భరతరసప్రకరణము/భరతరసప్రకరణము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భరతరసప్రకరణము

సాంధ్రతాత్పర్యము

శృంగారరససందోహం శ్రితకల్పమహీరుహం,
శ్రయే శ్రీనాథమేవాహం శ్రాంతలోకసుఖావహం.

1

శృంగారవ్యాపారములకూటమియును, స్వాశ్రితజనులకోరిక లీడేర్చు కల్పకవృక్షమును, సంసారాదితాపత్రయశ్రాంతులగు జనులకు శాశ్వతబ్రహ్మానంద మొసఁగువాఁడునగు లక్ష్మీవల్లభుని నామనోరథసంపూర్తికొరకు నాశ్రయించెదను.

కంఠేనాలంబయేద్గీతం హస్తేనార్థం ప్రదర్శయేత్,
చతుర్భ్యాం దర్శయేద్భావం పాదాభ్యాం తాళమాచరేత్.

2

నటనముఁ జేయునట్టి స్త్రీ మొదట గానము చేసి యావల గీతార్థమును హస్తాభినయములచేఁ దెలుపవలయును. నేత్రములచే భావమును దెలువవలయును. పాదములచేఁ దాళము నాచరించవలయును.

యతో హస్తస్తతో దృష్టిర్యతో దృష్టిస్తతో మనః,
యతో మనస్తతో భావో యతో భావస్తతో రసః.

3

ఎచ్చట హస్తము చూపఁబడుచున్నదో అచ్చట దృష్టి నుంచవలయును. దృష్టి యుండుచోట మనసు నుంచవలయును. మన సుండెడుచోట భావ ముంచవలయును. ఎచ్చట భావ మున్నదో అచ్చట రసము గలుగుచున్నది.

సూ.

 విభావానుభావవ్యభిచారిసంయోగాద్రసనిష్పత్తిరితి భరతసూత్రం.

విభావ అనుభావ వ్యభిచారిభావముల చేరికవలన రసము గలుగుచున్నదని భరతసూత్రము.

విభావోనామ

రత్యాదిస్థాయినో యేన భావ్యంతే నితరామితి,
అతో౽సౌ భావసారజ్ఞైర్విభావ ఇతి కథ్యతే.

4

రతి మొదలగు స్థాయిభావములు దేనిచే మిక్కిలి భావింపఁబడుచున్నవో అవి భావజ్ఞులచే విభావమని చెప్పఁబడుచున్నది.

అనుభావోనామ

రత్యాదిస్థాయినస్సమ్యక్చింతాదీంశ్చ తతః పరం,
అనుభావయతీత్యేష త్వనుభావ ఇతీర్యతే.

5

ఏది రతి మొదలగుస్థాయిభావములను, చింత మొదలగు వ్యభిచారిభావములను స్ఫురణమునకుఁ దెచ్చుచున్నదో యది యనుభావమని చెప్పఁబడును.

వ్యభిచారిభావోనామ

విశేషేణాభిముఖ్యేన సంయాతి స్థాయినం ప్రతి,
వ్యభిచారీతి విజ్ఞేయో భావో భావార్థకోవిదైః

6

ఏభావము రత్యాదిస్థాయిభావముల కెదురుగా సంచరించుచున్నదో అది వ్యభిచారిభావమని భావార్థజ్ఞులచే నెఱుఁగఁదగినది.

విభావాదిభావానాం స్థాయినాం చ సంయోగో యథా

కార్యకారణతాయోగః విభావస్థాయినో ర్మిథః,

స్థాయియైనది విభావములచే పుట్టింపఁబడునదిగనుక స్థాయివిభావముల కొకటొకటికి కార్యకారణభావము సంబంధమని చెప్పఁబడుచున్నది.

స్థాయ్యనుభావసంబంధో యథా

.

జ్ఞాప్యజ్ఞాపకసంయోగ స్తథా స్థాయ్యనుభావయోః.

7

స్థాయి అనుభావములచే జ్ఞాపింపఁబడుచున్నదిగనుక స్థాయ్యనుభావములకు జ్ఞాప్యజ్ఞాపకభావము సంబంధమని చెప్పఁబడుచున్నది.

స్థాయివ్యభిచారిసంబంధో యథా

పోష్యపోషకసంయోగః స్థాయినాం వ్యభిచారిణాం,

స్థాయిభావములు వ్యభిచారిభావములచే పోషింపబడుచున్నదిగనుక స్థాయివ్యభిచారులకు పోష్యపోషకభావము సంబంధ మనఁబడుచున్నది.

అయం సూత్రస్థసంయోగశబ్దార్థః పరికీర్తితః.

8

ముందు చెప్పిన తెఱఁగు భేదములు సూత్రములో నుండెడు సంయోగశబ్దార్థములని చెప్పఁబడును.

రసోనామ

విభావైరనుభావైశ్చ వ్యభిచారిభి రేవ చ,
ఆనీయమానస్వాదుత్వం స్థాయిభావో రసస్స్మృతః.

9

స్థాయి విభావానుభావవ్యభిచారిభావములచే మనోజ్ఞత్వమును పొందింపబడి రసమగుచున్నది.

నిష్పత్తిర్నామ

.

కార్యోత్ప త్తిర్విభావస్య కార్యజ్ఞప్తి స్తతఃపరం,
అనుభావస్య కార్యస్య సంపుష్టిర్వ్యభిచారిణః.

10


ఇతి సూత్రస్థనిష్పత్తిశబ్దార్థః పరికీర్తితః.

విభావమునకు కార్యమును గలుగఁజేయుటయలను, అనుభావమునకు కార్యమును జ్ఞాపించుటయును, వ్యభిచారిభావమునకు కార్యమును పోషించుటయును, నిష్పత్తిశబ్దార్ధమని చెప్పఁబడును.

విభావో నిరూప్యతే

ఆలంబనోద్దీపనాత్మా విభావో ద్వివిధో మతః.

11

విభావము ఆలంబనవిభావమనియును, ఉద్దీపనవిభావమనియును, ఇరుదెఱఁగులుగఁ జెప్పఁబడినది.

ఆలంబనవిభావో యథా

యానాలంబ్య ప్రజాయంతే రత్యాదిస్థాయినో౽పి చ,
ఆలంబనాఖ్యాస్తే ప్రోక్తా నాయికాద్యా విచక్షణైః.

12

ఏవస్తువుల నాశ్రయించి రతి మొదలగు స్థాయిభావములును రసములును గలుగుచున్నవో నాయిక మొదలగు ఆవస్తువులు ఆలంబనములని భావశాస్త్రప్రవీణులచేఁ జెప్పఁబడెను. బ్రిట

స్థాయిరసాలంబనభూతా నాయికా యథా

రసాలంబనభూతా యా నాయికాత్ర నిరూప్యతే,
సా స్వీయా పరకీయేతి సామాన్యేతి త్రిధా మతా.

13

ఏనాయిక రసమునకు నాధారముగఁ జెప్పఁబడుచున్నదో ఆనాయిక స్వీయ, పరకీయ, సామాన్య అని మూఁడువిధముల నుండును.

స్వీయాలక్షణం

సంపత్కాలే విపత్కాలే యా న ముంచతి వల్లభం,
శిలార్జవగుణోపేతా సా స్వీయా పరికీర్తితా.

14


ముగ్ధా మధ్యా ప్రగల్భేతి త్రేధా సా తు నిగద్యతే,

సంపత్కాలమందును, విపత్కాలమందును, శీలము, ఆర్జవము మొదలగుసద్గుణములు గలిగి నాయకుని విడువక యున్నట్టి స్త్రీ స్వీయయని చెప్పఁబడును. అది ముగ్ధ యనియును, మధ్య యనియును, ప్రగల్భ యనియును మూఁడువిధములు గలది.

ముగ్ధాలక్షణం

ముగ్ధా నవవధూః కామరతౌ వామా మృదుః క్రుధి.

15


యతతే రతిచేష్టాసు గాఢలజ్జా మనోహరా,
కృతాపరాధే దయితే వీక్షతే రుదతీ సతీ.

16


అప్రియ వా ప్రియం వాపి న కించిదపి భాషతే,

ఏయువిద మన్మథవిహారమందు నూతనస్త్రీ గాసు, మన్మథక్రీడయందు అస్వాధీనురాలుగాను, గాఢమైన లజ్జగలదిగాను, కోపకాలమందు స్తిమితగాను, నాయకుఁ డపరాధియయినను రోదనము చేయుచు చూచుచుండునదిగాను, రతివ్యాపారము యత్నముఁ జేయుచు హితాహితములను జెప్పకయుండునో యది ముగ్ధనాయిక.

మధ్యానాయికాలక్షణం

సమానలజ్జామదనా ప్రోద్యత్తారుణ్యశాలినీ.

17


మధ్యా కామయతే శాంతం మోహాంతే సురతక్షమా,
మధ్యా త్రిధా మానవృత్త్యా ధీరాధీరోభయాత్మికా.

18

సమానములైన సిగ్గును కామమును గలదియును, వృద్ధిబొందు యౌవనము గలదియును, మోహవ్యాపారమధ్యమందు సురతయోగ్యత గలదియు నగుచు నాయకుని అపేక్షించునాయిక మధ్య యనఁబడును. ఆమధ్యనాయిక మానమనెడు కోకువ్యాపారముచే ధీర-అధీర-ధీరాధీర అని ముత్తెఱంగులు గలది.

మానలక్షణం

ప్రియాపరాధావగమాత్సంజాతో మాన ఇష్యతే,
లఘుమానో మధ్యమానో గురుమాన ఇతి త్రిధా.

19

నాయకాపరాధము దెలిసినపిదపఁ గలుగు మనోవ్యాపారవిశేషము మానమని చెప్పఁబడును. ఆమానము లఘుమాన మనియును, మధ్యమాన మనియును, గురుమాన మనియును, మూఁడుతెఱగులు గలిగియుండును.

లఘుమానలక్షణం

అన్యస్త్రీదర్శనాదిభ్యో లఘుమానః ప్రజాయతే,
వాగాద్యల్పైరసౌ మానస్త్వపనేయః ప్రకీర్తితః.

20

అన్యస్త్రీదర్శనము మొదలైనవానివలన గలుగుకోపము లఘుమాన మనఁబడును. ఇది మంచిమాటలు మొదలయినవానిచే తొలఁగింపఁబడును.

మధ్యమానలక్షణం

మధ్యమానస్త్వథాన్యస్యా నామగ్రహణతో భవేత్,
ఏష మానో౽పనేతవ్యశ్శపథాద్యనువర్తనైః.

21

నాయకునితోడి సరససల్లాపకాలమందు అన్యస్త్రీపేరు చెప్పుటవలన గలుగు మనోవ్యాపారము మధ్యమాన మనఁబడును. ఈమానము ప్రమాణము చేయుట మొదలగు అనుసరణములచేత తొలఁగింపఁబడును.

గురుమానలక్షణం

అన్యాసంగమచిహ్నాద్యైర్గురుమానః ప్రజాయతే,
పాదప్రణామానునయైరపనేయో భవేదసౌ.

22

అన్యస్త్రీసంభోగపుగుఱుతులు మొదలైనవానివలన గలుగు చిత్తావేగము గురుమాన మనఁబడును. ఈమానము నమస్కరించుట అనునయించుట మొదలైనవానిచే తొలఁగింపఁబడును.

మధ్యాధీరాలక్షణం

ధీరా తు వక్తి వక్రోక్త్యా సోత్ప్రాసం సాగసం ప్రియం,

అపరాధియైయుండు నాయకుని జూచి సాభిప్రాయమైన వంకరమాట లాడునది మధ్యాధీరానాయిక యని చెప్పఁబడును.

మధ్యాఅధీరానాయికాలక్షణం

అధీరా పరుషైర్వాక్యైః ఖేదయేద్వల్లభం రుషా.

23

అపరాధియగు నాయకుని క్రూరమైనపలుకులచే ఖేదపఱుచునది మధ్యాధీరానాయిక యనఁబడును.

మధ్యాధీరాధీరానాయికాలక్షణం

ధీరాధీరాతు వక్రోక్త్యా సభాష్పం వదతి ప్రియం,

కన్నీరొలుక నాయకుని క్రూరవుఁబలుకులు పలుకునాయిక మధ్యాధీరాధీరానాయిక యనఁబడును.

ప్రగల్భానాయికాలక్షణం

సంపూర్ణయౌవనోన్మతా ప్రగల్భారూఢమన్మథా.

24


దయితాంగకలీనేవ యతతే రతికేళిషు,
రతిప్రారంభమాత్రేణ గచ్ఛత్యానందమూర్ఛనాం.

25


మానవృత్త్యా ప్రగల్భాపి త్రేధా ధీరాదిభేదతః,

నిండుయౌవనముచే మదించినదిగాను, మన్మథవ్యాపారపారంగతురాలుగాను, ఉండునది ప్రగల్భానాయిక యనఁబడును. అది రతిలీలయందు నాయకాంగలీనవలె ప్రయత్నపడుచున్నది. క్రీడారంభములోనే ఆనందమూర్ఛను బొందును. ఆప్రగల్భానాయిక మానవ్యాపారముచే ముత్తెఱంగులైన ధీరాదిభేదములను బొందును.

ప్రగల్భాధీరా యథా

ఉదాస్తే సురతేధీరా సావహిత్తా చ సాదరం.

26
కపటమానసయై అపరాధియగు నాయకునియందు ప్రేమతో రతివిషయమఁలలో ఉపేక్షచేయునది ప్రగల్భాధీర యనఁబడును.

ప్రగల్భా అధీరా యథా

సంతర్జయత్యరం రోషాదధీరా తాడయేతియం,

అపరాధియగు నాయకుని మిక్కిలి బెదరించికొట్టునది ప్రగల్భాధీరానాయిక యనఁబడును.

ప్రగల్భాధీరాధీరానాయికా యథా

ధీరాధీరగుణోపేతా ధీరాధిరేతి కథ్యతే.

27


ఏతే జ్యేష్టా కనిష్టేతి భేదతో ద్వివిధే మతే,

అపరాధియగు నాయకునియందు రతివ్యాపారములో ఉపేక్షయు, బెదిరింపు, తిట్లు, కొట్లునుంగలది, ప్రగల్భాధీరాధీరానాయిక యని చెప్పఁబడును. ముందు చెప్పిన మధ్యాప్రగల్భలలోఁగల భేదమునొందిననాయికలు జ్యేష్ఠ కనిష్ఠ అనుభేదమువలన ఇరుదెఱంగు లగుదురు.

జ్యేష్ఠాకనిష్ఠాలక్షణం

ప్రియాధికప్రేమపాత్రం జ్యేష్ఠ సా తు నిగద్యతే.

28


న్యూనవిస్రంభపాత్రం చేత్కనిష్ఠా సా ప్రకీర్తితా,
మధ్యాప్రౌఢే ద్వాదశథా ముగ్ధా త్వేకవిధా మతా.

29


ఏవం త్రయోదశవిధా స్వీయా సా పరికీర్తితా.

నాయకునికి ఎవతెయందు ప్రేమ అధికముగా నుండునో ఆమె జ్యేష్ఠ యనఁబడును. తక్కువప్రేమ ఎవతెయం దుండునో ఆమె కనిష్ఠ యనఁబడును. మధ్యాప్రగల్భానాయికలు పండ్రెండువిధములు గలవారని యు, ముగ్ధ ఏకవిధము గలదనియుఁ జెప్పఁబడుచున్నది. ఈ చెప్పిన ప్రకారము మొదటఁ జెప్పఁబడిన స్వీయ పదమూఁడువిధము లగుచున్నది.

పరకీయాలక్షణం

పరానురాగవ్యాపారగోపనే దత్తమానసా.

30

పరకీయేతి సా ప్రోక్తా భరతాగమవేదిభిః,
సా చ కన్యాపరోఢేతి ద్వివిధా పరికీర్తితా.

31

పరపురుషునియందుఁగల ఇచ్ఛావ్యాపారములను మఱుగుపఱుచుటయందు దత్తచిత్తురాలై యున్ననాయిక పరకీయ యనఁబడును. అది కన్య యనియు, పరోఢ యనియు, ఇరుదెఱంగులు గలిగియుండును.

పరకీయాకన్యాలక్షణం

కన్యా త్వనూఢా యువతిస్సలజ్జా పితృపాలితా,
సఖీకేళిషు విస్రబ్ధా ప్రియే ముగ్ధగుణాన్వితా.

