శతకకవులచరిత్రము/గ్రంథ ప్రవేశము

వికీసోర్స్ నుండి

గ్రంథ ప్రవేశము.

ప్రాచీనపాకృతశతకములు.

శతకరచనము ప్రాకృతమునందేకాక వేదపురాణములయందుఁ గూడనారంభ మైనట్లు పెక్కునిదర్శనములు కనఁబడుచున్నవి. కేవల స్తుతిమాత్రము లైన భాగములయం దనేకప్రదేశములలో పరమేశ్వరుని గుణవర్ణనమునకు సహస్రనామములఁ జెప్పుట, పలుమార్లు గుణవర్ణన మొనర్చుట మన కగపడును. ఒకనాడు చేసినపని పలుసార్లు చేసిన ఫలిత మధిక మని జపతపములు వృద్ధి యైనవి. ఆజపమొనర్చుటకు విధించిన నియమములయందు భగవద్గుణవర్ణనము నియమిత సంఖ్యగా నొనర్చుచుండిరి. స్తోత్రము లష్టోత్తరశత మని యుండుట పలువు రెఱిఁగినదే! కాని వేదపురాణములయందు గ్రంథమునడుమ సందర్భానుసారముగ మంత్రపుష్పము, ఏకాదశరుద్రములవంటివి-శతకములపోలికలు నియమితసంఖ్య గలప్రార్థనాదికము- లున్నను, అవి వేఱుగ వ్రాసినశతకములుకాని, చాటుప్రబంధములుకాని కావు. అందువలన వానినిఁగూర్చి వివరింపక, వేఱుగ శతకము లారంభ ఎట్లయినవి మనకుఁ దెలిసినంతలోఁ బరీక్షించి చూతము.

ప్రాకృతములో నిట్టి వేఱుశతకము లారంభమైనట్లు దెలియుచున్నవి.* అం దవదానశతక మనుపాకృతశతకమునందు పదివిభా

  • "A particular species of avadanas are those in which the ddha instead of a story of the past relates a prognasti18tion of the future. These prophetic anecdotes serve 184 the stories of the past to explain the present Karma * *

the species of avadanas occur sporadically also in the 1siaya and the Sutra, pitakas. They, however are grouped 18 arge collections with the object of edification or for e ambitious literary motives. A work of the first variety 187 Avadana Shataka” which is most probably the most 179 గము లున్నవి. పదిపదిపద్యములచొప్పున నూఱుపద్యములు కలవు. వీనికి దశకము లని పేరు. ఒక్కొక్కదశక మొక్కవిషయమును గూర్చి చెప్పుచుండును.

ఈసంప్రదాయ మిన్నివందలయేండ్లకుఁ బిమ్మట బయలుదేరిన మనశతకములయందుఁగూడ నిలిచియున్నది. పోతన్న దని నే ననుకొని ప్రకటించిననారాయణశతకమునం దీదశకములవిభాగ మున్నది. నామదశకము: ఇందుఁ గేవలమునారాయణునినామభేదములే యుండును.

మ. జగదాధారక భక్తవత్సలకృపా జన్మాలయాపాంగ ! భూ
     గగనార్కేందు జలాత్మ పావక మరుద్గాత్ర! ప్రదీపప్ర
     యోగి గణస్తుత్యమహాఘ నాశన! లసద్గీర్వాణ సంసేవితా!
     త్రిగుణా కార! ముకుంద! నాదుమదిలో దీపింపు సారాయణా!

దాశరథీశతకము నందలినామదశకములో "నాదుమదిలో దీపింపు” మనువాక్యముకూడ నుండదు. కేవలనామములే యున్నవి. ఇట్లే ఆదిదశకము, జ్ఞానవింశతి, అవతారదశకము మొదలగువిభాగములు మనతెలుఁగుశతకములలోఁ గనఁబడుచున్నవి. ఈవిభాగములు లేఖకులు కొన్నిఁట వ్రాయుట మానిరి. కొన్నిశతకములలోఁ గనఁబడుచునే యున్నవి. 17వ శతాబ్దము నందలిమన్నారుకృష్ణశతకములో


ancient of its kind. It is a collection of a hundred avadana legends. Since it was already rendered into Chinese in the first half of the 3rd century and şince it makes mention of the Dinara we may with certainty assign it to the Christian century. That it belongs to the Hinayana (హీనయాన) is indicated already by the character of the anecdotes; but this is likewise corroborated by the circumastances that in the stories relating to the present there are fraginents embodied from the Sanskrit canon of the Sarvastivadas relating to the Parinivana and other Sutras. In these legends the worship of the Buddha, plays a Great Part."

{P. 46. Literary History of SANSKRIT BUDDHISM.) దాససంగదశకము, జారదశకము, గోపాలనదశకము, దుష్టనిగ్రహదశకము, చోరదశకము నిత్యాదిగ విభాగించియున్నాఁడు. పైడిపాటి వేంకటనృసింహకవి తనరామచంద్రశతకమునందు స్తుతిదశకము, వాక్యోన్నతిదశకము', దాససంగతిదశకము, మనోవృత్తిదశకము, సంసార దశకము, మాయాదశకము, తత్త్వదశకము, అభేద, దీనత్రాణ, అవతార, నీతి, దశకము లని విభాగించియున్నాఁడు. కొందఱు వింశతులనికూడ విభాగించియున్నారు. ఈసంప్రదాయము ప్రాకృతశతకములనుండి పరంపరఁగా వచ్చుచున్నది. ఈవిభాగము మనప్రాచీనశతకములయందుఁ గనఁబడుచునేయున్నది. నామ, అవతారదశకములు ప్రతిప్రాచీనశతకమునందును సాధారణముగాఁ గనఁబడుచున్నవి. ఒంటి మెట్టరఘువీరశతకమం దీనియమ మున్నది.

పైని చూపినయవదానశతకము నందలిమొదటినాల్గుదశకములును కర్మస్వభావమును వ్యక్తీకరించుకథలను జెప్పును. అనఁగా నేకర్మ యొనర్చిన ప్రత్యేక బుద్ధుఁ డగుటకు వీలగునో యట్టికర్మల వివరించును. ప్రాకృతమునందు "వర్ణము” లని పాలిభాషలో " పగ్గము” లని పది పది విషయముల విభాగించుట యిట్టిగంథములలో నాచారము. ఫ్రాచీనబౌద్ధయుగమునుండియు నీయాచారాము కనఁబడుచున్నది. ప్రథమదశకము నందలికథ లన్నియు, మూఁడవదశకము నందలి కథలు చాలభాగమును భవిష్యద్విషయఫలసూచకములు. రెండవనాలవదశకముల యందు జాతకకథ లున్నని, ఐదవదశతకమునందు. " ప్రేత వస్తువు”ను గూర్చి వివరణముకలదు. ఒకఋషి సాధారణముగా మౌద్గ ల్యాయనుఁడు ప్రేతలోకమునకుఁ బోయి, తల్లోకవాసుల దుఃఖములఁ జూచి యొక ప్రేతము నెందుల కీజన్మమునకు వచ్చిన దని ప్రశ్నించును. ఆప్రేతము బుద్దునిఁ జూపును. బుద్ధుఁ డాప్రేతము పూర్వజన్మమున నొనర్చినపాపమునుఁగూర్చి చెప్పును. ఆపాపము దాన మీయమియో, యోగితిరస్కారమో, యైయుండును. ఆఱవదశకము మృగమానవులు మంచికార్యములు చేసిస్వర్గలోకవాసు లైనవారలకథల వివరించును. అర్హత (Arhat)నొందుట కనువగుకథలనుగడపటినాల్గుదశకములును వివరించును. శాక్యవంశార్హతుల నేడవదశకము. స్త్రీల నెనిమిదవదశకము, అనిందితచరితులవర్తనమునుగూర్చి తొమ్మిదవదశకమును, ముందు పాపులై నరక మొంది, మంచియొనర్చి సుఖు లైనవారిఁ గూర్చి పదవదశకమును వివరించును. (48 పుట)

ఇట్లే కర్మశతకముకూడ “అవదానశతకము” వంటిప్రాచీనశతకము. అవదానశతకము సంస్కృతమునం దున్న దే కొంచెముశీర్షికల భేదముతో నపదానళతక మని "పాలిభాషలో” నున్నది. కర్మశతకము నందు నూఱుకర్మలనుగూర్చి కథ లున్నవి. దీనికి టిబెటుభాషాంతరీకరణముమాత్ర మున్నది. మూలము లేదు. చీనాభాషాలోనికిఁ బరివర్తించినప్రాచీనగ్రంథ మున్నది. దివ్యావదానశతక మని మఱియొకటి కలదు. ఈమూఁడవశతకము పైగ్రంథములతరువాత నే పుట్టినది. మూలము సంస్కృతములో నున్నది. (52, 53 ఫుటలు)

ఇవి యన్నియు వినయపిటకము నుండి పుట్టి యుండవచ్చు నని తత్త్వజ్జు లనుచున్నారు. ఇందశ్వఘోషునిసూత్రాలంకారమునుండికూడ గాథలు తీసికొని చేర్చిరి, దివ్యావదానమునందు వచనము, గాథలు కూడ నున్నవి. దీర్ఘసమానభూయిష్టము లగుసత్య మైన కావ్య శైలి గల శ్లోకము లున్నవి. సులభ మైనవచనములలో సంస్కృతభాగము లున్నవి.. దివ్యావధానమున విషయవిభాగము లేదు. భాష శైలియు సక్రమముగ లేవు. కావున వివిధగ్రంథములనుండి నిది సంపాదితమైయుండును. యేకకర్తృకము కానేరదు. కావుననీగ్రంథము వేర్వేరు కాలములకుఁజెందినకావ్యభాగములకూర్పవచ్చును. ఇదిమూఁడవశతాబ్దమునాఁటికే చీనా భాషలోనికిఁ బరివర్తన మొందె నని చెప్పుదురు. ఇందశోకుఁడు, పుష్య మిత్రుఁడు, శుంగవంశముసుగూడఁ బేర్కొనియుంట దీనికాలనిర్ణయము విచార్యము. ఇందు “దీనార " శబ్దము పలుమార్లు ప్రయోగించుటచే నిది రెండవశతాబ్దమునకుఁ బిమ్మటఁ బుట్టిన దనియే నిర్ణయింప వలెను. అశ్వఘోషునిసూత్రాలంకారమునుండి యిందుదాహారణము లుంట నిది యాతనికిఁ బిమ్మటిది కావలెను. ఇందలి "శార్దూలకర్ణుని” కథ క్రీ. శ. 265 నాఁటికే చీనాభాషలోనికి బరివర్తించినట్లు ప్రబల నిదర్శనము లున్నవి. (54, 55 పుటలు)

"కల్పద్రుమావదనమాల” యనునది యవదానశతకమునుండి కథలు తీసి కూర్చినమఱియొక గ్రంథము. ఇట్టివే యశోకావదనమాల, రత్నావదనమాలయు ననికూడ నున్నవి. ఇవి పురాణసంప్రదాయము చొప్పున నున్నవి. ఇందలిశ్లోకములు నట్టివ!

ఇవి యన్ని యు లిఖితగ్రంథములు. అచ్చు కాలేదు. కొన్నిఁటికి టిబెటు, చీనా భాషాంతరీకరణములు మాత్రము ముద్రితములై యున్నని.

శైవ వైష్ణవమహాత్మ్యాములు స్తోత్రములును దెల్పుకొన్ని భాగములు పురాణములయం దున్నట్లే బుద్ధదేవునిస్తోత్రములు కొన్ని కలవు. [1]

ఇవి వేఱు వేఱు కావ్యములే. కొన్ని గ్రంథములలోని కేక్కీనవి. కళ్యాణపంచవింశతిక , లోకేశ్వరశతకము, సుప్రభాతస్తవము, పరమార్థనామసంగీతి, మొదలగున వీమాదిరిది. ఇందు కళ్యాణపంచవింశతిక అమృతానందుఁడు 25 స్రగ్దరలలో వ్రాసెను. లోకేశ్వరశతకము వజ్రదత్తుఁ డనుకవి నూఱుశ్లోకములలో లోకనాథుని స్తుతించుచు వ్రాసెను. శాక్యముని, బుద్దులు, బోధిసత్వులస్తుతి నలువదితొమ్మిది శ్లోకములలో నున్నదానినే సుప్రభాత స్తవముందురు. భగవద్గుణ విశేష స్తవముకలది పరమార్థనామసంగీతి. .

అవలోకితేశ్వరునిభార్య యగుతారాదేవినిగురించిన వనేక స్తుతులున్నవి. . ఇవి మిక్కిలి పవిత్రమైనవి. సర్వజ్ఞ మిత్రుఁ డనుకా శ్మీరదేశపుఁగవి తారాదేవినిఁగూర్చి స్రగ్ధరాస్తోత్రము వ్రాసెను. (panegyric). దీనికే "ఆర్యతారాస్రగ్ధరాస్తోత్ర” మని మారుపేరు. "స్రగ్ధర ” యనఁగా హారధారిణి. ఈపేరు తారాదేవికిని, శ్లోకనామమునకుఁగూడఁ జెందును. కవి యెనిమిదవశతాబ్దమువాఁడు. కాశ్మీరరాజున కల్లు:డే కవి యని తారానాథుఁ డనుచున్నాఁడు. ఒకప్పు డీతఁడు దాతయై యొకనరమేధ మొనరింపఁ బూనుకొనినరాజున కమ్ముడువోయి విప్రుని విడిపించి సంతోషపెట్టి, తాను "ఆర్యతారానామాష్టోత్తర శతస్తోత్రము” వ్రాసి తాను ప్రాణభయమునుండి తప్పించుకొని నూఱుమంది రాజకుమారుల ప్రాణముల రక్షించెను. ఈ 108 శ్లోకములును తారాదేవి నామగుణవర్ణనమే. ఆమెస్తుతియే!


ఏకవింశతిస్తోత్ర మనునది మఱియొక గ్రంథము.

ఇవి యన్నియుఁ బాశ్చాత్యులు భాషాంతరీకరించుకొనిరి. శాలివాహనసప్తశతి మనశ్రీనాథుఁడు భాషాంతరీకరించినను మనకుఁ జిక్క,లేదు[2]. ఈనడుమ శ్రీరాళ్లపల్లి యనంతకృష్ణశర్మగా రాంధ్రపత్రిక సారస్వాతానుబంధమున రుచిఁజూపినయాగ్రంథము మనకులేకపోవుట యెంతనష్టమో తెలిసినది. పాలి, ప్రాకృతముల మనవా రభ్యసించి యందలిగ్రంథము లెన్నియో భాషాంతరీకరించుకొనవలసియున్న దని వేఱుగఁ జెప్ప నగత్యములేదు.

