Jump to content

అడిదము సూరకవి/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

చెఱువుమీఁది పద్యములు.

(కృతికర్త అడిదము రామకవి.)


ఈపద్యములు సూరకవి ప్రణీతమని సామాన్యమగువాడుక. కాని యియ్యది మాకుటుంబములోఁ బారంపర్యముగ వచ్చచున్న వాడుకకు విరుద్ధము. కాఁబట్టి పద్యముల కృత్వమును గొంతవఱకుఁ జర్చించి యందలి సత్యాసత్యములు పా ఠకమహాశయులకు విశదపజచెదను.

ఈ వంశజుల చే మూలపురుషుఁడుగ నెన్నఁబడు నడిదము నారప్పకు * శ్రీవిజయనగర సంస్థాన ప్రభువులలో నొకర గు కృష్ణమరాజు మహారాజులుంగారు రేగయను గ్రామమునఁ గరణికము చేయుటకుఁ గొంతమాన్వమును దయచేసిరి. .


  • * యీయినాం సుమారు 300 సంవత్సరములకిందటస్నదుదార్కు (అడిదం నారప్పకు) మజ్కూరు మిరాశీ పని చూడగలందులకు శ్రీ యర్ర కృ ష్ణం దేవు శ్రీ నల్ల కృష్ణం దేవు మహారాజులం గార్లు మజ్కూరులో కొంతమా న్యం దయ చేయించినారు. " మహా రాజశ్రీ జి. యన్ . టయలరు యస్కోయరున్దొరవారి యినాముల దరియాప్తులో చేరిన విశాఖపట్నం జిల్లా యిల్కావియనగరం సమస్థానం బాపతు భీమునిపట్నం సబు మేజ స్త్రీటు యిల్కా అన్నమరాజు "రేగ మిరాశీదార్లు ఆడిదం నారాయణప్ప సన్యాసిరాజు వగై రాలు దాఖలు చేసిన స్టేటు మెంటు, స్న 1727ఫసలీ 1892 సంవత్సరం.

10

ఈశ్వరానుగ్రహముచే నయ్యది నేఁటివఱకు నీవంశజుల యనుభ వములోనే యున్నది. వారిలో నొకకుటుంబము వారు రేగలోనే నివసించుచుఁ గరణికము నేఁడును జేయుచున్నారు. ఆ కుటుం బమువారిలో నొకఁడగు రామకవియే యీపద్యములను జెప్పెను.

...." అడిదమువారి యినాము భూములు అనుముల చెఱు” వనునొక చెఱువు ' కిందనున్నవి. ఈ యినాముభూముల మళ్ళ లోఁగొన్నిటిన త్తి నోముల చెఱునను నింకొక చెఱువు గలదు. ఈ నోముల చెఱువు పూర్తిగ నిండినపుడు మిరాశీ యినాము భూములలోఁ గొన్ని మళ్ళకు ముంపుగలుగును. ఆ నాఁటికాల మున నీ రెండవ చెఱువు పూర్తి గా నిండియుండ 'రామకవి మొ దలగు వారి భూములకు ముంపువలన " సస్య నష్టము గలిగెను. అంత రామకవి "రేగగ్రామము గుత్తదారగు దంతులూరు, అన్న మరాజుగారితోఁ దనకుఁ గలిగిన నష్టమును గూర్చి చెప్పుకొని నీటిముంపుతీయింపుఁడని యతనిని వేడుకొనెను. కాని అన్నమరాజుగారు రామకవి ప్రార్థకనలను బెడచెవినిఁ బెట్టిరి. కవికిఁగలిగిన బాధ తొలఁగసాధనము లేకుండెను. అంత రామకవి యీసమాచా రమంతయుఁ దన యేలికయగు శ్రీ విజయరామ గజపతి మహా రాజుసకుఁ దెలుప నిశ్చయించుకొని యొక యర్జీని బద్యముల తో వ్రాసి యామహా రాజునకుఁ బంపుకొనెను. ఆపద్యముల కే యర్జీద్యములని వాడుక. అవియిందుఁ బొందుపంచు చు న్నాఁడను.