32

చతురయుగాను, యౌవనమధ్యస్థయుగాను, సిగ్గుగలదిగాను, దండ్రులచే పోషితగాను, చెలులతోడి విహారములయందు ప్రియురాలుగాను, ప్రియునియందు ముగ్ధగుణము గలదిగాను నుండునది పరకీయకన్య.

పరకీయాపరోఢాలక్షణం

పరోఢా తు ప్రియేణోఢాప్యన్యసంగమలాలసా,
నిపుణా గృహకృత్యేషు భర్తృచిత్తానువర్తినీ.

33

ప్రియునిచే పెండ్లియాడఁబడినదిగాను, పెనిమిటిమనస్సునకు సరియైననడతలు గలదిగాను, గృహకృత్యములందు సమర్థురాలుగాను, ఉండియును పరపురుషసంగమమం దాసక్తిగలదిగా నుండునది పరోఢ యనఁబడును.

సామాన్యానాయికాలక్షణం

సామాన్యా సైవ గణికా కలాప్రాగల్భ్యదార్ష్ట్యయుక్,
విత్తమాత్రాశయా లోకే పురుషేష్వనురాగిణి.

34


ఏతస్యా నాను రాగస్స్యాద్గుణవత్యపి నాయకే,
భగ్నకామాన్నృతార్థజ్ఞాన్ బాలపాషండషండకాన్.

35

రక్తేవ రంజయేన్నిత్యం నిస్వానాశు వివాసయేత్,
తస్యా దౌత్యప్రభృతయో గుణాస్తదుపయోగినః.

36

సంగీతాభినయాద్యనేకవిద్యాప్రాగల్భ్యధైర్యములు గలదిగాను, జనులయందు ధనాశచేతనే అనురాగము గలదిగాను నుండునది సామాన్య; ఇదే గణిక. ఈనాయికకు నాయకుఁడు గుణవంతుఁడైనను ధనాగమము లేకున్న వానియందు ప్రేమ గలుగదు. ధనాగమముగలవారు భగ్నకాములైనను, బాలురైనను, పాషండులైనను, షండులైనను, వారలయందు ప్రేమగలదానివలెనే వారిని సంతోషపఱుచును. ఈచెప్పఁబడినవారు కపటమెఱుగనివారుగాను నుండవలయును. ధనము లేనివానిని తఱుమకొట్టును. దానికి దౌత్యము మొదలైనగుణములు సహాయములని చెప్పఁబడుచున్నవి.

ఏతాష్షోడనాయక్యో హ్యవస్థాభేదతః క్రమాత్,
ప్రత్యేకమష్టథా ప్రోక్తా భావశాస్త్రవిచక్షణైః.

37

ఈపదునాఱునాయికలకును శృంగారావస్థాభేదములచే ఒక్కొకతెకు నెనిమిదివిధములుగ భేదములు చెప్పబడినవి.

అష్టవిధనాయికా నిరూప్యంతే

స్వాధీనపతికా చైవ తథా వాసకసజ్జికా
విరహోత్కంఠితా ప్రోక్తా విప్రలబ్ధా చ ఖండితా.

38


కలహాంతరితా చైవ తథా ప్రోషితభర్తృకా,
తథాభిసారికా చైవ మష్టథా నాయికా మతాః.

39
స్వాధీనపతిక, వాసకసజ్జిక, విరహోక్కంఠిత, విప్రలబ్ధ, ఖండిత, కలహాంతరిత, ప్రోషితభర్తృక, అభిసారిక అని పూర్వము చెప్పఁబడిన నాయికలు ఒక్కొకతె దశాభేదముచేత నెనిమిదివిధములఁ జెప్పఁబడును.

స్వాధీనపతికానాయికాలక్షణం

ప్రియోపలాలితా నిత్యం స్వాధీనపతికా మతా,
అస్యాస్తు చేష్టాః కథితాః స్మరపూజోత్సవాదయః.

40


వనకేళీజలక్రీడాకుసుమాపచయాదయః,

నాయకునిచే నెల్లప్పుడు సంతోషపఱుపఁబడెడిది స్వాధీనపతిక. దీనివ్యాపారము మన్మథపూజామహోత్సవము మొదలయినవియు, వనవిహారము, జలక్రీడ, పుప్పాపచయము, మొదలయినవియును.

వాసకసజ్జికానాయిలక్షణం

ప్రియాగమనవేళాయాం మండయంతీ ముహుర్ముహుః.

41


కేళిగృహం తథాత్మానం సా స్యాద్వాసకసజ్జికా,
అస్యాస్తు చేష్టాస్సంపర్క మనోరథవిచింతనం.

42


సఖీవినోదో నితరాం ముహుర్దూతీనిరీక్షణం,
ప్రియాగమనమార్గాభివీక్షాప్రభృతయో మతాః.

43

ప్రియుఁడు వచ్చెడిసమయమందు తా నలంకరించుకొని కేళీగృహము నలంకరించి సిద్ధముగా నుండునది వాసకసజ్జికానాయిక. దీనివ్యాపారములు నాయకుని సంసర్గమనోభీష్టమును యోచించుట, సఖులతోడి వినోదము సల్పుట ఆడుగడుగునకు దూతికను సాభిప్రాయముగఁ జూచుట, నాయకుఁడు వచ్చెడిదారిని జూచుట మొదలైనవి.

విరహోత్కంఠితానాయికాలక్షణం

అనాగసి ప్రియతమే చిరయత్యుత్సుకా తుయా,
విరహోత్కంఠితా భావవేదిభిః పరికీర్తితా.

44


అస్యాస్తు చేష్టాస్సంతాపో వేపథుశ్చాంగసాదనం,
అరతిర్బాష్పమోక్షశ్చ స్వావస్థాకథనాదయః.

45

నిరపరాధియగు ప్రియుఁడు రాక జాగుచేయఁగా కాలవిలంబము నోర్వక యెదురుచూచుచుండునాయిక విరహోత్కంఠిత యనఁబడును. దీనివ్యాపార . ములు సంతాపము, దేహము వణకు, చిన్నబోవుట, వ్యాపారాంతరములయందు ప్రీతిలేకయుండుట, కన్నీరు విడుచుట, తనయవస్థను సఖులకుఁ దెలుపుట మొదలైనవి.

విప్రలబ్ధానాయికాలక్షణం

క్వచిత్సంకేతమావేద్య తత్ర నాథేన వంచితా,
స్మరార్తా విప్రలబ్ధేతి కథితా భావకోవిదైః.

46


అస్యాస్తు చేష్టా నిర్వేదశ్చింతా ఖేదో౽థ దీనతా,
అశ్రునిశ్వాసమూర్ఛాద్యాః కథితా భావవేదిభిః.

47

ఒకానొకచోటిని సంకేతస్థానముగాఁ జెప్పి అక్కడ నాయకునిచే వంచింపఁబడి అనఁగా అతఁ డక్కడికి రాకపోఁగా మన్మథపీడితురాలై యుండునది విప్రలబ్ధ యనఁబడును. దీనివ్యాపారములు నిర్వేదము, చింత, ఖేదము, దీనత, కన్నీరును విడుచుట, నిట్టూర్పులు విడుచుట, మూర్ఛఁ జెందుట మొదలైనవి.

ఖండితానాయికాలక్షణం

ఉల్లంఘ్య సమయం యస్యాః ప్రేయానన్యోపభోగవాన్,
భోగలక్ష్మాంకితః ప్రాతరాగచ్ఛేత్సా హి ఖండితా.

48


అస్యాస్తు చేష్టా నిశ్వాసస్తూష్ణీం భావో౽శ్రుమోచనం,
ఖేదభ్రాంత్యస్ఫుటాలాపా ఇత్యాద్యా విక్రియా మతాః.

49
సంకేతసమయము నతిక్రమించి అన్యోపభోగపుగుఱతులతో ప్రాతఃకాలమందు వచ్చెడినాయకుని గలది ఖండితానాయిక యనఁబడును. దీనివ్యాపారములు నిట్టూర్పు విడుచుట, పలుకకుండుట, కన్నీరు విడుచుట, ఖేదపడుట, భ్రమించుట, మూలుగుట మొదలయినవి.

కలహాంతరితాలక్షణం

యా సఖీనాం పురః పాదపతితం వల్లభం రుషా,
నిరస్య పశ్చాత్తపతి కలహాంతరితా తు సా.

50


అస్యాస్తు చేష్టా నిశ్వాసభ్రాంతిర్హృత్తాపసాధ్వసే,
ముహుః ప్రలాప ఇత్యాద్యాశ్చేష్టాః ప్రోక్తా మనీషిభిః.

51

సఖులయెదుట చరణపతితుఁడగునాయకుని నిరాకరించి పిదప పరితాపపడునది కలహాంతరిత యనఁబడును. దీనివ్యాపారములు నిట్టూర్పు విడుచుట, భ్రమించుట, మనస్తాపపడుట, స్తంభాదిసాధ్వసభావములు గలుగుట, మాటిమాటికి ప్రలపించుట మొదలైనవి.

ప్రోషితభర్తృకాలక్షణం

దేశాంతరగతే కాంతే ఖిన్నా ప్రోషితభర్తృకా,
అస్యాస్తు జాగరః కార్శ్యం నిమిత్తాద్యవలోకనం.

52


మాలిన్యమనవస్థానం ప్రాయశ్శయ్యానిషేవణం,
జాడ్యచింతాప్రభృతయో విక్రియాః కథితా బుధైః.

53

నాయకుఁడు దేశాంతరమును జెందియున్నప్పుడు ఖేదపడుచుండునది ప్రోషితభర్తృక. దీని వ్యాపారములు నిదురలేక యుండుట, కృశించుట, ప్రియుఁ డెన్నాళ్లకు వచ్చునని శకునములు చూచుట, మలినయై యుండుట, నిలిచినచోట నిలువకపోవుట, ఎప్పుడును పండుకొనియుండుట, ఏమియుఁ దోవకయుండుట, చింత మొదలైనవి.

అభిసారికానాయికాలక్షణం

మదనానలసంతప్తా యాభిసారయతి ప్రియం,
స్వయం వాభిసరేద్యా తు సా భవేదభిసారికా.

54


అస్యాస్సంతాపచింతాద్యా విక్రియాస్స్యుర్యథోచితం,

మదనానలసంతప్తయై తనస్థలమునకు నాయకుని వచ్చునట్టు చేయు చున్నది గాని, తానే నాయకునిస్థలమునకుఁ బోవుచున్నది గాని, అభిసారిక యనఁబడును. దీనివ్యాపారములు సంతాపపడుట, చింత మొదలైనవి, యాయాసమయోచితముగ నుండును.

ఏతాసాం నాయికానాం తు త్రైవిధ్యం పరికీర్తితం,
ఉత్తమా మధ్యమా చారాప్యధమేతి ప్రభేదతః.

55

ముందు చెప్పిన 128 భేదములుగలనాయికలు, ఉత్తమ, మధ్యమ, ‘అధమ యనుభేదములచేత మూఁడువిధములు గలవారగుదురు.

ఉత్తమాలక్షణం

.

విదధత్యప్రియం పత్యౌ ప్రియమాచరతి స్వయం,
వల్లభే సాపరాధే౽పి తూష్ణీం తిష్ఠతి సోత్తమా.

56

నాయకుఁడు అహితముఁ జేయుచుండఁగ నతనికి ప్రియముగా నేపె నడచుచున్నదో, అపరాధియగు వల్లభుని చూచి యేపె ఊరకయున్నదో, ఆపె ఉత్తమనాయిక.

మధ్యమనాయికాలక్షణం

పుంసి స్వయం కామయతి కామయేద్యా చ తం వధూః,
సక్రోధే క్రుధ్యతి ముహుః సూనృతే సత్యవాదినీ.

57


సాపరాధే౽పకర్త్రీ స్యాత్ స్నిగ్ధే స్నిహ్యతి వల్లభే,
ఏవమాదిగుణోపేతా మధ్యమా సా ప్రకీర్తితా.

58
నాయకుఁడు ఇచ్ఛించిన తా నిచ్ఛించుట, అతఁడు కోపించుకొనిన తాను కోపించుట, అతఁడు నిజము పలికిన తాను నిజము పలుకుట, అతఁ దపరాధము చేసిన తా నపవాధము సేయుట, అతఁడు స్నేహించిన తాను స్నేహించుట, ఈరీతిగుణములు గలది మధ్యమనాయిక యనఁబడును.

అధమనాయికాలక్షణం

కఅస్మాత్కుప్యతి రుషం ప్రార్థితాపి న ముంచతి,
సురూపం వా విరూపం వా గుణవంతమథాగుణం.

59


స్థవిరం తరుణం వాపి యా వా కామయతే ద్రుతం,
ఈర్ష్యాకోపవిషాదేషు నియతా సాధమా మతా.

60

ఏనాయిక అకారణముగ కోపించుచున్నదో, ప్రార్థించినను కోపమును విడువదో, చక్కనివాఁడైనను, అరూపుఁడైనను, గుణవంతుఁడైనను, అగుణవంతుఁడైనను, ముసలివాఁడైనను, తరుణుఁడైనను, ఎట్లున్నను నాయకుని నిచ్ఛించుచున్నదో ఈర్ష్య, కోపము, వ్యసనము వీనిని గలదిగ నున్నదో, యది యధమనాయిక యనఁబడును.

నాయికాసంఖ్యాప్రకరణం

స్వీయా త్రయోదశవిధా ద్వివిధా చ పరాంగనా,
వేశ్యైకై షోడశదా తాశ్చావస్థాభిరష్టభిః.

61


ప్రత్యేక మష్టథా తాసాముత్తమాదిప్రభేదతః,
త్రైవిధ్య మేవం స చతురశీతిత్రిశతం భవేత్.

62

స్వీయ 13 విధములు గలదియు, పరకీయ 2 విధములు గలదియు, సామాన్య 1 విధము గలదియు నగును. ఈ 16 విధములుగల నాయికలకు ప్రత్యేకము ఎనిమిది యవస్థలు గలుగుటవలన నూటయిరువదిభేదములు గలవారగుదురు. వీరలు మరల ఉత్తమాదిభేదము వలన 34 భేదములు గలవారగుదురు.

అసాం దూత్యాదయో నిరూప్యంతే

దూతీ దాసీ సఖీ చేటీ ధాత్రేయీ ప్రాతివేశినీ,
లింగినీ శిల్పినీత్యాద్యాస్సహాయాః పరికీర్తితాః.

63
ఈనాయికలకు సహాయపడువారు దూతి దాసి సఖి చేటి ధాత్రేయి ప్రాతివేశిని లింగిని శిల్పిని వీరు మొదలయినవారు.

అథ శృంగారనాయకా నిరూప్యంతే

పతిశ్చోపపతిశ్చైవ వైశికశ్చ తతఃపరం,
స్వీయాదీనాం నాయికానాం నాయకాః కథితా బుధైః.

64

పతి, ఉపపతి, వైశికుఁడు, అనువీరు - స్వీయా, పరకీయా, సామాన్యలకు నాయకులని చెప్పఁబడుదురు.

పతిలక్షణం

వేదశాస్త్రానురోధేన పాణిం గృహ్ణాతి యః స్త్రియః,
స ఏవ పతిరిత్యుక్తః విద్వద్భిరిహ శాస్త్రతః.

65

ఏపురుషుఁడు వేదశాస్త్రోక్తముగ ఏస్త్రీని పాణిగ్రహణము చేసికొనుచున్నాఁడో ఆమెకు వాఁడే భర్తయని విద్వాంసులు శాస్త్రమందు చెప్పియున్నారు.

ఉపపతిలక్షణం

ప్రలోభ్యాన్యవధూం భుఙ్క్తే ఉపాయైర్వివిధైరపి,
స తూపపతిరిత్యుక్తః విద్వద్భిరిహ శాస్త్రతః.

66

అన్యవనితను వివిధోపాయములచే నాసపఱచి అనుభవించునతఁడు ఉపపతి యనఁబడును.

వైశికలక్షణం

వేశ్యాబహుళసంభోగసమాసాదితగౌరవః,
విత్తవ్యయీ విలాసీ చ వైశికః పరికీర్తితః.

67
ఎవఁడు వేశ్యోపభోగములచే పొందఁబడిన గౌరవముగలవాఁడును, అర్థవ్యయము చేయువాఁడును, విలాసముగలవాఁడు నైయుండునో వాఁడు వైశికుఁడని చెప్పఁబడును.

