లోకోక్తి ముక్తావళి/సామెతలు-తా

వికీసోర్స్ నుండి

1543 తల్లిదైవము తండ్రిధనము

1544 తల్లినిచూచి పిల్లనూ పాలనుచూచిబర్రెను కొనవలెను

1545 తల్లినినమ్మినవాడు ధరణిని నమ్మినవాడు చెడడు

1546 తల్లిపాలు దూడచెబుతుంది

1547 తల్లిపుట్టిల్లు మేనమామవద్ద పొగడినట్లు

1548 తల్లిరోసినపిల్లను దాదిరోయదా

1549 తల్లిలేనిపిల్ల వుల్లిలేనికూర

1550 తవుడుతింటూ వొయ్యారమా

1551 తవ్వగాతవ్వగా తధ్యం తేలుతుంది

1552 తవ్వి మీదతోసుకున్నట్లు


తా

1553 తాగనేరనిపిల్లి బోర్లదోసుకున్నట్లు

1554 తాగబోతే దప్పిగలేదు తలకొక అంటికలి

1555 తాగేది దమ్మిడీగంజాయి యిల్లంతా చెడువుమ్ములు

1556 తాగబోతూ బొల్లియెద్దుకుకుడితి

1557 తాచెడ్డకోతి వనమెల్లా చెరచినది

1558 తాగేవాడే యిచ్చుకుంటాడు తాళ్ళపన్ను

1559 తాటాకుచప్పళ్లుకు కుందేళ్లు బెదురునా

1560 తాటాకు తినెదవా తలకొట్లుపడెదవా

1561 తాటిచెట్లలో ప్రొద్ధుగూగినట్లు

1562 తాటిపట్టెకు యెదురు దేకినట్లు

1563 తాడుచాలకపోతే నుయ్యిపూడిచినట్లు 1564 తల్లీబిడ్డావకటైనా నోరూ కదుపూ వేరు

1565 తవుడుకు వచ్చినచెయ్యి డబ్బుకూవస్తుంది

1566 తాకోటుగాడికి దధ్యన్నము విశ్వాశికి వేణ్ణీలన్నము

1567 తాడనియెత్తి పారవేయనూగూడదు పామని దాటనూ గూడదు

1568 తాడెక్కేవానికి తలదన్నవాడుండును

1569 తాడేక్కేవానిని యెంతవరకు యెగసనదోయవచ్చును

1570 తాతకు దగ్గులు నేర్పినట్లు

1571 తాతాచార్యుల ముద్ర భుజము తప్పినా వీపు తప్పదు

1572 తాతా పెండ్లాడుతావా అంటే నాకెవడిస్తాడురా అన్నట్లు

1573 తాతా సంక్రాంతి పట్టు పట్టు

1574 తాతా సంధ్యవచ్చునా అంటే యిప్పుడు చదువుకున్న నీకు రాకపొతే 60 యేండ్ల క్రిందట చదువుకున్న నాకు వస్తుందా అన్నట్లు

1575 తా దిన తవుడులేదు వారాంగనకు వడియాలు

1576 తాననుభవించని అర్ధం ధరణిపాలు

1577 తానుండెది దాలిగుంట తలచేవి మేడమాళిగలు

1578 తానిచేసిన పాపం తనువుతో తల్లిచేసినపాపం ధరణికో

1579 తానుపట్టిన కుందేటికి మూడే కాళ్ళు

1580 తానుపట్టిన కోడికి నాలుగు కాళ్ళు

1581 తాదూర కంతలేదు మడకో డోలు

1582 తాను పతివ్రతయైతే బోగమింట కాపురముంటే నేమి

1583 తానుపెంచిన పొట్టేలు తన చేతనే చచ్చినట్లు 1584 తాబూతే మజ్జిగ లేదంటే పెరుగుకు చీటి వ్రాయమన్నాడట

1585 తాను బోను త్రోవలేదు మెడకొకడోలు

1586 తానుగాక పిల్లికూడానా

1587 తాను మింగేది తనను మింగేది చూడవలను

1588 తానూ ఒకమనిషేనా తాడూఒక రొట్టేనా

1589 తానే తుమ్మి తానే శరాయుస్సు అనుకొన్నట్లు

1590 తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది

1591 తానే మూగం కాయ తన్నితే మాగునా

1592 తానైవచ్చిన లక్ష్మిని కాలితోతన్ని త్రోయరాదు

1593 తావులగొడ్డుకు తోలడ్డము

1594 తాబెట్తినది ముషిణి మొక్కాయినా చేపట్టవలెను

1595 తాబోతూ బొల్లిఎద్దుకు కుడితి అన్నట్లు

1596 తమరాకులో నీళ్లు తల్లడించినట్లు

1597 తామసం తామసే

1598 తాలిమి తన్నూకచును యెదుట వానిని కాచును

1599 తాళ్ళకు తలమచండ్లు మేకలకు మెడచండ్లు

1600 తాళ్ళపాకవారి కవిత్వము కొంత తనపైత్యము కొంత

1601 తావలచినది రంభ తానుమునిగినది గంగ