అడిదము సూరకవి/పాఠం
శ్రీరస్తు
అడిదము సూరకవి
మొదటి ప్రకరణము
వంశపూర్వ చారిత్రము—గృహనామము
చ. ఇరువదిమూఁడు పూరుషము లిప్పటికయ్యెఁ గవిత్వవృత్తిచే
నరపతు లెల్ల మెచ్చఁ బదునాల్గుతరంబులు మించుపిమ్మటన్
వెరవగుజీవనస్థితి లభించుట, తొమ్మిదియయ్యెఁ బూరుషాం
తరములు నిక్కళింగ వసుధాధవుచెంగట నాశ్రయించుటల్.
(సూరకవి చాటుధార.)
ఆంధ్రదేశమునఁ గవితావృత్తిచేఁ బ్రఖ్యాతిగాంచిన నియోగికుటుంబములలో నడిదమువారి కుటుంబమొకటియని చెప్పనగును. తొలుదొల్త వీరియింటి పేరు ‘మోదుకూరువారు’. ఈకుటుంబమునఁ గొందఱు ప్రసిద్ధకవులు తమ గ్రంథములను నేనుంగులపైని వేసికొని దేశాటనముచేయుచు రాజస్థానములను దర్శించి జీవయాత్ర గడపుచువచ్చుటచేతఁ గొంతకాలము వీరికి “గ్రంథవారణము” వారనియు గృహనామము గలిగి యుండెడిది. మఱికొంత కాలమునకుఁ బిదప నీవంశజులలో నొకఁడగు నీలాద్రికవి కళింగరాజులలో నొకనియొద్ద నాస్థానకవిగానుండి యొకానొక సమయమునఁ దనప్రభువుతోఁగూడ యుధ్ధమునకై వెడలెను. బ్రాహ్మణుఁడయ్యును నపరద్రోణాచార్యునిపగిది నీలాద్రికవి యుధ్ధరంగమున వెల్లడించిన సాహస
పరాక్రమంబులకు "రాజెంతయు నాశ్చర్యమునొంది నీలాద్రి కవిని సుచిత రీతిని గౌరవింప సంకల్పించుకొనెను. కవియు నాయుద్దమునఁ దన యేలికగాంచిన విజయముసుగ్గడించుచు రణరంగ విజయమ !” ను పేర నొక యాంధ్ర ప్రబంధమును రచించి రాజు నకంకితమొన ర్చెను. నిండుకొల్వున రాజీ గ్రంథమును సాంతముగ విని యానందించి కవికి దవ్య రూపమగు పసదన మొసఁగుట యేగాక నీలాద్రి యుద్ధరంగమున వెల్లడించిన దైర్య సాహసము లకుఁదగిన పారితోషికమని యెంచి యొకకరవాలము (అడిదము) ను గానుకగా నొసంగి కవిని గౌరవించెను. నాఁటనుండియు నీ వంశజులకు (అడిదము' వారని యింటి పేరు గలిగెను.
మీఁదియంశములను - సప్రమాణముగఁ దెలుపుటకు దగిన యాధారములు గానరాకున్నను, సంప్రదాయసిద్ధముగ వచ్చుచున్న విషయములగుటచే నిందుఁబొందుపఱపఁ బడినవి. ఏదియెట్లున్నను బ్రకరణ ప్రారంభములో వాయఁబడిన "ఇరువదిమూడు పూరుషములు " అను సూరకవి చాటుపద్యమును బట్టి సూరకవికి ముందుఁ జాలతరములనుండి యీవంశజులు కవితా వృత్తి చే జీవించుచు వచ్చిరని 'చెప్పుట కేమెయు నాక్షేపణ ముండదు. మాగోత్రమును మోదుకూరివారి గోత్రమును. ససిస్టగోత మైన 'కారణ ముచేతఁ గొందొక కాలమున. నీయడిదము వారు మోదుకూరువారై యుండినను నుండవచ్చును.
" అడిదమును (కత్తి) గానుకగాణ గాంచిన నీలాద్రి కవికి మూఁడవ మునుమఁడగు బాలభాస్క. అడిదము. దాలభాసురుడు రకవి శుద్దం రామాయణ మను 'శుద్ధాంరధ్ర రామాయణము. ఒక యచ్చ తెనుఁగు కావ్యమును రచియించి దానిని దేవాంకిత మొనర్చెను. అయ్యది నుండియున్నచో కూచిమంచి తిమ్మవి ' విరచితమగు అచ్చ తెనుఁగురామాయణము” నకుఁ బూర్వము వ్రాయుబడినదని మనకు స్పష్టమగును. విధివశమున నాగ్రంథరాజుము నాకు మాత్రా వశిష్టమైనది. బాలభాస్కరకవి యాగ్రంథము రచించె ననుటకు రెండు సబలప్రమాణములు గానఁబడుచున్నని. సూరకవి తన గ్రంథములలో వేసికొనియున్న గద్యము ఇది శ్రీమద శేష మనీషి హృదయంగమ మృదుపవ నీరంఢ శుద్దాం ధ్రరామాయణ ఘటనావె దుషీ ధురంధ రాడిదము బాలభా స్కరకవి తనూభవ" యనియున్నది. ఇదిగాక సూరకవి విరచిత కవిసంశయ విచ్చేదమను లక్షణంథమున 'ఇ కార' సంధికి లక్ష్యము గా నీయఁబడిన నిగిడి కునై పుర్ల వెడల నేటయి నీట గువీటికోట” అను చంపకమాలికాపాదము బాలభాస్కరు : శుద్ధాంధ్ర రామాయణము - లోనిదని సూరకవి యుదాహ రించి యున్నాడు. ఈ యాధారములనుబట్టి నూరకవి తండ్రియ బాలఖాస్కర కవి శుద్ధాం ధ్ర రామాయణమును రచించిన సంగతి నిర్వివాదాంశము. ఈ గ్రంథము ఖలమైపోయినందును
మారకవి విరచిత గ్రంథములలో నెక్కడను 'వంశాభివర్ణనము కానరానందునను నీ వంశజుల పూర్వవృత్తాంతము పజ్నాదికములు తెలియకున్నవి. సూరకవి గ్రంథములలో నెల్ల నిన్నయని వన్నెకెక్కిన కవిజనరంజనములోఁగూడ నవ తారిక పద్యములు గాసరావు,
రావుబహదూరు కందుకూరి వీరేశలిం గము పంతులుగారు సూరకవి ప్రణీతగ్రంథములు” అని య చ్చొత్తించిన సంపుటములోని కవిజనరంజనమునందు నీక్రింది ష్ట్యంష్ఠ్యంత మొక టి మాత్రము గొనవచ్చుచున్నది.
క. కంఠీరవాడ్య విక్రమ .
కుండునకును గుంభిదైత్య ,కోపొటోపా
కుంకప్రతాప హరువకు
గంకాలనకుఁ బ్రమథ గణపొలుసకున్
మాయింటసుస్న ప్రతులలో నీపద్యము గానరాదు. సూరకవి తన ప్రబంధమున నవతారిక పద్యములు చెప్పియుండెనా లేచా యన్ననయంశము కొంతవఱకు నాలోచింప నలసియున్నది.
కవిసంశయ విచ్చేదమనునొక చిన్న లక్షణగంథమున నీయమము • దప్పకుండ నీక్రింది యవతారిక పద్యములను సూరన చెప్పియున్నాడు.
క. శ్రీనుచుమా శంభులను
మా. మురనైరులకు వాక్కు, మల మాతులకున్
చేమోడ్చి వినాయక పద
తామ సంబులకు -నెఱగి కవిలిన వేడ్కన్.
L
గేల్మొగిడిచి నన్న పౌర్యుఁ - గీర్తించిచి కవీం - దుల్మెచ్చఁ గవితఁగూర్చు న కల్మష నిం దిక్కయజ్వ • గణుతించి తగన్ .
క. చినలచ్చ మంత్రి తనయుని ననఘుని మజ్జనకు భాస్క రామాత్యమణిన్ గొనియాడెద శ్లాఘూలంలం ఘనజాంఘిక కవనధాటి • గలిగిన మేటిన్,
క. పుడమిఁగల రసికు లెల్లఁ బొ గడఁగజన రంజనకృతి గావించితి నే నడిదము సూరకవీంద్రుడ మృడశదపంకజ రిరంను • మృదుమాన సుఁడన్ ,
ఈరీతిగఁ గృత్యాదిపద్యములను జెప్పియున్న యతఁడు తన గ్రంథములలో ముఖ్యమగు కవిజనరంజనములో సవతారిక పద్యములను జెప్పియుండ లేదనుటకు నెంతమాత మును వీలు పడదు. 'చెప్పియే ' యుండును. ఎటులనో యవి యంతరించి పోయినవి. పూర్వకవులు కృత్యాది పద్యములను విడిచి పెట్టి కథాభాగమును దొలుతవ్రాయు నాచారము. గలిగియుండెడి వారేమోయని తోఁచెడిని. ఏది యెట్లున్నను: సూచనమాత్రము ప్రారంభముననో 'లేక గంథపరిసమాప్తి యైనతరువాతనో కృత్యాది పద్యములను వాసి యుండవచ్చుననియే నా నమ్ముకము.
రెండవ ప్రకరణము
జన్మాదికము—విద్యాభ్యాసము.
క. చినలచ్చమంత్రి తనయుని -
ననఘుని మజ్జనకు భాస్క రామాత్యమణిన్ .
గోనియా డెదశ్లాభూలం
ఘనజాంఘిక కవనధాటిఁ - గలిగిన మేటిన్.
కవిసంశయ విచ్ఛేదము.)
ఈపద్యమువలన సూరకవి భాస్కరమంత్రి, పుత్రుడనియు, చిన లచ్చమంత్రి పౌత్రుడనియుఁ దేలుచున్నది. ఇతఁడు భూపాలరాజు రేగయను గాయమునక్రీ.శ. 1720 సం. ప్రాంతమున జనన మొందెను. ఈగ్రామము విజయనగరము నకుఁ దూర్పుగా నై దుకోసుల దూరముననున్నది. దీనికి ప్పటి పేరు 'పూసపాటి రేగ. నాటినుండి నేఁటివఱకును నియ్యది అడిదము వారికి నివాసస్థల మైయున్న కారణముచేత - నిప్పుడు గూడ వారిలో, నోకకుటుంబమువారు. "గణికముచేయుచు నిచ్చటనే కాపురముండియున్నారు. చెఱువుమీఁది పద్యములు' చెప్పిన రామకవియు సూరకవితండ్రియగు బాలభాస్కరకవియు నొకే కాలమున స్వగ్రామమగు రేగయందు' నివసించుచుండిరి.వారినాఁడా 'గ్రామమునకు. భూపాల రాజు రేగయని పేరు.
అవధారు దేవ! . మహాప్రభూ! విన్న పంబాశ్రితోత్తముఁడ శుద్ధాంధకవిని పేరురామన యింటి , పేరడిదమువారు మాజాగ భూపాల రాజు రేగ ” అని రామకవి తన చెఱువు మీది పద్యములలో నొకదానియందిట్లు చెప్పియున్నాఁడు. వీరి కాలమునకుఁ దరువాత నీగ్రామము మునుపటి తావునుండి మార్పఁబడి యుత్తరముగా వేవొక స్థలమునఁ 'గట్టఁబడి యప్పటి గ్రామపు గుత్త దారుఁడగు దంతులూరీ అన్నమరాజు గారి పేరన అన్న మరాజు రేగ" యని వ్యవహరింపఁబడుచు వచ్చెను. భూపాలరాజు రేగ యను పేర నీగ్రామము రమారమి యెనుబది సంవత్సరములవఱకు నుండెననియుఁ బిదపఁగట్టఁబడిన గ్రామము అన్న మరాజు రేగ పేరట డెబ్బది సంవత్సరములకుఁ బై గానుండి ననియు నిప్పటిగ్రామమగు : పూసపాటి రేగ" "మొన్నపోయిన యానంద సంవత్సరమునఁ గాక క్రిందటి. యానంద సంవత్సర మునఁ బూర్వపుస్థలము నుండి యింకొక తావునకు మార్పఁబడి యచ్చటం గట్టఁబడెననియు, మాగ్రామములోని పెద్దలు చెప్పుచున్నారు. దీనినిఁబట్టి యిప్పటికి నూటముప్పది సంవత్సర ములక్రిందటి కాలముననున్న గ్రామము .భూపాలరాజు రేగయని తేలుచున్నది. క్రీ శ | 1780.90 సంవత్సర ప్రాంతము వఱకునుండి యున్న గ్రామము భూపాలరాజు రేగయని . వ్యవహరింపఁబడుచు వచ్చినందునను, మా కుటుంబమునందుఁ దరముల వెంబడి వచ్చు
చున్న వాడుక చొప్పున సూరకవి యఱువది మూడు సంవత్సరములు జీవించెనని తెలియవచ్చుటచేతను నతఁడు క్రీశ|| 1720 సంవత్సర ప్రాంతమున జన్మించి యుండెననుటకు వీలుకనఁబకు చున్నది.
సూరకవిగారి మనుమఁడగు సూరన 45 సంవత్సర ములు జీవించి, క్రిందటి చిత్రభాను సంవత్సరమునఁగాక యటు క్రిందటి చిత్రభానుసంవత్సర ఆషాఢ బహుళ పాడ్యమినాఁడు. (క్రీ శ 1 1828 సంవత్సరము) చనిపోయెను. దీనిని బట్టి యతఁడు క్రీ.! "వే || 1778 సంవత్సరమున జన్మించియుండవలెనని తేలు చున్నది. ఇతఁడు తనతండ్రిగారికి 28 సంవత్సరములు వయ స్సున జన్మించెను. అట్లయినచో సూరకవిగారి కుమారుఁడగు బాలభాస్కరుఁడు 1750 సంవత్సరప్రాంతమున జన్మించియుండ వలెను. సూరకవికి 25 సంవత్సరములకు మించిన ప్రాయమునందు సంతానము కలిగినట్లు వాడుక. ఈరీతిగ మాకుటుం బమునందుఁ దరముల వెంబడి వచ్చుచున్న సమాచారమునుబట్టి పరిశీలించి నను . సూరకవి 1720 సంవత్సర ప్రాంతమున " జన్మించియుం డవలెననియే తేలుచున్నది.
ఇంతియేగాక, బొబ్బిలి యుద్ధమున వీనస్వర్గమును గాంచిన " పెదవిజయరామ మహారాజుగారి కాలమున సూరకవి నిండుజవ్వనముననున్నవాటని యొక ప్రబలమగు వాడుక గలదు. ఇందులఁ దార్కాణముగ నితఁడు క్రీI{1 1746 సంవత్సరమున 'బాదుల్లాఖానునకును, పెదవిజయరాము మహారాజునకును జరిగిన యుద్ధమును బ్రశంసించుచు. నీక్రిందిపద్యములను జెప్పి యున్నాడు.
గీ.మెత్త నైనట్టి యరటాకు - మీఁదగాక:
మంటమీఁదను జేల్లు నే - . ముంటివాడి
బీదలైనట్టి సరదార్ల • మీఁదగా క
కలదెక్రొవ్వాడిబాదుల్లా ఖాను మీద.
సీ. గరిడీలలోపల • గంతువేయుట వేమీ
యీటెఁబట్టి యరీ పై * దాటవ లెను
సొగసుగ మొలకత్తి , బిగియఁచెక్కుటకేమి
వెఱవక వైరుల • నఱకవలెను
మాటిమాటికిఁ బెద్ద మాటలాడుట కేమి .
యదలించి రిపులం జం . డాడవలెను
ఱొమ్మున నెర్రగందమ్ము బూయుటకేమి .
గాయపు నెత్తురుల్ • గ్రమ్మవలెను .
గీ. గాని లేకు న్న సత్కీర్తిన్, కాంతగలదె ?
పూసపాటి కులాంభోధి పూర్ణ సోమ !
సమరజఁయ భీమ ! గజపతి , సార్వభౌమ !
విమలసద్రుణదామ ! శ్రీ• విజయ రాము !
శా. ఢిల్లీలోపల గోలకొండపురి నిండెన్ నీ ప్రశంసల్ గుణాల్
బల్లాం బొడిపించి హమ్మని యరబ్బానెక్కి పై కొందు పో
దుల్లాఖాడుని పార దోలితివి దోశ్శక్తి సుబాలకున్
మళ్ళిం పం బఱమౌనె , శ్రీ విజయరామా మండలాధీశ్వరా !
ఇట్లు నిరాఘాటముగఁ గవిత్వముఁ జెప్పఁగలిగిన సూర కవి యప్పటికి నిరువదియైదు సంవత్సరములకుఁ దక్కువగాని యీడున నుండవలెనని యూహింప నగును. అట్లునుకొనినచో నతఁడు క్రీ.శ.1720 సంవత్సరసాంతమున జన్మించి యుండె ననుటకుఁ బ్రతిబందము గానరాదు.
సూరకవికీ నక్షరాభ్యాసము మొదలు సంస్కృతాంధ్ర ములయందుఁ జక్కని సాహిత్య మలవడు వఱకును తండ్రి యగు బాలభాస్కరకవియే విధ్యగఱపెను. ఇతఁడు. పండ్రెండు పదు మూడు వత్సరముల వయస్సుకలవాడై యున్నప్పుడు తండ్రి -
- సుభా హిం. 5.. రాజ్య చునందొక గొప్ప భాగము అని శబ్ధరత్నాకరము.
- సT:- అనగా నట్టి - రాజ్యభాబరిపాలించు వాడు. ఈ యద్దమున నీపదము ఇంగ్లీషు భాషలో వ్రాయభడిన దేశ చరిత్రలందు వాడబడి యున్నది.
- The activati. ala.baljing, n. fis. return frora Hasliprtani, halted witbin four days.cf Hydrabad, and commence negatition with his brother N. zemally. (Ormes History of the Indostau Vol. II Heak ve. XL Page 34.) . ...!
సలాబత్ జంగు గబా మచిలీబందరునుండి తిరుగుదలలో హైదరాబాదునకు 'నాలుగుదినముల ప్రయాణపురూరమున నిలిచి తన సోదరుడగు మిజామలీ. తో సంధి ప్రయత్నములు చేయు మొదలు పెట్టెను. గారియొద్ద నొకనాఁడొక యాంధ్రగ్రంథము సారము చెప్పికొనుచుసందు . తగ | మావిమూక 'వసంతాగమంబు లేక యను గీత పద్యభాగమును జూచి యందలి 'తగన్ ' అను వ్యర్థ పదప్రయోగమును గూర్చి తండ్రి గారతో జర్చింప నంత చిన్న పయుసునం దన కుమారు డుచేయు విమర్శనకు భాస్కరకవి లోలోనసంతసించుచు వచ్చెను. ఇట్లు సూరస యిరువది సంవత్సరముల పాయుము వచ్చువఱకు తండ్రిగారిచేతనే సాహిత్య, సంపాదస మునందును, కవితా రచనా విధానములు, యందును శిక్షితుడై తండ్రికి చేతికందిన కొడుకై వర్దిల్లు చుండెను. సుకవి విద్యాభ్యాస సందర్బముసనుసరించి బాల భాస్కరకవి ప్రజ్నాది విశేషములు కొంతవఱకు వెల్లడింప నవ కాశము గలదు. సూరకవికి రమారమి యిరువదియైదు సంవత్సరములు - వయస్సు వచ్చువఱకు నీ భాస్కరకని జీవించి యుండును తండ్రి మరణముదనుక రేగడి విడచి సూరకవి వేఱొండు చోటునకువెళ్లుటలేదు అతని విద్యాభ్యాసమంతయు రేగడ యందే జరెగెను.అదియుం తండ్రి గారి వద్దనే.మా గ్రామమున మాతోబాటు పూర్వము నుండియు కాపురముండి యున్న వైధికులు, 'ఓరుగంటి ' వారి కుటుంబము ఒకటి కలదు. కాని విద్యాధికులగు పండితులుండి యుండిరన్న ప్రసిద్ధి యాకుటుంబమునకు లేదు ఆ హేతువు చేత
మూఁడవ ప్రకరణము
చీపురుపల్లికిఁ గాఁపురము మార్చుట.
సూరకవి . తనతండ్రియగు బాలభాస్కరుని మరణా సంతరమున స్వగ్రామమగు రేగను విడిచి చీపురుపల్లెకు (విజయ నగరమునకు నీశాన్యముగా నిరువది మైళ్ళ దూరమున నున్నది) మిక్కిలి సమీపముననున్న రామచంద్రపురమును (గులివిందాడ) దనకు నివాసస్థలముగ నేర్పంచుకొని యామరణాంతమచ్చటనే నివసించియుండెను. కవికిని నింకొకరికి నీ బద్యరూపమున జగిన సంభాషణ వలన నితఁడు చీపురుపల్లెయుందున్నట్టు తెలియ వచ్చెడిని.
క, ఊరెయ్యది ? చీఁ పురుపలి .
పేరో? నూరకవి యింటి , పేరడిదమువార్
మీరాజు విజయరామ మ
హారాజతఁడేమి సరసుఁ డా ? భోజుడయా.
రేగయందు వలెనే కవికి చీపురుపల్లె'కు దగ్గఱనున్న కంచ రాములో మాస్యముండెడిది. ఇప్పటివలేఁ గాక సూరకవి రామ కవిగార్ల కాలమున రేగమాన్యము లేమి కంచరమునఁ గల మాన్యము లేమి ప్రతిసంవత్సరము పండెడివి కావు. ఈమాస్యముల పంట పర్యాయములనుగూర్చి యే సూరయిట్లు చెప్పియున్నాడు.
చ. గరిసెలువ్రాఁ తే గాని యొక • గంటెఁడెఱుంగము మన్య దేశముల్
దిరిగి యభీష్టవస్తువులు , తెచ్చి భుజింతుము సర్వకాలమున్
సురుచిర సత్కవిత్వనిధీ సూరకవీంద్రుని కేలగల్గెగం
చరమును రేగ మేఁక మెడ , చన్ను లవంటిని రెండు మాన్యముల్".
సూరకవి, తండ్రి గారు స్వర్ణులైన వెంటనే తన నివాస స్థలముకు మార్చుటకుఁ గల కారణములు తెలియకున్నవి. చీపురుపల్లె కు సమీపమునఁ గంచరములో మాస్య ముండుట' 'యు తనకిష్ట దైవమగు రామలిం గేశ్వరునకు మనికి పట్టుగు రామచంద్రుపురముకు దనకు నివాసస్థలముగాఁ జేసికొన నాసక్తి యు దాను ప్రతిసంవత్సరము వర్షాళనమున కై పోయి చూచెడు మన్యపు జమీలకుఁ జీపురుపల్లె మధ్యస్థముగ నుం డుటయు నను నీకార ణములతని స్వస్థానచలనమునకు హేతువులై యుం:సునని నాకు దోఁచెడిని. ఈ రామచంద్రాపురమునఁ గల శ్రీరామలింగేశ్వ రాలయమును 'అడిదము ' వారి కోవెలయని దానికి సమీప ముగ నున్న ప్రదేశము పూర్వము అడిదము వారే యింటి నివేశనమనియు నిప్పటికిని నచ్చటివారు చెప్పువాడుక గలదు. సూరకవి, యిరువదియైదు సంవత్సరముల ప్రాయమప్పుడు చీపురుపల్లె ప్రవేశించెను , తన జీవితకాలమంతయు సచ్చటనే యుండెను. కవిజనరంజ మాది గ్రంధరాజము లెల్ల మచటనే రచన మొనర్చెను. ఇతనికి నాగ్రామము వై దికులుకొందఱు శిష్యులై యుండిరి. ఆయ్యది యీ క్రింది పథ్య వవలను తెలియవచ్చు చున్నది.
.
గీ. పారమందిరి యక్కిన ఆ పల్లివారు.
దుక్కి చేతను దీర దెం • దువుల కెల్ల
దూసికృష్ణుండు చదువంటే దుఃఖ పడును
ధీరుఁడై నిలిచె మురపాక • సూరనుక వీ.
ఈపద్య మునఁ "బేర్కొనఁ బడిన కుటుంబముల వారి సంతతివా రిప్పటికిని రామచంద్ర పురము (గులివిందాడ) నందుఁగాఁపురముండి యున్నారు.సాధారణముగా నాంధ్ర. కవీశ్వరులను జెట్టబట్టిన దరి దరిద్రాదేవత యొక్క కటాక్షవీక్ష్ణణములకు సూరకవి గూడ దూ రముగఁ దొలఁగి యున్న వాడు కాడు. సమీపగ్రామమున. నున్న యొక రాచకుమారుఁడు కవికిఁ జింతకాయ లిచ్చెదనని చెప్పి పలుసారులు తిప్పినట్లును, దానికి సూరన విసుగుఁ జెంద శంబాముగ్రామము బారికియగు 'రేగానిసన్ని గాఁడు చింతకా యలిచ్చి కవిని సంతోషపఱచి సట్లును నీక్రింది పద్యమువలనఁ డెలియుచున్నది.
గీ. బండ్లు నోడలు పట్టవు • పలుకులైతే
చేరివేడిన నీఁడాయెఁ జింతకాయ
కొండకంబాములో రాచ , కొడుకుకన్న
- శంబమున మేలు రేగాని సన్ని గాఁడు.
ఇతఁడిచట నున్న కాలమున మన్యపు జనాలకుఁ బోయి..
* పా! చాగముస, మేలు రేగాని సన్ని గాఁడు.
ధనము సంపాదించి దానిచేఁ గాల క్షేపము చేయుచుండెడివాఁడు ఇదియే పూర్వోదాహృత పద్యమున ( మన్య దేశముల్ తిరిగి యభీష్ట వస్తువులు తెచ్చి భుజింతుము సర్వకాలమున్ ”అని చెప్పఁ . బడెను. ఇంతియ గాక యితఁడు చీపురుపల్లెలోను దానిసమీప గామములలోను స్వగ్రామమగు భూపాలరాజు "రేగడలోను వైశ్యుల యిండ్లకడ వివాహములు జరిగినపుడు తప్పక యచ్చటికిఁబోయి కవీశ్వర సంభావనలను గైకొనెడి వాడు. దీనిని గూర్చియే కవి తన రామలింగేశ్వర శతకములో * « కవులకీ! గలజాతి యొక్కటియు లేదు | వితరణము వైశ్యులకుఁ బెండ్లి వేళ కలదు ! కొంకుపఱతురు కుపతులా కూటికొఱకు | రామలింగేశ రామచంద్రపురవాస | ” అని వాసియున్నాడు. మొత్తము మీఁద సూరకవి చీపురపల్లెలోఁ దన జీవితమును నిబ్బంది లేకుం డఁగఁ జరిపినట్టు కనఁబడదు. ఇతఁడుతన తండ్రిగారి సంరక్షణలో
- చినవిజయరామ మహారాజు గారి కాలమున నాయన 'యగ్రజుఁడు నీతారామరాజు గారు దివానుగా నుండి రాజకీయ వ్యవహారములలో సర్వా ధికారము జపుచుండెడి వారు. ఒకప్పుడాయన సూరకవి కోమటి పెండ్లిం డ్లపంభావనల నెపమున దర్బారు విడిచి పోఁగూడదని ఆజ్ఞ పెట్టెనంట. కాని నూరకవి మాత్రమట్టి యాజ్ఞను మన్నింపక విధిగాఁ గోమటి పెండ్లిండ్ల సంభావనలకుఁ బోవుచుండెడి వాఁడు. ఆషయమే యిచట సూచింపఁ బడినది.
హాయిగ నుండి సౌఖ్యమనుభవించినట్టుగ +* 'తండ్రి గల్గిన 'పెన్ని ధాన మేల" అను రామలింగేశ శతకములోని వాక్యమును బట్టి యూహింపనగును. సూరకవికి నతని తండ్రిగారు సజీవులై యున్నప్పుడే వివాహామాయెను. ఆ కాలమునఁ గోటిపల్లెయందు నివసించెడి వడ్డాది వారెపిల్లను నీతఁడు పెండ్లియాడెను. రైలు లేని యాదినములలో, నిట్టి దూర దేశపు సంబంధము మాకుటుం బమున కెట్లు కలిగెనో యూహింప వీలు లేకున్నది. ఒకానొకప్పు డు నితఁడేదియో రోగముచే బాధపడుచుండి యాసమాచారము నత్తవారికిఁ ' దెలియఁజేయ వారెవరును రానందులకు వగచి యాతని భార్య దానిని గూర్చి ప్రశంసింప నతఁడు తెలియని దానవు సుమ్మీ | పిలిచినపరుఁగెత్తి రాను పెండ్లా వడుగా”యని భార్య తోననెను. చీపురుపల్లెలో నున్న కాలముననే . సూరకవి సంతానవంతుఁ డయ్యెను. ఇతనికి నొక కుమారుఁడును నొక కొమా ర్తెయును గలిగిరి. కుమారునికి 'బాలభాస్కరుఁడనియు, కొమా ర్తెకు నరసమ్మయనియుఁ బేర్లు పెట్టెను. కొమా ర్తెను రెల్లివలస పాణంగిపల్లి వారికి చ్చెను. ఈసాణంగిపల్లి వారితో జేసిన సంబంధమును బట్టియే సూరకవికిఁ బిదపనాతని కటుంబ
1 ఇయ్యది భవభూతి మహాకవి యుతర రామచరితములోని . గీ. మంచి చెడ్డలుతండ్రి వీ క్షించుచుండఁ దల్లులును ముద్దుముచ్చటల్ "దలచుచుండఁ | గొ త్తప్రియు రాండ్రతోఁ గూడి • కులికినట్టి | క్షణములని తమ్ముఁ డారావు • కదమఱింక! ” అను శ్రీ రాముని వాఖ్యములను జ్ఞప్తి కి చ్చుచున్నది. మువారు వెల్లివలసను దమకు నివాసస్థానముగఁ జేసికొనిరి. సూరకవి తన కుమారునిఁ 'బెంచి పెద్దవానిని జేసి విద్యాబుద్ధులు గజపెను గాని యతఁడే విషయమువను బజ్ఞావంతుఁడై ప్రసిద్ది గని తండ్రిగారి కీర్తిని నిలిపినట్లఁగపడదు. ఇతఁడే సూరకవి. 'మరణించిన పిదప చీపురుపల్లె' నుండి రెల్లివలసకుఁ గాఁపురము : మార్చెను..
ఒకానొకప్పుడు భోజన సమయమున సూరకవిగారి బార్య (ఈమె పేరు సీతమ్మ) సూరకవితో 'ఏమండీ ; అందర మీఁదను 'బద్యములు చెప్పుదురు గదా : మనబాచన్నమీదట నేల యొక పద్యము చెప్పరాదు? " అని కోరఁగా సూరకవి యిట్లోక పద్యమును జెప్పెను,
క. బావా బూచుల లోపల బాచ స్నే పెద్దబూచి పళ్ళుందామన్ బూచంటే రాత్రి వెఱతురు బూచన్నను జూచిపట్ట • పగరే వెఱతుర్ ,
రూపసికానట్టి తమ కుమారుని స్వభావోక్తిగ వర్ణించుట యిష్టము లేనిదైన యామె భర్తతో చాలునండి. మా గొప్పపద్యము చెప్పినారు. మా బాచబాబు కేమి తక్కువ! . యని భర్తయెడల సురాళించుకొనెను. సూరకవి యీమెని నెగతాళిచేయ నెంచి యిది జరిగిన యొకటి రెండు దినము
వఱకు మామూలు మాటలలో సహితము పరియాచకమునకై నడుమనడుమఁ బద్యరూపముగ సంభాషించుచు. వచ్చెనంట. • వంటయేమి చేయుదు ' నని భార్య యడిగినపుడు సూరకవి «« 'పులగములోపలికి పచ్చిపులుసే కాదా? "యని చెప్పిన పద్య 'పాదము మీఁది యంశమును రుజువు చేయఁగలదు.