చంద్రగోమి యనుమఱియొకకవి తారాసాధనశతక మొకటి వ్రాసెను. ఇట్లే తారాదేవిపై శతాధికస్తోత్ర కావ్యములు పుట్టినవి. ఇట్టివి 96 గ్రంథములం గూర్చి సతీశచంద్రవిద్యాభూషణుఁ డొక గ్రంథపీఠికలో నుదాహరించియున్నాడు. (ఆతని స్రగ్ధరాస్తోత్రము. పీఠిక చూడుఁడు.) ఈస్తోత్రములలో 62 టిబెటు భాషాంతరీకరణము లగపడుచున్నవి. (G. K. Narayan in his Literary History of Sanskrit Buddhism.)

[వింటర్నిజు, సిల్వెయినులెవి, హ్యూంబరు, మొదలగు పండితులవ్రాతలనుండి తీసినసారాంశ సంగ్రహము.]

ప్రాకృతములనుండి తెనుఁగులోనికి భాషాంతరికరించిన గ్రంథములు తక్కువ. శృంగారసప్తశతినుండి శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారివి యెండు రెండుభాషాంతరీకరణ పద్యములను జూపెదను. శృంగార సప్తశతి యనేక కావ్యములకూర్పు.

కుందవుత్రుఁడు.

ఆ. లోభివానిచేతి లోసిరిపెరిగిన, ఫలమొకింతయైనఁ గలుగఁబోదు
     తెరువునడుచువేళ గఱకువేసవియెండ, మాఁడువానికిఁ దన నీదవోలె. 26

హాలుఁడు.



క. చెలులు కడుజాణ లాతఁడు, వలపుల దాఁచుకొనలేని వాఁడిఁక నేని
   గ్గులదానను నాపాదం బుల లత్తుకవన్నె లేల పూసెదుపోవే; 27

మనశతక వాఙ్మయమును పైవిషయములతోఁ బోల్చిచూచుకొనినచో ననేక వందలసంనత్సరముల క్రితము బహుశః ఆంధ్రభాషకుఁ దొలిరూపమైన పాకృతవాఙ్మయచ్చాయ లిప్పటికిని మనశతకవాఙ్మ యమునఁ జిహ్నిత మైయున్నవి. కాఁబట్టి మనశతకములు - చిరకాల సంప్రదాయము(Tradition)ను ననుసరించియే పెరుగుచున్నవి. ప్రాకృతమే యాంధ్రభాష తొలిరూపము కాదనువా రున్నచో వారు జైనులను, వారిదేవాలయములను, వారివాఙ్మయస్వరూపములను నాశన మొనర్చి శైవులు తమవానిగాఁ జేసికొని రట్టిసమయమున జైనులప్రాకృతవాఙ్మయమునుండి శతకస్వరూపమును దీసికొని రని యంగీకరింపకపోరు. ఏది యెట్లున్నను క్రీస్తుపూర్వము ప్రాకృతములో నున్న సంప్రదాయము లిప్పటికి మనశతకములలో నుండుట యాశ్చర్యజనక మైనవిషయము,

సంస్కృతశతకములు.

ఆర్యులజీవితము వేదమంత్రములతో నారంభమైనట్లు మనకుఁ దెలియును. అందువలననే మనకు వేదము లనాదియైనవి. అవి యపౌరషేయములుగా మనవారు పరిగణించిరి. ఆర్యులమతము, దినచర్య యివి వేదానుసారములు. వేదవిరుద్ద మైనమతముల కార్యావర్తము చోటీయలేదు. వేదములు భక్తిప్రతిపాదకము లైసమంత్రములు, స్తుతులు, ప్రార్థనలతో నిండియున్నవి. వీనికిఁ బిమ్మటఁ బుట్టినవేదాంతము లగునుపనిషత్తులు వానిసారములయినను వేదమునందు భక్తి ప్రధానముగఁ గనఁబడును. భగవత్ప్రీతికై స్తోత్రములు, తదనుగుణ్యముల గుజవతపములు, మంత్రములు, కర్మలు, కసఁబడుచున్నవి. మంత్రములు, శాస్త్రములుగాను, పార్థనలు క్రమముగా నుపనిషత్తులుగాను మారుటకుఁ గొంతకాలము పట్టినదని విమర్శకు లంగీకరించినవిషయమే కాని వేదకర్మలుమాత్రము నేటికిని జరుగుచునేయున్నవి. యథా రూపముగ నిప్పటికి వానియధికారము సాగుచున్నది. ఈ వేద స్తుతులయందే భక్తిభావముల కనుగుణముగఁ బుట్టినశాంతులు, స్తుతులు, జప తపరూపము నొంది, మంత్రతంత్రములు క్రియలుగాఁ బరిణమించినవి. ఈకర్మలలోఁ గొన్నినియమములు నేర్పడినవి. " ఒక మంత్ర మిన్నిసారులు జపింపవలెను.” అని సంఖ్యాబద్దములైనవి. తాంత్రిక వాఙ్మయముకూడ శతక వాఙ్మయమునకుఁ బోషకమైనది. వానికారణములతో మనకిచ్చటఁ బ్రసక్తిలేదు. ఆప్టోత్తరశతకమనునది మనకు మిక్కిలిపరిచయ మగుమాట. ఒకమంత్రముకాని, ఒక నామముకాని, స్తుతికాని, 108 మారులు జపించుటవలన లాభ మున్నదని మసపూర్వులగు తాంత్రికులును దలంచిరి. 108 ప్రదక్షణములు, 108 సూర్యనమస్కారములు, పురశ్చరణలు నియమించిరి. జపమాలయందుఁ గూడ 108 పూసలే నిర్ణయించిరి. ఈశతసంఖ్యాన్విత మగు నిర్ణయము భక్త్యావేశముచేతలుఁ జేసిసస్తోత్రము లయినభక్తిశతకములయందుఁ గూడ వ్యాపించినది. కావుననే ప్రాకృతశతకము, ఆంధ్రశతకములు కూడ 100 లేదా 108 పద్యములతో రచియింపసాగిరి.

వేదములో "శతయీతుఁ" డను ఋషికలఁడు. నూఱుమంత్రశక్తులు - కలఋషినామ మని విజ్ఞులు వక్కాణించియున్నారు. ఈ శతశక్తులనిర్ణయ మధికసంఖ్యాసూచకమో సత్యముగ నాఋషి కట్టి శక్తి కలదో-మన కవసరముకాదు. ఆసంఖ్యయందు మనవారికి గౌరవమున్నట్లు మనకుఁ దెలియుచున్న దది చాలును. శతరుద్రియ, శతరుద్రీయ యను పదములు వేదమునం దున్నవి. దీనికర్థము నూర్వురు రుద్రులనుగూర్చినస్తోత్రము అని వ్యాఖ్యాతలు చెప్పుచున్నారు. ఈశతరుద్రీయము యజుర్వేదము నందలిభాగము. దీనికీశతక నామమునిచ్చిరి. త్రైత్తిరీయసంహిత 4. 5-1-11; కథకసంహిత 17-11-16 ; మైత్రాయణీసంహిత 2-9-1, వాజసనేయసంహిత. 16.1 ఇందు రుద్రునినూఱుగుణములవర్ణన ముండును. గుణభేదము ననుసరించి నూర్గురురుద్రుఁలని యందురు. శతబాలాక్షమౌద్గల్యుఁ డనుఋషి. ముద్గలఋషిసంతతివా డొకఁడు కలడు. ఇతడు వ్యాకర్తయఁట. గాలవమైత్రేయునితో వాదించినట్లు గోపద బ్రహ్మణమునందుఁ జెప్పియున్నది.

మనపూర్వులకు "శత" శబ్దమునం దాదరణ మున్నది. అట్లే. “సహస్ర" శబ్దమునందు నున్నట్లు గాన నగును. దేవతాపూజలయందు సహస్రనామావళి చదువుట మనకుఁ గ్రొత్తకాదు. ఫురాణము లన్నిఁటియందు నిర్దిష్టదైవమునుఁగూర్చి సహస్రనామావళియు, స్తుతిసమయములయందు స్తుతిమాలలు, స్తవరాజములు, దండకములు, శతకములు, సహస్రనామములును వ్రాయుట వాడుకగాఁ గనబడుచున్నది. పురాణవాఙ్మయమునం దిట్టినిదర్శనము లనేక ములున్నవి. ప్రసిద్ధము లగుట నుదాహరింప నైతిని. కావున శతకస్వరూపము భక్తికొఱకు బట్టె ననవచ్చును. తెలుఁగువాఙ్మయము చాలవఱకు సంస్కృతానుసరణమే. మనపురాణములు కేవలభాషాంతరీకరణములు కాకపోయినను, సంగ్రహములుగా ననుసరణములు. మూలముకంటె భాగవతమునం దభివృద్దికూడ నున్నది. అయినను స్వరూపస్వభావము లనుసరణములే యనవచ్చును. ప్రబంధములుకూడఁ గేపలభాషాంతరీకరణములు కాకపోయినను సంస్కృతలక్షణానుసారము వ్రాసినవి. కథ, పాత్రలు, రీతి, . యివి యన్నియు సంస్కృతము నందలివే! స్వకల్పనము మిక్కిలితక్కువ. కాని శతకము లట్లు కాదు. శతకస్వరూపము, పద్యసంఖ్య, దశకవిభాగము, మొదలగునవి ప్రాకృతజనితము లయ్యు, శతకములలో సంస్కృతభాషాంతరీకరణములు మిక్కిలితక్కువ. ఈపరిమితి యెంతవఱకో, సంస్కృతశతకముల స్వరూప, స్వభావ, ప్రచారములెట్టివో కనుగొందము. అనఁగా “చాటుప్రబంధములు”గా సంస్కృతమున నీఖండకావ్యము లెన్ని, యెట్లు, యెప్పుడు పుట్టినవి, యెట్లభివృద్ధి నొందినని, అవి 'తెలుఁగు వాఙ్మయమున నేమిమార్పు లొనరించినవి, మొదలగు విషయములఁ చూచాయఁగఁ గనుఁగొనఁ బ్రయత్నించెదముగాక !

భావగీతములు - వానిలక్షణము.

భక్తియే శతకములు మొదలగుచాటుప్రబంధములరచనకుఁ మూలకారణ మని తెలిసికొనియుంటిమి, భావగీతము లని మనవా రిప్పు డనుచున్నలిరిక్కులు (Lyrics.) . శృంగార, భక్తిభరితములు. వేఱొకచోటఁ గాళిదాసునిమేఘదూత శతకస్వభావము కల దని చెప్పియుంటిని. అది భావగీత మనియే నాయభిప్రాయము, సంస్కృత భావగీతములలో నెల్ల మిన్నయై మనదేశమునందేగాక జర్మనీదేశమునందలి "గెటి” వంటిపండితుని మెప్పునొందిన దీమేఘదూతయే! దీనియందుఁ గొంచెముకథ, కావ్యలక్షణములు, నున్నవి. ఎడతెగకుండ గథ పద్యములపైఁ బ్రాకును. ఇది శతకములలో సాధారణముగా నుండదు. ఏపద్యమున కాపద్యమే యొకసంపూర్ణస్తుతి. ఆభావమంతతో ముగియును. అయినను దెలుఁగులోఁగూడ మేఘదూత వంటికథ గలశతకములు లేకపోలేదు. ప్రసన్నరాఘవశతకము వంగూరినర్సకవిప్రణీతము. రెండునూర్లపద్యము లున్నవి. శతకమువలె మకుట మున్నది. రామాయణకథ యితివృత్తము. ఉదాహరణమున కొక పద్యము చూపెదను,

"తల్లడ మందదేవతలు దానవులు౯ రఘురాముఁ డప్పుడు౯
 విల్లవలీలఁగాఁ దునిమె వేడుక మెచ్చ నృపాలుఁ డాత్మలో
 నల్లుఁడు రామభద్రుఁ డన నాదిమ రేశ్వరుఁ డంచు సీతయు౯
 బల్లవపాణి యాత్మఁ దనభాగ్యము మెచ్చెఁ బ్రసన్న రాఘవా||"
                                                 ప్రసన్న రాఘవశతకము, 53 పద్యము

(2) ఇట్టిదే రంగేశకృష్ణశతకము రెండవది. ముడుంబై వేంకటరామ నృసింహాచార్యకృతము. ఇందు రుక్మిణీకళ్యాణాది భాగవత కథ లున్నవి.

(3) "ఇందూనందునిమందనుండికద నీవేతెంచుటల్' రాక౯" అనుమకుటముతో పుసులూరి సోమకని “చంద్రదూత” యను మనోహరకావ్యము కృష్ణవిరహముచే నొకగోపిక యడిగినట్లు ' తానే గోపికనని వణి౯ంచియున్నాఁడు ఇది మిక్కిలి మనోహర మైనది.

ఇఁక ననేకము లిట్టికథలు వణిన్ంచుశతకము లున్నవి. కాని శతకమునం దితివృత్తముండక పోవుటయేతఱుచుగాఁ గానవచ్చుచున్నది.

సంస్కృతమున భావగీతములు శృంగారరసోద్దీపకములు. తెలుఁగున భక్తిభరితములు. కొందఱు భక్తిశృంగారము లొక్కటియే యని నిరూపించెదరు.

సంస్కృతమునందు ఋతుసంహారము, ఘటకర్పరము, చోర పంచాశత్తు ననున వన్నియు శతకస్వభావము కలవే.

ఈచౌరపంచశతకమునే చళ్ల పిళ్ల నరసకవి యామినీపూర్ణతిలకావిలాస మనియు, చెన్నూరి శోభనాద్రికవి శృంగారసుథాసముద్ర పూర్ణచంద్రోదయ మనియు వ్రాసిరి. సంస్కృతమునందు శతకత్రయ మని వాడుకలో నున్నభర్తృహరిసుభాషితరత్నావళి ప్రసిద్ధ మైనది.