చతుర్విధశృంగారనాయకలక్షణం

ఏతే శృంగారవిషయాశ్చత్వారస్స్యుః పృథక్పృథక్,
అనుకూలో దక్షిణశ్చ ధృష్టశ్శఠ ఇతి స్మృతాః.

68

శృంగారవిషయులైన ఈనాయకులు అనుకూలుఁడు, దక్షిణుఁడు, ధృష్టుఁడు, శకుఁడు అని వెవ్వేఱుగ నలుతెఱఁగు లగుదురు.

అనుకూలనాయకలక్షణం

ఏకాయత్తో౽నుకూలస్స్యాత్సదా తామనురంజయన్,
అన్యస్త్రీదర్శనాదిభ్యో నివృత్తనిజమానసః.

69

ఇతరస్త్రీలను జూచుట మొదలయిన వ్యాపారరహితుఁడును, స్వస్త్రీయందే ప్రేమగలవాఁడునై యుండువాఁడు అనుకూలుఁ డనఁబరగును.

దక్షిణనాయకలక్షణం

బహ్వీషు విద్యమానాసు స్వాశ్రితాసు నిరంతరం,
సమప్రీతిం ప్రకుర్వాణః స దక్షిణ ఇతి స్మృతః.

70

తన్నాశ్రయించిన అనేకస్త్రీలయందు సమముగ ప్రీతిఁజేయువాఁడు దక్షిణుఁ డనఁబరగును.

ధృష్టనాయకలక్షణం

వ్యక్తాగా రతభీర్ధృష్టః వారితో౽పి న ముంచతి,
తామేవానుసరత్యాశు ప్రణామానునయాదిభిః.

71
ఎవ్వడు తనయపరాధము నాయికచే నెఱుఁగఁబడినను భయములేక యుండునో తొలఁగించినం దొలఁగఁడో ఆనాయికనే త్వరగా నమస్కారము మొదలయిన ఉపాయములచే అనుసరించునో వాడు ధృష్టుఁ డనఁబరగును.

శఠనాయకలక్షణం

ప్రియాయామనురక్తాయాం గూఢవిప్రియకర్మకృత్,
అతశ్శఠ ఇతి ప్రోక్తః భావశాస్త్రవిచక్షణైః.

72

అనురాగముగల ప్రియకు గూఢముగ అహితముఁ జేయువాఁడు శఠుఁ డనఁబడును.

ఏతేషాం సహాయా నిరూప్యంతే

పీఠమర్దో విటశ్చేటః విదూషక ఇతి స్మృతాః,
చత్వారః కామతంత్రజ్ఞా ఏతేషాం సహకారిణః.

73

ముందు చెప్పినశృంగారనాయకులకు సహాయులగువారు పీఠమర్దుఁ డనియు, విటుఁ డనియు, చేటుఁ డనియు, విదూషకుఁ డనియు నలుదెఱంగు లగుదురు.

పీఠమర్దాదిలక్షణం

కించిదూనః పీఠమర్దః ఏకవిద్యో విటః స్మృతః,
సంధానచతురశ్చేటః హాస్యప్రాయో విదూషకః.

74

నాయకునికి కొంచెము తక్కువగా నుండువాఁడు పీఠమర్దుఁడు. కామశాస్త్రప్రవీణుఁడైయుండువాఁడు విటుఁడు. నాయికానాయకులకు సంధిచేయువాడు చేటుఁడు. హాస్యప్రధానుఁడై యుండువాఁడు విదూషకుఁడు.

అథ ఉద్దీపనవిభావో నిరూప్యతే

ఉద్దీపనశ్చతుర్ధా స్యాదాలంబనసమాశ్రితః,
గుణాశ్చేష్టాలంకృతయస్తటస్థాశ్చేతి భేదతః.

75
ఆలంబనవిభావము నాశ్రయించియుండు గుణములు చేష్టలు అలంకృతులు ఇవి మూఁడును, తటస్థములును కూడ ఉద్దీపనవిభావము నలుదెఱఁగులఁ బరగును.

ఆలంబనగుణా యథా

యౌవనం రూపలావణ్య సౌందర్యాణ్యభిరూపతా,
మార్దవం సౌకుమార్యం చేత్యాలంబనగతా గుణాః.

76

యౌవనము, రూపము, లావణ్యము, సౌందర్యము, అభిరూపత్వము, మార్దవము, సౌకుమార్యము, ఇవి ఆలంబనగుణములు.

యౌవనం నిరూప్యతే

సర్వాసామపి నారీణాం యౌవనం త్రివిధం మతం,
ప్రతియౌవనమేతాసాం చేష్టితాని పృథక్ పృథక్.

77

సమస్తస్త్రీలకును యౌవనము మూఁడు తెఱగులౌను. ఆయాయౌవనమున చేష్టలు వెవ్వేరుగ నుండును.

ప్రథమయౌవనలక్షణం

ఈషచ్చపలనేత్రాంతం స్మరస్మేరముఖాంబుజం,
సగర్వజరజోగంధమసమగ్రారుణాధరం.

78


లావణ్యోద్భేచరమ్యాంగం విలసద్భావసౌరభం,
ఉన్మీలితాంకురకుచం అస్ఫుటాంగికసంధికం.

79


ప్రథమం యౌవనం తత్ర వర్తమానా మృగేక్షణా,
అపేక్షతే మృదుస్పర్శం సహతే నోచ్చతాం రతేః.

80


సఖీకేళిరతా స్వాంగసంస్కారకలితాదరా,
న కోపహర్షౌ భజతే సపత్నీదర్శనాదిషు.

81


నాతిలజ్జావతీ కాంతసంభోగే కింతు శఙ్కతే,

కించిచ్చపలములైన కడకండ్లనుగలదిగాను, మన్మథునిచే వికాసము నొందిన ముఖపంకజము గలదిగాను, గర్వమువలన గలిగిన రజోగంధముతోఁ గూడినదిగాను, నిండుఎఱుపు లేనిపెదవులు గలదిగాను, లావణ్యముయొక్క ప్రకాశమువలన మనోహరమైన దేహము గలదిగాను వెలయుచుండు భావసౌరభము గలదిగాను, వృద్ధిబొందు మొలకచన్నులు గలదిగాను, చక్కగా నేర్పడని ఆంగములసంధులు గలదిగాను ఉండునది ప్రథమయావన మనఁబడును. ఈయౌవనముగలనాయిక మృదుస్పర్శము నపేక్షించును. ఉచ్చరతిని సహింపదు. సఖులతో నాడుటయందు ప్రియము. తన్ను తా నలంకరించుకొనుటయందు. ప్రియము. సవతిని జూచుట మొదలైన కార్యములందు కోపసంతోషములు లేనిదిగా నుండుట, ప్రియునియందు అధికముసిగ్గు లేకుండుట, రతియందు భయము ఈగుణములు గలిగి యుండును.

ద్వితీయయౌవనలక్షణం

స్తనౌ పీనౌ తనుర్మధ్యః పాదే పాణౌ చ రక్తిమా.

82


ఊరూ కరికరాకారౌ అంగం వ్యక్తాంగసంధికం,
నితంబో విపులో నాభిర్గంభీరా జఘనం ఘనం.

83


వ్యక్తరోమావళిస్నైగ్ధ్యమంగప్రత్యంగసౌష్ఠవం,
ద్వితీయం యౌవనం తత్ర వర్తమానా సులోచనా.

84


సఖీషు స్వాశయజ్ఞాసు స్నిగ్ధా ప్రాయేణ భామినీ,
న ప్రసీదత్యనునయైస్సపత్నీష్వభ్యసూయినీ.

85


నాపరాధాన్విషహతే ప్రణయేర్ష్యాకషాయితా,
రతికేళిష్వనిభృతా చేష్టతే గర్వితా రహః.

86

గొప్పచన్నులును, సన్నమైననడుమును, ఎఱుపుగల చేతులు కాళ్లును, ఏనుఁగుతొండమువంటి తొడలును, వ్యక్తాంగసంధియగు దేహమును, విపులమైన నితంబమును, గంభీరమైన నాభియు, ఘనమయిన జఘనప్రదేశమును, ప్రకాశమైన రోమావళినిగనిగయును. అంగప్రత్యంగముల చక్కఁదనమును గలదై యుండునది ద్వితీయయౌవన మనఁబడును. ఈయౌవనము గలనాయిక తన మనోభావము తెలిసిన సఖులయందు తరుచుగా ప్రీతికలదిగాను, సమాధా నపుమాటలచే తృప్తిపడనిదిగాను, చవతులయందు అసూయగలదిగాను, అపరాధములను ఓర్వనిదిగాను, ప్రణయకలహమందు ఈర్ష్యకలదిగాను, రతికేళులయందు స్తిమితగాక ఏకాంతమందు గర్వించి వ్యాపరించునదిగాను నుండును.

తృతీయయౌవనలక్షణం

అస్నిగ్ధతా నయనయోర్గండయోర్మానకాంతితా,
విచ్ఛాయతా ఖరస్పర్శో౽ప్యంగానాం శ్లథతా మనాక్.

87


అధరే మసృణో రాగః తృతీయే యౌవనే భవేత్,
తత్ర స్త్రీణామియం చేష్ఠ రతితంత్రవిదగ్ధతా.

88


వల్లభస్యాపరిత్యాగః తదాకర్షణకౌశలం,
అనారోపో౽పరాధేషు సపత్నీ ష్వప్యమత్సరః.

89

నేత్రములయందు తేటమాఱినదియు, చెక్కిళ్ల యందు వాడినదియు, దేహచ్ఛాయ తప్పినదిగాను, కఠినమైనస్పర్శము గలదిగాను, కొంచెము దేహపటుత్వము తప్పినదిగాను, పెదవులయెఱుపు మీఱినదిగాను ఉండునది తృతీయయౌవన మనఁబడును. ఈయౌవనముగల నాయిక వ్యాపారములు, రతితంత్రములయందు విశేషచాతుర్యము, నాయకుని విడువకయుండుట, నాయకుని స్వాధీనపఱుచుకొను పాండిత్యము, నాయకాపరాధములయందు అసూయ లేకయుండుట, సవతులయందు మాత్సర్యము లేకయుండుట మొదలయినవి.

తత్ర శృంగారయోగ్యత్వం రసాహ్లాదనకారణం,
ఆద్యద్వితీయయోరేవ న తృతీయస్య వర్ణ్యతే.

90
ఈమూఁడువిధముల యౌవనములయందును మొదటిరెండు యౌవనములకే రసములచే సంతోషపఱుచుటకు కారణమైన శృంగారయోగ్యత కలదు. మూఁడవయౌవనమునకు ఈయోగ్యత లేదు.

రూపలక్షణం

అంగాన్యభూషితాన్యేవ ప్రక్షేపార్హైర్విభూషణైః,
యేన భూషితవద్భాతి తద్రూపమితి కథ్యత్తే

91

అంగములు తగినభూషణములచే అలంకరింపఁబడకయే అలంకరింపఁబడినట్లు దేనిచేత శోభించునో యది రూప మనఁబడును.

లావణ్యలక్షణం

ముక్తాఫలేషు ఛాయాయాస్తరళత్వమివాంతరే,
ప్రతిభాతి యదంగేషు తల్లావణ్యమిహోచ్యతే.

92

ముత్యములయం దుండు ఛాయయొక్క తరళత్వమువలెనే అవయవములయందు ఏకాంతి ప్రకాశించుచున్నదో యది లావణ్యమని చెప్పఁబడును.

సౌందర్యలక్షణం

అంగప్రత్యంగకానాం యో సన్నివేశో యథోచితం,
సుస్నిగ్ధసంధిబంధస్స్యాత్తత్సౌందర్యమితీర్యతే.

93

అంగప్రత్యంగములయొక్క చక్కనిసంధిబంధముగల యథోచితసన్నివేశము సౌందర్య మనఁబడును.

ఆభిరూప్యలక్షణం

యదాత్మీయగుణోత్కర్షైర్వస్త్వన్యన్నికటస్థితం,
సారూప్యం నయతి ప్రాజ్ఞైరాభిరూప్యం తదుచ్యతే.

94

ఆత్మీయగుణాధిక్యమువలన తనసమీపముననుండు వస్తువునకు తనసారూప్యమును గలుగఁజేయునది యాభిరూప్య మనఁబడును.

మార్దవలక్షణం

స్పృష్టం యత్రాంగమస్పృష్టమివ స్యాన్మార్దవం హి తత్,

దేహము అంటఁబడియు అంటఁబడనిదానివలెనుండునది మార్దవ మనఁబడును.

సౌకుమార్యలక్షణం

యా స్పర్శాసహతాంగేషు కోమలస్యాపి వస్తునః.

95


తత్సౌకుమార్యం త్రేధా స్యాదుత్తమాదిప్రభేదతః,

అంగములయందు కోమలమైన వస్తువుయొక్క యైనను స్పర్శమును సహింపమి సౌకుమార్యము. ఆసౌకుమార్యము ఉత్తమ-మధ్యమ-అధమభేదములవలన ముత్తెఱఁగు లౌను.

ఉత్తమసౌకుమార్యలక్షణం

అంగం పుష్పాదిసంస్పర్శాసహం యేన తదుత్తమం.

96

ఏగుణముచేత అంగము పుష్పాదులస్పర్శమునుగూడ నోర్వదో యది ఉత్తమసౌకుమార్యము.

మధ్యమసౌకుమార్యలక్షణం

న సహేత కరస్పర్శం యేనాంగం మధ్యమం హి తత్,

ఏగుణముచేత అంగము కరస్పర్శమును సహింపదో యది మధ్యమసౌకుమార్యము.

అధమసౌకుమార్యలక్షణము

యేనాంగమాతపాదీనామసహం తదిహాధమం.

97

ఏగుణముచేత దేహము ఎండ మొదలయినవానిని సహింపదో యది అధమసౌకుమార్యము.

చేష్టాయథా

చేష్టాస్తు యావనోద్భూతకటాక్షాదయ ఈరితాః,

యౌవనవ్యాప్తిచేత గలుగు కడకంటిచూపులు మొదలైనవి చేష్టలు.

అలంకృతిర్యథా

చతుర్థాలంకృతిర్వాసోభూషామాల్యానులేపనైః.

98

అలంకృతి వస్త్రములు, భూషణములు, పుష్పములు, మైపూతలు ఈ విధములచే నలుదెఱఁగు లౌను.

తటస్థాయథా

తటస్థాశ్చంద్రికాధారగృహచంద్రోదయాదయః,
కోకిలాకులమాకందమందమారుతషట్పదాః.

99


లతామంటపభూగేహదీర్ఘికాజలదారవాః,
ప్రాసాదగర్భసంగీతక్రీడాద్రిసరిదాదయః.

100


ఏవమూహ్యా యథాకాలముపభోగోపయోగినః,

చంద్రికాధారము లైన గృహములు, చంద్రోదయము మొదలైనవి, కోవెలలు నిండియుండురసాలవృక్షము, మందమారుతము, భ్రమరములు, పొదరిండ్లు, భూగేహము, దీర్ఘికలు, మేఘనాదము, ప్రాసాదమధ్యము, సంగీతము, క్రీడాదులు, సెలయేఱులు మొదలైనవి ఉపభోగోపయోగవస్తువులు తటస్థోద్దీపనములు - ఇవి కాలోచితములుగ నూహించుకోవలసినవి.

అథ అనుభావలక్షణం

భావం మనోగతం సాక్షాత్స్వహేతుం వ్యంజయంతియే.

101


తే౽నుభావా ఇతి ఖ్యాతా భ్రూవిక్షేపస్మితాదయః,
తే చతుర్థా చిత్తగాత్రవాగ్బుద్ధ్యారంభసంభవాః.

102

స్వహేతువైన మనోగతాభిప్రాయమును ప్రత్యక్షమువలెనే బయలుపఱచునవి యనుభావములు. ఇవి చిత్తజానుభావములు, గాత్రజానుభావ ములు, వాగారంభానుభావములు, బుద్ధ్యారంభానుభావములు అని నలుదెఱఁగు లౌను.

చిత్తజానుభావా లక్ష్యంతే

తత్ర చ భావో హావో హేలా శోభా చ కాంతిదీప్తీ చ,
ప్రాగల్భ్యం మాధుర్యం ధైర్యౌదార్యేచ చిత్తజా భావాః.

103

ఆనలుదెఱంగుల అనుభావములయందు భావము, హావము, హేల, శోభ, కాంతి, దీప్తి, ప్రాగల్భ్యము, మాధుర్యము, ధైర్యము, ఔదార్యము ఇవి చిత్తజానుభావము లనఁబడును.

