మహాపురుషుల జీవితములు/నవాబు సర్ సలార్ జంగు

వికీసోర్స్ నుండి

నవాబు సర్ సలార్ జంగు

సలారుజంగు 1829 వ సంవత్సరమున హైదరాబాదు నగరమున జన్మించెను. ఈయన సంపూర్ణమైన పేరు మీఱుతుఱ్ఱాఅల్లీఖాను. ఈయన గొప్ప కుటుంబములోనివాడు. ఈయన పూర్వులు మహమ్మదుగారికిఁ బ్రియపట్టణమగు మదీనానగరమునుండి హిందూస్థానమునకు వచ్చి హైదరాబాదులో కాపురముండిరి. ఇంగ్లీషువారికి మైసూరుప్రభవగు టిప్పుసుల్తానుకు 1799 వ సంవత్సరమున యుద్ధము జరిగిన కాలమున సలారుజంగుయొక్క ముత్తాత మీరాలమ్మను నతఁడు హైదరాబాదు నిజాముగారివద్ద దివానుగా నుండెను. హైదరబాదు సంస్థానమునకు చందులాలు దివానుగా నున్నప్పుడు సలారు జంగుయొక్క తాత మనీరుల్ముల్కు వానితోగలసి రాజ్యతంత్రము నడిపెను. అనంతరము చందులాలు మంత్రిపదమును మానుకొన్నపుడు సలారుజంగు పినతండ్రి సురాజుల్ముల్కు నిజాముచే దివానుగా నియమింపఁబడెను. కాబట్టి హైదరాబాదు దివానుపదవికి సలారు జంగునకు న్యాయమైన హక్కుగలదు. హక్కున్నను దనకదియంతటి పిన్నవయస్సులో వచ్చునని యాయన యెన్నడు తలంప లేదు.

సలారుజంగు పాఠశాలకుఁబోయి యెన్నడు విద్య నేర్వ లేదు. వచ్చినచదువేమో యింటివద్దనే చదువుకొనెను. చిన్నతనమందే యతడరబ్బీ పారసీ భాషలయందు బ్రవీణుఁడై యింగ్లీషొక విధముగా నేర్చుకొనెను. కుమారదశయందే తండ్రియుఁ దాతయు మృతి నొందుటచే వాని విధ్యాభ్యాసమునకు విఘ్నములు గలిగి యుండవచ్చును. అతనికి బాల్యమున నుపాధ్యాయు నేర్పరచి యింటివద్ద నేడుసంవత్సరములు విద్య నేర్పించెను. ఆకాలమునం దతఁడుబుద్ధికుశలతనుగాని యేకార్యమైన జేయుటకు తమకమునుగాని జూపినట్లు గన


పడదు. అతఁడు చదువుకొన్న గ్రంథములనుబట్టి విచారించితిమా యతఁడు మంత్రిపదములోనుండి గనఁబరచిన రాజనీతి చాతుర్యము మొదలయినవి వాని కెక్కడినుండివచ్చినవో తెలియదు. ఆతనితండ్రి తల్లి లెక్కలలో వానిని నేర్పరిగ జేయుటకు వారిగ్రామములమీఁద నేఁటేఁటవచ్చు శిస్థులమొత్తము మొదలయిన సంగతులు దెలియఁ జేయుచుండినను సలారుజంగు వానినంత శ్రద్ధచేసివినినట్లుకనఁబడదు. హైదరాబాదులోనుండు గొప్పవారికొడుకులు విశేష విద్యావంతులు కాకపోయినను గొప్పయుద్యోగములలోఁ జిన్న తనమందేనియమింపఁ బడుదురు. అందుచేతనే యిరువదియేండ్ల ప్రాయమున సలారుజంగు తాలూకాదారుగ నేర్పరుపఁబడెను. తాలూకాదారనగా జిల్లకలెక్టరని యర్థము. ఈయుద్యోగమునం దతండెనిమిది మాసములు మాత్రమేయుండినను నాస్వల్పకాలములోనే హైదరాబాదు రాజ్యములోని నేపపన్నుల విషయమై జ్ఞానమంతయు సంపాదించెను. 1853 వ సంవత్సరమందు వాని పినతండ్రి మృతినొంద నిజాము మంత్రిపదము వహించి రాజతంత్రము నడుపుటకు సలారుజంగును బిలిచెను. బాలుఁడగు సలారుజంగు శుభమైన యావార్తవిన్నప్పుడు మనసులో నెట్లుతలంచెనో తనమిత్రునకుఁ వ్రాసిన యీయుత్తరము వలన దేటపడును. "రాజతంత్ర నిర్వహణమువలన ముఖ్యముగా నిటువంటి సమయమున సంభవించు మనోవ్యధలకు లోనుగాకుండ నా పినతండ్రి జాగీరుగ్రామములఁ జక్కంపెట్టుకొనుచు నేనుహాయిగా నుండిన బాగుండును. ఈయుద్యోగము నేను మనసార నంగీకరించుట లేదు. ఇది యంగీకరించని పక్షమున నేను నాకుటుంబము పూర్తిగ చెడిపోవుదము. ఇదిగాక తెల్లవారు నల్లవారు సమానముగ నీ యుద్యోగము నంగీకరింపవలసినదని నన్ను బ్రేరణము చేయుచున్నారు గావున సంస్థానమును జిక్కులలోనుండి పయికి లేవనెత్తుటకును


