లోకోక్తి ముక్తావళి/సామెతలు-తూ

వికీసోర్స్ నుండి

1640 తుపాకి కడుపున పిరంగి పుట్టినట్లు

1641 తుప్పర్ల వసేగాని మంత్రాల పసలేదు

1642 తుమ్మితే పోయేముక్కు యెన్నాళ్లుండును

1643 తుమ్ము తమ్ముడై చెప్పును

1644 తురక దాసరి యీత మజ్జిగ

1645 తురకలు గొట్టగా చుక్కెదురా

1646 తురకలు లేనివూళ్ళో దూదేకులవాడు సయ్యదుమియ్యా

1647 తురక వీధిలో సన్యాసి భిక్ష

1648 తులసికోటలో వుమ్మేసినావేమిరా అంటే యజ్ఞవేదిక అనుకున్నాడట

1649 తులసివనంలో గంజాయుమొక్క మొలచినట్లు

1650 తువ్వనవేసిన యెరువు, బాపనికి వేసిననెయ్యి

తూ

1651 తూనీగలు ఆడితే తూమెడు వర్షం

1652 తూమెడువడ్లు తూర్పారబట్టే టప్పటికి యేదు మనవడ్లు ఎలుకలు తిన్నవి

1653 తూర్పుకొర్రువేస్తే దుక్కిటెద్దు రంకెవేయును

1654 తూర్పున యింధ్రధనుస్సు దూరాన వాతవర్షం

1655 తూర్పున ఇంద్రధనుస్సు వస్తే తుంగమడిలోను, పడమర ఇంద్రధనుస్సువస్తే బండమీదను పశువులను కట్టవలెను

1656 తృణము మేరువ మేరువ తృణము