వాడుక ననుసరించి చెప్పఁబూనినచో సూరకవి యొక మాదిరి లావుశ రీరమును,నల్లని శరీరచ్చాయయుఁ గలిగి పొడువుగ నుండెడివాఁడని చెప్పవలెను. ( అతని వేషంబంతయు (బండితరీతి నుండక మొగలాయి విధంబున నుండు. కావునఁ దదనుగుణమైన లాగు, పాగా, యంగరఖాలను దాల్చి యొక ప్రక్క గంటపుటోర యును, రెండువదిక్కున బాకును బూని | ఇదం “బ్రహ్మ్యంబ్రాఃమ్యమిదం క్షాత్రామను రీతినుండి యేరైన మీరెవరనియడిగిన నేనడిదము సూరుఁడననుచుండు. " (గు!! శ్రీరామమూర్తి గారి కవి జీని తములు.)
నాలుగవ ప్రకరణము
సూరకవి కాలము.
ఈ కవికాలమును నిద్దారణ చేయు సందర్భమున నితనికి నాశ్రయులును, ప్రభువులును నగు శ్రీవిజయనగరాధీశులను గూర్చియు,వారి సంస్థానమును గూర్చియు నిందుఁ గొంతవఱకు వివరించుట యనుచితము కానేరదు.
శ్రీవిజయనగర ప్రభువులగు శ్రీ పూసపాటి వారు సూర్య వంశజులు. దుర్గాసాక్షాత్కారముఁ బొంది, తనతపః ప్రభావమునఁ దానేలు రాజ్యమున నేడు గడియల కాలము సువర్ణ వృష్టి ,గురిపిం చెనను ప్రసిద్ధిగన్న శ్రీమాధవనర్మ సంతతివారు. కొండపల్లి సర్కారులోని పూసపాడను గ్రామనివాసము చేత వీరికి పూసపాటి వారని యింటి పేరు గలిగినది. ఓరుగంటి సంస్థానము ప్రతాపరుద్రునితో సశించిన వెనుక వత్సవాయివారు, పూసపాటివారు మొదలయిన వారు మహమ్మదీయులకు లోఁబడిరి. రఘునాధరాజను మాఱుపేరు గల *పూసపాటి తమ్మిరా జుగారు గోలకొండలో సరదారుగా నుండి శ్రీకాకుళమునకు వచ్చి,
- « ఈతమ్మి రాజు గారికి రఘునాధరాజను మాఱు పేరు లేదు. ఈయన యన్న గారి పేరు రఘునాధ రాజు. " శ్రీకృష్ణ విజయము "న నీవిషయము స్ప స్టముగఁ జెప్పబడియున్నది. ఈ తమ్మి రాజు గా రీ కృష్ణ విజయమును రచించిన కవి. వ్యవహారమున నీయసకు మాధవ వర్మయని వాడుక యుండినట్టగ జరిత్రల వలనం దెలియుచున్నది — విశాఖపట్టణ, మండల, చరితమున నిుట్లున్నది.
21
శ్రీకాకుళముకు పొజుదారుగానుండిన షేరుమహమ్మదుఖాను వలన 1652 సంవత్సరమున కూలిమి 1.భోగాపురపు తాలూ కాలను గుత్తకు పుచ్చుకొని పాలనముచేయ నారంభించెను. **ఈయన పుత్రుఁడై న శీ తారామచ ద్రరాజు గారు మఱికొన్ని తాలూకాలను గూడ కవులునకు పుచ్చుకొని పర్లాకిమిడిసంస్థా నాధిపతియైన గజపతి దేవుతో మైతి సంపాదించి 125 గుర్రపు రౌతులతోను 450 కాల్బలముతోను పొట్నూరు జయించి కళింగ రాజని పేరు వడసి యాయూరు నివాసమేర్పరుచు కొని
« పూసపాటివారి వంశములో మాధవవర్మ గారు మొదట అప్పుడుశ్రీకాకుళము సర్కా రులో నొక భాగమున సుండు విశాఖపణ జిల్లాలోనికి వచ్చిరి. 1852 సంవత్సరములో సనగా రారాజగు నవురంగజీ బువారి వలన గోలకొండ వారి వంశము నశింపు చేయఁబడక పూర్వము 35 సంవత్సరముల కిందటనాయన వచ్చుట జరిగినది. అప్పటిలో షేరుమహమ్మదుఖాను శ్రీకాకుళములో ఫవుజు దారుగా నుండెను. ఆయనయొద్ద మాధవవర్మ గారు " మిలే, భ గాపురముల నిజారాచేసిరి. "-7 వ. అధ్యా, పుట 501–(కార్మెయకలు దొర వారియింగ్లీషుగ్రంధమునకు నిజాపురపు కోదండరావు పంతులు గారి తెనుఁగు తర్జుమా.) .
ఇది కుమిలి గాని కూలిమిగాదు. మాగామమగు రేగకు నిది మూఁడు మైళ్ళదూరమున నున్నది. దీని నే కుంభిళా పురమని ఉషాభ్యుదయము మొదలగు గ్రంధములలో వాడి యున్నారు.
1.సీతారామచంద రాజు గారు తమ్మిరాజు గారి ఫుత్రులుగారు. తమ్మి రాజు గారి తమ్ముఁడగు అన్నమరాజు గారి పుత్రులు. ఈ షయము కృష్ణవిజయమునందును,పూసపాటి వేంకటపతి రాజు మహా రాజప్రణీతమగు ఉషాభ్యుద యమునందును స్పష్టమః గవివరింపబడి యున్నది.
ప్రబలుఁడై యుండెను. ఈయన యనంతరమున *నానందరా జుగారు పరిపాలనమునకు వచ్చిరి. ఈయన పుత్రులు విజయ రామరాజుగారు బహుప్రసిద్ధ పురుషులు. ఈయన మన్నె దొర లను గెలిచి వారి దేశము లాక్రమించుకొని మన్నె సుల్తాను బిరుదంది, పొట్నూరు నుండి తన పేరిట విజయనగరమను పేరం బరఁగిన యూరికి. రాజధానిని మార్చుకొని 1712 వ సంవత్సర మునకు సరియైన విజయసంవత్సర విజయదశమి జయవారము నాఁడు కోటకట్టుటకు శంకుస్థాపనము చేసెను.
1758 వ సంవత్సరమున నిజాము, కొండపల్లి, యలూరు, రాజమహేంద్ర వరము, శ్రీకాకుళము సర్కారులను ఫ్రెంచి వారికి చ్చెను. అప్పుడు విజయరామరాజుగారు శ్రీకాకుళము " నకు నాయిబయిన జాఫరల్లీతోఁ జేరి దేశము ఫెంచివారికి ఈ స్వాధీనము కాకుండునట్లు చేయుటకయి ప్రయత్నించెను గాని, వారు రాజమహేంద్రవరము శ్రీకాకుళపు సర్కాలను తక్కున సిస్తుకు కవులునకి చ్చెద మన్నందున జాఫరల్లీని విడిచి 'ఫ్రెంచి వారితోఁ జేరెను. తరువాత సర్కారులోని రాజులందజును పెంచి వారికి .లోఁబడక తిరుగఁబడి నప్పుడు సహితమీయస
- ఈ ఆనందరాజు. గారిని సీతారామచంద్ర మహారాజులుం గారు శ్రీ పూసపాటి పెదజగన్నాధ రాజు గారి కుటుంబములో నుండి దత్తత చేసికొని నట్లు కనఁబడుచున్నది. ...
వారియెడల విశ్వాసము గలవాఁడయి యుండి 1755 వ సంవత్సరమున ప్రెంచి సేనానాయకుఁడయిన బుస్సీకి కావలసిన ధనమును రహస్యముగాఁ బంపెను. తరువాత బుస్సీ సేనలతో దేశమును స్వాధీనముచేసి కొనుటకు కళింగ దేశమునకు వచ్చినప్పు డీయన బొబ్బిలివారితోడి తసపూర్వ వైరమును సాధించుకొనుటకయి బుస్సీని పురికొల్పి యుద్ధము చేయునట్లు చేసి తానుగూడ సేనలతోఁబోయి 1757 'సం!! జనవరు నెల 24 వ తేదీని తాండ్ర పాపయ్యచే పొడువబడి పరమపదము నొందెను. తరువాత విజయరామరాజు గారి * పితృవ్యపుత్రుడైన యానందగజపతిరాజుగారు సింహాసనమునకు వచ్చి, బుస్సీ విజయ రామరాజుగారి యెడలఁ జూపిన యాదరమును తన యెడలఁ జూపకపోవుల చేత మనసులో ద్వేషము పెట్టుకొని బుస్సీ విశాఖపట్టణము మొదలై సస్థానముల నన్నిటిని స్వాధీనము చేసికొని పై యధికారుల యుత్తరువు ననుసరించి యీ దేశమును విడిచి కర్ణాటకమునకు వెడలి పోఁగానే సేనలను గూర్చుకొనిపోయి విశాపట్టణమును పట్టుకొని దాని నింగ్లీషువారికి వశపఱచెదనని యుత్తరములు వాసి 1757 సం||రమున వారితో స్నేహముచేసికోనెను. తరువాత నతఁడు ఫ్రెంచివారి నుత్తరపు సర్కారుల నుండి తమివేయు ప్రయత్నములలో నింగ్లీషువారితోఁ జేరి, దొరకినకొల్లలోఁదనకు భాగమిచ్చునట్లును, జయించిన దేశములో నదీసముద్రతీర -
* పితృవ్య పౌరులు, "గాని, పుత్రులు గారు.
.
పట్టణములును, వాని చుట్టుపట్లగల దేశమునుదక్క మిగిలిన భా గమును దన పాలనములో నుంచునట్లును యుద్ధవ్యయముల కింద తాను నెల కేఁబదివేలరూపాయల చొప్పున నిచ్చునట్లు ను ఏర్పఱచుకొని, కర్నల్ ఫోర్డుగారిచే నడపఁబకు చుండిన ఇంగ్లీషుసేనతోఁ దన సేనను జేర్చి దండయాత్ర వెడలెను. ఆవఱకే ఫ్రెంచి సేనానాయకుఁడయిన కప్లాన్సుగా రానందగజపతిరాజు గారిని శిక్షించుటకయి దండయాత్ర వెడలి యింగ్లీషు సేన యాయనతో, జేరినదని విని రాజమహేంద్రవరమున నిలిచి పోయెను. కర్నల్ ఫోర్డుగా రానంద రాజుగారు వెంటరాఁగా రాజు మహేందవరమునకు వచ్చి ఫ్రెంచి సేనాధిపతియైన కన్ ఫ్రాన్సు గారి సక్కడనుండి పాఱుఁదోలి, మచిలీ బందరున బోయి ! దానిని స్వాధీనపఱచుకొనెను. దండు వెడలియున్న యింగ్లీషు వారిని జయించుటకయి నిజాముసలాబత్ జంగు మచిలీ బందరు నకు 15 మైళ్ళ దూరము వఱకును వచ్చి వారినిజయించుట సాధ్యముకాదని తెలిసికొని 1759 వ సం||రము మెయి 14 వ తేదీ ని సంధి చేసికొని మచిలీ బందరు సర్కారును కొండవీడు నైజాముపట్టణము సర్కారులును ఇంగ్లీషు వారికిచ్చి వేసి, ఆనందగజప తిరాజు గారు "ప్రెంచి వారి కియ్యంబడిన దేశమునుండి గ్రహించిన సొమ్ము విషయమై తగవు పెట్టక విడిచి పెట్టి వారి తండ్రి తాతల నుండి వారనుభవించు చుండిన దేశమును వారనుభవించుట కంగీకరించెను. ఈయొడంబడిక యయిన తరువాత స్వదేశము
వకు వచ్చుచు త్రోవలో రాజమహేంద్రవరమున నానందగజ పతి రాజుగారు స్ఫోటకముచేత కొలధర్మము నొందిరి. అప్పుడాయన భార్య లిద్దఱును సహగమనముచేసిరఁట. తర్వాత బొబ్బిలిలో మృతులయిన విజయరామరాజు గారి భార్యచంద్రయ్యమ్మ గారు సన్నిహిత జ్ఞాతియైన పూసపాటి రామభద్రరాజుగారి ద్వితీయభార్య పుత్రుడైన పండ్రెండు సంవత్సరముల ప్రాయము గల వేంకటపతిరాజను చిన్న వానిని పెంచుకొని ఆచిన్న వాని పేరు విజయరామరాజుగా మార్చి యాయనను పట్టాభిషిక్తుని జేసెను. ఈ విజయరామరాజు బాలుఁడయి నందున రాజ్యధికార మునంతను సవతియన్న గారగు సీతారామరాజుగారు వహించి, తమ్మునకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత సహితమధికారము నంతను తానే చెల్లించుచువచ్చెను. ఈ విజయరామరాజుగారి కాలములోనే మన కవియుండినది. ఆకాలమునందు విజయన గరమువారు నిజాముకు కట్టుపన్ను రెండులక్షల తొంబది వేల యేఁబదితొమ్మిది రూపాయిలు అయినను దేశ మస్వస్థస్థితిలో నున్నందున నిజాము తనకు రావలసిన కప్పమును తిన్నఁగాఁగైకొన శక్తుఁడు గాక 'పెక్కేండ్లూరకుండుచు వచ్చెను. ఈ హేతువు చేతను, సీతారామరాజుగారు బలవంతులయి తమ సేనలతో చిల్లర సంస్థానాధి పతుల' నదిమి కప్పములు గొనుచుంచుట చేతను విజయనగర రాజ్యమాకాలము నందించు మించుగా స్వతంత్ర రాష్ట్రమువలెనే యుండెను. ఈ సీతారామరాజుగారు బొబ్బిలి
రాజయిన చిన్న రంగారావుగారిని పట్టుకొని విజయనగరములో చెఱసాల యందుంచెను. పర్లాకిమిడి రాజగు నారాయణ దేవు! జగన్నాధయాత్ర పోవుట సందు చేసికొని యతని రాజ్యముమీద దండెత్తి యాత్ర నుండి తిరిగివచ్చిన యాతని నరసన్న పేట వద్ద నోడించి యిప్పటి గంజాము మండలములో విశేషభాగము ను విజయనగర రాజ్యములోఁ జేర్చెను. తన తమ్ముని వెంటఁగొని తండనూత వెడలి సీతారామరాజుగారు మొగలితుఱు వఱకు నువచ్చి స్థానిక పాలకుఁడయిన నబాబు బడ్జి అబ్జమాఖానును జయించి కొంతకాలము 'రాజమహేంద్రవరము సర్కాను సహిత మాక్రమించినట్లు చెప్పుదురు. ఇట్లింకను పెక్కు జయములను బొంది మహోన్నత దశయందుండిన యీకాలములోనే యింగ్లీషువారు నిజామువలనఁ బొందిన సనదుప్రకారముగా నుత్తరపు సర్కారులలోఁ దమ యధికారమును జెల్లించుట కారంభించిరి. ఇంగ్లీషుకంపెనీ వారితోఁ జేసికొన్న యొడంబడికనుబట్టి సం పత్సరమునకు మూఁడులక్షల రూపాయిలు పేష్కష్.. చెల్లించుటకును, పర్లాకిమిడి రాజయిన నారాయణ దేవు వలనఁ గైకొన్న రాజ్యమును విడిచి పెట్టుటకును విజయనగరము వారొప్పుకొనిరి ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత విజయనగరసంస్థానమునకు లోబడియున్న కొండజమీందారు లందఱును విజయనగరము వారి మీద తిరుగఁబడి స్వతంత్రులగుటకుఁ బ్రయత్నించిరి.
కాని సీతారామరాజుగా రన్నిటికిని దగినవాడై నందున నింగ్లీషు సేనలను సహాయ్య పఱుచుకొని యాకొండ సంస్థానాథపతుల నొక్కక్కరినే జయించి కొందఱి దేశములను తమ రాజ్యములోఁ గలుపుకొనియు కొందఱిని విజయనగరమునఁ జెఱసాలలో బెట్టియు నందఱిని సాధించెను. ఈకలహములలో ఆండ్ర పాలకొండజమీన్ దారులు మాత్రము చేర లేదు. సీతారామరాజుగా రిట్లుపరరాజులను జయించుటయే కాక తురకదొరలు మసీదుల కిచ్చిన భూములను పూర్వరాజులు బాహ్మణుల కిచ్చిన మాన్యములను గూడ లాగుకొని ప్రజలను సహితము .క్షోభ పెట్ట నారంభించెను. ఈయన పెట్టుబాధలే సూరకవిని రామలింగేశ శతకము 'చెప్పనట్లు చేసినవి. "
ఇట్లుండఁగా సంస్థానము నందుండిన రాచవాఱందరు నొకటిగాఁ జేరి 1775 న సంవత్సరమునందు మంత్రిత్వమును మాని రాజ కార్య సంబంధము వదలుకొను నట్లు సీతారామరాజు గారిని నిర్బంధపఱచిరి. తన పుత్రుడయిన నరసింహగజపతి రాజును స్వీకారముచేసికొని విజయరామరాజు గారి మరణానంతరమున సింహాసన మాతనికిచ్చునట్లు తమ్ముని నొడఁబఱచి యాయన తాను మంత్రిత్వమును విడుచుట కంగీకరించెను. ” .
విజయనగరము వారు చెల్లింపవలసిన కప్పముయొక్క మొత్తమును నిర్ణయించుటకయి కంపెనీ వారి చెన్న పురి
పరిపాలకుఁడు విజయరామరాజు గారిని చెన్నపురి రమ్మనికో రెను, కోరిన ప్రకారముగా విజయరామరాజుగారు చెన్న పురికిఁబోక ప్రయాణ వ్యయములకు తన చేత సొమ్ము లేదనియు, తనయన్న యయిన సీతారామరాజుగారు తన్ను నాశనముచేయుటకయి తంత్రములు పన్ను చుండిన యాకాలములోఁ దాను రాజధానిని విడిచి దూరముగాఁ బోవుట యుచితము కాదనియు, విశామపట్టణములోని యధికారుల సమక్షమునఁ దాను వారు విధించెడు న్యాయమైన కప్పమున కంగీకరించెదననియు చెప్పి తప్పించుకొ నెను. అంతట చెన్నపురి పరిపాలకుఁడు సీతారామరాజుగారిని చెన్నపురికి రమ్మనికోరఁగానే యతఁడు తక్షణమేపోయి యక్కడివారిని వశపఱచుకొని, రాజా కార్యములు చక్కఁబఱుచు కొని విజయనగర సంస్థానమునకు తన్ను దీవానుగా నేర్పాటుచేయించు కొని తసపుత్రుని స్వీకారమును స్థిరపడిపించుకొని, మరల వచ్చెను. ఈ యేర్పాటుల వలన విజయరామరాజు గారు పేరునకు రాజుగా నుండినను నిజమైన యధికారమంతయు సీతారామరాజుగారి చేతిలో నే చిక్కెను. ఈ విషయ మై విజయరామరాజుగారు కంపెనీ వారికి మొఱ పెట్టుకోఁగా పె ట్టుకోఁగా తుదకు వారాయనను దివాను పనినుండి తొలఁగించి విజయనగరము విడుచునట్లుత్తరువు చేసిరి. అందుపయిని సీతా రామరాజుగారు : విజయనగరము విడిచి సింహాచలము నివాస ముగా నేర్పఱచుకొని యక్కడ కొంతకాలముఁడి, తరువాత
మరల తమ్ముని మంచిమాటలాడి 1790 సం|రమునం దొకసారి యు 1792 సం||రమునం దొకసారియు మరల సంస్థానములో దివానుగాఁ బ్రవేశించి కడపటిసారి కంపెనీ వారి చే చెన్నపురికిఁబోవు నట్లుత్తరువు చేయఁబడి నెలకయిదు వేల రూపాయిల యుపకార వేతనము మీఁద 1798 సం||రము నందక్కడకుపోయి చేరెను. సీతారామరాజు గారి దుష్పరిపాలనము మొదలయిన కారణములచేత విజయరామరాజుగారు ఋణముల పాలగుటయే గాక కంపెనీ వారికి కట్టవలసిన కప్పమును సరిగా కట్టలేక యాఱుులక్షల యిరువదియైదు వేల రూపాయిల వఱకును బాకిపడిరి. అందుచేత కంపెనీవారు సంస్థానమును తమపాలనమునకుఁ దీసికొని విజయ రామరాజు గారెం రాజ్య మునుపెడిచి మచిలీ బందరులో వాసము.చేయునట్లు యుత్తఱరువు చేసి ఆయనకు ముప్పది వేలకూపాయ లొక్కసారిగా రొక్క మిచ్చెదమనియు నెలకు 1200 రూపాయిలు వ్యయ ములకిచ్చెద మనియుఁ జెప్పిరి. ఆయన స్వదేశమును విడుచుట కిష్టము లేని వారయ బందరు పురమునకుఁ బోవు మార్గమున బయలుదేఱి యైదాఱుకోసుల దూరము పోయి యక్కడనుండి పరివారముతో వెనుకఁదిరిగి పద్మనాభమునకుఁ బోయి యక్కడ నుండి తాను ప్రయాణము చేయలేక పోవుటకు సాకులు వ్రాయనారంభించెను. విజయరామరాజుగా రక్కడ నున్న కాలము లో రాచవారును నాలుగువేల సైనికులనుబోయి యాయనను
జేరిరి. కంపెనీ వారికీ సంగతి తెలియఁగానే యిరువదినాలుగుగంటల కాలము గడువిచ్చి యాలోపల నతఁడు బందరు మార్గమున బయలు దేఱని పక్షమున బలత్కారముగాఁ బంపవలసినదని విశామపట్టణములో నున్న సేనానాయకున కుత్తరువుచేసిరి. పయివారి యుత్తరువును దెలియఁబఱిచి యింగ్లీషు సేనాధిపతి యయిన ప్రెండర్గాస్టుగారు కొంతసేన (750 భటుల)తో పద్మ నాభమునకుఁబోయిరి. 1794 సంవత్సరము జూలై నెల తే 10 ది యుద్దయమున నింగ్లీషు సేనాధిపతి పద్మనాభపు కొండనుజేరున ప్పటికి, విజయరామరాజు గారును బంధువులయిన రాచవారును ఖడ్గపాణులయి లోఁబడక యుద్ధముచేసి వీర మరణము నొందుటకు నిశ్చయించుకొని యందఱును పద్మ నాభస్వామి ప్రసాదమును స్వీకరించి యుద్డోన్ముఖులయి నిలిచి యుండిరి. నాఁడు సూర్యోదయకాలమున నింగ్లీషు సేన లకును రాజుగారి సేసలకును ముప్పావు గంటసేపు ఘోరయుద్ధము జరిగినది. అంతట రాజు గారి సేనలన్నియు చెల్లాచెదరయి పాఱిపోయినవి. రణరంగము నకుఁబోయి చూడఁగా రణనిహతులై వీరశయనము నొందిన వారి శరీరములక్కడ మున్నూట తొమ్మిది కనఁబడినవి. రణభూమి నలంకరించిన 'మున్నూట తొమ్మిదింటిలో నిన్నూట యెనుబది రాచవారి దేహములు. రణరంగమధ్యమునఁ బడియుండిన విజయరామరాజుగారె శవము చుట్టునుకోట కట్టినట్లుగా సంస్థానము లో నున్నతస్థితిలో నుండిన . యుత్తమ క్షత్రియుల శవములు
నలువది గుండు దెబ్బలతో బడియుండెను. ఇట్లు మరణమునొందిసవారు గాక పాఱిపోయి న వారిలో 'నెందఱికి గాయములుతగిలినవో తెలియలేదు. ఇంగ్లీషు సైనీకులలో మృతినొందిన వారు పదముగ్గురు, గాయపడిన వారఱువది యొక్కరు. ముప్పదియేండ్ల కిందట బొబ్బిలికోట ముందు పెదవిజయరామరాజుగారు హతులైనట్లే, మనకవీంద్రుని కాలములో నుండిన యీచిన విజయరామరాజుగారు పద్మనాభ పుకొండ ముందు నిహతులై రి. మన కవి కాలముతో సంబంధించిన చరిత్రమింతే. తండ్రి మర ణమును విని యప్పటి కెనిమిది సంవత్సరములు ప్రాయము వాఁడై న నారాయణ బాబుగారు తల్లీతోడ గూడ కొండ దేశమునకు పాటిపోయిరి. కాని కంపెనీ వారాయనను బిలిపించి దొరతనమిచ్చిరి. ” (రావుబహదూరు కం!! వీరేశలింగముపంతులుగారు ఆంధ్ర కవుల చరితము. తృతీయ భాగము పుటలు. 69-75.) :
పాఠక మహాశయులారా ! రారాజులచేతను గవిరాజుల చేతను,విలసిల్లి దిగంత విశ్రాంతమగు కీర్తినిగాంచిన శ్రీ పూస పాటి మహా రాజవంశమును గూర్చి వాయవ లెనన్న ఒక ప త్యేక గ్రంథమగును. అంత విపులముగ నిచట వివరింప నవ కాశము లేనివాఁడనై శ్రీవీరేశలింగము - పంతులగారి గ్రంథ మునందు సంగ్రహముగ వాయబడిన చరిత్రమును గైకొని నిచట నుపయోగపఱచు కొంటిని.. .. .. .. . . .
సూరకవి తనగ్రంథముల నన్నిటిని రామచంద్రపుర రామలింగేశ్వరున కంకిత మొనర్చెను. గంథములు' -దేవాంకిత ములైన కారణముచేతఁ గవి కాలనిర్ణయమునకు సౌకర్యము నియ్యఁజాల కున్నవి. అయినను నితఁడు తనప్రభువులగు విజయనగర పురాధీశులపై ఁ జెప్పిన చాటుపద్యముల వలనఁగాల నిర్ణయము చేయుటకు వీలగ పడుచున్నది. పూర్వోదాహృత ములైన మెత్తనైనట్టి యరఁటాకు మూఁదఁగాక " అను గీత పద్యమును ఢిల్లీలోపల గోలుకొండ పురినిండా "అను వృత్త మును, క్రీస్తుశకము 1746 సంవత్సరపాంతమున * బాదుల్లా ఖానునకును మొదటి, “పెదవిజయరామ మహ రాజునకు ను జరిగి న యుద్ధమును గూర్చి సూరకవి చెప్పియున్నాఁడు. దీనిని బట్టి సూరకవి 1738 మొదలు 1757 వఱకు రాజ్య ముచేసిన 'పెదవిజయ రామ మహా రాజుగారి కాలమున నున్నాఁడనుట స్పష్టము.
పెదవిజయ రామరాజుగారి తర్వాత ఆనందగజపతి మహా రాజుగారు. రాజ్యమునకు వచ్చి కొలఁది కాలము మాత్రము
- * "స్న 1158 ఫసలీ 1748 సంవత్సరములో జాఫరల్లీ ఖాసుడికి అయివజుగా బహుదుల్లాఖానుడు శ్రీకాకుళం సర్కారుకు ప్రవేశించినాఁడు. అదివరకు జాఫరల్లీ ఖానుడు 8 సంవత్సరములు హకీంగిరిచేసినాడు. . అటు తరు వాత బహుదుల్లాఖానుడికిన్నీ విజయ రామ రాజు గారికిన్నీ హవేలీ పరగణాల నిమిత్తమున్నూ జమాబందీఖణా యించడం నిమిత్తమున్నూ జవాబు సవాలు నిమిత్తమున్నూ లడాయివచ్చి కలహం చేస్తూ యున్నంతలో' "(......శ్రీవిజ యనగరం సంస్థావం డెయిరీ మెమోరాండము. 1652-1845.) . :
రాజ్యముచేసిరి. ఆయన స్వరస్థు లైన సిదప ఆ చినవిజయరామ మహా రాజు”గారు సింహాసనమునకు వచ్చి 1760-1794, వఱకు ను రాజ్యముచేసిరి. ఈమహా రాజుగారి కాలముననే మన కవి గారి ప్రభంచాల హెచ్చుగ నుండెను. సూరకవి యీచిన విజ యరామమహా రాజు గారి కాలమున నున్నాఁడనుటకు నిదర్శనములు పెక్కులుగలవు. ఒకటి రెండింటిని మాత్రమిచటఁ జూపు చున్నాఁడను.
.
శ్రీ వత్సవాయి తిమ్మ జగపతి మహా రాజుగారి రాజ్య కాలమున 'పెద్దాపురము 'లో నొకప్పుడు రాజులందఱు(తమ బంధువర్గములోని, వారును మిత్రమండలిలోని నారును నగు మహారాజులు) సభ చేసి కూర్చుండి యుండఁగా సూరకవి తన ప్రభువును స్తుతించుచు.
<poem> ఉ. రాజుకళంకమూర్తి రతి రాజు శరీరవిహీనుఁడంబికా రాజు దిగంబరుండు మృగ రాజు గుహాంతర సీమవతింవి భ్రాజితపూసపా డ్విజయ • రామసృపాలుఁడు రాజు గాక యీ రాజులు రాజు లే పెనుత రాజులు గాక ధరాతలంబునన్ ,
అను నీపద్యమును సభాసదులైన రాజులవంక ఁ జూచుచుసభిన యముతోఁ జదువనందలి కడపటివాక్యము తమ్ము నుద్దేశించి కవి చెప్పెనని యభిప్రాయపడి మహీపాలురంద ఱొక్కుమ్మడిఁ గోపమును జూప నతఁడించు కేనియు జంకక పద్యార్థమునుదేట
తెల్లముగ విప్పి చెప్పి వారిసందజను శాంతచిత్తులుగఁ జేసెనని ప్రబలమగు నొక వాడుకకలదు. శ్రీవత్సవాయి. తిమ్మజగపతి మహారాజులుంగారి రాజ్య కాలము క్రీ| వె|| 1759 మొదలు 1797 వఱకుఁగల కాలమైనందున నీయనకు సమకాలికుఁడు చినవిజయరామ మహారాజనుట స్పష్టము. ఆ కారణము చేత సూరకవి చినవిజయరామ మహా రాజుగారి కాలమున నున్న నాడని చెప్పుట కేమియు నా క్షేపణము లేదు. ..
