సప్తమైడ్వర్డు చరిత్రము/పదునొకండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి


పదునొ కం డ వ య ధ్యాయము,

ఎడ్వర్డు అవసానదశ. మరణము

.

1910 సం. న "మే నెల 5 తేదిని ఎడ్వర్డు మిక్కిలి జబ్బుపడి నాడనియును, పరదేశమునకు వెళ్లి ఇంటికి నేతెంచు తన భార్య నెదుర్కొనఁ బో నశక్తుఁ డై యుండెననియును, వైద్యులు తెలి యఁ జేసిరి. ఫ్రాన్సులో నుండు క లేలో నుండిన అలెగ్జాండ్రా, తన భర్త వ్యాధిపీడితుడై నాడని విన్నదై యెకాయెకిని దారిలో కుంభ ద్రోణవర్షము కురియు చుండినను, ఆవానలోనే లండను పురికి విచ్చేసెను, వైద్యులు “అమ్మా! మీభర్తగారి శ్వాసకో ములు కొంచెము చెడి యున్నవి . శీఘ్రముననే భగవంతుఁ డాయనశ్రమను నివారణ సేయగలడు.” అని మందలించిరి. అయిల్లాలు ఇంతకుముందు నాతఁడు వ్యాధిగ్రస్తుడైనపుడు దేవుని నమ్మినందున నాతఁడు స్వస్థచిత్తుఁ డయ్యెనని తలఁచి 'భగ వంతుడే" తన నాథుని మేన బ్రాణముల నిలుపు సని మిక్కిలి విశ్వసించి యుండెను. కాలము సమీపించి నప్పుడు, దేవుడేమి చేయఁగలఁడు? నాటి రాత్రి రోగము ముదురు చుండెను, వైద్యులు దాని నాప సర్వవిధంబులఁ బ్రయత్నించు చుండిరి.


ఎడ్వ ర్డింత జబ్బు స్థితిలో నుండిను, పడక నుండి లేచి భగ వంతుని స్మరించి, రాచ కార్యములు నిర్వర్తింపు చుండెను. అతని ప్రాణమిత్తుఁ డైన నాలిస్సుప్రభు వాతనిఁ జూడ నేతెం

చెను. ఎడ్వర్డు లేచి తనమిత్రుని గాఢాలింగనము గావించు కొని, యతని యోగ ముల నారసి కూర్చుండ నియమించి యతనితో ముచ్చటలాడుచుఁ బొద్దు పుచ్చుచుండెను. కాని వైద్యులు “రాత్రి "రాజు బాగుగ నిదుర పోయెను. అయినను రోగముమాత్ర ముపశమింప లేదు". అని వక్కాణించు చుండిరి. ఎడ్వర్డు దైర్య లక్ష్మీని వదలక తన్నుఁ గన వచ్చిన మిత్రా మాత్యులను గారవించి, వారితో దూరమున నుండు చెలికాం డ్రకును, బంధువులకును, జాబులు వ్రాయవలయు నని చెప్పి, తాను బ్రదుకుట దుర్లభంబని కొన్ని యేర్పాటులు సేయఁ దలంచెను. ఆరుస కుమారుఁడును, పుత్రికలును, మనుమలును, మనుమరాండ్రును, ఆయనను జుట్టియుండిరి. కాని అతని కడపటి ముద్దుకూఁతురు మాత్రము నార్వేకు వెళ్లి యుండెను. ఆచిన్నదీ తండ్రి జబ్బుస్థితిని విన్న దై బిరబిర వచ్చినను, ఆమె తండ్రిని జూడనే లేదు. వైద్యులు మే నెల 7 వ తేది ఉదయమున 7 ఘంట' లప్పుడు, “ రాజు బ్రతుకుజాడలు కాన్సింప లేదు; అతఁడిప్పుడు నదే స్థితిలో ఉన్నాఁడు. " అని చెప్పిరి.

బకింగు హాము భవనంబునకు నలుగడల న నేకులు గుంపు లు గూడి పైవార్తను విని దిగు లొందిన హృదయము కలనా రై నివ్వెరపడి యుండిరి.

