శివరాత్రిమాహాత్మ్యము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

క..

శ్రీదోరంతర[1]దేవ
ప్రాదితభాషావిశేషభాసురకీర్తి-
శ్రీదార్ఢ్య వివిధపూజా
మోదితగిరిదుహితృకాంత ముమ్మయశాంతా.

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. నట్లు తల్లిదండ్రుల నూరార్చి వెడలి సుకుమారుండు నిజాంతర్గతంబున.

2


గీ.

పోయె నుపదేశకాలంబు పూర్వముననె
కడచె ధైర్యంబు [2]జఠరవిక్రాంతమయ్యె
శీలసంపత్తి యిఁక నేమిసేయువాఁడ
భామినీ[3]సక్తి మన్మథుబారిఁ బడితి.

3


శా.

[4]పంతంబోడదు ధర్మముం దగవునుం బాడిం గులంబున్ విచా-
రింతున్ వేదపురాణశాస్త్రమతపారీణుండఁ గా నెట్ల-
ల్పాంతద్వాదశభానుమత్కిరణదాహక్రూరకామవ్యథా-
సంతాపజ్వరవేదనాభరమునం జాకుంట [5]సిద్ధించినన్.

4


సీ.

చాండాలుతోఁ బుల్కశత్వంబు గైకొను
          బ్రహ్మహత్య యొనర్చి బ్రాహ్మణుండు
క్రిమియై పతంగమై కీటమై జన్మించు
          నాసవం బాని భూమీసురుండు
క్రవ్యాదసత్త్వసర్గమున నుద్భవమందు
          విప్రుఁ డాచార్యునివెలఁదిఁ గవిసి
శ్యామచారుండు పిశాచమౌ బాడబుం-
          డన్యుని విత్తంబు నపహరించి


గీ.

యయిన [6]నేమగు వీనిలో నన్నిటికిని
సుఖము దుఃఖంబుఁ జర్చించి చూచినప్పు-
డెల్లసంసారులకుఁ (బోలె) హెచ్చు(గుందు)
లేకయుండుట గందుమో లేదొ జగతి.

5


గీ.

వామదేవుండు శుకుఁడుఁ [7]గేవలము దక్క
ముక్తులెవ్వరు వింటిమే ముజ్జగమున
జంతువుల కెల్ల [8]సరియ సంసారయాత్ర
విధినిషేధంబులకుఁ జొప్పు వెదకనేల.

6


శా.

ఆతంకంబున కేమికారణము బ్రాహ్మ్యం [9]బింతయుం జూచి యే
తాతల్ గట్టిన చెర్వు లే శ్రుతులు [10]బోధప్రక్రియల్ స్వల్ప మే
చేతోజాతు నుపాశ్రయించె[11]దఁ బరస్త్రీలన్ వినోదించెదన్
మాతంగీపరమేశ్వరిం గొలిచెదన్ మద్యంబు సేవించెదన్.

7

గీ.

[12]అష్టమావతారంబున నాదిపురుషుఁ
[13]డచ్యుతుఁడు విశ్వకర్త యనాదినిధనుఁ
డర్జునుండును దాను నేకాంతగోష్ఠి
విశ్వము నెఱుంగ [14]నొగలపై వినిచెఁ గాదె.

8


మ.

బహువేదాంతమతానుసాధిత [15]మహం బ్రహ్మాస్మియం చాడుదుర్
మహి మోహాంధులు గొందఱేని [16]యది బ్రహ్మం బెట్టు [17]దారెట్టిరో
యహహా బ్రహ్మము [18]దారయే నులుకశయ్యం ద్రెళ్ళి నిద్రింతురో
జహదుత్సర్గముగాఁగఁ జేయుదురొ విష్ఠామూత్రనిర్మోక్షమున్.

9


సీ.

కల్పద్రుమంబుతోఁ గామధేనువుతోడ
          నమృతాబ్ధి నవతారమయ్యె నెద్ది
బృందారవనమధ్యమందారతరుల[19]లో
          హలపాణి కెద్ది ప్రత్యక్షమయ్యెఁ
ద్రిపురాంతకుని యర్ధదేహంబునకు నెద్ది
          [20]మదసముల్లాససంపత్తి యయ్యె
నవసుధారూపమై పవనభుగ్భువనాధి-
          పతి కెద్ది ప్రాణంబు ప్రాణమయ్యె-


గీ.

నట్టి భవభేషజము నాసవామృతంబుఁ
గన్నుఁ గానక శపియించెఁ గాక యొకఁడు
తత్సమానములగు పదార్థములు గలవె
భూతభావిభవత్కాలముల ధరిత్రి.

10


వ.*

అని.

11


సీ.

కర్పూరరజము[21]లోఁ గలిపి కేతకీధూళి
          నఖిలాంగకముల నభ్యంగమాడి
జలజనాళీతంతుసందానితములైన
          యజ్ఞోపవీతంబు లఱుతఁ దాల్చి
వారాంగనాస్తన[22]హారవిభూషల
          నక్షమాల్యముగఁ జే నలవకించి
కస్తూరికామిశ్రగంధసారంబున
          నలికంబునఁ ద్రిపుండ్ర మనువుపఱిచి


గీ.

చంద్రికావేళఁ బరిపాండుసౌధవీథి
శక్తిఁ బూజించి దేవీప్రసాదమధువు
పుచ్చుకొను విప్రుఁ డాకంఠపూరితముగ
వెలఁదులును దాను నప్పుడు వినిమయముల.


క.

వనితల [23]కంగప్రేంఖో-
ళన మక్షివిఘూర్ణనంబు లజ్జావిగమం-

[24]బనవస్థితి మధుపానం-
బునను సురతమునను సదృశములు వక్త్రంబుల్.

13


గీ.

త్రిసరకాస్వాదభవ మదోద్రేకలహరి
ధరణిదేవుఁ డా యోజ మత్తావహించి
యారణాలు పఠింపంగ నాలకించి
శంబరారాతి రతిచేయి చఱచి నవ్వు.

14


సీ.

ఇంట నున్నాడొ వాఁ డెచ్చోట నున్నాఁడొ
          యొంటియో యెందఱే నున్నవారొ
మిన్నకున్నాఁడొ [25]యేమేఁ బల్కుచున్నాఁడొ
          నిద్రించినాఁడొ కన్దెఱచినాఁడొ
[26]యడలుచున్నాఁడొ (ప్రహర్షింపుచున్నాఁడొ)
          చించిలినాఁడొ గర్వించినాఁడొ
(శోకించినాఁడొ) యుత్సేకించినాఁడొ యు-
          ల్లాసించినాఁడొ కలంగినాఁడొ


గీ.

యుత్సవమొ వైభవమొ లేమియో కలిమియొ
పగలొ రాత్రియొ యెఱుఁగఁ డా బ్రాహ్మణుండు
నవమధూకప్రసూనసంభవపు మధువు
దలము దప్పంగఁ ద్రావి మత్తావహించి.

15


క.

సుకుమారుఁ డిట్లు నానా-
[27]ప్రకరంబుల వీటిలోనఁ [28]బడుచై తిరుగన్
సకలజనులు మొఱవెట్టిరి
యొకనాఁ డత్యాగ్రహమున నుర్వీశు సభన్.

16


క.

దేవర ప్రతినిధిఁగా సం-
సేవింతుము యజ్ఞదత్తు [29]సిద్ధ మతనిఁగా
భావింతుము తత్తనయుని
యౌవనసంప్రాప్తి లేని యటమున్నెల్లన్.

17


వ.

అవధరింపుము సుకుమార నామధేయుండైన మంత్రినందనుండు సౌందర్యవంతుండును గామశాస్త్రకళా[30]విధిజ్ఞుండునునై జారచోరవిటధూర్తవర్గంబులం గూడి వేడుకకాఁడై పుణ్యస్త్రీల [31]యీలువులు చెఱచుచున్న వాఁ డతని వారింపను నారీజనంబుల శిక్షింపను సమర్థులము గాకయున్నార మద్దురాత్మకుని నన్యాయసదృశంబైన దండంబు *(వలన) దండించునది యని విన్నవించిన (నా) మహీపాలుం డతని రప్పించి వాగ్దండనంబున దండించి పురంబును దేశంబును వెడల నడిపించిన రాజావమానితుండై యప్పాపి కీ[క]టదేశంబునకుం బోయి యందుఁ గొన్నిదివసంబు లుండి హూణమండలంబునకు నేతెంచువాఁడు కాంతారమధ్యంబున నతిక్షుత్పిపాసాపరవశుండై తనలో*(న) నిట్లు వితర్కించుచుండె.

18


చ.

అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం [32]బొడతేర గిన్నెలోఁ
బెరుఁగును వంటకంబు వడపిందియ[33]లుం గుడువంగఁబెట్టు ని-

ర్భరకరుణాధురీణయగు ప్రాణముప్రాణము తల్లియున్న దే
హరహర యెవ్వరింకఁ గడుపారని పెట్టెద రీప్సితాన్నముల్.

19


వ.

అని తనలోనం దలపోయుచుం జనిచని ముందట.

20


సీ.

స్ఫటికరత్నగృహంబు సర్వంసహాకాంత
          కభిధాంతరంబు దుగ్ధాంబునిధికి
మణిదర్పణము నభోమణిమార్గలక్ష్మికిఁ
          జంద్రాతపమునకు జన్మభూమి
యర్ధేందుమకుటాట్టహాసంబునకు జోడు
          పౌలస్త్యగిరికి సబ్రహ్మచారి
ప్రతిబింబ మభ్రముప్రభువారణమునకు
          ననుఁగుఁజుట్టము శారదాభ్రములకు


గీ.

గమఠతిమినక్రవిక్రమక్రమవిహార
చటులతరవీచికాఘటా[34]సమధిరూఢ
హంసకులసన్నినాదసంవ్యాప్తదిగ్వి-
భాగ మీక్షించె నతఁడు తడాగ మెదుర.

21


మ.

