హలో...డాక్టర్/ఎక్కువ బరువు (Overweight); స్థూలకాయము (Obesity)

వికీసోర్స్ నుండి

30. ఎక్కువ బరువు ; స్థూ లకాయము ( Overweight; Obesity ) గత నాలుగు దశాబ్దములుగా ప్రపంచము అంతటా ప్రజలలో బరువు ఎక్కువగుట (overweight), స్ల థూ కాయములు (obesity) బాహుళ్యముగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆహారపదార్థములు విరివిగా లభ్యమగుట, వ్యాయామము తగ్గుట, వాహనాల వాడుక హెచ్చి నడకలు తగ్గుట, దానికి కారణములు. ఎక్కువ బరువు, స్థూలకాయములు అనారోగ్యమునకు దారితీస్తాయి. భార సూచిక ( Body Mass Index ):

ఒక వ్యక్తి బరువు ఎక్కువో, కాదో, స్థూలకాయము ఉన్నదో, లేదో తెలుసుకొనుటకు భార సూచిక (Body Mass Index  BMI) తోడ్పడుతుంది. ఒక వ్యక్తి  కిలోగ్రాముల బరువును ఆ వ్యక్తి యొక్క మీటర్ల ఎత్తు  వర్గముతో భాగిస్తే  (Weight in kilograms/ Square of height in meters.  kg/m2 ) ఆ వ్యక్తి భారసూచిక తెలుస్తుంది. వర్గీకరణము :

భార సూచిక 18.5 కంటె తక్కువ ఉంటే భారహీనతగా ( Under weight ) పరిగణిస్తారు.

18.5 నుంచి 25 లోపల ఉంటే అది సామాన్యపు బరువు 25 నుంచి 30 లోపల ఉంటే  అది ఎక్కువ బరువు (Over weight) 30  పైన భార సూచిక ఉంటే స్థూలకాయముగా పరిగణిస్తారు. (Obesity) స్ల థూ కాయులను మరల మూడు తరగతులుగా విభజించ వచ్చును 1.

30- 35 వరకు భారసూచిక ఉంటే ప్రథమవర్గము గాను

3.

40 పైన ఉంటే తృతీయ వర్గములోను చేరుస్తారు.

2.

35 నుంచి 40 వరకు ద్వితీయ వర్గము గాను

324 :: భారసూచిక శరీరపు కొవ్వుని సూచించదు కాని శరీరములో ఉన్న

కొవ్వుతో అన్యోన్య సంబంధము కలిగి ఉంటుంది. హెచ్చు భార సూచిక అనారోగ్యమును తెలుపదు కాని అనారోగ్యములకు దారి తీస్తుంది. శరీరపు బరువును కోశాగారములో ధనముతో పోలుస్తే అర్థము చేసుకొనుట తేలిక అవుతుంది. కోశాగారములో ఎంత ధనము చేరుస్తే  ధనము అంతగా పెరుగుతుంది. ఎంత ఖర్చు పెడితే అంత క్షీణిస్తుంది. ఎక్కువ డబ్బు చేర్చి తక్కువ ఖర్చు పెడితే ధనము పెరుగుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ చేరుస్తే ధనము తగ్గుతుంది. తిని, త్రాగే కాలరీలు (కాలరీ వివరణ క్రింద తెలియజేయబడింది), ఖర్చయే కాలరీల కంటె హెచ్చయితే బరువు పెరుగుతారు. దేహములోనికి తీసుకొనే కాలరీలు తగ్గి, ఖర్చు చేసే కాలరీలు పెరుగుతే బరువు తగ్గుతారు.