ఎడ్వర్డు భాస్క.రు డస్తమించు నని చెప్పురీతిని నాఁడు సూర్యుఁ డపరదిక్కున నొడిగెను. సంధ్యా రాగము మిన్ను నఁ

బర్వెను. ఎడ్వర్డు స్వర్గమునకు వేగు చున్నాఁ డని చాటించు రీతిని నుద్యాన వనంబుల నుండు పక్షి గణంబులు కిలకల మని కూయఁదొడగెను. మూలల దాఁగిన చీకటులు సన్న సన్నగ రాజొచ్చేను. చోరులును, విటులును, సంతసంబున సందుగొం దుల విహరింపసాగిరి. చుక్కలు మిన్నున మినుకుమినుకని రా జిల్లగడంగెను. లండను పుర వాసు లన్నము తినియుఁ దినక ఎడ్వర్డు దేహస్థితి సరయుటకు బకింగు హాముభవనంబును సమీపించి గుమి గూడి యుండిరి.

బకింగుహాములోపల నెడ్వర్డుమోమువన్నె డస్సె. నోట మాట నిలిచె; కన్నులు మూతవడె; ఊపిరివిడుచుట మానె; దంతముల కాంతి డీలువడె ; దేహావయవము లన్నియుఁ జల్ల నయ్యే; మే నెల 7 వ తేది శుక్రవారము నాటి రేయి నడిజా మున నెడ్వర్లు మృతి నోందె; నని ఆయన చెంగట నుండు నలెగ్జాండ్రా, ఆతని పెద్దకోమారుఁడు జార్జి, మున్నగు వారు తెలిసికొని గొల్లున నేడువ సాగిరి. కాంటెర్బరీ ఆర్చిబిషపు, ఎడ్వర్డు సమీపంబున నుండి రాజు నాత్మ యేసు నాభుని యను మతిని బొంది స్వర్గముఁ జేర భగవంతుని స్తోత్రము సేయు చుండెను. "వెస్టుమినిస్టరు కోవెల గంట, ఎడ్వర్డు నాకంబునకు నేగె, నని జనులకు దెల్పుచుండె. నను తెలుంగున శబ్దంచెను. ఇంతలో నెడ్వర్డు మంత్రు లేతెంచి తండ్రి చావున కై వగచు చుండు జార్జి నూజడించి, అలెగ్జాడ్రా దుఃఖమును శాంత పఱచి, సమ స్తరాజచిహ్నములతో నారాజశవమును సమాధి చేయించిరి.


విక్టోరియా కాలధర్మము సెందినప్పుడు జనులు ముసలి డొరసాని పోయె నని చింతింపక ఉండిరి. ఎడ్వర్డు తల్లి మాడ్కి- బెక్లేండ్లు రాజ్యము నేల లేదు. అందరును ఆలెగ్జాండ్రా వైధవ్యదశను బొందవలసి వచ్చెఁగదా అని కుందు చుండిరి. “" అయ్యో! పాపము! అలెగ్జాండ్రా నలువ డేండ్లు మగని దగ్గఱ గాపురము సేసినది. ఎన్నడైన నాయన మనస్సు 'మెచ్చు లాగున "నాయిల్లాలు వర్తించి యుండు నే? ఆగృహిణి పోయి, ఎడ్వర్డుండకూడదా? " అని పెక్కుమంది పల్కు. చుండిరి. ఎశ్వర్డు, ప్రభుత్వమునకు వచ్చి తొమ్మిది సంవత్సరములు రాజ్యము 'నేలెను. అతని ప్రభుత్వ మారంభంబున నాయా చోటులలో గలహము లుద్భవిల్లినను, అవన్నియు క్షీణించి, అన్ని చోటుల జనులు సుఖంబుగ నుండఁ జూలిరి. హిందూ దేశ స్థులు విక్టోరియా పరిపాలనలో సుఖంబుగ మనిరి. ఎడ్వర్డు దొర తనమున వారియుల్లంబుల నవశక్తి నెలకొనెను. అది భగవం తుని కృపచే సభివృద్ధి బొందులాగున నాయెడ్వర్డు హిందూ దేశ స్థులకు "లేనిహక్కుల గల్పించి అల్లరుల నాంపి, దేశమును నెమ్మది స్థితిని జార్జికి నప్పగించి తాను దీర్ఘ కాలము విశ్రాంతి జెంద వెళ్లె. }


జార్జి, తండ్రియనంతరము ఇంగ్లండు, స్కాట్లండు, ఐర్లండు, హిందూ దేశము, కన్నడా, ఆస్ట్రేలియా మొద లగు రాజ్యము లకు నేలిక యయ్యె. ఇతని దొరతనమున జనులందఱును సుఖం బు పడయుదురు గాత!