సీ. అవధారు! దేవ! మ హాప్రభూ ! విన్న పం

బాఠితో త్తముఁడ శు ద్దాంధ్రకవిని. పేరురామన యింటి • పేరడిదమువారు. మాజాగభూపాల రాజు రేగ. నల్లకృష్ణకు మా నాయకాగ్రేసరుం డెఱకృష్ణక్ష్మాత , లేంద్రులచట గరణిక ధర్మంబు గల్పించి మాన్యంబు దయచేసి గది యాస్ప దంబు మాకు

గీ. నదియు నీయేఁడు దంతులూ , రన్న నృపతి సత్తముఁడు గ్రామ * మెల్లను , గుత్త చేసి చెఱువు బిగఁగట్టి ప్రజలుజే • జేపడంగా ముంపుగట్టించె వరిపొట్ట • ముంపఁదలఁచి.

సీ. విన్నవించెద నాదు ఆ వృత్తాంత మది కొంత చిత్తగింపు పరాకు సేయకుండఁ బొలములో నొకఁడేరు • పూన్పంగఁ జాలఁడు. గంగాభవానిఢాకకును జడిసి దుక్కి టెన్లను కొని దున్ను కొంద మటన్న - బదులియ్యం డెవ్వఁడు పాత నేబు ఏజోలియును లేక యింటనుండెద మన్న సొలుకు వచ్చుగం • టాలపన్ను,

+గీ. దేశముననాదు పొన్నూరు . తెన్ను గారు పంట పస లేదు. గంటాల • పన్ను పోదు - మీకు దయగాదు మునుపటి ఆ మిసిమిలేదు , అతులగుణదీప విజయ రా , మావనీప. . *

  • పొ|| నోముపొలముఁదా

+ పొ॥ దేశ నిసబత్తు.

మహారాజునకుఁ బద్యరూపమగునీయర్జీ పంపుకొనినను గార్యము లేకపోయెను. గుత్తదారుఁడగు అన్నమరాజుగారి వలనఁగాని తన ప్రభువులగు విజయనగరా ధీశులవలనఁ గాని తనకుఁగలిగిన బాధతొలఁగ కుండుటచేత వేవొండు చేయునది లేక యొక నాఁటియుదయమున రామన స్నానసంధ్యాను స్థానములు నిర్వర్తించుకొని తాటాకులు గంటము చేత నిడుకొని పొలము నకుఁ బోయెను. నీటిముంపు చేతఁ జెడుచున్న సస్యమును జూచి విచారించి తన బాధతొలఁగుటకుఁ దన కవితయే శరణమనియెంచుకొని కుత్తుక బంటి నీటిలో నిలువఁబడి గంగాభవానిని నుతించుచు నిట్లికపద్యమును వ్రాసి నాసిన 'తాటియాకును నీటి లోవిడిచెను.

<సీ. బ్రహ్మాండ ఖాండసం • పత్తి కుక్షిని గల్గు
పద్మ నాభుని పదా • బ్జమునఁ బుట్టి
సకలరత్నాకర • స్థానమై యుప్పొంగు
నంబుధీశునిచర ణంబు దొక్కి,
పరమతత్వజ్ఞుఁడై , పరఁగళంతను మహీ
రమణువామాంక భా • గమునఁజేరి
యఖిలలోకాధ్యక్షుఁ * డై మించి విహరించు
శివుజటాజూటాగ్ర సీమ నిలిచి


తనరునీవంటీ ధన్య కు త్తమము గాదు
పూసపాటీమహాస్థాన , భూమియందుఁ
గాలు దొక్కంగ నోడుఁజం , డాలుఁడయినఁ
గదలు మిట మానీ దివిజగం , గాభవాని.

ఇట్టి భూషణ వాక్యముల చేతఁ దన సంకల్ప మీడేరమిం జూచి రామన కుపితుఁడై యీకింది రీతిని గంగను దూషించు చు నాలుగుపద్యములను జెప్పెను.