వసుధానిర్జరుఁ [35]డమ్మహాసరసిలో వార్వీచులం దేలెఁ ద్రా-
వె సుధాసన్నిభమైన వారిఁ దటపృథ్వీజావళిచ్ఛాయ[36]లన్
వసియించెన్ లహరీసమీరముల నధ్వశ్రాంతి పోకారిచెన్
బిసకాండంబులు [37]మేసెఁ గూర్చెఁ జలువల్ నిర్మోకసంకాశముల్.

22


క.

కరశీకరార్ద్రపుష్కర-
కరుఁడై యాతండు గంధకరిరాజు క్రియం
[38]బరిషేకానంతరమునఁ
సరసిరుహాకరము వెడలి చాలఁగ నొప్పెన్.

23


సీ.

వైదూర్యమణిశిలాస్వచ్ఛోదకము గానఁ
          గౌతుకం బొనరించెఁ గన్నుఁగవకు
[39](శిశిరసంస్పర్శవీచీమారుతము గాన
          నంగకంబులకు నిం పావహించెఁ
మలకేసరరేణుగంధోల్బణము గాన
          ఘ్రాణేంద్రియమునకుఁ బ్రమద మొసఁగె
గలహంసకులకలకలకలకులాయము గాన
          శ్రుతిసంపుటములకు సుఖమునిచ్చె)


గీ.

(మధుర)సలిలంబు [40]గాన సమ్మదముఁ జేసె
నాలుకకు నప్పు డవనిబృందారకునకు
సైకతారూఢజలమానుషీకదంబ-
కాంక్షితార్కమయూఖంబు కనుల నరసి.

24

క.

కొలనిదరి వటమునీడన్
శిలతల్పమునందుఁ గొంతసేపు శయించెం
జెలువమగు వలిపెదుప్పటి
తలగడఁగాఁ జేసి సచివతనయుం [41]డంతన్.

25


గీ.

బహులపక్షక్షపాకదంబములలోనఁ
బ్రభవ మొందిన యంధకారంబువోని
కొలనిదరి కాననంబులోఁ గొంత[42]ప్రొద్దు
నలపు వాయంగ నిద్రించె యాజ్ఞదత్తి.

26


గీ.

[43]డప్పి దీఱంగ మధురకాండంబు గ్రోలి
కడుపునిండంగఁ [44]దూఁడుఁదీఁగలు భుజించి
యెండ వాలారునందాఁక నిండుకొలని
తీరమున మఱ్ఱినీడ నిద్రించె నతఁడు.

27


చ.

అపుడు విలంబమానమయి యంబరకోణతటాంతరంబునం
దపనునిమండలంబు బెడిదంబగు వేఁడిమి వే నొయ్య వీడ్కొనెం
గపిలములై మయూఖములు కార్తికమాస[45]కళాపచేళిమ
త్రపుసలతాశలాటుసముదాయముచాయఁ దిరస్కరింపఁగన్.

28


గీ.

అంత[46]లో నిద్ర మేల్కాంచి యవనిసురుఁడు
జిగమిషాబుద్ధి [47]నీక్షించెఁ జిత్రభాను
నభినవోన్మేషకుటిలజిహ్మప్రకార-
లోలతారకాకేకరాలోకనమున.

29


శా.

కాంతారాంతరభూమిచెంత శబరగ్రామంబు పద్మాకర-
ప్రాంతక్షోణితలంబునం గలుగ [48]సంభావించె విప్రుం [49]డెదన్
దంతిస్కంధకపోలకుంభపలలాదక్రూరకౌలేయకీ-
[50]సంతానాస్ఫుటకంఠఘర్ఘరతరద్రాఘిష్ఠనాదంబులన్.

30


వ.

(ఆ సమయంబున).

31


సీ.

ఆదికాలమున మాయావిలాసినియైన
          మురదైత్యదమనుని మూర్తి వోలె
ధరణితలంబునఁ జరియింప నేర్చిన
          పురుహూతమణిశిలాపుత్రి వోలెఁ
గామినీరూపంబుఁ గైకొన్న శంబరా-
          రాతి కాలాయసాస్త్రంబు వోలె
వేడ్కకె మానుషీవిగ్రహంబు ధరించి
          విహరించు తొలుకారువేళ వోలె


గీ.

నంధతామిస్రమును నవిద్యయును బోలె
భువనమోహనరూపవైభవము [51]లొలయ

లీల నేతెంచె నొక్క చండాలకన్య
కొలనఁ జిఱుబంతిపసపాడఁ జెలియుఁ దాను.

32


శా.

ఆ చండాలకులప్రసూతయగు కన్యం గన్యకారత్నముం
జూచెన్ దవ్వుల యాజ్ఞదత్తి విపినక్షోణీవిభాగంబునన్
వాచాగోచరసౌకుమార్యనవలావణ్యాన్వితం బుష్పనా-
రాచుం డిక్షుశరాసనంబు ఘన[52]దోర్దర్పంబునం గూర్పఁగన్.

33


ఉ.

యోగసమాధితత్పరత నున్న విధంబున [53]వ్రాసినట్లు మూ-
ర్ఛాగమ[54]మీలితాత్ముఁడగు చాకృతినిశ్చలదేహయష్టియై
సోగకనుంగొనల్ నుదురు చొక్కుల కిక్కలుగాఁగ నత్తఱిన్
రాగరసాతిరేకమున బ్రాహ్మణుఁ డాదటఁ జూచె మాలెతన్.

34


సీ.

అప్సరస్త్రీ వోలె [55]నకులీనయైన యీ
          పైదలి కన్నులపండువయ్యెఁ
[56]జామ యౌవనరూపసంపన్నయై [57]మోక-
          వనరేఖయునుబోలెఁ బెనఁచె వేడ్కఁ
బొలఁతి [58]ప్రావృడ్వేళ వోలె నళివినీల-
          ఘనవేణియై యిది [59]కరము మెఱసె
నిభరాజనిభయాన యిది [60]శరత్తునుఁ బోలెఁ
          బుండరీకాక్షియై పొలుపు మిగిలె


గీ.

ముట్టరానిదియైనట్టి మూర్తి వోలె
జిత్తరువు వోలె దృష్టి కచ్చెరు వొనర్చె
మెలఁత మధుమాసకుసుమసమృద్ధి వోలె
జాతివిరహిత[61]యయ్యు సంప్రీతి నొసఁగె.

35


గీ.

దీనిఁ గల్పించె నజుఁ డభిద్యానమునను
నాతి మును ముట్టరాకుండ నంత్యజాతి
ముట్టుటయ కల్గెనేని యిమ్ముదితమేను
గందకుండునె పుష్పంబుకంటె మృదువు.

36


వ.

అని [62]విస్మృతనిమేషంబు గిలించి ముకుళితపక్ష్మాంచలంబును జిహ్మ [63]తరతరళశాతోదరంబునునగు వీక్షణంబున నవ్వెలివాడ వ్రీడావతి నీక్షించుచు నవ్విప్రుండు మదనశరశలాకాశంకు[64]సంకలితహృదయుండై స్తంభితుని [65]భంగి విలిఖితుని చందంబున నుత్కీర్ణుని పగిది [66]నియతుని లాగున మూర్ఛితుని ప్రకారంబునఁ (నున్మత్తుని తెఱంగున) దన్నుఁ దానెఱుంగక నివ్వెఱపడి నిశ్చలాంగుండై యుండె నమ్మచ్చెకంటియు నలవోక వోలె నతిస్వచ్ఛసౌభాగ్యచ్ఛాయావినిర్భర్త్సిత మత్స్యకేతనుండగు నా బ్రాహ్మణుం గనుంగొని [67]నిజాంతరంగంబున.

37


గీ.

విప్రవేషంబుఁ దాల్చిన విష్ణుఁడొక్కొ
బ్రాహ్మణుండైన శంబరారాతి యొక్కొ
బాడబాన్వయరూప[68]సంప్రభవుఁడైన
చందురుండొక్కొ యితఁ డతిస్వచ్ఛమూర్తి.

38

వ.

అని యంతంతం జేరవచ్చి యయ్యంత్యజాతిసీమంతిని యశేషజనపూజనీయులు బ్రాహ్మణులని తమ కులంబు [69]పెద్దలవలన వినుటం జేసియుఁ దా[70]నెందే నొక్కపూర్వజన్మకృతపుణ్యసంస్కారవిశేషంబుననో బాల్యంబు [71]నాఁటనుండియు రూపంబు వినయంబు దాక్షిణ్యంబు మధురాలాపకౌశలంబు నిస్సంగతప్రశాంతమహానుభావంబు శుచిత్వంబు గౌరవంబు సద్భావంబు గుణంబులు నైసర్గకంబులయి యుండుటనో భర్గఫాలనయనకృశానుజ్వాలాజాలహేలాచుళుకితావయవుండు గాని కుసుమకోదండుండునుం బోలెఁ గన్నులపండువై తప్తకాంచనవర్ణంబును గోరాచనాగౌరంబును జాంపేయకుసుమకేసరరేణుత్రసరేణువిసర[72]పిశంగంబునునగు దేహ[73]ప్రభాప్రవాహంబున గహనషండం బశేషంబును వెలిగించువాని నుద్భిన్ననవశ్మశ్రు [74]నభినవయౌవనోద్భాసితు షోడశవర్షదేశీయు నాదిగర్భేశ్వరు నమాత్యనందను సుకుమారుం గుమారసన్నిభుఁ దప్పక చూచి భయసంభ్రమడోలాయమాన దంతతాటంకవలయం బగునట్లుగా నిబ్బరంపు గుబ్బచన్నుల బిబ్బోకంబు బాహుమూలకూలంకషంబై యీషద్విలోకనీయం[75]బుగఁ గేలుదోయి సేవాంజలిపుటంబు లలాటంబునఁ గీలించి యయ్యగారికి నమస్కారంబని యధరకిసలయంబునకు దశనరత్నాంకురజ్యోత్స్న కుసుమస్తబకంబుగా సహకారపల్లవాస్వాదకషాయకంఠకలకంఠకామినీ కోమలకుహూకారకోలాహలకరంబిత పంచమరాగ ప్రపంచంబునకు మించుఁజూపు కంఠస్వరంబునం బలికిన.

