హలో...డాక్టర్/దీర్ఘకాల మూత్రాంగవ్యాధి (Chronic Kidney Disease)

వికీసోర్స్ నుండి

22. దీర ్ఘకాల మూత్రాంగవ్యాధి ( Chronic Kidney disease ) శరీరములో వివిధ అవయవముల కణజాలములలో జరిగే జీవవ్యాపార ప్రక్రియ వలన (metabolism) వ్యర్థపదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థపదార్థములను రక్తమునుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీరావయవములను పరిరక్షించి శరీరవ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను, పక్షులలోను ఆ బాధ్యత   మూత్రాంగములు (Kidneys) నిర్వహిస్తాయి.

వివిధ వ్యాధుల వలన మూత్రాంగముల నిర్మాణములో మార్పులు కలిగి వ్యాపారము నెలలు, సంవత్సరాలలో మందగిస్తే దానిని దీర్ఘకాల మూత్రాంగవ్యాధి (Chronic Kidney Disease  CKD) లేక దీర్ఘకాల మూత్రాంగవైఫల్యముగా ( Chronic renal failure ) పరిగణిస్తారు. దీర ్ఘకాల మూత్రాంగవ్యాధికి కారణములు :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి (వైఫల్యము) ఎక్కువ శాతము మందిలో శరీరపు ఇతర రుగ్మతల వలన కలుగుతుంది. అధిక రక్తపీడనము (hypertension), మధుమేహవ్యాధి (diabetes mellites), స్వయంప్రహరణ వ్యాధులు (autoimmune diseases  ex ; Systemic Lupus Erythematosus) కలవారిలో దీర్ఘకాల మూత్రాంగవ్యాధి పొడచూపవచ్చును. వయోజనులలో అధిక రక్త పు పోటు కలవారిలో 20 శాతము మంది లోను  మధుమేహవ్యాధి కలవారిలో 30 శాతము మందిలోను దీర్ఘకాల మూత్రాంగవైఫల్యము కనిపిస్తుంది.

మూత్రాంగములలో కలిగే వ్యాధులు మూత్రాంగవైఫల్యమునకు దారితీయగలవు. మూత్రముకుళములలో (renal corpuscles) కేశనాళికా గుచ్ఛ వ్యాధులు (glomerular diseases; IgA nephropathy,

245 :: membranoproliferative glomerulonephritis, nephrotic syndrome, post infectious glomerulonephritis) దీర్ఘకాల

మూత్రాంగవ్యాధి (chronic kidney disease ) కలుగజేయగలవు.

జన్యుపరముగా వచ్చే బహుళ బుద్బుద మూత్రాంగవ్యాధి (polycystic kidney disease) మూత్రాంగవైఫల్యమునకు దారితీయవచ్చును.

కొంతమందిలో తెలియని కారణాల (idiopathic) వలన మూత్రాంగవైఫల్యము కలుగుతుంది. దీర ్ఘకాల మూత్రాంగ వ్యాధి దశలు :-

మూత్ర ముకుళములలోని కేశనాళికాగుచ్ఛముల  వడపోత ద్రవప్రమాణము (Glomerular filtration rate - GFR) బట్టి దీర్ఘకాల మూత్రాంగవ్యాధిని 5 దశలుగా విభజిస్తారు.

రక్తములో క్రియటినిన్ విలువలు స్థిరముగా ఉన్నపుడు GFR ను క్రింద సూత్రముతో  అంచనా చేస్తారు.

కేశనాళికాగుచ్ఛముల వడపోత ద్రవప్రమాణము (GFR) ml / minute / 1.73 m2 = (140 - వయస్సు) x (కిలోలలో ఉండవలసిన బరువు) / (72 x రక్తద్రవములో క్రియటినిన్ ప్రమాణము మి.గ్రా / డె.లీ) x (0.85 స్త్రీలలో).

వడపోత ద్రవప్రమాణము (GFR) బట్టి వ్యాధిని ఐదు దశలుగా విభజిస్తారు. మొదటి దశలో వడపోత ద్రవప్రమాణము (GFR) 90 మించి ఉంటుంది.  