సంస్కృతమునందలిశృంగారశతకము, శృంగారతిలకమునుగూడ మనోహర కావ్యము లనుటకు సందియము లేదు. ఇట్టి మంచిశతకములు తెలుఁగులో నెక్కువ లేపు. భావకావ్యములలో నమరుశతకము సుప్రసిద్ధమైనది. దీనిగుణము వ్రాఁత కలవికానిది. ఇందుఁ గాముకీ కాముకులు వేర్వేరవస్థలయం దెట్టియెట్టిపాట్లు పడుదురో ప్రకృతి ననుసరించి కవి చిత్రంపఁగలిగెను. ప్రణయకోపము, వియోగము, పునః సమాగమమును, అమరుశతకమున మనోహరముగఁ జూపెను. దంపతులుసమాగమసుఖము, ఆనందము, వియోగము, నిరుత్సాహము, భక్తి, ప్రేమము. వీనిదశ లన్నియు నతిచిత్రముగ స్ఫురింపఁజేయును. అన్నిఁటికంటెఁ జిత్ర మేమనగా నందఱు నెఱిఁగినవిషయమునే క్రొత్త రూపమునఁ గవి చెప్పును. అది మన మెఱిఁగినవిషయమైనను నందు నవ్యత ప్రదర్శన మొంది క్రొత్తభావములఁ బుట్టించి యానంచ మొదవించును. ఇది కవితాధర్మములో నుత్కృష్టమైనది. విచిత్రమైన సృష్టినైపుణ్య మని చెప్పవచ్చును. ఇందు వర్ణించినప్రేమ మాదర్శ ప్రాయమైనది కాక మోహమై కనఁబడుచున్నది. మనవాఙ్మయము నందుఁ బవిత్రప్రేమము లేదనియు, పూర్తిగా మోహపూరిత మనియుఁ గొందఱందురు. ఇది సత్యముకాదు.మనవాఙ్మయమునందుమనమిప్పుడు రసమునుగూర్చి మాటలాడుచున్నాము. ఏరస మెట్లున్నదని మనప్రశ్నము. అంతేకాని యది నీతిమంతమా కాదా యని కాదు. కావ్యగుణపరీక్షయందుధర్మశాస్త్ర ప్రయోజనము స్వల్పము. అమరుశతకము నందలి శృంగారము నిషిద్ధమైనది కాదు. - సత్యమైనమాట భావపూరిత మైనశతకములు, ఖండకావ్యములే గాక తారావళులు, ఉదాహారణములు, తుదకు చాటుపద్యములు, ఒక వాక్యముకూడఁ గావ్యమే యనవలెను, ఉద్రిక్తహృదయముతోఁ గవి వ్రాసినది భావగీతము. అనఁగా శిల్పి నేర్పుతో మనయందు రసో దయ, మొదవింపఁగలఁడు. తాను చేయుపని నిర్ణయించుకొనును. ఇక్కడ నీరూప మీవిధముగ ప్రదర్శించినఁ జూపరులయం దీరస ముప్పొంగునని చిత్రించును. అది చిత్రించునపు డతని కారస ముదయింపవలె నని శాసనములేదు. చూపరుల కొదవించు నేర్చున్నదా? లేదా? యనియే వివారించెదము. కావ్యమట్లే కవియొకపంథవేసికొని, కావ్యాంతముతానెఱిఁగి, లోకముకొఱకుద్దేశ పూర్వకముగ నిర్మించును. తత్తదుచితస్థలముల నుచితరసము లుద్బవిల్లునట్లు ప్రయత్నించును. భావగీతమునందుఁ గవి యదివ్రాయునప్పటికి రససముద్రములో మునిఁగి యుండవలెను. పులకాంకురములతోడనో, కన్నీళ్లతోడనో, తాను వ్రాయునది తా నెఱుఁగకుండ లక్ష్యలక్షణసమన్వయ మొనర్పలేనంత యొడలు తెలియనిస్థితిలో వ్రాయవలెను. లేనియెడల నాయభిప్రాయముచేఁ గావ్యమునందువలె "సాగుడుకథ” లేకుండుటతప్ప, కావ్యమునకు భావగీతమునకు భేదమే నిరూపింప వీలులేదు. ఆంగ్లేయమున “లైరు”(Lyre)శ్రుతి సహాయమునఁ బాడువానికి లిరిక్కులందురు.అట్టివి మనకీర్తనలు పాటలు మున్నగునవి. ఐనఁ బెద్దలు చర్చించెదరుగాక !

సంస్కృతమునందున్న ట్లే మనకుఁగూడ భక్తిపూరితపద్యములు, పాటలు, కృతులు, శతకములు ననేకము లున్నవి. తెలుగులో లిరిక్కులకుఁ బ్రత్యక్షనిదర్శనములఁ గొన్నిఁటినిఁ జెప్పెదను.

(1) చిన్నతనమునందే వైధవ్యము నొందిన బుద్దిరాజువారి చిన్నది చెప్పినపద్యము లగునవికొన్ని చదువుదురు. ఇవి కరుణరస పూరితములై శ్రోతలకుఁ గన్నీ ళ్లొదవించును. ఇం దాబాలికకన్నీళ్ళు పద్యముతో మనమనోరంగముల రాలుచున్నట్లు తోఁచును. ఈమె దని చెప్పుపద్యము"అయ్యలరాజు రామభద్రుని సకల నీతి కథాసారమునందు నలరాజుకథలో దమయంతివిరహమునఁ”గలదు.

(2) శ్రీనాథుఁడు సర్వజ్ఞసింగభూపతి కొలువున సరస్వతీకనక విగ్రహమును జూచుటతోడనే చేతులుజోడించి, కన్నులుమూసికొని, చెప్పిన “దీనారటంకాల” పద్యమునందు రాజసుతి, అత్మస్తుతియుఁ గూడ నున్నవి. రాజును స్తుతింపవలెఁగాని యది స్తోత్రముగాఁ గనఁబడరాదు. తనశక్తి వెల్లడికావలెఁగాని యాత్మస్తుతి చేసికొనరాదు. భక్తిచే నుప్పొంగినశరీరము గలశ్రీనాథునిపారవశ్యము దైవానుగ్రహమున నతని కారెండుకార్యముల సమకూర్చినది.

(3) అడిదము రామకవి "కదలుమిటమాని దివిజగంగా భవాని ” యని మొలలోతునీళ్ళలో నిలువఁబడి చేతులు జోడించి తడిబట్టలతోఁ-- గుంచిత భూయుగ్మముతో- నొనర్చినపార్థనాపూర్వక మగునాజ్ఞవలె నున్నపద్యము లాతనియుద్రేకస్వరూపమునే కనఁబరచుటలేదా?

ఇవి యన్నియుఁ గావ్యములేలకావు? ఇవియే లిరుక్కు..లని నా తాత్పర్యము. భావగీతములని మనవారు వీనికే పేరుపెట్టియున్నారు. సంస్కృతభావగీతములకును నాటకములకును నడుమ జయదేవుని గీతగోవిందము పుట్టి యా రెండుస్వరూపముల కావ్యములకు నతుకువలె నున్నది. ఇది నాటకము ననవచ్చును. భావగీతము ననవచ్చును.

మనలో భామవేష మని యాడుచుండువీధినాటకము భామా కలాప మందురు. ఇందు సత్యభామ విరహవేదన మితవృత్తము. ఇది యక్షగానరూపమున సున్నను, దీనినిఁ బెద్దభావగీత మనవచ్చును. ఇందలి భావోద్రేకము “పదపద్మములు తడఁబడ సాగె నోయమ్మా!" అనుదరువు వినినప్పుడు విశదము కాఁగలదు. అనఁగా భావగీతములు కాని పెద్దకావ్యములనడుమకూడ, వ్రాయుకవి విశ్వరూపము నొందినప్పుడుకాని, తానాపాత్ర మైనప్పుడుకాని- అనఁగా నాపాత్రస్థితికి దిగిపోయినప్పుడు కాని - కవియుద్రేకము నొంది తన్ను తానెఱుఁగకుండఁ కొన్నిభాగములు వ్రాయవచ్చును. అట్టిభాగములలో "లిరిక్కు”ద్భవించిన దని చెప్పవచ్చును. భామాకలాపమునందు స్వభావసిద్ధమైనపత్రలేఖనాదు లున్నను, వీధినాటకప్రదర్శనమునందుఁ బకృతికాంత గుగ్గిలవు పొడులపొగలలో కన్నులుమూసికొని, హరిదళపుఁగంపులకు ముక్కు బిగించుకొని, దరువులచప్పుడులో చెవిటిదియై, గంతులచిందులలోఁ గలిసి బెదరి యదృశ్య మగుచున్నను, వాఙ్మయచరిత్రకారున కీమన యక్షగాననిర్మాణము, ఖేలనము, నాట్యకళ, మున్నగువానిపూర్వ చరిత్రము, వానిరహస్యములు నూహించుట కత్యంతోపయోగముగ నున్నవి.

సంస్కృతతవాఙ్మయము నందలిశతకములు మనతెలుఁగుశతకములుగాఁ గొన్నిభాషాంతరీకరింపఁ బడినను, మనశతకవాఙ్మయము స్వతంత్రమైనదిగానే కనఁబడుచున్నది. వేణుగోపాల చంద్రశేఖర శతకములు పూర్ణముగ స్వతంత్రరచనములు. ధూర్జటికాళహస్తిశతకమునందుఁ గొన్ని శివానందలహరిపోలికలు, సుమతిశతకమునందు సంస్కృతనీతిపద్యచ్చాయలు, కనఁబడినను మనశతకములు మూఁడుపాళ్ళు స్వతంత్రరచనము లనవచ్చును. కొందఱుశతకకర్తలు సంస్కృతశ్లోకములభావము లనుకరించినట్లుకూడఁ గనఁబడుచుండును.

ప్రాస్తావికపద్యావళినుండియేమి నీతిమంజరి, హితోపదేశ, పంచతంత్ర, భారతము మొదలయిన వానియందలి శ్లోకాభిప్రాయముల నేమి, కొందఱు శతకకవులు సాంగముగఁ దీసికొని భాషాంతరీకరించిరి. తాంబూలనిర్ణయము, భార్యాధర్మములు, మొదలగునవి భాషాంతరీకరించిరి. మనవారు పూర్వుల ననుసరించుట గౌరవ మని యభిప్రాయము కలవారు. మంచివస్తువు కనఁబడినప్పు డది తెలిగించుచు వచ్చిరి. ఇట్లయ్యు మన శతక వాఙ్మయ ముపజ్ఞానహిత మనియే చెప్ప వీళ్ళు కలవు.

భాషాంతరీకరణములు.

నడుమ సందర్భానుసారముగఁ జూపినవికాక సంస్కృతము నందలి నృసింహ, రామ, కృష్ణ కర్ణామృతములు, ముకుందమాల, మహిషశతకము, సూర్యశతకము మున్నగుశతకములను మూలానుసారము భాషాంతరీకరించుకొని యున్నాము. భర్తృహరి శతకములను నలుగు రైదుగురు తేలిఁగించియున్నారు. (1) ఏనుఁగు లక్ష్మణకవి, (2) పుష్ప - గిరి తిమ్మన్న , (3) ఎలకూచి బాలసరస్వతి, (4) గురురాజకవి, (5) పోచిరాజు వీరన్న యీయైదుగురును సంపూర్ణముగఁదెలిఁగించిరి. సూర్యశతకమున కాధునికులేగాక పూర్వకవి యొకఁడు తెలిఁగించినట్లు ప్రబంధరత్నావళివలనఁ దెలియుచున్నది. ఇందు సంస్కృత పంచకావ్యములఁ దెలిగించి యనేకకృతు లొనర్చిన పోచిరాజు వీరన్నయిట్లు తనభళ్ళాణచరిత్రాదిని నుడువుచున్నాఁడు.

"సంస్కృతంబైన శంకరాచార్య విరచి, తంబు లానందలహరి సౌందర్యలహరి
 భర్తృహరికృతమైన సుభాషితమును, శతకములుగాఁగ మత్ప్రకల్పితములయ్యె.”

భక్తిపుంజ మగుముకుందమాలకూడఁ (గులశేఖరాళ్వారు కావ్యమునుఁ) దెలిఁగించియున్నారు.

(1) ఇట్లే పలువురు తెలుఁగుకవులు సంస్కృతముసఁగూడ శతకములు వాయుచువచ్చిరి. "

"నిర్మించినాఁడవు నిర్జరభాషచే శతకంబు, భాస్కరస్వామికెలమి ”

(రామవిలాసమున ఏనుఁగులక్ష్మణకవి.)

(2) చిత్రాడ వేంకటేశ్వరశతకము.

(3) కుమారశతకము ననునవి తెలుగువారు వ్రాసిన సంస్కృత శతకములు. ఇంకను బెక్కులుండవచ్చును.

అమరుశతకమును , తాళ్ళపాక వేంకటేశ్వరదీక్షతపుత్రుఁడగు తిరువేంగళ్ళప్ప శృంగారామరుశతక మని తెలిఁగించెను. శిష్టు సర్వశాస్త్రికవికూడ దీనినే తెలిఁగించి కాళహస్తి సంస్థానాధిపతులకుఁ గృతి యిచ్చెను. మండపాక పార్వతీశ్వరశాస్త్రికూడఁ దెలిఁగించెను.

ఇంకను శృంగారతిలకాదులుకూడఁ దెలుఁగులోనికి వచ్చినవి. ఈభాషాంతరీకరణములకుఁ బూర్వమునుండియు మన తెలుఁగుశతకము లున్నట్లు కనఁబడుచున్నది. ఆశతకములజన్మము, నభివృద్ధియుఁ బరీక్షించుకొందముగాక!

ఇతరభాషలు.

ఆర్యావర్తము నందలి ప్రతిదేశభాషయందు నీశతకము లున్నవి. అందు ముఖ్యముగ నఱవము, కర్ణాటకము, మళయాళము నందేగాక వంగభాషయందుఁగూడ నీశతకములు కనఁబడుచున్నవి. "శచినందనశతక" మని సంస్కృతమున రఘునాథుడనువంగకవి యనేకచాటుకృతులతోపాటు వ్రాసెను. శచినందనశతకము చైతన్యస్వామిస్తుతి యై యుండను. ఇదిగాక బంగాళీభాషలోఁ గూడ భక్తిశతకము లున్నవి. ఇట్టివి గ్రీకు, ఆంగ్లేయ, వాఙ్మయములయందును "సెంచెరీసు, గార్లెండ్సు” అనునామములతో నున్నట్లు పాశ్చాత్యవాఙ్మయచరిత్రములు నుడవుచున్నవి. కాని మకుటమే ప్రధాన మగుట తెలుఁగుశతకముల కొకప్రధానలక్షణము. ఇతరభాషాశతకములకునునీనియమ ముండియుండవచ్చునుగాని యీపైవివరము లింతకంటెఁ బెంచుట కవసరములేదు. ఏమనఁగా? వానివలనఁ దెలుఁగుశతకములయం దేమార్పులును గలిగి యుండకపోవచ్చును.

శతకవాఙ్మయాభివృద్ధి.

మనశతకములు క్రీ. శ. 12వ శతాబ్దమునకుఁ బూర్వమున్నట్లు కానరాదు. పండ్రెండవశతాబ్దమునం దున్నట్లుస్పష్టముగఁ జెప్పఁదగినది వృషాధిపశతక మొక్కటే! ఇంతకుఁబూర్వము పండితారాధ్యులవారి శివతత్త్వసారమొకటి శివమతప్రతిపాదక మైనగ్రంధము శతకస్వభావము కలది కనఁబడుచున్నది. శివతత్త్వసారము "శివా"యను మకుటముగలది. ప్రాయకముగనే మకుటము వచ్చును గాని కొన్నిచోట్ల మారును. కొన్నిచోట్ల పద్యమధ్యమున కేగును. కేవలశతక రూపమున నున్నది వృషాపధిశతక మే! .