భావలక్షణం

నిర్వికారస్య చిత్తస్య భావస్స్యాద్యా తు విక్రియా,
గ్రీవారేచకసంయుక్తో భ్రూనేత్రాదివిలాసకృత్.

104

వికారములేని మనసుయొక్క విక్రియ భావ మనఁబడును. అది గ్రీవారేచకసంయుక్తమై భ్రూనేత్రాదులయందు వికాసమును గలుగఁజేయును.

హావలక్షణం

భావ ఈషత్ప్రకాశో యః స హావ ఇతి కథ్యతే,

ఆభావము నేత్రాదులవలన నించుక ప్రకాశపడెనేని యది హావ మనఁబడును.

హేలాలక్షణం

భావ ఏవ భవేద్దేలా లలితాభినయాత్మికః.

105

ఆభావమే లలితాభినయరూప మగునపుడు హేల యనఁబడును.

శోభాలక్షణం

సా శోభా రూపభూషాద్యైర్యత్స్యాదంగవిభూషణం,

రూపభూషాదులచే దేహము నలంకరించుకొనుట శోభ యనఁబడును.

కాంతి లక్షణం

శోభైవ కాంతిరాఖ్యాతా మన్మథాప్యాయనోజ్వలా.

106

ఆశోభయే మన్మథవిషయతృప్తిఁ జేయుటయందు ప్రకాశించెనేని యది కాంతి యనఁబడును.

దీప్తిలక్షణం

కాంతిరేవ వయోభోగదేశకాలగుణాదిభిః,
ఉద్దీపితాతివిస్తారం యాతా చేద్దీప్తిరుచ్యతే.

107

ఆకాంతియే వయోభోగదేశకాలగుణాదులచే మిక్కిలియధిక మాయెనేని యది దీప్తి యనఁబడును.

ప్రాగల్భ్యలక్షణము

నిశ్శంకత్వం ప్రయోగేషు ప్రాగల్భ్యం పరికీర్తితం,

ప్రయోగములయందు నిశ్శంకవృత్తి ప్రాగల్భ్య మనఁబడును.

మాధుర్యలక్షణము

మాధుర్యం నామ చేష్టానాం సర్వావస్థాసు మార్దవం.

108

సర్వావస్థలయందును వ్యాపారములయొక్క మృదుత్వమే మాధుర్య మనఁబడును.

ధైర్యలక్షణము

స్థిరా చితోన్నతిర్యాతు తద్ధైర్యమితి సంజ్ఞితం,

దృఢమైన చిత్తవృత్తి ధైర్య మనఁబడురు.

ఔదార్యలక్షణము

ఔదార్యం వినయం ప్రాహుః సర్వావస్థానుగం బుధాః.

109

సర్వావస్థలయందు ననుసరించినవినయమును ఔదార్యమని చెప్పుదురు.

అథ గాత్రజానుభావా నిరూప్యంతే

లీలా విలాసో విచ్ఛి త్తిః విభ్రమః కిలికించితం,
మోట్టాయితం కుట్టమితం బిబ్బోకం లలితం తథా.

110


విహృతం చేతి విజ్ఞేయాః స్త్రీణాం తు దశ గాత్రజాః,

లీల, విలాసము, విచ్ఛిత్తి, విభ్రమము, కిలికించితము, మోట్టాయితము, కుట్టమితము, బిబ్బోకము, లలితము, విహృతము ఈపదియు స్త్రీల గాత్రాజానుభావము లనఁబడును.

లీలాలక్షణం

ప్రియానుసరణం యత్తు మధురాలాపపూర్వకైః.

111


చేష్టితైర్గతిభిశ్చాపి సా లీలేతి నిగద్యతే,

మధురాలాపము మొదలైనచేష్టలచే నాయకుని ననుసరించుట లీల యనఁబడును.

విలాసలక్షణం

ప్రియసంప్రాఫ్తిసమయే భ్రూనేత్రాననకర్మభిః.

112


తాత్కాలికో విశేషో యః స విలాస ఇతీరితః,

నాయకుఁడు వచ్చెడిసమయమందు కనుబొమలు, కన్నులు, ముఖము వీనిచే నప్పుడు గలుగువిశేష మేదో యది విలాస మనఁబడును.

విచ్ఛిత్తిలక్షణం

ఆకల్పకల్పనాకల్పా విచ్ఛిత్తిరతికాంతికృత్.

113
అలంకారవిన్యాసములకు సమానమై మెరయుచునుండునది విచ్ఛిత్తి యనఁబడును.

విభ్రమలక్షణం

ప్రియాగమనవేళాయాం మదనావేశసంభ్రమాత్,
విభ్రమో గంధహారాదిభూషాస్థానవిపర్యయః.

114

ప్రియుఁడు వచ్చెడిసమయమందు మన్మథావేశసంభ్రమముచే గంధముహారము మొదలైన భూషణస్థానవిపర్యయము విభ్రమ మనఁబడును.

కిలికించితలక్షణం

శోకరోషాశ్రుహర్షాదేస్సంకరః కిలికించితం,

శోకము, కోపము, కన్నీరు, సంతోషము వీనికూడిక కిలికించిత మనఁబడును.

మోట్టాయితలక్షణం

స్వాభిలాషప్రకటనం మోట్టాయితమితీరితం.

115

తనకోరికను బయలుపఱచుట మోట్టాయిత మనఁబడును.

కుట్టమితలక్షణం

కేశాధరాదిగ్రహణే మోదమానాపి మానసే,
దుఃఖితేవ బహిః కుప్యేద్యది కుట్టమితం భవేత్.

116

రతికాలమందు ఉవిద కొప్పు అధరము మొదలైనవానియొక్క గ్రహణమందు మనసులో సంతోషముగలదై యుండినను బయటికి దుఃఖితురాలువలేనే కోపించుట కుట్టమిత మనఁబడును.

బిబ్బోకలక్షణం

ఇష్టే౽ప్యనాదరో గర్వాత్ మనాక్ బిబ్బోక ఇష్యతే,

గర్వమువలన ప్రియవస్తువునందు కొంచెము అనాదరణము బిబ్బోక మనఁబడును.

లలితలక్షణం

విన్యాసభంగిరంగానాం భూవిలాసమనోహరాః.

117


సుకుమారా భవేయుశ్చేత్ లలితం తదుదీరితం,

అంగవిన్యాసచమత్కారములు, మనోహరభ్రూవిలాసములు, సుకుమారము లౌచుండిన అది లలిత మనఁబడును.

విహృతలక్షణం

ఈర్ష్యయా మానలజ్జాభ్యామదత్తం యోగ్యముత్తరం.

118


క్రియయా వ్యజ్యతే యత్ర విహృతం తదుదీరితం,

ఈర్ష్యచేతగాని, కోపముచేతగాని, సిగ్గుచేతగాని తగుపాటియుత్తర మియ్యక క్రియలచేఁ దెలుపఁబడెనేని అది విహృత మనఁబడును.

వాగారంభానుభావా నిరూప్యంతే

ఆలాపశ్చ విలాపశ్చ సల్లాపశ్చ ప్రలాపకః.

119


అనులాపో౽పలాపశ్చ సందేశశ్చాతిదేశకః,
నిర్దేశశ్చాపదేశశ్చ వ్యపదేశోపదేశకౌ.

120


ఏవం ద్వాదశధా ప్రోక్తో వాగారంభా విచక్షణైః,

ఆలాపము, విలాపము, సల్లాపము, ప్రలాపము, అనులాపము, అపలాపము, సందేశము, అతిదేశకము, నిర్దేశము, అపదేశము, వ్యపదేశము, ఉపదేశము, ఈపండ్రెండును వాగారంభానుభావము లనఁబడును.

ఆలాపవిలాపలక్షణే

తత్రాలాపః ప్రియోక్తిస్స్యాద్విలాపో దుఃఖజం వచః.

121
అందు సంతోషపుమాట ఆలాప మౌను. దుఃఖముచేఁ గలుగుపలుకు విలాప మౌను.

సల్లాపలక్షణం

ఉక్తిప్రత్యు_క్తిమద్వాక్యం సల్లాపః పరికీర్తితః

ఉక్తిప్రత్యుక్తి గలమాట సల్లాప మనఁబడును.

ప్రలాపానులాపలక్షణే

వ్యర్థాలాపః ప్రలాపస్స్యాదనులాపో ముహుర్వచః.

122

ఉపయోగము లేని మాట ప్రలాప మనఁబడును. చెప్పినమాటలనే చెప్పుట అనులాప మనఁబడును.

అపలాపలక్షణం

అపలాపస్తు పూర్వోక్తస్యాన్యథాయోజనం భవేత్,

మొదట చెప్పినమాటను వేఱువిధముగా త్రిప్పుట అపలాప మౌను.

సందేశలక్షణం

సందేశస్తు ప్రోషితస్య స్వవార్తాప్రేషణం భవేత్.

123

ఊరికిపోయియుండు నాయకునికి తనసంగతులను సఖులముఖమునఁ దెలుపుట సందేశ మనఁబడును.

అతిదేశలక్షణం

సో౽తిదేశో మదుక్తాని తదుక్తానీతి యద్వచః

నేను చెప్పనమాటలే అతఁడు చెప్పినమాట లనుట అతిదేశ మనఁబడును.

నిర్దేశలక్షణం

నిర్దేశస్తు భవేత్సో౽యమహమిత్యాదిభాషణం.

124

వాఁడు, వీఁడు, నాఁడు, నేను మొదలైనపలుకులు నిర్దేశ మనఁబడును.

అపదేశలక్షణం

అన్యార్థకథనం యత్ర సో౽పదేశ ఇతీరితః,

అర్థాంతరమును దెలియపఱుచుపలుకు అపదేశ మనఁబడును.

ఉపదేశలక్షణం

యచ్ఛిష్యార్థం తు వచన ముపదేశస్స ఉచ్యతే.

125

శిష్యులకొఱకు ఆచార్యులచేఁ జెప్పఁబడుపలుకు ఉపదేశ మనఁబడును.

వ్యపదేశలక్షణం

వ్యాజేనాతాభిలాషోక్తిర్యా సా స్యాద్వ్యపదేశకః,

ఇతరవ్యాజమున తనకోరికను దెలుపుట వ్యపదేశ మనఁబడును.

అథ బుద్ధ్యారంభానుభావా నిరూప్యంతే

బుద్ధ్యారంభా స్తథా ప్రోక్తారీతివృత్తిప్రవృత్తయః.

126

ఈబుద్ధ్యారంభానుభావములు రీతియనియు, వృత్తియనియు, ప్రవృత్తియనియు ముత్తెఱంగు లగును.

ప్రబంధాదిషు తే జ్ఞేయా భావశాస్త్ర విచక్షణైః,

ఇవి ప్రబంధము మొదలైనవానియందు భావశాస్త్రజ్ఞులచే నెఱుఁగఁదగినవి.

అథ సాత్వికభావా నిరూప్యంతే

అన్యేషాం సుఖదుఃఖాదిభావేషు కృతభావనం.

127


ఆనుకూల్యేన యచ్చిత్తం భావకానాం ప్రవర్తతే,
తత్సత్వమితి విజ్ఞేయం ప్రాజ్ఞైస్సత్వోద్భవానిమాన్.

128


సాత్వికా ఇతి జానంతి భరతాద్యా మహర్షయః,
తే స్తంభన్వేదరోమాంచస్స్వరభేదశ్చ వేపథుః.

129


వైవర్ణ్య మశ్రుప్రళయ ఇత్యష్టౌ సాత్వికా మతాః,

ఇతరులయొక్క సుఖదుఃఖములు మొదలైన భావములయందు అనుకూల్యముతో కృతభావనమై యేమనసు ప్రవర్తించుచున్నదో యది సత్వ మనఁబడును. అందునుండి గలుగుభావములు సాత్వికము లౌను. అవి స్తంభమనియు, స్వేదమనియు, రోమాంచమనియు, స్వరభేదమనియు, వేపథువనియు, వైవర్ణ్యమనియు, అశ్రువనియు, ప్రళయమనియు నీయెనిమిది సాత్వికభావము లనఁబడును.

స్తంభలక్షణం

స్తంభో హర్షభయామర్ష విషాదాద్భుతసంభవః.

130


అనుభావో భవేదత్ర నిష్క్రియాంగత్వమేవ హి,

స్తంభ మనుసాత్వికభావము సంతోషము, భయము, కోషము, విషాదము, అద్భుతము, వీనిచేఁ గలుగు నిష్క్రియాంగత్వము.

స్వేదలక్షణం

నిదాఘహర్షవ్యాయామశ్రమక్రోధభయాదిభిః.

131


స్వేదస్సంజాయతే తత్ర త్వనుభావా భవంత్యమీ,
స్వేదాపనయవాతేచ్ఛావ్యజనగ్రహణాదయః.

132

ఎండ, సంతోషము, వ్యాయామము, శ్రమము, క్రోధము, భయము, మొదలైనవానిచేత స్వేదము (అనఁగా చెమట) కలుగును. అప్పుడు చెమటను తుడుచుకొనుట, గాలిని ఇచ్ఛయించుట, వ్యజనగ్రహణము మొదలైనఅనుభావములు గలుగును.

రోమాంచలక్షణం

రోమాంచో విస్మయోత్సాహహర్షాద్యైస్తత్ర విక్రియాః,
రోమోద్గమాద్యాః కథితా విక్రియాస్తత్ర కోవిదైః.

133
ఆశ్చర్యము, ఉత్సాహము, సంతోషము, మొదలైనవానిచేత రోమాంచము కలుగును. అందు గగుర్పొడుచుట మొదలయినవికారములు కలుగును.

స్వరభేదలక్షణం

స్వరభేదస్సుఖాద్యైస్తు తత్ర స్యుర్గద్గదాదయః,

సుఖాదులచే స్వరభేదము గలుగును. ఇందు డగ్గుత్తిక మొదలైనవి గలుగును.

వేపథులక్షణం

వేపథు ర్హర్షసంత్రాసజ్వరక్రోధాదిభిర్భవేత్.

134


అత్రాసుభావాః స్మరణగాత్రకంపాదయో మతాః,

సంతోషము, బెదరించుట, జ్వరము, కోపము, మొదలైనవానిచే వేపథువు గలుగును. ఇందు స్మరించుట, దేహము వణకుట, మొదలైనవి గలుగును.

వైవర్ణ్యలక్షణం

విషాదపరరోషాద్యై ర్వైవర్ణ్య ముపజాయతే.

135


ముఖవర్ణపరావృత్తిః కార్శ్యాద్యాస్తత్ర విక్రియాః,

విషాదము, ఇతరులయందుఁ గలరోషము, మొదలైనవానిచే వైవర్ణ్యము గలుగును. ఇందు ముఖతేజస్సు మాఱుట, చిక్కిపోవుట, మొదలైనవి గలుగును.

అశ్రులక్షణం

విషాదరోషసంతోషధూమాద్యై రశ్రువిక్రియాః.

136


బాష్పబిందుపరిక్షేపనేత్రసమ్మార్జనాదయః,

వ్యసనము, కోపము, సంతోషము, ధూమము, మొదలైనవానిచే అశ్రువు గలుగును. ఇందు కన్నీరు విదిలించుట, కన్నులను తుడుచుకొనుట మొదలయినవి కలుగును.

ప్రళయలక్షణం

ప్రళయస్సుఖదుఃఖాద్యై శ్చేతసస్తు విసంజ్ఞతా.

137

ప్రళయమనఁగా సుఖదుఃఖాదులచేఁ గలుగు ప్రజ్ఞాభంగము.

ఏతేషాం సత్వమూలత్వాత్ భావానాం సాత్వికప్రథా,
అనుభావాశ్చ కథితాః భావసంసూచనాదయః.

138


ఏవం ద్వైవిధ్యమేతేషాం దర్శితం భావకోవిదైః,

సత్వమూలములైనవిగనుక వీనికి సాత్వికభావములని పేరు. భావసంసూచనాదులు అనుభావము లనఁబడును. ఇట్లు అనుభావములు రెండువిధములు గలిగియుండును.

విభావా అనుభావాశ్చ తే భవంతి పరస్పరం.

139


కార్యకారణభావాశ్చ జ్ఞేయా భావవిశారదైః,

విభావానుభావములు ఒకటికొకటి కార్యకారణభావములుగాను భావజ్ఞులచే నెఱుఁగఁదగినవి.