 సీ. ఆదిభిక్షుం డీతఁ • డని రోసి విడియాకు
గొనివచ్చి యిట నిల్వఁ • గోరితొక్కొ
జగడాలచీలి నై , సవతితోఁ బోరాడి
యీగి వచ్చిచోట • డాఁగిలొక్కొ,
నిద్దరాంగన లెల్ల • నీఱంకు నెలిపుచ్చ
దూబవై యిచ్చోటఁ • దూఱితొక్కొ
బీదబాపలఁ గష్ట • పెట్టుటకై మిన్ను
దొలఁగి యిచ్చోటను • నిలిచితొక్కో
వలదు ద్విజభూమి కాల్నిల్ప • వరుసగాదు
రవ్వ నీ కేల తగదంబు | రాశి కరుగు
నాతి ! యతఁడు కాఁడ టె పిన్న , నాఁటిమగఁడు
కదలు మిట మాని దివిజగం - గాభవాని.

సీ, భావింప నిలువెల్ల ఆ భంగంబులే కాని
భంగము ల్తొలఁగుటె • ప్పటికీ లేదు
తిరుగుచో వంకర • తిరుగు టింతియ కాని
తిన్నఁగాఁ దిరుగుట , యెన్నఁడెఱుఁగ
మొనసి రేయిఁబగళ్లు - మొరయుచుండుటె కాని
మొరయ కూరకయుండు • టెఱుఁగ మెపుడు
పాలకల్మి నిరోసి • పల్చనగు టెకాని
పలుచనిగతి మాని , మెలఁగు టెటుఁగ
మనుచు నీలోన నీవైన యవగుణంబు
లరసి లజ్జించి దివినుండ • కరుగుదెంచి

నిలువు నీ రైననీ విందు , నిలిచితొక్కొ,
కదలు మిట మాని దివిజగంగాభవాని.

సీ. పచ్చిమాంసము కల్లు • భక్షించి మత్తెక్కి
రాణించు తిరగుప • రాంసు లైన
గంజాయి గుండ హు క్కాలుడి కేడి నీళ్లు
దావి మౌన్స డెడు తురష్కులైన
గోవులఁ బడ మొత్తి కోసి ముక్కలు మెక్కు
సమదాంధు లగుకొండ • సవర లైన
తెరవాట్లు గొట్టి క • త్తెరదొంగలై చాలు
వాలించు తిరుగుచం • డాలు లైన
భూసుర క్షేత్ర మిది యన్నఁ • బోఁడొకండు
చిన్న పొలములు, బాహ్మణ, క్షేత్రమునకు
ఘాతుకత్వంబు సేయుము • ష్కరులు గలరె
కదలు మిట మాని దివిజగం , గాభవాని.

సీ, కృతకోద్రు లాయెనా కీలోగ్ర ఫణిఫణా
సేక ఫూత్కారవ ల్మీకచయము
విరిదోఁట లాయెనా • కఱకు కంటకకంట
కాంకురవిస్ఫురి • తాగచయము
పువుఁబాన్పులాయెనా • నవమంజుల శ్వేత
లవణాలవాలమౌ • చవుటి నేల
బొమ్మరిండ్లాయెనా • భూరి భేకాండ జా
ధారమై తనరు కే • చారచయము
నీకు విహరింప వసతులై నివ్వటి లెనె
చిన్న పొలములు బాహ్మణ • క్షేత్రములకు
ఘాతుకత్వంబు చేయుము • ష్కరులు గలరె
కదలు మిట నూని డివిజగం • గాభవాని.


ఈ రీతిగఁ బద్యములు వాసి. వాసిన 'తాటాకులను నీటి లో విడువ నట్టిదూషణను సహించి యచటనిలిచి యుండుట యుక్తముకాదని తెలుపుటకో యనఁ జెఱువులోని నీరు గండి తెగిపాఱిసముద్యగామియయ్యె . కవిఁ గలిగిన బాధ యంతటితోఁదొలఁగెను. రామన కృతకృత్యుఁడై పొలమునుండి యింటి కేఁగెను.


