హలో...డాక్టర్/ఆటాలమ్మ (Chicken pox); అగ్గిచప్పి/ అగ్నిసర్పి/ఒడ్డాణపు చప్పి/మేఖల విసర్పిణి (Shingles/Herpes Zoster)

వికీసోర్స్ నుండి

34. ఆటాలమ్మ (Chicken pox) : అగ్గి చప్పి / అగ్నిసర్పి / ఒడ్డా ణపు చప్పి / మేఖల విసర్పిణి / (Shingles / Herpes Zoster) ఆటాలమ్మ (Chicken pox, Varicella) ; అగ్గిచప్పి / అగ్నిసర్పి (Shingles / Herpes Zoster) వ్యాధులు ఆటాలమ్మ - అగ్నిసర్పి విషజీవాంశము (Varicella Zoster Virus - VZV) వలన కలుగుతాయి. VZV, హెర్పీస్ కుటుంబపు విషజీవాంశములలో (viruses) ఒకటి. హెర్పీస్ విషజీవాంశములు డి ఎన్ ఎ తరగతికి (DNA viruses) చెందినవి. ఇవి రెండు పోగుల డీ ఆక్సీరైబోన్యూక్లియక్ ఏసిడ్ జన్యు సముదాయమును కలిగి ఉంటాయి. ఆ జన్యు సముదాయము వింశతి (ఇరువది) ఫలక ఆకారములో ఉన్న మాంసకృత్త్తు పెంకులో (Icosahedral capsid) యిమిడి ఉంటుంది. ఇవి కణములకు సోకి ఆ కణములలోనికి చొచ్చుకొన్నపుడు ఆ కణముల న్యూక్లియస్ లలో విషజీవాంశ డి ఎన్ ఎ లు ఉత్పత్తయి కణద్రవములోనికి విడుదలయి ఆ విషజీవాంశములు (Viruses) సంఖ్యాపరముగా వృద్ధి చెందుతాయి. ఆటాలమ్మ (Varicella or Chickenpox) :

చాలామందికి చిన్నతనములోనే ఆటాలమ్మ సోకి ఉంటుంది. నవతరములో వారికి ఆటాలమ్మ టీకాలు వేయుటవలన సుమారు డెబ్బది శాతపు పిల్లలకు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆటాలమ్మ సోకదు. అందు వలన వ్యాధి అరుదయే అవకాశము ఉన్నది.

ఆటాలమ్మను కలిగించే వి.జి.విషజీవాంశములు (VZV) గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధి గలవారు తుమ్ములు, దగ్గుల లాలాజల తుంపరులతో విషజీవాంశములను వెదజల్లుతారు. విషజీవాంశములు ఉన్న గాలిని పీల్చుటవలన గాని, లేక చర్మ విస్ఫోటపు పొక్కులను తాకుటవలన గాని వ్యాధి సోకుతుంది. అగ్గిచప్పి (మేఖల విసర్పిణి: Herpes Zoster /

364 :: Shingles) పొక్కులను తాకుటవలన కూడా వ్యాధినిరోధకశక్తి లేని వారికి

ఆటాలమ్మ సోకవచ్చును.

ఆటాలమ్మ విషజీవాంశములు శరీరములో ప్రవేశించాక 10 నుంచి 21 దినముల వఱకు వ్యాధిలక్షణములు పొడచూపవు. ఈ అంతర్గతస్థితి కాలములో (Incubation Period) విషజీవాంశములు వృద్ధి చెందుతుంటాయి. ప్రారంభదశలో చిన్నపిల్లలలో ఏ లక్షణాలు కనిపించక పోవచ్చును. తరుణవయస్కులలోను, పెద్దవారిలోను, నలత ( malaise ), వమనభావన ( Nausea ), ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరము, ముక్కు కారుట వంటి లక్షణములు కనిపించవచ్చును.