ఇత్యనుభావాస్సమాప్తాః

అథ వ్యభిచారిభావా నిరూప్యంతే

వ్యభీ ఇత్యుపసర్గౌ ద్వౌ విశేషాభిముఖత్వయోః.

140


విశేషేణాభిముఖ్యేన చరంతి స్థాయినం ప్రతి,
వాగంగసత్వయుక్తా యే జ్ఞేయాస్తే వ్యభిచారిణః.

141

పలుకు, దేహము, సత్వము, వీనితోఁ గూడినవై స్థాయికి విశేషాభిముఖములుగాఁ దిరుగుభావములు వ్యభిచారిభావములని యెఱుఁగవలయును.

విచారయంతి వా సమ్యగితి సంచారిణో౽పి తే,

అవి స్థాయులను బాగుగ చరింపఁజేయుచున్నవిగనుక సంచారులనియును జెప్పఁబడును.

ఉన్మజ్జంతో నిమజ్జంతః స్థాయిన్యంబునిథావివ.

142


ఊర్మివద్వర్ధయంత్యేనం యాంతి తద్రూపతాం చ తే,

ఏభావములు స్థాయియందు సముద్రమందుండునలలవలె దానిని వృద్ధి బొందించి తద్రూపతను పొందుచున్నవో అవి వ్యభిచారిభావము లనఁబడును.

నిర్వేదాదయో నిరూప్యంతే.

నిర్వేదగ్లానిశంకాశ్చ తథాసూయామదశ్శ్రమః.

143


ఆలస్యం చైవ దైన్యం చ చింతా మోహో ధృతిః స్మృతిః,
వ్రీడా చపలతా హర్ష ఆవేగో జడతా తథా.

144


గర్వో విషాద ఔత్సుక్యం నిద్రాపస్మార ఏవ చ,
సుప్తిర్విబోధో౽మర్షశ్చ అవహిత్థాప్యథోగ్రతా.

145


మతిర్వ్యాధి స్తథోన్మాదః తథా మరణమేవ చ,
త్రాసశ్చైవ వితర్కశ్చ విజ్ఞేయా వ్యభిచారిణః.

146


త్రయస్త్రింశదమీ భావాః సమాఖ్యాతాస్తు నామతః,

నిర్వేదము, గ్లాని, శంక, అసూయ, మదము, శ్రమము, ఆలస్యము, దైన్యము, చింత, మోహము, ధృతి, స్మృతి, వ్రీడ, చపలత, హర్షము, ఆవేగము, జడత, గర్వము, విషాదము, ఔత్సుక్యము, నిద్ర, అపస్మారము,

సుప్తి, విబోధము, అమర్షము, అవహిత్థ, ఉగ్రత, మతి, వ్యాధి, ఉన్మాదము, మరణము, త్రాసము, వితర్కము ఈ ముప్పదిమూఁడును వ్యభిచారిభావములని చెప్పఁబడును.

నిర్వేదలక్షణం

తత్త్వజ్ఞానాచ్చ దౌర్గత్యాదాపదో విప్రయోగతః.

147


దుఃఖాదేరపి నైష్ఫల్యమతిర్నిర్వేద ఉచ్యతే,

తత్త్వజ్ఞానము, పేదఱికము, సంకటము, వియోగము, దుఃఖము మొదలైనవానిచేఁ గలుగు ఫలాభావము నిర్వేద మనఁబడును.

గ్లానిలక్షణం

అధివ్యాధిజరాతృష్ణావ్యాయామసురతాదిభిః.

148


నిష్ప్రాణతా గ్లానిరత్ర క్షామాంగవచన క్రియాః,
కలాసుత్సాహవైవర్ణ్యనయనభ్రమణాచయః.

149

మనోవ్యాధి, రోగము, ముసలితనము, దప్పి, వ్యాయామము, సురతము, ఇవి మొదలైనవానిచే గలుగు దౌర్బల్యము గ్లాని యౌను. ఇందు దేహము చిక్కుట, సన్నపలుకులు, మెల్లనపనులు, కలావిషయములయందు ఉత్సాహములేకయుండుట, దేహవైవర్ణ్యము, గుడ్లు తిరుగుట మొదలైనవికారములు గలవు.

శంకాలక్షణం

శంకా చౌర్యాపరాధాద్యైః స్వానిష్టోత్ప్రేక్షణం మతం,
తత్ర చేష్టా ముహః పార్శ్వవీక్షణం ముఖశోషణం.

150


అవకుంఠనవైవర్ణ్యకంఠసాదాదయో౽పిచ,

చౌర్యాపరాధాదులచేఁ దన కహితము నుత్ప్రేక్షించుట శంక యనఁబడును. ఇందు మాటిమాటికి పార్శ్వములను చూచుట, మోము వాడుట, ముసుకిడుట, వైవర్ణ్యము, కంఠగద్గదము, మొదలైనచేష్టలు గలవు.

ద్వివిధా చేయమాత్మోత్థాపరోత్థా చేతి భేదతః.

151


స్వకార్యజనితా స్వోత్థా ప్రాయో వ్యంగ్యేయమింగితైః,
ఇంగితాని తు పక్ష్మ భ్రూతారకాదృష్టివిక్రియాః.

152


పరోత్థా తు పరస్వేదః పరస్యాకారతో భవేత్,
ప్రాయేణాకారచేష్టాద్యైః తామిమామనుభావయేత్.

153


ఆకారస్సాత్వికశ్చేష్టా స్త్వంగప్రత్యంగజాః క్రియాః,

ఈశంక ఆత్మోత్థశంక యనియు, పరోత్థశంక యనియు నిరుదెఱఁగు లౌను. స్వకార్యమువలన కలుగునది స్వోత్థశంక. ఇందుఁగల ఇంగితములు ఱెప్ప, కనుబొమలు, నల్లగ్రుడ్లు, చూపు వీనియందు గలుగువికారములు. ఇతరుల ఆకారమువలన గలుగు చెమట పరోత్థశంక యనఁబడును. వరుసగా నాకారచేష్టాదులచే నీరెండువిధముల శంకను నూహింపవచ్చును. ఆకారము, సాత్వికము, చేష్టలు అంగప్రత్యంగములయుదు గలుగు క్రియాభేదములు.

అసూయాలక్షణం

పరసౌభాగ్యసంపత్తివిద్యాశౌర్యాదిహేతుభిః.

154


గుణే౽పి దోషారోపస్స్యాదసూయా తత్ర విక్రియాః,
ముఖాపవర్తనం గర్హా భ్రూభేదానాదరాదయః.

155

ఇతరుల సౌభాగ్యము, సంపత్తి, విద్య, శౌర్యము, మొదలగు హేతువులచే గుణమందుఁ గూడ దోషారోపణము చేయుట అసూయ యనఁబడును. ఇందు మోమును ద్రిప్పుట, నిందించుట, భ్రూభేదము, ఉపేక్ష ఇవి మొదలయినక్రియలు గలవు.

మదలక్షణం

మదస్త్వానందసమ్మోహసంభ్రమో మదిరాదిజః,
ప త్రిధా తరుణో మధ్యో౽పకృష్టశ్చేతి భేదతః.

156

మద మనునది మద్యము మొదలయినవానిచేఁ గలుగు ఆనందసమ్మోహములయొక్క సంభ్రమము. ఆమదము తరుణమదమనియు, మధ్యమదమనియు, అపకృష్టమదమనియు మూఁడువిధములు.

దృష్టిః స్మేరా ముఖే రాగః సస్మితాకులితం వచః,
లలితావిద్ధగత్యాద్యాశ్చేష్టాస్స్యు స్తరుణే మదే.

157

తరుణమదమందు గర్వపుఁజూపులు, ముఖమందు ఎఱుపు, చిఱునగవును సంభ్రమమును గలపలుకు, ఒయారపునడక, ఇవి మొదలయిన చేష్టలు కలుగును.

మధ్యమే తు మదే వాచి స్ఖలనం ఘూర్ణనం దృశోః,
గమనే వక్రతా బాహ్వోర్విక్షేపస్రస్తతాదయః.

158

మధ్యమమదమందు వాక్కున తడఁబాటు, గ్రుడ్లు తిరుగుట, వంకరగ నడచుట, చేతుల నాడించుట, వ్రేలవేయుట, మొదలయిన చేష్టలు గలవు.

అపకృష్టే తు చేష్టాస్స్యుర్గతిభంగో విసంజ్ఞతా,
నిష్ఠీవనం ముహుశ్శ్వాసోహిక్కా ఛర్ద్యాదయో మతాః.

159

అపకృష్ణమదమందు గతిభంగము, మూర్ఛిల్లుట, తెలివితప్పియుండుట, ఉమియుట, వెక్కిళ్లు, వాంతి మొదలయిన చేష్టలు గలుగును.

ఉత్తమప్రకృతిశ్శేతే మధ్యో హసతి గాయతి,
అధమప్రకృతిర్గ్రామ్యం పరుషం వక్తి రోదితి.

160

ఉత్తమమదమును గలవాఁడు పండుకొనియుండును. మధ్యమమదమును గలవాఁడు నవ్వుచుఁ బాడుచునుండును. అధమమదమును గలవాఁడు క్రూరముగను వికారముగను మాటలాడుచును దుఃఖించుచునుండును.

శ్రమలక్షణం

శ్రమో మానసఖేదస్స్యాదధ్వనృత్తరతాదిభిః,
అంగమర్దననిశ్వాసపాదసంవాహనాని చ.

161

జృంభణం మందయానత్వం ముఖనేత్రవికూణనమ్,
సీత్కృతిశ్చేతి విజ్ఞేయా అనుభావాశ్శ్రమోస్థితాః.

162

త్రోవనడచుట, నృత్తమాడుట, క్రీడ మొదలయిన వ్యాపారములచే గలుగు మానసభేదము శ్రమ మనఁబడును. ఇందు అంగమర్దనము, నిట్టూర్పు, కాళ్లు పిసుకుట, ఆవలింత, మందముగ నడచుట, ముఖమును కన్నులను వంకర చేసికొనుట, సత్కారము చేయుట ఈ అనుభావములు గలుగును.

ఆలస్యలక్షణం

స్వభావభయసౌహిత్యగర్వనిర్భయతాదిభిః,
కృచ్ఛాత్క్రియోన్ముఖత్వం యత్తదాలస్యమిహ క్రియాః.

163


అంగభంగక్రియాద్వేషజృంభణాక్షివిమర్దనాః,
శయ్యాసనైక ప్రియతా తంద్రీనిద్రాదయో౽పి చ.

164

స్వభావము, భయము, తృప్తి, గర్వము, భయములేకయుండుట మొదలగువానిచేత కష్టమున పనులను జేయ యత్నించుట, ఆలస్య మనఁబడును. ఇందు అంగభంగము, క్రియాద్వేషము, ఆవలింత, నేత్రములు నలుపుట, పండుకొనుటయందును కూర్చుండుటయందును ముఖ్యముగా ప్రియము గలుగుట, కన్నులు మూతలుపడుట, నిదుర మొదలయిన క్రియలు గలుగును.

దైన్యలక్షణం

హృత్తాపదుర్గతత్వాద్యైరనౌధ్ధత్యం హి దీనతా,
అత్రానుభావా మాలిన్యగాత్రస్తంభాదయో మతాః.

165

మనస్తాపము, పేదఱికము మొదలయినవానిచేఁ గలుగు అణఁకువ దైన్య మనఁబడును. ఇందుకు మాలిన్యదేహస్తంభాద్యనుభావములు గలుగును.

చింతాలక్షణం

ఇష్టవస్త్వపరిప్రాప్తేరైశ్వర్యభ్రంశనాదిభిః,
చింతా ధ్యానాత్మికా తస్యామనుభావా భవంత్యమీ.

166

కార్శ్యాధోముఖ్యసంతాపనిశ్వాసోచ్ఛ్వసనాదయః,

ప్రియవస్తువులు లభించనందువలన నైశ్వర్యభ్రంశనము మొదలయినవానిచేతఁ గలుగుధ్యానము చింత యనఁబడును. ఇందు మేను చిక్కుట, తలవంపు, సంతాపము, నిట్టూర్పు మొదలయినవి గలుగును.

మోహలక్షణం

ఆపద్భీతివియోగాద్యైర్మోహశ్చిత్తస్య మూఢతా,
విక్రియాస్తత్ర విజ్ఞేయా ఇంద్రియాణాం చ శూన్యతా.

167


నిశ్చేష్టతాంగభ్రమణపతనాఘూర్ణనాదయః,

ఆపత్తు, భయము, వియోగము మొదలైనవానిచే మనస్సున కేమియుఁ దెలియకపోవుట మోహ మనఁబడును. ఇందు ఇంద్రియములు శూన్యముగ నుండుట, చేష్టలు లేకయుండుట, దేహము తిరుగుట, గ్రుడ్లు గిరగిరలాడుట ఇవి మొదలైనవి క్రియలు గలుగును.

ధృతిలక్షణం

జ్ఞానవిజ్ఞానగుర్వాది భక్తేర్నానార్థసిద్ధితః.

168


లజ్జాదిభిశ్చ చిత్తస్య నైస్సృహ్యం ధృతిరుచ్యతే,
అత్రానుభావా విజ్ఞేయా ప్రాప్తార్థానుభవస్తథా.

169


అప్రాప్తాతీతనష్టార్థానభిసంక్షోభణాదయః,

మోక్షవిషయకజ్ఞానము, శాస్త్రజ్ఞానము, గురుభక్తి, నానావిషయములసిద్ధి, సిగ్గు మొదలైనవానిచేత మనస్సునకు ఇచ్ఛ లేకయుండుట ధృత యనఁబడును. ఇందు లభించినదానిని అనుభవించుట; పొందఁబడనివిషయములు, కడచిన విషయములు, నష్టవిషయములు వీనికిగా మనస్సున చింతలేక

యండుట, మొదలయినవి గలుగును.

స్మృతిలక్షణం

స్వతశ్చిత్తదృఢాభ్యాసాత్ సదృశాలోకనాదిభిః.

170


స్మృతిః పూర్వానుభూతార్థప్రతీతిస్తత్ర విక్రియాః,
కంపనోద్వేపనే మూర్ధ్నో భ్రూవిక్షేపాదయో౽పి చ.

171

మనోభ్యాసబలముచేత తనంతటను సమానవస్తువుల చూచుట మొదలైనవానిచేఁ గలుగు పూర్వానుభూతార్థజ్ఞానము స్మృతి యనఁబడును. ఇందు శిరస్సును ఆడించుట, ఊచుట, కనుబొమలవిశేషాపములు మొదలైనవి గలుగును.

వ్రీడాలక్షణం

అకార్యకరణావజ్ఞాస్తుతినూతనసంగమైః,
ప్రతీకారక్రియాద్యైశ్చ వ్రీ డా త్వనతిధృష్టతా.

172


తత్ర చేష్టా నిగూఢోక్తిరాధోముఖ్యవిచింతనే,
అనిర్గమో బహిర్వాపి దూరాదేవావకుంఠనం.

173


నఖానాం కృంతనం భూమిలేఖనం చైవమాదయః,

అకార్యముఁ జేయుట, అవమానము, స్తోత్రము, నూతనసంగమము, ప్రతికారక్రియ మొదలైనవానిచేత అతిధార్ష్ట్యములేకయుండుట వ్రీడ యనఁబడును. ఇందు మఱుఁగుగ మాటాడుట, తలవంచుట, యోచించుట, బయట రాకుండుట, దూరముగానే ముసుగిడుట, గోళ్లు గిల్లుట, నేలగీరుట ఇవి మొదలైనవి గలుగును.

చపలతాలక్షణం

రాగద్వేషాదిభిశ్చిత్తే లాఘవం చాపలం భవేత్.

174


చేష్టాస్తత్రావిచారేణ పరిరంభావలోకనే,
నిష్కాసనోక్తిపారుష్యే తాడనాజ్ఞాపనాదయః.

175

ఆస, ద్వేషము, మొదలైనవానిచే మనస్సులోఁ గలుగు లాఘవము చాపల మౌను. అందు యోచింపక కౌగిలించుకొనుట, చూచుట, వెళ్లుమనుట, కఠినపుమాటలు, కొట్టుట, ఆజ్ఞాపించుట మొదలైనచేష్టలు గలుగును.

హర్షలక్షణం

మనోరథస్య లాభేన సిద్ధియోగ్యస్య వస్తునః,
మిత్రసంగాచ్చ దేవాదిప్రసాదేన చ కల్పితః.