రెండవ దశలో  GFR 60 - 89, మూడవ దశలో 30 - 59, నాల్గవ దశలో 15 - 29, ఐదవ దశలో 15 కంటె తక్కువ ఉంటుంది

మొదటి రెండు దశల మూత్రాంగ వ్యాధిలో కేశనాళికాగుచ్ఛముల వడపోత ప్రమాణములు సామాన్య పరిమితులలో ఉన్నా మూత్రములో మాంసకృత్తులు (Proteinuria & albuminuria), మూత్రములో రక్తము (hematuria) మూత్రాంగ నిర్మాణ, వ్యాపారములలో మార్పులను

246 :: సూచిస్తాయి. మూత్రములో ఆల్బుమిన్ ప్రమాణముల బట్టి కూడా వ్యాధి

తీవ్రతను గుర్తిస్తారు. వ్యాధి లక్షణములు :-

మూత్రాంగవ్యాధి లక్షణములు మూత్రాంగవ్యాపారము బాగా క్షీణించే వఱకు (నాలు గైదు దశల వఱకు) వ్యాధిగ్రస్థులకు కనిపించవు.

కాని దీర్ఘకాల మూత్రాంగవ్యాధి మూడవ దశలో ఉన్నపుడు అధిక రక్తపుపోటు (hypertension), పాండురోగము (anaemia), ఖనిజ లవణముల సంబంధిత ఎముకల వ్యాధులు (mineral bone disorders - Renal osteodystrophy, Secondary hyperparathyroidism) పొడచూపవచ్చును. అవి పొడచూపినపుడు పరీక్షలతో మూత్రాంగవ్యాధికి శోధించాలి.

వ్యాధి నాలుగు, ఐదు దశలలో ఉన్నపుడు రక్త ము లో యూరియా విలువలు పెరుగుట వలన నీరసము, ఆకలి మందగించుట, వాంతి భావన, వాంతులు, కాళ్ళలో పొంగు కనిపించవచ్చును. బరువు తగ్గుట, కండరములు సన్నగిల్లుట కనిపించవచ్చును. యూరియా విలువలు బాగా హెచ్చయితే  యూరియా చెమటలో విసర్జింపబడి చెమట ఆవిరి అయిన పిదప చర్మముపై  యూరియా తెల్లని పొడిగా (urea frost) కనిపిస్తుంది. రక్తము ఆమ్లీకృతమయితే (metabolic acidosis) శ్వాసవేగము పెరుగుతుంది. యూరియా విలువలు బాగా పెరిగినపుడు గందరగోళము, మతిభ్రమణము కలుగవచ్చును. పరీక్షలు :మూత్రపరీక్షలు :-

రక్త ము లో యూరియా, క్రియటినిన్ విలువలు పెరిగి మూత్రాంగవ్యాధిని సూచిస్తాయి. పరీక్షలతో మూత్రములో ఎఱ్ఱ క ణములు (erythrocytes), తెల్లకణములు (leukocytes), రక్తము (hematuria), మూసలు (casts), మాంసకృత్తులకై శోధించాలి. మూత్రములో ఆల్బుమిన్

247 :: / క్రియటినిన్  నిష్పత్తి తెలుసుకోవాలి.

రక ్త పరీక్షలు :-

రక్తములో క్రియటినిన్ విలువలు నుంచి కేశనాళికాగుచ్ఛముల వడపోత ప్రమాణము (Glomerular Filtration Rate - GFR ) అంచనా వేసి దీర్ఘకాల మూత్రాంగవ్యాధి ఏ దశలో ఉన్నదో నిర్ణయిస్తారు.