ఇంతియ 'కాక చినవిజయ రామమహా రాజునకు సమకా లికుఁడై * శృంగవరపుకోట జమీని బరిపాలించు చుండిన శ్రీముఖీ కాశీపతి రాజుగారి రెండవ కుమారుఁడు రాజభూపాల రాజు. తన సత్త్వమును, నెదిరి సత్త్వమును దెలియనివాఁడై మి గులఁ బ్రబలులై యున్న విజయనగర పురాధీశులమీఁదికి దాడి
(1) * " ......... అంతట కాశీపతి రాజు గారి శృంగవరపుకోట మీదికి దండుయెత్తి, మోహింది గే వర్కువారు లొంగుపోటులో రానందున సకల ప్రయత్నాలు చేసి కోట మాత్రం పట్టుకొని రాజ్యం స్వాధీనం తెచ్చుకున్నారు. గన్కు వారు 'కాశీపురం ప్రవేశించి పితూరీ చేస్తూ వచ్చినారు. యీ కాశీపతి రాజు గార్కి ముగ్గురు కొమాళ్ళు. వారి పేర్లు. వీరభద్రరాజు, వీరముకుంద రాజు, రాజభూపాల రాజు, యీ ముగ్గిరి కొమాళ్ళతోటివుండగా యింతలో కాశీపతి రాజు వుండగా నే పెద్దకుమారుడైన వీరభధ్ర రాజు నష్టపోయినాడు. * అంతట .కాశీపతి రాజ్కు బలంతగ్గి శీతారామరాజు గారితోటి బహు దినములు లడాయి చేసి ఆయనయున్నూ గతించినాడు. తరువాత వీరముకుంద రాజూన్నూ
వెడలి రాఁగనట్టి సాహసకృత్యమును బరిహసించుచు సూరకవి యిట్లోక పద్యమును జెప్పి యున్నాడు.
గీ. విజయ రామ మహారాజు వీరుఁడేలు
పట్టములికించె రాజభూపాల రాజు
కడమ మాటల కేమి యీ కాలమునను
బుఱెవచ్చెనును బులితో గొఱైగఱచె.
ఈనిదర్శనము కూడ సూరకవి చినవిజయరామ మహా రాజుగారి కాలమున నున్ననాఁడనియే నిర్ధారణ చేయుచున్నది.
వీర్కి జేరు దస్తులో ర్కౌబహు యుద్ధం చేస్తూ యుండగా చఖ సమయమందు శీతా రామరాజు గారికి దయవచ్చి వీరి దేశంవదలి నాడు జమాబందీ విస్తరించి కట్టినంద్ను, తాలూకాలో వారికి మానువర్తి మాత్రంగడిచేది. హాని గాని ఘజానా గాని చేసేటందు - ద్రవ్యం మిగి లేదికాదు. " (ఫుటలు 15, 16.)
పూసపాటి వారి కైఫీదు..
ఆంధ్ర సారస్వత ప్రచురములు10.
వి!! ఆర్
జగపతివర్మ గారిచే సంపాదితము
(2) " ......... Like other petty chiefs, the Mukkis were evicted by Vizianagram, but in the general collfusion consequent on the sequestration of that Zamindari in 1793 (P. 50), one of the old family, Mukki Rajabhupalaraju, took forcible possession of Kasipuram." (Vizagapatam Gazetteer, Vol. 1. Ch.XY Srungavarapukota Taluk, Page 317).
మీఁదఁ జెప్పియున్న ప్రకారము.సూరకవి కీ| శ||1720వ సంవత్సర ప్రాంతమున జననమొంది యిరువదియైదు సంవత్సర ముల పాయమువఱకు 'రేగలోనుండి పిదప 'చీపురుపల్లె కుఁ గాఁ పురము మార్చె యామరణాంతర మచ్చటనే యుండెను. 1794వ సంవత్సరమునఁ బద్మనాభ యుద్ధములో వీరస్వర్గమును గాంచిన తన ప్రభువగు రెండవ విజయరామ గజపతి మహారాజులుంగారి కంటెఁ దొమ్మిదిపది సంవత్సరములు ముందుగ ననఁగా 1785 సంవత్సర ప్రాంతమున నీకవి వరుఁడు కీర్తిశేషుఁడయ్యెను. .
ఐదవ ప్రకరణము
సంస్థానాస్థాన కవి పదము
సూరకవి తన ప్రభువును విజయనగర సంస్థానాధీశుఁడు నగు చిన విజయరామ మహారాజు నాదరణమును బొందియా స్థానకవిగానుండెనని ప్రబలమగు నొక వాడుక కలదు గాని యితఁడు విజయనగరమునఁ గాపురముండి నట్టును నితరులగు నాస్థాన పండితులవలె నిత్యము రాజస్థానమునకుఁ బోవుచు వచ్చుచుండినట్టును జెప్పుటకు నాధారములంతగఁ గానరావు. ఇతఁడాకాలమున నాస్థానకవి పదమలంకరించి విజయనగరమునఁ గాఁపురముండక చీపురుపల్లె యందే నివసించుచుఁ దఱచు విజయనగరమునకు వచ్చి తన ప్రభువులను దర్శించుచు నియమితో ద్యోగమును నెజవేర్చు కోనుచునుండెడి వాడు.
సూరకవి ప్రజ్ఞావంతుఁడును విద్యాధికుఁడును నై యుండియుఁ దన స్వాముల యెడలఁ జూపనలసిన వినయమును జూపక యొక విధమగు స్వాతంత్యమును గనుపఱ చెడి వాఁడు. స్వతంత్రం ఈ బుద్ధి కలిగియుండుట ప్రశంసనీయమైననుఁ దన యేలికల పట్ల నవిధేయతను జూపునడనడి మాత్రము శ్లాఘాపాత్రము.
కానేరదు. ఇట్టి నడవడి యేకవికిఁ దఱచు గలుగుచు వచ్చిన దేవిడీ మాన్నాల "కుఁ గారణమని చెప్పుదురు. సూరకవి. సహజముగ నిట్టి స్వభావము కలవాఁడు కాకపోయినను నప్పటి దివానును రాజుగారి యగ్రజుఁడును నగు సీతారామరాజుగారు కవి యెడలఁ జూపుచువచ్చిన యనాదరణమును నీర్ష్యయుఁ గొంతవఱకుఁ గారణమై యుండవచ్చును. ఈ సీతారామరాజు గారిని గూర్చి కవికృతమగు రామలింగేశ శతకమును విమర్శించు సందర్భమున నికముందు వ్రాయుచున్నాను. కాన నిచట విడచితిని.
ఒకనాఁడు మహారాజు, పండితులు కవులు మొదలగు వారితో నిండుకొలువునఁ గూర్చుండియుండ నప్పటి సందర్భము ననుసరించి సూరకవి యాశుగా.
ఉ. పంతముననీకు జెల్లు నొక • పాటియమిరుఁడు నీకులక్ష్యమా
కుంతము కేలఁ బూని నిను • గొల్వనివాఁడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేఁడు కటకంబు మొదల్కొని గోలుకొండ ప
ర్యంతము నీ వెకా విజయ • రామనరేంద్ర వైభవా. "
అనియొక పద్యమునుఁ జెప్ప దానికి రాజును సభ్యులునుమిగులసంతసించి కవిని బహువిధముల శ్లాఘించిరి ; కాని సీతారా మరాజుగారు మాత్రమొక యద్భుతమగు నాక్షేపణము చేసిరి. ఎట్లనిన - మండలాధీశ్వరునిగూర్చి నీకుఁ జెల్లు; నీకు లక్ష్యమా?
అని యేకవచన ప్రయోగము చేయఁదగునా ? నీవు మహాకవివి
మైసను నితరులను మన్నించి నీవు మన్నన గొనవలెను " అని చెప్ప సూరకవి
* క. చిన్నప్పుడురతి కేళిని
సున్నప్పుడు కవితలోన యుద్ధములోనన్
వన్నె నుమీ 'రా' కొట్టుట
చెన్న గునో పూసపాటి • సీతారామా !.
సమయోచితమగు నీ ప్రత్యుత్తరము సభ్యులకు మోదకరమయ్యును సీతారామరాజుగారికి మాత్రము ఖేదకారియయ్యె . ఇట్టి కారణ పరంపరచే నానాఁటికి సూరకవి పై సీతారామరాజు గారికి ననాదగణము హెచ్చు కాఁజొచ్చెను. కవి పెక్కుచోట్లఁదన రామలింగేశ్వర శతకములో సీతారామరాజు గారి చండశాస నత్వమును సూచించుచునే వచ్చెను. మొత్తము మీఁద సూరకవియొక్క యాస్థానకవి పదము జయప్రదముగను సుఖదాయక ముగను వెళ్ళుట లేదు.
శ్లో, బాల్యేనుతానాం నుర తేంగనానాం !
న్తుతోకవీనాం సమ రేభటానాం |
త్వం కారనాదాహిగిరః పశస్తాః |
కస్తేప్రభో మోహతరస్స్మరత్వమ్ |
అను నీశ్లోకమును మనమునందుంచుకొని మీఁది పద్యమును జెప్పినట్టు గ' నూహింపవచ్చును,
పూర్వోదాహృతమైన రాజుకళంకమూర్తి" అను పద్యమును ( పెద్దాపురమునఁదు' సూరకవి చెప్పినప్పుడు మహా రాజును మంత్రి మొదలగు నితరోన్నతో ద్యోగస్థులును, పద్య ముయొక్క. సొగసున కెంతయు మెచ్చి కవికిఁ గనకాభి షేకము చేయించిరఁట ; అట్టి యపూర్వ గౌరవమునకు సూరకవి మిక్కిలిగ సంతసించి తనకృతజ్ఞతను ప్రభువునకును, మంత్రియుఁదన బందుగుఁడు నగు బుఱ్ఱ బుచ్చనామాత్యునకును ననేకవిధముల వెల్లడించెను. అభిషేకము చేయఁబడిన బంగారు నాణెము లను గవి తప్పక పరిగ్రహించునని మహారాజు లోనగువారు తలంచిరి. కాని సూరకవి మాత్రము వానిని ముట్టఁడయ్యెను. • పరిగ్రహింపుఁడ'ని చెప్పినపుడు సూరకవి " మహాప్రభూ! ఏలి నవారి కటాక్షముచే నింతదనుక స్నానము చేసిన యుదకమును బానము చేయ లేద ”ని చెప్ప మహారాజు లోనగువారు సూరకవి నిర్లక్ష్య భానమున కెంతయు నాశ్చర్యపడిరి. విజయరామమహా రాజు సూరకవి చెప్పిన సమాధాన మెంతయు యుక్తియు క్తముగ నున్నదని సంతసించి, యతనికి వేఱుగ బహునూన మొసఁగి గౌరవించెను. తాను సుఖముగ జీవయాత్ర గడపఁదగిన యుప వృత్తిలేని వాఁడయ్యు ' ద్రవ్య విషయమున నిట్టి నిర్లిప్తతను జూపుట యతని స్వతంతబుద్ధిని భావదారిద్ర్యమును వెల్లడిచే యుచున్నది.
సీతారామరాజుగారి వలెఁగాక చిన విజయరామ మహా రాజుగారు సూరకవి పజఞాది విశేషములను బాగుగగు నెఱిఁగియతని నుచిత రీతిని గౌరవించుచు వచ్చిరి. మహారాజుదయకుఁ బాత్రుడై సన్నిధిపతి యై మెలఁగుచుండిన పతివాడ పైడన్నయను పేరుగల 'దారూగా' యొక సమయమున సూరకవి యెడల నగౌరవమును జూపెనఁట. దానికి మిగులఁ గుపితుఁడయ్యు సూరన గోరంత వాఁడై నఁ గొండంత వాఁడైనఁ బగ కనర్హుఁకు నృపపార్శ్వవతిః ” (రామలిం గేశ శతకము) అను న్యాయము ననుసరించి దాని కేమియుఁ జేయ లేక యూరకుండెను. కాని నాఁడు. తాను రాజస్థానమునకుఁ బోయినపుడేది యోసందర్భమున "కః ఇత్తడిపుత్తడి యగునా ! తొత్తుకు నగలెన్నియున్న దొరసానగునా | యు త్తమకులుఁడౌ నాదౌ ! లత్తెం తలభించినను గులాము గులా మే ! ” అను పద్యమును రాజు సన్నిధిని జదివి యూరకొనెను. సరసుఁడగు నీవిజయరామన్న పాలుఁను మీఁది సమాచారమును నెటులో తెలిసికొని సూతకవి, మీఁది పద్యమును దన సన్నిధిని జదువుట కది కారణముణముగాఁ దలంచి 'దారూగా' యగుపతివాడ "పై డన్నకు దేవిడీ మన్నాయను శిక్షను విధించెను. నాఁడు బుద్ధినెఱిఁగి తన యపరాధమును సూరకవికీ నివేదించి క్షమింపుఁడని వేడుకొనఁగ సతఁడీకింది పద్యమునుచెప్పెనని వాడుక గలదు.
గీ. మోటముండకొడుకు మాట చేల్లిన నాడు
నన్ను లక్ష్య పెట్టి నాఁడుకాఁడు;
తెలిసియిపుడ: నన్ను * * దీవింపుమనిపల్కు
బడ్డ, ........... . బ్రాహ్మపశ మె.
ఒకానొకప్పుడు *సత్య వరముజమీదారుల యాస్థానము డితుఁడునుఁ గవియును నగు రేకపల్లి సోమప్పకవి రాజు సమ్మానమును బోందఁగోరే తనప్రభువుల సిఫార్సుగైకొని విజయనగఁ మునకు వచ్చి యచ్చటఁ గొన్ని మాసములు నివసించి యుండి ప్రతిదినము నాస్థాన పండితులతో బాటు మహారాజు సన్నిధికి వచ్చుచుఁ బోవుచుండెడి వాఁడు. సోమప్పకవి విజయనగరమున " నున్న దినములలో సూరన, రాజును దర్శింప సస్థానమునకుఁ బోగా మహారాజును, దివానగు సీతారామరాజుగారును సోమప్పకతో మన కవికిఁ బరిచయము కలుగఁ జేసి, యాపండితుని ప్రజాఞ వి శేషములను వర్ణించి వానికిఁ జెస్సిరి. "యాచకోయ చితుశ్శతు ' అను లోకోక్తి సార్థకమగునట్లుగఁ బ్రథమదర్శన ముననే సూరకవి సోమకవులను నొండొరులపై నొకవిధమగు కక్ష్యజనించెను. ఈ పండితుని మూలమున నెట్లయినను సూతకవిని బరాభవింప సీతారామరాజుగా రుత్సాహ పడుచుండి.. తమ యుత్సాహ, స్వకల్పము"లు వెల్లడియగునట్లుగ సీతారామ రాజుగారు సోమసుకవి జగదేక పండితుడనియు, నతని ప్రజ్నాది
- పా॥ దీవించమంటాడు. " - ఇవి విశాఖపట్టణము జిల్లాలోని అనకాపల్లీ సమీముననున్నది. "
- -warm . విశేషము లమోఘములనియు, సూరనయెదుటఁ బొగడుటయే గాక యతఁడొక మహాకవీశ్వరుఁడని కూడఁ జెప్పుచు వచ్చెను.అంతసూరకవి, సోమప్పకవిని, సీతారామరాజు గారినిగూడఁబరా భూతులుగఁ జేయనెంచి సోమప్పకవి పై నీపద్యములను జెప్పెను.
గీ. దేవు నానమున్ను • దేశానకొక కవి.
యిప్పుడూరనూర • నింటనింట
నేగురార్డు రెడ్లు • రెనమండ్రు తొమ్మండ్రు
పదుగు రేసికవులు • భవ్యచరిత.
క. ఏమేమోశాస్త్రంబులు .
తామిక్కిలి పతి కెనఁటస , తకనీ కవితా
సొమర్ధ్యమెఱుఁగ నేరని
సోమునిజృంభణము గలదె • సూరునియెదుటన్
అంత సోమప్పకవి, ప్రత్యుత్తర మియ్యనిచోఁ దనయ శక్తి వ్యక్తమగునని యెంచి యాశుగా నీకింది పద్యమును జెప్పెను.
గీ. సోమశబ్దార్థ మెఱుఁగని • శుంఠవగుట
వదరితివి గాని సూరుని రదనపాళి .
రాలదన్నిన సోముని , లీలఁ దెలియ -
వైతి, నీ గుట్టుబఁయలగు • ననుచుఁ గుకవి.
అంతసూరకవి యూరకొనక సోమప్పకవి సుద్దేశించి రెండు పధ్యములు చెప్పెను. ________________
క. తెలుఁగున్ గబ్బపురీతులు క
ల నెఱుఁగని శుష్కతర్క కర్కశమతికిస్
డెలిసెనొక యించుకించుక
వెలివలి గౌతన్నకృపఁగ • విత్వపుజాడల్.
క. చెన్నగు నియోగి కపనపు
మిన్నా వైదికుని కబ్బి • మిందును జెపుఁడా
వెన్న మిసి జున్నుకబ్బునె
తన్ను కచచ్చినను గాని • ధరలో నసృపా
వీనికిఁ బ్రత్యుత్తరముగ.
గీ. తర్క కర్కశ బుద్దులై , తగినవారి
కేమసాధ్య ? మటంచు నూ , హింపరాదె
తెలుఁగుమాటలు నాల్గయిదు. తెలిసి తాము
కవులమనుకొన్న వెఱిపాడ • గట్టుమదిని ?
అను నీపద్వమును జెప్పి గడుసరియగు సూరకవిని వాగ్వుద్దమున జయించుట తనక సాధ్యమని ఖిన్ను డై సోమప్పకవి సరస్వతినిగూర్చి యిట్లు పలికెను.
క. జిలిబిలి పలుకుల వెలఁదీ !
పంగాకినకారగుళ్ళ పాలైతిగదే
యిలలో వైదిక విద్య
త్తిలకంబుల కేదిదిక్కు • తెల్పితివమ్మా.
అంత సూరకవి దీనికిఁ బ్రతరముగ నీకింది పద్యములను ఱెప్పెనని వాడుక. వానిలో నొకదాని యభిప్రాయము
మాత్రచట వాయుచున్నాను. (పద్యమింత వరకును నాకు లభింప లేదు).
1." నీ పురస్థలము తాళ్ళపాలెము, నీ చుట్టములు కల్లూరి వారు, నీయింటి పేరు "రేకపల్లి వారు, నీవు సోమాహ్వ యుఁడవు. ఇట్టి నీవాక్యములెంత వఱకు యుక్తియుక్తములో సభ్యు లెఱుంగుదురు గాక."
2. సీ. తట్టెఁడంతవిభూతిఁ • బెట్టి తాతలనాఁటి
కుండనాల్వీనులఁ • గునిసియాడ
మైలగ్రక్కెడు శాలం , మడతలు నెరసిన
బోడిబుఱ్ఱలమీఁద • బోసగఁజుట్టి
ప్రాంతనీరుంగావి • పంచెలుము.........ల్
గనుపింపఁగాడొల్లు • కచ్చగట్టి
యంగవ స్త్రంబుల • నతికి కుట్టినయట్టి
దుప్పట్లు పైఁగప్పి • తుదలుచినిఁగి
నట్టి పుస్తకముల • కట్టలుచంకలోఁ
బెట్టివిషం బులు • విదులుకొనుచుఁ
బలుగాకిముండ బి • డ్డలుశిష్యులనికొంద
ఱువచారము ల్సేయు • చుండఁగా స్వ
యంపాక. నిష్టుల • మనివంటసాగించి ,
పదిదినం బుల కొక్క • పట్టుఁబట్టి
సంగీత సాహిత్య • సరసవిద్యలవారి
పాలిటిభూతాల • పగిదిఁదనరి
యెంతచక్కని శ్లోక • మేనిఁబద్యం బేని
రస మెఱుంగక ముష్క, రతవహించి
యితఁడుపండితుఁడుగాఁ • డితఁడు తార్కికుఁడుగా
డితఁడుశాబ్దికుఁడుగా , డితఁడు సత్క్రి
యారసజ్ఞుండు గాఁ • డనిచుల్క నాడుచు
ఘనవిత్తహరణ దు • ష్కర్ములగుచుఁ
బర గుదుష్పండిత • బ్రహ్మ రాక్షసుల చేఁ
గవితారసజ్ఞత , గట్టు వడియెఁ
గాన నేరీతిఁజూచేదో కరుణమాదృ
శులకవిత్వ మేరీతిని సూటిఁజేసి ,
రక్షఁజేసెదొ నీ నేమా - రక్షకుఁడవు
జానకీరామదేవతా , సొర్వ భౌమ.
ఈరీతిగ వీరిరువురకును జనించిన పరస్పరనిరము వీరి యామరణాంత ముండెను. తనకు సూరకవిఫై గల వైషమ్యమును ప్రతిబింబింపఁ జేయునట్టి పద్యములను సోమప్పకవి తన ప్రబంథమగు "రుక్మసతీపరిణయమునం” గృత్యాది పద్యము లలోఁగుకవి నిందా సందర్భమున వాసి యున్నాడు. ఆపద్య ములిందుఁబొందు పఱుపఁబడినవి.
<poem>మ, కనవృత్తుల్ గుణముల్ గణింపక యలం • కారంబులున్ రీతులున్" "
ఘనవాక్యాః సదార్ధ సంగతు లెఱుం • గన్నేరకే యూరకం
పునఁబొబంధి , బైరి కొందఱుకవుల్ • • పుణ్యైర్యశో లభ్యతే "
యను వాక్యంబు ప్రమాణముయ్యె నిపు • డాస చిత్రమిద్ధారుణిన్.
చ, వరకవులంచుఁ గొందఱఁట • వారలు సాహితీ లేక యే కవీ
శ్వరులఁట వాడరీకలన • చాలఁగఁ గద్దఁట చిత్రమయ్యెడిన్
వరములొసంగు దైవములు • వాగ్దదినిచ్చుచు శాస్త్రసంగతిన్
వరమిడ లేరె సిగ్గెడలు • వాదులు గాక కవిత్వరీతులే.
సూరకవి కాశ్రయులైన చినవిజయరామ మహారాజు గారు సరసులనియుఁ బండి తావలంబకులనియుఁ గవిపోషకులనియు మీఁదఁజూపియుంటిని. వీరుభయభాషల యందునుజక్కని పొండిత్యము గలిగి రెండింటియందును సరసమగు కవిత్వము చెప్పుసామర్థ్యము గలవారై యుండిరి. 'పెద్దాపుర సంస్థానాధిపతులపయి వీరు చెప్పిన సంస్కృతశ్లోకము నిందుఁ దార్కాణముగ జూపుచున్నాఁడను. ..
శ్లో|| అంభోజంకలయన్ సదృక్షమవ నే సాహిత్యరీత్యాం దృశో |
ర్మాం తారమపారసంపది మహాభాపే యశో రాశిషు |
శత్రూణాం పుగ భంజు నే ధృతి గుణేకించోర గేంద్రంమతి |
ప్రాగల్భ్యేలేఖ్య ప్రతిభాతి తిమ్మనృపతిః పాకాహిత ప్రాభవః |
ఈ విజయరామ నృపాలుని గూర్చి ప్రశంసించుచుఁ గీర్తి శేషులగు గురజాడ శ్రీ రామూర్తి పంతులు గారు తమకవి . జీవితములలో నిట్లు వాసియున్నారు. « ఈరాజశిఖామణి యుద్దమందు మడసిన వానికి వీరస్వర్గమున్నదా యని పలికిన వారిం గూర్చి చెప్పిన యొక పద్యము.
ఉ. ఇంచుక సూచివేదన సహిం • చినమాతనృపొంగ నాకు
చోదంచిత సౌఖ్య కేళి సత • తంబునుగంచుకి గాంచు నెట్లుదు
ర్వంచిత తీవ్రబాణనిక • రక్షతబాహుల కబ్బ వేమరు
చ్చంచలలోచనాఘనకు • చ స్తబక వ్యతిషంగ సౌఖ్యముల్.
ఈపద్యంబుచే నీ విజయరామమూర్తి కవియనియు సర సుండనియు నెంచందగియున్నది. ”
శ్రీరామూర్తి పంతులుగారు మీఁది పద్యము విజయ రామనృపాలుని దని భ్రమపడిరి. కాని యియ్యది జక్కన కవి ప్రణీతమగు విక్రమార్క చరితమునఁ జతుర్థాశ్వాసము సందున్నది. సందర్భానుసారముగ మహా రాజీపద్యమును సభయందుఁ జదివి యుండవచ్చును. ఉదాహరించుటకుఁ బద్యములు లభ్యము కాలేదు గాని యీమహారాజునకుఁ గవిత్వము చెప్పు సామర్థ్యముండెనని ప్రబలనుగు వాడుకమాత్రము కలదు. .
ఆఱవ ప్రకరణము
దేశాటనము
సూరకవి సంవత్సరమునకు రమారమి "యైదాఱుమాసములు దేశాటనము చేయుచుండెడివాఁడు. ఇతఁడు ప్రతి సంవత్సరము వర్షాశనమునకై - పర్లాకిమిడి, పాలకొండ, బొబ్బిలి, చెముడు, శృంగవరపుకోట మొదలగు స్థలములకుఁ బోవు చుండెను. ఒక సమయమున నతఁడు పర్లాకిమిడికిఁబోయి యాసంస్థానము నఁగల రాజకీయోద్యోగుల సాహాయ్యమున రాజును దర్శింపఁ గోరఁ బండి తాదరము లేనియొక - ముఖ్యోద్యోగస్థుఁడు ' రాజు గారిని దన్నెంపన ఏసమయముకాదని సాకులు సెప్పి కవికినాశా భంగము కలుగఁ జేసెను. తనకుఁగలిగిన యనాదరణము కారణమున నాపట్టణమున నుంచుటకిష్టము లేని వాఁడై సూరకవి సమీప గామమునకు నడవిమార్గమునఁ బోవుచుండెను. ఆకాలమున నక్కడి యడవులలోని తోవలకు « జంతు ”లని పేరు. ఆ 'జంతు'లలో నొకటి యగు " రామజంతి'ని గవియిట్లు వర్ణించి యున్నాడు.
గీ. తరుశిఖర చుం బితామృతాం • ఢస్రవంతి
దళితనక్షత్ర పరి (వృఢ) • తపన కాంత
సమదవేష్టిత సకలభూ • (జానీ తాంతి)
ప్రకట మీంకృతవనదంతి. . "రామజంతి ”.
ఇది యిట్లుండ సూరకవిరాక రాజున కెట్లో తెలిసెను. అంత నాతఁడు జరిగినదాని కెంతయు వగచి సూరకవిని మరలఁ దస పట్టణమునకు రప్పింపనెంచి సవారీతోఁ దనమంత్రిని రామజంతి మార్గమున నంపెను. మంత్రి నిర్భంధము ను దాఁటఁజాలక సూరకవి పర్లాకిమిడికిఁ దిరుగ వచ్చి మహారాజుచే నుచిత రీతిని గౌరవింపఁబడి తగిన బహుమానమునందెను. ఆసమయమున గవి యామహారాజుగారి పై జెప్పిన పద్యములలో లభ్యమైన వానిని నిందుఁబొందు పఱచితిని.
<క. గోవింద ద్వాదశివలె .
వేవచ్చితి రాక రాక • నీనగరికి నో
పొవనగుణ నారాయణ
దేవుమహారాజ ! సాహి • తీనవభోజ..
క. నీవిచ్చుభత్య ఖర్చొక
భూవల్లభుఁడిచ్చు త్యాగ • మున కెనవచ్చుస్
బావనగుణ నారాయణ
దేవుమహారాజ ! సాహి • తీనవభోజూ.
క. వారిధికిని వారిధియే
మేరునగంబునకు సాటి ఆ మేరువగంబే
నారాయణ దేవుకు సరి
నారాయణ దేవు గాక • నరపతు లేదురా!
ఆకాలమున, పర్లాకిమిడి వారికిని విజయనగరము వారికిని బరస్పర వైరము కలిగియుండెడిది. అయినను విజయనగరాస్థాన కవీశ్వరుఁడగు సూరకవి తమపురమునకు వచ్చిన ఫుడెల్లను, పర్లాకిమిడి ప్రభువులగు నారాయణ దేవుగారు వాని నుచిత రీతిని గౌరవించి దవ్యరూపమగు బహుమాన మొసంగుచు వారి యాదార్యమును వెల్లడించుచుండిరి. మీఁది పద్యములానారాయణ దేవుమహారాజు సరసుఁడఁనియుఁబండి తావలంబకుఁడనియు బానశీలుఁడనియుఁ జాటుచున్నవి.
సూరకవిని నరాశన మొసంగి గౌరవించు మన్యపుసంస్థానములలోఁ బర్లాకిమిడి యొకటిగా నుండెను. "
ఒకానొకప్పుడు సూరకవి పాలకొండకుఁ బోయియుండెను. ఆకాలమున రామభద్ర రాజను పేరుగల యాతఁడువానిని బాలించ చుండెను. రాజు గారి దర్శనము చేయింపుఁడని మంత్రి లోనగు వారి, జాలదినము సూరకవి యాశ్రయించెను. ఏకాగణముననో సంస్థానముపందలి యున్నతోద్యోగస్థు లీతని విన్నపమును మన్నింపక , వీనియెడల సనాదరణఁజూపిరఁట. అంతసూరకవి మిగుల ఖిన్నుఁడును గుపితుఁడునునై యీక్రిందిప ద్యములను జెప్పెనని వాడుక.
శా. రాజు జారుఁడు మంత్రినియుఁడు నీరాష్ట్రంబులో పెద్దగా,
రోజుల్ కొండలు జీవహింసలను సం • కోచింప రెవ్వారికిన్
దాజీ మీయరు ; పాలకొండపురిలో దాక్షిణ్యశూన్యత్వమీ
ఖాజీ పట్టణ మేల వచ్చితిని నా • పాపంబు సర్వేశ్వరా.
మ. నరసింగుండును వెంక పొతుడుసుగృ •ష్ణాపాత్రుడున్ నాయుఁడున్
శరభాపాత్రుడు పాలకొండధరణీ • సామాజ్యధారేయులై
ధరవర్థిల్లెడు రామభధ్రసృపునా • స్థానంబునన్ బంచముల్
చిరకాలంబుగ వీరివెంటఁదిరుగన్ • చీ ! ఛీ! మనం బొప్పునే.
ఇట్లాగ్రామ మందు రవంతయును సమ్మానంబుఁ గానకి వేఱొక గ్రామంబునకు 'బోవనుద్యుకుఁడై పండి తావలంబ కుఁడని ప్రసిద్ధిగన్న యాగ్రామవాసుని దేవాంగుని బత్తుల అయ్యన్నను జూడఁగోరి దగ్గఱ సాగుచుండుసంతకు బట్టలమ్ముకొనుటకై వెళ్లుచుండిన అయ్యన్న నే "అయ్యన్న గ్రామమున నున్నాఁడా ? లేక సంతకు వెళ్ళినాఁడా? నేనిప్పుడతని యింటికి వెళ్ళినచో నతనిఁజూడఁగలనా? ” అని ప్రశ్నించెను. పండిత పక్షపాతియు నుదారశీలుఁడును నగు, అయ్యన్నతన్నుఁ బశ్నిం చిన యతఁడు సూరకవియని తెలిసికొనిన వెంటనే సంతకుఁబోవుటమాని వేఱక త్రోవను దనయింటి కేఁగి సూరకవిరాకకు నిరీక్షించుచుండెను. సూరకవియు, అయ్యన్న యింటి కేఁగియతనివలన మంచి సమ్మానమును (అయ్యన్న తాను స్వయముగ నేసినట్టి విలువగల యొక పంచలచాపును దాని పొరలయందు పదునారు రూపాయలను నుంచి కవికీ బహుమానముగ నొసఁ గెను.) బొంది యానందించిన వాఁడై యాతని పై నీక్రిందిపద్య ములను 'జెప్పెను.
