Jump to content

అక్షరశిల్పులు/అబ్దుల్‌ ఆజాద్‌ ఖాన్‌ పఠాన్‌

వికీసోర్స్ నుండి

అబ్దుల్‌ ఆజాద్‌ ఖాన్‌ పఠాన్‌:
ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలో 1971 జూన్‌ ఒకటిన జన్మించారు. తల్లితండ్రులు: ఇమాంబి, మహబూబ్‌ ఖాన్‌. చదువు: బి.ఎ(తెలుగు).,విద్వాన్‌ (హింది). 2003లో ప్రచురితవున 'ఓ గులాబీ ప్రేమగీతం' కవితతో సాహిత్య వ్యాసంగం ఆరంభం. కవితలు,
వ్యాసాలు ప త్రికల లో ప్ర చురితం. పలు సత్కారాలు పొందారు.

సాహిత్య-సాంస్కతిక కార్యక్రమాల ఏర్పాటు పట్ల ఆసక్తి. మతసామరస్యం ప్రధాన ప్రాతిపదికగా సర్వమత సమ్మేళనాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ. ప్రస్తుతం ప్రజాశక్తి దినపత్రికకు విలేఖరిగా పనిచేస్తున్న ఆయనకు సామాజిక, రాజకీయాంశాల మీద రచనలు చేయడం ఇష్టం. చిరునామా: పఠాన్‌ అబ్దుల్‌ ఆజాద్‌ ఖాన్‌, రాచర్ల గ్రామం, రాచర్ల మండలం, ప్రకాశంజిల్లా, 523368, దూరవాణి:08405-247414, సంచారవాణి: 93916 74562.


అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌:
విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరంలో 1970 మార్చి 21న జన్మించారు. తల్లితండ్రులు: మదీనా, కాశింబీబి. ఉద్యోగం: విశాఖపట్నం నావెల్‌డక్‌ యార్డ్‌లో టెక్నీషియన్‌. ముస్లిం గురువు షేక్‌ సత్తార్‌ ప్రోత్సాహంతో 1979లో 'శంఖుస్థాపన' కవిత రాయడంతో సాహిత్యరంగ ప్రవేశం. కలంపేర్లు: మహోదాయ, హరిóఓమ్‌. కవితలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం. పలు కవితలు ఆంగ్లం లోకి అనువాదం. 'శంఖుస్థాపన' కవిత 2000లో ఆంగ్లంలోకి, 'గుజరాత్‌గాయం' కవితా సంపుిటిలోని

'ఖబర్దార్‌' కవిత పలు జాతీయ భాషల్లో తర్జుమా అయ్యింది. అవార్డులు- పురస్కారాలు: సాహితీ సరస్వతి (విశాఖ ప ట్నం), వచన కవితా సురబి (మచిలీపట్నం). ఆధ్యాత్మిక ప్రసం గాలు చేయడం , శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం, హరికథలు చెప్పడంలో దిట్ట. రచనలు: హరి:ఓమ్‌ (1997) తదితర కవితా సంపుటాలు. లక్ష్యం: త్యాగరాజు, అన్నమా చార్యులు, రామదాసు కీర్తనల ఆలాపన, పరిశోధన, ప్రసంగాల నిర్వహణ. రచనల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం సాగించాలని, పరమత సహనం, మతసామరస్యం, ప్రగతిశీలత సాధించాలన్నది ప్రధాన లక్ష్యం చిరునామా: ముహమ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌, 15-7-12, సంతోషిమాత కోవెల వీధి, నిదానందొడ్డి, అనకాపల్లి -531002, విశాఖపట్నం జిల్లా, సంచారవాణి: 92963 58324.

అబ్దుల్‌ బాసిత్‌ షేక్‌: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రాంపూర్‌లో 1968

30