ఆపై విస్ఫోటము (Rash) పొడచూపుతుంది. తొలుత చిన్న చిన్న ఎఱ్ఱటిమచ్చలు అచ్చటచ్చట కనిపిస్తాయి. ఈ మచ్చలు విరివిచెంది, పొక్కులుగాను (papules) తరువాత దినములలో నీటిపొక్కులుగాను (vesicles), ఆపై చీముపొక్కులుగాను (pustules) పరిణామము చెందుతాయి. తరువాత దినములలో పొక్కులు మాడి, పెచ్చులు కట్టి ఆ పెచ్చులు రాలిపోతాయి. ఈ పొక్కులు పరంపరలుగా వచ్చుట వలన ఒకే సమయములో వివిధ దశల స్ఫోటకములు కనిపిస్తాయి. ఈ విస్ఫోటము వలన దుఱద కలుగవచ్చును. నొప్పి కలుగదు. కొందఱిలో దౌడలలోను అంగుడిలోను చిన్న పొక్కులుగాని, పుళ్ళుగాని పొడచూపుతాయి. నొప్పి, దురద యీ పొక్కులవలన కలుగవచ్చును.

ఆటాలమ్మలో విస్ఫోటము ఛాతిపైన, వీపుపైన, ఉదరముపైనా, తల, చేతులు, ముంజేతులు, తొడలు, కాళ్ళ పైనా కనిపిస్తుంది.

విస్ఫోటము కనిపించుటకు రెండుదినములు ముందునుంచి వ్యాధిగ్రస్థులు విషజీవాంశములను తుమ్ము, దగ్గుల ద్వారా వ్యాపింపజేస్తారు. పొక్కులు పూర్తిగా మాడి పెచ్చులు కట్టేవఱకు (సుమారు నాలుగైదు దినములు) వీరు ఆటాలమ్మను వ్యాపించగలరు. సాధారణముగా ఆటాలమ్మ రెండు వారములలో తగ్గిపోతుంది. వయోజనులలో జ్వరము, విరివిగా విస్ఫోటము కలిగి వ్యాధి ఎక్కువ దినాలు

365 :: ఉండవచ్చును. వయోజనులలోను, వ్యాధి నిరోధకశక్తి తగ్గినవారిలోను

ఊపిరితిత్తుల తాపము (Pneumonitis) కలుగవచ్చును. గర్భిణీస్త్రీలలో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉండవచ్చును. గర్భిణీస్త్రీలకు వ్యాధి కలిగి పిండమునకు వ్యాధి సోకిన గర్భస్థ శిశువు పెరుగుదలకు, అవయవముల అభివృద్ధికి అవరోధము కలిగి పుట్టుకతో కొన్ని వ్యాధులు (జన్మవ్యాధులు ; Congenital diseases) కలుగవచ్చును. సాధారణముగా ఆటాలమ్మ ప్రమాదకరము కాదు గాని, వ్యాధినిరోధక శక్తి తగ్గినవారిలో, వ్యాధి తీవ్రతరమయి చాలా అరుదుగా ( 50 వేల మంది వ్యాధిగ్రస్థులలో ఒకఱికి ) మరణము సంభవిస్తుంది. పరీక్షలు:

వ్యాధిలక్షణములు, విస్ఫోటపు లక్షణములు, సమాజములో వ్యాధి ప్రాబల్యము బట్టి వైద్యులు వ్యాధినిర్ణయము చేయగలరు. రక్తములో VZV కి ప్రతిరక్షకముల పరీక్ష చేసి సత్వర IgM ప్రతిరక్షకములను (antibodies) కనిపెట్టిన వ్యాధి నిర్ణయమైనట్లే. IgG ప్రతిరక్షకములు దీర్ఘకాలమునవి. అవి కనిపించుటకు కొద్దివారములు పడుతాయి. అవి వ్యాధినిరోధక శక్తిని సూచిస్తాయి. పొక్కులనుంచి సేకరించిన రసిని గాజుపలకపై పొరగా నెఱపి Tzanck వర్ణకముతో సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. పొక్కుల రసినుంచి డి ఏన్ ఎ గుణకార చర్యతో (DNA Polymerase chain reaction) విషజీవాంశములను గుర్తించవచ్చును. చికిత్స :

