శివతాండవము/విజయా ప్రార్థన

వికీసోర్స్ నుండి

విజయా ప్రార్థన

కలకలరణత్కాంచీ, పంచాస్త్ర జీవనమూలికా
నిగడితహరప్రేమా శ్యామా[1] సదృక్షవపుస్స్థలీ
మునిజనమనఃపేటీ, చేటీకృతామరవల్లభా
జయతి కరుణాపాంగా, చంద్రావతంస సధర్మిణీ!

నిరావై ర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం
రహస్యంవేదానాం, లలిత లలితాన్‌ దృష్టివలయాన్‌
కిరంతీశ్యామాంగీ, కుచభర నమన్మధ్యలతికా
నటంతీ పాయాన్నః పరమపదసీమా, హరవధూః.

మరకతరుచా మైదంపర్యం, మునీశ్వరమండలీ
సుచరితఫలం, కాంతం, కటాక్ష తరంగితం
ప్రమదహృదయోపేతం, కదంబవనాశ్రయం
కిమపి సుభగం తేజశ్శివాఖ్య ముపాస్మహే.

నతానాం భక్తానాం నయనయుగ బాలార్కసుషమా
మహార్షీ ణామాశా, త్రిదశతరుణీ కైశ్యఘటితా
స్వసంపర్కోత్సేకా త్సపది శివయంతీ శివతనుం
శివంకుర్యాన్మాతుః పదవనజపాటల్యలహరీ!

మదిరాఘార్ణితనేత్రా
మదగజగమనా, మనోజ్ఞతరవదనా!
మనసి మమ సన్నిధత్తాం
మాతంగీ! మధ్య నిక్వణత్కాంచీ!

అనుభవరసికై ర్ఞ్నేయా
మాదిమజననీం! హృదబ్జమధుధారాం!
నీలమణిసదృశ దేహాం
బాలాం, తా మాశ్రయే మహోరూపాం!

  1. ప్రేంకణపు దీగె.