అంగజజనక సారంగనయన నీకు మంగళం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
అంగజజనక సారంగనయన నీకు మంగళం జయమంగళం ||అంగజజనక||

అనుపల్లవి:
మునిజనములకు జీవనమనదగు పా
వనమైన మీ పాదవనజములకు ||అంగజజనక||

చరణం1:
వనజమునను నాల్గుముఖముల బాలుని
కనుగొన్న మీనాభికంజమునకు ||అంగజజనక||

చరణం2:
అందముగాను యాయిందిర కిరవైన
సుందరమైన పూదండ యురమునకు ||అంగజజనక||

చరణం3:
సొగసైన కస్తూరిచుక్క వాసనలీన
తొగరేని దెగడు నీనగుమోము దమ్మికి ||అంగజజనక||