39


గీ.

వెలఁది మాలెత గాన దీవింపకయును
నొప్పెడిది గాన నూరకయుండకయును
ధరణి దేవుండు గైకొనె దాని మ్రొక్కు
గేలుఁదామర తిర్యగాందోళనమున.

40


ఉ.

శంబరవైరిసన్నిభునిఁ జారుతరోజ్జ్వలమూర్తి విప్రర-
త్నంబు మహాప్రధాను ప్రియనందనునిన్ సుకుమారుఁ జూచి ప్రే-
మంబు వహించియుం గొమరుమాలెత గన్నుల నవ్వు దేరఁగా
[76]సంబళిసంబళీ యళుకు సందడికిం దలమంచుఁ బల్కుచున్.

41


గీ.

బ్రాహ్మణుఁడు గాన లజ్జింపఁ బ్రాప్తి లేక
బాల ప్రౌఢయవోలెఁ దప్పకయ చూచి
చాటువడి యుండుమయ్య యీ సరసిలోన
నుదకమాడెదఁ[77]గాక పిన్నదియు నేను.

42


క.
  • అని పలుకుచుఁ గొలనికి డిగఁ

జని మాలప్రమద దాను సఖియు నొనర్చెన్
వనకేళితరంగ లురు-
స్తనభారాస్ఫాలనమున జర్జరములుగాన్.

43


చ.

పడఁతి పసిండిడాలు [78]గనుపట్ట [79]హరిద్ర ప్రతిప్రతీకమున్
దొడసి సరోవరాంబువునఁ దోఁగి పయోనిధితీరభూమికిన్
వెడలి ధరాసుపర్వునకు నేత్రమహోత్సవమయ్యె నప్పుడ-
ప్పుడ కలశాబ్ధిమధ్యమునఁ బుట్టిన యాదిమలక్ష్మియో యనన్.

44


గీ.

కొలను వెలువడి తడినూలు వలువ విడిచి
మణుఁగు పుట్టంబుగట్టి యమ్మగువ యొప్పె
[80]జలద మెడవడి వర్షావసానవేళఁ

గాశకుసుమాట్టహాససంగతియుఁ బోలె.

45


ఉ.

ఆ కలకంఠి యొయ్యఁ దడియార్చు నెడన్ జఘనాంతికంబులై
[81]కేకికలాపలీల నణకించి మధువ్రతమాలికాకృతిం
గైకొని యింద్రనీలమణిఖండవిలాసమలిమ్లుచంబులై
చీకటికొల్పె బ్రాహ్మణుని చిత్తము పెన్నెఱిసోగవెండ్రుకల్.

46


గీ.

చికురసంతతి నీరార్చి చెలువ తుఱిమె
సేసకొ ప్పొక(యింత దక్షిణము మలఁగ)
చన్నుఁగవ[82]సొంపు కక్ష[83]దేశముల మెఱుఁగు
బ్రాహ్మణుని యాత్మఁ బల్లవింపంగఁజేయ.

47


గీ.

దంతతాటంకచక్రమధ్యంబునందు
బాల కీలంచెఁ గంకేళిపల్లవంబు
బాడబుని నేయఁదలఁచు శంబరరిపునకుఁ
బ్రథమ మదియ నమస్కారబాణమయ్యె.

48


గీ.

పూనెఁ గుచముల వెలివాడపువ్వుఁబోణి
విప్పుగలయట్టి బండిగుర్వెందసరముఁ
బ్రథమరాగరసోద[84]యరక్తమైన
సచివనందను హృదయజసంగరమున.

49


వ.

అప్పుడు సుకుమారుండు నిజాంతర్గతంబున.

50


సీ.

ఏల చేయండు శేషేంద్రియంబులు నాల్గు
          నలినగర్భుఁడు లోచనములుగాఁగ
నెట్టు గల్గె విధాత కీ రూపనిర్మాణ-
          పరమాణువులు కోటిపరిమితంబు
లజుఁడు దీని సృజించి యాత్మ నువ్విళ్లూర-
          కెట్లుండుఁ గూతు మోహించినాఁడు
కల్పింపఁబోలు శృంగార[85]సర్గంబున
          దీని వాక్పతి [86]యున్నతి ఫలియించె


గీ.

దీని [87]నిఖిలావయవములు తీర్చితీర్చి
చేయునపుడు ప్రయాసంబుఁ జెందుటయును
నొయ్యనొయ్యన బ్రహ్మ నిట్టూర్పువుచ్చె
నదిసుమీ పుష్పసమయమందానిలంబు.

51


వ.

అని విచారిం[88]చుచు విప్రుండు చండాలకులకన్యకా*(మణి) దుర్లభంబగు సౌభాగ్యంబునకు నద్భుతంబందుచు దానితో సంభాషింపఁ గోరి చేరువ [89]నిలిచె జనంగమకన్యకారత్నమును నతని కిట్లనియె.

52


క.

ఎందుండి [90]యేఁగు దెంచితి-
రెం దరిగెద రిచట నునికి కేమి కతంబో
కందర్పరూపరేఖా-

సౌందర్యవిలాసవిభవ[91]సర్వజ్ఞనిధీ.

53


వ.

నిన్నుం జూచి సుఖామృత(హ్రద)ంబున మునింగిన చందంబున [92]రతిసముద్రంబును దేలిన విధంబున [93]సర్వానందంబుల కుపరిభాగంబున వర్తించు కరణి సకలమనోరథంబులకు సంకేతంబైన లాగున నా హృదయంబు నిర్వృతిం బొందియున్నయది.

54


ఉ.

క్రొన్ననవింటిజోదు నలకూబరు నైషధునిం జయంతునిం
బున్నమనాఁటిచందురునిఁ బోలినవాఁడవు రూపసంపదన్
నిన్నొకవిప్రుఁగాఁ బరిగణింపఁగవచ్చునె కల్లగాదు మా
యన్నల[94]తోడు చూడు పులకాంకురముల్ మొలచెం గుచంబులన్.

55


గీ.

అవనిసుర చింతకాయల కాజ్ఞ గాక
యరసిచూడంగ గ్రుక్కిళ్ళ కాజ్ఞ గలదె
యంటరాకున్న నేమి యంతంత నిలిచి
చిత్తమలరంగ నిన్ను వీక్షింపరాదె.

56


సీ.

కమలినీపత్ర[95]పాత్రములఁ గాసారోద-
          కముఁ దెచ్చి పాదపద్మములు గడుగఁ
జిలుక ముట్టని ఫలంబులు గోసికొని వచ్చి
          పరికించి యారగింపంగఁ బెట్టఁ
గాంతార[96]కర్పూర కదళికాదళముల
          సరసరీతులను వీజన మొనర్ప
నధ్వఖేదము వోవ హస్తద్వయంబున
          నూరుకాండము లొత్తి యుపచరింప


గీ.

వేడ్క[97]యయ్యెడు వినయంబు విస్త[98]రిల్ల
[99]భక్తి గొనఁసాగఁ బ్రమదంబు పారమేద
నీకు విప్రోత్తమునకు నీ నెలవులందుఁ
జెట్టదుర్జాతి యది నన్నుఁ జెఱిచెఁ గాని.

57


క.

ఇది హూణమండలం [100]బ-
వ్వది నున్నది చెంచుపల్లె వనమధ్యమునన్
మదననిభ యీ పుళిందా-
స్పదంబు వెలివాడ (జన్మసదనము నాకున్).

58


తాళ రగడ.

కనుఁగొనవలయును దౌదవ్వుల నెడ[101]గలిగి నిలిచియైనను మా యిండ్లన్
వనమధ్యంబున విప్రోత్తమ వెలివాడవనితలకు నేత్రోత్సవమై
యనిభృతపరభృతనఖ(శిఖరోల్లిఖితాంగణ)సహకారద్రుమశాఖా
ఘనఫలరసధారామృతపానోత్కంఠవివృత్తాననవటుకంబున్.

59


క.

[102]పాణసివారము కమ్మని
ప్రాణము నెఱజాణదేవరా వినవలదా
వీణావాద్యముఁ బాటయు

వేణుస్వానంబు వేనవేల్ చందములన్.

60


వ.

అని చండాలకన్యక పలికిన నవ్విప్రుండు భవితవ్యతాబలంబున.

61


సీ.

ఇది యసజ్జనగోష్ఠి యిది [103]మోహవిలసితం
          బిది [104]మహాపాతకం బిది యకీర్తి
యిది దుర్మదాంధత్వ మిది [105]కామవిక్రియ
          (యిది యాగ్రహావేశ) మిది కుదృష్టి
యిది నారకద్వార మిది ప్రమాదస్థలం
          బిది మౌర్ఖ్యకారణం బిది యనియతి
యిది యధర్మముత్రోవ యిది [106]పథప్రచ్యుతి
          యిది యధోగతిహేతు విది యకృత్య-


గీ.

మని విచారింప కవనీసురాధముండు
కలికి చండాలకన్యపైఁ గన్ను వైచెం
దీయతీయనివింట లేఁదేఁటినారి
శంబరారాతి మోహనాస్త్రంబు [107]దొడుగ.

62


వ.

[108]అప్పుడతండు నిజాంతర్గతంబున.

63


సీ.

మాంసంబు భక్షింప మనసు వెట్టిననాఁడ
          దాక్షిణ్యగుణము [109]విధ్వంసమయ్యె
గంజాయిఁ దినఁగ నుత్కంఠ చేసిననాఁడ
          లజ్జాభిమానంబు లుజ్జగిల్లె
హాలారసము గ్రోల నభిలషించిననాఁడ
          సూనృతోక్తుల సుద్ది చూఱవోయెఁ
బరకళత్రముల[110]పైఁ బడఁదలంచిననాఁడ
          ప్రజ్ఞావిలాసంబు పదటఁ గలసె


గీ.

నింక నేటికి వంచింప [111]నిలుపు నాకు
బరువె యీ పాపములలోనఁ బాపమొకటి
వరుస వేయింటిమీఁద జవ్వాదికొమ్ము
తివుటఁ జండాలకన్యకఁ గవయువాఁడ.

