Wikisource:రచ్చబండ

Wikisource నుండి

రచ్చబండ
వికీసోర్స్‌కు మీ అవసరం ఉంది. రండి చేతులు కలపండి. అందరికీ అందుబాటులో ఉండే ఒక తెలుగు మహా గ్రంథాలయము తయారీలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు ఇక్కడ కొత్త గ్రంథాలు చేర్చవచ్చు, లేదా వివిధ గ్రంథాలను చేర్చుటకు జరుగుతున్న కృషిలో పాల్గొనవచ్చు. ఈ విషయమైనా ఏదైనా సహాయము కూడా తీసుకొనవచ్చును. మరిన్ని వివరములకు మీరు తెలుగు వికీ సభ్యుల సమూహముని చూడగలరు. Join this group for more discussions or help.


విషయ సూచిక

[మార్చు] Friendship Day - మెయిల్

"నా అభిరుచులు" లో "ఇతర సభ్యుల నుండి ఈ-మెయిల్ రానివ్వు" కనుక టిక్ చేసినట్లయితే మనము వికీ నుండి పరికరాలపెట్టె లోని "ఈ సభ్యునికి ఈ-మెయిల్ పంపు" ద్వారా ఇతరులకు మెయిల్ పంపవచ్చును లేదా మనము ఇతరులనుండి మెయిల్ అందుకోవచ్చును. దీని వలన మన ఈ-మెయిల్ అడ్రస్ ఎవరికీ తెలియదు (సందేశములో తెలిపినప్పుడు లేదా వికీ నుండి కాక ఈ-మెయిల్ సర్వర్ నుండి తిరిగి రిప్లయ్ ఇచ్చినప్పుడు తప్ప).

ఇలా చెయ్యడం వల్ల మనము ఎవరినైనా సంప్రదించడానికి, మనల్ని ఇతరులు సంప్రదించడానికి అవకాశము ఉంటుంది.

మనమంతా కూడా వికీలో ముఖ్య భూమిక పోషించాలని, వికీసోర్స్ ఇంకా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రేపు Friendship Day సందర్బంగా వికీ సభ్యులందరికీ శుభాకాంక్షలు. అన్వేషి 10:35, 4 ఆగష్టు 2007 (UTC)

అన్వేషి గారూ, మీక్కూడా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు. ఎప్పట్నించో నిస్తేజంగా ఉన్న వికీసోర్స్‌ను పరుగులెత్తిస్తున్నారు. --వైఙాసత్య 03:16, 5 ఆగష్టు 2007 (UTC)

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

[మార్చు] ఈ వారం పద్యము

ఈ వారం పద్యము మరియు ఈ వారము శ్లోకము అనే శీర్షిక మొదటి పేజి లొ చేరిస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యము. పెద్దలు సమాలొచన చేసి ఆలోచించండి. పద్యము దాని అర్థము మరియు సన్నివేశము. ఏమంటారు సభ్యులు--S172142230149 00:48, 27 ఆగష్టు 2007 (UTC)

బాగానే ఉంటుంది కాని, వికీసోర్స్‌లో ఇప్పుడున్న కార్యకలాపాల స్థాయికి, పరిమితమైన సభ్యులు మాత్రమే పాల్గొంటున్నందున, అది మెయింటెయిన్ చేయడం కష్టతరం. ఒకవేళ వారానికో పద్యం మార్చగలిగితే అది వికీకోట్‌లో పెట్టడం మరింత ఉచితం - --Kajasudhakarababu 06:54, 28 ఆగష్టు 2007 (UTC)
కాసు బాబు తమ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. ఇక్కడే ఈ శీర్షిక నడపలేకపోతే వికీకోట్ లొ అసలు నడపలేము.--S172142230149 10:21, 28 ఆగష్టు 2007 (UTC)
వికీసోర్స్ కృషి బాగానే జరుగుతుంది కానీ సభ్యులు చాలా తక్కువ. తరచూ మార్చే శీర్షికలకు ఇంకా సమయముందని నా అభిప్రాయము కూడా..అన్వేషి గారు మీరేమంటారు? --వైఙాసత్య 11:36, 28 ఆగష్టు 2007 (UTC)
సుధాకర్‌బాబు గారూ, మళ్ళీచాలా రోజులకు ఇటు వచ్చారు ధన్యవాదాలు. శీర్షిక విషయంలో వారానికి ఒక పద్యాన్ని, శ్లోకాన్ని చేర్చడం కష్టమే అయినా అది ఒకరు కంటిన్యూగా నిర్వహించగలిగితే సాధ్యమే! S172142230149 గారూ మీరు నిర్వహించాలనుకుంటే ప్రారంభించవచ్చు లేదా వైజాసత్య గారు చెప్పినట్లు కొంతకాలము ఆగి, మీతో పాటు ఇతర సభ్యులు ఎవరైనా సరే వికీసోర్స్‌లో ముందు వ్యాసాలుగా పొందుపరచినట్లయితే తరువాత శీర్షికగా ప్రారంభించవచ్చు. --అన్వేషి 05:35, 29 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] annamacharya keetehana

