లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఎ

వికీసోర్స్ నుండి


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


536 ఊరిపీడ వీరి శెట్టిని కొట్టినట్లు

537 ఊరి ముందుకువచ్చి నా పెండ్లాము బిడ్డలు యెట్లున్నారన్నాడట

538 ఋణమే వ్రణం

539 ఋణసేషం, వ్రణసేషం, అగ్ని శేషం, ఉంచకూడదు

540 ఋషిమూలము, ఇదీమూలము, స్త్రీమూలం విచారించకూడదు

541 ఎంగిలిచేత్తో కాకి కైనావిదపడు

542 ఎంచబోతే మంచమంతా కంతలే

543 ఎంచి చేస్తే ఆరి తరుగునా

544 ఎండబెడితే వుండవుతుంది వుండబడితే వండబడుతుంది వండబడితే తిండబడుతుంది తిందబడితే పండబడుతుంది పండబడితే చీకటిపడుతుంది

545 ఎండుమామిడి టెంకలు ఓడిలోపెట్టుకొని అవరితాడు తెంపటానికి వచ్చినావోయి వీరన్నాఅన్నాడట

546 ఎంతదయో నరకడికి చేంత్రాడు వెదుకుతున్నాడు

547 ఎంత పొద్దు ఉండగా లేచినా తుమ్మకుంటవద్దనే తల్లవ్చారింది

548 ఎంత చెట్టు కంతగాలి

549 ఎంతమంచిగొల్లకైనా ఇప్పకాయంత వెర్రివుంటుంది

550 ఎంతమంచి నందిఐనా అమేధ్యం తినకమానదు 551 ఎందుకుఏడుస్తావురా పిల్లవాడా అంటే ఎల్లుండి మావాళ్ళు కొట్తుతారు అన్నాడట