64


వ.

అని పరమసాహసంబు చేసి సుకుమారుండు చండాలకన్యకం జేరవచ్చి యిట్లనియె.

65


కవిరాజవిరాజితము[112].

సరసిజలోచన యొక్కమహాముని శాపవశంబునఁ బాణచివై
ధర జనియించినదానవు నీవిది తథ్యము కిన్నరభామినివో
గరుడపురంధ్రివొ [113]ఖచరవధూటివొ గాని జఘన్యవు గావిఁక నన్
ధరణిసురోత్త[114]ము దగ వరియింపు సుధాకరసూర్యులు సాక్షులుగాన్.

66


వ.

సామాన్యస్త్రీజనంబుల కిట్టి యమానుషలోకోచితంబులైన సౌభాగ్యంబు[115]లుం గల్గునె మునికోపవశంబున సముజ్ఝితదివ్యశరీరలగు దేవ[116]కాంతలు శాపవశోపనీతంబైన శరీరంబు నధిష్ఠింతురు తొల్లి [117]స్థూలశిరుండను మహాముని త్రిభువనలలామభూతయగు రంభ నేదేని యొక్కనిమిత్తంబున శపించెననియును దచ్చాపంబున నయ్యప్సరస

 బాడబరూపంబు ధరియించి మృత్తికాపతియందు శతధన్వుఁడను రాజును సేవించుచుం బెద్దకాలంబు మర్త్యలోకంబున నుండెననియును విందుము.

67


సీ.

జలజగర్భుని మానసంబు వేదంబులు
          దక్షప్రజాపతి దర్పకుండు
సౌదామనీవల్లి చంద్రికాలోకంబు
          సప్తజిహ్వ జ్వాలసప్తకంబు
రవిమయూఖములు నీరవని దుగ్ధాంభోధి
          మృత్యుదేవత[118]నోరి మెఱుఁగుఁబండ్లు
ముని కరిష్టాదేవికిని సంభవించిన
          దివ్యగంధర్వజాతిద్వయంబుఁ


గీ.

గారణంబులుగాఁ బుట్టినారు [119]పదియుఁ
నాల్గు కోట్లప్సరసలునా నాకసతులు
వారిలో నొక్కతెవు నీవు వారిజాక్షి
యేమి దుష్కృతిఁ బుట్టితోఁ హీనజాతి.

68


గీ.

తివుచుచున్నది భవదీయదృగ్విలాస-
మెత్తుకొనిపోవుచున్నవి యింద్రియములు
వెనుక ద్రొబ్బుచునున్నాడు మనసిజాతుఁ
డేమి సేయుదుఁ జెప్పవే యిందువదన.

69


గీ.

వనిత నీ చిత్తమున కేను వత్తునేని
కామతంత్రంబునకు సంచకర్వు గాఁగఁ
జుంబనము సేయని మ్మోష్ఠబింబ మిపుడు
గండుఁగోయిల చిగురాకుఁ గమిచినట్లు.

70


గీ.

అనుచు విప్రుండు తమకించి యంటుకొనియె
సమ్మతించియ యుండె నా చంద్రవదన
శూకలాశ్వంబు నస రేఁపఁ జొచ్చినప్పు
డనుమతింపదె యత్తళువైన బడబ.

71


వ.

ధీరోదాత్త [120]యగుట నమ్మత్తకాశిని చిత్తజాయత్త యయ్యును దత్తఱపాటు లేక యతనితో నిట్లనియె.

72


సీ.

కలుగుచున్నవి యనేకములు వికల్పము
          లాడుచున్నవి యపాయంబు లెదుర
నంతరాయము లసంఖ్యములు గన్పట్టెడు
          సందేహములు పెక్కు చాయవాఱె
నంకురితములయ్యె శంక లేరాళంబు
          వికృతు లెన్నేని యావిష్కరించె
శాఖోపశాఖలఁ జాఁగుచున్నది రట్టు
          గుఱిలేక యుదయించె గోసనాస

గీ.

యిన్నిటికి నోర్చి నీ కోర్కి యేను దీర్తు
నింతవానికి [121]నీకు నన్నీయ బరువె
యెప్పటికి [122]నిత్తునో లేక యీ శరీర
మిప్పటికిఁ జాలునో నిక్కమెఱుఁగఁ జెపుమ.

73


గీ.

మొదలఁ గక్కుర్తిపడి [123]కూడి పిదప వాయు
నొక్క కమలాననకు డిక్కి యుండఁజాలఁ
డడవిఁ బెక్కు పుష్పములయందు వ్రాలు
చంచరీకంబు మగవాఁడు సరియ సువ్వె.

74


ఉ.

చందురుఁ డంత చూడఁడు నిశా[124]సతి బున్నమనాడు గూడుచో
గందళితానురాగుఁడయి కానఁగవచ్చు నవోదయంబులం
జందము దప్పి మీఁద నొకచాయకు వచ్చుఁ గ్రమక్రమంబునన్
సుందరి పట్టునందుఁ బురుషుండును [125]నట్లయకాఁ దలంపుమీ.

75


వ.*

అనిన విని సుకుమారుండు.

76


క.

మగవారల నిందింపకు
తగవును బంతంబు నిజము ధర్మముఁ గృపయున్
మగవారికెగా కెందును
మగువలకుం గలవె చంద్రమండలవదనా.

77


సీ.

హరుని చిచ్చఱకంట నసమాస్త్రుఁ డీల్గిన
          రతిదేవి యెట్లు జీవితముఁ జెందె
బాండుభూపాలుండు పరలోకగతుఁడైనఁ
          గుంతి చావక యేమి కుడువనుండెఁ
బ్రథనాంగణమున సౌభద్రుండు చచ్చిన
          బ్రతికె నెట్లు విరాటరాజతనయ
సింధురా జస్తమించిన నేల దుస్సల
          కాషాయవస్త్రంబు గట్టుకొనియెఁ


గీ.

బంక్తిరథుఁ డన్యలోకసంప్రాప్తుఁడైన
నేల కౌసల్య ప్రాణమీ నెఱుఁగదయ్యెఁ.
దగవు ధర్మంబు పాడి పంతంబు లెట్లు
భామ లెట్లు వృథానులాపంబులేల?

78


గీ.

అనినఁ జండాలకన్యక యాఁడువారి
మంచితనమును మగవారి మంచితనము
సరియ కీడని మేలని చర్చలేల
మనకు మన యాడికలు తప్పకునికి చాలు.


వ.

విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకయను నప్సరసకుం బ్రభవించిన ప్రమద్వరయను కన్యక స్థూలకేశాశ్రమవనంబునఁ బాదమర్దితంబగు పన్నగంబు గఱచినఁ బ్రవిలుప్తజీవిత యగుటయు భార్గవుండగు చ్యవనునకుఁ బౌత్రుండు ప్రమతికొడుకు

 [126]రురుం డాయురర్ధం బొసంగి యయ్యంగన బ్రతికించెననియును, నర్జునుం డశ్వమేధాశ్వానుసారియై యాత్మజుండగు బభ్రువాహనునిచేత నాహవాంగణంబున (నతినిశాత) శరాహృతప్రాణుండైన నులూచి యను నాగకన్యక రసాతలంబుననుండి యేతెంచి (యుపచరించి) యుపగతప్రాణునిం జేసెననియు విందుము. మంచితనంబు లాఁడువారికి మగవారికి సరియ యద్ది యటులుండె నా పంతంబు వినుము.

80


ఉ.

నాకు మనంబునిండ నొక నమ్మిక సేయుము (సర్వకాలమున్)
గైకొనువాఁడ [127]నిన్ ననుము కాదన కెక్కడకైన వచ్చెద
న్నీ కొకటయ్యెనేని యవనీసురమన్మథ నిర్విశంకత
న్నాకముఁ జూఱ[128]వెట్టెద ధనంజయతీవ్రశిఖాముఖంబునన్.

81


వ.

అనిన విని సంతోషించి సుకుమారుండు.

82


సీ.

కలహంససంపద గల కలక్రేంకార-
          కలకలంబైన యీ కొలను సాక్షి
ప్రసవసౌరభనటద్బంభరంబైన యీ
          [129]ఫలినీలతామంటపంబు సాక్షి
ప్రచ్ఛాయశీతలోపరిభాగమైన యీ
          శశికాంతమణిశిలాస్థలము సాక్షి
తరులతాగుల్మసంతతపిధానాతప-
          వ్యాపారమైన యీ వనము సాక్షి


గీ.

మకరకేతను పాదపద్మములు సాక్షి
రతిమహాదేవి జఘనభారంబు సాక్షి
సత్య మెన్నఁడు నినుఁ బాయ సమ్మతించి
కౌగిలింపఁగఁ నీఁగదే కమలవదన.

83


వ.

అనినఁ జండాలి కరారవిందంబులు [130]మొగిడిచి సవినయంబును *(సగౌరవంబును) సానురాగంబునుగా నతని కిట్లనియె.

84


ఉ.

నేఁడు గృతార్థులైరి జననీజనకుల్ ఫలియించెఁ బుణ్యముల్
నేఁడు పురాకృతంబు లవనీరుహమూలనివాసియైన కా-
ట్రేఁ డిలు[131]వేల్పు నేఁడ యొనరించె మనోరథద్ధిసంపదల్
నేఁడుగదా (సువార మిది నీ కృపఁ) గంటి ధరాసురోత్తమా.

85


ఉత్సాహ.

మలుసమర్త నంటకుండి మాలదాన నగుట నేఁ
గలయ [132]నీళ్ళనాడి కడవ గ్రంత యంటుకొనుటకై
కొలనఁ గ్రుంకిపోవుచుండి కుసుమబాణనిభుని ని-
న్నలఘు(తేజు) లోచనంబు లలరఁ జూచి వలచితిన్.

86


గీ.