“ఎక్కువ బరువు ఉన్నవారిలో జీవవ్యాపారము ( Metabolism) మందముగా ఉంటుంది, వారు తక్కువ తిన్నా బరువు పెరుగుతారు” అన్నది వాస్తవము కాదు. శరీరపు బరువు ఎక్కువగా ఉండుట వలన నిజానికి వారి నిత్య జీవన వ్యాపారమునకు ఎక్కువ కాలరీలే ఖర్చవుతాయి. హృదయము, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రాంగముల వంటి ముఖ్య అవయవములపై పనిభారము వీరిలో హెచ్చు. నడిచేటప్పుడు కూడా వీరు ఎక్కువ బరువును మోయాలి కాబట్టి ఎక్కువ కాలరీలు ఖర్చుపెడతారు. ఆహారపదార్థాలను అవి యివ్వగలిగే శక్తిని బట్టి కాలరీలలో కొలుస్తారు. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను  వాతావరణ పీడనము వద్ద ఒక సెంటీగ్రేడు డిగ్రీ పెంచుటకు కావలసిన శక్తిని ఒక కాలరీగా పరిగణిస్తారు. ఆహార పదార్థాల విషయములో శక్తిని కిలో కాలరీలలో ( 1 కిలో కాలరీ = 1000 కాలరీలు ) వ్యక్తపరుస్తారు. వాడుకలో కాలరీలన్నా వాస్తవానికి అవి కిలో కాలరీలుగా అర్థము చేసుకోవాలి.

ఓక గ్రాము కొవ్వు పదార్థాలలో సుమారు 9 కాలరీల ( కిలో కాలరీలు) శక్తి నిగూఢమై ఉంటుంది. ఓక గ్రాము పిండిపదార్థాలు, మాంసకృత్తులలో సుమారు 4 ( కిలో ) కాలరీలు ఉంటాయి. దైనందిక అవసరాలకు మించి తీసుకున్న ఆహారపదార్థాలు శరీరపు పెరుగుదలకు, బరువు పెరుగుటకు

325 :: తోడ్పడుతాయి. ఆహార వినియోగము పెరిగి, చేసే వ్యాయామము తగ్గుతే బరువు

హెచ్చుతాము. ఆహార వినియోగము, జీవనవ్యాపారము + వ్యాయామపు అవసరముల కంటె తక్కువయితే బరువు తగ్గుతాము. అవసరాలకు ఆహారము సరి అయితే బరువు స్థిరముగా ఉంటుంది. అధిక భారము, స్థూ లకాయములకు కారణాలు :

పాతదినములలో ధనవంతులయిన కొద్దిమందిలో ఎక్కువ బరువు ఉండుట కనిపించేది. నవీనకాలములో ఆహార విప్లవము వలన ఆహారపదార్థాల ఉత్పత్తి పెరిగి అవి విరివిగా లభ్యము అవుతున్నాయి. చిల్లర తిళ్ళ దుకాణాలు ఎక్కువయ్యాయి. చక్కెర ఉండే శీతల పానీయాలు, చక్కెర సహిత ఫలరసాల వాడుక పెరిగింది. వేడుకలు పెరిగి శక్తిసాంద్ర ఆహారపదార్థములు (Energy rich foods) తీపివస్తువులు, పానీయాలు, మద్యము, మిగిలిన చిరుతిళ్ళ వినియోగము అన్ని సమాజాలలోను పెరిగింది. భోజనము హెచ్చయితే జీర్ణాశయము సాగుతూ పరిమాణము పెరిగి వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. చక్కెరగల పానీయాలు, పదార్థాలు సేవిస్తే వారి రక్తములో చక్కెర విలువలు పెరిగి దానికి స్పందనగా  ఇన్సులిన్ విడుదలయి  దాని ప్రభావము వలన రక్తములో చక్కెర తగ్గగానే వారికి నీరసము ఆకలి పెరుగుతాయి. అపుడు వారు మరికొంత ఆహారమునో, పానీయములనో సేవిస్తారు. ఈ విషచక్రము అలా కొనసాగుతుంది. సమాజములలో మార్పుల వలన వాహనాలు పెరిగి పిల్లలు పాఠశాలలకు నడిచి వెళ్ళరు. పెద్దలు ఉద్యోగాలకు నడిచి వెళ్ళరు. దూరదర్శినులు, గణనయంత్రాలు, చరవాణుల వాడుక హెచ్చి పిల్లలు, పెద్దలు క్రీడలకు, వ్యాయామములకు వెచ్చించే కాలము తగ్గిపోయింది. పాఠశాలలలో క్రీడలకు, వ్యాయామములకు ప్రోత్సాహము తగ్గింది. జన్యు కారణాలు :

పరిసరాలు, జీవన శైలులలో మార్పులకు వేఱు వేఱు వ్యక్తులు వేఱు వేఱుగా స్పందిస్తారు. జడత్వము, వ్యాయామపు కొఱత, అధిక ఆహార వినియోగములు కొందఱిలో ఎక్కువగా ఉంటాయి. వాటికి జన్యువులు

326 :: కారణము కావచ్చును.

