శశికళ/ఖేచరి

వికీసోర్స్ నుండి

ఖేచరి

ఖేచరీ గంధర్వ బాలా !
భూచరుడ నన్వేషి నేనూ

             గరుద్వయమును ముడిచి అస్మత్
             గాన పూజాపీఠి వాసించూ !

పల్లవాధరి ! దుధు వసన్త పు
పల్లవిని నీ వాలపింపగ

            ఝల్లుమని నా మొరడుహృదయం
            వల్లరీ సంపుల్లమయ్యెన్.

గ్రామములు మూర్ఛనలు మొరసెను
గతుల బేధాలెన్నొ మురిసెను

            జతుల వర్ణాలన్ని సుడులై
            మతుల పరవశతలను ముంచెన్.

స్థాయిత్రయములు అభినయమ్మయె
కాలత్రికములు నృత్త మాడెను

            తాలద్వా త్రిశన్మోహిని
            తాండవించిందీ !

గళము వీడిన ఖరహరప్రియ
వెలుగు తరగలు విరుచుకొనిపడె
 
              తళుకు తళుకని బ్రతుకు సర్వము
              కళానిధి అయ్యన్.

దేవి ! నందనవన సుమాలను
నీవు మలచితి స్వర సుమాలిక

              గ్రీవ భూషితదామ పరిమళ
              భావపూరిత దేవమూర్తిగ
                           నేను నిలిచితినే !