ఏమి సేయుదు నీకు నెట్టిత్తు నన్నుఁ
[133]బచ్చిముట్టునఁ గలుగు బీభత్స మెఱిఁగి
[134]యిచ్చగింపక యుండ నేనెట్లు నేర్తు
నధికతరమైన మన్మథాయత్తు నిన్ను.

87


వ.

అనిన సుకుమారుండు చండాలకన్యక కిట్లనియె.

88

శా.

ఏమాసించినఁ బ్రాణరక్షకయి యేమేఁ బాపముల్ సేసినన్
భామా చెల్లుఁ బురాణసంహితలఁ జెప్పన్ విందుమే కాదె వి-
శ్వామిత్రుం [135]డెడరైనచో శునకమాంసంబున్ భుజింపండె నీ
వ్యామగ్రాహ్యకుచంబు లంటి యిదె [136]నా ప్రాణంబు రక్షించెదన్.

89


వ.

ఇదె యెదుర (ససంభ్రమభ్రమద్భ్ర)మరకుల చరణనఖశిఖాశిఖరవిశీర్యమాణ కుసుమకేసరరేణు త్రసరేణువిసరపిశంగితోపకంఠంబు లతామండపం బిదె వెనుకఁ గుటిలశుకత్రోటికోటివిపాటిత మధురఫలరసధారాసార దుర్దినాయమానాభ్యంతరప్రదేశంబు చూతతరువాటికాభ్యాశంబిదె కెలన మదకలమల్లికాక్షపక్ష[137]పాళీనవపవనసంపాతకంపమాన కమలకేసరపరాగధూళీవిరచితాళీక సంధ్యానుబంధచకిత చక్రవాకనీడోద్భవక్రీడానీడంబులు, సరససైకతవేతసీనికుంజక్రోడంబు లిందు నీకు నింపు వుట్టినట్టియెడ నన్ను మన్నింపు మంటకున్నదాననని భయంబందకు కుసుమసమయంబు గదా ఫలావాప్తికి మూలంబింకఁ గాలక్షేపంబు చేసితేని కందర్పుండు దర్పాతిరేకంబున భవద్భ్రూవల్లీమతల్లికిం దల్లియగు [138]నించువింటిం బద్ద దిగిచి కొదమ తుమ్మెదఱెక్కగఱిగట్టిన పూమిట్టకోలల హృదయం బుద్ఘాటించి చంపుఁ జంపకకుసుమగంధీ ప్రాణంబు రక్షింపుమిదె నీకు సేవాంజలి యని కంకణఝణఝణత్కారంబు తోరంబుగా సుకుమారుండు నఖకిరణపరంపరాకుసుమ కుట్మలాభిరామంబులగు కరకిసలయంబులు మోడ్చి ఫాలభాగంబునం గీలించిన.

90


శా.

వాలాయంబుగ నద్ధరాసురుఁడు దన్ వాంఛించినన్ మందహా-
సాలంకారమనోజ్ఞమైన ముఖ మొయ్యన్వాం[139]చి చండాలి యా
లీలా[140]భావము కీలెఱింగి నవమల్లీకుంజమధ్యంబునం
గేలీతల్పముఁ దీర్చెఁ[141]బో మృదులకంకేలీప్రవాలంబులన్.

91


వ.

అనంతరం [142]బధరీకృతకుసుమాయుధరూపసంపన్నుఁడగు నవ్వసుధానిలింపుం డపహసితసురసిద్ధగంధర్వవిద్యాధర లీలావిలాసినీవిలాసవతి యగు నవ్వెలివాడచేడియం గూడి సురతసౌఖ్యం [143]బనుభవించె నంత.

92


ఉ.

కాయజవిక్రియం [144]బడఁగఁ గానికులంబున సంభవించి య-
న్యాయము సేయునే యిటు దురాత్ముఁడు వీఁడు [145]త్రపాభిమానముల్
మాయఁగఁదట్టి యంచు నతిమాత్రము లజ్జితుఁడైన కైవడిం
దోయజషండబాంధవుఁ డధోముఖుఁడయ్యె నభోఽంగణమ్మునన్.

93


గీ.

గగనయానవేగంబున గలమరించి
కడుపునిండంగఁ గ్రోలిన కమలమధువుఁ
గ్రక్కెనో నాఁగ గగనమార్గంబునందు
భానుబింబంబు రక్తాతపంబుఁ గాసె.

94


శా.

వ్రాలెం బశ్చిమశైలశృంగముపయిం బ్రత్యగ్ర[146]మధ్వాగమో-
న్మీలత్కింశుకకోరకస్తబకకాంతిన్ భానుమన్మండలం-
బాలంబించె మరుండు హస్తమున దాక్షారామలీలావతీ-
భ్రూలేఖానిభవిభ్రమాభ్యుదయముం బుండ్రేక్షుకోదండమున్.

95


క.

క్రుంకె విభాకరంబము
పంకజషండములు మొగిడెఁ బ్రత్యగ్వీథిం
గంకేలీతరుపల్లవ-
సంకాశచ్ఛాయఁ గొమరుసంజ జనించెన్.

96

గీ.

పద్మినీషండములనుండి పాసి చనియెఁ
గోకమిథునంబు లత్యంతశోకపరతఁ
దోన యేతెంచె భ్రమరసందోహ మపుడు
కంఠలోహార్గళంబుల కరణి [147]మొఱయ.

97


వ.

ఇవ్విధంబునం బ్రతీచీకర్ణపూరరక్తోత్పలంబును జక్రవాకచక్రవాళకులచక్రవర్తియునగు మార్తాండుండు లోకాంతరంబున కవతరించిన గ్రమంబున నంబరతటాకవికచకమలినిసంజ మంజుమంజిష్టాపరాగసౌష్ఠవంబు [148]సంధించెఁ గృష్ణాగురుపంకవల్లికల యుల్లాసంబు నుల్లసంబాడుచుఁ జిలుపచిలుప చీఁకటి సిద్ధవిద్యాధరనితంబినీజనంబుల చెక్కుటద్దంబులతోడం జరలాడె [149]సాంధ్యదేవార్చనా బలిపిండంబులుం బోలె గగనమండలంబున వెండి[150]తగడుఁ దెగడి క్రిక్కిఱిసి చుక్కలు వొడిచెఁ బురుహూతాంతఃపురపురంధ్రీవిలాసదర్పణంబు దర్పకుని [151]మాటుఁ బొంది చందురుం డుదయగిరిశృంగశృంగాటకంబునఁ [152]బటికంబు గుండు చందంబొందె నప్పుడు చండాల*(కుల)వరారోహ వాహకుం డెక్కి విడిచిన వారువంబుఁ గొదమయుం బోలె సంభోగంబునం దృప్తి చని తనివోవని కౌతుకంబున సుకుమారుఁ గౌఁగిటం జేర్చి యిట్లనియె.

98


ఉ.

అల్లదె వేఁటపల్లె యట నావల మా వెలివాడ యావలన్
భల్లనిపాతమాత్రమునఁ బర్వతనిర్ఝరసింధు వావలం
దెల్లని గోపురంబుల నతిప్రమదావహమైన రోహిణీ-
వల్లభమౌళిభామిని నివాసము (లా మహిత) ప్రదేశముల్.

99


గీ.

ప్రతిభ సతతంబుఁ గొల్తు రా భద్రకాళి
జగతి నేఁబదియాఱు దేశములవారు
దశదినంబులు సింహకేతనము నిలిపి
హూణభూమికి దైవ మీ యుత్పలాక్షి.

100


వ.

నీ వమ్మహాస్థానంబున వసియింపు మేను నీకు నాయావేళలఁ బరిచర్య [153]సేయుచు వంచన బయల్పడకుండ మెలంగెద సర్వకలావిశారదుండవైన నీకుం బ్రాకారగోపురద్వారవేదికా*(ప్రాకార)ప్రఘాణకుట్టిమహట్టసౌధవీథీవిటంకంబులం గావ్యగోష్ఠీపరిహాసకథా బిందుమతీభిత్తికాప్రహేళికాభావనసుభాషితశ్రవణంబు, వారవిలాసినీదర్శనంబు, వైతాళికస్తుతిపాఠకంబు, దురోదరక్రీడ, చిత్రకర్మంబు, వీణాస్ఫాలనంబు మొదలయిన వినోదంబులం [154]బ్రొద్దుపుచ్చం గలిగెడి వెండియు.

101


క.

వెలివాడకుఁ గడుఁ జేరువ
సెలయేటికిఁ బొరువు [155]తాళ్ళుఁ జిట్టీఁదులు నా-
వలఁ దఱచు భద్రకాళీ-
నిలయం బది లెస్స నీకు నెలవు వసింపన్.

102


గీ.

ప్రొద్దు వోకుండ [156]ముందటఁ బొదమ నీవు
కాళికాస్థానమునకు నీ [157]కాలిత్రోవ
విప్రగృహమున నీకు నే విందొనర్తు
ధర్మమిషమున నింటిపెద్దలకు జెప్పి.

103


వ.

(అని చండాలి) చెలికత్తెయుఁ దానును వేఱొక్కతెరువున నిజనివాసంబునకుం జనియె సుకుమారుడు చెఱువుకొమ్ము దాపలం బట్టుకొని విపినషండంబు నడుమఁగా బక్కణంబునకు దక్షిణంబు(న వెలివాడ) యొరసికొని పోయి [158]కాలిత్రోవం జని సెలయేఱు గడచి ముందట.

104

సీ.

[159]బ్రహ్మ యెక్కెడి జాలపాదంబునకుఁ గేళి-
          వసతియైన సరోజవాటితోడ
నైంద్రవాహనమైన యైరావణగ(జంబు
          నోరూర్చు మోకయిందువులతోడ)
వైష్ణవరథమైన వైనతేయున [160]కాఁగ
          నిరవైన ప్రాకారపరిధితోడఁ
గౌమారయానశిఖావళంబునకుఁ దాం-
          డవమాడ సొబగైన గవనితోడ


గీ.

వేడ్క [161]మాహేశుఁ డెక్కెడి వృషభరాజు
దాఁక నిల్చిన కేళిభూధరముతోడ
సకల[162]శక్తినివాసమై చాలనొప్పు
చండిభవనంబు పొత్తెంచె సచివసుతుఁడు.