13వ శతాబ్దమునడుమ మఱియొక ప్రసిద్ధశతక మున్నది. ఇదియే యథావాక్కుల అన్నమయ్య వ్రాసిన సర్వేశ్వరశతకము. వృషాధిపశత కము సర్వేస్వరశతకమును రమ్యమయినవి. వృషాధిపశతకము. జాను తెనుఁగు మొదలగుభాషావిశేషములఁ జర్పించుకొనుట కనువైనది. సర్వేశ్వరశతకమున భావములు భక్తిప్రధానము లైయున్నవి. కొన్నికవిత్రయప్రయోగములకు విరుద్ధముగ భాషావిశేషములు కనఁబడుచున్నవి. ప్రాకృతములో బౌద్ధ, జైనవాఙ్మయములయందలిశతకములు శైవులవలనఁ దెలుఁగులోనికిఁ బ్రాకినట్లు తోఁచుచున్నది; జైనదేవాలయము లనేకములు శైవు లాక్రమించినట్లే, వారిప్రాకృతవాఙ్మయము వ్యాప్తినిఁ గనిశైవులు "జానుతెనుఁగు”లో శైవమతవ్యాప్తి నొనరించుకొని రనుటకు పాలకురికి సోమనాథునిద్విపదవాఙ్మయమే ప్రబలనిదర్శనమని చెప్పవచ్చునని తోఁచుచున్నది,

ఇందువలన మనకుఁ జిక్కినమొదటిశతకములు రెండును 12వ శతాబ్దమునాఁటి కున్నవి శైవమత ప్రతిపాదకములు. 13వ శతాబ్దమునం దున్నతిక్కన్న కృష్ణశతక మొండు రచించె నని "పూర్వకవిచరిత్ర" కారుఁ డనినమాట త్యాజ్యము. ఏపద్యము తిక్కన్న దని యిదివఱకుఁ జెప్పిరో యాపద్యము దేవకీనందనశతకములో నున్నది. దేవకీనందనశతకము తిక్కనకృతము కానేరదు. అది జక్కన విక్రమార్కచరిత్ర కృత్యాదివాక్యానుసారము వెన్నెలకంటి జన్నయ్యది కావచ్చును. “పరమహృద్యం బయిన పద్యశతంబుచే దేవకీతనయు విధేయుఁ జేసె”నని యున్నది. అప్పకవినాఁటి కీదేవకీనందనశతకము లక్ష్యగ్రంథముగాఁ బ్రసిద్ధి నొందియున్నది. దేవకీనందనశతకము నాఁటి కనేక వేల శతకములు మహాకవీశ్వరులు వ్రాసియుండి రని యాశతకమే సాక్ష్య మిచ్చుచున్నదివినుఁడు.

శా. కొండలవంటికవీశ్వరుల్ శతకముల్ గూర్పంగఁ గోటానఁగో
     ట్లుండన్ నీవుమ జెప్పఁబూనితి పదేమో యంటివా వింటివా
     వండేనేర్పులఁ బెక్కురీతుల రుచుర్విర్తింపవే శాకముల్
     చండా నామన నాలకింపు మదిఁ గృష్ణా దేవకీనందనా||

లేదా కొన్నిప్రతుల యందలిగద్యముల ననుసరించి కవిరాక్షసుఁడే శతకకర్త కావలెను. సర్వేశ్వర, వృషాధిపశతకములయం దం తఁగా గవిత్రయవైరుధ్యము లగుప్రయోగములు కనఁబడవుకాని యీ దేవకీనందనశతకము (15వ శతాబ్దము) మొదలు "వండేనేర్పులు, అంతామిధ్య, కూడీకూడని,” మొదలగు ప్రయోగములు జన్నయ, పోతన్న, ధూర్జటి మొదలగువారు ప్రయోగించినట్లు కనఁబడుచున్నది. ఇట్టివి ప్రౌఢకవిప్రయోగములుగ లాక్షణికు లంగీకరించిరి. ప్రబంధముల యందును బెక్కులు చూపట్టెడిని. ఇవి ప్రస్తుతరచయితలకు ప్రయోగార్హ ములుగ నొనర్చుటయే లెస్సగాఁ దోఁచుచున్నది. పండితకుంజరులు నిర్ణయించెదరుగాక!

పావులూరి మల్లన భద్రాద్రిరామశతక మొండు కనఁబడుచున్నది. కాని యిదిగణితశాస్త్రకర్త రచించినది కాదని గోత్రభేదము వలనఁ దెలియుచున్నది. ఈశతకకర్త ఒంగోలుతాలూకా పావులూరి వాడఁట. క్రీ. శ. 1350లో నున్నరావిపాటి త్రిపురాంతకుఁ డంబికాశతక మొండు రచించెనుగాని యది చిక్కుటలేదు. ఒకటి రెండుపద్యములు మాత్రము శ్రీమానవల్లి రామకృష్ణకవిగారివలన మనకు లభించినవి.

ఈకవియే వ్రాసినత్రిపురాంతకోదహారణము, “చంద్రరోహిణీ వల్లభా” యనుమకుటము గలచంద్రతారావళి, యనుగ్రంథములును జాటుప్రబంధములలోఁ జేరదగినవే. పాలుకురికి సోమన్న వ్రాసిన చెన్నమల్లుసీసములు, చతుర్వేదసారసూక్తులు మొదలగు చాటుకావ్యములుగూడఁ గొన్ని కలవు.

ఇఁక సుమతిశతకము తగ వొక్కటి బ్రబలమైనది కనఁబడు చున్నది. దీనికర్తృత్వముకాని, కాలముకాని తెలియదు.

ఇట్లే భాస్కరశతకము మొదలగుకొన్ని శతకములకాలము నిర్ణయ మొనరించుటకు వీలులేకయున్నది. ఇవికూడఁ గృష్ణరాయనికిఁ బూర్వపువే యైయుండవచ్చును, 12-15 శతాబ్దములనడుమ 10-16 చాటుకావ్యములుమాత్ర మగపడుచున్నవి. ఇఁక 16వ శతాబ్దారంభమునకు వచ్చిచూతము. ఇది పోతన్నకుఁ జేరువకాలము. కృష్ణరాయభానూదయకాలము. శైవముతగ్గి వైష్ణవము హెచ్చుసూచన లున్నవి. దక్షిణహిందూ స్థానమున తురకల బాధలు కథలుగాఁ, బ్రాకుచున్నవి. రాయలవా రార్తజనరక్షకుఁడై విజయనగర సామ్రాజ్య మధిష్టించుచున్నాఁడు. కర్ణాటకరాజ్యము ప్రబలమయ్యు నోరుఁగల్లుపతనము భీతి కలిగించినది. ఆంధ్రరాష్ట్రమునుండి యనేకులు దక్షిణదేశమునకు వలసపోయిరి. వేఁగిదేశము రెడ్లు పాలించుచుండిరి. గజపతులు దండెత్తుచుండిరి. రాజ్యములు స్థాపించియుండినవి చెడినవి. కృష్ణరాయలకు రెడ్లు శత్రువులు. ఈకాలమునందుఁ గృష్ణాగోదావరులనడుమకాని, పల్నాడునందుఁగాని, బయిలుదేరిన గ్రంథములు తరచుగాఁ గనఁబడవు. ఆంధకర్ణాటక రాజ్యసమ్మేళనమొందినది. వేఁగి, కళింగదేశములు బలహీనములై రాయలకెఱగానున్నవి. వేఁగికళింగము లనేకప్రభువులపాలైయున్నవి. మహమ్మదీయులప్రచార మధికముగ లేకపోయినను, ఒత్తిడి రాజులకైనఁ గలదు.

15వ శతాబ్దాంతమున 16వ శతాబ్దాదినిఁ గల యీస్థితిలో కడపమండలము నందలి యొంటిమెట్ట రామచంద్రమూర్తిని గుఱించి రచించిన యొకశతకము ప్రసిద్ధమై కనఁబడుచున్నది. దీని సంపూర్ణ ప్రతియున్నట్లాంధ్రపత్రికలో నేను ప్రకటించియుంటిని. దీనికే జూనకీవరశతకమనియు, రఘువీరశతక మనియుఁ బేళ్లు గలవు. . అయ్యలరాజు రామభద్రుఁడు తన రామాభ్యుదయగద్యయందు "ఇది శ్రీమదొంటిమెట్టరఘునిరశతకనిర్మాణకర్మకుఁ డగు తిప్పయపౌత్రకృత మని వ్రాసికొనినాఁడు. శతకమునకే యింతబడబడలేల యని విచారింపఁ గొన్నిపద్యములే చేకురుచుండినవి. ఈశతక మిటీవల నియోగిపత్రికలో రామభద్రకృత మని పొరబాటునఁగాబోలు ప్రకటించు చున్నారు. ఇందుఁగవిత్రయప్రయోగములకు వైరుధ్యము లధికములు. కాని యీతఁడు కావ్యములు వ్రాసినందులకే యధికగౌరవ మందిన ట్లీక్రిందిపద్యము సాక్ష్య మిచ్చుచున్నది.

"శా. ఆకర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబున౯
      నాకావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడఁగా
      నీకుం బద్యములిచ్చుచో నిపుడు వాణీ దవి నాజిహ్వకు౯
      రాకుండ౯ వసియించు టెట్లు రఘువీరా! జానకీనాయకా!!” 2

స్వతంత్రప్రయోగము లధికములు. భావము లింతకుఁ బూర్వపు శతకములలో నున్నవానికంటె మిన్నకావు. కొన్ని మిరియములవంటి పద్యము లున్నమాట సత్యము, కణా౯టక రాజుల కావ్యపోషణము ప్రసిద్ధము. ఇతఁడు రామభద్రునితాత యగుట వీరనరసింహునికాలమునఁగాని, కృష్ణరాయనితండ్రికాలమునఁగాని జీవించియుండవలెను. ఈతనిగౌరవించినక ణా౯టకమండలాధిపతి నరసింహరాయఁడో వీరనరసింహరాయఁడో తెలియదు. వీరనరసింహునికాలమున రాధామాధవుఁ డుండెను. బహుశః తిప్పయయు నీతఁడును సమకాలికులు కావచ్చును. పోతనామాత్యుఁడుకూడ నాలెక్కప్రకారము వీరికి సమకాలికుఁ డైయుండవలెను. లేదా కొంచెముపూర్వుఁ డైయుండవలెను. ఇప్పటి భాగవతము, నారాయణశతకము, జానకీవరశతకము, రాధామాధవ విలాసము, తారకబ్రహ్మరాజీయమునుగూడఁ గణా౯టకరాజ్య పరిసరప్రదేశములనేగాక దేశమునల్గడల వైష్ణవప్రాబల్యమును సూచించుచున్నవి. ఈకాలమునందే యున్నప్రబోధచంద్రోదయకర్తలు శైవులు. వారికిఁ కొంచెముతరువాత వాఁడగుధూర్జటి శైవుఁడు. పినవీరన్న శైవుడు. కావున శైవులు లేకపోలేదు. వైష్ణపము ప్రబలముగ నున్న దనిమాత్రమే చెప్పవీ లగుచున్నది. శతకములును వైష్ణవమత ప్రతిపాదకముగ బయలుదేరినవి. శ్రీనాథుఁ డింతకుఁబూర్వము రచియించిన శాలివాహన సప్తశతి చిక్కుటలేదు. ఇతఁడును శైవుఁడేకాని శాలివాహనసస్తశతి భాషాంతరీకరణ మగుట నందు శైవమతప్రమేయ ముండకపోవచ్చును.

ఇఁక గృష్ణరాయనికాలమునుండియు వచ్చిన శతకములఁ బరిశీలింప దొరకొనిన ధూర్జటి కాళహస్తీశ్వరశతకమే ముందుగఁ గనఁబడు చున్నది. ఇందు శివానందలహరి సర్వేశ్వరశతకములఛాయలు కనఁ బడుచున్నవి. కాని దానినడక, భావములప్రవాహము, .భక్త్యుద్రేకము నీశతక మాశువుగఁ జెప్పినట్లు కనఁబఱచుచున్నవి. ఇది కవి ప్రౌఢవయస్సున వ్రాసినట్లు గ్రంథస్థవిషయములవలనఁ దెలియు చున్నది. శతక మీతనిచేతిలో సంపూర్ణస్థితికి వచ్చిన దని చెప్పవచ్చును.

సర్వేశ్వర దాశరథీశతకముల విషయమయి యతిమానుషములగుకథలు చెప్పుచున్నారు. అవి సత్యమైనదియుఁ గానిదియుఁ జెప్పుటకు వీలులేదుకాని, దేవకీనందనశతకవిషయమై యొకపద్యము గ్రంథస్థమై రెండుప్రతులలోఁ గానవచ్చుచున్నది. కొందఱుశతకకర్తలు భక్తితోఁ బద్యములు వ్రాసి గోదావరిలో వేసిరనియు, నీటి కెదు రీఁదినవిమాత్రమే తీసికొని శతకముగఁ గూర్చిరనియుఁ జెప్పుదురు. భక్తిభరితము లగుషద్యము లన్నియుఁ జక్కని వనుట కీకథ చెప్పుదు రని తోఁచుచున్నది, ఎట్లయిన నున్నకథ కేవల మసత్యమనుటకుఁ దగినకారణములు లేనప్పుడు, అట్లు సిద్ధాంతములు చేయుటకు మన కధికారము లేదుకదా! దేవకీనందనశతకము పరిషత్ప్రతి నె 2347 రులోఁ గొన్ని పద్యము లధికమున్నవి. కొన్ని నారాయణశతకపద్యములతోఁ దుల్యములు. అందలి 110 పద్యములకుఁ బిమ్మట నున్నతుదిపద్య మిది:

"సదయస్ఫూర్తిగళల్ ఘటించి కవిరక్షశ్రేష్ఠుఁ డామోదియై
 పదివేల్‌పద్యము లందు నూటపది సత్పద్యంబు అర్పించె మీ
 పదనీరేజములందు దివ్యతటినీపాథః ప్రపూర్వాభిము
 ఖ్యదయ౯ (ధుని౯?) గాంచినదౌట మీకరుణ కృష్ణా! దేవకీనందనా 1"

ఇఁక గృష్ణరాయనికాలమునఁగూడ జాటువులు పెక్కులు కనఁబడవు. ముక్కు తిమ్మన్నత్రిస్థలీదండకము, తెనాలి రామలింగని దశావతారపద్యముల పిడుగుఱాళ్ళు, రామరాజభూషణుని వని చెప్పు రామతారావళియు ననేకములు చాటుపద్యములు నున్నవి. శతకములు మఱి కనఁబడుటలేదు, కృష్ణరాయనికి నప్పకవికి నడుమ గొన్నిశతకములు కనఁబడుచున్నవి. వజ్రపంజరశతకము, మరున్నందనశతకము, గువ్వల చెన్నశతకము, బాలగోపాలశతకము, చంద్రదూత 'మొదలగున వీకాలములోనివి.