గ్రమత లేని స్థలముల గ్రమత నిలుపుటకు యావచ్ఛక్తినివియోగించి పనిచేసెను.

అతడన్నట్లెచేసెను. ఆకాలమున హైదరాబాదు సంస్థాన మెంత యధమస్థితిలోనుండవలెనో యంతయథమస్థితిలోనుండెను. ఖజానాలో ధనమాలేదు. నేలపన్ను వసూలు చేయుపద్ధతి మిక్కిలిపాడుగనుండెను. బేరారు రాచూరు మాలదుర్గము మొదలగుజిల్లా లప్పటికి గొన్ని దినముల క్రిందటనే పాతబాకీక్రింద నింగ్లీషు వారి కీయఁ బడెను. ఈ జిల్లాలలోనున్న జాగీరుదారులు వారి వారి జాగీరుల నింగ్లీషువారికి లోబరచవలసినదని యాజ్ఞాపింపఁబడియు దానికొప్పుకొనక తమకుఁ గలిగిన నష్టములకు నిజాముగారిమీదఁ వ్యాజ్యముల వేయదలంచిరి. నిజాముగారి బంధువులజీతముల నిచ్చుటకుఁ గావలసినసొమ్ము వచ్చుట కాధార మేదియు గానఁబడదయ్యె. నిజాముగారి సొంతనగలు సీమలో తాకట్టుపెట్టబడెను. మొత్తముమీఁద హైదరాబాదు రాజ్యముమీఁద నప్పటికున్న ఋణము మూడుకోట్లు. మహాంధకారపుంజమువలెనున్న యాసంస్థానమును బ్రకాశమానముగజేయ సలారుజంగు పూనుకొని మొగమోటము భయము నన్నవి విడిచి వినినవారందరు మహాద్భుతము నొందునట్లు వ్యవహారము నడిపెను. ఇరువదియవయేట మంత్రియై యంతపని నెవ్వఁడు నిదివఱకు చేసియుండలేదు. అతఁడు చేసిన మొట్టమొదటి మార్పే మన సంస్థానములో మిగుల బలవంతులై యెవరిలక్ష్యము లేని యరబ్బులను లొంగదీయుట. వారిజీతములక్రింద నేఁటేఁట విశేషధన మగుచుండును. వారిచేయుపని రవంతయు లేదు. అందుచే నతఁడు వారికొలు వక్కరలేదని తీసివేసెను. అంత తోఁబోక సలారుజంగు తాలూకాలలోను జాగీరులలోను గొలువుండిన యరబ్బులను రోహిలాలను పఠానులను దీసివేయవలసినదని తాలూకాదారులకు జాగీరుదారులకు నుత్తరువులు వ్రాసెను. అట్లు