176


మనఃప్రసాదో హర్షస్స్యాదత్ర నేత్రాస్యఫుల్లతా,
ప్రియభాషణమాశ్లేషః పులకానాం ప్రరోహణం.

177


స్వేదోద్గమశ్చ హస్తేన హస్తసంతాడనాదయః,

మనోరథముయొక్క సిద్ధియోగ్యమైనవస్తువుయొక్క లాభముచేతను, మిత్రుల సంగమముచేతను, దేవతాదులప్రసాదముచేతను గలిగింపఁబడిన మనఃప్రసాదము హర్ష మనఁబడును. ఇందు ముఖము కన్నులు వికసించుట, ప్రియము పలుకులు, కౌఁగిలించుట, పులకరించుట, చెమట గలుగుట, చేతులు తట్టుట మొదలైనవి గలుగును.

ఆవేగలక్షణం

చిత్తస్య సంభ్రమో యస్స్యాదావేగో౽యం స చాష్టథా.

178


ఉత్పాతవాతవర్షాగ్నిమత్తకుంజరదర్శనాత్,
ప్రియాప్రియశ్రుతేశ్చాపి శాత్రవవ్యసనాదపి.

179
మనసుయొక్క తడబాటు ఆవేగమౌను. ఆయావేగము ఉత్పాతావేగమనియు, వాతావేగమనియు, వర్షావేగమనియు, అగ్న్యావేగమనియు, మత్తకుంజరదర్శనావేగమనియు, ప్రియశ్రవణావేగమనియు, అప్రియశ్రవణావేగమనియు, శాత్రవవ్యసనావేగమనియు కారణానుసారముగా నెనిమిదితెఱఁగు లగును.

ఉత్పాతావేగో యథా

తత్రోత్పాతస్తు శైలాదికంపకేతూదయాదయః,
తజ్ఞస్సర్వాంగవిస్రంపో వైమనస్యావసర్పణే.

180

అందు కొండ మొదలైనవి కదలుట, తోఁకచుక్క పుట్టుట మొదలైనవి ఉత్పాత మాను. దీనివలన గలిగిన సర్వాంగవిస్రంసము, వైమనస్యము, అపసర్పణము ఇవి ఉత్పాతావేగ మనఁబడును.

వాతావేగో యథా

త్వరయా గమనం వస్త్రాహరణం చాపకుంఠనం,
నేత్రావమార్జనాద్యాశ్చ వాతావేగభవాః క్రియాః.

181

వేగముగ నడచుట, వస్త్రములను తీసికొనుట, కప్పుకొనుట, కన్నులను తుడుచుకొనుట మొదలైనవి పెద్దగాలిచేఁ గలుగు క్రియయలు.

వర్షావేగో యథా

ఛత్రగ్రహో౽౦గసంకోచబాహుస్వస్తికధావనే,
ఛన్నాశ్రయణమిత్యాద్యా వర్షావేగభవాః క్రియాః.

182

గొడుగును గ్రహించుట, దేహము చిన్నదవుట, చేతులను భుజమూలములయందుఁ జేర్చుట, పరుగిడుట, గుప్తస్థలము నాశ్రయించుట మొదలైనవి వర్షావేగముచేఁ గలుగు క్రియలు.

అగ్న్యావేగో యథా

అగ్న్యావేగభవాశ్చేష్టా వీజనం చాంగధూననం,
వ్యత్యస్తపాదవిక్షేపనేత్రసంకోచనాదయః.

183
అగ్న్యావేగమందుఁ గలుగుచేష్టలు వీజనము, అంగధూననము, వ్యత్యాసముగ నడుగులుంచుట, నేత్రసంకోచము ఇవి మొదలైనవి.

మత్తకుంజరదర్శనావేగో యథా

ఆవేగే కుంజరోద్భూతే సత్వరం వాపసర్పణం,
విలోకనం ముహుః పార్శ్వే త్రాసకంపాదయో౽పి చ.

184

ఏనుఁగుచేఁ గలుగు నావేగమందు త్వరగా పరుగెత్తిపోవుట, ప్రక్కకు తిరిగి తిరిగిచూచుట, భయము, వణకు మొదలైనవి గలుగును.

ప్రియశ్రవణజావేగో యథా

ప్రియశ్రవణజే౽ప్యస్మిన్నభ్యుత్థానోపగూహనే,
ప్రీతిదానం ప్రియం వాక్యం రోమహర్షాదయో౽పి చ.

185

ఈప్రియశ్రవణజావేగమందు అభ్యుత్థానము, ఆలింగనము జేసికొనుట, ప్రీతిపురస్సరముగ వస్త్రాభరణాదుల నిచ్చుట, ప్రియమైన వాక్యము, రోమాంచము మొదలైనవి గలుగును.

అప్రియశ్రవణావేగో యథా

.

అప్రియశ్రుతిజే౽ప్యస్మిన్విలాపః పరిలుంఠనం,
ఆక్రందితం చ పతనం పరితో భ్రమణాదయః.

186

అప్రియశ్రవణావేగమందు ఏడుపు, పొరలాడుట, మొరపెట్టుట, క్రిందఁబడుట, అంతటఁ దిరుగుట మొదలైనవి గలుగును.

శాత్రవవ్యసనావేగో యథా

చేష్టాస్స్యుశ్శాత్రవావేగే వర్మశస్త్రాదిధారణం,
గజవాజిరథారోహ సహసా విక్రమాదయః.

187


ఏతే స్యురుత్తమాదీనామనుభావా యథోచితం,

శాత్రవావేగమందు కవచము ఆయుధము మొదలైనవస్తువులను ధరించుట, ఏనుఁగు గుఱ్ఱము రథము వీని నెక్కుట, త్వరగా విక్రమించుట మొదలైనవి గలుగును. ఇవి ఉత్తమాదులకు యథోచితముగఁ గలుగును.

జడతాలక్షణం

జాడ్యమప్రతిపత్తిస్స్యాదిష్టానిష్టార్థయోశ్శ్రుతేః.

188


వృష్టేర్వా విరహాదిభ్యః క్రియాస్తత్రానిమేషతా,
అశ్రుతిః పారవశ్యం చ తూష్ణీంభావాదయో౽పి చ.

189

ఇష్టార్ధము అనిష్టారము వీనివినికివలనఁ గాని, వర్షమువలనఁగాని, విరహము మొదలైనవానివలన గాని కలుగు అజ్ఞానము జాడ్య మాను. ఇందు ఱెప్పపాటు లేకయుండుట, చెవులు వినకయుండుట, పరవశుఁ డౌట, ఊరకయుండుట మొదలగు చేష్టలు గలుగును.

గర్వలక్షణం

ఐశ్వర్యరూపతారుణ్యకులవిద్యాబలైరపి,
ఇష్టలాభాదినాన్యేషామవజ్ఞా గర్వ ఉచ్యతే.

190


అనుభావా భవంత్యత్ర గుర్వాద్యాజ్ఞావ్యతిక్రమః,
అనుగ్రహప్రదానం చ వైముఖ్యాభాషణాదయః.

191


విభ్రమాపహ్నుతీవాక్యపారుష్యమనవేక్షణం,
ఆవేక్షణం నిజాంగానామంగభేదాదయో౽పి చ.

192

ఐశ్వర్యము, రూపము, యౌవనము, కులము, విద్య, బలము, ఇష్టలాభము మొదలైనవానిచేత నొరుల నవమానించుట గర్వ మనఁబడును. ఇందు అహంభావము, ఆజ్ఞోల్లంఘనము, అనుగ్రహప్రదానము, మోము త్రిప్పుకొనుట, మాటలాడకయుండుట, మొదలైనవియు, పరుషముగ మాటలాడుట, చూడకయుండుట, తనయవయవములను జూచుకొనుట, ఒడలు విఱుచుకొనుట మొదలైనయనుభావములు గలుగును.

విషాదలక్షణం

ప్రారబ్ధకార్యానిర్వాహాదిష్టాప్రాస్తేర్విపత్తితః,
అపరాధపరిజ్ఞానాదనుతాపస్తు యో భవేత్.

193

విషాద ఇతి విఖ్యాతో భరతార్ణవపారగైః,
స విషాదస్త్రిధా జ్యేష్ఠమధ్యమాధమసంశ్రయాత్.

194

తానారంభించినపని సాగకుండుట, ఇష్టపదార్థాప్రాప్తి, విపత్తు, తప్పు వీనివలనఁ గలుగు ననుతాపము విషాద మనఁబడును. ఆవిషాదము ఉత్తమ, మధ్యమ, అధమముల యాశ్రయమువలన మూఁడుతెఱఁగులు గలది యగును.

జ్యేష్ఠవిషాదో యథా

సహాయాన్వేషణోపాయచింతాద్యా ఉత్తమే స్మృతాః,

ఉత్తమునివిషాదమందు సహాయమును వెతుకుట, ఉపాయచింత మొదలైనవ్యాపారములు గలుగును.

మధ్యమవిషాదో యథా

అనుత్సాహశ్చ వైచింత్యం వైక్లబ్య మవిలోకనం.

195


విషాదే మధ్యమే ప్రోక్తా భ్రాంత్యాద్యాశ్చైవ విక్రియాః,

మధ్యమునివిషాదమందు ఉత్సాహము లేకయుండుట, మిక్కిలి చింతించుట, కార్యాకార్యములు తెలియక యుండుట, ఎవరిని తలయెత్తి చూడకుండుట, భ్రమించుట మొదలయిన క్రియలు గలుగును.

అధమవిషాదో యథా

రోదనశ్వసితధ్యానముఖకోణాదయో౽ధమే.

అధమునివిషాదమందు రోదనము, నిట్టూర్పు, ధ్యానము, ముఖము వంకర మొదలైనవి గలుగును.

ఔత్సుక్యలక్షణం

కాలాక్షమత్వమౌత్సుక్యం అభిలాషాదిహేతుజం,
త్వరయా గమనం శయ్యాస్థితేరుత్థానచింతనే.

197

శరీర గౌరవాద్యాశ్చ అనుభావా ఇహ స్మృతాః,

ఆస మొదలైనవానిచేఁ గలుగుజాగును తాళలేకయుండుట ఔత్సుక్య మనఁబడును. ఇందు వేగముగ నడచుట, పడకలోనుండి లేచుట, చింతించుట, శరీరము బరువగుట మొదలైనవి గలుగును.

నిద్రాలక్షణం

మందస్వభావవ్యాయామనిశ్చింతత్వసమాధిభిః.

198


మనోనిమీలనం నిద్రా చేష్టా స్తత్రాస్యగౌరవం,
ఆఘూర్ణమాననేత్రత్వమంగానాం పరివర్తనం.

199


నిశ్వాసోచ్ఛ్వసితే గాత్రస్వేదో నేత్రనిమీలనం,
శరీరస్య తు సంకోచో జాడ్యం చేత్యేవమాదయః.

200

మందస్వభావము, వ్యాయామము, నిశ్చింతత, సమాధి, వీనిచేఁ గలుగు మనోనిమీలనము నిద్ర యనఁబడును. ఇందు ముఖగౌరవము, కన్నులు జొలాయించుట, అంగములపరివర్తనము, ఉచ్ఛ్వాసనిశ్వాసములు, దేహమందు చెమటపోయుట, నేత్రములు మూతపడుట, దేహసంకోచము, తెలివిలేకయుండుట ఇవి గలుగును.

అపస్మారలక్షణం

ధాతువైషమ్యదోషేణ భూతావేశాదినా కృతః,
చిత్తక్షోభస్త్వపస్మారః తత్ర చేష్టాః ప్రకంపనం.

201


ధావనం పతనం స్తంభో భ్రమణం నేత్రవిక్రియా,
స్ఫోటదంశభుజాక్షేపలాలాఫేనాదయో౽పి చ.

202

వాతపితశ్లేష్మధాతువుల హెచ్చుతక్కువ, దోషము, దయ్యము సోకుట మొదలైనవానిచేతఁ జేయఁబడిన మనస్సుయొక్క క్షోభము అపస్మార మనఁబడును. ఇందు వణకుట, పరుగెత్తుట, పడుట, కదలకుండుట, తిరుగుట, నేత్ర ములవిక్రియ, స్ఫోటము (భేదనము) పండ్లుకొఱుకుట, చేతులు విసరుట, చొల్లకారుట, నురుగు గలుగుట మొదలైనవి గలుగును.

సుప్తిలక్షణం

ఉద్రేక ఏవ నిద్రాయాస్సుప్తిస్స్యాత్తత్ర విక్రియాః,
ఇంద్రియోపరతిర్నేత్రమాలనం స్రస్తగాత్రతా.

203


ఉత్స్వప్నాయతనైశ్చల్యశ్వాసోచ్ఛ్వాసాదయో౽పి చ,

నిదురయొక్క ఆధిక్యమే సుప్తి యనఁబడును. ఇంద్రియములు ఉపరతిని బొందియుండుట, కన్నులు మూసియుండుట, గాత్రము స్రస్తమైయుండుట, కలగనుట, దీర్ఘకాలము కదలకయుండుట, ఉచ్ఛ్వాసనిశ్వాసములు మొదలైనవి గలుగును.

విబోధలక్షణం

విబోధశ్చేతనావాప్తిశ్చేష్టాస్తత్రాక్షిమర్దనం.

204


శయ్యాయా మోక్షణం బాహువిక్షేపో౽౦గుళిమోటనం,
శిరఃకండూయనం చాంగవలనం చైవమాదయః.

205

నిదుర మేలుకొనుట విబోధ మనఁబడును. ఇందు కన్నులు నలుపుకొనుట, పడకను విడుచుట, బాహువిక్షేపము, అంగుళిమోటనము, (బొటనవ్రేళ్లు లాగికొనుట), తలను గోకుకొనుట, దేహమును ద్రిప్పుట మొదలైనవి గలుగును.

అమర్షలక్షణం

అధిక్షేపావమానాద్యైః క్రోధో౽మర్ష ఇతీరితః,
తత్ర స్వేదశ్శిరఃకంప ఆధోముఖ్యవిచింతనే.

206


ఉపాయాన్వేషణోత్సాహవ్యవసాయాదయః క్రియాః,

తక్కువ చేయుట, అవమానము చేయుట మొదలయినవానిచేతఁ గలుగు క్రోధము అమర్ష మనఁబడును. అందు స్వేదము, శిరఃకంపము, తలవంచుకొనుట, చింతించుట, ఉపాయములను వెతకుట, ఉత్సాహము, వ్యవసాయము మొదలయినవి గలుగును.

అవహిత్థాలక్షణం

అవహిత్థాకారగుప్తిః ధైర్యప్రాభవనీతిభిః.

207


లజ్జాసాధ్వసదాక్షిణ్యప్రాగల్భ్యాపజయాదిభిః,
అన్యథాపాదనం మిత్థ్యాధైర్యమన్యత్రవీక్షణం.

208


కథాభంగాదయో౽ప్యస్యా అనుభావా భవంత్యమీ,

ధైర్యము, ప్రాభవము, నీతి, సిగ్గు, సాధ్వసము, దాక్షిణ్యము, ప్రాగల్ఫ్యము, అపజయము ఇవి మొదలయినవానిచేఁ గలుగు ఆకారగుప్తి అవహిత్థ యనఁబడును. ఇందు వేరుగఁ జెప్పుట, అబద్ధపుధైర్యము, మఱియొకప్రక్క చూచుట, కథాభంగము మొదలయినవి గలుగును.

ఉగ్రతాలక్షణం

అపరాధాపమానాభ్యాం చౌర్యనిగ్రహణాదిభిః.

209


అసత్ప్రలాపనాద్యైశ్చ కృతం తూర్ణత్వముగ్రతా,
క్రియాస్తత్రాస్య నయనరాగో బంధనతాడనే.

210


శిరసః కంపనం స్వేదవర్ధనం భర్త్సనాదయః,

అపరాధము, అవమానము, దొంగతనము, నిగ్రహము, అసత్ప్రలాపము మొదలయినవానిచేఁ జేయఁబడినత్వర ఉగ్రత యనఁబడును. అందు కన్నులు ముఖము ఎఱ్ఱనౌట, బంధించుట, కొట్టుట, తలయాడించుట, చెమట పోయుట, బెదరించుట మొదలయినవి కలుగును.

మతిలక్షణం

నానాశాస్త్రార్థకథనాదర్థనిర్ధారణం మతిః.