చాలామందికి జ్వరము, వంట్లో నలత తగ్గించుటకు పారసిటమాల్, లేక ఎసిటెమైనోఫెన్లను వాడవచ్చును. దుఱద ఎక్కువగా ఉంటే డైఫెన్ హైడ్రొమెన్ వంటి హిష్టమిన్ అవరోధకములను (antihistamines) వాడవచ్చును. పొక్కులను ప్రతిదినము గోరువెచ్చని నీటితో శుభ్రపరచి జింక్ ఆక్సైడు గల లేపనములను పూయవచ్చును. పిల్లలలో ఎసైక్లొవీర్ (Acyclovir) వంటి విషజీవాంశ నాశకములు

366 :: (Antiviral medicines) వ్యాధిపై ఫలితములను చూపవు. అందువలన

ఒక మాసముపైన, 12 సంవత్సరములలోపు వయస్సు ఉన్నవారికి విషజీవాంశములను అదుపులో పెట్టు మందులను వాడరు.

వయోజనులలో వ్యాధి పొడచూపిన 48 గంటల లోపల వాడే ఎసైక్లొవీర్, వాలసైక్లొవీర్ (valacyclovir) వంటి మందులు వ్యాధి త్వరితముగా తగ్గుటకు ఉపయోగపడుతాయి. గర్భిణీస్త్రీలు, వ్యాధినిరోధక శక్తి కొఱవడినవారికి యీ మందులను త్వరగా మొదలుపెట్టుట మంచిది. వ్యాధి తీవ్రముగా ఉన్నవారికి, యితర చిక్కులు, సమస్యలు కలిగినవారికి ప్రతిరక్షకముల గ్లాబ్యులిన్ (Varicella Zoster Immune Globulin - VZIG ను వాడుతారు. వ్యాధినిరోధము :

పిల్లలకు ఆటాలమ్మ టీకాలు వేయుటవలన అధిక సంఖ్యలో (80 శాతము మందిలో) వ్యాధిని నిరోధించగలము. వ్యాధిగ్రస్థులను మిగిలిన వారికి దూరముగా ఉంచుట వలన వ్యాధి వ్యాప్తిని అరికట్టగలము. అగ్గి చప్పి / అగ్నిసర్పి / ఒడ్డా ణపు చప్పి / మేఖల విసర్పిణి, ( Shingles / Herpes Zoster ) :

అగ్నిసర్పి (అగ్గిచప్పి, ఒడ్డాణపు చప్పి, మేఖలవిసర్పిణి) సాధారణముగా పెద్దవారిలోను, వ్యాధి నిరోధకశక్తి కొఱవడినవారిలోను కనిపిస్తుంది.

367 :: పిల్లలలోను తరుణ వయస్సు కలవారిలోను అరుదుగా కనిపిస్తుంది.

అదివఱకు ఆటాలమ్మ కలిగినవారిలో ఆ విషజీవాంశములు (Viruses) శరీరరక్షణ యంత్రాంగముచే తొలగించబడినా, కొన్ని చర్మమునుంచి జ్ఞాననాడుల ద్వారా నాడీకణముల లోనికి ప్రవేశించి వానిలో నిద్రాణమై మసలవచ్చును.

వెన్నుపామునుంచి వెలువడు నాడులకు పూర్వనాడీ మూలము (ముందఱ ఉండు anterior nerve root), పరనాడీ మూలము (వెనుక నుండు posterior nerve root) ఉంటాయి. పూర్వనాడీ మూలములో చలననాడుల పోగులు (motor nerve fibers) ఉంటాయి. పరనాడీ మూలములలో జ్ఞాననాడుల పోగులు (sensory nrve fibers)  ఉంటాయి. పరనాడీ మూలములలో నాడీకణములతో నాడీగ్రంథులు (nerve root ganglions) ఉంటాయి. ఆటాలమ్మ-మేఖలవిసర్పిణి విషజీవాంశములు (Varicella Zoster Viruses) యీ నాడీగ్రంథుల నాడీకణములలోను, ముఖచర్మము నుంచి స్పర్శ మొదలగు జ్ఞానములను సేకరించు త్రిశాఖనాడీ గ్రంథి (Trigeminal nerve ganglion) లోను నిక్షిప్తమై ఉండగలవు. శరీర వ్యాధినిరోధకశక్తి వయస్సువలన, యితర వ్యాధులవలన, ఔషధములవలన, కర్కటవ్రణముల (cancers) వలన తగ్గినపుడు, యీ విషాంశములు చైతన్యవంతమయి నాడీకణములలో వృద్ధిచెందినచో అవి నాడీతంతువుల ద్వారా చర్మమునకు చేరి చర్మములో తాపము కలిగించి పొక్కులతో మేఖల విసర్పిణి (అగ్గిచప్పి /Shingles /Herpes Zoster) కలుగజేస్తాయి. మేఖల విసర్పిణి లక్షణములు:

మేఖల విసర్పిణి పొడచూపే ముందు శరీరములో నలత, జ్వరము, తలనొప్పి కలుగవచ్చు. కొద్దిదినములకు ముందు ప్రభావితభాగములో తిమ్మిరి, మంట, సలుపు, పీకుట, నొప్పి కలుగవచ్చును. ఛాతి ప్రభావితమైనపుడు ఛాతినొప్పి, ఉదరభాగము ప్రభావితమయితే కడుపునొప్పి కలుగవచ్చును.

ఈ బాధ కలిగిన రెండు మూడు దినములు లేక కొద్దివారముల పిదప ప్రభావిత ప్రాంతములో విస్ఫోటము (rash) కనిపిస్తుంది. ఈ విస్ఫోటము

368 :: ఆరంభదశలో గులాబిరంగు లేక ఎఱుపురంగులో దద్దుర్లు వలె కనిపిస్తుంది.

ఈ విస్ఫోటము సర్వసాధారణముగా శరీరములో ఒక ప్రక్క ప్రభావిత నాడీపాలిత చర్మవిభాగమునకు (Dermatome) పరిమితమై ఉంటుంది. ఈ విస్ఫోటము శరీర మధ్యరేఖను అతిక్రమించదు. శరీర వ్యాధినిరోధక శక్తి విశేషముగా క్షీణించిన వారిలో ఈ వ్యాధి తీవ్రమయి విశేషవ్యాప్తి చెందవచ్చును. తొలుత దద్దుర్లుగా ఉండి తర్వాత నీటిపొక్కులు ఏర్పడి, ఆ పిమ్మట నల్లబడి, పెచ్చులు కట్టి, తర్వాత పెచ్చులు రాలిపోతాయి. అరుదుగా పుళ్ళు కలిగి, మచ్చలు కూడా కట్టవచ్చును. రెండు, నాలుగు వారములలో విస్ఫోటము మానిపోతుంది. కొంతమందిలో నెలలు లేక కొద్ది సంవత్సరముల పాటు నరాల సలుపు ( Post herpetic neuralgia ) బాధించవచ్చును. ముఖములో మేఖల విసర్పిణి :  

త్రిశాఖనాడిలో (Trigeminal nerve) నేత్రకుహర నాడి (Opthalmic nerve), హనువు నాడి (Maxillary nerve), అధోహనువు నాడి (Mandibular nerve) అను మూడు శాఖలు ఉంటాయి. ఈ మూడు శాఖలలో నేత్రకుహర నాడి అగ్గిచప్పికి తఱచు లోనవుతుంది.

నేత్రప్రాంతములో మేఖల విసర్పిణి కలుగుతే నుదుటి ప్రాంతములోను, కనురెప్పలపైనా ఎఱ్ఱదనము, వాపు, పొక్కులు పొడచూపుతాయి. కంటి పైపొర తాపము వలన కండ్లకలక (Conjunctivitis); స్వచ్ఛపటల తాపము (Keratitis), కృష్ణపటల తాపము (Uveitis), చక్షునాడి వాతములు (Optic nerve palsies) వలన కంటిలో సలుపు, నీరు కారుట, నుదుటి ప్రాంతములో ఒకపక్క తలనొప్పి, దృష్టిలోపములు, అంధత్వము కూడా కలుగవచ్చును. హనువునాడి (maxillary nerve) ప్రభావితమైతే నోటిలో పైదవుడ, అంగుడు, పైదంతపు ఇగుళ్ళలో చిన్న పొక్కులు, పుళ్ళు, పైదవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపుతాయి.