ద్యోగములు భూములు పోయిన యరబ్బుల హక్కుల విచారించి న్యాయమిచ్చిట కతఁడొక కోర్టుగట్టించెను. మఱియు నరబ్బులకున్న జాగీరులు ముఖాసాలు జమీందారీలు లాగుకొనుటకు నిశ్చయించుకొనెను. ఈవిధమునఁ గృతనిశ్చయుఁడై సలారుజంగు తాను మంత్రి పదమునుబూనిన సంవత్సరములోనే రెండువేల యరబ్బులను రెండువేల పఠానులను మఱియందరి యితర సేవకులను గొలువునుండి తొలఁగించి యేడాదికి నలువదిలక్షల రూపాయలు శిస్తువచ్చు జాగీరులను సంస్థానమునకు గలిపెను. పూర్వ మాసంస్థానములో గుత్తదారీపద్ధతి ప్రకారము శిస్తు వసూలుచేయఁబడుచు వచ్చెను. అనగా తాలూకాదారు ప్రతిగ్రామము నొక్కక్కనికి శిస్తునిమిత్త మిజారాకిచ్చుట. ఈపద్ధతివలన గుత్తదారులు పన్ను లెక్కువ కట్టుటయు రయితు లవి యిచ్చుకొనలేక బాధపడుటయు సంభవించెను. సలారుజంగు దాని నివారింపఁదలఁచి నమ్మఁదగిన మనుష్యులను శిస్తువసూలుచేయ నియమించి గుత్తదారీపద్దతి తగ్గించెను. తాలూకాదారు లదివఱకు రయితులవద్ద వసూలుచేసి శిస్తులో నాలుగవవంతు మూడవవంతు నొకప్పుడు సగము హరించుచువచ్చిరి. క్రొత్తమంత్రియట్టిద్రోహులను నిజోద్యోగములనుండి తప్పించెను. అదివరకు సంస్థానములోఁ బ్రబలియుండిన దొంగతనము బందిపోటు మొదలగు దౌర్జన్యములను మహాకఠినుఁడై యడంచెను. సమర్థమైన యా పరిపాలనముచేత 1856 వ సంవత్సరమునాఁటికి సంస్థానమునకు భూమివలన వచ్చు శిస్తు హెచ్చెను. గొప్పఖజానా యొకఁటి స్థాపింపఁబడెను. హైదరాబాదు సర్కారువారియందు బ్రజలకు గౌరవమతిశయించెను. సంస్థాన మంతటను మంచిమార్పులు పొడసూపెను.

1858 వ సంవత్సరమున నింగ్లీషుదొరతనమువారిమీఁద సిపాయిలు పితూరీచేసిరి. ఇదియే నానాసాహెబుపితూరి యనికూడ చెప్పు