హరి నీ ప్రతాపమున కద్ధ మెది లొకములొ సరి లెరె నీకెవరు సర్వెస్వర can you mail me the script please - Gvkamal

[మార్చు] శ్రీసాయి అష్టోత్తర శతనామావళి

శ్రీసాయి అష్టోత్తర శతనామావళి నేను స్తోత్రములు వర్గంలో చేరుస్తున్నాను. కాని స్తోత్రములు వర్గంలో అది కనిపించడం లేదు. ఎందువలన.Rajasekhar1961 06:36, 1 డిసెంబర్ 2007 (UTC)

[మార్చు] విశేష గ్రంధము ప్రతిపాదన

  • పానుగంటి వారి సాక్షి వ్యాసాలు నేను చేరుస్తున్నాను. వీనిలోని సాక్షి సంఘనిర్మాణము తెవికీ మూలాలలో మొదటిపేజీలో విశేష గ్రంధముగా ప్రచురించ గలరని అభ్యర్ధిస్తున్నాను.Rajasekhar1961

[మార్చు] విశేషగ్రంథము విషయమై...

రాజశేఖర్ గారూ,

మీరొక బృహత్ కార్యక్రమానికి పూనుకొన్నందుకు హృదయపూర్వక అభినందనలు. కానీ పానుగంటివారి మూలవ్యాసాలలో ఉన్న 'బండిఱ'లూ, అఱసున్నాలూ తీసివేశారేమి ? పానుగంటివారు వ్యావహారికవాది కాదని అందరికీ తెలుసు గదా !

- తాడేపల్లి

  • గ్రాంధిక భాష సవరణలు చేశాను.Rajasekhar1961 07:43, 9 ఫిబ్రవరి 2008 (UTC)

[మార్చు] ఆంధ్ర మహాభాగవతం ప్రాజెక్టు

శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం ప్రాజెక్టు లో పద్యాల్ని చేర్చడం నేనివాళే మొదలుపెట్టాను.


-తాడేపల్లి

తాడేపల్లి గారూ, మీరు ఆంధ్ర మహాభాగవతం ప్రాజెక్టు ప్రారంభించి అందులో పద్యాలు చేర్చటం ఆనందదాయకం. ఇక్కడి విషయాల్లో ఏమైనా సహాయం కావాలంటే తప్పకుండా చెప్పండి --వైఙాసత్య 18:53, 13 ఫిబ్రవరి 2008 (UTC)

[మార్చు] సుందరకాండము

ఎన్ ఎస్ రామారావుగారి సుందరకాడము వీకీ సౌర్స్లో చేర్చవచ్చా . --T.sujatha 16:03, 13 ఫిబ్రవరి 2008 (UTC)

రామారావు గారు దాన్ని ఎప్పుడు ప్రచురించారో. నాకు తెలిసీ ఆయన సుందరకాండ గానము చేయటం జీవితపు చరమదశలోనే ప్రారంభించారు. కాబట్టి ఇంకా కాపీహక్కులు ఉండిఉండవచ్చు. నిర్ధారించుకొని తెలియజేస్తాను --వైఙాసత్య 18:51, 13 ఫిబ్రవరి 2008 (UTC)

[మార్చు] చిన్నయ సూరి ఆంధ్ర ధాతుమాల

1930 సంవత్సరంలో చిన్నయ సూరి రచించిన 'ఆంధ్ర ధాతుమాల' Internet Archive నుండి అందరికీ అందుబాటులో ఉన్నది. ఇది 100 పేజీలుంది. దీనిని తెవికీ స్క్రిప్ట్ లోకి ప్రోగ్రాం ద్వారా మార్చే అవకాశం ఉన్నదా. సాఫ్ట్ వేర్ లో అనుభవం ఉన్న ఎవరివల్లనైనా ఇది సంభవమైతే వికీపీడియా మూలాలలోకి దీనిని మనం కాపీ చేయవచ్చును. ఇదే అనుమానం కొంతమంది నా స్నేహితులు కూడా అడిగారు. వాళ్ళదగ్గర ఉన్న ప్రాచీనమైన పుస్తకాలు మన తెవికీ కోసం వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాటిని ఒక్కొక్క పేజీక్రింద తెలుగులో టైపు చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి వాటిని ప్రత్యేకమైన ప్రోగ్రాంతో మనం ఉపయోగించుగలిగితే వికీ మూలాలకు మంచి బూస్ట్ అవుతుంది.Rajasekhar1961 06:28, 22 ఫిబ్రవరి 2008 (UTC)