ఈపద్యముల రచనతో సంబంధించి పారంపర్యముగ నొకవింత చెప్పఁబడుచుచున్నది. మీఁద వాయఁబడిన యర్జీ- పద్యములలో మొదటి దానియెత్తు గీతమునందు(మాపు ట్టిముంపఁ దలఁచి "యని ప్రయోగించుటచేతఁ గవికిఁ గళతన స్టమైనదఁట. "వరిపుట్టి ముంపఁదలఁచి ” అని చెప్పనుద్దేశించి నను దైవికముగ నూపుట్టి ముంపఁదలఁచి యని ప్రయోగింప బడెనఁట. ఈ గాథ యొక్క సత్యాసత్యములు చర్చింపనవకాశమే మియు "లేదు. కుటుంబములోఁ దరముల వెంబడివచ్చుచున్న యంశమగుట చే నిందుఁ బొందుపఱుప సాహసించితిని.

పద్యముల కతృత్వమును గూర్చి చర్చ.

1. సూరకని తనతండ్రియగు బాలభాస్కరకవి మరణా నంతరము స్వగ్రామమగు భూపాల రాజు రేగ విడిచి చీపురుపల్లెకు సమీపమున నున్న రామచందపురమును దనకు నివాస స్థలముగనేర్పఱచుకొనెనని మూఁడవ ప్రకరణమున వాసి యుంటిని.ఇంతీయ గాక. .


చ. గరి సెలువ్రాత గాని యొక • గంటెఁ డెఱుంగము మన్య దేశముల్
తిరిగి యభీష్టవస్తువులు • దెచ్చి భుజింతుము సర్వకాలముల్
నురచిర సత్కవిత్వవిధి • సూరకవీందున కేలగల్లెల గం
చరమును రేగ ? మేఁక మెడ • చన్ను లవంటివి రెండు మాన్యముల్

,


అను నీపద్యమును బట్టి సూరకవికి రేగలో మాన్వమున్నదని తేలుచున్నను నతఁడు కరిణిక పువృత్తిచే జీవనము చేయక కవితావృత్తి చే దేశాటనము చేయుచుఁ గాలక్షేపము చేయుచుండెనని దృఢముగాఁ జెప్పవచ్చును. దీనిని బురస్కరించు కొని సూరకవి రామకవిగార్ల కాలమున రేగ గ్రామమునఁ గరిణికము చేయుచున్న వాఁడు సూరకవి కాఁడనియు, రామకవిగాని మఱియొకరు గాని కరణికము చేయుచుండిరనియు మనమూహిం పవచ్చును. ఇంక మొదటినుండియు ననఁగా రామకవికిఁ బూర్వమునఁ దరువాతను గూడ నీరామకవివంశజులే నేటికిని రేగ గ్రామమునఁ గరణికముచేయు చున్నారు. కాఁబట్టి నీటిముంపు తగాయిదా విమము గుత్తదారు అన్నమరాజు గారికిని గ్రామ కరణము రామకవికిని గలిగియుండునని 'చెప్పుటయె యుక్తము గాని పై యూరనుండి కరిణికముచేయని సూరకవికి దానితో సంబంధమున్నదని చెప్పుట యెంతమాత్రమును సరికాదు.


2. ఇదిగాక యసలు సనదుదారగు అడిదము నారప్పకు జినలచ్చన్న, కిత్తన్న, నీలాదియను ముగ్గురు కుమారులుండిరి. సోరప్ప యనంతర మీముగ్గురును బిత్రాజ్తి తమగు మిరాశీయి


నామును బంచుకొని యనుభవించు చుండిరి. ఈయినాము భూముల నత్తియున్న నోముల చెఱువు పూర్తిగ నిండునపుడు కిత్తన్న వంతునకు వచ్చిన పొలమునకే ముంపుతగులును గాని తక్కినవారి పొలముల కంతగా ముంపుతగులదు. అందుచే నీటి ముంపువలన సస్య నష్టమును బొందిన రామనకే దీనితో సంబంధముగలిగి యుండెనని యూహించుట యుక్తముగాని ముంపు వలన నెట్టినష్టమును బొందని సూరకవ్యాదులకు సంబంధము కల్పించుట యుక్తముగాదని నాయభిప్రాయము.