రక్తపరీక్షలతో పాండురోగము (anaemia) ఉన్నదో, లేదో తెలుసుకోవాలి. రక్తములో చక్కెర విలువలు, విద్యుద్వాహక లవణముల (electrolytes) విలువలు  ఆల్బుమిన్ విలువలు, కొలెష్ట్రాలు, కొవ్వుపదార్థాల విలువలు కూడా తెలుసుకోవాలి. కాల్సియమ్, సహగళగ్రంథి స్రావక విలువలు (Parathyroid hormone) కూడా తెలుసుకోవాలి. శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ :-

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ (ultrasonography) పరీక్షలతో మూత్రాంగముల పరిమాణము, ప్రతిధ్వనిత్వము (echogenicity), నిర్మాణములను పరీక్షించాలి. బహుళ బుద్బుద వ్యాధి (polycystic kidney disease), జలమూత్రాంగము (hydronephrosis), మూత్రనాళములలో శిలలు (ureteric calculi), ఇతర అవరోధములు, మూత్రాశయములో అసాధారణములు ఈ పరీక్ష వలన తెలుస్తాయి. కణపరీక్షలు :-

మూత్రముకుళములలో  కేశనాళికగుచ్ఛముల వ్యాధుల (glomerular diseases) సంశయము ఉన్నపుడు మూత్రాంగముల కణపరీక్ష  (biopsy) చేయాలి. చికిత్స :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధిని (chronic kidney disease) నిర్ణయించాక అది ఏ దశలో ఉన్నదో కూడా నిర్ణయించాలి. వ్యాధిని అదుపులో పెట్టుటకు తొలిగా మూత్రాంగవ్యాధిని కలుగజేసిన రక్తపీడనము, మధుమేహవ్యాధి, స్వయంప్రహరణ వ్యాధులను (autoimmune dis:: 248 :: eases) అదుపులో పెట్టాలి.

రక్తపీడనము 140 / 90 m.m hg లోపల అదుపులో ఉంచాలి. మధుమేహవ్యాధిగ్రస్థులలో రక్తపు చక్కెర విలువలను అదుపులో ఉంచి  Hb A1c  7% లోపల ఉంచే ప్రయత్నము చెయ్యాలి. మూత్రప్రవాహమునకు అవరోధములు ఉంటే వాటిని తొలగించు ప్రయత్నము చెయ్యాలి. మూత్రాంగములకు రక్తప్రసరణ లోపములు ఉంటే వాటిని సరిదిద్దాలి.

ద్రవప్రమాణహీనతను  (hypovolemia) సరిదిద్దాలి. హృదయవైఫల్యము

(Congestive heart failure), జలోదరము (ascites) వంటి వ్యాధులకు తగిన చికిత్సలు చేసి మూత్రాంగముల  రక్తప్రసరణను మెరుగుపఱచాలి.

కీళ్ళనొప్పులకు వాడే ఐబుప్రోఫెన్ వంటి ష్టీ రా యిడులు కాని తాపహరముల (NonSteroidal Anti Inflammatory Drugs) వాడుక మానివేయాలి. వీటి వలన GFR తగ్గగలదు.

Angiotensin Converting Enzyme inhibitors ( ACE inhibitors), Angiotensin Receptor Blockers వలన GFR తగ్గగలదు. వీటి వలన రక్తద్రవములో క్రియటినిన్ విలువలు 30 % కంటె పెరుగుతే ఆ మందుల మోతాదులను వైద్యులు తగ్గిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్థులలో మూత్రములో ఆల్బుమిన్ విసరన ్జ (albuminuria) తగ్గించి మూత్రాంగవ్యాధిని అదుపులో పెట్టుటకు ACE inhibitors, ARBS ఉపయోగపడుతాయి. ఈ ఔషధములు కేశనాళికగుచ్ఛములలో పీడనము తగ్గించి మూత్రాంగ రక్షణకు తోడ్పడుతాయి. వీటి వలన రక్తములో పొటాసియమ్ విలువలు పెరిగే అవకాశము ఉన్నది కాబట్టి  ఆ రెంటినీ కలిపి వాడుట మంచిది కాదు. వీటిని వాడినపుడు రక్తములో పొటాసియమ్ విలువలు, క్రియటినిన్ విలువలు గమనిస్తూ ఉండాలి. అవసరమయితే మందుల మోతాదులు సరిదిద్దాలి. మూత్రాంగములపై విషప్రభావము గల amino glycoside antibiotics వంటి మందులు వీలయినంత వఱకు వాడకూడదు. తప్పనిసరి అయితే రక్తములో ఆ ఔషధముల విలువలు విషస్థాయిలో (toxic range)

249 :: లేనట్లు జాగ్రత్తపడాలి.