క, మూ డేబదు లెవరుండరు
మూఢులునది గాన లేరు - ముల్లోకములన్
కం
వాడుక పడవలె మనుజుఁడు
వేడుకతో పొత్తులయ్య • వినఁగదవయ్య.
క. ఇచ్చెడివానికి రణమునఁ .
జొచ్చెడివానికిని గాని ఆ నురుచిర కీర్తుల్
వచ్చునె ? పందకి లోభికిఁ ..
బచ్చని విల్కానివయ్య , బత్తుల" అయ్యా.
గీ. చేరుఁబట్టు వేళ • జెలఁగి యేడ్చును బిడ్డ
యంతకంతనుఖము • నదియెయిచ్చు
నర్ధయడుగు వేళ • నదికష్టమనిపించు
ననఘచరిత ,బత్తు • లయ్యనార్య.
క. ఎత్తెఱుఁగ డూళ్లకంబఁడు -
సొత్తెడు దుప్పాడజగ్గు • శునకపుదాతల్
ఉత్తమకవుల నెఱింగిన
బత్తుల యయ్యన్న యీగి • పొటిని జేయర్ .
పాలకొండ "తాలూకా మిగుల ఫలవంతమైనది. తృణ కాష్టజల సమృద్ధిగలిగి సస్యపూరకములగు కేదారములచే నొప్పియుస్న యానాఁటిపాలకొండ జమీని గవి యిట్లు వర్ణించి యున్నాడు.
శా.క్షేమాకీర్ణ కీర్ణధామములున క్షీనేక్షు రంభాటవీ
స్తోమంబుల్ బహుళాలిధాన్య తతు లె • చ్చోటన్ నదీమాతృక
గ్రామం బుల్ బహుళాగ్రహరముల నే కంబుల్ ధరన్ జూడఁగా
క్షామం బన్నది లేదు శ్రీ రగిరిదే • శంబంధు నేందేనియున్
పాలకొండకు సమీపమున నున్న వీరఘట్టములోఁ బర్వ వీరఘట్టమునకుఁ తాలు, అను పేరుగలపండితమన్యుఁడగు నొబోవుట. క కోమటికవీశ్వరుఁడుండెడివాడు. అల్ప విద్యగలవాని కహంభావము మెండను లోకోక్తిసాకమగు నట్లుగ నీకోమటి కవి తన కాలములోనున్న కవీశ్వరుల నందఱను హేళనచేయుచు నవమానించు చుండెడివాఁడు. రాజాముకుదగ్గ జగనున్న యిల్లం నాయుడువలస కాపురస్థుఁడగు కొట బాలకవి యను నొక యుత్తమ కవీశ్వరు నీపర్వతాలు, అవమానముచేయ దానికా బాలకవియు నతని పక్షమువారగు వీరఘట్టాము కాపురస్థులు కొందఱు బ్రాహ్మణులును గలసి యెటులనై న నీవైశ్య కవీశ్వరునకు శృంగభంగము గావింప సెంచి నాడు పాల కొండవచ్చి యున్న సూరకవిని దమ గ్రామమునకు రప్పించి. తనశక్తియు నెదిరిశక్తి - గుర్తెఱుగని బర్వతాలు సూరకవి బాలకవిగార్లతోఁ బోటీకి నాశుకవిత్వ ప్రదర్శనము చేయ నొడంబడెను. గ్రామములోని పెద్దలు తగవరులుగాఁ గూర్చుం డిరి. నిర్ణీత కాలమగు మొకజాములో బాలకవి సూరకవిగార్ల తో సమముగఁబద్యములు చెప్పలేక పర్వతాలు తనయసమ్మతను నొప్పుకొని క్షమింపుఁడని సూరకవికిఁ బాదాక్రాతుఁడయ్యెను. ఆ సందర్భమున సూరకవి చెప్పిన పద్య మిట్లున్నది.
<poem>గీ. నరుని నొగల మీద • హరియున్న చందాన సూరకవివరేణ్యు • జోగగూడు
ఓర్వతాలుగాఁడు • పారిపోయె.</poem>
తన్న వమాన పఱచిన కోమటికవికిఁ దగినట్టుగ గర్వపరి హారమైనఁదున కెంతయు సంతసించి యాకార్యమునందుఁ దనకు సాహాయ్యపడిన సూరకవిని శ్లాఘించుచు బాలకవి యీ కిందిపద్యమునుఁ జెప్పియున్నాడు.
<క. అంతాకవులము గామా
అంతింతో పదైమైన • నల్లగ లేమా
ధంతివి నీతో సమమా
కాంతా సుమబాణ! సూర • కవి నెరజాణా.
వీరఘట్టముకు దగ్గఱగనున్న 'వట్టిగెడ్డ ' పయి నేలకోసూర కవి యొక పద్యమును జెప్పియున్నాడు. ఆపద్యమునందలి యొక పాదము మాత్రము మనకు లభించినది.
"వట్టి గెడ్డకు పదివేల వందనములు”
ఒకప్పుడు సూరకవి బొబ్బిలివెళ్లి యుండెను. ఆ కాలమున బొబ్బిలికి విజయనగరము వారికిని బొబ్బిలివారికిని బద్దద్వేషముగా నుండినను సూరకవి తమపట్టణమునకు వచ్చినాఁడని వినినతోడనే. బొబ్బిలి రాజుగా రతనికిఁ దగిన సదు పాయములనెల్ల జరుపవలయునని. తన యుద్యోగస్థులలో నొకరిని నియమించిరి. సూరకవి యిట్లు గౌరవింపఁబడి మరుచటి దినము రాజును దర్శిప నాస్థానమునకుం బోయెను, కొండొక సేపు..
రాజు గారు కవితో లోకాభిరామముగ సంభాషించి ప్రసంగంశమున విజయనగర ప్రభువులను గూర్చి మిక్కిలి లాఘవముగ మాటలాడ సూరకవి యట్టి దానికిఁ గొంచెమైనను సహింపకరా 'జుగారికి విరసముగఁ బత్యు త్తరమిచ్చి తనప్రభువుల యెడలఁదన గలవిశ్వాసమును వెల్లడించెను. అంతరాజు గారికి మిగులఁగోపము రాఁగ సూరకవి సభయందు నిష్టము లేని వాఁడై వెడలి పోయెనను నీ మొదలగు వింతలు జరిగినట్టుగ నొకవాడుక కలదు. దీని యదార్థమును స్థిరపఱుప గవికృతములగు చాటుపద్యము లేవియుఁగానరావు. కాని యొక విషయము మాత్రము మిక్కిలిగ వ్యాపించి యున్నది. ఆనాఁడు సూరకవి సభవిడిచి బసకువచ్చి భోజనాది కృత్యములు నిర్వర్తించుకొని రాత్రి రెండు యామముల కాలము నిద్రించి వేకువజామున బయలు దేఱి షీకారుగంజి అడవిగుండా స్వస్థలమునకు బోవుచుండెను. "అప్పుడచ్చట సాయుధపాణులగు కొందఱు బోయవారును కవిని జంపుటకు సంసిద్దులుకాగా వారికి భయోత్పాతమగు నట్లు సూరకవి కిరుపక్కల. ధనుష్పాణులగు రామలక్ష్మణులును వారి చెంగట సుగ్రీవాంజనేయులును నిలిచినట్టుగ వారికిఁ గన్పట్టవారందఱు స్మృతిదోలంగిన వారై కొంత తడవూఱకుండి ' తెలివివచ్చిన పిదపఁబట్టణ మునకుఁ బోయి యావార్త పురజనులకు నెఱిఁగింప వారెల్లరాశ్చర్యమగ్ను లయిరఁట ! ఈవిషయమును స్థిరపఱుప సూరకవికృత' మని వాడుకలోనున్న పద్యమిట్లున్నది."
<మ. హనుమంతుం డెచటన్ దివాకరసుతుం *(డాచెంత) సౌమిత్రియున
(దను సేవింపఁగ) జానకీ విభుఁడు (వా - త్సల్యంబుతో నిల్చి) యిం
(పున నన్నెప్పుడు) గాచుచుండగనునీ • బోయాధముల్ కిన్కచే
ననుఁజం వంగలవారే ? రావుకులజు • న్మా ! రంగరా (యోత్తమా.!)
ఇట్లు బోయల బారి నుండి తప్పించుకొని • మఱునాటికి జాముపొద్దు వేళకు మరడామునకు సమీపముననున్న యొకతోటలో బసచేసి వంట చేసికొని భోజనము చేయుటకు నొక యరటాకు నిమ్మని యచ్చటనున్న కూరాకుల మల్లిగాని నడుగవాఁ డాకు నీయక కవిని నిరాకరించెను. అంత సూరకవి కుపితుఁడై * కూరాకుల మల్లిగాడు కూలే నూతన్ " అని తిట్టెను. సూరకవితిట్టు కమసాలిసుత్తి పెట్టు”అను దానికి నిదర్శనముగ నేతము తోడుచున్న మల్లిగాఁడు నూతిలోఁ గూలెనఁట ! ఇది జరిగియి ప్పటికి రమారమి నూటయేఁబది సంవత్సరములైనను నిప్పటికిని మరడామునకు దగ్గఱనున్న యొక గచ్చునూతికి "సూరన్న గారి నుయ్యి ”అని యాప్రాంతమున వాడుక గలిగియున్నట్లు నామిత్రులలో నొకరగు శ్రీ బుద్దరాజు వేంకటపతి రాజు గారు చెప్పు
- ఈసందర్భమున నే కవిగారు . ఆర్తిజనరక్షోంపాయ ఆంజనేయ" అను మగుటముతో నూరుపద్యములు చెప్పినట్టు పొడుకకలదు. వానిలో నేను బది పద్యములు గల యొక ప్రాచీన తాళ గ్రంథము తమయొద్ద నున్నదని నా మిత్రులలో నొకరగు మగ్గాల గున్నయ్యశాస్త్రీ, బి. ఎ. గారు చెప్పినారు. కారణాంతరములచే నయ్యది సమయమునకు వారు నాకుబంపఁ జాలి నారు కారు. అడిడమువారి చాటువులు' అను "పేరునేను ప్రచురింపబోవు పుస్తకమునందా పద్యములనుజేర్చగల వా
డను
చున్నారు. ఈనూతికి సమీపమున నే నాఁడు సూరకవి బసచేసి యుండెనని తోచెడిని. 'లేనిచో నీనూతికి " సూరన్న గారి నుయ్యి "అను వాడుక కలుగ నేరదు. ఆ వైపునున్న పాచి పెంట, చెముడు, శంబరపురము మొదలగు మన్యవు జమీలకు వెళ్ళినప్పుడు చెప్పిన పద్యములుగా ? గన్పడు వానిలోఁ గొన్నిటిని మాత్రమిందుఁ బొందుపఱచు చున్నాను.
- క. ఆర్బుదములు నిర్బుదములు
బర్బర దేశాధిపతులు + పడిగాపులు నీ
దర్బారునఁ బడియుందురు
దోర్బల సంపన్న ! మన్నె • దొరయెరకన్నా.
- ఈ పద్యమును ఆంధ్రమున్నె దొరల పై జెప్పినట్టుగ గనఁబడు చున్నది ఔచిత్యమును బాటింపమికి దీనిని దార్కాణముగ నీయవచ్చును. ఇందు! జెప్పఁబడిన యెరకన్న శ్రీమంతుఁడును గృషీవలుఁడునునగు నొక మన్నె దొర గాని కవిగారు వర్ణించినట్టుగ బ్రహ్మాండ నాయకుఁడు, మాత్రము గాఁడు.
మ్యానాధిక్యములను బాటింపమికి నింకొక తార్కాణమును జూపు చున్నాను. తనకు మంచిగంటమును జేసియిచ్చిన యొక కమసాలిని నూరకవి గారిట్లు "వర్ణిం చియున్నారు..
క. ముల్లోకంబుల నాలుగ
వల్లెపరశురాము కీర్తి • ప్రబలివెలుగున్ -
మల్లిన్ సుమవల్లిన్
జాబిల్లిన్ , అలపాలవెల్లి • భీష్మునితల్లిన్
క ధీరాగణిశివరాము .
క్ష్మారమణుండేలు చెముడు • శంబర పురమా
పోరామారొంపల్లా -
పొరాద్రా మంగరాజు • పాలెముపట్టా.
సీ. చుట్టాలసునుగూడు • పెట్టని పెనులోభి
బొజ్జతా బెంచిన • పుణ్యమేమీ
కార్యమించుక సేయఁ - గా లేని నీచుండు -
రాజసన్నిధినున్న " లాభ మేమి
పదిమంది మెచ్చని ఆ పాపకర్మునకు సం
పదవి వీగిన ఆ భాగ్యమేమి
ఆశ్రితుఁబోవని , యధముండు పల్లకీ
కుక్కెక్కి తిరిగిన ఆ గొప్పయేమి
మాటచెల్లినయెడల సమస్తబందు
భూను గాశ్రితజనములఁ బ్రోవవ లేని
హని జన్మం బుకాల్పనా , వసుధలోన
టెంకిలి పురీనివాస ర , విప్రకాశ
శ్రీమదాకాళ కేశ యు , మామ హేళ.
సమస్యాపూణము.
ఉ. సారతరప్రబంధముల • సంఖ్యముగా నొనరించునట్టి
యీ "సూరకవీంద్రు నింజునిగి • చూతమటంచును. మాటిమాటికిన్ఈ
రసమెత్తి దుషకృ తుల • నిచ్చిన వారలనోరు మొత్తు డీ
మీరును బారుమీరు మఱి • మీరును మీరును మీరలందఱున్
(ఈపద్యమును బొబ్బిలిలోఁ జెప్పినట్టు వాడుక కలదు.) సూరకవి తఱుచు తన బంధువులను జూడఁబో పుచుండెడి నాఁడు. ఒకప్పుడితఁడు చీపురుపల్లి నుండి బయలు దేఱి తన బంధువులు బుఱఱా వారింట జరుగు నొకశుభకార్యమును జూడ, అదపాకకుఁబోవు చుండెను. (ఈగ్రామము చీపురుపల్లెకు నేడెనిమిది. మైళ్ళదూరమున నున్నది.) ఆనాఁడే సూరకవిగారింటికి సమీపమున నివసించు పాపయను పేరుగలయొక సాలిది కూడ నదపాక పోవుచుండెను. దారిలో నది సూరకవిని గలియ నతఁడు “ పాపా ! యెటు వెళ్లెదవే ? ”అని యడిగెను. “బాబూ! 'అత్త వారింటికి నదపొక "ఏళ్లుచున్నాను. ” అని పాప ప్రత్యుత్తరమిచ్చెను. సర్వకాల సర్వావస్థల యందును బద్యములల్లుటయే వేళ్ంబముగాఁగల మన కవిగారు పాప చెప్పిన మాటలనే యొక కందపద్య పాదములో ( అదపాకా అత్తవారు ? ఔనే పాపా ! యని తిరుగఁ జెప్పిరి. అంత పాప సూరన్న బాబూ! నీకుదండము. నామీఁద నొకపద్యమును గూర్పుము.' అని గోరెను. సూరకవి యాసొలిదాని కోరికను జెల్లింప నెంచి,
<* క. అదపాక మామిడాకులు -
పొదుపుగ దొరవి స్తరంటఁ - బొడిచినవాడే
మద మొప్ప విక్రమార్కుఁడు;
అదపాకా అత్తవారు! • ఔనేపాపా.
- అమాయకురాలగు సాలిదాని గోర్కె చెల్లించఁ జెప్పిన పద్యమనివాడుకకుఁ దగినట్టుగ నే యున్నది. అదపాక మామిడాకులు విస్తరికుట్టుటకుఁదగిన వెడల్పు లేనివి. కవి గారియనుభవము. నిచట వెల్లడించియున్నారని చెప్పనగును.
అని పద్యమును బూర్తిచేసి యాపాపను సంతోష పెట్టి నట్లు వాడుక..
చీపురుపల్లెనుండి స్వగ్రామమగు భూపాలరాజురేగ నెళ్లినపుడెల్ల సూరకవి తన బంధువులగు రెల్లివలస పొణంగిపల్లి వారిని, భోగాపురము దేవగుప్తాపువారిని జూడఁబోయెడివాడు. , ఆకాలమున దేవగుప్తాపు రామయ్య గారు భోగావు మునఁ గణికము చేయుచు వ్యవసాయమువలనఁ దనకుఁ గావలసిన వానిని బండించుకొని హాయిగఁ గాలక్షేపము చేయుచుండెడి వాడు.. అతఁడు బాంధవ్యమున మనకవిగారికీమఱదియైన కారణమునఁ బరియాచకముగ నారామయమంత్రి నిట్లునణిర్ణించి యొక పద్య మునుజెప్పెను.
రెయిలు సదుపాయము లేని యాదినములలో సూరకవి వ్యయశ్రయాసములకు వెనుదీయక కాశీయాత్రకుఁ బోయెను, దివ్య క్షేత్రమగు వారాణసీపురమును బవిత్రమగుగంగా స్రవం తినిదర్శించి తనజన్మము సార్థకమైన దానిని గాఁ జేసికొను నాసక్తి యటుండ, సంస్కృత విద్యా ప్రచారమునకు నిలయమై ప్రసిద్ధి గాంచిన కాశీపురమును నవ ద్వీపమును జూచి యాయాస్థలముల యందున్న 'పండితో త్తములను దర్శింప వలయున నెడి యుత్సా హము తన్నుఁ బురిగోల్ప నితఁడు త్తర - దేశయాత గావించెను. కాశీ నుండి స్వదేశమునకుఁ దిరుగవచ్చుచు మార్గములో నున్న దివ్య క్షేత్రమగు శ్రీజగన్నాధమునకు వచ్చియున్నప్పుడే తనకుఁ బరమ మిత్రుడును బోషకుఁడును నగు పొణుపాటి వేంకటమం త్రి స్వర్గస్థుఁ డయ్యెనని విని మిగుల ఖిన్నఁడై యిట్లోక పద్యమును జెప్పి యున్నాడు.
మ. కరుణాసాగర ! పొగ్గా పొటికుల వేం • కటామదాసుస్ వసుం .
ధరయందుంచక' స్వర్గలోకమునకున్ • దగ్గించినావేమి ? త .
తురిఁ గల్పాదులు లేవే యాచనలకున్ ? • భూయాచక శ్రేణి కె .
వ్వరు (దిక్కేమిది) మొండిజగ్గడవు (కా వా వెఱిపల్కితిన్.)
ఏడవ ప్రకరణము -
కవి కాశ్రయుఁడైన పొణ్గుపాటి వేంకటమంత్రి .
18 వ శతాబ్దమధ్యమున శృంగవరపుకోట జమీని బరి పాలించు చుండిన శ్రీముఖీ కాశీపతి రాజుగారికి నీపొల్గుపాటి వేం కటమంత్రి మంత్రిగానుండెను. ఇతఁడు గోలుకొండ వ్యాపారి శాఖలోఁ జేరిన బాహ్మణుఁడు. శ్రీవత్సగోత్రుడు. నీరరాజు మాత్యపుత్రుడు. ఈ మహనీయుని వితరణాది గుణము 'లెంత యుత్కృష్టములో కాని, యతనిని నుతించినట్లు తనయేలికలగు విజయనగర పురాధీశులనుగాని మఱి యితర రాజులను గాని సూరకవి పొగడియుండ లేదు. ఇతని పై సూరకవి చెప్పిన వద్య ములు 'పెక్కులుగలవు. వానిలోఁ గొన్నిటినిమాత్ర మే యిచట వాయు చున్నాఁడను.
క. వర దానాచారంబుల
గరిమగనివనీ వకులును గర్మరులును భూ .
సురమణి' యని నిన్నందురు
విరచితవృష ! పొణ్గుపాటి • వేంకటమంత్రీ.
క. లేడు భువివానం దడయని
వాడున్నీ యింట భుక్తి • వడయనిద్విజుడు
బోడిమి మిజు గనిన్నున్
వేఁడనికవి పొణ్గుపోటి • వేంకటమంత్రీ.
క. చుక్కలవ లెఁ గర్పూరపు
ముక్క వలె నీదుకీర్తిన్ ముల్లోకములన్
గ్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్క సముగఁ బొణ్గు పొటీ వేంకటమంత్రీ.
క. సగిదత్తురె గుణసంపద
వెఱంక మా పొణ్గుపాటి , వేంకటపతికా
గురుచక్రవర్తులు బదా
ర్గురు రాజులు ముప్పదిద్ధ • రునియోగివరుల్.
మీఁది పద్యములయందుఁ గల వర్ణనమతిశయోక్త్య లంకార భూయిష్టమైనట్లుగఁ గానఁ బడుచున్నను నీమంత్రి పుంగవున కీప్రాంతమునఁగల కీర్తి మాత్ర మద్దానిని స్వభావోక్తి యని యే చాటుచున్నది.
తనకు సూరకవి యాశ్రితుఁడై నను వేంకట మంత్రి మాత్రమాతని యెడలఁ బోష్యపోషక భావముచూపక యతనిఁదన నెచ్చెలిగ యోజించి తన బంధువుల కంటె నెక్కుడుగ గౌరవిం చుచువచ్చెను. సంవత్సరమునకు మూఁడు నాలుగుమాసములు శృంగవరపుకోటలో మంత్రిగారి యింటనే 'యుండు చుండెడి వాడు. ఆయాసమయముల యందు వేంకటమంత్రి గారి సన్నిధిని నిష్టగోష్ఠిగను లోకాభిరామముగను జరుగు ప్రసంగముల సందర్భముననే సూరకవి . పొణుపాటి 'వేంకటమంతి) " అను మకుటముతో - నే పద్య ములను జెప్పియున్నాడు. ఈ పద్యములనే యిటీవల వారెవరో 'యేర్చికూర్చి వానికి - వేంకటమంత్రి శతక మని పేరెడిగాని వాస్తవముగ నయ్యవి కవిచేఁ బ్రస్తావన గఁ జెప్పఁబడిన వేగాని శతకరూపముస రచింపఁబడినవి కావు. ఇందులకుఁ దార్కాణముగఁ గొన్ని పద్యములతో సంబంధించియున్న వింతకథలను నిచట వ్రాయు చున్నాఁడను.
1 ఒక సమయము శృంగవరపుకోట జమీదారులగు శ్రీముఖి కాశీపతిరావు గారి గృహామున నేదియో యొక శుభ కార్యము వైభవముతో జరుగుచుండ సమీపగ్రామములలో నున్న బాహ్మణులు సంభావసలఁ గైకొనుటకు-- శృంగవరపుకోటవచ్చి యుండిరి. సంభోసనలిచ్చుటకుఁ బూర్వము బాహ్మణులందరు దొడ్డిపెట్టిరి. ప్రమాదవశమున సూరకవి కూడ దొడ్డి పెటఁబడి రెండు యామములు మించు వఱకచ్చటనే యుం డవలసి వచ్చెరు. తాను సూరకవి యని పలుమాఱు బంట్రౌతులకు జెప్పి విడు పడన్నను వారితనిని విడువరయిరి. సంభావనల నందుకొను బ్రాహ్మణులతోఁ బాటు. కొంత సేపునకును సూరకవి సంభావన లిచ్చుచున్న వేంకటమంత్రి గారి యెదుటబడ నతఁడు భావగారూ! మీ రేల దొడ్డి పెటఁబడిరి? ఇంతవజుకును భోజనములేక యుంటిరా ? అపరాధము క్షమింపుడుడు. ఆచటనున్న
బంట్రౌతులకుఁ దెలిసినది కాదు” అని జరిగినదానికి వగచు చుండ సూరకవి.
1. క. బలవంతుఁడు బలహీనుఁడు
పొలతురు విధితప్ప, నల్ల • పూసలుముత్యాల్
తొలఁగుఁగద మగఁడుపోయిన
వెలదుకకున్ బొణ్గుపాటి శ్రీ వేంకటమంతీ.
అనియొక పద్యమును జె ప్పెను.
2. మఱియొకప్పుడు వేంకట మంత్రిగారి యింట జరిగిన యొక బ్రాహ్మణ సమారాధన కొఱకు సమకూర్పఁబడిన వస్తుసం మృద్దిని వర్ణించుచు సూరకవి యొక పద్యమును జెప్పియ న్నాఁడు.
క. ఒక్క సముద్రము దక్కఁగఁ
దక్కినసంద్రములువీయు , దారమహిమచేఁ
జిక్కిఁగద ! విప్రభుక్తికి
వెక్కసముగఁ బొణ్గుపాటి , వేంకటమంత్రీ.
వడ్డనచేయు చున్న వేంకటమంత్రిగారి సోదరి యీ పద్యమును విని నూరకవితో ' భావగారూ ! (వెంకటమంత్రియు సూరకవియు నొకరి నొకరు (భావగారు' అని పిలుచుకొనుచుం డెడి వారఁట.) మీబోటి స్వయంపాక నియమముగల వారలకు, దక్కటి సముద్రము విడిచినారము ”అని చెప్ప సూరకవి యేని
యుఁబ్రత్యుత్తరముగఁ జెప్ప లేకపోయెను. అంతనచ్చట భోజనమును జేయు చున్న వారంద ఱామె సమయస్ఫూర్తిగఁ జేసిన పరియాచకమున కెంతయు సంతసించిరి.
ఇటులనే యీపద్యములలోఁ గొన్నిటికి "గాధలుకలవు. ఆ కారణముచేత నీ పద్యములు ప్రస్తావవశముగఁ జెప్పబడిన వని యూహించుట యుక్తమని నాకుఁదోఁచెడిని.
ఆఱవప్రకరణమునం దుదహరింపఁ బడిన
మ. కరుణాసాగర ! పొణ్గుపాటికుల వేం • కట్రామదాను న్వమం
ధరయందుంచక స్వర్గలోకమునకున్ దర్లించినావేమి ? త
త్పురిఁగల్పాదులు లేవె యాచకులకున్ • భూయాచక శ్రేణి కె.
వ్వరు(ది క్కేమిది) ? మొండి జగ్గఁడవుఁగా • వా ? నెట్టి నై పల్కితిన్ "
అను నీపద్యము వేంకటమంతి స్వర్గస్థుఁడై న పిదపఁగవి చేఁ జెప్పఁబడినది. ఇయ్యది యామంత్రివరుని యెడలఁ గవికిఁగల గౌరవాతిశయమును దేటపటచుటయే గాక యాతని వితరణాది సుగుణసంపదనుగూడ విశదపజచు చున్నది. కారణజన్ముఁడని చెప్పఁదగిన యీమంత్రి శిఖామణి క్రీ!! వె|| 1780 సంవత్సర ప్రాం తమునఁ గీర్తి శేషుఁడై యుండవచ్చును.
ఎనిమిదవ పకరణము
శాపానుగహసమర్థత.
చ. గడియకు దూఱుపద్యములు - గంటము లేక రచింతుదిట్టుగా
దొడఁగిలినా ఫలాలుమని • తూలిపడున్ గులశైల జముల్
విడువక సుగ్రహించి నిరు , పేదధనాధి పుతుల్యుఁజేతు నే
నడిదముపొడ సూరిన ప , మాఖ్యఁడ పోకుండు నాటియే.
సూరకవి చాటుధార.
పదునెనిమిదవ శతాబ్దమునఁ గాఢప్రబంధ రచనకు ప్రసిద్ధి కెక్కిన కవి వరులలో నొకఁడనియు, లాక్షణికుడనియు, సూరకవికిఁగల ప్రసిద్ధి యటుండ నతనికి(దిట్టు కవి త్వము గూడ గొప్ప పేరు వచ్చినది. " సూరకవితిట్టు కమనాలిసుత్తి పెట్టు ” అని లోకమున నిలిచియున్న పలుకులే మీఁది యంశమును వేనోళ్ళల జూటుచున్నది. అంతియగాక పిండిపోలు లక్ష్మణకవి తన "లం కావిజయము"న.
క. " తెలియ విమురాదు క్యూ
తులు సూరకవి ప్రముఖపృ • ధుపది భావం
శులు భీమశ్రీనాధుల్
వెలియగ నాకరణిఁ దిట్ట - లేరూఢమతి . "
, అనితిట్టు కవిత్వమునకుఁ బ్రసిద్ధి కెక్కిన ప్రాచీన కవివరులతో పాటు సూరకవినిఁ గూడఁ బేర్కొని యున్నాడు. శాపానుగ్రహముల రెంటిలోను మొదటి దానికిగల నిదర్శనములు రెండవ దాని కుండినట్టుగ నీకవివరుని జీవితము ననుసరించి చెప్పుటకు నాధారములఁ గానరానందున వేములవాడ భీమకవి మొదలగు పాచీనకవులవలె 'మొకటఁ దిట్టటయుఁ బిదపనను గ్రహించుట యు నీతని పట్ల లేదేమో యని తోఁచెడిని. కాని తపఃప్రభావ : సంపన్ను డగు నీతనికి నట్టి ప్రభావముండిన సుండవచ్చునని " "విచువకను గ్రహించి నిరుపేదనాధిపు తుల్యుఁజేతు" వను .. వాక్యము సందియమును గలిగించుచున్నది. సూరకవి నిండు జవ్వనమున నుండి కవితాసామర్థ్యముచేఁ దనకీర్తి చంద్రి కల దేశమునందు వ్యాపింపఁ జేయుకాలమున నే యడిదము రామకవి : తన వాక్పటిమచే గంగాభవానిని నోడించి యీయడిదము వంశమునకు నొకయద్భుతమగు కీర్తిదెచ్చెను. అట్టికీర్తితి కొలఁది దినములలో నే, కవితావృత్తిచే నెల్లెడలఁ జేరుడయుచున్న సూరకవి నాశ్రయించిన దాయెను. సహజమగు తన సామర్థ్య - మునకునిది తోడుగాఁగ ఇతనికిఁ దిట్టు కవిత్వవిషయమునఁగీర్తి హెచ్చు కాఁజొచ్చెను. వేయేల ! ఆకాలమున సీతని . యెడల జనసామాన్యమునకు భక్తికంటె భయమేయెక్కుడుగనుండెను. సూరకవి తిట్టు కవిత్వముతో సంబంధించిన కొన్ని ముచ్చటల : విచ్చటఁ జెప్పుచున్నాఁడను. .
