లోకోక్తి ముక్తావళి/సామెతలు-కు

వికీసోర్స్ నుండి

కీ

919 కీ వెరిగి కాటో, రే నెరిగి దాటొ, జా గెరిగి బైటో

920 కీడెంచి మేలెంచవలెను

కు

921 కుంచములో కదుళ్లు పోసినట్లు

922 కుంచెడు గింజలు కూలికిపోతే తూమడుగింజలు దూడ తిన్నదట

923 కుంచెడు బియ్యం గుమ్మడికాయ

924 కుంటికులాసం యింటికి మోసం

925 కుంటి గాడ్దెకు జూరిందే సాకు

926 కుంటెద్దు రానిది దూల మెత్తరు

927 కుండలోకూడు కూడుగానే వుండాలి, పిల్లలుదుడ్డలై వుండాలి

928 కుండల్లో గుర్రాలు తోలేవాడు

929 కుందేటి కొమ్ము

930 కుంపట్లో తామర మొలచినట్లు

931 కుక్క అమేధ్యము తిన్నది

932 కుక్క ఆశ గుండ్రాతితో తీరును

933 కుక్కకాటుకు చెపుదెబ్బ

934 కుక్కకు నెయ్యి యెక్కడైనా యిముడునా

935 కుక్కకువచ్చేవన్నీ గొగ్గిపండ్లు

936 కుక్కతీసినకొయ్యా నక్కతీసిన కొయ్యా 937 కుక్క తెచ్చేవన్నీ బొమికెలు

938 కుక్కతోకపట్టుకొని గోదావరి యీదవచ్చునా

939 కుక్కదొరికితే కర్రదొరకదు కర్రదొరికితే కుక్క అందదు రెండుదొరికితే రాజుగారికుక్క

940 కుక్కను అందలము లో కూర్చుండపెడితే ఆమేధ్యంచూచి దిగవురికినదట

941 కుక్కను ఎక్కి తే సుఖమూలేదు కూలబడితే దు:ఖమూ లేదు

942 కుక్కనుగొట్ట బచ్చనకొయ్యకావలెనా

943 కుక్కనుగొట్టితే యిల్లంతా పారుతుంది

944 కుక్కనుచంపిన పాపము గుడికట్టినా పోదు

945 కుక్కనుదెచ్చి అందలమునబెట్టగా కుచ్చులన్నిటిని తెగ కొరికినదట

946 కుక్కను పెంచితే కూటికుండలకెల్లా చేటు

947 కుక్కముద్దెట్టుకుంటే మూతెల్లానాకుతుంది

948 కుక్క వేషమువేస్తే మొరగకుండా వల్లకాదు

949 కక్కుశ్య పచ్చిగోడశ్య దాటితే మళ్ళిదాటితే రెడ్డిశ్య రెడ్దిసానిశ్య సహమూలా వినశ్యతి

950 కుట్టితేతేలు కుట్టకపోతే కుమ్మరిపురుగు

951 కుట్టిన తేలు గుణవంతురాలు కూశినమ్మ కుక్కముండ

952 కుడబోవుచు కూరాకు రిచి అడిగినట్లు

953 కుడవమంటే పొడవవస్తాడు 954 కుడుములు వండలేని ఆడది కూనిరాగం తీయలేని మగవడు లేరు

955 కుప్పకుముందూ కుస్తీకి వెనక

956 కుప్పతగలబెట్టి పేలాలు వేయించుకు తినేవాడు

957 కుక్కసంతకుపోయి తునకోల దెబ్బలు తిన్నట్టు

958 కుప్పలొ మాణిక్యం

959 కుమ్మరపురుగుకు మన్నంటదు

960 కుమ్మరవీథిలో కుండలమ్మినట్లు

961 కుమ్మరావములో గచ్చకాయలు వేసింట్లు

962 కుమ్మరికి ఒకయేడు గుదియకు ఒక పెట్టు

963 కుమ్ము చెప్పుకునేటందుకు గూడూరుపోతే యేడుకుమ్ము లెదురుగా వచ్చినట్లు

964 కుమ్మరపూ వాటము

965 కుమ్మరివీధిలో కుండలమ్మినట్లు

966 కుమ్మరివారి పెండ్లికూతురు ఆవకట్టకురాక ఎక్కదికి పోతుంది

967 కురూపి యేమిచేస్తున్నాడంటే సురూపాలన్నీ లెక్కబెడుతున్నాడు

968 కులమెరిగి చుట్టము స్థలమెరిగి వాసము

969 కులపింటి కోతియైనా మేలు

970 కులహీనమైనా వరహీనము కారాదు

971 కుళ్లికుళ్లి కాయనష్టి కాలి కాలి కాయవష్టి