మూత్రాంగ వ్యాధిగ్రస్థులలో ఎక్స్ రే వ్యత్యాసపదార్థాల (xray contrast materials) వాడుకలను కూడా నియంత్రించాలి. మూత్రాంగములకు వీటి వలన హాని కలుగవచ్చును. ఆహార నియంత్రణ ( Dietary restrictions ) :సోడియం :

దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి  కలవారు భోజనములో సోడియం ని (ఉప్పు) తగ్గించుకోవాలి. దినమునకు  సోడియమ్ వాడుకను 3 గ్రాములకు మితము చేసుకోవాలి. హృదయవైఫల్యము (CHF) కూడా ఉంటే దినమునకు సోడియం వాడుక 2 గ్రాములకు తగ్గించాలి. పొటాసియం :

వీరు పొటాసియం వాడుకను దినమునకు 60 m.eq నియంత్రించు కోవాలి. నారింజ నిమ్మ రసములు, టొమోటాలు, అరటిపళ్ళు, బంగాళదుంపల లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. వీటి వాడుకను బాగా తగ్గించుకోవాలి. రక్తములో పొటాసియమ్ విలువలు ఎక్కువగా ఉన్నవారికి సోడియమ్ పోలిష్టైరీన్ సల్ఫొనేట్ (sodium polystyrene sulfonate ) వాడుతారు.

రక్తద్రవములో పొటాసియమ్ విలువలు ప్రమాదకర ప్రమాణములలో ఉండి (6 meq / dL మించి), విద్యుత్ హృల్లేఖనములో (electro cardiogram) మార్పులు ఉంటే, హృదయ రక్షణకు కాల్సియమ్ గ్లూకొనేట్ (calcium gluconate) సిరల ద్వారా ఇస్తారు. రక్తద్రవములోని పొటాసియమును కణముల లోపలకు మళ్ళించుటకు ఇన్సులిన్ + గ్లూకోజుల మిశ్రమమును సిరలద్వారా ఇస్తారు. బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను (beta adrenergic receptor agonists) పీల్పుసాధనముల ద్వారా ఇచ్చి పొటాసియమ్ ను కణములలోనికి మళ్ళించవచ్చును. రక్తము ఆమ్లీకృతము అయితే (acidosis) సోడియమ్ బైకార్బొనేట్ (sodium bicarbonate) కూడా ఇవ్వవచ్చును. ఆపై శరీరములో పొటాసియమును తగ్గించుటకు so:: 250 :: dium polystyrene sulfonate  వంటి ఋణపరమాణు వినిమయ ఔషధములు (cation echange resins) వాడాలి. ద్రవపరిమాణ లోపము (hypovolemia) లేనివారిలో మూత్రకారకములు (diuretics) వాడి పొటాసియము విసర్జనను పెంచవచ్చును. ఫాస్ఫేటులు

ఆహారములో ఫాస్ఫేటుల (phosphates) వాడుకను 1  గ్రామునకు నియంత్రించుకోవాలి. వివిధరకముల పిక్కలు (nuts), నల్లని శీతల పానీయాలలో ఫాస్ఫేటు ప్రమాణములు హెచ్చుగా ఉంటాయి. అధిక రక ్త పీడనము :-

రక్తపీడనమును 140/ 90 మి.మీ. మెర్క్యురీ లోపు అదుపులో ఉంచుకోవాలి. అధిక రక్తపీడనమునకు Angiotensin Converting Enzyme inhibitors లను, కాని  Angiotensin Receptor Blockers లను కాని ప్రథమముగా ఎంచుకుంటారు. ఈ మందులు మూత్రాంగములకు రక్షణ చేకూరుస్తాయి. వీని వాడుక వలన రక్తములో క్రియటినిన్ ప్రమాణములు కొంత పెరుగుతాయి. మూల విలువలు కంటె 30 % మించి పెరుగుతే వాని మోతాదును తగ్గించాలి. ACE inhibitors, ARBs  రక్తద్రవపు పొటాసియమ్ విలువలను పెంచుతాయి కాబట్టి రెంటినీ కలిపి వాడుట మంచిది కాదు. శరీరములో ద్రవభారము (fluid overload) పెరిగి కాళ్ళు పొంగుతే మూత్రకారకములు (diuretics) అవసరము కావచ్చును. పాండురోగము ( Anemia ) :-

