అకళంక చరిత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పల్లవి:
అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనఘానుతా 

చరణం:
అనసుయ తనయ అమృతైక నిలయ అసురాళి విలయ అఖిలాభయా

మహితాత్రి పుత్ర మహనీయ గాత్ర మహిమాతి చిత్ర మిహిరత్ర

యోగోపదేశ యోగావళీశ రోగైక నాశ రాగాంకుశ

గుణరమ్య సార గుణి చిత్త చోర గుణ భేద హార గురు సుందర

యతిరాజ రూప హత భక్త పాప శ్రుతివర్గ గోప కృతసత్కృప 

జిత దుర్వివాద హత సర్వభేద సతత ప్రమోద శ్రీ సచ్చిదానంద