105


మ.

[163]తన దౌశ్శీల్యము తా నెఱుంగుట వెలిన్ దౌదవ్వులన్ నిల్చి దు-
ర్జనుఁ డాతండు లలాటభాగమున హస్తద్వంద్వమున్ మోపి యొ-
య్యన లోలోన నమస్కరించెఁ బటుగర్వారంభసరంభశుం-
భనిశుంభప్రథనక్రమప్రకటబాహాకేళికిం గాళికిన్.

106


ఉ.

మాలెత విందు బ్రాహ్మణకుమారుడు పక్కణవాసి వేణుకం-
డోలమునందుఁ దెచ్చిన గఠోరితచంద్రిక నిర్ఝరాపగా-
కూలమునన్ భుజించి ఘనగోపురవేదిక నిద్రవోయె న-
య్యాలరి బ్రాహ్మణుండు తుహనాచలకన్యకయాశ్రమంబునన్.

107


వ.

మఱునాఁడు ప్రాతఃకాలంబున నిర్ఝరాంధఃప్రవాహంబున నవగాహనంబు చేసి కపటసంధ్యావందనంబును గృతకజపంబును (మిథ్యా)సూర్యోపాస్తియు నడపి బ్రాహ్మణ[164]బ్రువుండు.

108


సీ.

దంతిదంతార్గళస్తంభభారముతోడ
          రాజిల్లు ఘనగోపురములు సూచి
గండశైలచ్ఛేదఘటితమై యొరపైన
          మేటికొమ్మలతోడి కోట సూచి
యమృతదీధితిలోని హరిణంబు వెఱపించు
          సౌధాగ్రసింహధ్వజములు సూచి
యాటమండపముపై నభ్ర ముల్లేఖించు
          జాంబూనదత్రిశూలంబు సూచి


గీ.

చమురుగా(కులు కుసు)మగుచ్ఛములు వోలె
సకలశాఖోపశాఖల సంశ్రయింపఁ
బుష్పితాశోక[165]పాదపంబులునుఁ బోని
నింబములు సూచి యతఁ డద్భుతంబు సెందె.

109


ఉ.

కాళికదివ్యమందిరము (కట్టెదురం బశుకంఠ)నాళకీ-

లాలరసంబు గ్రోలు నభిలాషమునం జనుదెంచియున్న వే-
తాళగణంబు వోలె నతిదైర్ఘ్యమునన్ దివి దాఁకియున్న హిం-
తాళవనంబు గన్గొని యతండు మహాద్భుతమందె నాత్మలోన్.

110


ఉ.

పైపయి గర్భగేహమునఁ [166]బన్నికమీఱి వెలుంగు మాలికా-
దీపశిఖాప్రరోహములు దేఱగఁ జూచి యనుస్మరించె లో-
నా పృథివీసురుండు మహిషాసురమస్త(కశోణితార్ద్ర)దు-
ర్గాపరమేశ్వరీపదనఖంబుల [167]రూపము సంవదించినన్.

111


గీ.

[168]సదనవనవాటికానికుంజములయందు
నెలుక లధరోష్ఠసంపుటంబులు గదల్ప
శక్తిమంత్రాక్షరంబులు జపముసేయు
నవియువలె నున్న నద్భుతంబందె నతఁడు.

112


సీ.

మంత్రవాదులతోడి మైత్రి సంపాదించు
          యంత్రవాదులఁ గని యాదరించు
సిద్ధయోగీశ్వరశ్రేణి సంసేవించు
          ధా(తువాదులకు వం)దనము సేయు
కదలి [169]వశ్యాశ్చర్యకథ లెఱుంగఁగఁగోరు
          బిలము సాధింప నపేక్ష సేయు
బహుదేశభాష లభ్యాసింప వాంఛించు
          శల్యతంత్రముమీఁదఁ జాఁపు మనసు


గీ.

(ఘుటిక కట్టఁగఁ) బెన్నిధి [170]గుద్దలింప
నింద్రజాలంబు వన్నంగ నిచ్చగించుఁ
[171]గట్టిభవనములకు సురంగములు ద్రవ్వ
నేర్చుకొనుఁ బ్రత్యహంబును నీచబుద్ధి.

113


చ.

[172]బతి చెడి మాంసభుక్తి మధుపాన జనంగమవంశభామినీ
రతిఁ బరతంత్రుఁడై నడుపుఁ [173]బ్రత్యయమున్ ధరియింపుచుండు న-
ప్పతితుఁడు గంగమట్టియయుఁ బ్రన్నని నున్నని నీరుకావిదో-
వతులును (బ్రహ్మసూత్ర)ములు వంశ్యులయిండ్ల [174]భుజించు కోరికన్.

114


గీ.

మాధుకరభిక్షలను స్వయంపాకములను
సత్రభోజవములఁ బితృశ్రాద్ధములను
విందులను దేహయాత్ర గావించు నతఁడు
వేదశాస్త్రపురాణప్రవీణుఁ డగుట.

115


సీ.

నీరాట నెపముగా నిర్ఝరంబుల కేఁగి
          సవిధవానీరకుంజముల [175]నొండె
భూధరంబుల కిప్పపువ్వు దే ననిపోయి
          కందరామధ్యభాగముల [176]నొండె

[177]శిశిరభూధరకన్య సేవింప ననిపోయి
          [178]నక్తమాలముల నెన్నడుమ [179]నొందె
కలమ సస్యక్షేత్రములకుఁ గూళ్ళొగి మోసి
          శణవాటికాప్రదేశముల [180]నొండె


గీ.

నెట్టు [181]కనుఁబ్రామి వచ్చునో యింటివారి
[182]నెట్టు (వెరవదొ యొం)టిమై నిక్క కరుగ
నతివ పగలైన మాపైన నతనితోడ
నిచ్చ [183]నొకసారి సాగించు నిధువనంబు.

116


వ.

[184]ఒక్కనాఁ డక్కనిష్ఠవర్తనుండు పక్కణశబరులం గూడి కరిక్రవ్యాదంబు(లగు కుక్కలం బట్టు)కొని ప్రత్యుషఃకాలంబున విపినవీథుల [185]నీవారభసలవిఘటితసరఃకమలషండసౌరభోద్గారభరిత దిక్కటాహంబు కరటిమార్గం బిదె, విదళితసమస్తముస్తాశకలసారంబు వరాహయూథపథం బిదె, కఠిన[186]విషాణకోటివిభిద్యమాన వల్మీకధూళిపాళికానిచుళిత తరుపలాశంబు మహిషవర్త్మం బిదె, దూర్వాప్రవాళచర్వణ[187]హరిచందన పరిపాండురంబు [188]హరిణమార్గం బిదె, [189]కటుదీర్ఘఘర్ఘరవ్యాక్రోశంబు కర్కరేటుకులకులాయస్థానం బిదె, కహ(కహారా)వంబు, దాత్యూహవ్యూహప్రదేశంబు ననుచు నాఖేటకౌతుకంబున నాఖేలనక్రీడావిహారంబుల [190]నృశంసుండై, ప్రాణిహింస [191]యొనర్చుచు వెండియు.

117


గీ.

పాపకర్ముండు కాంతారపథమునందు
[192]నదరిపా టొంటినంటి బ్రాహ్మణుల మొత్తి
యవహరించిన విత్త మన్యాయపరత
నంత్యజస్త్రీయుఁ దానును ననుభవించు.

118


గీ.

ఇవ్విధంబున సుకుమారుఁ [193]డీలు వుడిగి
మాలచిగురాకుఁబోఁడితో మనువు మనఁగ
వచ్చె నొయ్యన మధుమాసవాసరములు
[194]వాసితాశోల్లసత్ఫుల్లకేసరములు.

119


సీ.

కామినీగండూషకాదంబరీధారఁ
          బులకించె నారామభూమిఁ బొగడ
చివురాకుఁ జవిచూచి చవిచూచి [195]యెలుఁగించెఁ
          బంచమస్వరమునఁ బరభృతంబు
సంఫుల్లకోరకస్తబకాచితంబైన
          కొరవిపై [196]భ్రమరించెఁ గొదమతేఁటి
పరిపక్వసహకారఫలరసాస్వాదన-
          [197]మదమునం గీరంబు చదువదొణఁగె


గీ.

విటవిటీసముదయములు వివిధవిధుల
నుపవనక్రీడ సల్పిరి యుబ్బుమిగిలి
యఖిలజనులకు సంతోష మావహించె
మాసరములైన [198]మధుమాసవాసరములు.

120


వ.

ఇట్లు సకలజనమనోహరంబులగు మధుమాసవాసరంబుల(యందు), [199]నప్పాపిష్ఠుఁడు చండాలకన్యకం దగిలి

 యొండెఱుంగక లజ్జ యుజ్జగించి మానం బూనంబు చేసి కులంబు పదటం గలిపి శీలంబు పరిత్యజించి దిట్టకూళయై కన్నుగానక కావరంబెత్తి తిరుగుచుండఁ గర్ణాకర్ణి నతని దుశ్చారిత్రంబులెల్ల విని [200]యెక్కడెక్కడ నాడికొనం దొణంగి రంత నెంతేనియుఁ [201]దేటతెల్లయైన యతని దుర్వర్తనంబు ప్రసంగించి ప్రకాశంబుగా నాడుచుండి రంత.

121


క.

క్రూరాత్ముఁ డితఁ డనఁగాఁ
జోరుం డితఁ డనఁగ నితఁ డశుద్ధుం డన దు-
శ్చారుఁ డితం డనఁగా సుకు-
మారున కపకీర్తి హూణమండలిఁ బ్రబలెన్.

122


వ.