మూత్రాంగములలో రక్తోత్పాదిని (erythropoietin) అనే రసాయనము ఉత్పత్తి  అవుతుంది. అది ఎముకల మజ్జపై పనిచేసి ఎఱ్ఱకణముల ఉత్పత్తికి దోహదపడుతుంది. మూత్రాంగవ్యాధి మూడవ దశలో ఉన్నా, దాటినా రక్తపరీక్షలతో రక్తవర్ణకపు (hemoglobin) విలువలు తెలుసుకోవాలి. తగ్గుతే రక్తములోను, శరీరములోను ఇనుము విలువలు తెలుసుకొని లోపములు

251 :: ఉంటే ఇనుము లవణములు నోటిద్వారా గాని, సిరలద్వారా గాని ఇచ్చి

లోపమును సరిదిద్దాలి.

ఇనుము లోపాలు, ఇతర పోషక పదార్థముల లోపాలు సరిదిద్దినా రక్తవర్ణకపు విలువ 10 గ్రాలు/డె.లీ కంటె తక్కువగా ఉంటే కృత్రిమ రక్తోత్పాదుల (erythropoiesis stimulating agents : ESAs) వాడుక అవసరము అవవచ్చును. వీటిని వాడునపుడు రక్తవర్ణకపు (hemoglobin) ప్రమాణములు 11 గ్రా.లు దాటకుండా  జాగ్రత్తపడాలి. ఎముకల బలహీనత :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి మూడవ దశకు చేరినవారిలో విటమిన్ డి తగ్గుతుంది. [ విటమిన్ D3   ఖోలికాల్సిఫెరాల్  ( Cholecalciferol) చర్మము దిగువభాగములో సూర్యరశ్మి సహాయముతో ఉత్పత్తి అవుతుంది. కాలేయములో ఖోలికాల్సిఫెరాల్  హైడ్రాక్సిలేట్ అనే ఉత్ప్రేరకముతో  25హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్ గా మార్పుచెందుతుంది. 25 హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్ మూత్రాంగములలో ఉత్తేజకరమై 1-25- డై హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్  లేక కాల్సిట్రయాల్ Calcitriol గా మారుతుంది. ] మూత్రాంగవ్యాధి కలవారిలో కాల్సిట్రయాల్ లోపించి రక్త ము లో కాల్సియమ్ విలువలు తగ్గుతాయి. ఫాస్ఫేటు విలువలు పెరుగుతాయి. కాల్సియమ్ జీవవ్యాపారముపై సహగళగ్రంథుల (parathyroid glands) ప్రభావము ఉంటుంది. రక్తములో కాల్సియమ్ విలువలు తగ్గినపుడు సహగళగ్రంథులు సహగళగ్రంథి స్రావమును ( parathyroid hormone) ఎక్కువగా స్రవిస్తాయి. సహగళగ్రంథి స్రావము ఎముకల నుంచి కాల్సియమ్ ని రక్తములోనికి తరలిస్తుంది. ఎముకలు అందుచే బలహీనపడుతాయి (osteomalacia).  ఆ పై ఎముకలలో  తంతు బుద్బుదములు ఏర్పడి Osteitis fibrosa cystica అనే వ్యాధికి దారితీస్తాయి. వీరిలో ఎముకల నొప్పులు, ఎముకలు సులభముగా విఱుగుట కలుగుతుంటాయి.

రక్తములో కాల్సియం తగ్గుటచే  సహగళగ్రంథి స్రావము అధికమగుటను

252 :: ద్వితీయ సహగళగ్రంథి ఆధిక్యతగా (secondary hyperparathyroidism) పరిగణిస్తారు. శరీరములో విటమిన్ డి లోపమును సరిదిద్దుటకు  Secondary hyperparathyroism ను నివారించుటకు ఉత్తేజకర 1-25 డై

హైడ్రాక్సీ వైటమిన్  డి (1-25- dihydroxy vitamin D) ని గాని, లేక దాని సమధర్మిని ( analog ) గాని వాడవలసిన అవసరము కలదు.

