భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/రజియా ఖాతూన్‌

వికీసోర్స్ నుండి

జుగాంతర్‌ విప్లవ దళం వీరవనిత

రజియా ఖాతూన్‌

భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రజానీకాన్నిఅన్ని రకాల త్యాగాలకు సిద్ధపర్చింది. అహింసామారంలో బ్రిటిష్‌ సేనల తుపాకి గుండ్లకు బలైన ఖుదాయే- ఏ-ఖిద్మత్‌గార్‌లనూ (భగవత్సేవకులు), ఆయుధాలను చేతపట్టి బ్రిటిష్‌ పోలీసు-సైనిక దాళాలను తొడగొట్టి సవాల్‌చేసి రణరంగంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను బలిపెట్టిన విప్లవకారులనూ జాతీయోద్యామం సృజియించింది.

బ్రిటిషర్ల బానిసత్వం నుండి విముక్తి కోరుకుంటూ సాగిన ఈ పోరాటాల మార్గాలు ఏవైనా అందులో పురుషులతోపాటు మహిళలు కూడ నడుంబిగించి మున్ముందుకు సాగారు. విముక్తి పోరాటంలో ఏమాత్రం వెన్ను చూపక ఆయుధం చేపట్టి బ్రిటిషర్ల వెన్నులో చలి పుట్టించారు. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రభుత్వాన్నిసవాల్‌ చేసి హడలగొట్టిన ఆడపడుచులలో రజియా ఖాతూన్‌ ఒకరు.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర పుటలలో అగ్నియుగం గా పిలువబడిన సాయుధ పోరాట కాలంలో జుగాంతర్‌, అనుశీలన సమితి, ఆత్మోన్నతి దళం, గదర్‌ విప్లవ దళం, హిందాూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ తదితర విప్లవ దళాలలోని విప్లవవీరులు అపూర్వ ధైర్య సాహసాలతో, అసమాన త్యాగాలతో అగ్నియుగాన్ని రగిలించారు. అటువంటి విప్లవ


71

వీరుల సరసన నిలిచిన మహిళామణి రజియా ఖాతూన్‌.

ఆమె ప్రముఖ విప్లవయోధుడు మౌల్వీ నశీరుద్దీన్‌ అహమ్మద్‌ కుమార్తె. చిన్ననాటి నుండి ఆమెలో అంకురించిన దేశబక్తి భావనలు బ్రిటిష్‌ వ్యతిరేకతను తీవ్రతరం చేశాయి. స్వదేశాన్ని విదేశీ పాలకుల బానిసత్వం నుండి విముక్తం చేయాలని ఆమె సంకల్పించారు. తండ్రితో పాటు ఆమె కూడ జుగాంతర్‌ విప్లవ దళంలో సభ్యర్వం స్వీకరించారు. జుగాంతర్‌ విప్లవయోధులు సాగించిన సాయుధపోరాటానికి దళ సభ్యురాలిగా రజియా ఖాతూన్‌ క్రియాశీలక తోడ్పాటునందించారు.

మాతృదేశ విముక్తికోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి చిరునవ్వుతో బలిపెట్టడానికి సిద్ధమైన, ముక్సుద్దీన్‌ అహమ్మద్‌ (నెట్రకోన), మౌల్వీ గయాజుద్దీన్‌ అహమ్మద్‌, అబ్దుల్‌ ఖాదర్‌ (జమ్లాపూర్‌) తదితరులతో కలసి రజియా ఖాతూన్‌ విప్లవ కార్యక్రమాలను నిర్వహించారు. బ్రిటిష్‌ పాలకవర్గాలు జుగాంతర్‌ దళ సబ్యులను పూర్తిగా మట్టుపెట్టాలని ఒకవైపున తీవ్రంగా కృషి చేస్తూ, దాడులు, దాష్టీకాలకు పాల్పడుతున్న భయానక సమయంలో కూడ ఆమె మార్గం మళ్ళకుండ విప్లవబాటన నడిచారు.

ఆనాటి భయంకర పరిస్థితు లలో కూడ విపవోద్యమంలో మున్ముందుకు సాగేందుకు రజియా ఖాతూన్‌ ఏమాత్రం భయ పడలేదు .బ్రిటిష్‌ గూఢచారుల, పోలీసుల కదలికలను, ఇతర సమాచారాన్ని రహస్యంగా విప్లవకారులకు చేరవేయటం, దళంలోని సభ్యులకు ఆశ్రయం కల్పించటం, ఆహారం, ఆర్థిక, ఆయుధ సహాయ సహకారాలు అందచేయటం లాింటి పనులను చాకచక్యంగా నిర్వహించి జుగాంతర్‌ విప్లవ దళం చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు.

ప్రముఖ చరిత్రకారుడు Santimoy Ray తన గ్రంథం Freedom Movement and Indian Muslims, PPH, New Delhi,1993, Page. 44 లో ఆ పోరాట యోధురాలు రజియా ఖాతూన్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మాతృదేశం కోసం మరణంచటం కూడ అప్పుడప్పుడు అవసరం... అయితే మరణం



మాతృదేశంకోసం మరణించటం కూడా అప్పుడప్పుడు అవసరం. అయితే మరణిం చటం కంటే లక్ష్యసాధన కోసం జీవించటం చాలా అవసరం.

                                                - ఆబాది బానో బేగం

72