కొందురు. ఆ కాలమున నింగ్లీషువారికి సలారుజంగు చేసిన సహాయ మింతింతయన రానిది. ఉత్తర హిందూస్థానమంతయుఁ బెద్ద కాఱుచిచ్చువలె నుండెను. మధ్య హిందూదేశములోను దక్షిణహిందూదేశములోనున్న స్వదేశరాజులు హైదరాబాదువారు కొంచెముయూత యిచ్చిన యడల దొరతనమువారిమీద తిరుగబడుటకు సిద్ధముగ నుండిరి. హైదరాబాదు ప్రజల వీధులలో గుంపులుగూడి యింగ్లీషువారిమీద యుద్ధమునకు బోవుదు మని కేకలు వేయుచు వచ్చిరి. ఇంగ్లీషువారి ప్రభుత్వ మెంత యపాయస్థితిలో నుండెనో బొంబాయి గవర్నరుగారు హైదరాబాదు రెసిడెంటుగారి కిచ్చిన యీ క్రింది టెలిగ్రాపు వలనఁ దెలియవచ్చును. "నిజాము శత్రుపక్షమునఁ జేరెనా! హిందూదేశము మనకు పోయినదే గావున జాగ్రత్త పెట్టుము" ప్రజ లింగ్లీషువారిమీఁద నెంతద్వేషము చూపినను నిజాము మనస్సు మఱియొకలాగుండినను సలారుజంగుమాత్రము యెవరిమాటలు వినక నిశ్చలుఁడై యింగ్లీషువారి రాజ్యమును రక్షించెను. అప్పటి మంత్రి సలారుజంగు నింగ్లీషువారి కంతటి మేలు చేసెను. మఱియొకఁడైనచో నావిధముగాఁ జేయకపోవును. ఏది యెటులయినను సలారుజంగుమాత్ర మింగ్లిషువారిపక్ష ముండుటకే నిశ్చయించుకొనెను. ఆ పితూరి సమయమున సలారుజంగు చేసిన యుపకారమునకుఁ గృతజ్ఞులై గవర్నమెంటువారు వానికి ముప్పది వేలరూపాయలు వెలగల ఖిల్లతు నొక దానిని బహుమాన మిచ్చిరి. గవర్నరుజనరలు గారు వాని సహాయమునకుఁ సంతసించి యతఁడు హైదరాబాదు సంస్థానమును నిజామును నిష్కారణముగా నాశనముచేయక నిశ్చలబుద్ధి వహించినందుకు నింగ్లీషువారి పక్షమున నుండినందుకు ననేక వందనములఁజేసి గవర్నమెంటువారి కాప్తమిత్రుండుగ నెంచుకొనిరి. వెనుక నరబ్బులు మొదలగు బండవాండ్రను వెడల నడచుట చేతను శిపాయి పితూరీలో నతఁడింగ్లీషువారి పక్షము వహించుట చేతనుఁ దేశమందు విరోధులనేకులతనికి బయలుదేరిరి. ఆవిరోధ మతని కొకసారి ప్రాణాంతమగుటకు సిద్ధమయ్యెను. 1859 వ సంవత్సరమున మార్చినెల 15 వ తేదీని సలారుజంగు రెసిడెంటుతోఁ గలసి నవాబు దర్బారునుండి యింటికిబోవుచుండ జహంగీరుఖాననియెడు నొక తురకవానిమీఁద తుపాకి ప్రేల్చెను. దైవవశమున నాదెబ్బ వానికిఁ దగులక తప్పిపోయెను. ఆనరహంతకుఁడు తన గురి తప్పిపోయెనని వగచి రోషావేశపరవశుఁడై ఖడ్గముదూసి సలారుజంగుమీఁదికిఁ బరుగెత్తెను. కాని వాఁడుతలఁచుకొన్న దౌర్జన్యము చేయకమునుపే రాజభటులు వానిని దుత్తునియలుగ నరికిరి. 1860 వ సంవత్సరమునం దింగ్లీషు దొరతనమువారు తొల్లి తాముఋణవిమోచనము నిమిత్తము పుచ్చుకొన్న షోళాపురము రాచూరు ధారాసీమ మొదలగు తాలూకాలను మరల నిజామున కిచ్చిరి. 1861 వ సంవత్సరమునఁ గొందఱు విరోధులు సలారుజంగును మంత్రి పదవినుండి తొలగింపఁ గుట్రలుపన్ని రెసిడెంటు దొరగారు సలారుజంగును మంత్రిపదమునుండి తప్పింప దలఁచుకొన్నారని నిజాముగారితోఁ జెప్పిరి. మాయమర్మము నెఱుఁగని యానిజాము వారికల్పనలు నమ్మి రెసిడెంటుగారి యభిప్రాయ మదియే యనుకొని తనవద్దకు రెసిడెంటు వచ్చినప్పుడు "మీ యిష్టము ప్రకారము నేను సలారుజంగును దీసివేయుట కిష్టముగనున్నా"నని చెప్పెను. రెసిడెంటు మతిలేని యాశ్చర్యమునొంది తెల్లబోయెను. తరువాత వారొండొరులయభిప్రాయములను గ్రహించి సలారుజంగునే మంత్రిపదములో నిలుప నిశ్చయించిరి. అతఁడు మునుపటియట్లె పలుమార్పులంజేయుచు సంస్థానమును మంచిదశకు దెచ్చెను. అందు ముఖ్యముగ వ్యవహార