హెచ్చయిన ఫాస్ఫేటు విలువలను తగ్గించుటకు ఫాస్ఫేట్ బంధకములను (phosphate binders) వాడుతారు. కాల్సియం కార్బొనేట్ (CaCO3), కాల్సియం ఎసిటేట్, లాంథనమ్ కార్బొనేట్ (Lanthanum carbonate), సెవెలమెర్ కార్బొనేట్ (Sevelamer carbonate) కొన్ని ఫాస్ఫేటు బంధకములు. ఇవి జీర్ణమండలములో ఫాస్ఫేటు గ్రహణమును నివారిస్తాయి. రక ్త ఆమ్లీకృతము ( Metabolic acidosis ) :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి కలవారిలో శరీరములో జనించే ఆమ్లపు విసర్జన మందగిస్తుంది. అందుచే రక్తము ఆమ్లీకృతమవుతుంది. ఇది జీవవ్యాపార ఆమ్లీకృతము (metabolic acidosis).

[ శ్వాసవైఫల్యము కలవారిలో బొగ్గుపులుసు వాయువు విసర్జన తగ్గి రక్తములో బొగ్గుపులుసు వాయువు (CO2 ) ప్రమాణములు పెరుగుటచే కలిగే ఆమ్లీకృతము  శ్వాసవ్యాపార ఆమ్లీకృము ( Respiratory acidosis ) ].

వీరిలో రక్తములో బైకార్బొనేట్ విలువలు తగ్గుతాయి. వారికి సోడియమ్ బైకార్బొనేట్  నోటి ద్వారా ( 650 మి.గ్రాలు - 1300 మి.గ్రా లు దినమునకు రెండు మూడు పర్యాయములు ఇచ్చి రక్తములో బైకార్బొనేట్ విలువలు 22 meq / L సమీపములో ఉండేటట్లు చూడాలి. సోడియం బైకార్బొనేట్ వలన శరీరములో లవణ, ద్రవభారములు పెరుగుటకు, రక్తపుపోటు పెరుగుటకు, కాళ్ళలో పొంగులు కలుగుటకు అవకాశము ఉన్నది. ధమనీ కాఠిన్యత, హృద్రోగములు :-

దీర్ఘకాల మూత్రాంగ వ్యాధులు కలవారిలో ధమనీ కాఠిన్యత (ath:: 253 :: erosclerosis), హృద్రోగములు, హెచ్చుగా ఉంటాయి. కొవ్వులు, కొలెష్టరాలు తగ్గించే ష్టాటిన్ (statins) మందులు వాడుట వలన హృద్రోగములు, ధమనీ వ్యాధులు తగ్గించగలుగుతాము. మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( Renal replacement therapy):-

కేశనాళికాగుచ్ఛముల వడపోత ద్రవప్రమాణము (Glomerular filtration Rate - GFR) క్షీణించి దీర్ఘకాల మూత్రాంగవ్యాధి తీవ్రతరమయి  ఐదవ దశకు చేరినపుడు మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్సలు అవసరము అవుతాయి. GFR విలువలే కాక రోగి పోషణ, జీవవ్యాపార స్థితులు క్షీణించినపుడు ప్రత్యామ్నాయ చికిత్స మొదలు పెట్టుట మేలు.

ఉదరాంత్రవేష్టనము (peritonium) ద్వారా రక్తమును శుద్ధిచేయు ప్రక్రియ Peritoneal dialysis. దీనిని అరుదుగా వాడుతారు. రక్తనాళములలోని  రక్తము ను శుద్ధిచేయు ప్రక్రియ Hemodialysis. ఇది తఱచు వాడబడే ప్రక్రియ. పరమూత్రాంగ దాన  (renal transplantation) చికిత్సలో గ్రహీతకు అనుకూల  మూత్రాంగమును శస్త్రచికిత్సతో   చేరుస్తారు.

రక్తపీడనమును, మధుమేహ వ్యాధిని అదుపులో పెట్టుకొని దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిని నివారించుట, అదుపులో ఉంచుకొనుట వాంఛనీయము.

254 ::