552 ఎక్కడకట్టితేనేమి మనమందలో యీని తేసరి

553 ఎక్కడకొట్తినా కుక్కకు కాలుకుంటు

554 ఎక్కడనైనా బావా అనవచ్చును గాని వంగతోటదగ్గిర బావా అనకూడరు

555 ఎక్కడున్నవే కంబళీఅంటే వేసినచోటనేవున్న వెంబళీ అన్నదట

556 అక్కడికి పోతావు కిధమ్మాఅంటే వెంటనేవస్తాను పదమ్మా అన్నదట

557ఎక్కితే గుర్రపురౌతు దిగితే కాలిబంటు

558 ఎక్కినవానికి ఏనుగులొజ్జు

559 ఎక్కిపోయి పట్టిచూచి దిగివచ్చి రాళ్ళురువ్వినాడట

560 ఎక్కిరించబోయి వెలకిలబడ్డాడట

561 ఎక్కూఅంటే ఎద్దుకుకోపం దిగూ అంటే కుంటివానికికోపం

562 ఎచ్చులకు ఏలూరుపోతే తన్ని తలగుడ్డలాకున్నారట

563 ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య

564 ఎగరబోవుచు బోర్లబడి యీవురు అచ్చిరాదన్నాడట్టు

565 ఎత్తుకతిన్న వాణ్ణీ పొత్తులో పెట్టుముంటే అంతాతీసిబొంతలో పెట్టుకొనెనట

566 ఎత్తుకొని తిన్నబోలె ఎదురుగావస్తే సంకనున్నజోలే సలాంచేసిందట

567 ఎత్తుపడ్డ గొడ్డు పులికి జడుస్తుంది 568 ఎదట అన్నదిమాట యెదాన పెట్టింది రాత

569 ఎదటవున్నవాడు పెళ్లికొడుకు

570 ఎదటపొయ్యిమండితే తనపొయ్యిలోనీళ్ళు పోసుకున్నట్లు

571 ఎదుగువడ్డమ్మ ఎండిపోయినదట

572 ఎద్దుతన్నునని భయపడి గుఱ్ఱముచాటున దాగినాడట

573 ఎద్దు దున్నగా పిణుజు లొగిరించినదట

574 ఎద్దు నడిగా గంతకట్టటం

575 ఎద్దును కొద్దిలో కొనరాదు బట్టలు బారిలో కొనరాదు

576 ఎద్దునుజూస్తే ముద్దేగాని దున్నబోతే దు:ఖమువస్తుంది

577 ఎద్దునెక్కినవాడే లింగడు గద్దెనెక్కినవాడే రంగడు

578 ఎద్దుపుండు కాకికిమొద్దా

579 ఎద్దుఈనెనంటే కొట్టానగట్టమన్నట్టు

580 ఎద్దుయెండకులాగ దున్ననీడకులాగ

581 ఎద్దులవెంబడే తాళ్ళు

582 ఎద్దుమోసినంత గోనెపట్టినంత

583 ఎద్దులాగున్నావు తేలుమంత్రంరాదా

584 ఎద్దులుబండియు నేకమై కొండమీదికిపోవును

585 ఎద్దేమి యెదుగురా అటుకులరుచి గాడ్దేమిఎరుగురా గంధపు వాసన

586 ఎనుబోతుమీద వానకురిసినట్లు

587 ఎనుము యీనినది రెడ్డీఅంటే నీకేమికద్దేబొడ్డీఅన్నట్లు

588 ఎన్నడుఎరగనిరెడ్డి గుఱ్ఱముఎక్కితే వెనుకముందాయెను

589 ఎన్నిబూతులైనా పిదికెడు కొర్రలుకావు 590 ఎన్నో వ్రణములుకోసినాను గాని నావ్రణంత తీపులేదు

591 ఎప్పటి అమ్మకు నిప్పటేగతి

592 అప్పటిమేలు అప్పటికే

593 ఎరగనివూళ్లో యెమ్మెలుచేస్తే యేకులు నీ మొగుడు వడుకుతాడా

594 ఎముక లేనినాలుక ఎటుతిప్పినా తిరుగుతుంది

595 ఎరుకపెడికెడు ధనం

596 ఎరుకసత్యముకాదు వాక్కుతోడుకాదు

597 ఎరువులసొమ్ము యెరువులవారు ఎత్తుకపోతే పెండ్లికొడుకు ముఖాన పేడానీళ్ళు చల్లినట్టేవుంటుంది

598 ఎరువులసొమ్ముబరువులచేటు తియ్యాపెట్టా తీపులచేటు అందులో ఒకటిపోతే అప్పులచేటు

599 ఎఱ్ఱను చూపి చేపను పట్టినట్లు

600 ఎలుక యేట్లోపోతేనేమి పిల్లి బోనులోపోతేనేమి

601 ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి తనపట్టు వదలదు

602 ఎలుకకు పిల్లి పొంచువేసినట్లు

603 ఎలుకకు పిల్లి సాక్ష్యము

604 ఎలుకచావుకు పిల్లి మూర్చపోవునా

605 ఎలుకమీద కోపాన యిల్లు చిచ్చుబెట్టుకున్నట్లు

606 ఎల్లవార లమ్మల బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది

607 ఎలుగుబంటికి దంతము తీసినట్లు

608 ఎల్లిశెట్టి ఎక్కయే లెక్క

609 ఎవరబ్బ సొమ్మురా యెక్కియెక్కి ఏడ్చెవు 610 ఎవరికిపుట్టిన బిడ్డవురా యెక్కియెక్కి ఏడ్చేవు

611 ఎవరికి వారే యమునాతీరే

612 ఎవరికొంప తీయడానకు యీ జంగం వేషం వేసినావు

613 ఎవరిజానతో వారు యెనిమిది జానలే

614 ఎవరినీళ్ళలో వారే మునుగవలెను

615 ఎవరిప్రాణము వారికి తీపు

616 ఎవరి పైగుడ్డ వారికి బరువా!

617 ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే నోటివల్ల చెడ్డా నోయి తోటమరాజా అన్నాడట

618 ఎవరు ఏమిచేసినా యింటికి ఆలూవుతుందా దొంతికి కడవ అవుతుందా

619 ఎవరుయిచ్చినది యీ మావూఅంటే నేనే యిచ్చుకొన్నాను అన్నాడట

620 ఎద్దున్నవానికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నవానికి ఎద్దుండదు

621 ఎద్దులేని సేద్యము చద్దిలేని పైనము

622 ఎనుము తన్నునని గుఱ్ఱమువెనుక దాగినట్లు

623 ఎవరిపుండు వారికి నొప్పి

624 ఎద్దువలెతిని మొద్దువలె నిద్రపోతాడు