సకలనీతిసమ్మతము/పుట 12

వికీసోర్స్ నుండి


ఆ. యంత్రవప్రరిఖ లతివిశీర్ణంబులై
ధాన్యతృణజలాదిశూన్య మగుచు
నమితహీనమగుట యదియు దుర్గవ్యస
నంబు నాఁగ నిది గరంబు కీడు. 73

క. ఎఱుఁగనివానికి దుర్గం
బెఱిఁగింపఁగఁ గోరి యెవ్వ డేఁగు నతఁడు దా
నొఱపుగ నాదుర్గములో
నఱిముఱిఁ బగవారి దఱియ నడుగుట దలఁపన్. 74

ఆ. వెరవు లావును మదమును బొరసెనేని
చేటు పొందకయుండ రక్షించుఁ గోట
వెరవు లావును మదమును బొరయనేని
కోట ప్రాణాభిమానముల్ గోలు పుచ్చు. 75

కామందకము



క. ఈరీతి దుర్గభాండా
గారగృహద్వారవప్రకరిహయగోష్ఠా
గారభటభూము లెప్పుడు
సారక్ష యెనర్పవలయు జననాథునకున్. 76

మదీయము

ఆజ్ఞాపాలనము

క. ఏ జనుల కాజ్ఞ సాలని
రాజును రాజేంద్రునాజ్ఞ ప్రకటింపని యా
రాజునకు గోడ వ్రాసిన
రాజునకున్ భేద మేమి ప్రాజ్ఞున కరయన్. 77

నీతిభూషణము



క. అనుజులు తనుజులు గురుజను
లనుఁగులు బంధుల ప్రధానులకు సిరిపొత్తీఁ
జనుగాని యాజ్ఞపొత్తీఁ
జన దధిపతికిన్ వివేకచతురాననుఁడా. 78

బద్దెననీతి



క. పుత్రులు పౌత్రులు భ్రాతలు
మిత్రులనరు రాజు లాజ్ఞ మీఱినచోటన్
శత్రులుగాఁ దమయలుకకుఁ
బాత్రము సేయుదురు నీజశుభస్థితిపొంటెన్. 79

ధౌమ్యనీతి



క. భూతలపతివితతాజ్ఞా
జ్యోతి ప్రవర్తింపకున్న సూర్యాగ్నిశశి
జ్యోతులు వెలుఁగవు గాన వి
చేతనముం బొంది సృష్టి చీకటి గాదే? 80

క. సతతసుఖానుభవంబులు
నతిశయవిభవములు నృపతియాశ్రితజనసం
తతికైనలేవె ధరణీ
పతి కాజ్ఞయ గాదె రాజ్యఫలము దలంపన్. 81