మీరంటున్నది క్రీ.శ. 1830 వ సంవత్సరమా ? - తాడేపల్లి

[మార్చు] Significance of Telugu New Year

I want to Know the Significance of Telugu New Year Ugadi and names of the 60 years

[మార్చు] పద్యము

దళిత సాహిత్యానికి పద్య కవిత్వము వాహికగా ఉన్నదా?లింకు పేరు

[మార్చు] కొమర్రాజు గారి కథ

ఏబది వేల బేరము కథ పూర్తి పాఠం చేర్చాను. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు 1910 లో రచించి, ఆంధ్రపత్రికలో ప్రచురించారు. దీనిని మొదటి పేజీలో ప్రధాన వ్యాసంగా స్థాపించమని అభ్యర్ధిస్తున్నాను.़़़़

[మార్చు] పదకోశం జోడింపు

 తెలుగు  భాష కి ముఖ్యమైన  శబ్దరత్నాకరము  జోడించడం బాగుంటుందేమో? దానికి నేనేమి చెయ్యగలను?


                             రామం (ARSSRAO)

[మార్చు] పదకోశం జోడింపు

 తెలుగు  భాష కి ముఖ్యమైన  శబ్దరత్నాకరము  జోడించడం బాగుంటుందేమో? దానికి నేనేమి చెయ్యగలను?

అయ్యా, అన్నమయ్య పదాలను వికీ లో చేర్చేందుకు ఓ చేయి వేద్దామని ఆశ, ఆ పని చేస్తున్న వారు తమ ఈ-మెయిల్ అడ్రస్ చెబితే, వారిని offline సంప్రదిస్తాను. భారత, భాగవతాది కావ్యాలను నెట్టెక్కంచే పనిలో సైతం సహాయం చేయగలను

[మార్చు] సంశయ నివృత్తి

శ్రీయుతులు తెవికి సభ్యులకు,

నేనీ మధ్యనే అన్నమాచార్య కీర్తనల కోసం అన్వేషిస్తుంటే మీ వెబ్ సైట్ చూడటం తటస్ఠించింది. నా ఆనందానికి అవధులు లేవు. నాకు తెలిసిన కొన్ని సినిమా పాటలను ఇందులో సమకూర్చాలనిపించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలతో వ్రాయాలని కొన్నిటిని రాశాను ధైర్యం చేసి. అయితే ఎవరైనా వ్రాయ వచ్చో, లేదో ఖచ్చితంగా తెలియదు. దయచేసి తెలుప గలరు.

భవదీయుడు

సూర్యనారాయణ వులిమిరి నార్త్ కరోలినా, యు. ఎస్. ఏ.

[మార్చు] ఆదిశంకరాచార్యులవారి శివస్తుతి / ప్రార్థన

అసమాన ప్రవచనకారులు గురుస్వరూపులు బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు నాకు ఈ ప్రార్థనను అనుగ్రహించినారు. వారి పాదపద్మములకు భక్తిప్రపత్తులతోకూడిన నా నమస్సుమాంజలులు. (వారు స్తుతించగా విని వ్రాసుకొన్నది నేను కావున, వ్రాతలోగాని భాషలోగాని కనబడు లోపములు నావలననే కలిగినవి.)

శ్రీశంకరభగవత్పాదులవారి సగుణాననందనిజమంగళస్వరూప పరమశివ ప్రార్థన

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే |
సర్పైర్భూషితకర్ణకంఠవివరే నేత్రోద్భవైశ్వానరే |
దంతిత్వకృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే |
మోక్షార్థం కురు చిత్తవృత్తిమమలాం అంతైస్తు కింకర్మభిః | |

ఆదిశంకరాచార్యులవారు పరమశివుని అనేక విధములుగా దర్శించి స్తుతించి ప్రార్థించారు. అటువంటి ప్రార్థనాస్తోత్రరత్నమాలికలో ఒక మేలువజ్రము ఇది. యథాలాపముగా చూచితే, మౌనముగా చదివితే సాధారణ ప్రార్థనాశ్లోకము వలె తోచవచ్చు. నోటితో పలికితేగాని దీని భావకాంతి, భాషాసౌందర్యము ఆవిష్కృతముగాదు. సంస్కృత శ్లోకమైనప్పటికిన్నీ దీనిని మన తెలుగు వికి లో చేర్చాలని ఉన్నది; కాని సరైన వర్గ/ఉపవర్గములు కనపడుటలేదు (స్తోత్రముల పేజీని చూసాను). తెలుగు వికి కి క్రొత్తగా వచ్చాను;

అలాగే ఆదిశంకరులవారికి ఒక ప్రత్యేక పేజీని సృష్టించుటకు దయచేసి మార్గము చూపగలరు.

The vilence of A.P in Mahatma Gandhi

ఇ0డీయ