కేవలము జన్యుకారణముల వలనే సంక్రమించే స్థూలకాయములు చాలా అరుదు. చాలామందిలో స్థూలకాయములకు వివిధ కారణాలు, పెక్కు జన్యువులు కారణము అవుతాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువబరువు, స్థూలకాయములు సంభవించినా దానికి వారి జీవనశైలి, పరిసరాల ప్రాబల్యమే ప్రధాన కారణము. జీవనశైలులలో మార్పుల వలన వారు స్థూలకాయములను నిరోధించ వచ్చును. రుగ్మతలు :

కుషింగ్ సిండ్రోము (Cushing Syndrome), పాలీ సిస్టిక్ ఓవరీలు (Polycystic Ovaries), మానసిక వ్యాధులు  అధిక భారమును కలిగిస్తాయి. ఔషధములు :

కుంగువ్యాధులు, యితర మానసికవ్యాధులకు వాడే (Atypical antipsychotics) మందులు, ఎడ్రినల్ కార్టికో ష్టీరాయిడులు ( Adrenal Corticosteroids), మధుమేహవ్యాధి మందులు, గర్భనిరోధక ఔషధములు, కొన్ని మూర్ఛమందులు బరువు పెరుగుటకు తోడ్పడ వచ్చును. ఆకలి ఎక్కువయి ఎక్కువగా భుజించుట దానికి కారణము.  స్థూ లకాయము వలన పరిణామములు :

ఎక్కువబరువు, స్థూలకాయము కొన్ని రుగ్మతలకు దారి తీస్తాయి. ఎక్కువబరువు ఉన్న వారిలో అధిక రక్తపీడనము కలిగే అవకాశములు  ఎక్కువ. మధుమేహవ్యాధి, అల్ప సాంద్రపు కొలెష్టరాలు ఎక్కువగుట ( Low density lipoproteins ), అధిక సాంద్రపు కొలెష్టరాలు  ( High density lipoproteins) తక్కువగుట, ట్రైగ్లిసెరైడులు ఎక్కువ అవుట ఎక్కువగా సంభవిస్తాయి.  హృద్రోగములు, హృద్ధమనుల వ్యాధులు (Coronary artery disease), మస్తిష్క విఘాతములు (Cerebro vascular accidents), పిత్తాశయ వ్యాధులు (Gall bladder diseas:: 327 :: es), కీళ్ళ వాతములు (ముఖ్యముగా మోకాళ్ళ నొప్పులు, తుంటి సంధుల నొప్పులు), ఒళ్ళు నొప్పులు ఎక్కువగా సంభవిస్తాయి. కాలేయములో కొవ్వు చేరి కాలేయపు కొవ్వువ్యాధి (Fatty Liver disease) సంభవిస్తుంది. స్థూలకాయులలో ఆమ్ల తిరోగమనము (Acid Reflux) ఎక్కువ. మూత్రాంగవైఫల్యములు, కుంగుదల వంటి మానసికవ్యాధులు వీరిలో ఎక్కువ. జడత్వము, నిశ్చలత్వము, మందకొడితనము ఎక్కువయి జీవన రీతులు అసంపూర్ణముగా ఉంటాయి. కొన్ని కర్కటవ్రణములు (Cancers ; పెద్దప్రేవుల, కాలేయపు, పిత్తాశయపు, మూత్రాంగముల కర్కటవ్రణములు, స్త్రీలలో రొమ్ము, బిడ్డసంచీ కర్కటవ్రణములు) కూడా స్థూలకాయులలో ఎక్కువగా కలుగుతాయి. వీరిలో నిద్రలో కలిగే అవరోధ శ్వాసభంగములు (Obstructive Sleep Apnea) ఎక్కువగా కలుగుతాయి. తామర, ఒరుపులు ( Intertrigo ), సూక్ష్మాంగజీవులు కలిగించే వాపులు, పుళ్ళు ( Boils) వంటి చర్మవ్యాధులు కూడా స్థూలకాయములు కలవారిలో ఎక్కువ. ఫైన పేర్కొన్న వివిధకారణముల వలన బరువు ఎక్కువగా కలవారిలోను, స్థూలకాయులలోను ఆయుః ప్రమాణము తగ్గుతుంది. స్థూ లకాయము, ఎక్కువ బరువులను నివారించు మార్గ ములు :