అంత నొక్కనాఁ డతండును నదియును బాతాళపంకకలుషంబగు మహాజలధిపూరంబునుం బోలె నంధకారంబు తోరంబై దిక్కులఁ బిక్కటిల్ల బహుళపక్షంబు*(నాఁటి) రాత్రి కాళికాగోష్ఠంబు కెలన జీర్ణోద్యానంబు నడుమ నక్తమాలతరుషండంబులోఁ దార కల్పించిన సంకేతస్థలంబునం దృణకుటీరంబునం గోద్రవ[202]పలాలపర్యంకంబున మదిరోమదోద్రేకసంభవంబైన మదనావేశంబున మనోభవశర[203]సీత్కారంబులనుం బోలె సీత్కారంబులవలనను, బంచబాణమాణిక్యకంకణక్వణితం(బులునుం బోని మణితంబులవలనను, ప్రద్యుమ్నరథరథ్యరాజకీరహేషాకలకలంబులం బోలె కులుకుటెలుంగులవలనను, శంబరారాతినికేతన లీలోద్యానవాటికాతరులతాసంవేష్టనబంధనబులుం బోని యాలింగప్రబంధంబులవలనను, మకరధ్వజోపహార ద్రాక్షాఫలరసపానానుబింబంబులుం బోని చుంబనంబులవలనను, కుసుమకోదండదండయాత్రాసమారంభజృంభమాణ విజయతుత్తుంభగంభీరభాంకారంబులకుఁ దాతలుం బోని ముష్టిఘాతలవలనను, బహువిధోపచారసంపన్నంబైన సురతంబు సాగించి రప్పుడు.

123


శా.

హాలాపానమదాతిరేకమున నయ్యబ్జాక్షి గుంజాఫల-
ప్రాలంబంబు నటింపఁ జూపెను [రతిప్రౌఢిన్ స్వపుంభావమున్]
దాళీగర్భపలాశకల్పితబృహత్తాటంకచక్రద్వయీ
డోలాడోలనముల్ మనోభవభుజాటోపంబు రూపింపఁగన్.

124


వ.

అనంతరంబ.

125


ఆ.

కేలు గేలఁ బెనఁగఁ గాల్గాలఁ బెనఁగంగ
వారు చొక్కి [204]సురతపారవశ్య-
నిద్ర జెంది రపుడు నిశ్వాసమారుత-
ప్రమదములను నట్టి సమయములను.

126


మ.

కనియె నిద్దురవోయె మేలుకొనియెం గర్లుబ్బ గాంధారిప్రొ-
ద్దున వానీరము పువ్వు రాల్చు తఱి ముత్తో కంకటిం గూడి యొ-
య్యనఁ గోర్కొయ్యలు పశ్చిమాచలము డాయంబోవఁ గాత్యాయనీ-
వనమధ్యంబున బ్రహ్మబంధువు కుటీవాసాంతరాళంబునన్.

127


వ.

మేలుకాంచి తనదౌర్జన్యంబు కారణంబుగా హూణమండలంబునం బట్టిన రట్టుసడి నిమిత్తంబునం దన కచిరకాలంబున గా[ఁగ]ల ప్రాణాభిమానభంగంబు దర్కించి పరదేశంబునకుఁ బోవువాఁడై చండాలిక మనంబునుం దనమీఁదం గల యనురాగంబునుం దెలియు పొంటె తత్కాలంబున మేలుకనియున్నదానితో నిట్లనియై.

128


క.

సడియును రట్టును రవ్వయుఁ
బొడమెన్ నాకిపుడు హూణభూమండలిలో
బడితి[ని] నిట నీ దేశము
విడిచి చనన్వలయు నకృతవిషయంబునకున్.

129

గీ.

మగువ పరదేశమున కేఁగి మగుడి వత్తు
కొంతకాలంబునకు నన్యచింత యుడిగి
యుండు నీ[వు] పుట్నింటియం దోర్పు గలిగి
మరలి రాఁడెట్టు [205]పరదేశ మరిగి మగఁడు.

130


వ.

అని పలికిన నిర్ఘాతపాతంబునకంటె నిర్ఘృణంబైన యమ్మాటకు శిరీషకుసుమసుకుమారంబైన తన మానసంబున నుస్సురంచు పుల్కసి యాననంబు వాంచి నిట్టూర్పు నిగుడించుచు నూరకుండె నప్పుడు).

131


చ.

కువలయపత్రనేత్ర కనుఁగొల్కులయం దుదయించె బాష్పబిం-
దువులు ధరాసురుండు తనుఁ దోడ్కొని[206]పోవ కుపేక్షసేయున-
న్న వదరవిందచక్రమిథునంబు లసహ్యవశాంగజాగ్నిచే
రవులుకొనంగఁ బుట్టిన నిరంతరధూమము సోఁకియో యనన్.

132


గీ.

చామ హృదయంబుమీఁద హస్తంబు వైచె
నతఁడు తనుఁ బాసి యేఁగునో యనెడు భీతి
నుల్లమునయందు వసియించి యున్న తన్ను
వెడలిపోకుండ [207]నడ్డపెట్టెడు విధమున.

133


వ.

అనంతరంబ యా చాండాలి యతని కిట్లనియె.

134


గీ.

ఎట్టు వేగింతు సంసార మిచట నుండి
యేల నినుఁ బాసి యొంటి నా కిచట నుండఁ
గలుగనిమ్ము [208]బంధువులు పెక్కండ్రు నాకు
[209]బంధువు గలండె నాకు నీపాటివాఁడు.

135


శా.

ఇచ్చోటన్ మధుపానగోష్ఠి సురతం బిచ్చోట సంగీతకం
బిచ్చోటం బరిపాటి నీ కలకలం [210]బిచ్చోట మానోదయం
బిచ్చో నంచు భవద్వియోగమునఁ దా నెవ్వారికిం బ్రీతిగాఁ
జచ్చున్ మన్మథవేదనానలమునం జండాలి విప్రోత్తమా.

136


మ.

కరవీరప్రసవచ్ఛదారుణ [211]పయఃకాషాయవస్త్రంబుతో
శరతూలచ్ఛవి యజ్ఞసూత్రములతో జాంబూనదస్ఫూర్తిత-
స్కరమృత్స్నానిటలోర్ధ్వపుండ్రకముతో సాక్షా[212]చ్ఛుకబ్రహ్మతోఁ
దరమౌ నిన్ను మహాత్మ రేపకడ సందర్శించినం జాలదే.

137


ఉ.

ధీరత పూని నీవు పరదేశము వోవఁగ నేను రాక యీ
[213]యూరనె యుంటినే ద్విజకులోత్తమ [214]నిత్యముఁ గాళికాగృహ-
ద్వారవితర్దికాస్థలము దవ్వులఁ జూచినయప్పు డెట్లొకో
కూరిమి పేర్మి గుండియ దిగుల్లని తల్లడ మందునో సుమీ.

138


సీ.

తను నిద్ర మేల్కొలిపిన మాత్రమున జర-
          త్కారుండు విడువఁడే ధర్మపత్ని
జమదగ్ని కొడుకుచేఁ జంపింపఁడే భార్య
          లవమంత దోష ముల్లమున [215]నిల్ప
[216]యొకమాటి తప్పుగావక యహల్యాదేవి

          నక్షపాదుఁడు ఱాయియగుమనండె
స్రుక్కి సన్నంబుగాఁ జూడఁడే కోపించి
          సతి నరుంధతి వసిష్ఠర్షివరుఁడు


గీ.

తగవు ధర్మంబు పాడి పంతంబు నిజము
పువ్వుఁబోఁడుల యెడ లేదు భూసురులకుఁ
బ్రథమమున నీవు చేసిన బాస నమ్మి
మోసపోయితిఁ [217]గులములో నీసు వడితి.

139


సీ.

పద్మాకరమునకుఁ బసపాడఁ దెచ్చిన
          దైవంబు చలము సాధ్యంబుగాఁగ
ననురాగరసము నా మనములో నూన్చిన
          నయనేంద్రియములకుఁ బ్రియముగాఁగ
విడువ నిన్నెన్నఁడు విశ్వసింపవె యన్న
          నీ సత్యమునకుఁ బున్నియముగాఁగ
నిక్షుకోదండ మెక్కిడి బాణ మరిఁబోయు
          కందర్పునకు మహాఖ్యాతిగాఁగ


గీ.

[218]నెపుడు నీవు ననుం బాసి యేఁగి తపుడె
నీరనైనను నురినైన నెగడినైన
విడుతుఁ బ్రాణంబు [219]లిపుడ నీ యడుగు లాన
పలుమఱునుఁ బెక్కుమాటలు వలుకనేల.

140


గీ.

అనినఁ జిఱునవ్వు నవ్వి నీ మనసు చూడ
నంటిఁగా కేను నినుఁ బాసి యరుగఁగలనె
యిట్టిపట్టున నెవ్వఱు నెఱుఁగకుండఁ
[220]బోవుటయ లెస్స యీ హూణభూమి విడిచి.

141


గీ.

ఎల్లి శ్రీభద్రకాళికి నిద్దభక్తి
యాత్ర యొనరించి వెళ్ళుద మర్ధరాత్ర
మీ విచారంబు చెప్పకు మెవ్వరికిని
వారిజానన రట్టువడ్డార మిచట.

142


ఉ.

సంగరసవ్యసాచి[221]వరశాస్త్రవిశారదదేశికేశ్వరా
మంగళగీతవాద్యపరిమండిత [222]ముద్రకకుండలీకళా-
భంగురనృత్త భవ్యపరిభాసితసంతతనిర్మలాత్మకా
యంగజసన్నిభప్రథితహాట్టవిశేషమనోజ్ఞవర్తనా.

143


క.

గౌరీవల్లభసేవా-
పారీణ విరాజివిభవభక్తిప్రతిభా-
భారోన్నతదివ్యాంగా
సారసగర్భప్రభావ సర్వజ్ఞనిధీ.

144

మాలిని.

సరససుఖవినోదా సారశైవార్థమోదా
పరమపదవివేకా భానుతుల్యప్రభాకా
ధరణిధరసుధైర్యా దండసంగ్రామశౌర్యా
నిరుపమగుణధామా నిత్యకల్యాణసీమా.

145

గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర *(సకలవిద్యా
సనాథ) శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రి మాహాత్మ్యంబునందుఁ
దృతీయాశ్వాసము.

