్రీతికితోడు నూరకవి పినతండ్రి రామకవి శుద్ధాంధ్ర కవిని” యని తన దుర్జీపడ్య మున చెప్పియున్నాడు. ఈ యడిదము కుటుంబములో బాలభాస్కరుని తరువాత మూడవికవియగు బాలభాస్కరకవి (III) స్వయముగా వ్రాసికొనిన యచ్చతెలుగు పద్యములుగల తాళ పత్ర మొకటి (వెల్లివ లస తాటాకుల లోనున్నది. వంశపారంపర్యముగ నీకవులకు శుద్ధాంధ్రమందుగల ప్రతి నీ పద్యములు వెల్లడించును.


వసిష్ఠగోత్రులగు శ్రీపూసపాటి వంశ భూపతులవలె నే వసిష్ఠగోత్రు లగు నీయడిదము కవులును శివశ్యామలా దేవతోపాసకులు, విసేషించి బాలభాస్కరు (I) ని నాడు రామపొసనము ప్రారంభించియుందురు. ఇందుకు తార్కాణముగా వారీగ్రంధములలో రామస్తోత్రములేకాక శివస్తోత్ర ములుకూడగలవు. మొత్తముపైన ప్రథమతః వీరు తముయేలికలవలెనే యురైన శులని తేలుచున్నది. దీనికి బలముగా రెల్లివలస తాళ పత్రములందు ” రామోపాసనా విధానములును,శివాష్టకములును,శ్యామలాచండక ములును బాలభాస్కరుడు (III) గారి స్వహస్తలిఖితములు కానవచ్చుచున్నవి.

సూరకవి యేలిక చినవిజయరామమహారాజులుం గారు, వీరు పద్మనాభమందు వీరస్వర్గము గాంచిరి. వీరి పరాక్రమాతిశయములు గడించు “విజయరామ మహారాజు చరిత్ర" మను గ్రంథము నానాటీ యాస్థాన కవియగు చాట్రాతి లక్ష్మీనరసు గారి పుత్రులు కనకయ్య గారు రచించిరి. ఆది శ్రీవిజయ రామమహారాజులుం గారి పుత్రులగు శ్రీ నారాయణగజపతి మహారాజులుం గారి కంకితము కాబడినట్లు


క| శీరవికుల కలశాంబుధి తాఠాధిప నవకళింగ ఆ ధరణీపమహో దారయశ పూసపాటీ నారాయణ గజపతీంద్ర • సరనాధేంద్ర. -

యను నాశ్వాసారంభ పద్యమువలన తెలియుచున్నది. ఈ కావ్యము లో కొంత భాగమే దొరికినది. అందుండి శ్రీవిజయ మమహారాజులుం గారి పద్మనాభమందలి 'సమరకటకము (War Camp) ను గూర్చిన ప్రశస్తి పద్య ములనిందు బొందుపరచు చున్నాను. వీటి వలన నానాటియాస్తానకవుల కవన ధాటీవిశేషములు తేటపడుటయేగాక వారికి తమ యేలిక యెడలగల గౌర వాతిశయములు వెల్లడి కాగలవు.

 సీ, తనకీర్తి సాహసో ద్దతికోడి మృగరాజు
విదితంబు గుహలలో , నోదిగియుండ
తన చేల్వుకును దాన ఆ మునకోడి దినరాజు
నిరతంబు కొలలేక , దిరుగుచుండ
తనదయా గాంభీర్య తలకు జాలక నదీ
రాజహర్నిశములు రోజుచుండ
తన ప్రతాపము తేజ, మునుజూచి భయపడి
దిన రాజు 'మేరువ , నెనసియుండ

గీ. పౌర విరాధివీరదు ర్వారశౌర్య
ధుర్య సూర్యకులాం భోధి తుహినకరుడు
విజయ రామావతారమౌ విష్ణుమూర్తి
కొలువు గూర్చుండె భీష్మని , చెలువు దోప.

సీ. ఏరోజు కీ ర్తితో సెనగాక చంద్రుండు
మేరున ప్రొఫున • మెలగుచుండు .
నేమహీపతి ధర్మ • వీక్షించి చాలక
ధారాధరము నిల్వు • నీరు విడుచు

నేభర్త గాంభీర్యం మింతింత యనలేక
జలపై నితాంత ఘో షంబుచేయు
నేరాట్ప్రతాపంబు తోరాక భాస్కరుం ..
డుదయాస్త మయముల • సుడుగు వేడి

గీ. యమ్మహాత్ముడు వినుతి నేయంగ సెగ డే
సంగవం గాంధ్ర మత్స్య కళింగ చోళ
బర్బర పుళింగ మగధ భూ పాల సభల
విజయ రామావ తారమై , పేలయు ప్రభువు.

క. పాలించు సర్వధరణీం
బాలించు దరామరాళి బహుభంగుల గో
పొలు గతినఖిల జనములు
మేలనఁగా విజయరామ మేటి కిరీటి.

సీ, రక్తరాంకవ తను త్రాణ నీలో ష్నీ ష .
కాంతులు సొంధ్య రా గంబుదోప
మహితాచ లాంఘ్రి సమాజు ఘట్టణ భాగ
భరమున గడగడ ధరణి వణక
నాదుకొ తిరుగు సు బేధార్ల విచ్చుక
త్తులతళత్తళకలుది క్కులు జలింప
లయను జెప్పెడి తంబు రాల ధణంధణ
ధ్వానంబు భూన భోం తరము మ్రోయ

ఘనసరష్రాణ విక్రియ ధనము దాచు
పెట్టెలోయన డబ్బాలు గట్టి మరియు .
చెకుముకి తుపాకులూని గర్జించు కొనుచు
వీరభటుల పటాలము • ల్వేలు గొలువ.