1. ఒకానొకప్పుడు, ఆళ్ళ సరవయ్య యను పేరుగలయొక కోమటి యింట వివాహముజరిగెను. కవితా సంభావనను గై కొనుటకయి సూరకవి యాకోమటి యింటికిఁబోయి యుండెను. అంత గృహయజమానుఁడు సరవయ్య " బాబూ ! సూరకవి గారూ ! రేపటి యుదయమున దయ చెయ్యండి. కట్నము దాఖలు చేసుకుంటాను. ” అనియెను. సరవయ్య కోరిక చొప్పున మ ఆునాఁటి యుదయమున స్నాన సంధ్యాద్యనుష్ఠానములు నిర్వర్తించుకొని సూరకవి వాని యింటికిఁ బోయెను. "బుద్ది: క ర్మానుసారిణీ ” యనునట్లు సవరయ్య వీణ్ని పాంగర ; బాప నాడు దాచ పెట్టినట్టు పొద్దుటే పౌరొచ్చేడు ”అని సూరకవిని దిట్టెను. ఆపరుషోక్తులు విని సూరన మిగులఁగుపితుఁడై "ఆపామే నిన్నుఁగఱవ అయ్యో సరవా! "అని శపించెను. తిట్టుటయె తడవుగ నొక ' కృష్ణసర్పమింటి ముంజూరు , దూలమునఁ జేయానుకొనియున్న సరవయ్యను బొడిచి విగత పాణుని జేనెను. అట్టి యద్భుతమున కచ్చటనున్న వారందఱు కలవరపడి చేష్టదక్కి యుండిరి. ఆ సర్పము మాత్రమచ్చటనున్న వారల సేవ్వరి నేమియుఁ జేయక తన దారిని బైటకుఁబోయెనఁట !
2. ఒకప్పుడు సూరకవి చీపురుపల్లి నుండి శృంగవరపుకో టకుఁ బోవుచుండెను. మార్గమధ్యముననున్న ద్వారపూడియను గ్రామమునకుఁ బోయి నాలుగైదు యిండ్లకడఁ దాగుటకుమజ్జిగ నడిగెను. అది యెట్టిపాపమో గాని యొట్టుఁ బెట్టినట్టు కవికిఁ జల్లబొట్టు దొరకదయ్యెను. తానేఁగిన యిండ్లకడఁ బాడియుండియుఁ దనకు వార లీయనందులకు వగచి "దూరమైపోయెరా పొడి ద్వారపూడి "యని యొక శాపవాక్యమును పలికెనఁట. ” దీనికిఁదగినట్టుగ నాఁటిసాయంకాల, మాయైదారెండ్లకడ నావులు గంటెఁడు పాలైన నియ్య లేదఁట ! గృహయజమాను లట్టివింతకు సూరకవి శాపమే కారణమని యెంచి క్షమింపుమని సూరకవి ని వేఁడుకొన యథాప్రకారముగ మఱునాఁటి నుండియునావులు పొలిచ్చు చుండెనఁట ! (ఈవింతను సూరకవి శాపానుగ్రహ ముల "రెంటికిని దార్కా ణముగఁ జెప్పినను జెప్పవచ్చును.) -
3. సూరకవికి 'చీపురుపల్లె 'యందుఁ గొందఱు శిష్యు లుండిరని మూఁడవ ప్రకరణముననే వాసియున్నాను. ఆ విష యమునుఁ దెలియఁజేయుపద్యములోని కడపటి పాదమిట్లున్న ది. “ ధీరుఁడై నిలిచె మురపాక నూరఁడొకఁడు ” ఒక్క మురపాక సూరన మాత్రము తన శిష్యులలో నుత్తముఁడనియు, స్థిరముగ విద్యగరచెననియుఁ గవిగారి యభిప్రాయమై యుండ దైవమా పద్య పాదార్థమును వేఱుగ గ్రహించుటచే మురపాక సూరన్న గారి సోదరులు నలువురలోను సతఁడు మాత్రము మిగిలి తక్కి నవారు స్వర్గస్థులైరట ! (ఈపద్యమును జెప్పుటలోఁ గవియు దేశము జరిగినదానికి భిన్నముగ నుండినను బదములగూర్పుచే నొక విపరీతమగు నర్థము గలిగెననియు దాని పర్యవసానముగనట్లు జరి గెననియుఁ జెప్పుదురు.) ఇట్టి వింతలింకను నీకవిని గూర్చి పెక్కులు చెప్పుదురు గాని యవి యెంతవఱకు. విస్రంభ పాత్రములో చెప్పఁజూలను. ఏదియెట్లున్నను సూరకవికి మాత్ర ము తిట్టుకవిత్వమునబ్రఖ్యాతికలిగి యుండెనని చెప్పుటకు సందియము లేదు.
'గడియకు నూఱుపద్యములు గంటను లేకరచింతు' అను వాక్యమును బట్టి సూరకవికి నాశుకవిత్వమున గొప్పసామర్థ్య ముండెనని మనమూహింపవచ్చును. దేశాటనము' (ఆఱనప ! కగణము) కింద నియ్యఁబడిన వీరఘట్టాము వృత్తాంత మాతని యాశుకవితా సామర్థ్యమును వెల్లడిచేయు చున్నది. ఇంతియ గాక శతసంఖ్యాకములై యాంధ్ర, దేశమున నిలిచి యున్నయీ కవివరుని చాటు పద్యరత్నములు గూడ సద్దానికి సాక్ష్యమిచ్చుచున్న పని నాయభిప్రాయము. తొమ్మిదవ ప్రకరణము
చెఱువుమీఁది పద్యములు.
(కృతికర్త అడిదము రామకవి.)
ఈపద్యములు సూరకవి ప్రణీతమని సామాన్యమగువాడుక. కాని యియ్యది
మాకుటుంబములోఁ బారంపర్యముగ వచ్చచున్న వాడుకకు విరుద్ధము. కాఁబట్టి పద్యముల కృత్వమును గొంతవఱకుఁ జర్చించి యందలి సత్యాసత్యములు పా ఠకమహాశయులకు విశదపజచెదను.
ఈ వంశజుల చే మూలపురుషుఁడుగ నెన్నఁబడు నడిదము నారప్పకు * శ్రీవిజయనగర సంస్థాన ప్రభువులలో నొకర గు కృష్ణమరాజు మహారాజులుంగారు రేగయను గ్రామమునఁ గరణికము చేయుటకుఁ గొంతమాన్వమును దయచేసిరి. .
- * యీయినాం సుమారు 300 సంవత్సరములకిందటస్నదుదార్కు (అడిదం నారప్పకు) మజ్కూరు మిరాశీ పని చూడగలందులకు శ్రీ యర్ర కృ ష్ణం దేవు శ్రీ నల్ల కృష్ణం దేవు మహారాజులం గార్లు మజ్కూరులో కొంతమా న్యం దయ చేయించినారు. " మహా రాజశ్రీ జి. యన్ . టయలరు యస్కోయరున్దొరవారి యినాముల దరియాప్తులో చేరిన విశాఖపట్నం జిల్లా యిల్కావియనగరం సమస్థానం బాపతు భీమునిపట్నం సబు మేజ స్త్రీటు యిల్కా అన్నమరాజు "రేగ మిరాశీదార్లు ఆడిదం నారాయణప్ప సన్యాసిరాజు వగై రాలు దాఖలు చేసిన స్టేటు మెంటు, స్న 1727ఫసలీ 1892 సంవత్సరం.
10
ఈశ్వరానుగ్రహముచే నయ్యది నేఁటివఱకు నీవంశజుల యనుభ వములోనే యున్నది. వారిలో నొకకుటుంబము వారు రేగలోనే నివసించుచుఁ గరణికము నేఁడును జేయుచున్నారు. ఆ కుటుం బమువారిలో నొకఁడగు రామకవియే యీపద్యములను జెప్పెను.
...." అడిదమువారి యినాము భూములు అనుముల చెఱు” వనునొక చెఱువు ' కిందనున్నవి. ఈ యినాముభూముల మళ్ళ లోఁగొన్నిటిన త్తి నోముల చెఱునను నింకొక చెఱువు గలదు. ఈ నోముల చెఱువు పూర్తిగ నిండినపుడు మిరాశీ యినాము భూములలోఁ గొన్ని మళ్ళకు ముంపుగలుగును. ఆ నాఁటికాల మున నీ రెండవ చెఱువు పూర్తి గా నిండియుండ 'రామకవి మొ దలగు వారి భూములకు ముంపువలన " సస్య నష్టము గలిగెను. అంత రామకవి "రేగగ్రామము గుత్తదారగు దంతులూరు, అన్న మరాజుగారితోఁ దనకుఁ గలిగిన నష్టమును గూర్చి చెప్పుకొని నీటిముంపుతీయింపుఁడని యతనిని వేడుకొనెను. కాని అన్నమరాజుగారు రామకవి ప్రార్థకనలను బెడచెవినిఁ బెట్టిరి. కవికిఁగలిగిన బాధ తొలఁగసాధనము లేకుండెను. అంత రామకవి యీసమాచా రమంతయుఁ దన యేలికయగు శ్రీ విజయరామ గజపతి మహా రాజుసకుఁ దెలుప నిశ్చయించుకొని యొక యర్జీని బద్యముల తో వ్రాసి యామహా రాజునకుఁ బంపుకొనెను. ఆపద్యముల కే యర్జీద్యములని వాడుక. అవియిందుఁ బొందుపంచు చు న్నాఁడను.
బాఠితో త్తముఁడ శు ద్దాంధ్రకవిని. పేరురామన యింటి • పేరడిదమువారు. మాజాగభూపాల రాజు రేగ. నల్లకృష్ణకు మా నాయకాగ్రేసరుం డెఱకృష్ణక్ష్మాత , లేంద్రులచట గరణిక ధర్మంబు గల్పించి మాన్యంబు దయచేసి గది యాస్ప దంబు మాకు
గీ. నదియు నీయేఁడు దంతులూ , రన్న నృపతి సత్తముఁడు గ్రామ * మెల్లను , గుత్త చేసి చెఱువు బిగఁగట్టి ప్రజలుజే • జేపడంగా ముంపుగట్టించె వరిపొట్ట • ముంపఁదలఁచి.
సీ. విన్నవించెద నాదు ఆ వృత్తాంత మది కొంత చిత్తగింపు పరాకు సేయకుండఁ బొలములో నొకఁడేరు • పూన్పంగఁ జాలఁడు. గంగాభవానిఢాకకును జడిసి దుక్కి టెన్లను కొని దున్ను కొంద మటన్న - బదులియ్యం డెవ్వఁడు పాత నేబు ఏజోలియును లేక యింటనుండెద మన్న సొలుకు వచ్చుగం • టాలపన్ను,
+గీ. దేశముననాదు పొన్నూరు . తెన్ను గారు పంట పస లేదు. గంటాల • పన్ను పోదు - మీకు దయగాదు మునుపటి ఆ మిసిమిలేదు , అతులగుణదీప విజయ రా , మావనీప. . *
- పొ|| నోముపొలముఁదా
+ పొ॥ దేశ నిసబత్తు.
మహారాజునకుఁ బద్యరూపమగునీయర్జీ పంపుకొనినను గార్యము లేకపోయెను. గుత్తదారుఁడగు అన్నమరాజుగారి వలనఁగాని తన ప్రభువులగు విజయనగరా ధీశులవలనఁ గాని తనకుఁగలిగిన బాధతొలఁగ కుండుటచేత వేవొండు చేయునది లేక యొక నాఁటియుదయమున రామన స్నానసంధ్యాను స్థానములు నిర్వర్తించుకొని తాటాకులు గంటము చేత నిడుకొని పొలము నకుఁ బోయెను. నీటిముంపు చేతఁ జెడుచున్న సస్యమును జూచి విచారించి తన బాధతొలఁగుటకుఁ దన కవితయే శరణమనియెంచుకొని కుత్తుక బంటి నీటిలో నిలువఁబడి గంగాభవానిని నుతించుచు నిట్లికపద్యమును వ్రాసి నాసిన 'తాటియాకును నీటి లోవిడిచెను.
<సీ. బ్రహ్మాండ ఖాండసం • పత్తి కుక్షిని గల్గు
పద్మ నాభుని పదా • బ్జమునఁ బుట్టి
సకలరత్నాకర • స్థానమై యుప్పొంగు
నంబుధీశునిచర ణంబు దొక్కి,
పరమతత్వజ్ఞుఁడై , పరఁగళంతను మహీ
రమణువామాంక భా • గమునఁజేరి
యఖిలలోకాధ్యక్షుఁ * డై మించి విహరించు
శివుజటాజూటాగ్ర సీమ నిలిచి
తనరునీవంటీ ధన్య కు త్తమము గాదు
పూసపాటీమహాస్థాన , భూమియందుఁ
గాలు దొక్కంగ నోడుఁజం , డాలుఁడయినఁ
గదలు మిట మానీ దివిజగం , గాభవాని.
ఇట్టి భూషణ వాక్యముల చేతఁ దన సంకల్ప మీడేరమిం జూచి రామన కుపితుఁడై యీకింది రీతిని గంగను దూషించు చు నాలుగుపద్యములను జెప్పెను.
సీ. ఆదిభిక్షుం డీతఁ • డని రోసి విడియాకు
గొనివచ్చి యిట నిల్వఁ • గోరితొక్కొ
జగడాలచీలి నై , సవతితోఁ బోరాడి
యీగి వచ్చిచోట • డాఁగిలొక్కొ,
నిద్దరాంగన లెల్ల • నీఱంకు నెలిపుచ్చ
దూబవై యిచ్చోటఁ • దూఱితొక్కొ
బీదబాపలఁ గష్ట • పెట్టుటకై మిన్ను
దొలఁగి యిచ్చోటను • నిలిచితొక్కో
వలదు ద్విజభూమి కాల్నిల్ప • వరుసగాదు
రవ్వ నీ కేల తగదంబు | రాశి కరుగు
నాతి ! యతఁడు కాఁడ టె పిన్న , నాఁటిమగఁడు
కదలు మిట మాని దివిజగం - గాభవాని.
సీ, భావింప నిలువెల్ల ఆ భంగంబులే కాని
భంగము ల్తొలఁగుటె • ప్పటికీ లేదు
తిరుగుచో వంకర • తిరుగు టింతియ కాని
తిన్నఁగాఁ దిరుగుట , యెన్నఁడెఱుఁగ
మొనసి రేయిఁబగళ్లు - మొరయుచుండుటె కాని
మొరయ కూరకయుండు • టెఱుఁగ మెపుడు
పాలకల్మి నిరోసి • పల్చనగు టెకాని
పలుచనిగతి మాని , మెలఁగు టెటుఁగ
మనుచు నీలోన నీవైన యవగుణంబు
లరసి లజ్జించి దివినుండ • కరుగుదెంచి
నిలువు నీ రైననీ విందు , నిలిచితొక్కొ,
కదలు మిట మాని దివిజగంగాభవాని.
సీ. పచ్చిమాంసము కల్లు • భక్షించి మత్తెక్కి
రాణించు తిరగుప • రాంసు లైన
గంజాయి గుండ హు క్కాలుడి కేడి నీళ్లు
దావి మౌన్స డెడు తురష్కులైన
గోవులఁ బడ మొత్తి కోసి ముక్కలు మెక్కు
సమదాంధు లగుకొండ • సవర లైన
తెరవాట్లు గొట్టి క • త్తెరదొంగలై చాలు
వాలించు తిరుగుచం • డాలు లైన
భూసుర క్షేత్ర మిది యన్నఁ • బోఁడొకండు
చిన్న పొలములు, బాహ్మణ, క్షేత్రమునకు
ఘాతుకత్వంబు సేయుము • ష్కరులు గలరె
కదలు మిట మాని దివిజగం , గాభవాని.
సీ, కృతకోద్రు లాయెనా కీలోగ్ర ఫణిఫణా
సేక ఫూత్కారవ ల్మీకచయము
విరిదోఁట లాయెనా • కఱకు కంటకకంట
కాంకురవిస్ఫురి • తాగచయము
పువుఁబాన్పులాయెనా • నవమంజుల శ్వేత
లవణాలవాలమౌ • చవుటి నేల
బొమ్మరిండ్లాయెనా • భూరి భేకాండ జా
ధారమై తనరు కే • చారచయము
నీకు విహరింప వసతులై నివ్వటి లెనె
చిన్న పొలములు బాహ్మణ • క్షేత్రములకు
ఘాతుకత్వంబు చేయుము • ష్కరులు గలరె
కదలు మిట నూని డివిజగం • గాభవాని.
ఈ రీతిగఁ బద్యములు వాసి. వాసిన 'తాటాకులను నీటి లో విడువ నట్టిదూషణను సహించి యచటనిలిచి యుండుట యుక్తముకాదని తెలుపుటకో యనఁ జెఱువులోని నీరు గండి తెగిపాఱిసముద్యగామియయ్యె . కవిఁ గలిగిన బాధ యంతటితోఁదొలఁగెను. రామన కృతకృత్యుఁడై పొలమునుండి యింటి కేఁగెను.
ఈపద్యముల రచనతో సంబంధించి పారంపర్యముగ నొకవింత చెప్పఁబడుచుచున్నది. మీఁద వాయఁబడిన యర్జీ- పద్యములలో మొదటి దానియెత్తు గీతమునందు(మాపు ట్టిముంపఁ దలఁచి "యని ప్రయోగించుటచేతఁ గవికిఁ గళతన స్టమైనదఁట. "వరిపుట్టి ముంపఁదలఁచి ” అని చెప్పనుద్దేశించి నను దైవికముగ నూపుట్టి ముంపఁదలఁచి యని ప్రయోగింప బడెనఁట. ఈ గాథ యొక్క సత్యాసత్యములు చర్చింపనవకాశమే మియు "లేదు. కుటుంబములోఁ దరముల వెంబడివచ్చుచున్న యంశమగుట చే నిందుఁ బొందుపఱుప సాహసించితిని.
పద్యముల కతృత్వమును గూర్చి చర్చ.
1. సూరకని తనతండ్రియగు బాలభాస్కరకవి మరణా నంతరము స్వగ్రామమగు భూపాల రాజు రేగ విడిచి చీపురుపల్లెకు సమీపమున నున్న రామచందపురమును దనకు నివాస స్థలముగనేర్పఱచుకొనెనని మూఁడవ ప్రకరణమున వాసి యుంటిని.ఇంతీయ గాక. .
చ. గరి సెలువ్రాత గాని యొక • గంటెఁ డెఱుంగము మన్య దేశముల్
తిరిగి యభీష్టవస్తువులు • దెచ్చి భుజింతుము సర్వకాలముల్
నురచిర సత్కవిత్వవిధి • సూరకవీందున కేలగల్లెల గం
చరమును రేగ ? మేఁక మెడ • చన్ను లవంటివి రెండు మాన్యముల్
అను నీపద్యమును బట్టి సూరకవికి రేగలో మాన్వమున్నదని తేలుచున్నను నతఁడు కరిణిక పువృత్తిచే జీవనము చేయక కవితావృత్తి చే దేశాటనము చేయుచుఁ గాలక్షేపము చేయుచుండెనని దృఢముగాఁ జెప్పవచ్చును. దీనిని బురస్కరించు కొని సూరకవి రామకవిగార్ల కాలమున రేగ గ్రామమునఁ గరిణికము చేయుచున్న వాఁడు సూరకవి కాఁడనియు, రామకవిగాని మఱియొకరు గాని కరణికము చేయుచుండిరనియు మనమూహిం పవచ్చును. ఇంక మొదటినుండియు ననఁగా రామకవికిఁ బూర్వమునఁ దరువాతను గూడ నీరామకవివంశజులే నేటికిని రేగ గ్రామమునఁ గరణికముచేయు చున్నారు. కాఁబట్టి నీటిముంపు తగాయిదా విమము గుత్తదారు అన్నమరాజు గారికిని గ్రామ కరణము రామకవికిని గలిగియుండునని 'చెప్పుటయె యుక్తము గాని పై యూరనుండి కరిణికముచేయని సూరకవికి దానితో సంబంధమున్నదని చెప్పుట యెంతమాత్రమును సరికాదు.
2. ఇదిగాక యసలు సనదుదారగు అడిదము నారప్పకు జినలచ్చన్న, కిత్తన్న, నీలాదియను ముగ్గురు కుమారులుండిరి. సోరప్ప యనంతర మీముగ్గురును బిత్రాజ్తి తమగు మిరాశీయి
నామును బంచుకొని యనుభవించు చుండిరి. ఈయినాము భూముల నత్తియున్న నోముల చెఱువు పూర్తిగ నిండునపుడు కిత్తన్న వంతునకు వచ్చిన పొలమునకే ముంపుతగులును గాని తక్కినవారి పొలముల కంతగా ముంపుతగులదు. అందుచే నీటి ముంపువలన సస్య నష్టమును బొందిన రామనకే దీనితో సంబంధముగలిగి యుండెనని యూహించుట యుక్తముగాని ముంపు వలన నెట్టినష్టమును బొందని సూరకవ్యాదులకు సంబంధము కల్పించుట యుక్తముగాదని నాయభిప్రాయము.
3. మాయింటనున్న వాతప్రతులలోను మాయూరిలో నాస్నేహితుల వద్దనున్న ప్రతులలోను. "పేరురామన ” అని యే పాఠము గానవచ్చుచున్నది. మాగ్రామమునఁ గల పత్రుతులలో నెల్ల ఆకి సరవయ్యయను వైశ్యునిచే సంగ్రహింపఁబడినది ప్రాచీన మైనదిగఁ గానబడుచున్నది. ఇయ్యది యఱవది సంవత్సరముల కిందటి కాలమున గ్రామ పురోహితులగు రుద్రా, వజ్జల నరసింహము గారిచే వ్రాయఁబడినది.
4. ఇదిగాక సుమారు 50 సంవత్సరముల క్రిందటఁ గాలధర్మ మొందిన సూరకవి ప్రపౌతుఁడగు బాలభాస్కరకవి చె ప్పిన యీకింది సీసపద్యముచేత చెఱువుమీఁది పద్యములతో సూరకవికి సంబంధము లేదనియు వానిని రచించినది. రామకవి : యనియు స్పష్టమగుచున్నది.
11
<సీ. విజయరామక్షమా - విభుఁదిట్టి భాసిల్లె
ధరణిలో మాప్రపి • తామహుండు .
గంగాభవానిని గడుదిట్ట యైతిట్టి
ఖ్యాతిఁ జెన్నొందె మా • తాతయొకఁడు,
నెలయంగ మగటిప ల్వెంకనఁ బడఁబెట్టి ,
తగఁ దెగటార్చె మా , తండ్రి గారు
ఆరీతి గాదిట్టి , యమపురంబునకును"
నిన్నుఁ బంపఁదలంచి యున్నవాడ పొగడఁ
గాచుకొమ్మిటుమీఁద న • ఖండచండ,
దారుణోద్దండ కవితాగ • భీరశక్తి
నీతరముగాదు కలహించి • నిర్వహింప
జల్ల పట్టాభిరామ నీ • చగుణధామ
ఈపద్యమును జెప్పిన బాలభాస్కరకవి రామకవికి వరుస కు మనుమఁడు. అందుచేతనే యతఁడు "........ఖ్యాతిఁ జెన్నొం డెమాతాత యొకఁడు ” అని రామకవిసి ప్రశంసించినాఁడు. సూరకవి విజయరామగజపతి మహా రాజునకు నాస్థానకవిగా నుం డెనని యైదవప్రకరణమున వ్రాసియే యున్నాఁడను. మాకు టుంబములోఁ దరముల వెంబడి వచ్చుచున్న వాడుకను గూడఁ బ్రబల ప్రమాణములలోఁ జేర్పఁదగినదిగా యోచించి మీది యంశముల నన్నిటిని బట్టి యాలోచించిన చోఁ జెఱువుమీది పద్యములతో సూరకవి కెంతమాత మును సంబంధము లేదనియు వానిని రామకవియే రచించెననియు స్పష్టముగాక పోదు, .
ఇప్పటికీ, సుమారు నూరునూటయేఁబది సంవత్సరములు
నుండి యీ పద్యములు సూరకవి ప్రణీతమని బహుళ వ్యాప్తిగాం
చినవి. ఇట్టి వాడుక మాకుటుంబములో వంశపారంపర్యముగ
వచ్చుచున్న వాడుకకు విరుద్ధముగా నున్నది. అట్టి విరుద్ధమగు
వాడుక నిలిచి యుండుట యుక్తము కాదని యెంచి యందలి
సత్యాసత్యములను లోకమునకు వ్యక్తపఱచుట నావిధియని
పదియవ ప్రకరణము
గ్రంథరచన.
క. రవియెఱుఁగును భువితత్త్వము
భువిలో పలనుండు జనులఁ • బోషించుసదా
శివుఁ డెఱుఁగు నాట్యతత్త్వము
కవితాతత్త్వంబు సూర్య కవికే తెలియున్.
(శ్రవిసమకాలికులు)
పదునెనిమిదవ శతాబ్దియందుఁ బౌఢ ప్రబంథ రచనకుఁ ప్రసిద్ధిగాంచిన కవులలో నొకఁడనియు, లాక్షణికుఁడనియు సూరకవి విశేషప్రఖ్యాతి గాంచెను. ఇతఁడు రచించిన గ్రంథముల లో నాంధ్ర ప్రపంచమునకు లభ్యములై ప్రచారములో నున్నవి యాఱు గ్రంథములు మాత్రము గానవచ్చుచున్నవి. (1) చంద్ర మతీపరిణయమను నామాంతరము గల కవి జనరంజనము. (2) కవిసంశయ విచ్చేదమను లక్షణ గ్రంథము. (8) చంద్రాలోకము (భాషాంతరీకరణము ) (4) ఆంధ్రనామ శేషము (నిఘంటు వు) (5) 'రామలింగేశ శతకము. (6) శ్రీ రామదండకము. ఇతఁ : చురచించిన గ్రంథములలోఁ గవిసంశయ విచ్ఛేదమున వ్రాయఁబడిన మూఁదునాలుగు కృత్యాదివద్యములు తప్ప మఱి దేని యందును గృత్యాదివద్యములు గానరావు. ఆ కారణము చేత : .
నితని గ్రంథములను గూర్చిన సమాచారము స్పష్టముగఁ డెలిసి కొన నవకాశము 'లేక యున్నయది. ఇతనిగ్రంథములలో నెల్ల ముఖ్యమైనదియుఁ దనకు మిగులఁ బ్రఖ్యాతి దెచ్చినదియు నగు కవిజనరంజనము నందుఁగూడఁ గృత్యాదిపద్యములు లేవు. వంశ చరిత్రమును జెప్పు సందర్భమున నీవిషయమును గూర్చి ప్రథమ ప్రకరణమునందుఁ గొంతవఱకుఁ జర్చించి యున్న కారణముచేతఁ. జర్విత చర్వణమగునని యెంచి యాచర్చనిచటఁ దిరుగ వ్రాయ. మానితిని. సూరకవి గ్రంథరచనకుఁ బూని తొలుదొల్త కవిజనరం, జనమును రచించినట్టుగఁ గనఁబచుచున్నది. కవిసంశయవిచ్చే దములోని.
క. పుడమిఁగల రసికు లెల్లఁ బో
గడఁగవిజన రంజనకృతిఁ, గావించితినే
నడిదము సూరకవీంద్రుడ.
మృడపదపంకజరిరంను మృదుమాననుఁడన్
అను పద్యమును బట్టి యితఁడు కవిసంశయ విచ్చేదమును రచిం చుటకుఁ బూర్వము కవిజనరంజనము రచించెనని తెలియుచున్నది.
1. కవి జెనరంజనము:- ఇది మూఁడాశ్వాసముల శృంగారప్రబంథము. ఇందభివర్ణింప బడిన విషయము చంద్రమతీ , హరిశ్చంద్రుల వివాహము. తృతీయాశ్వాసొంతమున.
"తే: గీ: సత్యమును దృఢవతంబుగా • సంగ్రహించి . . ,
రాజనూయాది వివిధాధ్వ రములొనర్చి
వరగుణోజ్జ్వలసంతాన • వంతుఁడైక
రమును సుఖముండెనాధరా , రమణమౌళి
అని చెప్పి హరిశ్చందనిపూర్వకథలోనే ప్రబంధమును ముగించినాఁడు. కథా విన్యాసమునఁ గల్పనా చాతుర్యమును జూపన వకాశమంతగాఁ జిక్కినది కాదు. ఇందలి కథను నొకటి రెండు వాక్యములలో నిట్లు చెప్పవచ్చును.
పూషవంశ భూషణుండగు త్రిశంకుభూపసుతుఁ డయో ధ్యానగరమును రాజధానిగాఁ జేసికొని భూమిని బరిపాలించు చుండఁ బుడమికిఁ దొడవగు విజయాస్పదపురమును దనకుఁ బ్రధాన నగరముగఁ గావించుకొని యుశీనరధరావరుఁడు రాజ్యపాలన మొనరించు చుండెను. ఆయుశీనరునకుఁ జంద్రమతి యను కుమారీ రత్నముజనించెను. ఆమెకు జవ్వనమంకురించిన పిదప హరిశ్చంద్రుని సుగుణసంపదను వినియును నతని మనోహరాకృతిని జిత్రపటమునఁ గనియును నతని యందే తన చిత్తమును హత్తించియుండ నాసమాచారము నామె చెలికత్తెల ముఖమున వినిన" వాఁడై యుశీ నరధరారమణుఁడు దృఢవ్రతుండను బ్రాహ్మణోత్త ముని హరిశ్చంద్రుని పాలికిఁబుత్తెంచెను. హరిశ్చంద్రుఁ డావిప్రుని వలనఁజంద్రమతి సుగుణసంపదయు, రూపలావణ్యాతిశయమును' విని తనకామె తగిన పత్నియనితలఁచి తనయంగీకారమునుదృఢ వ్రతునకుఁ జెప్పి పుచ్చ నతఁడాశుభవార్తనుజంధ్రమతి జనకునకుఁ దెలియఁజెప్పెను. పిదప విజయాస్పదపురమునఁ గడువై భవముతో వివాహసన్నాహంబులు జరుగ హరిశ్చంద్రుఁడ యోధ్యానగరమునుండి తర్లి వెడలీ విధ్యుక్తముగఁ జంద్రమతిని బాణి. గ్రహణము చేసికొని సంతోషపూరితహృదయాంతరంగుఁడై మామ, యొసఁగిన యరణములతోఁ జంద్రమతినిఁ జేకొని యయోధ్యానగరమునకు వచ్చి సుఖముగ రాజ్యపాలన మొనర్చు చుండెను. .
ఈ కథనే సూరకవి, మూఁడాశ్వాసములలో 260 వద్య ములతోఁ జెప్పెను. అందుఁబ్రథ మాశ్వాసము పురవర్ణనాదికముతోడను, చంద్రమతి జననసౌందర్యాభి వర్ణణముతోడను ముగియును. ద్వితీయాశ్వాసమున, వసంతము, చంద్రమతివిరహము, మలయపవ నాద్యు పాలంభము, దృఢవత సందేశమును ననునవి వర్ణింపఁ బడినవి. తృతీయాశ్వాసమున హరిశ్చంద్రుని , కళ్యాణయాత్ర, చంద్రమతీ హరిశ్చంద్రుల వివాహమా హెూత్సవము, నూతన వధూవరుల గృహప్రవేశము, సూర్యాస్తమయ ము, తమస్సు, తారలు, చంద్రోదయము,ప్రభాతము, కోడికూత, సూర్యోదయము, మొదలగునవి యభివర్ణింపఁ బడినవి.
ఈ ప్రబంథరచన యందు 'సూరకవి తనకుఁ బూర్వులగు శ్రీనాధాది మహాకవులను నెక్కు డుగ ననుసరించియున్నాఁడు.