369 :: అధోహనువు నాడి (mandibular nerve) ప్రభావితమైతే నోటిలో

క్రిందిదవుడ, నాలుక, క్రిందిదవుడ యిగుళ్ళలో పొక్కులు, పుళ్ళు కలుగుతాయి. క్రిందిదవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపవచ్చును. నోటిలో అగ్గిచప్పి వలన పొక్కులు పుళ్ళు ఏర్పడితే అవి ఒక ప్రక్కనే ఉండుట వలన వ్యాధిని వైద్యులు పసిగడుతారు. నోటిలో మేఖల విసర్పిణి కలుగుతే నాడులతో బాటు రక్తనాళములు తాప ప్రభావమునకు లోనయితే దంతపువ్యాధులు, యిగుళ్ళ వ్యాధులు, దంతనష్టము, దౌడ యెముకలలో అస్థినిర్జీవత (osteonecrosis), ఎముకల విచ్ఛిన్నము సంభవించవచ్చును. వ్యాధినిర్ణయము :

విస్ఫోటము దేహములో ఒక ప్రక్కకు ఒక నాడీపాలిత చర్మ విభాగమునకు (Dermatome) ఒక పట్టీ వలె పరిమితమయి అగ్గిచప్పిని (మేఖల విసర్పిణి) సూచిస్తాయి. ఈ వ్యాధిలో సలుపు, మంట, నొప్పి ఎక్కువగా ఉండి దురద పాలు తక్కువయి అగ్గిచప్పిని సూచిస్తాయి. పొక్కుల రసితో డి.ఎన్.ఎ గుణకార చర్యతో (Polymerase Chain Reaction) విషజీవాంశములను కనుగొనవచ్చును. రసిని గాజు పలకపై నెఱపి Tzanck వర్ణకముతో  సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి వ్యాధి ధ్రువీకరణ చేయవచ్చును. రక్తపరీక్షలలో VZV కి IgM ప్రతిరక్షకములను కనుగొని వ్యాధిని నిర్ధారించవచ్చును. చికిత్స : నొప్పి మందులు :

విస్ఫోటమునకు జింక్ ఆక్సైడు పూతలు కొంత ఉపశమనము కలిగిస్తాయి. నొప్పికి ఎసిటెమైనోఫెన్, పారసిటమాల్ లు వాడవచ్చును. కొందఱికి కొడీన్, హైడ్రోకొడీన్, నల్లమందు (Opium) వంటి మత్తిచ్చే నొప్పి మందులు అవసరము పడవచ్చును. లైడొకేన్ వంటి మందులతో తాత్కాలికముగా స్పర్శను, వ్యధను ఆయా ప్రాంతములలో అరికట్టవచ్చును. విషజీవాంశ నాశకములు ( Antiviral medicines ) :

VZV పై పనిచేసే ఎసైక్లొవీర్ (Acyclovir), వాలసైక్లొవీర్ (Va:: 370 :: lacyclovir), ఫామ్ సైక్లొవీర్ (famciclovir) లలో ఏ మందైనా వ్యాధి లక్షణములు పొడచూపిన 48- 72 గంటలలో మొదలుపెడితే వ్యాధి తీవ్రతను, వ్యాధి కాలపరిమితిని తగ్గించగలుగుతాము. ఎసైక్లొవీర్ దినమునకు ఐదు పర్యాయములు వాడాలి. వాలసైక్లొవీర్, ఫామ్ సైక్లొవీర్ లను దినమునకు మూడు పర్యాయములు వాడాలి. వ్యాధితీవ్రత హెచ్చుగా ఉన్నవారిలోను, యితర సమస్యలు కలిగినపుడు సిరలద్వారా వాడుటకు ఎసైక్లొవీర్ లభ్యము. అగ్గిచప్పి తరువాత కలిగే నాడీ వ్యధకు (Post herpetic neuralgia) గాబాపెంటిన్ (Gabapentin), ప్రీగాబలిన్ (Pregabalin) లను, నొప్పి మందులను వాడవచ్చును. వ్యాధినివారణ :

అగ్గిచప్పికి టీకాలు లభ్యము. ఇవి వ్యాధిని చాలా శాతముమందిలో నివారిస్తాయి. టీకాలు తీసుకొన్నవారిలో వ్యాధి పొడచూపినా వ్యాధి తీవ్రత పరిమితముగా ఉంటుంది.

371 ::