సౌలభ్యముకొఱకు సంస్థానము నైదుభాగములుగను బదునేడు జిల్లాలుగను విభజించెను. అదివఱకు రయితులు దివాణముపన్ను రొక్కము నీయలేక ధాన్యాది పూర్వకముగ నిచ్చుచుండిరి. అతఁడాపద్ధతి కొట్టివేసెను. భూములు కొలిపించి సరియైన వైశాల్యము దెలిసికొనెను. మఱియు రయితులకు భూములు శాశ్వతముగా నుండునట్లు శిస్థు హెచ్చకుండునట్లు చాల మార్పులంఁ జేసెను. సలారుజంగు సంస్థానమునందుఁ జేసిన యభివృద్ధిని రెసిడెంటుగా నుండిన సాండ్రను దొరగారు వ్రాసిన యీ క్రింది వాక్యమువలన మనము తెలిసికొన వచ్చును. "ఇప్పటి హైదరాబాదు సంస్థానమునకు వెనుక నలువదియేండ్ల క్రిందటనున్న సంస్థానమునకుఁ భేదముచూడ నిప్పటి యింగ్లండునకు రెండువందల యేండ్ల క్రిందటి యింగ్లండునకుగల భేదము కలదు. ఈ యభివృద్ధికంతకు సర్ సలారుజంగు పడినపాటు నా పూర్వపు రెసిడెంట్లు వానికిజేసిన సహాయము ముఖ్య కారణములు. ఖజానాధనముతో నిండియుండును. ప్రతిసంవత్సరము వ్యయముపోగా సంస్థానమున కెనిమిది లక్షలరూపాయల యాదాయమిప్పుడున్నది. శిస్తు వసూలు చేయుటకు మునుపటి యిజారాపద్ధతి నీ దివాను కొట్టివేయుటచే గ్రామములలో నిప్పుడు మునుపటివలె నల్లర్లు లేవు" హైదరాబాదు సంస్థానములోని జనులు నాగరికతలేని మోటవాండ్రగుటచే సలారుజంగు తమకుజేసిన మహోపకారములను గుర్తెఱింగికృతజ్ఞులై యుండ లేకపోయిరి. అందుచేతనతడు క్రమక్రమముగా జనులచేత ద్వేషింపఁ బడెను. వ్యవహారములలోఁ గఠినముగా నున్న వారికందరకు నట్టియవస్థయే ప్రాప్తించునుగదా ! అనేకులకు విరోధియగుటచే నతని ప్రాణము తీయుటకు మఱియొక ప్రయత్నము జరిగెను. 1868 వ సంవత్సరమందు సలారుజం గొకనాఁడు దర్భారునకుబోవుచుండ నొక దురాచారుఁడు వానిమీఁద


తుపాకి రెండుసారులు గాల్చెను. అదృష్టవశమున నా రెండుగురులు గూడ మంత్రికిఁదగులక తప్పిపోయెను. వెంటనే సేవకులాదురాత్మునిఁ బట్టుకొనిరి. నిజాము వానికి మరణదండన విధించెను. దుష్టుఁడైనతు వానికి మరణదండనవిధింపవలదనియు గారాగృహబంధనము విధింపు డనియు సలారుజంగు నిజామును వేడుకొనెను గాని నిజాముపట్టు విడువక తన మొదటియాజ్ఞ చెల్లించెను.

1869 వ సంవత్సరమున నప్పటి నిజాముగారు మృతినొందిరి. ఆయన కొక్క చిన్నకుమారుఁ డుండుటచేత నింగ్లీషుదొరతనము వారు పౌర్యాపర్యములు చక్కగ బరిశీలించి సలారుజంగుగారిని షమ్సల్‌దౌలా అమీరీ కాబీరీగారిని బాలునిపక్షమున బ్రజాపరిపాలనము జేయుమని నియోగించిరి. 1872 వ సంవత్సరమున నాయిరువురు మంత్రులు మునుపు తమ నిజామువద్దనుండి పుచ్చుకొన్న బేరారు పరగణా మరలనీయవలసినదనియు దానికై సొమ్ము రొక్కముగ ధరావతు నిలుపుదుమనియు జెప్పియడిగిరి. కాని గవర్నమెంటువారు పుచ్చుకొనుటలోనేకాని యిచ్చుటలోఁజురుకుతనము లేనివారగుటచే దాని కంగీకరింపరైరి. 1875 వ సంవత్సరమున మన ప్రస్తుత చక్రవర్తియగు నెడ్వర్డురాజుగా రప్పుడు యువరాజుగానుండి మనదేశము జూడవచ్చిరి. అప్పుడు సలారుజంగు బొంబాయికిఁ బోయి వారిని స్వయముగ సన్మానము చేసెను. ఆయువరాజుగారు సలారుజంగును సీమకు రమ్మని యాహ్వానముచేసిరి. 1876 వ సంవత్సరమున సలారుజంగు వారు కోరిన రీతిగా నింగ్లాండునకుఁబోయి యచ్చటి జనులచే నమితమైన సన్మానము నందెను. ఇంగ్లాండు బోవుటలోఁ నతని ముఖ్యోద్దేశము బేరారు పరగణా నెటులైన మరల సంపాదించి తన ప్రభువున కీయవలయునని యతఁడు మృతినొందు వఱకు దీని విషయమునఁ బ్రయత్నించుచునే వచ్చెను. అతఁడీప్రయత్నమున నింగ్లం


డులో కృతకృత్యుఁడు గాకపోయినను స్వదేశరాజులలోనైన నెవరికిం జరుగని యఖండ గౌరవము తన కక్కడ జరిగినదని సంతుష్టి నొందెను.