తక్కువ  ఆహారము తక్కువ కాలరీలు గ్రహించుట వలన, వ్యాయామముతో ఎక్కువ కాలరీలను ఖర్చు పెట్టుట వలన బరువు తగ్గుతారు. కాలరీలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాల ద్వారా దేహానికి చేరుతాయి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చక్కెర, వెన్న, నేతులతో చేసిన చిల్లర తిళ్ళు వలన, తఱచు వివిధ రకాల చిరుతిళ్ళు తినుటవలన, అధిక పరిమాణములలో భోజనము భుజించుట  వలన కాలరీలు ఎక్కువగా  గ్రహించుట జరుగుతుంది. దేహము ఖర్చు పెట్టని కాలరీలు ఏ రూపములో వెళ్ళినా చివరకు కొవ్వుగా దేహములో నిలువ అవుతాయి. ఆహారములో కాలరీల తగ్గ ింపు :

అందువలన ఊబ కాయము తగ్గాలంటే చక్కెర సహిత శీతలపానీయాలు

328 :: మాని మంచినీటి వాడుకను పెంచుకోవాలి. చక్కెరలేని శీతల పానీయములు

0 కాలరీలవి వాడుకొనవచ్చును. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలతో సహా తీసుకొనే కాలరీలు మితపరచుకోవాలి. ఆరోగ్యానికి తోడ్పడే ఫలాలు. ఆకుకూరలు, కూరగాయలు, పీచుపదార్థములు, చిక్కుళ్ళు, పప్పులు పూర్ణ ధాన్యములు (Whole grains) వినియోగించుకొని సంస్కరణ ధాన్యాల (refined grains) వినియోగము తగ్గించుకోవాలి. కొవ్వుతో కూడిన మాంసము బదులు చిక్కిన మాంసాలను (Lean meats) వినియోగించుకోవాలి. తిని, త్రాగే మొత్తపు కాలరీలను పరిమితము చేసుకోవాలి. మద్యము వాడుకను మితపరచుకోవాలి. వ్యాయామముతో కాలరీల ఖర్చు పెంచుట :

జీవనశైలిని మార్చుకొని నడక, వ్యాయామము, యోగా, క్రీడలద్వారా శరీరములో నిలువ ఉన్న కాలరీలను (కొవ్వును) కరిగించి ఖర్చు చెయ్యాలి. వీలయినంతగా వాహనముల వాడుక తగ్గించుకోవాలి. బయట నడచుటకు అవకాశము లేనియెడల వ్యాయామ సాధనములను యింట్లోనే వినియోగించుకోవాలి. దండీలు, బస్కీలు, యోగా, మొదలైన ప్రక్రియలతో స్వంత కండరములకు  ఎదురుగా కసరత్తులు చేసుకొనవచ్చును. ఒంటరిగా వ్యాయామము చేసుకోలేనివారు సమూహములుగా చేసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో, క్రమశిక్షణతో బరువు తగ్గగలరు. ఔషధములు :