క. ఆచలాచల భటపాద
ప్రచయ సముధ్బూత రజము ప్రబలె ఘనం బై
శుచిఖడ్గ జాతజాతను
రు చినుంచున్ మించులనిని రూఢింబల్కన్,

ఉ, ఆలము లన్న వెన్కదిరు - గాడని విక్రమ శక్రనందనుల్ . వేలకు నొక్క బంటు తగు వీరులనన్ .కడిదేరిచేత డ బ్బాలుససీలునున్ గలతు పాకులు బూనినయట్టి భానుపా రాల జవాను లెంతయు ని , రంతరమున్ బహుమంది కొల్వగన్,

ఈ వర్ణనమునకుండదగినటుల నానాటి మంత్రులలో నొకడగు మాబుర్రా బుచ్చన మంత్రి తమ్ముడు వెంకనమంత్రిని ప్రశంసించు నొకశతకమున (ఇది మామిత్రులు పండిత వంగూరి సుబ్బారావు పంతులుగారు కనిపెట్టి నా కొసంగి మాబుర్రావారి కృతజ్ఞతకు పాత్రులైరి) నీ విజయరామ మహారాజులుం గారినిగూర్చి యిట్లు చెప్పబడినది,

క. శతమఖునకు సముఁడు మహో
న్నతపదవిని విజయరామ • సరనాధుఁడు ప
న్మతి జలమున నీవు బృహ
స్పతి సముడవు. బుర్ర వంశ భవ వేంకన్నా.

క.బుధుచిభునిభ శుభవిభవ
ప్రభావ శోభితుడు విజయ • రామధరిత్రీ
విభురత్నము నిన్నేలిన
ప్రభువుకదా బుర్ర వంశ • భవ వేంకన్నా.

క. కుజసనిర్హణ సంతత
సుజనతా ణార్థజనిత • శుభవిలవదధో
క్షజ విజయ రామ నరపతి ..
భజనోత్సుక బుర్ర వంశ • భవ వేంకన్నా.

.

ఈపద్యములు శ్రీ విజయ రామమహా రాజులుం గారినిగూర్చియు, వారిమం త్రులగూర్చియు ప్రశంసించుటయే గాక, సూరకవి విరచితములగు పొణుగుపొటి వేంకట మంత్రిత్రి పద్యములను పోలియుండుటచే నానాటికవులు నూరక విరచనల -ననుక రించి యూతని కవనము నానిధమున 'మెచ్చియుండుటను సూచిం చుచున్నవి.


సూరకవిది కవికుటుంబమనుట సూరకవి కోవహరాతని ,యనంతరము గూడ స్థిర పరచిరి. సూరకవి కుమారుడు బాలభాస్కరడు(11), ఈతనికుమా రుడు సూరన; ఈతనికుకూరుడు బాలభాస్కరుడు (III); ఈతనికుమారుడు బుచ్చి వేంకటరాయులు (వీరుసజీవులు. చిన్న తనమున కవనము చెప్పి రాజమ హేంద్రమందు విద్వత్సభను మెప్పించి గొప్ప బహుమానము గొన్న వారు) నూరకవి మనుమడగు సూరనను గూర్చి యాతని సమకాలీకులు నడిమింటి రామజోగిశాస్త్రి గారు

 మ. కవిరాజుల్ గల రెందరైన నిఖిలక్ష్మాచక్ర మధ్యం బునన్
దవు గానిమ్ము నిరర్గళ . ప్రక టాపానుగ్రహా ఖండవై ..
భవశుద్ధాంధ్ర వచో ధురంధర ఘన ప్రాబంధికుల్ పేరిలే .
రవురా శ్రీయడిదంబు సూరకవిచంద్రా సాంద్ర తేజోనిధీ .

(యని చెప్పిరి.)

ఈ సూరన కుమారుడగు బాలభాస్కరుడు' (III) -శ్రీమాడుగుల సంస్థానమందు శ్రీ కృష్ణ భూపతి దేవు మహా రాజులుం గారిచే సన్మానింపబడుచు తన తాతనూరకవివ లెనే దేశాటనము చేయుచు కవితావృత్తి చేజీవించుచుండెను. ఈతడు సంగీత సాహిత్యములందు నేర్పరి. విద్వత్సభలయందు సభారంజకముగ నాసుకవిత్వము జెప్పి నవరోజు రాగముతో పద్యములు చదువుచుండెడివాడ ని యాతని మనుమలగు శ్రీపొగరు కృష్ణమూర్తి పంతులుగారు. నాతో సెలవిచ్చిరి. సూరకవియునిట్లే యేదో యొక రాగవరుసనను పద్యములు చదివియుండవలెను.

సూరకవి రచనలలో మూడువంతులాశువులే. ఒకవంతు కావ్యములు,

పూర్వాంధ్ర కవులవలె పదునెనిమిదవ శతాబ్దమున వన్నెకెక్కిసప్రాబంధికుడై సరసముగ కవనము సాగించియు, రామలింగేశ శతక మువంటి రచన లయందా నాటిలోక వ్యవహార విమర్శనమును ధర్మానుసారముగ నెరపి సత్కవి యనదగియు,సుఖజీవనో పాయము లంతగా లేకుండుటచే రాజావలంబనము నపేక్షించియు కూటికై యాత్మ స్వాతంత్య్ర మును కోల్పోకుండియు సమకాలకులను, ఆంధ్రలోకమునకును సంభావ్యుడగునట్టి యీయడిదము సూరకవి జీవితచరితమును సవిమర్శముగఁ జదివి లోతుపాతులరసి యాంధ్రావళి మోదంబొరయు గావుతమని మాసంపాదకీయ విన్నపము. . : . . .. .. ..బుర్రా శేషగిరి రావు. -