శైలియందును, గల్పనావిషయమునను నీకవిజనరంజనములోని పద్యములు పెక్కులు నైషధము, వసుచరిత్రము, కవికణ రసాయనము మొదలగుప్రసిద్ధాంధ్ర ప్రబంధము లలోని పద్యములకుఛాయగ నున్నవి. కవిత్రయము వారికవిత్వము నితఁడెంత శృద్ధాభక్తులతోఁ బఠించెనో యంతగా శ్రీనాధ మహాకవి గ్రంథములను, అందుముఖ్యముగ శృంగార నైషధమును వసుచరితమును, మనుచరితమును బఠించి నట్టుగ నిందలి పద్యములే ప్రబలమగు సాక్ష్యమునిచ్చు చున్నవి. ఈప్రబంధ మునందుఁ జేయఁబడిన పురవర్ణనాదులలోఁ గొన్ని మాత్ర: మిచటఁ జూపఁ బడుచున్నవి.
1. పురము.
క. నూపురము భూపురంద్రికి
గాపురము జయేందిరకును " గగనతలస్సృ
గోపురము భాసిలునయో
ధ్యాపురమిన వంశ భూధ • వాధారం బై.
మ. అమరద్వీపవతీ పయోవిహరణ • పొంచగ్సుర స్త్రీల వ . .
జుమయాభంకషమంటపాగ్రములని • చ్చల్ క్రీడఁ గావించు త
దమణీవారము వేట నేఱు పఱుప • న్రాదంచుఁగా దివ్యరా
జముభీపాళికిఁ దమ్మిచూలియని మే • షత్వంబు గావించుటల్ .
2. పూదోఁటలు.
'క. వలపులపాణింధమములు
మలయానిలముల విహార • మందిరములు
పూవిలుతుని యాయుధశాలలు -
చలువల జన్మస్థలము ల • చటిపూఁదోఁటల్
3. పద్మాకరములు.
గీ. అతుల దరచక మీన రే• ఖాంకములయి
యూర్మి కాకంకణద్వ్యతి • నొప్పుమీఱి
చారు పద్మాకరమ్ముల • చందమునను
రాజిలుచునుండు పద్మాక • రములువీట.
4. రాజు.
సీ. తనపృధుకీర్తిము • క్తాఛత్రమునకు స్వ
గ్లధరంబు కనకదం , డంబుగాఁగఁ
దనప్రతాపసమగ్ర - దావాగ్ని శిఖకు వ్యో
మంబుతంగ ధూ మంబు గాఁగఁ
దననిరర్గళ దాన • ధారాంబులహరికి
గైలాసశిఖరి సైకతముగాఁగఁ,
దనకటాక్షుస్యంది • మనకృపౌరసవృష్టి ,
కఖిలార్థి కోటి స • స్యంబు గాఁగ
గీ. మహిని వెలువొందె మతారి • మండ లేశ
మకుటమణిగణశాణాయ " మానచరణ
నఖరపాళి నిజాశ్రిత • నళిన హేళి
చారుకీర్తిహరిశ్చంద - చక్రవర్తి.
5. వసంతము.
చ. వలపులకున్ని దాస మలి. ఆ వారము కోరనికోర్కి జాతికిం
దలఁపని కీడు పౌంధసము • దాయము పాలిటి వేఱు విత్తు రో
కిలముల నోముపంట స్మర , కేవల శౌర్యహుతాశిధాయ్యరా
చిలుకలభాగధేయ మిలఁ • జెన్నల రారె వసంతమంతటన్
12 6. విరహము.
1. సీ. ఎలనాగ పల్కుల , కెన గావటంచునో
చెవియొగ్గి -వినఁడయ్యెం జిలుక పల్కు
లింత నెమ్మోముతో - నీదు గాదంచునో
తళుకుటద్దముఁజూడఁ • డలఁపఁడయ్యెఁ
బూఁబోఁడి బాహులఁ • బోల లేవంచునో
పూవుదండలు మేనః • బూనఁడయ్యెం
బొలఁతి మై తావితో బురుడు గాదంచునో
మొనసి ఆ గంధంబు • ముట్టఁడయ్యె
గీ. బోటినిట్టూర్పు గాడ్పుతో సాటి గాద
టంచునొయుశీర తాలవృం • తానీలంబు
సొంపునకు నించు కేనిఁ గాం. • క్షింపఁడయ్యె
మదనసాయక ఖిన్నుఁడై - మనుజువిభుఁడు.
2. తే. గీ. అతను తాపంబుఁ గావింత • మనుచుఁగోరి
సఖులు శైత్యోపచారముల్ - సతికిఁజేయ
దైవ మొండొక యద్ధం బు , దాగ్ర హించి
యతను తాపంబుఁ గావించె • నజ్జముఖికి,
3. శా. శయ్యాదంభమునన్ మురాంతకుఁడు భూ షాకై తవస్పూరిచే
సయ్యా ర్యారమణుండుఁ దాల్చిరి భుజం • గాధీశులన్నీయ సా
హాయ్య ప్రస్ఫుటధాటికర్వోకనుచో •వజ్జాస్య లాయోర్చువా
రయ్యాగంధసమీర! పోవఁగదవ • య్యా! యీకురం గేక్షణన్
7. యాత.
శ. శ్వేతాతపత్రాళి, చీకట్లు దొలఁగించే -
రాజన్యభూషణ • రత్నరుచులు
తురగఖురోద్దూత | ధూళి వెంపడగించె
గరిపుష్కరోర్ఝిత కంకణములు
సింధురమద గృష్టి • సింధులనింకించే
సామంతమకుటక • క్షణరజంబు
సైన్యసమ్మర్దసం జనితోష్మఁ దొలఁగించె
సమితపతా కాంబ • రానిలంబు
సైన్యజని తావరోధంబు , సైన్యముననే
తొలఁగెనని సైనికాళి సం , తోషమండఁ
జనియె సైన్యంబు కతిపయ • దినములకును
రమ్య విజయాస్పదపురీవ • రంబుఁజేర.
8. పరిణయము.
మ. జలమ న్మైఁబులకాంకు రాళిదరహా • సొంకూరముల్కంగం
దొలఁక స్మశ్యపుట్టింట్లు గండయుగళిం • దూఁగంగనత్కకణం
బులు మోయన్భజమధ్య సీమ రతనం • పుం దాళితార్మాలు గా
దలఁబ్రాల్వో సెలతాఁగియాదలపయిన్ - ధాత్రీశుఁ డత్యాయకృతిన్ .
క. మంగళ తూర్యంబులు పు
ణ్యాంగనల శుభార్హ గీతి , కారావములు
ప్పొంగంగ హరిశ్చందుఁడు
మంగలసూత్రంబు చంద్ర • మతికింగట్టెస్
9. నయవిరచనము.
సీ. అనుఁగు బిడ్డల భంగి • నను జీవులను బ్రోవు
మిలువేలుపులఁ గొల్వు మేమఱంక
పతికిముం దనుభవిం • పకు మేపదార్థంబు
జవదాటకుము నిశ్వరుని మాట:
<మగఁడు గావించిన ఈ మన్ననగుబ్బకు
మదిఁగృశింపకు మవ • మానమునకు
నవనినురాభ్యాగ తార్థికోటుల నెల్ల
నా ప్త బంధువుల య • ట్లాడరింపు
గీ. కరుణగల్గుము బంధువ • ర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తిఁ - గొలువు మెపుడు
దైవమన్నసు గురువన్న • థర్మమన్నఁ
బ్రౌణ సాధుండు సుమ్ముమా • యమ్మ కాస
.
10. చంద్రోదయము.
సీ. కుముదినీ జృంభణాం • కురమూలకందంబు
తోయజశ్రీ పళ్య తోహరుండు
సకలజీవంజీవ • సంజీవనౌషధి
చక్ర వాకీమన స్తాపకారి
తిమిరవారణఘుటా • సమడమృ గేంద్రంబు
చిత్తజమాండ్యవి లో చ్ఛేదనుండు
సఖిలది దృక్షుజ • 'నా సేచనకమూర్తి
బహుశౌషధీపియం • భావుకుండు,
సురలయాఁకటికూడు మ్రు - చ్చులకుఁగీడు
రిక్కలకు ఱేడు వెలుఁగుల • యిక్కజోఁడు
లచ్చి సైదోడు రేఁబోటి , వెచ్చకాఁడు
చంద్రుడల రా రెసత్కళా • సాందుఁడగుచు.
11. సూర్యోదయము.
చ, కలువలపూఁడుతమ్మి చెలి • కాఁడునిశా విభుజంట చుట్టుపు జులగమినోముపంటఖగ • ఘోటునకున్ వలచూపుమూఁడుమూ
ర్తులునొక టైనరూపుతొగ. రుంజినీరంగు వెలుంగు ప్రోవు ప్రా
బలుకుల తావు పూర్వగిరి • పైనపుడొప్పెది నేంద్రుడెంతయున్.
ఈకవి జనరంజనములోని పద్యములు కొన్ని నైషధము, వసుచరిత్రము మొదలగు ప్రసిద్ధాంధ్ర ప్రబంధముల యందలి పద్యముల ననుకరించియున్నవని చెప్పియుంటిని. అట్టి యనుసరణములఁ గొన్నింటి నీదిగువఁజూపు చున్నాఁడను.
నైషధపుఁబోలికలు.
1. సీ. భక్తి ప్రదక్షిణ •మంబులఁ జేసి
రాశుశుక్షణికిను , పాసనంబు
సంశుక గంధి క .ళ్యాణకియాచార
మాచరించిరిమంద • హాస మెసఁగ
నఱెత్తిచూచిరి , యాకాశమండలా
స్థానరత్నంబునౌ • త్తానపాదిఁ
ద్రైలోక్యపతి దేవ • తాఫాలతిలకంబు .
దివిరియ రుంధతీ • దేవిఁగనిరి
గీ. బాహ్మణోత్తమ పుణ్యపు • రంధి వర్గ
మంగళా శీర్వచోయుక్త • మహిమశోభ
నాక్షతారో పణంబుల • నాదరించి
రంబుజాక్షి యునిషధ దే | శాధిపతియు.
శృంగార నైషధము 6 ఆ 101 ప.)
సీ. కేలు మోడ్చిరి పద • క్షీణపూర్వకంబుగా
నాశుశుక్షణికి న • త్యాదరమునఁ
గాంచిరిగ్రహతార • కామండలో పతి
స్థానసంవాసినా త్తానపాది
బణతిఁ గావించిరి , భక్తి నరుంధతి
సీమంతినికిని వ • సిష్ఠునకును
జేసి రుత్సవమునఁ • జేలాంచలగింది
సముచితపరిణయా • చారనియతి
గీ. ద్విజవ రేణ్యులు బహుపురం • ద్రీ జనములు
ప్రీతి నాశీర్వదించి య • ర్పించుశోభ
నాకతలుగైకొని ధరించి రౌదలలను
జంచమతీయ హరిశ్చంద • చక్రవర్తి.
(కవిజనరంజనము 3 ell 48 ప)
2. ఉ. కంకణనిక్వణంబు మొగ కట్టఁగఁగౌనసియాడరత్నతా
టంక విభూషణంబులు వ • డంకఁ గుచంబులురాయిడింపఁగాఁ
బంకజ నేత గౌతముని • పంపున లాజలుదోయిలించి ధూ
మాయునియందు వేల్పెదర • హాసము అప్పలలోన దాఁచుచున్ .
శృంగార నైషధము 6 ఆil 102 ప)
చ. అలఁతిక వున్వడంకవల • యఢ ని నిర్మలబాహు మూలకాం
తులుగొనియాడ లేనగవు • తొంగలి అప్పల డాఁగ హారము
ల్మె లిగొన జిల్కు పయ్యెద చ • లింపఁగుచడ్వయిరాయిడింబడం
జెలిదలఁబ్రాలువోసె నృప , శేఖరునౌదల పైని దోయిటన్
(కవిజనరంజనము. 3 !!! 38 ప!)
క. వనితామణి పాదాబ్దము
తనహస్తాబ్దములఁబట్టి దరహాసరుచుల్క
కను ఱెప్పలలో , డాఁచుచు
సనికల్ దొక్కించె రాజు జవ్వని చేతన్
(కవిజనరంజవము 3 అ|| 45 ప॥) .
మ. గురువన్నన్ ధనమన్నఁ బుణ్యమనినన్ •గోతోదయంబన్న దే
వరయన్న న్మనమన్నఁ చుష్టియనివన్ • వాత్సల్యమన్నన్ని జే
శ్వరుఁడన్నం బరమోపకారమనినన్ • సర్వంబునన్నందలో
దరి నీరున్ నిషధాధినాధుఁడె నుమా | తథ్యంబుగాఁ జెప్పితిన్ .
సీ. పాటించికొలువుము • భవన దైవంబుల
సవతులఁగొనియాడు • సఖులఁబోలె
నారాధనము సేయు . మత్తమామల కెప్టు
సరిజనంబుల మీఁదఁ • గరుణగల్లి :
యలగకు కోపించి • నపుడు నాధునితోడ
మదిలోన నుబ్బకు మన్ననలకుఁ
దోడికోడండ్రతోఁ గూడియాడిచరింపు
దాసీజనముఁ బోవు • తల్లికరణి
తే, బాహ్మణులయందు గురులందు బంధులందు
భక్తి విశ్వాస సౌహార్ద్ర, పరత సెఱపు
భవ్య పతి దేవతాచార • పరఘపుణ్య
ధర్మ మేచురకుండు మా తల్లి కాన.
శృంగార నైషధము ఆll 7-8,9 పద్యం )
సీ. అనుఁగుబిడ్డలభంగీ • నను జీవులను బోవు
మిలువేలుపులఁ గొల్వు • మేమఱిలక
పతికిముందనుభవిం • పకు మేపదార్థంబు
జవదాటకుము నిజే శ్వరునిమాట
మగఁడు గావించిన మన్న నకుబ్బకు
మదిఁ గృశింపకు మవ • మానమునకు
నవనిసురాభ్యాగ , తార్టీకోటుల నెల్ల
నాప్త బంధువులయ ట్లాదరింపు
కరుణగల్గుము బంధువ •వర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తిం • గొలువు మేపుడు
దైవమన్నను గురువన్న • ధర్మమన్న
బ్రాణ నాధుండు సుమ్మ మా యమ్మ కాన.
కవిజనరంజనము 3 ఆ|| 54 పద్యము.)
కవికర్ణ రసాయనపుఁ బోలికలు
ఉ. కన్నులఁజంచలత్వమును గౌగ్యమపాం గవిలోకనంబులం
జన్ను లఁగర్కశత్వముఁ గృ• శత్వముఁగౌనునమంద భావము
స్నెన్నడ వక తంగురుల • నెక్కొనఁజేయు నెట్టి చిత్రమో
కన్నియ జవ్వనంబుత్రిజ , గజ్జన సన్నుతమయ్యె నయ్యెడన్
(కవికర్ణరసాయనము 3 ఆll 20 పద్య ||)
ఉ. కన్ను లచంచలత్వమును గబ్బిచనుంగవ కర్క శత్వము
న్నెన్నడమాంద్యముంగురుల నెక్కొనువక్రత కౌసుకార్శ్యము
న్సన్ను తికెక్కె నొనచల • సంపదబోఁటిక ద్ధరించుట
స్వన్ని య కెక్క వేయవగు ణంబులు మిక్కిలికల్మియున్నెడన్
(కవిజనరంజనము 14|| 54. పద్యం )
సూరకవి పద్యములోని యర్థాంతరన్యాసము మీఁదిపద్యమునకును వన్నె దెచ్చెనని చెప్పనగును.
క. కరమర్థి నేన పెనుపం
బెరిగినశుక మోట లేక • ప్రేలుచుహృదయం
బెరియింపఁ దొణఁగెనింకం ..
బరభృతములు చెప్ప నేల , పంకజవదనా.
(కవికర్ణరసాయనము ఆళ్వా! 3. 104 పద్య) .
ఆ.కురభృతంబు గానం • బరికించి యొక వేళ ,
గోకిలంబు చేయఁ - గూడుఁగాక
కొంత నామధేయ • మెంతయుఁగైకొని
చిలుక నీకు వెట్ట • సేయఁదగునె.
(కవిజనరంజనము ఆశ్వా! 2. 50 ప)
సీ. మూర్థాభిషిక్తుల ముకుటరత్నద్యుతు
ల్కరదీపదీప్తులఁ - గలిపికొనఁగ
రత్న వేత్రపరం ప • రారుచుల్పురసతీ
నీరాజనాంశుతల • నిలిపికొనఁగ
స్మేరముఖాం బుజ • శ్రీపార్శ్వదోదూయ
మానచామరలక్ష్మి మాఱుకోనఁగ
వందిమాగధుల కై వారంబు రావంబు
శుభతూర్యరవములఁ • జూఱకొనఁగఁ
గీ. బసిడిరథ మెక్కి విపులపై - భవము మెఱయ
జూపరుల కెల్ల వ్రేకపుఁ * జోద్య మొదవ
సొంగ మైన చ్చు భాగధే, యంబువోలె
మామయింటికి వచ్చెజా మాతయపుడు.
(కవికర్ణరసాయనము 3 ఆళ్వా! 175 వ పద్యము .)
సీ. రాజన్యకోటీర • రత్న మరీచులు
గరదీపికాపదల్ గలసి మెలఁగ
నాభీలవటు భేరి • కాభూరిభాంకృతుల్
మత్తేభ ఘీంకృతుల్ • మైతి సలుప
సుర్వీసురవ్రజా , శీర్వాద నాదము
ల్విములవందిస్తుతు • ల్వియ్యమంద
వారాంగ నాదత్త • నీరాజనాంశువుల్
హైమవేత్రద్యుతు లల్లుకొనగ
భద్రకరి నెక్కి రూపనై , భవసమృద్ధి
దర్శసవ్యగ పౌరసం • తతికి నేత్ర
పర్వ మొనరించుచును సార్వ • భౌముఁడపుడు
భూతలాధిపుశుద్ధాంత మునకువచ్చె.
కవిజనరంజనము3 ఆ 20 ప)
వసుచరితపుఁబోలికలు. -
మ! జన నాధోత్తముఁడింతఁజూడ ననీ మే షత్వంబు గాంక్షించు న
య్యని మేషత్వము కాంతకాంతముఖ చం ద్రా సేవ నానంద వా
సనఁబాపించినఁ గోరునప్పుడని మే • షస్వామి భావంబుఁ గ
కొన నెండున్ నృపులు త్తరరోత్తరపదా • నూనస్పృహాచంచలుల్,
(వసుచరిత్రము 2 ఆ|| 84 పn)
శా. కాంతారత్న సమాగమందును నెద గ్గాంక్ష్ంచు నేతెంచుడుం
జెంతంజేరఁగఁగోరుఁ జేరుడుఁగుచా • శేషాప్తిఁ గాంక్షించుఁగా
నంతందత్క లంటగోరు ఫలతృ • పాత్మ త్వముర్వీవధూ
కాంతానర్హ మటంచుఁబల్కు స్మృతివా క్యస్ఫూర్తిస్వార్థంబుగన్
(కవిజనరంజనము 3 || 123 ప|) I
చ|| అలికుల వేణియిట్లు వల యాంక బిసాలకురపన్న గాళికిం
జలమరిచల్ల గాలికిని . జక్కెరఖాణపు లేజిఁదోలు పూ
విలుకువయాళికిం జిగురు ఈ విందుల నీలిగయాళికిన హలా
హలగుళికాపద్ముదము • నాభికి నాళికిలోఁగి యాత్మలోన్ .
(వసుచరిత్రము . 8 ఆ| 118 ప!)
క. అళుకొందెనప్పుడా తొ
య్యలి మధుకనికర శుక పి . కావలికిస్ జా
చీలికిన్ జిలిబిలివలికరు వలికి న్విరివిలుతు సెక్కు వ హళాహళికిన్.
{ కవిజనరంజవము 2 ఆl 19 ||)
III
సీ.నటదీశ హసన వి • స్ఫుటిత వేధోండ రే
ఖలఁదోచు వరణాంబు • కణికలనఁగఁ
బెల్లుబ్బునిన్ల పె • నెల్లి మెల్ల పదార్థ
ములుముగ్గఁ బొడము బు ద్భుదములనఁగ
రవికి మందేహ ని , ర్మధన సాధనములై
వచ్చిన ద్విజమంత్ర వర్ణములన
హరిపదంబును నీశు • శిరము నైన నభంబు
ననభోగతులు నించు . ననలనంగఁ
తే.రమగిరియను మరకాడు జలధిసరణిఁ
దరణిడించిన నతఁడు త • త్సలిలమగ్న
విమలముక్తాఫలం బులు • వెలికిఁ జొనిపె
ననఁగ నవ తారకా నికా • యంబులడరె.
(వనుచరితము 4 అ 15 <ప.)
సి. ధ్వాంతదంతాళో , త్కర పుష్కరోద్ధూత
గగనగంగాపయః కణములనఁగ
శర్వతాండన దిదృ క్షా సమాగత నిర్జ
రీ హార మౌకిక శ్రేణులనఁగ
వభ్ర కళింపజా హ్రదమున నిండార
విరిసిన తెలిగల్వ • విరులనంగ
భావి నిశాచండ్ర పరిణి మంబునకిడు
దిక్కుడ్యముల పిండి ఆ చుక్కలనఁ
గీ. గిక్కిఱి సెనొక్క మొగి నెల్ల దిక్కులందు
క్షీర మనసార పొటీర • తారహార
హీరపారద నారద ఈ శారదాభ్ర
గౌరరుచిమీఱ దారకా వారమపుడు.
(కవిజనరంజనము • ఆ!!. 88 ప)
I. IV
సీ!! తనయశో విశద ము • కాసౌధపౌళికి
నంబు దాయనము వా , తాయనముగఁ
దన శౌర్య శిఖిశిఖా • తతికి జాంబూనద
భూధరంబపరంజి • పూదెగాఁగఁ
దనబలోడ్డతరజో • దంభకుంభినికిఁ దా
రా గహంబులు గర్భ • రత్నములుగఁ
దన దానధారాఖ్య " వనధికి మిన్నేఱు
కల్లోలధుత వారి • కణముగాఁగఁ
తే. దన వినూతన సుగుణ సం లో తానవల్లి
సముదయంబున కంభోజ • సంభవాండ
ఖాండములఖండ ఫల పరం , పగలు గాఁగ
వరలు భవ్యవిళా విభా + వనుఁడు వనుఁడు.
(వసుచరితము 1 ఆ|| 116 ప)
సీ. తనపృధుకీర్తిన్ ము • క్తాఛతమునకు స్వ
ర్ణధరంబు కనకదం • డంబుగాఁగ .
తనప్రతా ససమగ్ర • దావాగ్ని శిఖకు వ్యో :
మంబు తదగ్రధూ ధామంబుగాఁగఁ
దననిరర్గళ దాన • ధారాంబు లహరికి
గైలాసశిఖరి సై కతము గాఁగఁ
దనకటాక్షస్యంది. • మనకృపొరసవృష్టి
కఖిలార్థి కోటి స • స్యంబు గాఁగ
గీ.మహిని జెలువొంది మత్తారి • మండలేశ
మకుట మణిగణ శాణాయ • నూన చరణ
సఖం పాళి నిజాళిత • నళిన హేళి
చారుకీతి హరిశ్చంద్ర చక్రవర్తిన్,
(కవిజనరంజనము 1 of 28-29)
చ. తఱులరనిక్కఁ బూత నెఱ • తావియచిక్క పొంగమాలికల్
మెఱుఁగులుగక్క నూరుపుల • మేలిమిఁ డెటులు చొక్క హారముల్
కుఱుచలు దొక్క ముంగురులు - గొం జెమటం బద నెక్క వేలుపుం
దెఱవయొక ర్తు చేదిజగ తీపతికిన్ శిరసం టె వేడుకన్ .
(వసుచరిత్రము 5 ఆll 75 ప!)
చ. జిలుఁగుపయంటదూల నునుఁ • జెక్కుల లేఁ జెమరంకురింప గు ,
బ్బలు నటియింపఁ దాళగతి • బంగరు గాజు అమోయ హారము
ల్మెలిట్గొన నూర్పులుప్పతిల , లేనడుమల్లలనాడ మెల్ల నే ,
యలీ కుల వేణియోతున్ శిర, సం టెను గెంజిగురాగ బోఁడికిన్.
(కవిజనరంజనము 8 ఆ|| 26 ప||)
ఇటులనే యింకను మనుచరిత్రము మొదలగు గ్రంథము లలోని పద్యములను బోలినపద్యము లిందు నక్కడక్కడనున్నవి. కాని గ్రంథవి స్తర భీతిచే వాని నిటఁ జేర్పమానితిని. ఇట్టి యను సృతులను దమకవితలోఁ జొప్పించుటయే గొప్పగా నెంచినయాకాలపుఁ గవితా పరిపాటి ననుసరించి సూరకవి వసుచరిత్రాది
ప్రబంధముల కవిత్వరీతులను గైకొని యన్వారాభిధాన మగు నీకవిజనరంజనమును జెప్పి యున్నాఁడు. ఈ యనుసరణములు కవియొక్క ప్రతిభకును గవితా సామర్థ్యమునకును గొఱతగా నెన్నఁబడరాదు గదా ? సరసకవితా సామ్రాజ్యపట్టభద్రుడగు పెద్దనార్యుడు మారన మార్కండేయ పురాణ మనుసరింప లేదా ! ఏదియెట్లున్నను సూరకవి మాతకృతిని మిగుల సరసముగను శ్లాఘనీయముగను గావించెనని చెప్పక తప్పదు.
సూరకవి కవిత్వమునందలి యర్థాలంకారములు.
అభ్యాలంకారము లనేకము లీకవి యీప్రబంథమునఁ బ్రయోగించియున్నాఁడు. అట్టియలంకారములుగల పద్యములు గొన్నింటి నీదిగువఁ జూపుచున్నాఁడను.
1. ఉపమ:
చ. పుర నిక టాంచితో పవన • పుష్పిత సాలములం గదల్చుచున్
సరనులఁ దేలుచున్ నుమర • జంపటలంబులఁ గొల్లలాడుచున్ సురుచిరకుంజపుంజములఁ • జొచ్చినటించుచు మంద గామలై
కరులవ లెంజరించుఁ జలి , గాడ్పులు షట్పదశృంఖలజ్జగన్ .
(కవిజనరంజనము 1 34 18 ప!)
2. క. కలశాబ్దిళంగి నిన్నెల
పొలిచెం దెలిదీపిలీవిఁ • బూర్ణసుధాంశుం
డల రె నచటనున్న రమా
లల నాధిపుభంగిఁ దత్కళంకంబొప్పెన్
(కవిజనరంజనము 8 ఆ: 83 ప!)
103 2. ఉత్ప్రేక్ష:(1)
చ. అనుపమ హైమగడ్య ఘటి ఆ తాంచదనంత మణిప్రహాలిచే
ననయముఁ దత్పురీవర మ • హాగృహముల్ రెయిదోచండఁగా
నొనరుచు టంజుమీ గృహము , లొప్పె నిశాంత సమాహ్వయంబులన్
విసుతి యొనర్పఁగాఁ దరమె • వీటనుగల్గిన రత్నసంపదల్
(కవిజనరంజనము 1 ei 19 ప||) '
ఉ. యమునా తీవధూటి బిగి యారఁ గవుంగిటఁ జేర్చుటం దదం
"గా మలచందసలు మటు • నం టెననందెలుపయ్యె బింబమా ;
కోమలగాత్రి గబ్బిచను . గుబ్బలకస్తురి తొమ్ము సోకెనో
నామహిఁ దత్కళంకము గ • నంబడెఁ గల్వలఱేనిక య్యెడన్ .
(విజనరంజనము 3 ఆll 75 పm)
3. రూపకమం:--
1. గీ. చన్ను కొండల క్రేవల • సంభవించు
బాహులతలజనించిన • పల్లవములు "
పడఁతి కెంగేలు తత్కర • పల్లవముల
జనన మొందిన కళికలు • సకియగోళ్లు.
" (కవిజనరంజనము 1 on 57 ప)
సీ.చిగురాకు టెఱసంజ • జిగికిఁ బాండురకోర
కములు భానుర తార • కములుగా
బసవ రసాసార • పటిమంబుననురాలు
కనుమము ల్వడగండ్ల • గుంపు గాఁగఁ
బ్రవహించు మధుని ర్ఘములకుఁ బుప్పాళ్ళ
నెఱతిప్పలి నుక తి - న్నియలు గాగ.
మంజుతరనికుంజ • కుంజరంబులకు రో
లంబముల్ శృంఖలా, లతలు గాఁగఁ
తే. బసవకిసలయ ఫలరస • రసిక మధుక
ర పీక శుక నిక రారవా , క్రాంత దశ
ది గంతరాళము దనరె వసంతకాల
మఖిలభూజన రంజనం , బగుచునంత.
(కవిజనరంజనము 2 ఆ|| 5 ప!)
4. అతిశయోక్తి:
సీ. మేనుమించులఁ జేసి - వాని చాంచల్యం బు
వాలుగన్నుల యందుఁ - గీలుకొలిపి
శశి నెమ్మొగ మొనర్చి • చందు నందలి కప్పు
కుటిలాలకములందుఁ • గుదురుపఱిచి
కెంపువా తెఱఁజేసి , కెంపుకెంపుకాఠిన్యంబు
బటువు గుబ్బలయందుఁ - బాదుకొలిపి
విరులు గోళ్ళానరించి ఆ విరుల సౌరభ్యంబు :
నిట్టూర్పు గాడ్పుల • మట్టుపఱచి
తే. నలువఁ గావింపఁబోలు నీ చెలువనౌర
యనఁగఁ జెలువొందె నాచాన • హంసయాన
యమృత పుంబావి యరిదియం • దములదీవి -
యాణిముత్తెమ్ము వలరాజు • నలరుటమ్ము.
(కవిజనరంజనము 1 ఆll 70 ప) 2.
క. లోకాలోక మహీధర
మేకోట, కులాచలము లే కృతకారులు, కే.
ళాకూళులుజలరాసులు,
శ్రీకరధృతిసాందుడౌహరిశ్చంద్రునకున్.
(కవిజనరంజనము 1 ఆn-29 ప|}}'
5. ఉల్లేఖము:
1. చ. వలపులకున్ని దాన మలి - వారముకోరనికోర్కి జాతికిం'
దలఁపనికీడు పొంధ సము • దాయము పొలిటీ వేఱువిత్తుకో ,
కిలములనోముపంట స్మర, కేవల శౌర్యహుతాశిరాయ్యరా
చిలుకలభాగ ధేయమిలఁ , జెన్నలరారే వసంతమంతటన్ .
(కవిజనరంజనము 2 or 3 ప )
2. క. చిలుకల చదువులబడులయి
యలులకు బానీయశాల లయికోకిలమం
డలముల కామెతలయి వల
పులకుని దానంబులగుచుఁ • బొలిచెందరువుల్
(కవిజనరంజనము a ell: 7 ప) ,,
6. అర్థాంతరన్యాసము:
గీ. ఇంతి సౌందర్య రేఖాది • దృక్షు చేత
నెపుడు తెరవంతురను, వంచి" • నపుడు గోరు
నిమిష పరికల్పి తాంత రా " యమువిదిర్ప
భూమిపతులందు వాంఛాప్ర• పూతిఁ గలదె.