211


అత్ర చేష్టాస్తు కర్తవ్యకరణం సంశయక్షిపా,
శిష్యోపదేశో భ్రూక్షేప ఊహాపోహాదయో౽పి చ.

212

అనేకశాస్త్రార్థములను జెప్పుటవలనఁ గలుగు అర్ధనిర్ణయయము మతి యనఁబడును. ఇందు యుక్తమగుపనులను జేయుట, సంశయమును బోఁగొట్టుట, శిష్యోపదేశము, కనుబొమల నాడించుట, ఊహాపోహములు మొదలయినవి గలుగును.

వ్యాధిలక్షణం

దోషోద్రేకవియోగాద్యైః జ్వరాత్మా వ్యాధిరుచ్యతే,
గాత్రస్తంభః శథాంగత్వం కూజితం ముఖకూణనం.

213


వృథాకృతాంగవిక్షేపో నిశ్వాసాద్యాస్తు విక్రియాః,
స శీతోదాహయుక్తశ్చ ద్వివిధః పరికీర్తితః.

214

దోషోద్రేకముచేతను, వియోగాదులచేతను గలుగుజ్వరము వ్యాధి యనఁబడును. ఇందు దేహము స్తంభించుట అంగము బిగి తగ్గుట, అఱచుట, ముఖము వంకరపోవుట, వ్యర్థముగ నంగవిక్షేషముఁ జేయుట, నిట్టూర్పు మొదలయినవి గలుగును. ఆజ్వరము శీతజ్వరమని, దాహజ్వరమనిన్ని ఇరుదెరంగు లౌను.

శీతజ్వరవ్యాధిర్యథా

శీతజ్వరే తు చేప్టాస్స్యుస్సంతాపశ్చాంగసాదనం,
హనుసంచలనం బాష్పః సర్వాంగోత్కంపకూజితే.

215


జానుకంపనరోమాంచముఖశోషాదయో౽పి చ,

శీతజ్వరమందు తాపము, దేహము చిక్కుట, చెక్కిళ్లు చలించుట, కన్నీరు, సర్వాంగమును వణకుట, అఱచుట, మోకాళ్లు వణకుట, పులకరింపు, ముఖము వాడుట, మొదలయినవి గలుగును.

దాహజ్వరో యథా

దాహజ్వరే తు విజ్ఞేయాశ్శీతమాల్యాదిధారణం.

216


పాణిపాదపరిక్షేపముఖశోషాదయో౽పి చ,

దాహజ్వరమందు చల్లనిపూలదండ మొదలయినవానిని ధరించుట, చేతులు కాళ్లు ఎత్తెత్తివేయుట, మొగము వాడిపోవుట మొదలయినవి గలుగును.

ఉన్మాదలక్షణం

ఉన్మాదశ్చిత్తవిభ్రాంతిః వియోగాదిష్టనాశతః.

217

వియోగము, ఇష్టనాశనము వీనివలన గలుగు చిత్తవిభ్రమము ఉన్మాద మనఁబడును.

వియోగజోన్మాదో యథా

వియోగజే తు చేష్టాస్స్యుర్ధావనం పరిదేవనం,
అసంబద్ధప్రలపనం శయనం సహసోద్ధతిః.

218


అచేతనైస్సహాలాపో నిర్నిమిత్తస్మితాదయః,

వియోగజోన్మాదమందు పరుగెత్తుట, పరిదేవనము, సంబంధము లేనిపలుకులు పలుకుట, పండుకొనియుండుట, త్వరగా లేచుట, ప్రాణములేనివానితో మాటలాడుట, కారణములేక నవ్వుట, మొదలయినవి గలుగును.

ఇష్టనాశోన్మాదో యథా

ఇష్టనాశకృతోన్మాదే భస్మాదిపరిలేపనం.

219


నృత్తగీతాదిరచనా తృణాదేర్మాల్యధారణం,
అత్రోన్మాదే౽పి సకలా ప్రాగుక్తా విక్రియా మతాః.

220

ఇష్టనాశోన్మాదమందు భస్మము మొదలయినవానిని బూసికొనుట, నృత్తము గీతము మొదలయినవి చేయుట, తృణము మొదలయినవానిదండలను ధరించుట, ఇవియును వియోగజోన్మాదమందుఁ జెప్పినక్రియలును గలుగును.

మరణలక్షణం

వాయోర్ధనంజయస్యాపి విప్రయోగో మహాత్మనః,
శరీరావచ్ఛేదవతో మరణం నామ తద్భవేత్.

221

ఏతచ్చ ద్వివిధం ప్రోక్తం వ్యాధిజం చాభిఘాతజం,

సర్వాంగవ్యాపిగానుండు ధనంజయవాయువుయొక్క నిర్గమము మరణ మనఁబడును. ఈమరణము వ్యాధిజమని, అభిఘాతజమని, ఇరుదెఱఁగు లౌను.

వ్యాధిజమరణం యథా

ఆద్యే త్వసాధ్యహృచ్ఛూలా విషూచ్యాదిసముద్భవే.

222


అనుభావా అమీ ప్రోక్తా అవ్యక్తాక్షరభాషణం,
వివర్ణగాత్రతా మందశ్వాసోక్తిస్తంభమీలనాః.

223


హిక్కా పరిజనాపేక్షా నిశ్చేష్టే౦ద్రియతాదయః,

అసాధ్యమైన హృద్రోగము విషూచి మొదలయినవానిచేతఁ గలుగునది వ్యాధిజమరణ మందు కొతుకుచు మాటలాడుట, దేహకాంతి మాఱిపోవుట, మెల్లఁగా శ్వాసము విడుచుట, మాట నిలిచిపోవుట, నేత్రమీలనము, హిక్క, పరిజనముల నపేక్షించుట, ఇంద్రియచేష్ట లణఁగుట, మొదలయినవి గలుగును.

అభిఘాతమరణం యథా

ద్వితీయం ఘాతపతనదేహోద్బంధవిషాదిజం.

224


తత్ర ఘాతభవే భూమిపతనక్రందనాదయః,
విషం తు వత్సనాభాద్యమష్టావేతా స్తదుద్భవాః.

225


కార్శ్యం కంపో దాహో హిక్కా ఫేనశ్చ కంధరాభంగః,
జడతా మృతిరితి కథితాః పతనాద్యభిఘాతజాశ్చేష్టాః.

226
ఘాతము, పడుట, దేహబంధనము, విషము, వీనిచేఁ గలుగునది యభిమాతజమరణము. అందు ఘాతజమందు నేలఁబడుట, ఏడ్చుట, మొదలయినవి. వసనాభి మొదలయినది విషము. పతనాదులయిన యభిఘాతమువలనఁ గలుగు చేష్టలు - చిక్కిపోవుట, వణఁకుట, తాపము, హిక్క, ఘనము, కంధరాభంగము, జడత, మరణము మొదలయినవి.

త్రాసలక్షణం

త్రాసస్స్యాచ్చిత్తచాంచల్యం విద్యుత్క్రవ్యాదగర్జితైః,
తథాభూతభుజంగాద్యైర్విజ్ఞేయా స్తత్ర విక్రియాః.

227


ఉత్కంపగాత్రసంకోచ రోమాంచ స్తంభగద్గదాః,
ముహుర్నిమేషో విభ్రాంతి పార్శ్వస్థాలంబనాచయః.

228

మెఱపు, రాక్షసులు, ఉఱుము, పిశాచము, సర్పము మొదలైనవానిచేఁ గలుగు చిత్తచాంచల్యము త్రాస మనఁబడును. ఇందు ఉత్కంపము, దేహసంకోచము, రోమాంచము, స్తంభము, గద్గదము, అడుగడుగునకు ఱెప్పపాట్లు, భ్రమ, ప్రక్కనుండువారిని పట్టుకొనుట మొదలయినవి గలుగును.

వితర్కలక్షణం

ఊహో వితర్కస్సందేహవిమర్శప్రత్యయాదిభిః,
జనితో నిర్ణయో౽ర్థస్య అసత్యస్సత్య ఏవ చ.

229


అత్రానుభావాస్స్యురమీ భ్రూశిరఃకంపనాదయః,

సందేహము, నిశ్చయము మొదలయినవానిచేఁ గలుగు ఊహాత్మకమును సత్యాసత్యనిర్ణయము వితర్క మనఁబడును. దీనియందు కనుబొమ లెగురవేయుట, తలయాడించుట మొదలయిన యనుభావములు గలుగును.

ఉత్తమాధమమధ్యేషు సాత్వికవ్యభిచారిణః.

230


విభావా అనుభావాశ్చ వర్ణనీయా యథోచితం,

ఉత్తమ అధమ మధ్యమ స్వభావముగలవారియందు విభావానుభావసాత్వికభావవ్యభిచారిభావములు యథోచితముగ వర్ణింపఁదగినవి.

స్వాతంత్ర్యాత్పారతంత్ర్యాచ్ఛ ద్వివిధా వ్యభిచారిణః.

231


వరపోషకతాం ప్రాప్తాః పరతంత్రా ఇతీరితాః,
తదభావే స్వతంత్రాస్స్యుః భావా ఇతి చ తే స్మృతాః.

232

వ్యభిచారిభావములు స్వాతంత్ర్యపారతంత్ర్యములవలన ఇరుదెఱఁగు లౌచున్నవి. ఇతరపోషణమును బొందినపుడు పరతంత్రములనియును, అటు లేకున్నపుడు స్వతంత్రములనియును జెప్పఁబడును.

వ్యభిచారిభావానాం దశాచతుష్టయలక్షణం

ఉత్పత్తసంధిశాబళ్యశాంతయో వ్యభిచారిణాం,
దశాశ్చతస్రస్స్యుస్తేషాముత్పత్తిర్భావసంభవః.

233


సరూపమసరూపం వా భిన్నకారణకల్పితం,
భావద్వయం మిళతి చేత్స సంధిరితి కథ్యతే.

234


శబళత్వం హి భావానాం సంమర్దస్స్యాత్పరస్పరం,
అత్యారూఢస్య భావస్య విలయశ్శాంతిరుచ్యతే.

235

ఉత్పత్తియని, సంధియని, శాబళ్యమని, శాంతియనియు వ్యభిచారిభావములకు నాలుగవస్థలు గలవు. ఇందు ఉత్పత్తియనునది భావము గలుగుట. సరూపములైనను, అసమానరూపములైనను భిన్నకారణములచేతఁ గల్పితములైన రెండుభావములు చేరెనేని సంధి యనఁబడును. భావములు ఒకదాని నొకటి యొరయుట శబళత్వ మనఁబడును. అత్యారూఢమైన భావముయొక్క లయము శాంతి యనఁబడును.

అభాసతా భవేదేషామనౌచిత్యప్రవర్తనం,
అసత్యత్వాదయోగ్యత్వాదనౌచిత్యం ద్విధా మతం.

236

ఈభావములకు అనౌచిత్యప్రవర్తనము ఆభాసత యనఁబడును. ఆయనౌచిత్యము అసత్యానౌచిత్యమనియు, అయోగ్యానౌచిత్యమనియు ఇరుదెఱఁగు లౌను.

అనౌచిత్యద్వితయలక్షణం

అసత్యత్వకృతం తత్స్యాదచేతనగతం తు యత్,
అయోగ్యత్వకృతం ప్రోక్తం నీచతిర్యగ్జడాశ్రయం.

237

అచేతనగతమై యుండునది అసత్యముచేతఁ జేయఁబడినది యగును. నీచతిర్యగ్జడాశ్రయమైయుండునది అయోగ్యత్వకృతమని చెప్పఁబడును.

అథ స్థాయినో నిరూప్యంతే

సజాతీయై ర్విజాతీయై ర్భావై ర్యేత్వతిరస్కృతాః,
క్షీరాబ్ధివన్నయంత్యన్యాన్ స్వాత్మత్వం స్థాయినో హి తే.

238


తే త్వష్టావితి విజ్ఞేయాః స్థాయినో మునిసమ్మతాః,
రత్యుత్సాహ చ శోకశ్చ విస్మయశ్చ తతఃపరం.

239


హాసో భయజుగుప్సే చ క్రోధో నాట్యే ప్రకీర్తితాః,

సజాతీయవిజాతీయభావములచేత అతిరస్కృతములై క్షీరసముద్రమువలెనే ఇతరభావములను స్వాత్మత్వమును బొందించుకొనునవి స్థాయిభావములు. అవి యెనిమిదివిధములని ఋషులచే నొప్పఁబడినవి. వానిపేళ్ళు వివరింపబడుచున్నవి. రతి, ఉత్సాహము, శోకము, విస్మయము, హాసము, భయము, జుగుప్స, క్రోధము ఇది నాట్యమందుఁ జెప్పఁబడినవి.

రతిస్థాయిలక్షణం

యూనోరన్యోన్యవిషయా స్థాయినీచ్ఛారతిర్భవేత్.

240


నిసర్గేణాభియోగేన సంసర్గేణాభిమానతః,
ఆత్మోపమాదివిషయై రేతాస్స్యుస్తత్ర విక్రియాః.

241


కటాక్షపాతభ్రూక్షేపప్రియవాగాదయో౽పి చ,

స్వభావము, సహవాసము, సంబంధము, అభిమానము, ఆత్మోపమాదివిషయములు. వీనిచేత నాయికానాయకులమనసున గలుగు అన్యోన్యవిషయమైన ఇచ్ఛావిశేషము రతిస్థాయి యౌను. అందు కడగంటిచూపు, కనుబొమ లెగురవేయుట, ప్రియవాక్యము మొదలైనవి గలుగును.

అంకురపల్లవకలికా ప్రసూనఫలభావభాగయం క్రమశః.

242


ప్రేమామానః ప్రణయః స్నేహో రాగో౽నురాగ ఇతి,

వరుసగ మొలక, చిగురు, మొగ్గ, పుష్పము, ఫలమును నగురతిస్థాయిభావము ప్రేమయని, మానమని, ప్రణయమని, స్నేహమని, రాగమని, అనురాగమని ఈపేళ్లను బొందుచున్నది.

ప్రేమలక్షణం

స ప్రేమా ప్రేమసహితం యూనోర్యద్భావబంధనం.

248

నాయికానాయకుల ప్రీతిసహితమైన మనస్సులకలయిక ప్రేమ యనఁబడును.

మానలక్షణం

యత్తు ప్రేమానుబంధేన స్వాతంత్ర్యాద్ధృదయంగమం,
బధ్నాతి భావకౌటిల్యం స మాన ఇతి గీయతే.

244

నాయికానాయకులకు ప్రేమబంధముచేత స్వాతంత్ర్యమువలనఁ గలుగు భావకౌటిల్యము మాన మనఁబడును.

ప్రణయలక్షణం

బాహ్యాంతరోపచారైర్యత్ప్రేమ మానోపకల్పితైః,
బధ్నాతి భావవిస్రంభం సో౽యం ప్రణయ ఉచ్యతే.

245

నాయికానాయకులమానోపకల్పితములైన బాహ్యాంతరోపచారములచేత భావవిస్రంభమును గలుగఁజేయుప్రేమ ప్రణయ మనఁబడును.

స్నేహలక్షణం

విస్రంభే పరమాం కాష్ఠామారూఢే దర్శనాదిభిః,
యత్ర ద్రవత్యంతరంగం స స్నేహ ఇతి కథ్యతే.

246


స త్రేధా కథ్యతే ప్రౌఢమందమధ్యమభేదతః,

నాయికానాయకులవిస్రంభము చూపు మొదలయినవానిచేత పూర్ణము కాఁగా ఏదశయందు మనసు కఱగుచున్నదో యది స్నేహ మనఁబడురు. ఆస్నే హము ప్రౌఢస్నేహమనియు, మందస్నేహమనియు, మధ్యస్నేహమనియు ముత్తెఱఁగులఁ జెప్పఁబడినది.

ప్రౌఢస్నేహలక్షణం

ప్రభానాదిభిరజ్ఞాతచిత్తవృత్తౌ ప్రియే జనే.

247


ఇతరక్లేశకారీ యః స ప్రౌఢస్నేహ ఉచ్యతే,

తోఁచుట మొదలయినవానిచేత నెఱుఁగఁబడని చిత్తవృత్తిగలనాయకుని యందు ఇతరక్లేశకారియైన స్నేహము ప్రౌఢస్నేహ మనఁబడును.

మందస్నేహలక్షణం

ద్వయోరన్యస్య మానాదౌ తదన్యస్య కరోతి యః.