అనంతర మతఁడు స్వదేశమునకుఁవచ్చి 1883 వ సంవత్సరము వఱకుఁ హైదరాబాదు సంస్థానమును న్యాయముగఁ బాలించెను. 1883 వ సంవత్సరమున విశూచిజాడ్యముచేత నతఁడుమృతినొందెను. మరణకాలమున కతనికి యేఁబదిమూడేండ్ల వయస్సు. వాని మరణమునకు వగవనివారు లేరు. హిందూ దేశస్థులు దుఃఖించిరని చెప్పుట యొకగొప్పకాదు. ఇంగ్లాండుదేశస్థులుఁగూడ బిట్టువగచిరి. విక్టోరియా రాణిగారు తత్కుమారుఁడు యువరాజుగారు మొదలగు ననేకులు వాని మరణమునకు శోకింపుచు తత్కుటుంబమునకు జాబులువ్రాసిరి. ఇండియా గవర్నమెంటువారు ప్రత్యేకముగా నొక గెజిటీలో నీక్రింది విషయమును వ్రాసిరి. "ఈ నెల 8 వ తేదీని హైదరాబాదు సంస్థానమునకుఁ మంత్రియగు సర్ సలారుజంగుబహదూరు విశూచిజాడ్యము వలన మృతినొందెనని తెలియఁజేయుటకు మాకు మిక్కిలి దుఃఖకరముగా నున్నది. అతని మరణముచేత నిండియా గవర్నమెంటువారికి విశ్వాసపాత్రుఁడగు మిత్రుఁడు పోయెను. నిజాము గారికి యోగ్యుఁడగు మంత్రిపోయెను."

సలారుజంగు పొట్టియుఁ బొడుగు కాని విగ్రహము కలవాఁడు. సుకుమారదేహుఁడు కాని గంభీరాకారముగలవాఁడు వేష భాషలలో నతఁడు సామాన్యుఁడువలె నుండును. గొప్పదర్బారులు తీర్చినప్పుడు తప్ప తదితరసమయముల నతఁడు నగలుదాల్చువాడుకాఁడు. అతనిఁ పద్ధతులన్నియుమంచివి. అతఁడు జనులకుసులభుఁడు. తోఁటలువేయించుట యతనికి యెక్కువయిష్టము. అతనికి యూరోపియనుల సహవాసమే యెక్కువయిష్టము. వానియునికియు దొరలపద్ధతి ననుసరించియే.