వేణుగోపాల, చంద్రశేఖర, కుక్కు.టేశ్వర, రామలింగఁ కవి చౌడప్పశతకములు 16, 17 వ శతాబ్దప్రాంతములఁ బుట్టిన వని తోఁచుచన్నది. ఇవి యన్నియుఁ దిట్టు, హాస్యశతకము లని చెప్పవచ్చును. వేణుగోపాలశతకము లావణ్యశతకకర్త యొనర్చె నని కొంద ఱందురుకాని సత్యము తెలియదు. కూచిమంచి తిమ్మున్న, కవిచౌడప్ప, అడిదముసూరకవులచరిత్రములు మనకుఁ దెలియును.

17 వ శతాబ్దమునందు శతక వాఙ్మయము మిక్కిలియభివృద్ధఁ గాంచినట్లు పెక్కునిదర్శనములు కనఁబడుచున్నవి. వేనవేలుశతకములు పుట్టిన వనఁదగిన ట్లున్నయీక్రిందినిదర్శనములఁ జూడుఁడు. పెద్దాపురసంస్థానాధిపతు లగుబలభద్రజగపతిరాజుగారు రామశతకమును, రాయజగపతిరాజుగారు భద్రాద్రిరామశతకమును వ్రాసిరి.

(1) చింతలపల్లి వీరరాఘవకవి తాను వ్రాసినమధుర వాణీవిలాసమునందుఁ దాను

"జాములో శతకంబు సంధించి కంకణా
 దులు గొంటి వలరాయదుర్గమునను”

అని తన్నుఁగూర్చి చెప్పుకొనినాఁడు. కవితాత మట్ల యనంతుఁడు. పూలరంగపతిరాజులకాలము వాఁడఁట! అనఁగా కవిచౌడప్పకు సమకాలికుఁడు. వీరరాఘవకవి పెదతండ్రి యగుగోపాలకవి యార్యా శతకమును వ్రాసినట్లు చెప్పుచున్నాఁ డు.

"విలసత్పాండితిఁ గల్పనాగతి జగద్విఖ్యాతుఁడై జాములో
 పల నార్యాశతకంబు వజ్రగిరిగోపాలాంకితం బూహచే

సి లలిన్ దివ్యసుమాంబరాభరణముల్ శ్రీమించఁ జేకొన్నయో
గ్యులమేటిన్ గవిరాజ నెన్నఁదరమే గోపాలవిద్వన్మణి౯

ఆకాలమునందు శతకము లాశువుగఁ జెప్పి బహుమానము లందువాడుక యన్నట్లు పెక్కు నిదర్శనములఁ జూపవచ్చును.

(2) గణపవరపు వేంకటకవి కఠినప్రాసశతకము, యమకశతకమును, కస్తూరిరంగని సాంబనిఘంటువు సీసశతకమునఁ జెప్పుటయు శతకవాఙ్మయవ్యాప్తినే సూచించును. హంసవింశతికర్త అయ్యలరాజు నారాయణకవి "నఖగర్త పురాంజనేయ నతజనగేయా” అని కందశతకమువ్రాసెను.

వైష్ణవభక్తులలోఁ దాళ్ళపాకవారి శతకములు 15, 16, 17 శతాబ్దములలో ననేకములుపుట్టినవి. తాళ్ళపాకవారి వేడెనిమిది శతకములు దొరికినవి. శతకములాది నకారాదిగ నియమమేర్పఱచుకొని వ్రాసినట్లుసుమతి భాస్కర వేణుగోపాల శతకములు సాక్ష్యమిచ్చుచున్నవి. ఇందువలనఁ గవి వ్రాసిన పద్యములవరుస తప్పకుండఁ దెలియనగును. సుమతిశతకకర్త బాలురకొఱ కీనియమము పాటించెనని తోఁచుచున్నది. అందలి మొదటిపద్యము "అక్కఱకురాని చుట్టము. ” పిమ్మట "ఆ" "ఇ" "క" “గ” ఈవిధముగ వ్రాయుటకుఁ గవి నియమమేర్పఱచుకొనెను. వివరములు గ్రంథమున సూచించితిని.

17వ శతాబ్దమునకుఁ బిమ్మట శతకములు మితిమీరిపోయినవి. అందఱును శతకములే వ్రాసిరి. వృత్తసాధనమునకుఁ బ్రారంభమున నీశ్వర దైవపార్ధనమునకుఁ గూడఁ బనికివచ్చి, యుభయతారకముగ నుండు నని యొక్కొకవృత్తముతో నొక్కొక శతకముచొప్పున ప్రతి కవియు పదులు వందలు శతకములు వ్రాసినట్లు కనఁబడుచున్న ది.

(1) పంచడబ్బులలో నొకటగు కృష్ణార్జునసంవాదము వ్రాసిన వెలిచేటి జగ్గయ్యపుత్రుడఁగు వేంకటరామప్రధాని తనగ్రంథమున నిట్లు వ్రాసెను.

సీ. మృదువుగా విజయలక్ష్మీ నృసింహవిలాస, మంచితగతని రచించినావు
    పరగవియన్నదీ పరిణయంబనుకావ్య, మొప్పుగా విలసిల్లఁ జెప్పినావు
    వినయంబుతోఁ బంచవింశతిశతకముల్, విరచించి హరికి నర్పించినావు
    భాసురమతిని బాణాసురాయుద్దాది, వెసనాటకములఁ గావించినావు

గీ. సరసుఁడవు నీవె రచియించు సవ్యసాచి, కృష్ణసంవాద మనుమహోత్కృష్టకావ్య
    మొనరమా పేరఁ ఆ గృతియిచ్చి ఘనతిమీర, విస్తరింపుము లోక ప్రశస్తిఁగాను.

(2) శ్రీరాజా గొడే నారాయణగజపతిరాయనింగారిమేనత్త యగుమదిన సుభద్రయ్యమ్మగారు 1781లో జన్మ మొందెను. ఈమె 5, 6 శతకముల రచియించెను.

(3) మండపాకపార్వతీశ్వరశాస్త్రి రమారమి 60, 70 చిన్నగ్రంథములు శతకములవంటివి రచియించెను,

(4) విశాఖపురిమండలము నందలిపాలతేరులో నమలాపురపు సన్యాసి యనునొకకుమ్మరి నూఱుశతకముల వ్రాసెను.

(5) ఏనుఁగు లక్ష్మణకవి మున్నగువారితో సమకాలికుఁ డని చెప్పుచున్నసత్యవోలు జనార్దనామాత్యపుత్రుఁ డగుభగవత్కవి

క. ధీరత శతశతకంబులు, దారావళులు౯ దశావతారావళులు౯
   జారూదాహరణంబులు, శ్రీరాజితదండకములు చెప్పినవాఁడ౯.

అని చెప్పుకొనినాఁడు, ఈతనిరుక్మిణీపరిణయము నందలిపద్యములే “రక్షణపరాయణుండ!నారాయణుండ!" అనుమకుటముకలవి భోజన సమయమున మనవారు చదువుచుందురు.

(6) అంతకంతకు చీపురుపుల్లశతకములు, సోడా బుడ్డిశతకములు కూడ వాడుకలోనికి వచ్చినవి. ప్రతిగ్రామమునందును లక్షణ మెఱిఁగినవా రందఱు నేదోయొక శతకము నయిన వ్రాసి యాయూరనున్న దేవుని కంకితముచేయుచు వచ్చిరి. కావున మనదేశమునందు దేవాలయము లెన్నికలవో శతకము లన్నిఁటికి ద్విగుణముగనైనఁ గలవనుట తప్పుకాదు.

19వ శతాబ్దమునందును శతకములు విరివిగనే పెరిగినవి. ఇందువలన 17, 18, 19 శతాబ్దముల యుదుఁ బుట్టినశతకములు కొన్నిలక్ష లుండు నని తోఁచుచున్నది. వేదాతశతకములు, ఉత్సాహవృత్తశతకములు, పద్యలక్షణములు లేనిశతకములును గొన్నివేలు పెరిగినట్లు కనఁబడుచున్నది. ఇందువలన మన కున్నశతకములకంటెఁ బోయినవే యధికముగఁ గన్పట్టుచున్నవి. తాళపత్రగ్రంథములలోఁ బ్రతిదినము ప్రాఁతశతకములు నూతనముగఁ గనబడుచునే యున్నవి. పరిషత్తు, ప్రాచ్యలిఖితపుస్తకాగారము, అడయారుపుస్తకాలయములలో రమారమి 300 శతకములు వ్రాఁతశతకము లున్నవి. నాకడ నచ్చుపడినవి 300 కుఁబైఁగా నున్నవి. నాకుదొరకని వెన్నియున్నవో! మన కీవఱకు 600 శతకములకంటె నధికముగఁ గనఁబడుచున్నవి.


శతకముల యాదరణము

పూర్వము మనప్రభువులును, ప్రజలును, లాక్షణీకులునుగూడ మనప్రాచీనశతకముల నాదరణబుద్ధితోఁ జూచినట్లు పెక్కునిదర్శనము లున్నవి. శతకము లాశువునఁ జెప్పించి బహుమానము లిచ్చిన ప్రభువు లున్నారు. తమపై శతకములఁ జెప్పించుకొన్న ప్రభువులు మంత్రులుకూడఁ గనఁబడుచున్నారు. ఒంటిమెట్టరఘువీరశతకము, ఆర్యాశతకము, పాపయ్యమంత్రి శతకము, పొణుగుపాటివెంకటమంత్రి శతకము, బుఱ్ఱావెంకనమంత్రిశతకము, ఎరగుడికన్నశతకము, గువ్వలచెన్నశతకము, కృష్ణభూపతిలలామశతకము మొదలగున విందులకు నిదర్శనములు. అప్పకవీయము, రఁగరాట్చందము మున్నగు లక్షణ గ్రంధములయందు భాస్కర, నారాయణ, వజ్రప జర, మరున్నందన సుమతిశతకాదులనుండి యుదాహరణము లున్నవి. వేలకొలఁదికూర్పు లచ్చుపడినదాశరధీ, సుమతీ, కుమారీ, వేణుగోపాల, చెంగల్వరాయ, నాయకీనాయక , కాళహస్తీశ్వర, భాస్కర, వేమన, మానసబోధ, తాడిమళ్లరాజగోపాల శతకములు ప్రజలయాదరణమును, వ్యాప్తిని సూచించుచున్నవి. ఐనను మనలాక్షణికులుసు చరిత్రకారులు నీశతక వాఙ్మయము నెట్టియాదరణబుద్దితోఁ జూచి రని విచారించిన మన యిప్పటిపండితులలోఁ గొందఱ కించుకగౌరవము తక్కువయున్నట్లు కనఁబడును.

లాక్షణికులలో నగ్రగణ్యుఁ డని యింతవఱకు మనవా రెంచిన యప్పకవి చాటుప్రబంధలక్షణము నిట్లు చెప్పియున్నాఁడు. మనకధలలో జాటుకవిత్వ మైనఁజెప్పుకొనలేక పోవునా? యని యీసడించినట్లు విందుము. అప్పకవిలక్షణము:- కావ్యభేదములు.

సీ. ఉచ్చారణక్రియ నొప్పారువర్ణంబు, వర్ణసంచయమున వరలుఁబదము
    పదవితాసంబుస భాసిల్లు వాక్యంబు, వాక్యభేదమున నివ్వటిలు నర్ధ
    మర్ధవశంబున నమరునుభావఁబు, భావసంగతిఁ గనుపట్టురసము
    రస సంప్రశక్తిచేఁ బొసఁ గును పద్యంబు, పద్యరాశినిగూర్పఁ బడునుగావ్య

తే. మట్టికావ్యంబు ద్వివిధమై యతిశయిల్లు, చిరువడిఁ బ్రబంధచాటు ప్రబంధములన
    సర్గముల సంస్కృతమున నాశ్వాసములను, దెనుగునఁ బ్రబంధమనునది తనరుఁగృష్ణ. 1-130

అని "ప్రప్పులో” నడుగువైచినాఁడు. “పద్యరాశిని” గూర్పబఁడును. గావ్యమనివేసినాఁడు.

ఇఁక నర్సభూపాలీయకర్త యేమనుచున్నాఁడో చూడుడు. “విగతదోషంబులును, గుణాన్వితము లధికలసదలంకార భావోపలక్షితములు నైన శబ్దార్ధములు కావ్యమనఁజెలంగు[3] అని శబ్దార్థసంఘటితమైన, వాక్యమైనచో గావ్యత్వము పట్టవచ్చునని సంస్కృతలాక్షణికులలో మమ్మటుని యభిప్రాయమును బతిథ్వనించి యున్నాఁడుకదా! విన్నకోట పెద్దన్నగారు లౌక్యము చేయుచున్నారు. వినుఁడు. ఆయనకూడ నప్పకవిగారిమార్గమునే యనుసరించి శతకాదులు క్షుద్రకావ్యములని నిర్ణయించినాఁడు. క్షుద్రకావ్యము లఁనగా, సల్పకావ్యములు, ఖండకావ్యములు ననుటకుఁ బర్యాయపదముగా వాడిరనిన నా కాక్షేపము లేదు. అవి నీచకావ్యము లను భావముండిన నది తప్పని చెప్పవచ్చును. పెద్దన్నగారు “ఒకపాటి గంతచాటు చాటు కృతులకు మెచ్చునే, విశ్వేశచక్రవర్తి" అని చక్రవాళ, దండక, మంజరి, రగడ, గుచ్ఛము లాదిగాఁగల కావ్యములు హెచ్చుగుణము గలవిగ నుండవలె ననెను. గుణములేని దెవ్వరును మెచ్చరు. ప్రబంధాదులుమాత్రము గుణ ముండనివి మెచ్చుచున్నామా? శతకములన్నియు మంచివన మనుచున్నామా? కాదు. మన లాక్షణికులు "కావ్య తత్త్వము బాగుగ వివరింపలేదని మనవి చేయుచున్నాను. అప్పకవి పై పద్యమునకు వ్యతిరేకముగఁ మఱలఁ జెప్పుచున్నాడు.