3. మాయింటనున్న వాతప్రతులలోను మాయూరిలో నాస్నేహితుల వద్దనున్న ప్రతులలోను. "పేరురామన ” అని యే పాఠము గానవచ్చుచున్నది. మాగ్రామమునఁ గల పత్రుతులలో నెల్ల ఆకి సరవయ్యయను వైశ్యునిచే సంగ్రహింపఁబడినది ప్రాచీన మైనదిగఁ గానబడుచున్నది. ఇయ్యది యఱవది సంవత్సరముల కిందటి కాలమున గ్రామ పురోహితులగు రుద్రా, వజ్జల నరసింహము గారిచే వ్రాయఁబడినది.


4. ఇదిగాక సుమారు 50 సంవత్సరముల క్రిందటఁ గాలధర్మ మొందిన సూరకవి ప్రపౌతుఁడగు బాలభాస్కరకవి చె ప్పిన యీకింది సీసపద్యముచేత చెఱువుమీఁది పద్యములతో సూరకవికి సంబంధము లేదనియు వానిని రచించినది. రామకవి : యనియు స్పష్టమగుచున్నది. 11

<సీ. విజయరామక్షమా - విభుఁదిట్టి భాసిల్లె
ధరణిలో మాప్రపి • తామహుండు .
గంగాభవానిని గడుదిట్ట యైతిట్టి
ఖ్యాతిఁ జెన్నొందె మా • తాతయొకఁడు,
నెలయంగ మగటిప ల్వెంకనఁ బడఁబెట్టి ,
తగఁ దెగటార్చె మా , తండ్రి గారు
ఆరీతి గాదిట్టి , యమపురంబునకును"
నిన్నుఁ బంపఁదలంచి యున్నవాడ పొగడఁ


గాచుకొమ్మిటుమీఁద న • ఖండచండ,
దారుణోద్దండ కవితాగ • భీరశక్తి
నీతరముగాదు కలహించి • నిర్వహింప
జల్ల పట్టాభిరామ నీ • చగుణధామ

.


ఈపద్యమును జెప్పిన బాలభాస్కరకవి రామకవికి వరుస కు మనుమఁడు. అందుచేతనే యతఁడు "........ఖ్యాతిఁ జెన్నొం డెమాతాత యొకఁడు ” అని రామకవిసి ప్రశంసించినాఁడు. సూరకవి విజయరామగజపతి మహా రాజునకు నాస్థానకవిగా నుం డెనని యైదవప్రకరణమున వ్రాసియే యున్నాఁడను. మాకు టుంబములోఁ దరముల వెంబడి వచ్చుచున్న వాడుకను గూడఁ బ్రబల ప్రమాణములలోఁ జేర్పఁదగినదిగా యోచించి మీది యంశముల నన్నిటిని బట్టి యాలోచించిన చోఁ జెఱువుమీది పద్యములతో సూరకవి కెంతమాత మును సంబంధము లేదనియు వానిని రామకవియే రచించెననియు స్పష్టముగాక పోదు, . ఇప్పటికీ, సుమారు నూరునూటయేఁబది సంవత్సరములు నుండి యీ పద్యములు సూరకవి ప్రణీతమని బహుళ వ్యాప్తిగాం చినవి. ఇట్టి వాడుక మాకుటుంబములో వంశపారంపర్యముగ వచ్చుచున్న వాడుకకు విరుద్ధముగా నున్నది. అట్టి విరుద్ధమగు వాడుక నిలిచి యుండుట యుక్తము కాదని యెంచి యందలి సత్యాసత్యములను లోకమునకు వ్యక్తపఱచుట నావిధియని తలఁచి యీవిమర్శనమును జేసితిని.