(కవిజనరంజనము 3 ell- 37 ప||)
గీ. విసముఁగంతం బునను దాల్చి • విసముకంటె .
నతి భయంకరమూర్తివీ , వని శశాంక !
యుత్తమాగంబునందు నిన్నుం చెహరుఁడు
వ్యర్థ మే శర్వసర్వజ్ఞ • వైభవంబు.
(కవిజనరంజనము. 2 అ 40 ప!) 7. ప్రతీపము:
1. క. పుడమింబొజియలు దూఱెడు
పిడుగులు నడవుల నెడాఁగు • బెబ్బిలిగుహలం
డడఁగెడు సింహముసరియే
వడిగలతనమునను రాచ • వారికి వీటన్.
2. సీ. ఎలనాగ పల్కుల , కెన గావటంచువో
చెవియొగ్గి వినఁడయ్యెఁ జిలుక పల్కు •
లింత నెమ్మోముతో , నీడు గొదంచునో
తళుకుటద్దముఁజూడఁ - దలఁవఁడయ్యె
బూఁబోఁడి భాహులం • బోల లేవంచునో
పూవుదండలు మేనఁ • బూనఁడయ్యెం
బొలఁతి మైతాలితోఁ - బురుడు గాదంచునో
మొనసి శ్రీగంధం బు • ముట్టఁడయ్యె
గీ. బోటి నిట్టూర్పు గాడ్పుతో , పాటి గాద
టంచునో యుశీరతాలవృం , తానిలంబు
సొంపునకు నించు కేనిఁగాం • క్షింపఁడయ్యె
మదనసాయక ఖిన్నుడై - మనుజవిభుఁడు.
(కవిజనరంజనము 2 || 18 ప)
8. 'పరిసంఖ్య:
సీ. బహుభాషణత్వంబు - పటుశాస్త్రసంవాద
చుంచువిద్వజ్జన • స్తోమమంద .
కూరభావంబత్యు • దారవిలాసవ --
చ్చంద్రాననాకటా • క్షములయంద
చంచల భావంబు • సముదగ్ర భద్రదం
తావళ రాజిహ • స్తములయంద
వక్రభావంబు దు• ర్వారవిక్రమనము
ద్భటభటాధిజ్యచా • పములయంద
కాని పురమున జనులందుఁ గానఁబడద
నంగ నెంతయు నప్పట్ట • ణము చెలంగు
హీరమణిమయ సౌధాగ్ర, హేమకలళ ,
భాజితస్వర్ణ దీస్వర్ణ • పద్మమగుచు.
(కవిజనరంజనము 1. ఆl 25 ప!)
9. స హెూక్తి:-
సీ. తరుణపల్లవ లతాం తములతోఁ గూడ నె
వల రాజు శౌర్యకీ • ర్తులు నెలింగే
నంచితనుమమరం - దాసారములతోన
విరహిణీ బాష్పాంబు • వృష్టి గురి సెం
గమనీయ లతికాప్ర , కొండంబు తోడనే
శుక పిక మధుకరో • త్సుకతనిగి డె
మలయానిలాంకూర, ములతోనకాముక
సమితి వాంఛకంద •శములు ప్రబలె
భవ్యనవ్య ప్రభా పరం • పరలతోన
పరిమళంబులు దట్టమై • పర్వేదేశల
సకలఋతుసార్వభౌమ వ • సంత ఋతువు
త్రిభువనీ మోహనంబయి , తేజరిల్ల,
(కవిజనరంజనము . 2 el? - 21)
తే. తమమడ రెఁ బాంథజన మోహ తమముతోడ
వహ్ని వెలుఁగొందే మరుశౌర్య • వహ్నితోడఁ
దారకలు దెల్విఁగ నె నబి , సారికాప
రంపరలతోడ నెంతయుఁ జంపుమీఱి.
(కవిజనరంజనము & ఆ!! 84 ప4)
.
10. అనన్వయము:--
చ. వనితవిలాసభా గవయ • వంబులకుం బరికించి చూడఁగా
నెన మఱి లేవు వాని కవి • యే యెనయంచు మదిం దలంచికా
యనుపమతన్మనోజ్ఞకర • ఖాకృతిగా నొనరించె నూరువు
ల్వనజదళాయ తేక్షణకు• వారిజసంభవు నేరు పెట్టిదో.
11. శ్లేష:
సీ. పద్మాకరములౌట • భవనరాజంబులు
విష్ణుపదంబంటి • చినుతి కొక్క
రత్నాకరంబౌట • రమణీయవప్రంబు
గగన స్రవంతితో. • గలని మెనె
నుమనోభిరామత • శోభిల్లుటనుదోట
ఆతులాప్సరస్సము • న్వితములయ్యె
రాజవతంను , రాజిల్లుటను సృపు
లమలదుర్గాధి పత్యమునమనిరి
భోగులకు నాణ్యంబయి. • పొలుచుకతన
సన్ను తుకి నెక్కె నదిబలి • సద్మమసంగ
నిత్యకల్యాణ లక్ష్మిచే నెగడుకతన
నాపురంబొప్పు విబుధాల యంబనంగ.
(కవిజనరంజనము 1 ఆn 28 211)
మ, అమృతాంభో నిధి లక్ష్మితోడనుద • యంబై రాజనంబొల్చి తో
రముగా సత్ఫథవతి? నా నెగడి సర్వజ్ఞావతం నుండనై
కమనీయాఖిల సద్గుణంబులయికొన్న నిన్నే న్నడ
క్యమే యీయంత్ఫల, పత్రలో ఛన్నగృపం గాపాడురాకాశశి
(కవిజనరంజనము. a en 30 ప్ర||)
(కవిజనరంటే
తే. కొమ్మల గదల్చు నెప్పుడు • గమ్మ గాలి
విధుతనయుఁడు మనోజుఁడు • మధుఁడు జూతీ,
వైరిదోషాకరుం డుడు , వల్లభుండు
గలికి వీరికి సుగుణంబు • గలుగు టెట్లు.
(కవిజనరంజనము 2 ఆn 34 ప.}
12. భ్రాంతిమంతము:-
మ. అతులో త్సాహము లుప్పతిల్లనిక • టో ద్యానంబులం బొల్చుకే
కితతుల్వీటను జితనత్ర నకలా , కేలింవి జృంభించు భ
వ్యత రాభ్హ్రంకష రత్న సౌధపటలీ • వాతాయన వారతని
గతకాలాగరుధూపధూమ్యలు మొయి ల్గా నెంచి యెల్లప్పుడున్ -
రంజనము 1 ఆ॥ 21 ప)
మీఁదఁజూపిన యలంకారములు గాక యింకను మఱికొన్ని గలవు. కాని గంధవిస్తర భీతిని ఇంతటితో విరమించితిని.
సరసమగు నర్థము నే మిక్కిలిగ నపేక్షించిన కారణముచేత నీకవివరుఁడు - వాగాడంబరమున కోశించి శబ్దాలంకారములనంతగాఁ బాటింప లేదు. కాని యర్థ సందర్భమునకు భంగములేకుండయుచిత మైన శబ్దాలంకారములను గూడ నచ్చటచ్చటఁగవివాడి యున్నాడు:-
X
1. అనఁగఁజెలువొందినా చాను హంసయాను
యమృత వుంచావి. యరిది యండములదీవి
యాణిముత్తెమ్ము వలరాజు • నలగుటమ్ము,
• 2. సరసనిభమూ వినిహిత • నశ్రితాతిన్
సాధుకీర్తిన్ మాకిశ్చంద్ర చక్రవర్తి
సూరకవి కవిత్వము,
సూరకవికిఁ బిదపనో లేక యతఁడు జీవించియున్న కాలముననో యీ కవిజనరంజనము పండితుల యాదరణమునుబొందియాంధ్ర కవి ప్రపంచమున సబ్బయామాత్య కృతమగు కవిరాజుమనోరంజనము మొదలగు గ్రంథములతో పాటు పిల్లవసుచరిత్ర మను ప్రసిద్ధిగాంచినది. అట్టి ప్రసిద్ధిని పొందుటకు దీనియందలి వసుచరిత్ర పుఁబోలిక లొక కారణమయి యుండుటగ్రంథమునందలి వర్ణ నాంశముల పట్లఁగవి చూపిన ప్రేమ యు రసపోషణమును బ్రథాన హేతువులై యుండవచ్చునని తోచెడిని. కథా విన్యాసమునఁ గల్పనా కౌశలమును జూప నవకాశము లేక పోయినను గవి వర్ణ నాంశముల పట్లఁ దన ప్రౌఢిమను జూపి యాధునిక ప్రబంధకవీశ్వరులలో నుత్తమ స్థానము నధిష్ఠించెను.
ఈకవివరుసకు సంస్కృతాంధ్రముల యందుఁ జక్కనివైదుష్యము కలదు. ఇతఁడు సంస్కృతమున నాటకాలంకార సాహిత్యము కలవాడగుటయే గాక పాణినీయ వ్యాకరణ-జ్ఞుండుగూడనై యుండినట్టుగ నీతని గ్రంథములను బట్టి తెలియవచ్చెడిని. కవిసంశయ విచ్ఛేదములోని
A. ఆంధ్ర మర్మంబుఁ దెలియంగ , వసుపుపడు నె
ప్రకటసంస్కృత రచితసూత్రముల చేత
అను నీపద్యమును బట్టియు, శ్రీ రామదండకములోనిసం స్కృతపద భూయిష్ఠమగు రచనను బట్టియు, కవిసంశయ విచ్ఛే దములో నితఁడు వాడిన "ల్యప్పు " మున్నగు వ్యాకరణపరి భాషను బట్టియు నితనికి సంస్కృత వ్యాకరణమునఁ జక్కని జ్ఞానముక లదని నూహింప వచ్చును.
సర్వవిధముల నుత్తమ కవిత్వమని చెప్ప నొప్పునది యెట్లుం డవలెనో సూరకవి, తనకవి సంశయ విచ్ఛేదములో నిట్లు చెప్పియున్నాఁడు.
- సీ.యతి, యుక్త వాక్యాను • గతినంటవలయు వ
త్సంబు ధేనువు వెంటఁ • దవిలినట్లు
మెట్టు మీఁదను గాలు • పెట్టఁగై దండ యం
దిచ్చినట్టులు పాస • మెనయవలయ
సానఁబట్టిన మణి • చందానఁబదమర్థ
నారీశుభంగిబం • ధంబువలయు
- సూరకవి యీయ భిప్రాయము నే తన యితర గ్రంథముల యందుఁ
గూడఁ దెలిపి యున్నాఁడు-
1. గీ. కవిత నేరుపుయతి గూర్చు • కరణి దెలుపు. (రామలింగేశ శతకము)
2.క. యతీ దవలవలయు వాగసు
గతి ధేనువు వెంటనంటి • కదలెడు వత్సా
కృతి నదియె కవనచతురిమ
వితరణఖని ! పొణ్గుపాటి • వేంకటమంత్రీ.
(వేంకటమంత్రి శతకము.)
దివిబెలుంగు మెఱుంగుఁ • దీఁగెయటర్థంబు
తేట తెల్లంబు గాఁ • దెలియవలయు
గీ. నలఁతి తొలపడ్డ చంచమం • డలమువలన
జలజలను రాలునమృతంపు • జాల లీల
రసముతులకింప వలెనట్టి • రమ్యకవిత
రసికరసనా రిరంసచేఁ • బ్రబలకు న్నె.
ఇట్టి యాదర్శమును దనముందిడు కొనిన వాఁడగుట చేతనే సూరకవి యీప్రబంథమును గవిజనహృదయా వర్షకముగ నొనర్చి యన్వర్ణాభిధానముగఁ జేసి యున్నాడు. కథా సంవిధానమునఁ జెప్పఁబడిన చంద్రమతీ హరిశ్చం ద్రులయన్యోన్యా నుగాగ బీజము వారివారిచిత్రపటములను నొం డోరు లుపలక్షించుట చేతనే మొలకలెత్తిన వని చెప్పియు బ్రా హ్మణసం దేశమునుజొనిపియు" సంభావ్య విషయనిరూపణము గావించి, యిరువురు రాజ్యాధిపతులు వియ్యమందిన విధమునఁ జంద్రమతీ హరిశ్చంద్రుల వివాహమహోత్సవమును క్షత్రి యోచిత, మర్యాదల ననుసరించి మిగుల మనోహరముగ నభివర్ణిం చియున్నాడు. దృఢవ్రతుఁడను బాహ్మణుఁడు హరిశ్చం ద్రుని దరికి దూతగా వచ్చిన సందర్భమున... నాయతిథిని హరిశ్చం. ద్రుడు పూజించుటలో " వైదిక సంప్రదాయము ననుసరించి సం స్కృత భాషా మయముగ, నతిథి సత్కారవాక్యములనుగవియిట్లు
నడపియున్నాడు.
సీ. వరదనం తే: విప్ర పల్ల అగిమ సార్వ
భౌమ తుభ్యం సదా • భదమస్తు,
అతో పవిళ భవ , దాగమనం కుతో
విజయోస్పదపురాద్వి • వేకధుర్య
తవనామకిం ద్విజో.. త్తమ దృఢవత ఇతి
ప్రాహుర్మనీషిణః • పార్థి వేంద్ర
యుష్మ దాగమన ప • యోజనం కిం విప్ర
రహాసిన క్ష్యే ధరా రమణవర్య
గీ. యనుచు నన్యోన్య పరిభాష • లాడి పిదప
సముఖమందున్న యాశ్రిత • జనుల నెల్ల
వేఱక నేపంబుఁ గల్పించి వీడుకొల్పి
మంతనం బుండె వసుమతీ • కాంతుఁడపుడు.
బ్రాహ్మణ పూజయునందును నతిథిపూజయు యజ్ఞములే యనఁ జనును గాన (యజ్ =To worship) నట్టి యజ్ఞవిషయమున వికృతి భాష నుపయోగించుటకన్నఁ బవితమగు
గీర్వాణభాష నుపయోగించిన నుచితతరముగా నుంచునని సకలాగమ సంప్రదాయాభిజ్ఞుండగు సూరకవి తలంచెనా యని యాలోచొంపవలసి యున్నది.
వాగ్వోగవిద్దుషతి చాపశబ్దైరితి స్మృత్యనుమిత్య వమ్యమానోప సబ్దనిషేధోపి క్రతువిషయ ఏవ .................. ఆత ఏవ వ్యాకరణ మహా భాష్యేసర్వోప్యప శబ్దనిషేధఃక్రతు విషయ ఏవ నతు వ్యవహార విషయ ఇతి ప్రతిపాదితం. తత్తస్స్వదేశ భాషాభింజాన ధౌ రే
స్మృత్యనుమిత్య వగమ్యమానోప శబ్దని షేధోపి క్రతువిషయ
. 114
యా:పండిత శశాంకాః నిశ్శంకాస్స్వదేశ భాషా కావ్య నిర్మాణే కేపిన ప్రవర్తంత ఏవ.
(ఆహోబిలపండితీయము. 89 పేజీ.)
అను నహాబల పండితుని ధోరణినిబట్టియు నాతం డుదాహరించిన మహాభాష్య ప్రమాణమును బట్టియు యజ్ఞ విషయముస దేశ భాషల నుపయోగించుట నిషిద్ధమని - తేలుచున్నది గదా ! ఇట్టి గంభీరమగు- సూరకవి యాశయమును బరిశీలించు వారికెల్లను .నాతనికి గల సంస్కృత వ్యాకరణ జ్ఞానమును నహో బలపండి తీభూదు లందలి పాండిత్యమును, వైదిక సంప్రదాయాభిజ్ఞతయు నుచితజ్ఞతయు విశదపడక మానవు.
ఇంక నితనికవితా విశేషములను గూర్చి కొంచెము చెప్ప వలసి యున్నది. సూరకవి కవిత్వము సంస్కృతపదభూ యిష్టమైమ్మ మృదుమధురమై ' యనర్గళ ధారకలదై 'కదళీపాకమున విరాజల్లుచు " కవితాత త్త్వంబు సూరకవికే తెలియు” అను నాతని సమ
కాలికుల యభిప్రాయమును దృడీకరించు చున్నది. ఇతని కవితనుగూర్చి పండితులొసఁగిన యభిప్రాయముల నీదిగువఁబొందు ఱపచు చున్నాఁడను.
" అడిదము సూరన --ఇతఁడొక సుకుమారకవి.జనరంజనమను నొక చిన్న కాన్యమును రచియించిన వాడు.
దానిని పిల్లవసుచరిత్ర మని చెప్పుదురు. ఆడి తన పడసిన నామ ము సన్వథర్మము చేయుచున్నది. ”
-- -- --
బహుజనపల్లి సీతారామాచార్యులు వారు-(శబ్ధ రత్నాకరముపీఠిక .)
" ఇతఁడు. చేసిన గ్రంథములలో నెల్ల. జంద్రమతీపరిణయ మము నామాంతరము గల కవిజనరంజనము .మిక్కిలి మనోహర. మైనది. ఇది మూఁడాశ్వాసములు, గల చిన్న ప్రబంధమైనను, దీనియందలి .గుణసంపదను బట్టి పండితులు దీనిని. పిల్ల వసుచరిత్ర మని వాడుచున్నారు.
-- -- -- -- రావుబహదూరు కం. వీరేశ లింగము పంతులుగారు- (ఆంధ్రకవుల చరిత్రము 3 వ భాగము.).
« సరసకవిత్వవైభవ" అని యీకవి వ్రాసికొనిన బిరుదు
సార్థకమలి యెన్ను చున్నారము • : ఇతఁడు రచించిన కవిజనరంజు
నము చదివిన కొలఁది ధ్వనులీనుచు మాధుర్యముం ఇలికించు
చున్నది. ఆ గ్రంథమన్ని విధముల వసుచరిత్రను బోలి కొన్ని
చోట్ల మించి యెప్పుచుండుటచేతనే దాని కప్పటివారు పిల్లపసు
చరిత్రమని పేరిడిరి. కవిత్వము హృద్యముగా నుండును. ధ్వనియే
ప్రధానముగా సెంచి కావ్యగుణములకే భంగముఁ బొరలకుండ
గ్రంథములను రచించి , నలుగురౌనన - "బేరుబ్రతిష్ఠలఁ గాంచియీకవి మించెను. ఈతని కవిత్వమున నఱువది పాళ్ళు సంస్కృతమును నలువది పాళ్ళు తెనుఁగునుగలదు.
రాజా మంత్రిప్రగడ భుజంగ రావు బహద్దరు గారు-
(చంద్రాలోకమునకు ను పోద్ఘాతము.)
6. ఈతఁడనేక గ్రంథంబులు రచియించె. అందు జంద్రమతీపరిణయము లేక కవిజనరంజనమను నది ప్రబంధము. ఇదిప్రబంధమనఁదగి దాని రచియించిన కవి పేరు శాశ్వతమైభూమి యందుండు 'నల్గొన ర్చె. ”
గురజాడ శ్రీరామమూర్తివంతులుగారు-(కవిజీవితములు.)
".. - వసుచరిత్రములోని కల్పనములను గడపట్టులను ననుసరించి చెప్పిన వారిలో ముఖ్యుల గ్రంథములు పిల్ల వసుచరిత్రములని ప్రసిద్ధిని జెంది యున్నవి.అడిదము సూరకవి ప్రణీతమగు కవిజనరంజనములోనివర్ణణనములును సరసముగనే యున్నవి. కాని యిందుఁగథా భాగమేమియుఁ గానరాదు.
వజ్జల చినసీతారామస్వామి శాస్త్రి గారు - (వసుచరిత విమర్శనము .)
కవిసంశయవిచ్ఛేదము:- ఇది మూఁడు : ప్రకరణముల లక్షణగంథము. ఇందలి ప్రకరణములకు దరంగములని పేరు.అందు మొదటి రెండు తరంగముల యందును గవి తనకుఁబూర్వముననున్న వ్యాకరణములలో లేని కొన్ని నూతనవిషయములను
జేర్చి వానికి సూతములుగల్పించి లక్ష్యములను భారతాది గ్రంథముల నుండి చూపియున్నాడు. రెండవ "తరంగమునందు శకటరేషనిర్ణయమును గూర్చి కొంతవఱకును, మూఁడవ తరంగమునందుఁ దద్భవములు గలిగిన విధమును గూర్చి కొంతవిపులముగను వివరించి యున్నాడు. దీనియందుఁ దాను జేసిన నియమములను సూరకవి యిట్లు చెప్పియున్నాడు.
క. కవిజన సంజీవనిలోఁ
దవిలినపద్ధతులు మఱియి • తరలక్షణల
క్ష్యనిర్దిష్టగతులు చె
ప్పవలయునని వేఱయొక్క • పద్ధతి చేతన్ .
క. ప్రియమందఁగఁ గవులు కవి
త్రయనుకవిత్వాసరణి దప్పక కవిసం
శయవిచ్ఛేదంబను నా
హ్వయమిడి లకు ణ మొనర్తు • నార్యులు మెచ్చన్
భారతాదిగ్రంథముల యందు మహాకవులు ప్రయోగంచిన ప్రయోగములను సూరకవి లక్షణ. సమ్మతములుగా సాధింఛి యుదాహరించెను. అట్టివానిని గొన్నింటి నీదినువఁ జూపుచున్నాఁడను.
1. లక్షణము:-
గీ. ఇడఁగవచ్చును ల్యప్పుపై • నిత్వసంధి
మాత్ర మొక్కొక్కచోటను • మట్టుమీఱ
గొలుతు సమమడంపఁ • గోరిందు శేఖరు
నన్నయట్లు కవిజ • నామామతిని.
ప్రయోగము:--
1. క. ఇతఁడుమదీయ పురోహితుఁ డితనికిఁడగ నెల్ల పను లె • ఱింగించిపుడే,
(ఉద్యోగపర్వము ) 2. క. ....................... జమ్మి దెశంబ్రాకివిడిచి • చాపమునాకం రిమ్మనుడు. (విరాటపర్వము.)
3. సీ. దర్శించి యతనికేం •దగుదునో తగనొ య నించుకించుక సంళ • యింతురాత్మ. (నైషధము - శ్రీనాధుఁడు.).
4. చ. నిగి డిరువైపుల న్వెడల • నేటయినీటగు. వీటికోట. శుద్ధాంధ్ర రామాయణము. (అడిదము బాలభాన్కరుఁడు.)
ఇకారసంధి శ్రుతికటువుగా నుండునని ప్రాచీను లద్దాని సంగీకరింపరయిరి. అట్లయినను శృతికటువు కాని ఈ ఇకార సంధి దుష్టముకాదనియే వారి యాశయము. ".................................వా
రాతెలివెందునుం గలదె” (ఉద్యోగ పర్వము. 2 వరిశ్వాసము, 225 పద్యము) అని తిక్కయజ్వ ప్రయోగించి యున్నాఁడు. సామాన్యముగా ఇకారము నకుఁ దాలవ్యాచ్చు పరమగునపుడు సంధిశ్రుతి హితముగానే యుండును. . (ఇకార సంధి' దుష్టమను : నిబంధనమునకు, అకారాదిపర కే కార సంధియే దుష్టమనియెన్నఁ దగును. ఆలోచింపఁగా, క్వార్థ కేకార సంధీని షేధమునుదాలవ్య స్వర పరకస్థలముల యందుఁగాదని మహాకవు లభిప్రాయపడినట్లు స్ఫురించుచున్నది. ఇట్టి భాషాతత్త్వమును గను పెట్టియు -మహా కవుల ప్రయోగరహస్యములఁ గను పెట్టియు దానినే యనుసరిం చియున్న సమర్థుఁడగుసూరకవి క్త్వార్థక సంధివిషయమున నట్టి వ్యవస్థ నేర్పఱచి శృతిహితములును మహాకవి ప్రయుక్తములు నునగు నికారపరకక్యార్థక సంధులనే యుదాహరించియున్నాడు..
2. లక్షణము
గీ.కర్మధారయంబు గావించు చోటను
నూది పలకవచ్చు నొక్కచోట
స్ఫుటకృపా నిభూతిఁ బొలుచున్ శివుఁడుమాకు
సభిమతీర్థ మిచ్చు • నన్నయట్లు.
ప్రయోగము:-
శా. ..........................................................................చె
ల్వారున్రాముడు ప్రోచు గాతచిక తిమ్మాధీశుతిమ్మాధివున్న్.
(కవులవృష్టము. )
.
మన ఆంధ్రశబ్దచింతామణి యందలీ "నుమ్చోతః' అను సూ తమును బట్టి, యుదంత స్త్రీసమాదులకుఁ 'బరుషసరళములు పర మగునపుకు ద్రు తాగమము నిత్యముగా వచ్చునని తేలుచున్నది., ఈయభిప్రాయమునే ఈ బాలవ్యాకరణములో సంధిపరిచ్ఛేదము లోని యిరువదియైదవ 'సూత్రము విశదీకరించు చున్నది. కాని, ఉకారాంతములగు ధాతుజవిశేషణములు స్త్రీ సమములు కాకుం డటను. జేసి వానికీయాగమము రాదనియే ప్రాచీనా ధునాతనవై, యాకరణుల యభిప్రాయము. ఆ బాలవ్యాకరణము లోని సమా : సపరిచ్ఛేదమునందలి యేడవ సూతమున స్త్రీసమశబ్దమును జెప్పి, యు, మరల ధాతుజవిశేషణ పదమును గ్రహించుటయే, ధాతు, జవి శేషణములు : స్త్రీసమములు కానేరవన్న సిద్ధాంతమును వెల్ల డించుచున్నది. లోక వ్యవహారమునందును. మహాకవి వ్యవహార మునందును ధాతుజవి శేషణములకుఁ బరుషసరళములుపరముల గునపుకు దు తాగమము లేకుండుటయే తఱచు గానఁబడుచు న్నది. అట్లయినను కొన్ని చోట్ల మహాకవి ప్రయోగములలో ధాతుజవి శేషణములకుఁ బరుషసరళములు పరములగున పుడు ద్రు తాగమము వచ్చుట లేక పోలేదు.
- సమాసంబుల నుదంతం బులగు స్త్రీ సమంబులకుం బుంపులకుం బరుష
సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు..
1 కర్మధారయంబు త్రిక, స్త్రీసమ, ముగంత, ధాతుజవిశేషణ పూర్వ పదంబయి యుండు..
, మ. పలుకుం దొయ్యలిమాళి, కాంతి కెనయా, బాగాలునయ్యింతి చె
క్కులఁ బోలు, దెల నాకులు ........................ . ,
పాండురంగ మాహాత్మ్య ము 1 అ|| తెనాలి రామకృష్ణకవి.)
అట్లు వచ్చినప్పుడట్టిచోట్ల, క్వాచిత్కముగా ద్రుతాగమ మువచ్చునని సూత్రించుట యే యుచితమై యుండును. " అని యిప్పటి వైయాకరణు లంగీకరింపక యట్టి స్థలముల యందలివి ధాతుజుని శేషణములు గావనియు నవి దేశ్యములగు స్త్రీసమళబ్ద ములయి వేఱుగానున్న వనియు సిద్ధాంతీకరించు చున్నారు. కాని సూరకవి మాత్ర మట్ల భిప్రాయపడక, సహజముగాఁ గొన్ని యె డల నట్లు ధాతుజవి శేషణములకు సహితము పరుషసరళేతరములు పరములగునపుడును, క్వాచిత్కముగా ద్రుతాగమము గలదని యుదాహరించి యున్నాడు.
3. లక్షణము;.
గీ. ధరఋకారాంతశబ్దంబు • ద్వంద్వమైన '
రేఫయగుచుఁరవర్తిల్లు • దృఢముగాను
పత్రి వరహయ వాగ్వధూ - నేత ముఖసు
రాభి వందిత పాదాబ్జ • యన్నయట్లు.
ప్రయోగము.
ఉ............. .........................................................రామమాం
ధాతృరఘడీ తీశులుము • డంబునఁ గాచి రె యే యుగంబునన్ ,
(ఆ. పర్వము .]
. 16 ఈయభిప్రాయమునే బాలవ్యాకరణములో సమాసపరి చ్చేదములోని యిరువదినాల్గవ సూత్రము (ద్వంద్వంబునందు ఋకారంబునకు 'రవణంబు విభాషనగు) విశదీకరించుచున్నది. : బాలవ్యాకరణ గుస్తార్థ ప్రకాశికలో సీసూత్రము క్రింది నీయఁ బడిన వ్యాఖ్యానములోని కొన్ని పంక్తుల నిచట నుదాహరించుచు న్నాఁడను.
మీఁది పద్యమునందు " మాంధాతృరఘు "తీశులు అనిన ద్వంద్వంబునందు మాంధాతృశబ్దంబు 'రేఫా దేశయు కర బై భారతంబునందున్నట్టు లెంచి యడిదము సూరకవి ( గీ. ధ' ఋకారాంత .............. .యన్నట్లు ” కవి సం—ప్రథమ. 28 ల. అను పద్య లక్షణమునకు లక్ష్యంబుగాఁ జూ పెను. అప్ప - కవిపయి పద్యచతుర్థ పాదంబునందు. మాంధాతృశబ్దంబు భారతరచనా సమయంబున ఋకారాంతముగానె రచియింపఁబడినదని
యెంచి రేఫక్లిష్టమైన యకురంబులకు రేఫశ్లిష్టంబు గాని యక్షరంబు ప్రాసంబుగా నుండవచ్చునన్న దానికిఁ బయిపద్యం బుదా హరణం.. గా నిరూపించెను. కొన్ని ప్రాచీన భారత పుస్తకములయందు రేఫయు క్తంబుగాను, 'మణికొన్నిటి యందు రేఫవిరహి తంబుగాను మాంధాతృశబ్ద ముండవచ్చును. కావునఁ బూర్వో క్తకవులిద్దఱును నుభయవిధంబుగా నభిప్రాయపడిరి. శాస్త్రం బున మాంధాతృరఘుక్షితీశులు' అన్న ద్వ ద్వంబులో రఘుక్షితీశ శబ్దంబు నసూసచరనూవయవంబు (కడపటి పదంబు) కాన
దానికిఁ బూర్వంబునందున్న మాంధాతృశబ్దంబునకు రేఫాదేశంబురావచ్చును. ” (పేజీ -200.)
4. తదృవపదలక్షణము:
గీ. ద్విశ్వవర్ణంబు లకును "మీదిదియ యొండె
గ్రిందిదియ యొండెఁ దొలఁగును • జెందుడుమువు
లొక్కకొన్ని పదంబుల • కుగగభూష
కలుగు బంధుత తటవర్గ • ములకు శర్వ.