క. కనుగొన సంఖ్యాబద్ధం, బుస సంఖ్యాకంబు నాఁగభువి నిరుదెఱఁగై
   తనరారుఁ బూర్వకవిమత, మననాచాటు ప్రబంధములు జలజాక్ష. 1-132

తే. నాల్గుదెగల యదాహరణముల ముక్త, కాది పంచాదశమును సంఖ్యాన్వితములు
    గద్య రగడ ద్విపద దండకములు మంజరులును, సంఖ్యారహితచాటువులు నృసింహ.
                                                                                                            1-133

వ. ముక్తకాది పంచాదశ త్తెట్టి దనిన,

సీ. ఒనరు ముక్తకమన నొక్కవద్యము ద్వికం, బగు రెండుత్రికముమూ డైనఁ బంచ
    రత్నంబులైదు వారణమాలయెనిమిది. నవరత్నములు పద్యనవకమైన
    భాస్కరమాలిక పండ్రెండు శశికళ, పదియాఱు నక్షత్రపంక్తియిరువ
    దియునేడు త్రింశద్వాహయయు ముప్పది, రాగసంఖ్య వెండియు రెండుసాగెనేని

తే. వరుసపంచాదశాఖ్య మవ్వలశతకము, నష్టసమధిక శతకంబు ననఁగ వెలయు
    నేఁబదియునూరు నూటిపై నెనిమిదియును, సప్తశతి సప్తశతమై శార్జపాణి. 1.134

ఈతనికిఁ బూర్వుఁడగు ననంతామాత్యుఁడు తన ఛందములో జాటు ప్రబంధలక్షణ మిట్లు చెప్పినాఁడు,

ఒకపద్యమైన ముక్తకము రెండునుమూఁడు, ద్వికమును ద్రికమునై విస్తరిల్లు
బంచరత్నములైదు పరగ నెన్మిదిగజా. వళికి నామావళి ద్వాదశంబు
నెన్నంగ నిరువదియేడు తారావళి, యెవయ ముప్పదిరెండు నేఁబదియును
నూఱు నూఱెనుబది నుతికెక్కి ద్వాత్రింశ, దభిధాన పంచాదశాఖ్యనాఁగ
వెలయు శతకమన వెండియష్టోత్తర, శతకమనఁ గ నిట్లు సకలసుకవి
సమ్మతముగ నెగడు జాటుప్రబంధము, లభిమతార్థరచన వబ్జనాభ. 3-62

ఇతఁ డప్పకవికంటెఁ దక్కువభేదములఁ జెప్పెను. ఎట్లయినను వీనికిఁ గావ్యసిద్ధి కలిగినట్లు వారు చెప్పినను సవతితల్లిప్రేమమునేకనఁ బఱచిరి.

కవిజీవితకారు లీశతకములవిషయము వ్రాయలేదు. కవి చరిత్రకారు లగుశ్రీవీరేశలింగముపంతులు గారు వీనియందు నిరసనభావముకూడఁ గనఁబఱచినారు. శబ్దరత్నాకరకర్త పేరు కొఱకొకటి రెండు శతకములనుండి ప్రయోగముల నిచ్చెనుగాని, తాను గ్రంథాదిని సూచించిన గ్రంథములపట్టికలో శతకముల నాల్గవతరగతిలో నైన నుదాహరింప లేదు. స్త్రీలు కవిత్వము చెప్పి రనిన సంతోషపూర్వకముగ నట్టి స్త్రీలచరిత్రమును గనుఁగొని ప్రకటింపవలసినకవిచరిత్రకారు లగుశ్రీ వీరేశలింగముపంతులుగారు శ్రీ మదిన సుభద్రమ్మగారు శతకములు వ్రాసినారని తరిగొండ వేంకమాంబచరిత్రము తుదను చెప్పివిడిచినారు. శతకములు వ్రాసిన స్త్రీ లనేకు లున్నా రనిరే కాని వారిపేళ్లయిన నుడువలేదు. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు " జాలమ్యాల రామకృష్ణ” యని తాళరాగములనడుమ విరిగి ముక్క లైనమవ్వగోపాలపదములపాటియైన గౌరవము శతకములలో ముఖ్య మైసవానికైన నిచ్చినారు కారు. శ్రీరామమూర్తి పంతులుగారు వ్రాసిరో లేదో సందేహము. ఇది యంతయు శతకముల నాదరణబుద్ధితోఁ జూచి రనుట కనువుగానున్నదా?

క్షేత్రయపదములు నిఘంటకర్తలకు క్షేమలాభము లిచ్చి ధూర్జటి కాళహస్తీశ్వరశతకము, పానకాలరాయని మానసబోధశతక ము కాసుల పురుషోత్తమునియాంధ్రనాయకశతకము, కవిచౌడప్పశతకము, వేమనశతకము, నీయఁజాల వనగఁలమా? తెలుఁగుపలుకు బడులకు శతకములకంటె మంచిపద్యగ్రంథములు లేవనియే నామతము. ఇవి పాటలంతవివర్ణపదసంకలితములు కావు. శబ్దశాస్త్ర సిద్ది లేనివికావు. శతకకవులు లాక్షణికులు కారందుమా? పాలుకురికి సోమన్న బసవపురాణము లాక్షణికమై దానికిఁ బిమ్మట వ్రాసినవృషాధిపశతకము వికృతమైన దనవచ్చునా? కవిసంశయవిచ్ఛేదము వ్రాసినలాక్షణికుఁ డగుసూరకవి రామలింగేశశతకము గడ్డితుక్కయి, కవి జనరంజనము ఘనమైన దయినదా? ఆంధ్రనామశేష మాదరణపాత్రమై శతకము, హితవుకాకపోయిసదా? అప్పకవివజ్రపంజరశతకాదుల లాక్షణికముగ నెంచలేదా? రావిపాటితిప్పన్నచాటుధారలు, మేధావి భట్టుపద్యములు లాక్షణికములు కాఁగా, కావ్యగౌరవము గలశతకములు పనికిరాకపోవుట న్యాయమా? ధూర్జటికాళహస్తిమాహాత్మ్యము పనికివచ్చి, తరువాత ప్రౌఢవయస్సున వ్రాసిన కాళహస్తీశ్వరశతకము గౌరవార్హత లేనిదైనదా? శతకములవంటి చిన్నగ్రంథములు వ్రాసిన గట్టుప్రభువు గట్టివాఁడైనాఁడు? లాక్షణికుఁ డైనకూచిమంచి తిమ్మకవి,[సర్వలక్షణ సారసంగ్రహకర్త] వ్రాసినకుక్కు. టేశ్వరశతకము, కుకవిత్వమా? ప్రబంధమార్గములు ప్రాఁతవి సమకూర్చిన రుక్మిణీపరిణయాదులు ప్రౌఢగ్రంథములా? ఇది వింతగా లేదా?

మీకొక్క యుదాహరణము చూపెదను. శ్రీవడ్డాది సుబ్బారాయుడుగారు మంచిపండితులు, కవులు నని లోక మెఱుఁగును. వారనేక పెద్దగ్రంథములు వ్రాసినారు. భాషాంతరీకరించినారు. కాని వాని యం దెల్లయెడల వారిపాండిత్య, భాషాంతరీకరణ నైపుణ్యము వెల్లడి యైయుండవచ్చును. కాని వారిభక్తచింతామణి పండితపామరప్రియమైనది. ఇది యుపజ్ఞాసహిత మగుస్వకల్పితా కావ్యముకదా! ఇదిశతక స్వభావము కలది. అది పెక్కుమార్లు పునర్ముద్రిత మైనది; వేనవేలు ప్రతులు చెల్లిపోవుచున్నవి. తక్కిన - వారివే - యితరగ్రంథములు రెండుమూఁడు ముద్రణములు దాటియుండవు. కారణమేమి? గ్రంథ ము సుబోధ మయినచోఁ బామరు లైనను రసమును గ్రహింపఁగలరు. కనుక దానినాదరింపక మానరు. కావ్యగుణము సులభలభ్యముగ నున్న చో, వారది యూదరించి తీరెదరు. వ్యాప్తినిఁబట్టి గ్రంథగుణము సర్వదా నిర్ణయముకాదు. కాని శతకకవిత్వమునందు కావ్యగుణము సులభముగ లభ్యమగు నని నాయాశయము.

లక్షణవిరుద్ధముగ వ్రాసి రని నింద లొందుచున్నపోతన్న భాగవతము, కృష్ణరాయని యాముక్తమాల్యద, వేంకటకవి విజయవిలాసమును నైఘంటికు లంగీకరించిరి. పచ్చిబూతులు వ్రాసె ననుచున్న ముదుపళనిరాధికాస్వాంతనము, కుచకచాదుల వర్ణించిన సారంగుతమ్మయ్య వైజయంతీవిలాసము, బిల్హణీయమును బనికివచ్చినవి. ఈ గ్రంథములపేరుల వినిన నేవగించు కొందు మని వ్రాయనేర్చిన శ్రీ వీరేశలింగము పంతులుగారికి భక్తి, వైరాగ్యములు, నీతి, మతము, శరంపరలుగఁ బామరులకు బోధచేయుట కుపయోగించిన శతకరాజము లుప్పుగల్లునకైనఁ బనికిరాకపోవుట శోచనీయము. దుష్టగ్రంథములని వారు చెప్పినవానికర్త లగువేశ్యలు, వేశ్యాపుత్రులచరిత్రములు బాగుగఁ బరిశీలించి వ్రాసిరికాని యాంధ్రదేశ మంతట ననునిమిషము పండితపామరుల నొడలుపులకరింపఁజేయు "దాశరథీ కరుణాపయోనిధీ” యనువాక్యము వ్రాసిసకర్తచరిత్రమును వారు వెదకుటకుఁ బ్రయత్నింపరైరి.

శివభక్తులు, విష్ణుభక్తులు, వేదాంతశిఖామణులును వ్రాసిన తేటతెలుఁగు కావ్యరాజము లనఁదగిన శతకకవులచరిత్ర మీవఱకే వ్రాయక, భక్తిజ్ఞాన వైరాగ్యమూర్తు లగువారిపేళ్లే దలఁపెట్టక, వారిపై గ్రీఁగంటిచూపు లైనఁ బంపక మనచరిత్రకారు లాలసించియున్నా రను దుఃఖముచేఁ బెద్దల నిట్లు పైవాక్యములలో నడిగినందులకు మహాజనులు మన్నించెదరుగాక! -

పర్యవసానమున నామనవి యేమనఁగా మనపూర్వు లగుకొందఱు లాక్షణికులు, చరిత్రకారులవలె మన మీవాఙ్మయ ముపేక్షించి రామబాణములనుక్రిములకు నప్పగింపఁదగినదో, మనమే పుస్తకక్రిములమై వానిదుమ్ము దులిపి యందలిగుణమును గొనియాడఁదగినదో విచారించెదరుగాక ! శతకములలోఁగవిత్రయ ప్రయోగవైరుధ్యములు కొన్ని యున్నసు, తేట తెలుఁగుసొంపులు కొన్నియట్టిచోటులనే రససమంజసములై వాడుక భాషావాదులవాదమునకు బలమును గలుగఁజేసి, శబ్దసిద్ది లోకమువలనఁ దెలియవలె ననుసిద్ధాంతము నందలి న్యాయమును వెల్లడించుచున్నవి. ప్రయో మూలము వ్యాకరణ మగుట నట్టిప్రౌఢప్రయోగముల తారతమ్యముచొప్పున మన వ్యాకరణము కొంతవఱకు సవరించుకొనుట న్యాయ మని నేనుఁ దలంచుచున్నాను.

ఇదివఱకువారు శతకములఁగూర్చి వ్రాయలేదనియు, నేనిప్పుడు వ్రాయుచున్నాననియు, నందువలన నేను వారికంటె ఘనుఁడననియు నేనీవాక్యములు వ్రాయుటలేదు. అట్టి దుష్టాభిప్రాయము నాకుండినను లోకమును మోసగించి నేనట్టిసాహసమున కొడిగట్టినను లోక మూరకొనదు. పైన నేనుచూపిన భావములు పెద్ద లనేకు లంగీకరించుచున్నారు. వ్యాకరణసంస్కరణము, శతకములయాదరణము నవసరమనుచున్నారు. కాని యెవ్వరు నాపనుల కింతవఱకు నాకుఁ దెలిసినంతలోఁ బూనుకొనలేదు. ఒకశతకము మంచిదని మనకు సత్యముగఁ దోఁచినప్పుడు ఒక ప్రయోగము బహుళమై కవిత్రయప్రయోగములకు విరుద్దమయ్యు రసప్రకటనమున కనువైయున్నట్లు మన కగ పడినప్పుడు మనమది లోకమునకుఁజూపి చెప్పవలెను. ఆవిధముగఁ బ్రయోగించి భావప్రకటనమునకు, రసస్ఫూర్తికి, భాషాసౌలభ్యమునకుఁ దోడ్పడవలెను. ఇది భాషాభివృద్ధి చేయుటకాని, భాషాభివృద్ధి కావలె నని యెవరితెన్నున వా రూరకుండిన నగునా! విద్యాధికులైన వారు తమకు సత్యము లని తోఁచినవిషయములు మాబోంట్లకు వెల్లడించుచుండవలదా?

ఇదివఱకు మన పెద్దలు శతకకవులను విస్మరించినమాట సత్యము అది వా రుద్దేశపూర్వకముగ విస్మరించిరి. చేతఁగాక యీ స్వల్పకార్య మును వారు మానియుండరు. అనేకప్రబంధముల నామూలాగ్రముగఁ జదివిన సీతారామాచార్యులుగారుకాని, ఎన్నో గంథపీఠికలును, గద్యలను జదివి, బ్రౌనుగారి గ్రంథచరిత్రములఁ బరిశీలించి, కవిచరిత్రము వ్రాసిన శ్రీవీరేశలింగముపంతులు గారకాని ప్రయోగముల నీయలేరా? శతకకవులనుఁగూర్చి వ్రాయలేకపోవుదురా? వారిది యనవసర మని తలంచిరి. తప్పు లధిక మని విడిచిరి. ప్రౌఢప్రబంధములే సత్యమైన వాఙ్మయ మనుకొనిరి. అందు లేనిప్రయోగములకుఁ బదముల కే నిఘంటువులో స్వల్పముగ గేయశతకవాఙ్మయసాయము నందిరి.

శతకములపై శ్రీ వీరేశలింగము పంతులుగారి కంతగా గౌరవములేదనుట కాధారముగా వారివాక్యములే చూపనగును. కాని యదియిచ్చట నవసరములేదు, అయినను సందియమున్నవారు వారి కవుల చరిత్రమునందలి 400, 396, 397, 393 పుటలఁ జూడవచ్చును కూచిమంచి తిమ్మకవి "మఱియుఁ బెక్కుశతకదండకసత్కృతుల్ ప్రతిభఁగూర్చి” యని చెప్పుకొనుచుండఁగా శ్రీ వీరేశలింగముపంతులుగా రవియన్నియు బాల్యకృతము లగు చిన్నకృతు లని యాతనిసారంగధరచరిత్రముతోపాటుగా త్రోసివేసిరి. తిమ్మకవి కుక్కుటేశ్వరశతకము ముందఱ నాతని యితరగ్రంథములు పేర్కొనుటకైన నర్హతలేని వని విజ్జులకుఁ దెలియనివిషయముకాదు. "సత్కవితామహాసామ్రాజ్య భారధౌరేయుండ బుధజనప్రియసచివుంది” నను తిమ్మ కవిశతకమునందలి వాక్య మాతఁ డాశతకము బాల్యమున వ్రాసెననియే తోఁచిన శ్రీ వీరేశలింగముపంతులుగారి నేమనఁగలము? ఇట్లే సూరకవి రామలింగేశ్వరశతకము, ధూర్జటి కాళహస్తీశ్వరశతకమును గూడఁ బ్రౌఢవయస్సుననే వ్రాసినట్లు "రోసిందేమిటి రోత "అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె” “కాయల్గాచె వధూనఖాగ్రములచేఁ గాయంబు” “ రాజుల్మత్తులువారి సేవనరకప్రాయంబు” “ఎన్నాళ్లుండితి నేమిగంటి నిఁకనే నెవ్వారి రక్షించెద౯ " మొదలగు వాక్యములచేఁ దెలియుచున్నది. నఱసినవెండ్రుకలప్రక్క వెండితీఁగెల రుద్రాక్ష లల్లాడుచుండ ధూర్జటి యాపద్యములు చదువుచు న్నట్లు నాకుఁ గనఁబడుచున్నది. అది బాల్యకృత మని యెట్లనఁ గలుగుదును?