అతఁడుగావించిన సత్పరిపాలనము నొక్క దానిబట్టియే వాని సామర్థ్యమును మనమెంచకూడదు. అతనికున్న విరోధులంబట్టియు వారినిగ్రహ మందతఁడు చూపిన నేర్పుంబట్టియుఁగూడ జూడవలెను. అతనివిరోధులమాట యటుండనిండు. అతఁడు చేసిన ప్రతికార్యమందు వాని ప్రభువగు నిజాము సయితము చెప్పుడుమాటలు విని యెన్నో విఘ్నములు కల్పించుచు వచ్చెను. పాపము సలారిజంగు తను కావించిన పనినిఁ దనయేలిక యెన్నఁడైన మెచ్చుకొనునేమోయని యూటలూరుచు వచ్చె ఎప్పుడో కాని నవాబు మెచ్చుకొనుట లేదు. అతఁడు సంపూర్ణుఁడైన యోగ్యుఁడు. అంతటి యోగ్యుఁడైనను సంస్థాన మంత బాగుచేసినను వెనుకటి నిజాము వానినెప్పుడు సరిగా నమ్మక యేదో యనుమానముతోనే జూచుచువచ్చెను. కోటదాటియావలకుఁ బోవలసివచ్చినప్పుడు నూరుబైటనున్న వసంతగృహమునందు దొరలకు విందుచేయఁదలఁచుకొన్నపుడు సయితము సలారుజంగు నిజాముగారి సెలవును పొందవలయునట. అట్టి సమయములందు నిజాము సెల విచ్చవిచ్చినపుడిచ్చి యిష్టములేనప్పు డియ్యకపోయెను. రెసిడెంటుతో బలుమారు కలుసుకొన్నను నిజామున కనుమానమే. రెసిడెంటు మిక్కిలి యవసరములైన కాగితములు పెట్టెలోవేసి పంపినను నిజామునకు సందేహమే వేయేల తన రెసిడెంటు తన మంత్రి కలుసుకొనుట నిజామున కిష్టములేదు. దన యేలిక యిన్ని చేసినను సలారుజంగు స్వామిభక్తి మెండుగఁ గలవాఁడగుటచేఁ దనకష్టముల నొకరితో జెప్పుకొనఁడు సరిగదా యెన్నఁడు సణుగుకొననైనలేదు. వెనుకటి నిజాము వానిం దరుచుగా సమక్షమునకుఁ బిలుచుటయే లేదు. ఎప్పుడైనఁ బిలిచెనా సలారుజంగు వానికడ నున్నంతసేపేమి మూడునో యని వెలవెలబోవుచునేయుండును. అయినను తన రాజు విషయమున నతఁడు శక్తివంచన లేక పాటుపడుచువచ్చెను. 1867 వ


సంవత్సరమువఱకు నతఁడు హైదరాబాదు తప్ప మఱియేపట్టణమును జూచి యెఱుఁగడు. సంస్థానమందైన నాయా తాలూకాలకుఁ జిల్లాలకుఁపోయి యెఱుఁగడు. అందుచేత తాలూకాదారులు తక్కిన యుద్యోగస్థులు స్వకార్యముల నెట్లు నిర్వహించుచున్నారో ప్రజల నెట్లు పరిపాలించుచున్నారో పరీక్షించి చూచుట కతనికి వీలులేక పోయె. అటుపోయి చూడవలయునన్న నిజాము వానిని వెళ్ళనియ్యడు. ఎట్ట కేల కింగ్లీషువారు బలవంతముపెట్ట నిజాము వానినొకటి రెండుసారులు రాజధాని విడిచిపోవనిచ్చెను. అతఁడు సత్కుల సంభవుఁడగుటచేత శరీరమునందు సహజముగ దుర్బలుడయ్యు నవసరమైనప్పుడు కావలసినంత శాంతమును దెచ్చుకొని యెంతో యోపిక గలిగి న్యాయదృష్టితో బరిపాలించెను. అతని సమకాలికులగు రాజా మాధవరావు రాజాదినకరరావులను నిద్దర దివానులతో బోల్చినపుడు సలారుజంగు వానికి దీసిపోవునని యనేకులనుచున్నారు. పరిపాలనా శక్తిలో నితఁడు వారికొకవేళ దీసిపోయినను శిస్తులు వసూలుచేయుట వ్యవహారము చురుకుగ జేయుట మొదలగు కొన్ని నేర్పులలోఁనితడే వారిని మించునని చెప్పకతప్పదు. ఆతని బుద్ధినిపుణత యెట్టిదో కాని యింగ్లీషువారు తమరాజ్యములో చేసిన మంచిమార్పు లన్నియు వెంటనే గ్రహించి సలారుజంగు తన సంస్థానములో బెట్టుకొనువాఁడు మార్గస్థుల నిమిత్తము సత్రములు కట్టించుట బాటలు వేయించుట మురికినీరు పోవుటకు తగిన యాధారములునిర్మించుట మొదలగునవి గూడ నతఁడే చెప్పిచేయుంచుచువచ్చెను. అతఁడు సహస్రాక్షుడు వలె సర్వ కార్యములయందు దానే ప్రవేశించి చూచువాడు. ఈయన యందు హిందువులకు మహమ్మదీయులకు గూడఁ సమాన గౌరవముండ దగును. హైదరాబాదు సంస్థానమున కితఁడు మంత్రి కాకపోయిన పక్షమున నది మిక్కిలి దురవస్థలో నుండియుండును.