ఆకలిని తగ్గించుటకు బరువు తగ్గుటకు కొన్ని మందులు ఉన్నాయి. వాడుకలో ఉన్న మందులు ఆర్లిస్టాట్ (Orlistat), లార్కసెరిన్ ( Lorcaserin ), లిరగ్లూటైడ్ (Liraglutide ), ఫెంటెరమిన్/టోపిరమేట్, (Phentermine/Topiramate),  నల్ ట్రెక్సోన్/బూప్రోపియన్ (Naltrexone/Bupropion) లు. ఆర్లిస్టాట్ కొవ్వుపదార్థాల జీర్ణమును అరికడుతుంది. కొవ్వుపదార్థాలు భుజించినపుడు అవి జీర్ణము కాక విసర్జింపబడుతాయి. ఔషధాల వలన విపరీత ఫలితాలు కలిగే అవకాశము ఉన్నది. ఈ మందులవలన దీర్ఘకాలిక ప్రయోజనము, దీర్ఘకాలము వాడుట

329 :: వలన కలిగే నష్టముల వివరాలు పూర్తిగా తెలియవు.

శస్త్రచికిత్సలు :

బరువు విపరీతమైనప్పుడు ఎక్కువ బరువు వలన హృద్రోగములు, మధుమేహము యితర రుగ్మతలు ఉన్నప్పుడు బరువు తగ్గించుటకు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.   జఠర బంధన చికిత్స ( Laparoscopic Gastric Banding ):

భార సూచిక 40 దాటిన వారికి, లేక 35- 40 లో ఉండి హృద్రోగము, అదుపు కాని మధుమేహవ్యాధి ఉన్నవారికి మిత ఆహార, వ్యాయామ చికిత్సలు విఫలమైనప్పుడు జఠరబంధన చికిత్సలు అవసరము అవవచ్చును. ఉదరాంతర దర్శనము ద్వారా ( Laparoscopy ) జీర్ణాశయము (Stomach) చుట్టూ వ్యాకోచింపగల పట్టీ అమర్చి జీర్ణాశయమును రెండు తిత్తులుగా విభజించుట వలన పై భాగపుతిత్తి  కొద్ది ఆహారముతోనే నిండి ఆకలి తీరుతుంది. జఠరము, ఆంత్రములు ఉండుట వలన విటమినులు ఖనిజ లవణముల గ్రహించబడుతాయి. జఠరబంధన పరిమాణమును  మార్చుతూ జీర్ణాశయపు తిత్తుల పరిమాణములు మార్చవచ్చును. జఠర ఛేదన ( Gastric Resection ):

ఈ శస్త్రచికిత్సలో, జీర్ణాశయములో చాలాభాగమును తొలగిస్తారు. జఠరములో చిన్నతిత్తినే ఉంచి దానిని ఆంత్రములకు జతపరుస్తారు. (Partial Gastrectomy with Gastro jejunal anastomoses). లేక నిలువుగా చాలా భాగమును తొలగించి ( Vertical Gastric resection) జీర్ణాశయ పరిమాణములో కొంత భాగమునే ఉంచవచ్చును. ఈ చికిత్సలు పొందిన వారికి విటమినులు, ఖనిజ లవణములను సమకూర్చాలి. ఆంత్రములలో కొంత భాగమును తొలగించే శస్త్ర చికిత్సలు అఱుదు అయిపోయాయి. కడుపు బుడగ ; జఠర బుద్బుదము ( Gastric Balloon ) : తాత్కాలికముగా

జీర్ణాశయములో వ్యాకోచింపగలిగే బుడగను

330 :: అంతర్దర్శిని (Endoscope) ద్వారా నిలిపి ఆరు మాసములలో తొలగించి

ఆకలి తగ్గించి బరువును తగ్గింపవచ్చును. ఎక్కువ బరువు లక్షణాలు పిన్నవయస్సులోనే పొడచూపుతాయి కనుక తల్లిదండ్రులు పూనుకొని పిల్లలను ఆరోగ్యకరమైన మితాహారములో ఉంచి, వారికి తగిన వ్యాయామము, క్రీడలు సమకూర్చి శ్రద్ధ వహిస్తే చాలా వఱకు అధిక భారములను, స్థూలకాయములను నివారింపగలుగుతాము.

331 ::