శతకము లన్నియుఁ గవులు బాల్యమునందు వ్రాసిన వగుట నాదరణపాత్రములు కావని మెఱికలవంటి ప్రౌఢశతకములఁగూడ విడుచుట న్యాయముగాఁ గనఁబడదు. అందువలనఁ జేతనైనంతవఱకు మన శతకములపరశీలన మొనరించి యందుండిగుణములఁ గొంచెముచవి చూపింపఁబ్రయత్నించెదను. నేనుమంచివేయనుకొనినశతకము లన్నియుఁ జూపలేను సరికదా, ప్రసిద్ధశతకము లన్నిఁటినిగూర్చియైనఁ జెప్పుట సులభముకాదు. కావున స్థాలీపులాకన్యాయమునఁ గొంచెముభాగమే పరిశీలించుకొందముగాక!


శతక పరిశీలనము.

ఆంధ్రభాషలో రమారమి 600 శతకములు కనఁబడినవి. (1) ఇందు భక్తిశతకము లధికము. శైవము, వైష్ణవము, కూడ నున్నవి. రామశతకములు, ఆంజనేయశతకములును వైష్ణవములని యంగీకరించినచో శైవము వానికంటె వైష్ణవ శతకము లధికముగఁ గనఁబడుచున్నవి. (2) వేదాంతశతకములు కొన్నియున్నవి. ఇవి వేమన, ఆత్మలింగ, అప్పాలయోగి మొదలగువారిశతకములు, బైరాగులు చదువుచుందురు. వేదాంతబోధకులు తెలుఁగులో నిర్వచించునట్టియద్వైతమతబోధకములుగా నుండుపద్యములుండును. తత్త్వములలోఁ బ్రతిపాదింపఁబడు నట్టివిషయములె యీశతకముల నుండును. శృంగారము భక్తిలో నొకభాగ మనినచో మనశతక వాఙ్మయములో మూఁడువంతులు భక్తిశృంగారములపా లగును. శృంగార శతకములు వేఱుచేసినయెడల నివి రమారమి యిరువదిశతకముల కొకటిచొప్పున రావచ్చును. చాలవఱకు శృంగారశతకములు కృష్ణునిపై సుండుటచే నవి భక్తిప్రతిపాదకము లనవీ లున్నది. కేవలశృం గారశతకములు మిక్కిలి తక్కువ. కావున భక్తిశృంగారముల రెంటిని నేనొక్కటిగాఁ బరిగణించటకే యంగీకరించెదను. భక్తిశృంగారములను, జ్ఞానవైరాగ్యములును గలుపుకొని భక్తి జ్ఞానశతకములని రెండువిధములుగా శతకముల విభజించుకొనవచ్చును. ఇవి పోఁగా మిగిలిన వానిలో నీతిశతకములు, హాస్యశతకములును మిగిలియుండును. ఇన్ని విభాగము లొనర్చుకొనినను వివిధవిషయము లుండుసంకలితములు కూడఁగలవు. భక్తిలోనుశృంగారములోను, శాఖలు విభజించుకొనవీళ్ళున్నవి. ఆభేదము లన్నియు " వేఱొకచో వివరించెదను.

మనశతకములు సాధారణముగా స్వతంత్రరచనములే కాని కొన్ని కేవలభాషాంతరీకరణములు సూర్యశతకము, భర్తృహరివంటివి; కొన్నియనుసరణములు సుమతి, కాళహస్తీశ్వరశతకముల వంటివి; కొన్ని సంకలితాభిప్రాయసూచకములు భాస్కర, దాశరధీశతకముల వంటివి; స్వతంత్రరచనము లున్నవి వేమన, కవిచౌడప్ప, వేణుగోపాలశతకములవంటివియఁ గలవు. రాజనీతి, సేవకనీతి,లో కనీతి, బాలబాలికనీతినిఁబ్రకటించినవి కొన్ని యున్నవి. ఇవికూడఁగొంతవఱకుసంస్కృతానుసరణము లనవచ్చును. నీతిశతకములు ధర్మశాస్త్రముల వంటివి, ప్రభుసమ్మితము లగువేదములవంటివి. కావున వీనికిఁ గావ్యత్వము సిద్ధింపదు.

భక్తిశతకములయందు వారివారియాత్మసంక్షోభమును భక్తులు వెల్లడించుకొనిరి. శృంగారశతకముల యందుఁ గాంతాలలామ, లావణ్య చంద్రవదనశతకములు కేవలకాముకజనార్హములుగఁగన్పట్టును. తాడిమళ్ళరాజగోపాల, మల్లికార్జున, కలువాయి శతకములు భగవంతుని గుఱించి చెప్పిన శృంగారశతకములు. ఇవిగాక నీతిశాస్త్రములు, జ్యోతిషము, శబ్దశాస్త్రసంబంధ మగునిఘంటువులునుగూడ శతకరూపమున నున్నవి. బద్దినీతులు, నీతిమంజరి, శిఖనరసింహశతకము, సాంబ నిమంటువు మొదలగున వీతరగతిలోఁ జేరును, ఇవికూడఁ గావ్యములు కావు. ప్రాయికముగా భక్తిశతకములే యెక్కువ. రెండవస్థానము వైరాగ్యశతకములకే వచ్చును. ఈ రెంటికినడుమ శృంగారశతకము లుండును.

శతకములయందు సాధారణముగాఁ గవి తనయిష్టదైవమును గాని, పోషకుఁడగుప్రభువునుగాని, సంబోధించిచెప్పుచున్నట్లు ప్రతిపద్యముచివర నిర్ధిష్టనామమును జేర్చును. "వేణుగోపాలబాల" యనికాని “దాశరథీకరుణాపయోనిధీ" యనికాని; "కృష్ణభూపతిలామ!” "వేంకటమంత్రీ” అనికాని చేర్చుచుండును. నూఱుపద్యములచివరను నీవిధముగనే చేర్చును. దీనినే మకుట మనుచున్నాము. ఈమకుటము చేర్చుపద్దతి సంస్కృతమునందును ఇంగ్లీషు పాటలయందును క్వాచిత్కముగఁ గనఁబడుచున్నది.

(1)ఆంగ్లేయమునను సంస్కృతమునను మకుటమున్నవి చూపెదను. థోమ్‌స౯ వ్రాసిన 'Rule Britania;' బరన్సు వ్రాసిన 'My heart's in the High lands;' రెజినాల్డు హీబరువ్రాసిన 'God provideth for the marrow;' మూరువ్రాసిన 'Oft in the silly night;' క్యాంబెల్లు వ్రాసిన ' The Irish Harper & the Dog నందును మకుటము లున్నవి.

      THE HOUR OF PRAYER.
“Child, amidst the flowers at play
While the red light fades away
Mother, with thine earnest eye
Ever followingly silently
Father by the breeze of eye
Called thy harvest work to leave
Pray, ere yet the dark hours be,
Lift the heart and bend the knce!"

ఇట్లే కడపటిపాదము ప్రతిపద్యము చివర వచ్చుచుండును. సంస్కృతమునందు నిట్టివి కనఁబడుచున్నవి. మచ్చు చూపెదను.

చతుప్పాదయుక్తం సరోజంచచిత్తం, షడానందకారం స్ఫురద్ద్వాదశారం
స్వరద్వంద్వయుక్తం సరోజం స్మనేయం, చిదానందరూప శ్శివోహంశివోహం!! 1
ఆనాకాశ మాకాశ మాకాశరూపం, నిరాకార సాకార మోంకారగమ్యం
సహస్రార మధ్యస్థ బిందుస్వరూపం, చిదానందరూపశ్శివో హంశివోహం!!
                                                             (చిదానందద్వాదశస్తోత్రము)

సంస్కృతమునందును భక్తుల స్తుతులు, స్తవములు, మకుట సహితములు.

(2) ఇట్లే ఋగ్వేదము, 1-17 లో పదిఋక్కులు "మరుద్భిరన్న ఆగహి” అని కొట్టకొనను మకుటమువలె గలవి యున్నవి.

(3! ఇట్లే పాళీభాషలో నున్నవి.

కాని మనశతకములకీమకుటముతప్పనిసరిగఁ గనఁబడుచుండును. లేనివి లెక్క కొకటిరెండుమాత్ర మున్న ట్లున్నది. ఈమకుటమును బట్టియే శతకనామ మేర్పడును. శతకనామమే కాదు. శతకము వ్రాయవలసినవృత్తమును ఒకప్పుడు యతిప్రాసలునుగూడ నీమకుటముపై నాధారపడియుండును. “ఇందూ నందునిమందనుండిక దనీ వేతెంచుటల్ రాకల౯" అని మకుట మేర్పఱచుకొని చంద్రదూత వ్రాసిన పుసులూరి సోమరాజకవి శతక మంతయు బందుపూర్వకదకార ప్రాసముతోవ్రాయవలసివచ్చెను. వేమన నాల్గవపాద మంతయు మకుటముతోనే నింపుటచే నాతఁ డాట వెలదులతోనే రచింపవలసివచ్చెను. “సుమతీ" యనుమకుట మున్నకవి కందములే వ్రాయవలసివచ్చెను. "శ్రీకాళహస్తీశ్వరా” యన్నమకుట మేర్పఱచిన ధూర్జటి నాల్గవపాదము మొదటియక్షరముపై నొకకన్నుంచి ప్రతిపద్యము వ్రాయవలసి వచ్చెను. కవిచౌడప్పయు నిట్లే కదా! చూపుచు: బోయిన ననేక వైచిత్ర్యము లున్నవి.

కాఁబట్టి శతకమునందు మకుటనిర్ణయము ప్రధానకార్యము . ఇది మనతెలుఁగు శతకములయందు వైలక్షణము దాల్చుటకుఁ గారణ ము మన యతిప్రాసనియమములయందలి రహస్యముపై నాధారపడి యున్నది. మకుట మొకటిపద్యముల కన్నిఁటికి స్థిరముగ నుండవలసివచ్చుటచే నొక శతకమునందలి పద్యము లన్నియు సంస్కృతకావ్యముల యందలి సర్గలవలె నొకేతీరుపద్యములతో వ్రాయవలసియుండెను ఉత్పల చంపకమాలల వంటి యన్యోన్య సంబంధముగల పద్యములు మాత్రము మారుచుండుట గలదు. కాళహస్తీశ్వరశతకమునందు మత్తేభశార్దూలములు, భాస్కరశతకమునం దుత్పల చంపకమాలలు దాశరథీశతకమునందు నట్లే యొకటి రెండు వృత్తములలోఁ జెప్పవలసివచ్చినది. సూక్ష్మమగు నీతులు సులభమైనశైలిలోఁ దేట తెలుఁగు పదములతో వ్రాసిన కొందఱుశతకకర్తలు నీతి, వేదాంతముల కాటవెలఁది కందపద్యములవంటి జాతుల నాశ్రయించిరి. కందపద్యము నీతిశతక కవులకుఁ బ్రీతికర మని తోఁచుచున్నది. సులభముగ బాలురు బాలికలు చదువుటకు, నందఱకు జ్ఞప్తియందుంచుకొనుటకును, వీరీ కందము నాశ్రయించి రనుకొందును. నీతిపద్యముల కీకందములందముగ నున్నవి. కందము చెప్పినఁగాని కవి కాఁడనుటవలననే తెలుఁగుభాష కీజాతిపద్యము ప్రాముఖ్యమని ప్రచురము కాఁగలదు. తిక్కన భారతము శాంతిపర్వములో నీకందమును జక్కగ వాడియున్నాఁడు. అందువలననే కవిచౌడప్ప యిట్లుపలికెను.

“ముందుగ చనుదినములలో, కందమునకు సోమయాజి ఘనుఁడందురు నే
 డందఱు ననుఘునుఁడందురు, కందమునకుఁ గుందవరపు కవిచౌడప్ప!"

చౌడప్పకూడఁ గందమునకు ఘనుఁడనుట సత్యేతరము కాదు కాని మకుటముకొఱకు నాల్గవపాదము మొదటికి 'కి' కారమును దెచ్చి కవి పైపద్యమునందలి వాక్యక్రమము నెట్లు మార్పవలసివచ్చెనో చూచెదరుగాక! కావున మకుటము శతకస్వరూపమును నిర్ణయించుటకు ముఖ్యకారణ మైనది.

భక్తిశతకములు వృత్తమయములు రాగాలాపనము చేసి భక్తులు పాడుకొనుట కిది రమ్య మని యట్లొనరించి యుండవచ్చును. శృం గారశతకములు ప్రాయికముగా సీసపద్యములతో నున్నవి. వేణుగోపాలశతకమువంటి 'హాస్యశతకములు నిట్లేయున్నవి. చంద్రశేఖర శతకమువంటి యచ్చతెలుఁగు పామరభాషమాత్రము వృత్తములలో నున్నది. భాషాంతరీకరణము లగుశతకములు వివిధవృత్తములతో నున్నవి. ఇందుఁ దెలిగించిన కవికి స్వాతంత్ర్యము తక్కువ. అందువలన నివి చంపుపులవలె వివిధవృత్త సమన్వితములు కావలసివచ్చినవి. ఈచర్చపై నాయభిప్రాయములు తెలియఁగోరువారు నావాఙ్మయ చరిత్రమును జూడుఁడు. భాషాంతరముచేయుకవికి భావములపైస్వాతంత్ర్యము లేదు. కావుననే మకుటము నేనుఁగు లక్ష్మణకవి భర్తృహరి తెలిఁగింపులో మానుకొనెను. తెలుఁగుసంప్రదాయాను సారము కృతిభర్త నామము ప్రతిపద్యము చివరను జేర్చిన బాలసరస్వతి మల్లభూపాలీయ మనుభర్తృహరి తెలిఁగింపులో మకుటమును జేర్చ మూలముకంటె భిన్నముగను, కొన్నిచోట్లఁ గ్లిష్టముగను, వ్రాసి పాట్లుపడవలసివచ్చినది. చిన్నశ్లోకమును మకుటమునకై పెద్దపద్యముగా వ్రాయ వలసిన యీతఁడు మూలానుసార మెట్లు వ్రాయగలఁడు? ఈనడుమ నొకకవి సీసపద్యములో గీతము తీసివేసినట్లు, త్రిపాదులు ద్విపాదులు వృత్తములు వ్రాసియుండవలసి వచ్చియుండెడిది.