క. ఋత్వమునకు నిత్వమునకు
నేత్వముసిద్దించు నోత్వ • మెనయును సుత్వం
ఔత్వమునకు నోత్వంబగు
నైత్వం బేత్వమగు నుమళ రాననమధనా
సూరకవి యేలకో లక్షణమును జెప్పుచు లక్షణ భాగమును దేటగీతిలోను లక్ష్యభాగమును ఆఁట నెలదిలోను నొకేపద్య మున వాసియున్నాడు. మీఁద నీయఁబడిన ( ఇడఁగవచ్చును ల్యప్పు పై నిత్వసంధి అను. పద్యమే దీనికి చార్కాణము.ఇ దెంతయు వింతగాఁ జూపట్టుచున్నది. " సూరకవియుఁ గూచిమంచి తిమ్మకవియు సమకాలికులు గాంగనఁబడు చున్నారు. ఆ కారణముచేతఁ గవిసంశయ విచ్చేదమును సర్వలక్షణ సారసంగ్రహమును ' నొకే కాలమునఁబుట్టిన లక్షణ గ్రంథములని చెప్పవ లెను. తిమ్మకవి గ్రంథము - సూరకవి గ్రంథముకంటె నిస్సంశయముగ విపులతరమగు గ్రంథమని చె ప్పవలసి యున్నది...... . . 3.చంద్రాలోకము:- ఇది యొకయలంకారశాస్త్రము. దీనిని బీయూషవర్ష బిరుదాంకితుఁడగు జయ దేవమహాకవిసంస్కృ తమున రచియించెను. ఇందలి భాగములకు మయూఖములని పేరు. అవిపది. అందు నైదవ మయూఖములోని యథాకాలం కారములను నూటిని దీసికొని సూరకవి తెనిఁగించెను. సంస్కృ తచంద్రాలోక కతౄత్వము నేలకో .సూరకవి కాళిదాసున కా రోపించుచు నిటొక పద్యమును జెప్పి యున్నాఁడు.
గీ. బాలురకు నైనఁ దెలియంగం • గాళిదాసు
షునురచించెఁ జందాలోక • మునుద్రిలింగ
భాషజేసితి నీకృప • భవ్యముగను
దీనిఁ గరుణించి కై కొమ్ము • దేవ దేవ,
ఈవిషయమున సూరకవి పొరపాటు పడెనని చెప్పకతప్ప దు. ఏలయనఁ జంద్రాలోకమను దానినిఁ గాళిదాసురచించినట్టు గానీ యట్టి ప్రచారమున నున్నట్టు గాని తెలియరాదయ్యెను. ఒకప్పుడు సూరకవికి దొరకిన సంస్కృతగ్రంధమున ( కాళిదా సకృత చంద్రాలోకమని ఆ యుండిన నుండవచ్చును. ఆ వ్రాత యందలి యథార్థమును బరిశీలింప నవసరము లేదనుకొని సూర కవి యీతీరునఁ బొరపడియుండిన నుండవచ్చును. ఈ రీతిగ భ్ర మపడిన వారింకొకరగపడు చున్నారు. వారు వురాణనామచంద్రికను వ్రాసిన యెనమండ్రం వేంకటరామయ్యగారు. ఆయన తమ గ్రంథములో నిట్లు వ్రాసి యున్నారు: --చంద్రాలోకము—ఒక యలంకార శాస్త్రము. ఇది కాళి దాసకృతము. (పు! నా!! చం| 67 వ పేజీ.)
ప్రకృతమున నీయాంధ్రచంద్రాలోకమునకు మాతృక యేదియో తేలవలసి యున్నది. పరిశీలించి చూడఁగా సూరకవి జయ దేవ కృతమగు చంద్రాలోకములోని ' యథార్థాలంకార , మయూఖమునే తెనిఁగించినట్టుగఁ గనఁబడుచున్నది. కానిశ్రీయుత అక్కిరాజు ఉమాకాంతముగారభిప్రాయ' 'పడిన ట్లప్పయ దీక్షి తుల వారి కువలయానందకారికలను . దెనిఁగింప లేదు. ఉమాకాంతముగారు తమ యాంధ్రచంద్రాలోక వీఠిక లో తన నాదరించిన వేంకటపతిరాయలను దీక్షితుఁడు శతాలంకారము లలోఁ జివరదియైన హేత్వలంకారము యొక్క లక్ష్యమునందు "స్మరించెను. ఆ లక్ష్యమిది. ( లక్ష్మీ విలాసావిదుపొం కటాయో వేంకటప్రభో! ” సూరకవి యీలక్యుమునే.
గీ. కార్య కారణములకు నై• క్యమగు నేని
గృతులఁగొందటు' హేత్వలం • కృతియయండ్రు
సత్కవులకున్ రమావిలా , సములువేంక
టేశ్వకకటాక్షములనంగ • నిందుమౌళి.
అని యాంధ్రీకరించెను. .కనుక సూరకవి కువలయానంద కారికలనే యాంధ్రీకరిం చెనని, శశవిషాణప్రాయమైన 'కాళిదాసకృత చంద్రాలోకమును గాని జయ దేవుని చంద్రాలోకమును గాని యాంధ్రీకరింప లేదని స్పష్టమయినది” అని వానిసి యున్నారు.
కాని యిందును బొరపాటులు గలవు. 'లక్ష్మీ విలాసా విదుషాం కటాక్షా వేంకట ప్రభో?! అనుదీనియందలి (వేంకట ప్రభో!' అను దాని బట్టి దీక్షితుల వారు తమ పోషకులను స్మరించిరనివ్రాసిరి కాని యియ్య ది జయ దేవ , కృతచంద్రాలోకముననే కాన వచ్చుచుండుట చేత సుమాకాంతముగారి యూహ సరికాదని చెప్పవలెను. ఇచ్చటి వేంకటప్రభు శబ్దమును- దైవపరముగాఁ దీసికొనవలెను. గాని ప్రభుపరముగా ముడి వేయరాదు. కాబట్టి సూరకవి యాంధ్రీకరణమునకు జయ దేవుని గ్రంథమే మూల మని తలఁపవలెను.
సూరకవి యాంధ్రీకరణము సంస్కృత చందాలోకము నకుఁ జూలవఱకు దగ్గఱగనే యున్నది. అప్పయ దీక్షితుల వారి గ్రంథసహాయము నితఁడ పేక్షింపక పోలేదు. అవసరమగు పట్లగువలయానందములోని విషయముల నితఁడు గ్రహించి వాడు కొనెను. మొత్తము మీఁద సురకవి యాంధ్రీకరణము సరసముగను, ఉపయోగ రముగను నున్నది. ఉదాహణము కయి కొన్ని శ్లోకములను, పద్యములను నిచటఁ జూపు చున్నాఁడను.
శ్లో ఈపమా యత సాదృశ్య | లక్ష్మీరుల్ల పతిద్వయోః |
హంసీవ కృష్ణతేకీర్తి | స్సవంగా మవ గాహ తే || :
వక్ష్యో సమాన ధర్మాణా | ముపమా వాచక స్యచ |
ఏకద్విత్యు " ను పాదానా ! ద్భిన్నా లుప్తోపమాష్టధా ||
గీ వర్ణ్యముపమాన ముపమాన వాచకము స
'మానధర్మము సంఘటిం • పనగునుపమ ;
హంసిచందాన నీకీర్తి • యబ్జనాభ :
యభగంగా వ గాహనం • బాచరించు.
(మిది రెండు శ్లో: ములలోని లక్షణము లనుండి పూర్ణోపపమ
లక్షణమును గ్రహించి మూలములో నిలక్ష్యమునేయిచ్చినాడు.);
{3 శ్లో| చేద్బింబ ప్రతిబింబత్వం | దృష్టాంత సదలంకృతిః ||
త్య మేవ కీ ర్తిచూన్రాజ | న్విధు రేవహి కాంతిమాన్ ||
క.కృతి బిం ప్రతిబింబా
దగ దృష్టాంతమగుసు • నృపనీవసము
న్న : సమన్వితుఁడవు
సీతకి” " కాంతియుతుఁడు •క్షితినను పాల్కిన్.
(ఈ పద్యము మూలమునకు సరిగనున్నది.)
(3) శ్లో. ప్రశ్నోత్తరాంత రాభిన్న | ము స్తరం చిత్రముత్తరం!
కేదా రపోషణరతాః | కే ఫేటా కించలంవయః ||
క. షరగఁ గృతులం దుఁ బ్రశ్నో
త్తరమస గనలం. కియా వ • తం సముప్రశ్నో
త్తరములో కటయిన, నెద్దీ
శ రవాహన మః గసరస • సమ్మతమగుచున్
ఇచ్చట మూలములోని లక్షణమును మాత్రము గ్రహించి లక్ష్యము నాంధ్రీ కరించుట దుస్సాధ్యమగుటచేత 'వేఱొకటి పొందుపఱచెసు.
ఇట్టిరీతులనే దీనిని తెనిఁగించుటలో గవి యనుసరించెను.
4. శ్రీరామదండకము:-
సూరకవి యించుఁదనయుభయాభాషా పాండిత్యమును వెల్లడించుచు రామాయణ కథను సంక్షేప్తముగా వర్ణించి యున్నాడు. ఇందలి కవితాధోరణిని దెల్పుటకయి గొంతభాగము నిచట నుదాహరించు చున్నాఁడను.
". .....మాయాకురంగాకృతిన్ రావణ సేరితుండొచు మారీచుఁ డేతే
ర సీతా ప్రయత్నంబునన్దజ్జి ఘృక్షాచురాయత్త చిత్తుండవై నీవు బోవ స్టశాన్యుం
డు సీతాసతింగొందు లంకాపురింజేర నీవంత మారీచు దున్నాడి తత్పర్ణశాలా స
మీపంబునంజానకిగాన కార్తి న్శరారు ల్తరణ్యంశు జూలాశరణ్యం బరణ్యం బగణ్యంబు లేవేళల న్వ్యాళ శార్దూలగుండాలముల్ హాతటిద్గాత్రి హా మానసొహ్లాదసంధాత్రి హా ప్రేయసి క్వాసి యచాయరణ్యాని నీవాధశణ్యాత్మజ ంవెన్కుచున్ రావణోత్కృత్త కాయు న్జటాయున్ని రీక్షించి నీచాక బంధున్బడంజెండి లోకై కబంధుండ వై పొల్చియిందింది గా జీవ రాజీవరాజీ వరామోదసంపాది పంపొసరనీ రదేశంబున నైతిలో మైతి గావించి వాలిన్మహా సత్వశాలి నముచ్చండ కొండా హతి ఎండవే చండ వేదండము వొండు పంచాస్యమన్బోలి నీకంతట న్భానుమత్సూనునిగేళ భదాసనాసీనుని వేసిన న్బాసటై భూనుతాన్వేషణార్థంబు శాఖామృగాధీశుల స్బంపు వేళ స్మహావేగవంతున్ హనూమంతు సర్దక్షిణాళాప్రదేశంబు వెన్క నియోగించినన్వాయుసూనుండు భూభృత్సదృక్కర, టాళీడులీఢాకి తాళంక షాదభవీ చీసమాచీనవారాన్నిధిజెంగున ఛాటి లంకాపురోద్యానమధ్యంబునన్దూర నక్తంచరీచంచరీకాలోపేర సీతన్నిరీక్షించి ప్రాంతారవింబోలి సీతారవిందాస్య చేతోరవిందంబు నానంద మొందించి యంతనృతోద్యాననిద్రావణుండౌచుక్షేశాకరాళననోగాహవాహంయు నక్తంర్ల్గొల్వ నక్షాదిరక్షోబలాధ్యక్షులే తెంచి యుద్వృత్తి మైహత్తిదండెత్తినన్బిండీపిండై సముత్తుంగ మాతంగములుగును గైతురంగంబులు ధైక్కు చెక్కై శతాంగం బులున్నుజ్జునుజ్జై భటాగంబులు న్నేలపై
గూల లీలఁ దత్సేన్య ముద్ధూత చైతన్యము వేసి యు ద్వేలకోలాహలాభీల హే లాసము ? సిమై యస్ ని ఎండు చెండాడి తైయకు వీజే శుశు క్షుణ్య పేక్షు కృ దుగా ఆ వాలాగ బద్ధాంశుక ప్రస్ఫుర ద్విస్ఫులింగచ్ఛటాభీలకీలా, కరాణాగ్ని లంకాపు రా గారము ల్భస్మ సా త్కారము ల్పేసి వేళంతమున్బోలె తానాసరస్వత తము నాటి నిన్గాంచి లం కాపురో ద్యాన మధ్య స్థితాం దానవీ సంవృతాం ల్వేద్వి యోగ వ్యధా క్లిష్ట గాతీం విదేహేందపుతీ మపశ్యం" రఘూత్తంస యంచు న్సుధామాధురీశ్రీ ధురీలో కుల న్విన్న వింపంగ .....
5. ఆంధ్రనామ శేషము: ఇది పద్యరూపమున నున్న యొక నిమంటువు. పైడిపాటి లక్ష్ముణకవి కృతమగు నాంధ్రనామ సంగ్హాహమునందు లేని పదములను జేర్చి. యోనిఘంటువును సూరకవి రచియించినాఁడు. ఆవిషయమునే 'యతడీ గ్రంధా రం
భమున నిట్లు చెప్పి యున్నాఁడు.
గీ. ఆంధ్ర నామసంగ్ర హమునందు. జెప్పని
యన్ని తెనుఁగు మఱుఁగు లరసికూర్చి
యాంధ్ర నామ శేష మను పేరఁ జెప్పెద :
దీనిఁ జిత్తగింపు దేవ దేవ
ఆంధ్రపదజాలము నొకచోట, నేర్చి కూర్చి వివిధ వర్గులు
గా విభాగించి గ్రంథముగాఁ జేయుటయేమిగులఁ గష్టమగుఫని.
అట్టి ఘన కార్య మొక రొనర్చిన పిదప దానియందలి విశిష్ట భాగ
ములఁ బూరించుట మఱియుఁ గష్టము. ఈ కార్యమును సూర
కవి కడు శ్లాఘనీయముగ జేసి యాంధ్రుల కృతజ్ఞతకు బాత్రు
17
డయ్యెను. ఆంధ్రనామసంగ్రహము వలె.నీశేషముకూడఁ జాలనుపయోగకరమైన నిఘంటువుగాఁ బరిగణింపఁబడి, యాంధ్రులచేఁబరింపఁ బడుచున్నది. ఇట్టి గ్రంథములు ప్రాయికముగఁగవుల కవితాధోరణిని జూపనవకాశ మియ్య నట్టివి. అయినను సూరకవి కవితా ప్రవాహము మాత్రమట్లు మిక్కిలి పరిణామముమెందక దీనియందును, నిరాఘాటముగా వెలయుచు నే యుస్నదనుటకు నీ క్రింది రెండుపద్యములను బొందుపఱచు చున్నాఁడను.
తే, పెంపుఁ జెందెను, దామర • తంపరయ్యేం
బబలె, సెగ డెను,గొనసాగే • బలి సెఁ బెరిఁ?
ననఁగఁరేకేత్తె ననఁగఁచే ళ్ళయ్యేవృద్ధి
బొందెననుటకు శేషాహి " భూషి తాంగ.
తే, అగపడకపోయె,విచ్చు మొగ్గయ్యె, ననఁగఁ
గంటఁ బడఁడయ్యె: బంచబం • గాళమయ్యె
ననఁగ దృగగోచరంబయ్యె • ననుట పేళ్ళు
శయఘటితశూల ! నైయామ • చర్మ చేల !
రానులిం గేశ శతకము:-
సూరకవి గ్రంథములలో నెల్లమిగుల జనరంజకమైనదియు, నతనికాలమున నే పలువురచే నాదరింపఁబడినదియు నగు నీశతకము క్రీస్తుశకము 1770-1785 సం వత్సరముల మధ్య కాలమున రచింపఁబడినదని యూహించుట కుదగిన యాధారములున్నవి. శ్రీవిజయనగర - ప్రభువులును కవికి నాశ్రయులునునగు శ్రీచినవిజయ రామరామ గజపతి మహారాజు
లుంగారి రాజ్యకాలమున దివానుగా నుండిన సీతారామరాజు చండశాసనత్వమును, దద్వారమున దేశమునకుఁ గలిగిన ప్రజాపీడయు, నాఁటి సాంఘిక స్థితియు, రాజకీయ స్థితియు నిందు నన్యాపదేశముగ వెల్లడించుటయే కవి ముఖ్యాభిప్రాయమైనట్టు గ దీనిఁజదివిన వారికిఁ దప్పక స్ఫురింపక మానదు. సీతారామ రాజుగారు 'పెట్టిన బాధలే యీగంథము కవి వ్రాయుటకుఁగా రణమని యాంధ్ర కవుల చరిత్రమిట్లు నుడువుచున్నది.
సీతారామరాజు గారిట్లు పరరాజులను జయించుటయేకాక తురక
దొరలు మసీదులకిచ్చిన భూములను, పూర్వ రాజులు
బాహ్మణుల కిచ్చిన మాన్యములను గూడ లాగుకొని ప్రజలను
సహితము క్షోభ పెట్ట నారంభించెను. ఈయన పెట్టుబాధలే సూ
రకవిని రామలింగేశశతకముచేయునట్లు చేసినవి. ” ఈ యూహ
సరియైనను గావచ్చును. - కొని ,యాకాలపు విజయనగర రాజ్య
వ్యవస్థకును బాగుగ గమనించి చూచినచో సీతారామరాజుగారి
చండశాసనత్వమును, పరిపాలనా ప్రావీణ్యమును, రాజనీతి
వైదుష్యమును నీ పూసపాటి రాజ్యమును గొప్పయాన్నత్యము
నకుఁ దెచ్చుటకుఁ గారణములయినవని చెప్పితీరవలెను. విజయ
నగరము వారికిఁ బక్కలోని బల్లెములవలె నుండిన ప్రబలులగు
గాజులను మన్నె రాజులను జయించి రాజ్యమును విస్తరింపఁజేసి
నదీ సీతారామరాజుగారే. సులభముగ లొంగుపాటులోనికి రాని
జమీదారులకు దమ చాకచక్యను. చేఁ బట్టి తెచ్చి విజయనగ
గా రాగృహబద్ధులుగం జేసెడివారు. ఇప్పుడీ పట్టణమునఁ
గోటను నెదుటనున్న '( బొంకులదిబ్బ.' ,యను బయలు 'నాఁడు
రమునఁ గా
“ బంకూల్, "-అనఁగా జైలుఖానా. యుండినస్థలమని యూహింపవచ్చును. బంకూల్' శబ్దవికారమే బొ.కులయినది. ఆకారాగారము శిధిల మైసశింప నాస్థలమును జనులు బంకూల్ దిబ్బయనెడివారు. అదియే రానురాను బొంకులదిబ్బయైనదని నిశ్చ
యముగా మనము చెప్పవచ్చును.
పూసపాటి వారి కైఫీదు, డిస్ట్రిక్టుమ్యాన్యూల్, డిస్ట్రిక్టుగెజటీయరు మొదలగు గ్రంథముల యందు నీయఁబడిన యానాఁటి వృత్తాంతమును జూచినపుడు సీతారామరాజు గారి క్రౌర్య ము, నిరంకుశాధికారము మున్నగునవి వెల్లడియగును. కాని “యప్పటి యవసరమును బట్టి, యాతఁడా రీతిగఁ జేయపలసివచ్చె'నని దృఢముగఁ జెప్పవచ్చును.
నూతన రాజ్య నిర్మాణమునఁ గలుగు కష్టములను న్యాయబుద్ధితో సరయఁ బయత్నింపని వారలీ సీతారామరాజుగారి పరిపాలనా విధానములను నిందింపవచ్చును. ఇల్లు నేఁ జెప్పఁ బూనినను సీతారామరాజుగారి యందెట్టి లోపములును లేవనిచూప నేనుద్యమింప లేదు. సూరకవి బలవత్తరమగు నీ దూషణ గర్భ కావ్యము {Satire) నిహేతుకముగ వ్రా సెనని నాయభి ప్రాయమెంత మాత్రముగాదు. తగిన కారణములుండిన నుండ
వచ్చును. ఏది. యెట్లున్నను నీశతకము పండిత పామర జనరంజకమై యాంధ్ర వాజ్మయమునఁ గల శతక రాజములలో నుత్తమ స్థానమధిష్టించి యున్నది. కవితా ధోరణిని తెలుపఁ గొన్ని పద్యములిచటఁ బొందుపంచు చున్నాఁడను.
సీ. మాన్యంబు లీయ సమర్థుఁ డొక్కఁడు లేఁడు
మాన్యము , ల్చెక్కుప. సా. మంతులంద
ఱెండినయూళ్ళగో డెఱింగింపఁ డెవ్వఁడుఁ
బండినయూ ళ్ళెన్న బౌండులంద
తితఁడు పేద యటంచు , నెఱిఁగింపఁ డెవ్వఁడుఁ
గలవానిసిరి యెంచఁ గలగు చాలం
దనయాలి చీకటి , తప్పెన్న -డెవ్వఁడుఁ
బెఱకాంత ఱం కెన్నఁ బెద్దలంద
తే. ఱిట్టిదుష్టుల కధికార • మిచ్చినట్టి
రాజు నునివలేఁగాక ర్నయుల ననఁగ
నేమ సని యున్నయి.సత్కవీంద్రులకును
రామలింగేశ రామచం • ద్రపురవాస.
సీ. పదుగురుఁ గోతి వెం • బడి సంచరింపరే
వాహకు ల్లేరెశ • నంబునకును
గంగి రెద్దుకు లేనే మనతూర్యరావముల్
కలిమి గల్గదె ది వార కామినులకు
బులి. గోవుఁ జంపి ననక్కలను బోషింపదే
స్థూల కాయము లేదె దున్నలకును
పి, ఫుఁటికి లేదె • పుట్టంబుఁ జుట్టుట
వేణుధరుం డెద్దు వెంట రాడె
న్యాపద్దతి నడువని యవని పతికి
నెన్ని చిన్నెలు గలిగిన నెందుకొఱకు
సంతమున జు-డవలయు, నా యయ్య సుఖము
రామలింగేశ రామచం • ద్రపురవాస.
సీ. భయ మేల కొండంత , పగతుఁడు నాకున్న
మేరువు వంచిన మేటి గలుగ
నాకేల శోకసం తాపంబునను గుంద
శీతాంశుమాళి 'నా చెంత నిలవం
దస్కరభీతికిఁ • దల్లడిల్లఁగ నేల
ప్రమధులతో శూల • పాణినిలువ
నగ్ని భీతికి నాకు • నళుకుఁ జెందఁగ నేల
గంగాధరుండు నాకడ వసింప
తే. ననుచు నెంతటి కేంతటి • కలుకు లేక
నమ్మియుంటిని నీ ప్రాపు • నామనమున
జాగరూకుఁడవై నన్ను • సాకు మయ్య:
రామలింగేశ రామచంద్రపురవాస.
పరిసమాప్తి.
ఇంతదనుక" సూరకవి గ్రంథముల నొక్కొక్క దానిని
బ్ర త్యేకముగఁ దీసికొని నాకుఁదోచిన విధమున విమర్శనముఁ
గావించితిని. ఇక నొక్కయంశము చర్చింపవలసి యున్నది.
తనకుఁ బూర్వులగు కవులనుసరించిన మార్గములనే యితఁడను
సరించెనా, లేక కొత్తతోవల నవలంబించెనా యన్న సంగతి
పరిశీలింప వలసియున్నది. ప్రథమాంధ్ర కవియు వాగనుశాస
నుఁడును నగు నన్నయభట్టు మహాభారతమున :
ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథా కవితార్థయు క్తితో
"నారసి మేలునా నితరు లక్షరరమ్యత నాదరింప".
అని వాసియున్నాడు. దీనినిబట్టి సారమతులగు కవీంద్రులు, అక్షర రమ్యతనాదరింపరని తేలుచున్నది. ఇంతియె గాక తాను "నానారుచిరార్థసూక్తినిధి"యని చెప్పుకొనియెను. కాఁబట్టి ప్రశంసనీయమగు కావ్యమునందుఁ బ్రసన్నమగు కథయు, ప్రసన్నమగు కవితయు, నర్థయుక్తియు నుండవలెనని యామహాకవి యభిప్రాయము. అంతియె గాని యాలంకారిక గ్రంథముల యందుఁజెప్పఁబడిన విశేషగుణముల నన్నింటిని బ్రధానముగఁ జెప్పలేదు. కవి బ్రహ్మయగు తిక్కన తన నిర్వచనోత్తరరామాయణమున
ఉ. భూరివివేక చిత్తులకుఁ ◆ బోలు ననం దలఁపన్ దళంబులన్
సౌరభ మిచ్చుగంధవహు ◆ చందమునం బ్రకటంబుచేసి యిం
పారెడుపల్కులం బడయ ◆ నప్పలుకు ల్సరిగ్రుచ్చునట్లుగాఁ
జేరుప నేరఁగా వలయుఁ ◆ జేసెద నేఁ గృతి యన్నవారికిన్.
క. తెలుగుకవిత్వము చెప్పం
దలఁచినకవి యర్థమునకుఁ ◆ దగియుండెడు మా
టలు గొని వళులుం బ్రాసం
బులు నిలువక యొగిని బులిమి ◆ పుచ్చుట చదురే.
యని వాసియున్నాడు. ఇందువలన, శబ్దములను జక్కగఁగూర్చుటయు, యతిప్రాసములకొర కర్థగౌరవమును జెఱుపకుండుటయు సత్కవీంద్రమార్గమని తెలియుచున్నది. మఱియుఁ దనకవిత్వము (సరసమధురవచోగుంభనసుప్రసాదసంబోధన గోచరబహువిధార్థతాత్పర్యము" కలిగి యుండునని కూడఁ జెప్పియున్నాడు. దీనం బట్టి చూడ నక్షరరమ్యతయు, నర్థగౌరవమును సత్కవీంద్రసమ్మతమనియే తేలుచున్నది. నన్నయకాలమున నక్షరరమ్యత కంతయాదరము లేక పోయినను దిక్కన
నాటికి గొంతవఱకుఁ గలిగినదని యూహింపవచ్చును. మొత్తము మీఁద నాంధ్రమహాభారత కవులు శబ్దాలంకారములకు - నంత గఁబ్రాముఖ్యము నిచ్చి యుండ లేదని వారి కవిత్వము వలస స్పష్టమగుచున్నది.
కొంతకాలమునకుఁ బిమ్మట నాంధ్ర భాగవత కృతికర్థ
యగు బమ్మెర పోతనామాత్యుడు తన గ్రంధము, శబ్దాలం
కారములను విరివిగా జొనిపి నట్టి కవితను సత్కవీంద్రనాదజరణీయ
ముగఁ జేసినాడు. పిదపవచ్చిన యాంధ్ర కవితా పితామహుఁ
డగు నల్లసాని పెద్దనార్యుడు తాను రచియించి సింహవనలో
కనమను ” నుత్పలమాలిక యంచుఁ గవిత్వరీతులెట్లుండవలెనో
చెప్పియున్నాఁడు. ఆపద్యమును. బూర్తిగ నిచట నుదాహరిం
పనసకాశము లేక యందలి సౌంశమును జెప్పుచున్నాడను.
కవిత్వము మెఱుగుగలిగి -రుచికరమయి, మనస్సు నాకాక్షించు
శక్తిగలదియై, కిన్నెరస్వరము వలె -మనమును బర వశత్వమునొం
దించి వింశలగు కోర్కెలను "బుట్టింప దగిన, గమకముతో రస
మును విరజల్లుచుండ వలెను. ఇట్టియాదర్శమును బెద్దనార్యుం
డు ప్రదర్శించినను, "పూలు మెంఱుంగులన్ " అనెడి మాలిక
ను జూచినప్పుడుశ్రవణ సుఖమునకు నర్థగౌరవముతో సనూ
నమగు ప్రాధాన్యము నతఁడం గీకరించి నట్లగపడును. అంతియే
గాక యాతడు శ్రావ్యతకు బక్షపాతము చూపెసని కూడదోచును
పెద్దనామాత్యుడు శశాబ్ద ప్రారంభమునను నాంధ్రకవిత్వమునకొక విధమగు క్షీణ దశ
27
పొడసూప 'మొదలు పెట్టెను. ఆ సమయమున నే సూరకవి గ్రంథ
రచన కారంభించెను. పెద్దనగారి యుత్పలమాలిక యందలి విష
యముల నతఁడు చక్కగఁ బరిశీలించెనని మాకుటుంబమునందు
నిలిచి యున్న సూరకవిగారి నాఁటి తాళపత గ్రంథములను
బరీక్షించినఁ దెలియఁగలదు. నన్నయ తిక్కనాదుల కవిత్వమునం
దాతనిఁకిగల గౌరవమత్యధికము, 'పెద్దనామాత్యుని శ్రావ్య
తాపక్ష పాత మతము నతఁడవలబింపక నన్నయాదుల మార్గ
మునే ప్రశస్తమని యెన్ని నట్టులు సూరకవిదియగు నీకిందిపద్య
మువలన విశదమగుచున్నది.
<సీ. యతి, యుక్త వా • క్యానుగతి నంటవలయు వ
త్సంబు ధేనువు వెంటఁ • దవిలినట్లు
మెట్టుమీఁదను గాలు • పెట్టఁగై దండ యం
దిచ్చినట్టులు పాస • మెనయవలయు
సానఁబట్టినమణి • చందానఁబద మధ్య
నారీశుభంగి బం - థంబువలయు
దివి వెలుంగు మెఱుంగుఁ • దీఁగెయట్లర్థంబు
తేట తెల్లంబుగాఁ • తెలియ వలయు
గీ. నలఁతి తొలపడ్డచంద్రమం • డలమువలన
జలజలను రాలు నమృతంపు • జాలులీల
రసము తులకింపవలె నట్టి • రమ్యకవిత
రసిక రస నారిరంస చే • బ్రబలకు న్నె.
ఇట్టి యాదర్శమును దన ముందిడుకొని కవిత్వము చెప్పిన
వాఁడగుటచేత . సూరకవి కవిత్వము సత్కవి సమాదరణీయమై
కావ్యరచనా విషయమున నూతన మార్గమును జూపు రా
మలింగేశ శతకమును వ్రాసి' వన్నె కెక్కెను. పూర్వ కవుల
యెడలఁ దనకుఁగల గౌరవమును, తన బుద్ధి స్వాతంత్యమును
నితడు, కవిత్వమర్యాదల యందు, కార్యనిర్మాణము నందును
వెల్లడించియున్నాఁడు. సూరకవి సమకాలికులచేఁ జెప్పఁబడినది
గా వాడుకలోనున్న యింక్రింది పద్యమున, నతనికి నాంధ్రసా
రస్వతమునఁగల యున్న తస్థానమును నిరూపించుటకుఁగా నుదా
హరించి ధన్యవాదములం జేయుచు నీ మహనీయుని పవిత్రచరి
తమును నింతటితో ముగించు చున్నాఁడను.
ఉ. ఆధునికుల్ కవీంద్రులు స • హస్రము లుందురుగాక నీవలెన్
మాధురిగల్గు నేకవన • మార్గము తిక్కనసోమయాజి శ్రీ
నాధుఁడు ముక్కు తిమ్మకవి • నాఁడు ప్రసిద్ధులుగాకిటీవలన్
గాధితమయ్యె నీవలనఁ • గాదె కవిత్వము సూరసత్కవీ.
సంపూర్ణము
COMPOSED BY V. JAGANNADHAN:-S. V. V. Press, VIZAINAGRAM.