  1. ము. వేదప్రోదిత
  2. తా. జడత
  3. తా. సఖి
  4. తా. పంతంబున్ దధుధర్మముం
  5. తా. సిద్ధించునే
  6. ము. నేమిగా
  7. తా. కేవలమతంక
  8. తా. సరియె
  9. తా. బంతయున్
  10. తా. బుద్ధప్రక్రియల్
  11. తా. దు చిరస్త్రీల
  12. తా. అష్టమాది తోరంబున
  13. తా. డవ్యయుఁడు విశ్వకర్తయనుట నిధను
  14. ము. మొ ... ... నిధిగా; తా. మొగలిపూవిరిసెఁ గాదె
  15. తా. బ్రహ్మాస్మియం చాదురే; ము. మహాబ్రహ్మాహమం
  16. ము. యటె
  17. తా. దారెట్టిదో, లహహా
  18. ము. వారయే
  19. తా. తో
  20. ము. మదనసంఫుల్ల
  21. తా. తోఁ గలియు
  22. తా. తారహారవిభూష యక్షమాల్యముగ
  23. తా కంగంప్రేంఖో; ము. కంగప్రక్షా
  24. తా. బు
  25. తా. యెమ్మెయిఁ బల్కకున్నాడొ
  26. ము. యాడుచున్నాఁడొ... గర్వించియున్నాఁడొ శోకించినాఁడొ
  27. తా. ప్రకారముల
  28. తా. బరుచై
  29. ము. సిద్ధమ యతనిన్
  30. తా. వంతుండును
  31. ము. నిలువరుసఁ
  32. ము. గనుపట్ట
  33. తా. నుం
  34. ము. సమద
  35. (తాళపత్రములో) ఈ పంక్తులకు చాలినంత స్థల మూరక విడిచియున్నది.
  36. ము. డున్మహా
  37. ము. లో
  38. తా. మేసె గుంజె వలువల్ నిర్మోక; ము. మేనఁగూర్చె క
  39. ము. సమ్మోదమునను జేసె
  40. ??
  41. ము. డలఁతన్
  42. తా. వేళ
  43. తా. దప్పివోవంగ మధురోదకంబు గ్రోలి
  44. తా. దొండితీగలు
  45. ము. కలాపి పింఛమై
  46. తా. నా నిద్రమేల్కని
  47. తా. వీక్షించె
  48. తా. సంభావించి
  49. తా. ఎడన్
  50. ము. సంతాన
  51. తా. వొలయ
  52. ము. దోర్దండంబు
  53. ము. ఁబాసినట్లు
  54. తా. నాకృతిన్ తను వినిశ్చలదృష్టియు దేహయష్టియై
  55. ము. నకులయై యౌర యీ
  56. ము. జారు
  57. తా. మొక
  58. తా. ప్రావృడ్వేళల వోలె నలినాక్ష పయినీల
  59. ము. గరము
  60. ము. శరర్తువువోలె
  61. తా. యయ్యె
  62. ము. విస్తృత
  63. తా. తరళతర
  64. తా. సంకుపిత
  65. తా. విధంబున
  66. తా. సంయతుని
  67. తా. నిజాంతర్గతంబున
  68. తా. సంప్రభవమైన
  69. తా. బ్రాహ్మణులవలన
  70. తా. నెద్ది
  71. తా. నాది
  72. ము. ప్రసంగంబును
  73. తా. ప్రభావంబున
  74. తా. నభినవ
  75. తా. బగు
  76. తా. శంబళిశంబళీ యరకు
  77. తా. గాని
  78. తా. గల పచ్చ
  79. ము. హరిద్రముఁ దీరపంకముం
  80. ము. తా. జలధి వెలువడి
  81. తా. కేకరలోవలీల
  82. తా. నొప్పు
  83. తా. దేశమున
  84. తా. ఆరక్తమైన
  85. తా. సర్వంబున
  86. తా. యున్మది భవించి
  87. తా. యఖిలా
  88. తా. పుచు
  89. తా. నిలిచెదనని చనినం గన్యకా
  90. ము. యరుగుదెంచితి
  91. ము. సర్వస్వ
  92. ము. నతి
  93. తా. సర్వానందంబు లుపరి
  94. ము. యాన
  95. ము. పుటముల
  96. తా. కల్హార
  97. తా. యయ్యెడి
  98. తా. రింప
  99. ము. భక్తిగొనఁగఁ బ్రమోదంబు పారమేదు
  100. తా. బి
  101. ము. గలుగ
  102. తా. పాణచి
  103. తా. యసమ్మతదృష్టి
  104. తా. మోహవిలసితం
  105. ము. యాగ్రహావేశ
  106. తా. పద
  107. ము. దొడిగి
  108. ము. ఏయునప్పుడు
  109. తా. విధ్వస్తమయ్యె
  110. ము. వెంబడ
  111. తా. నిలువ
  112. [AB. దీని ఛందస్సు హరిగతి రగడకు దగ్గరగా వుంది. కవిరాజవిరాజితము కానేరదు.]
  113. ము. యక్ష
  114. ము. ముని న్వరియింపు
  115. తా. లు గలునేర్చునె
  116. తా. తాంగనలు
  117. తా. స్థూలశరీరుండను
  118. తా. నోర
  119. తా. మరియు
  120. తా. యగు
  121. ము. నన్నీగు టెరవె; తా. నీకు నం న్నింన్నుం బరచె
  122. తా. నైన నిత్తునో యీ శరీర
  123. తా. నీవు
  124. ము. నటి
  125. తా. నిట్లయ కా
  126. తా. రురుండనువాఁడు తన యాయువందు నర్ధం బొసంగి
  127. తా. నిన్ననిన
  128. తా. పట్టెద
  129. ము. వలని
  130. తా. మోడ్చి
  131. ము. వేలుపౌచు నొనరించె
  132. తా. నీళ్ళాడి కడువం గాంతయింటి కొనుటకై
  133. ము. బంచమని యింటఁ కల్గు బీభత్సునెఱిఁగి
  134. తా. యిచ్చగించుకొనుండ నేనెంత నేర్తు
  135. తా. డెడలైనచో
  136. తా. నేఁ బ్రాణంబు
  137. తా. పాధివిక్షేప ప్రభవసంపాత
  138. తా. నించువిల్లు దెగనిడం దిగిచి
  139. తా. చె
  140. ము. భావ మెఱింగి యేగి నతవల్లీ
  141. తా. బోఁటి మృదుకంకేళి
  142. తా. బధఃకృత
  143. తా. బు లనుభవించె నంత
  144. ము. బడయఁ
  145. తా. వ్రతాభిమానముల్
  146. తా. మృద్భాగ
  147. ము. మెఱయ
  148. తా. నధిష్ఠించె
  149. తా. సంధ్యాదేవతార్చన
  150. ము. తగటు
  151. తా. మారటం
  152. తా. పటికంపుగుండు చందంబునుం బొందె
  153. తా. సేయుదు
  154. తా. ప్రొద్దుపుచ్చుచుండం గలిగెడు
  155. ము. త్రాళ్ళు
  156. తా. ముందరఁ బొదము
  157. తా. కాలుద్రోవ
  158. తా. కాలుద్రోవ
  159. తా. బ్రాహ్మి
  160. తా. కుఁగా
  161. ము. మాహేశ్వరంబైన
  162. ము. భక్తనివాసమై
  163. ము. తనదౌ శీలము
  164. తా. ప్రవరుండు
  165. ము. పాదపంబులను జూచి
  166. తా. పన్నిన
  167. ము. డంబుల సంచరించినన్
  168. ము. సరస
  169. తా. వనాశ్చర్య
  170. ము. గుద్దలించు
  171. తా. గట్టు బాళములును సురంగా విధులను
  172. ము. స్థితి చెడి మాంస(భోజనము సేసి) యసంగమ
  173. ము. బ్రత్యహమున్
  174. తా. భుజించున్ గోరికన్
  175. ము. నొందు
  176. ము. నొందు
  177. ము. (శిఖరీంద్రవర)కన్య
  178. తా. నక్తతమాల నెన్నడుమ
  179. ము. నొందు
  180. ము. నొందు
  181. తా. కనువామి
  182. ము. నెట్లు (చీఁకటి నొం)టిమై నిక్కకరుగు
  183. తా. నొకవాలు
  184. తా. ఒక్కొక్కనాఁడ
  185. తా. నిదె రభసవిఘటిత
  186. ము. పాషాణ
  187. తా. హరిచ్చండపరిపాండురంబు
  188. తా. హరిణాధ్వం బిది
  189. తా. కదా
  190. ము. ఁగృశుండై
  191. తా. యొనర్పుచు
  192. ము. నదరిపాటున నొంటి
  193. తా. డిల్లు
  194. ము. వాసితాశోకసంఫుల్ల
  195. ము. యెలిఁగించె
  196. ము. బ్రమయించె
  197. ము. ముదమున
  198. తా. యమ్మాసవాసరములు
  199. తా. నప్పాపిష్ఠి
  200. ము. యక్కడక్కడ
  201. తా. తేటతెల్లంబైన
  202. ము. పలాశ
  203. తా. శరాత్కారంబులునుం బోలె
  204. తా. ము. యితర
  205. తా. పరదేశి
  206. తా. పోవ కుపేక్ష సేయు న, న్నవదినప్డు చక్రమిథునంబు. ము. పోక యుపేక్ష సేయ న
  207. ము. అడ్డుపెట్టెడి
  208. ము. పెక్కండ్రు బంధులును నాకు
  209. తా. బంధువుఁడు నాకుఁ గలఁడె
  210. ము. బిచ్చో, మనోజోదయం
  211. ము. రజః
  212. తా. త్తుక
  213. తా. యూరన
  214. తా. నిన్నును
  215. ము. నిల్పి
  216. ము. యొకమాటు
  217. ము. కులమునం దీసు
  218. తా. యెప్పుడేనేని ననుఁ బాసి యేఁగి తపుడు
  219. ము. లపుడు
  220. ము. పోవుటయు
  221. ము. నయ
  222. ము. మంద్రకరుండలీకళా