శతకస్వభావము గలమేఘసందేశము వంటికావ్యములు మందాంక్రాంతము మొదలగు సమజాతివృత్తములు వ్రాసియుండిరి. ఇచ్చట శతకస్వభావ మనఁగా "లిరిక్కని” నాయభిప్రాయము. మేఘసందేశమునందు శృంగారము ప్రధానము. తనకోర్కె తీరుటకు సంక్షుభితమనస్కుఁడైన యక్షుఁడు రక్షించు నని తాను తలంచుకొను మేఘు నుద్దేశించి పలుకుచున్నాఁడు. మనభక్తిప్రతిపాదకశతకముల యందు భక్తుఁడు ఘోరసంసారజలధిలో బంధింపఁబడి, సంక్షుభితమనస్కుఁడై రక్షకుఁ డని యాతఁడు తలంచుకొనుభగవంతునియిష్టావ తారమును, సాకారముగసంభోధించి తనయావేదనము వెల్లడించుకొని మోక్షమును గోరుచున్నాఁడు. ఈరెంటియందును గామపరితృప్తి ప్రధానము. తానురక్షింపఁపడుట, లేదా తనకోరికతీరుట ప్రధానము. “ధూమజ్యోతిస్యలిలరుతా" సన్నివేశ మగుమేఘము తనవియోగదుఃఖమును బాపఁగల్గునా లేదా యను విచారము యక్షునకు లేనట్లె కామముచే నజ్ఞానుఁడైనట్లెయిచ్చట శతకములయందు భక్తుఁడును, సాకారుఁలగు రామకృష్ణాద్యవతారములుకాని యిష్టదైవ మగువిగ్రహముకాని తన్ను సంసారజలధీనుండి యుత్తరించి పరమాత్మనుండి తన కైనవియోగదుఃఖమును బాపఁగల్గునా? లేదా? యనువిచారముచేయక యక్షునివలెనే భక్తుడు భక్తిచే నున్మాదుఁడై (మోక్షకామియై) భగవదంశము గల విగ్రహమునుగూర్చి మొఱపెట్టుకొనును. మేఘము ప్రియురాలిని సందర్శింపవచ్చును. కాని మాటలాడలేదు. అట్లే విగహము జ్ఞానము కుదుర్చుటకు సాధనము కావచ్చును. కాని మోక్షము నీయలేదు. మోక్షసాధన మగుభక్తిజ్ఞానముల నీయవచ్చును. కాని మోక్షమీయఁ జాలదు, ఇచ్చట నేను వేదాంత ముపన్యసింపఁ దలంపలేదు. నేను చెప్పినయుపమానము నందలిసాధర్మ్యమును వెల్లడింపఁబూనితిని. ఇందువలన మనశతకముల యందలిభావోద్రేకమునఁ బుట్టియావేదనము వలనఁ గలిగినస్తుతియందు "లిరిక్కు"గుణ మున్నదని చెప్పఁగలిగితి నని తలంచెదను. అయితే మేఘసందేశమునందుఁ గర్త యగుకాళిదాసుకంటె వేఱుగ యక్షుఁ డనుపాత్రకలదు. యక్షుఁడే కవి యని నాయాశయము. కాని యది యట్లుంచుఁడు. శతకములలో రచయిత యగుకవియే పాత్ర. శతకము నందలిభక్తుఁడును, శతకమువ్రాసిన కవియు వేఱని చెప్పవచ్చును. పరమాత్మ కవి, జీవాత్మ భక్తుడు. భక్తుఁడో శతకము నందలిపాత్ర. యక్షునివంటి పాత్ర! అని సమర్థింపవచ్చు నన కొందును.

ఇట్లు సమర్ధించుటకుఁ దనకుఁ దానే సంబోధించుకొనినశతకము లుదాహరణముగఁ జూపవచ్చును. కవిచౌడప్ప ప్రసిద్దికొఱకును, బద్ది భూపతి కీర్తికొఱకును తమ్ముతామే సంబోధించుకొని శతకములు వ్రాసి రంద మనినను, వేమనవంటి విరాగమూర్తి “వినురా వేమా" అని సంబోధించుకొనుటకుఁ గారణము లరయవలయును. ఈసంబోధనములఁ జూచినకొంద ఱివి, వేఱుకవులు వారిపై వ్రాసిన వనియు వేమన తనకుఁ దాను సంబోధించుకొనఁ డనియు వాదించుచున్నారు. వేమన్న యనుపేరుకూడ నశ్వర మగుశరీరమువంటి మానవకల్పిత మగు బాహ్యశరీర సంబంధ మైనసాంకేతిక మనియు, జ్ఞాని యగువేమన్న , అజ్ఞాని యగుతనమనస్సుతో ననఁగాఁ బరమాత్మ యగుతాను జీవాత్మ యగు నజ్ఞాని వేమన్నతో నీవేదాంతము బోధించినట్లును, మనకుఁ దట్టుచున్నది. లేదా వేమన్నకే కలిగిన సందేహములను, తిట్టినయూహలను, “చెప్పరవేమా!! "చాటరవేమా!" అని తాను బ్రహ్మజ్ఞానా నందమున నోలలాడుసమయమున వినిపించిన వనవచ్చును. వేమన్నకవి వేమన్న రాజగుసోదరునిఁ గూర్చి చెప్పె ననుమాట నిలువఁ జాలదు. తనయందే యన్న “సుబుద్ధి" కీ వేదాంతమును సంబోధించి చెప్పినట్లు మనము తలంపవీలగుచున్నది. ఇందువలన శతకమునందలికవి జీవాత్మపరమాత్మలఁగూడ విడఁదీసి మేఘసందేశము నందలి యక్షుని వంటిదే జీవాత్మ యనవచ్చుననుకొందును. ఆదిగాక శివ కేశవభేదము లేని వేమన్న - "అహమ్‌బ్రహ్మస్మి" యనినయద్వైతి యగువేమన, జీవాత్మపరమాత్మలకు భేద మంగీకరింపనివేమన్న - సర్వసృష్టియు దానొక్కఁడే యనుకొనినవేమన, తన్ను తానుగాక మఱియెవ్వరి నుద్దేశించి పలుకుట కంగీకరించును? అట్టివేదాంతి కీకవిత్వమేల యనవచ్చును. గాని వేమన్న సహజకవిత్వము కలిగి పక్షివలెఁ బాడెనేకాని వ్రాయలేదు. అందువలననే యాతని శతకమునం దిన్నిభేదములు.

సులభ మైనతేటతెలుఁగులో నున్నయీజాతివేదాంతశతకములయం దనేకవైచిత్ర్యములు గన్పట్టుచున్నవి. కొందఱు వేమన స్వర్ణకారవిద్య తనశతకమునందు బోధించే నని దానికై పాట్లుపడుచున్న వారున్నారు. శతకములలో గూఢార్ధప్రతిపాదకములు, (Mythical) యంతరార్థ సంఘటితములు (allegorical) కొన్ని శృంగారరసప్రకటితములయ్యు గీతాంజలి, గీతాగోవిందములవలె నంతరార్థబోధకములుగ సాధింప దగినశతకము లున్నవి. కావున శతకములు ప్రచురముగాఁ గవుల స్వీయాభిప్రాయములు ప్రకటించినవి. వీనియందుఁ బాత్రలను తెఱలయడ్డములేదు. కవి భగవంతునితో ముఖాముఖి మాటలాడును. అందువలన శతకములయందు "గవిహృదయము.” సులభముగ గ్రహింపఁగల మని నా తలంపు. శతకములు కవిభావోద్రేశకమునఁ బుట్టిన "లిరుక్సు” అగుటచే భక్తి, శృంగారము, క్రోధము, భయము, అద్భుతము మొదలగు భావోద్రేకములు కలిగినప్పుడే శతకములు పెక్కుమంది రచించి యున్నారు. మహాపండితులబంధచిత్రకవిత్వశతకములకంటెఁ దప్పులకుప్పలగు బ్రావోద్రేకజనితము లగుతేటతెలుఁగు శతకరాజములే మణులవలె బ్రకాశవంతము లగుచున్నవి. వానికి మరణములేదు. మంచి యభిప్రాయముల వెల్లడించినవి.

ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యముకంటెఁ గాళహస్తీశ్వరశతకము, తిమ్మకవి ప్రబంధముకంటెఁ గుక్కుటేశ్వరశతకమును, మనకు గొప్పనిధులు. వారి ప్రబంధము లాంధ్రవాఙ్మయమున లేకపోయినను నేను విచారింపను దానికి లోటులేదు.

కాని వారిశతకములు మనవాఙ్మయమునుండి తీసివేయుటవలన మనకుఁ గొంతయాస్తి తరిగిన ట్లగును.

శతకములు భావోద్రేకజనితము లనుటకు ప్రబల నిదర్శనముగ నొక్క శతకము చూపెదను. తుఱకలు సింహాచలముప్రక్క.ల దోపిడిచేయుచు వచ్చి దేవాలయమును జుట్టుముట్టినప్పుడు కోపముతో-- భయముతో --- భక్తుఁడైన గోగులపాటి కూర్మకవి "దేవుని నిందాగర్భముగ "వైరిహరరంహ! సింహాద్రినారసింహా ! " అని చెప్పిన నారసింహశతకమునందలి వాక్యముల వినుఁడు.

"పొంచియుంటివి యవనులఁ ద్రుంచుమింక ! దోలు పారసీకాధిపుల పటాపంచలుగను!
 ప్రజలఁరక్షించు యవనేశు బలముగూర్చి ! ఘనతురుష్కులఁ బడఁగొట్టమనసుఁబెట్టు!”

అని యుద్రేకముతో సంబోధించుచున్నాఁడు. ప్రోత్సహించుచున్నాఁడు. నిందాగర్భముగఁ బలుకుచున్నాఁడు. తెగఁబడి తిట్టుచున్నాఁడు. దేవుని భయపెట్టుచున్నాఁడు. బ్రతిమాలుచున్నాఁడు. "అదె! తుఱకబలము వచ్చె”నని చూపుచున్నాఁడు. " సేన నిర్జించి యీ యాంధ్రసృష్టి నిల్పు”మని బ్రతిమాలుచున్నాఁడు. ఇచ్చటి భావావేగము వర్ణనాతీతము. చదువరులకే తెలియవలయును. ఆభయము దర్శనీయము, ఆభక్తుఁడు మనోరంగమునఁ దిలకింపదగినవాఁడు. కరుణ రసపూరిత మగుహృదయముతో నాశతకమును ముగింపవలసినదే! ఇట్టివి పెక్కుశతకము లున్నవి.

మన గ్రంథములలో భావము లుండ వనియుఁ బ్రకృతిపరిశీలన ముండ దనియుఁ బలువురితలంపు. అట్టివారి కీక్రిందిపద్యము పఠనార్హ మైనది. చూడుడు కృష్ణానది నలుపు, అదిసంగమ మగుచోట సముద్రము నలుపు, పై యాకాశము నలుపు, ఆమహారంగమును మనస్సులో ధ్యానించుకొనుఁడు. నది సాగరగతి యైనసంగమస్థలియం దుల్లోల కల్లోలితము లగుగంభీరజలములలోతు, అందుఁ బ్రదర్శిత మగుచున్న నీలపుటాకసపులోతును ధ్యానించుకొనుఁడు. గట్టుదరి నేర్పడినదీవినిఁ బరికింపుఁడు. దీని చుట్టులేచి కరగిపోవు. తెల్లనుఱుగులఁ దిలకింపుఁడు. ఆహంసలదీవిపరిసరముల విహరించిననల్లదొంగపై నల్లినకాసుల పురుషోత్తముని పద్యమును వినుఁడు.

సీ. భువనత్రయీక సంపూర్ణుఁడవగునీకు, నందకుటీరమా మందిరంబు
    పొలమున్నీటిలో నోలలాడెడు నీకు, మహి యశోదాస్తన్య చూబలంబు
    పదపద్మమునగంగ యుదయమందిన నీకు, జలకామాగోపి కాంజలిజలంబు
    హరిరాజు భోగవతి యంకంబుగల నీకు, తల్పమారాధికాతరుణియంక

గీ. మహహ! వారలభాగ్య మెంతనఁగవచ్చు, భావజవిలాస! హంసలదీవి నాస!
    లలితకృష్ణాబ్దిసంగమ స్థలవిహార! పరమకరుణా స్వభావ! గోపాలదేవ !!

మహానీలరంగమున నీలమేఘశ్యాముఁ డగుగోపాలదేవుని యాలయముతో నున్నహంసలదీవిని నిలువఁబడి యానల్లనిసంద్రము , నాకాశమును, అందుఁ గలియుచున్నను కృష్ణయగుకృష్ణనుఁజూచి భక్తుఁడు తన కొఱమాలినజీవితమును దలంచుకొని పరమేశ్వరుఁడు పరమకరుణాస్వభావుఁ డనుచున్నాఁ డందలి స్వభావపరిశీలనము పాశ్చాత్యకవులలో మహాకవులనైనఁ జూపుమనుఁడు! •

రవిసూను౯ బరిమార్చి యింద్రసుతిని౯ రక్షించినాఁడందునా?
రవిసూను౯ గృపనేలి యింద్రసుతుఁ బోరం ద్రుంచినాఁడందునా?
యివి నీయందును రెండునుంగలవు నీకెద్దిష్టమో వెంటనే
రవిచంశాగ్రణి తెల్పువయ్య రఘువీరా జానకీనాయకా!
                                                       (అయ్యలరాజు త్రిపురాంతకుఁడు.)

(ఏలూరు సాహిత్యపరిషత్సభలోఁ జదివిన వ్యాసభాగము లిందుఁ గలవు.)


శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

  1. మనకిట్టి పురాణస్థస్తోత్రములు శతకములుగా నున్నట్లు కీర్తిశేషులైన దాసు శ్రీరాములుగారి దేవీభాగవతమునందుఁ జూడనగును.
  2. ఈక్రిందిపద్య మొక్కటిమాత్రము శ్రీనాథుని దని శ్రీమా రామకృష్ణకవిగా రనుచున్నారు.

    ఉ. వారణసేయదావగొనవా నవవారిజమందుఁ దేఁటి క్రొ
         వ్వారుచునుంట నీవెఱుఁగవా ప్రియహా తెఱగంటి గంటి కె
         వ్వారికిఁ గెంపురాదె తగవా మగవారలదూఱ నీవిభుం
         డారసి నీనిజం బెఱుఁగు నంతకు ------- నోర్వు నెచ్చెలి.

  3. "తదదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతీ పునఃక్వాపి” కావ్యప్రకాశిక.