248


నైవాపేక్షాం న చోపేక్షాం స స్నేహో మంద ఉచ్యతే,

నాయికానాయకులలో ఒకరికి కోపము మొదలయినవి కలిగియున్నప్పుడు రెండవవారికి ఉపేక్షాపేక్షలను జేయకయుండునది మందస్నేహ మనఁబడును.

మధ్యస్నేహలక్షణం

ఇతరానుభవాపేక్షా మీక్షతే యస్స మధ్యమః.

249

ఇతరానుభవాపేక్షను నెదురుచూచుచున్నది మధ్యమస్నేహ మనఁబడును.

రాగలక్షణం

దుఃఖమప్యధికం చిత్తే సుఖత్వేనైవ రజ్యతే,
యేన స్నేహప్రకర్షేణ స రాగ ఇతి కథ్యతే.

250


కుసుంభనీలమాంజిష్టరాగభేదేన స త్రిథా,

ఏస్నేహాతిశయమువలన మనసున దుఃఖము సుఖమువలెనే తోఁచుచున్నదో యది రాగ మనఁబడును. ఆరాగము కుసుంభరాగమనియు, నీలరాగమనియు, మాంజిష్టరాగమనియు ముత్తెఱఁగు లౌను.

కుసుంభరాగలక్షణం

కుసుంభరాగస్స జ్ఞేయో యశ్చిత్తే రజ్యతే క్షణాత్.

251


అతిప్రకాశమానో౽పి క్షణాదేవ వినశ్యతి,

ఏరాగము మనసున క్షణకాలముననే కలుగునదియును, అధికముగ ప్రకాశించుచున్నదైనను తత్క్షణమే మాఱునదియునో అది కుసుంభరాగ మనఁబడును.

నీలరాగలక్షణం

నీలరాగస్తు యస్సక్తో నాపై తి న చ దీప్యతే.

252

ఏది మనసున సక్తమై మాఱకుండను, ప్రకాశించకుండను నున్నదో యది నీలరాగ మనఁబడును.

మాంజిష్ట గలక్షణం

అచిరేణై వ సంసక్తశ్చిరాదపి న నశ్యతి,
అతీవ భాసతే యో౽సౌ మాంజిష్టో రాగ ఉచ్యతే.

253

ఏది చిత్తమందు త్వరగ సంసక్తమై యెన్నటికిని మాఱక ప్రకాశించుచున్నదో యది మాంజిష్టరాగ మనఁబడును.

అనురాగలక్షణం

రాగ ఏవ స్వసంవేద్యదశాప్రాప్త్యా ప్రకాశితః,
యావదాశ్రయవృత్తిశ్చేదనురాగ ఇతీరితః.

254


అన్యే ప్రీతిం రతేర్భేదమామనంతి మనీషిణః,

ముందుచెప్పినరాగమే తనసంవేద్యదశను పొందుటచేత ప్రకాశితమై ఆశ్రయ ముండువఱ కుండెనేని యది అనురాగ మనఁబడును. కొందఱు ప్రీతిని రతిభేదమని చెప్పుదురు.

ఉత్సాహస్థాయిలక్షణం

శక్తిధైర్యసహాయాద్యైశ్శీలశ్లాఘ్యేషు కర్మసు.

255


సత్వరా మానసీవృత్తి కుత్సాహస్తత్ర విక్రియాః,
కాలాద్యవేక్షణం ధైర్యత్యాగారంభాదయో౽పి చ.

256


సహజాహార్యభేదేన స ద్విధా పరికీర్తితః,

శీలశ్లాఘ్యములైన కార్యములయందు శక్తి, ధైర్యము, సహాయము మొదలయినవానిచేత త్వరగా ప్రవర్తించు మనోవ్యాపారము ఉత్సాహస్థాయి యౌను. అందు సమయమును జూచుట, ధైర్యము, త్యాగము, ఆరంభము మొదలైనవి గలుగును.ఇది సహజోత్సాహస్థాయి యనియు, ఆహార్యోత్సాహస్థాయి యనియు నిరుదెఱఁగు లౌను.

శోకస్థాయిలక్షణం

బంధువ్యాపత్తిదౌర్గత్యధననాశాదిభిః కృతః.

257


చిత్తక్లేశకరశ్శోకస్తత్ర చేష్టా వివర్ణతా,
బాష్పోద్గమో ముఖే శోషస్స్తంభనిశ్వసితాదయః.

258

బంధునిషయమైన విపత్తు, దుర్గతి, ధననాశము మొదలైనవానిచే గలుగు చిత్తక్లేశకరమైనవృత్తి శోకస్థాయి యనఁబడును. అందు దేహకాంతి మాఱుట, కన్నీరు కలుగుట, ముఖము వాఁడుట, స్తంభము, నిట్టూర్పు మొదలైనవి గలుగును.

విస్మయస్థాయిలక్షణం

లోకోత్తరపదార్థానామపూర్వాలోకనాదిభిః,
విస్తారశ్చేతసో యస్తు విస్మయస్స నిగద్యతే.

259

క్రియాస్తత్రాక్షివిస్తారో సాధూక్తిపులకాదయః,

లోకోత్తరమైనపదార్థములను అపూర్వముగఁ జూచుట, వీనిచేఁ గలుగు మనోవిస్తారము విస్మయస్థాయి యనఁబడును. ఇందు నేత్రవైశాల్యము, శ్లాఘించుట, పులకరింపు మొదలైనక్రియలు గలవు.

హాసస్థాయిలక్షణం

భాషణాకృతివేషాణాం క్రియాయాశ్చ వికారతః.

260


తౌల్యాదేవ పరస్థానా మేషామనుకృతేరపి,
వికారశ్చేతసో హాసస్తత్ర చేష్టాస్సమీరితాః.

261


దృష్టేర్వికాసో నాసోష్ఠకపోలస్పందనాదయః,

పలుకులు ఆకారము వేషము పని వీనివికారముచేతను, ఇవి పరస్థలవాసులవైనయెడ సహజముగా నుండినను, వెక్కిరించుటచేతను, గలుగు మనోవికారము హాసస్థాయి యనఁబడును. ఇందు వికారపుచూపు, ముక్కు పెదవి చెక్కిళ్లు వీనికదలిక మొదలైనవి గలుగును.

భయస్థాయిలక్షణం

భయం తు మంతునా ఘోరదర్శనశ్రవణాదిభిః.

262


చిత్తస్యాతీవ చాంచల్యం తత్ప్రాయో నీచమధ్యయోః,
ఉత్తమస్య తు జాయేత కరణైరతికారణైః.

263


అనుభావ్యో భవేత్కంపముఖసంశోషణాదిభిః,

ఆకస్మికముగా భయంకరవస్తువులను జూచుట వినుట మొదలైనవానిచేతను, తప్పిదముచేతను గలుగు మిక్కిలిచిత్తచాంచల్యము భయస్థాయి యనఁబడును. ఇది ఉత్తమ మధ్యమ నీచాశ్రయమై ముత్తెఱఁగు లౌను. దీనిని వణఁకుట, ముఖము వాడుట, మొదలైనవానిచే నెఱుఁగవచ్చును.

జుగుప్సాస్థాయిలక్షణం

అహృద్యానాం పదార్థానాం దర్శనశ్రవణాదిభిః.

264


మనస్సంకోచనం యత్సా జుగుప్సా తత్ర విక్రియాః,
నాసాపిధానం త్వరితా గతిరాస్యవికూణనం.

265


సర్వాంగధూననం కుత్సా ముహుర్నిష్ఠీవనాదయః,

అయోగ్యవస్తువులను జూచుట వినుట మొదలైనవానిచేఁ గలుగు మనస్సంకోచము జుగుప్సాస్థాయి యనఁబడును. ముక్కు మూసికొనుట, వేగముగఁ బోవుట, ముఖమును వంకర చేసికొనుట, సర్వాంగధూననము, అసహ్యపడుట, మాటిమాటికి ఉమ్మివేయుట మొదలైనవి గలుగును.

క్రోధస్థాయిలక్షణం

భవేత్ప్రజ్వలనం క్రోధః పురాక్షేపాదిసంభవః.

266


ఫుల్లనాసాపుటోద్వృత్త తారకాద్యనుభావయుక్,
శత్రుభృత్యసుహృత్పూజ్యాశ్చత్వారో విషయా మతాః.

267

పురాక్షేపాదులచేఁ గలుగు మనఃప్రజ్వలనము క్రోధస్థాయి యనఁబడును. ఇది ఫుల్లనాసాపుటము, గిరగిరతిరుగు నల్లగ్రుడ్లు, మొదలైన అనుభావములను గలదై యుండును. దీనికి శత్రువులు, భృత్యులు, స్నేహితులు, పూజ్యులు, ఈనలుగురు విషయు లనఁబడుదురు.

శత్రువిషయక్రోధో యథా

ముహుర్దష్టోష్ఠతా భంగో భ్రుకుట్యా దంతఘట్టనం,
హస్తనిష్పీడనం గాత్రప్రకంపో౽స్త్రస్య వీక్షణం.

268


స్వభుజావేక్షణం కంఠగర్జాద్యాశ్శాత్రవక్రుధి,

శత్రు విషయక్రోధమందు అడుగడుగునకు పెదవులు కొఱుకుకొనుట, కనుబొమలు వంకరయవుట, పండ్లు కొఱుకుట, చేతులను పిసుకుకొనుట, దేహమువణఁ కుట, అస్త్రమును జూచుట, తనభుజములను జూచుకొనుట, గర్జించుట మొదలైనవి గలుగును.

భృత్యవిషయక్రోధో యథా

భృత్యక్రోధే తు చేష్టాస్స్యుర్నేత్రాంతపతదశ్రుతా.

269


తూష్ణీం ధ్యానం చ నైశ్చల్యం శ్వసితాని ముహుర్ముహుః,
మౌనం వినమ్రముఖతా భుగ్నదృష్ట్యాదయో మతాః.

270

భృత్యక్రోధమందు కన్నీరు కారుట, ఊరక ధ్యానించుట, కదలకయుండుట, అడుగడుగునకు నిట్టూర్పులు విడుచుట, మాటలాడకయుండుట, తలవంచుకొనుట, భుగ్నదృష్టి మొదలైనవి గలుగును.

మిత్రక్రోధో యథా

మిత్రక్రోధేతు చేష్టాస్స్యుః భావగర్భవిభూషణం,
భ్రూభేదనిటలస్వేదకటాక్షారుణిమాదయః.

271

మిత్రక్రోధమందు భావగర్భముగ భూషించుట, కనుబొమ్మలు భేదపడుట, నొసటఁ జెమట కలుగుట, కన్నులు ఎఱ్ఱనౌట మొదలయినవి గలుగును.

పూజ్యక్రోధో యథా

పూజ్యక్రోధే తు చేష్టాస్స్యుస్స్వనిందా నమ్రవక్త్రతా,
అనుత్తరప్రదానాంగస్వేదగద్గదతాదయః.

272

పూజ్యక్రోధమందు తన్ను తాను నిందించుకొనుట, తలవంచుకొనుట, ప్రత్యుత్తరము చెప్పకుండుట, దేహమున చెమట గలుగుట, కంఠగద్గదము మొదలైనవి గలుగును.

భృత్యాదికోపత్రితయే తత్తత్కోపోదితాః క్రియాః,
మిథః స్త్రీపుంసయోరేవ రోషః స్త్రీగోచరః పునః.

273

ప్రత్యయావధిరత్ర స్యుః వికారాః కుటిలేక్షణం,
అధరస్ఫురణాపాంగరాగనిశ్వసితాదయః.

274

భృత్యాదిక్రోధత్రితయమందును దానిదానికిఁ జెప్పఁబడిన క్రియలు దానిదానికిఁ గలుగును. మిత్రక్రోధాంతర్గతమైన స్త్రీపురుషులకోపములయందు స్త్రీమీది పురుషకోపము ప్రత్యయము గలుగునంతవఱకు నుండును. ఇందు వంకరచూపు, పెదవు లదరుట, కడకన్ను లెఱ్ఱనౌట, నిశ్వాసములు మొదలైనవి గలుగును.

ద్వేథా నిగదితస్స్త్రీణాం రోషః పురుషగోచరః,
సపత్నీరోషహేతుస్స్యాదన్యస్స్యాదన్యహేతుకః.

275


సపత్నీహేతుకో రోషః విప్రలంభే ప్రపంచ్యతే,
అన్యహేతుకృతే త్వత్ర క్రియాః పురుషరోషవత్.

276

పురుషవిషయమైన స్త్రీకోపము సపత్నీహేతుకమనియు, అన్యహేతుకమనియు, ఇరుదెఱఁగు లౌను. సపత్నీహేతుకమైనరోషము విప్రలంభమందుఁ జెప్పఁబడుచున్నది. అన్యహేతుకృతరోషమందు పురుషరోషమందుఁ గల క్రియలు గలుగును.

ఏతే చ స్థాయినస్సర్వే విభావైర్వ్యభిచారిభిః,
సాత్వికై రనుభావైశ్చ నటాభినయగోచరాః.

277


సాక్షాత్కారమివానీతాః ప్రాపితా స్వాదురూపతాం,
సామాజికానాం మనసీ ప్రయాంతి రసరూపతాం.

278

విభావవ్యభిచారిభావసాత్వికానుభావవ్యాపారరూపానుభావములచే సాక్షాత్కారమును బొందింపఁబడినట్లు అభినయగోచరములై స్థాయిభావములు స్వాదురూపతను బొందింపఁబడి సామాజికులమనమున రస మౌటను బొందుచున్నవి.

దధ్యాదివ్యంజనైశ్చించామరిచ్యాదిభిరౌషధైః,
గుడాదిమధురద్రవ్యైర్యథాయోగ్యం సమన్వితైః.

279


యథాపాకవిభేదైశ్చ నిష్పాద్యో రస ఔదనః,
నిష్పాద్యతే విభావాద్యైః ప్రయోగేణ తథా రసః.

280


సో౽యమానందసంభేదో భావజ్ఞైరనుభూయతే,

యథాయోగ్యముగఁ గూడిన పెరుగు మొదలైనవ్యంజనములచేతను, చింతపండు మిర్యాలు మొదలయిన యౌషధములచేతను, బెల్లము మొదలయిన మధురపదార్థములచేతను, పాకభేదములచేతను, అన్నమునకు రస మెట్లు కలుగుచున్నదో అట్లు విభావాదిభావములచేతను, ప్రయోగముచేతను, రసము నిష్పన్న మగుచున్నది. రసమనునది మనస్సుచే నెఱుఁగఁదగిన సుఖవిశేషము. అది భావజ్ఞులచే ఆస్వాదింపఁబడుచున్నది.

రసభేదానాహ

శృంగారవీరకరుణాద్భుతహాస్యభయానకాః.

281


భీభత్సశ్చ తథా రౌద్రో నాప్యే త్వష్టరసాః స్మృతాః,

శృంగారము, వీరము, కరుణము, అద్భుతము, హాస్యము, భయానకము, భీభత్సము, రౌద్రము - అని నాట్యమందు ఎనిమిదిరసములు చెప్పఁబడుచున్నవి.

శృంగారరసలక్షణం

రసేషు తత్ర శృంగారః ప్రథమం వక్ష్యతే స్ఫుటం.

282


విభావై రనుభావైశ్చ సాత్వికై వ్వ్యభిచారిభిః,
నీతా సదస్యరస్యత్వం రతిశృంగార ఉచ్యతే.

283


నాయికా నాయకో వాపి తత్ర చాలంబనం మిథః,
రూపయౌవనలావణ్యకులశీలాదితద్గుణైః.

284

వాగ్భిశ్చ మధురాలాపగీతకర్మకలాదిభిః,
చేష్టాభిర్భుజనిక్షేపకటాక్షహసితాదిభిః.

285


అలంకారైస్స్రగా లేపదుకూలకటకాదిభిః,
తటస్థైశ్చంద్రదీపాద్యైః భావైరుద్దీపితా తతః.

286


కాంతదృష్టిప్రసన్నాస్యరాగాద్యైరాంగికైరపి,
వాచికైర్మధురాలాపగుణసంకీర్తనాదిభిః.

287


సాత్వికస్తంభకంపాద్యైరనుభావైః ప్రకాశితా,
ఔత్సుక్యచింతాహర్షాద్యైస్సంపుష్టా సహకారిభిః.

288


యా రతిస్స్థాయినీ నైవ భావాద్యైరభిరంజితా,
రస్యమానా సహృదయైర్యాతి శృంగారతామియం.

289
క్రిందఁ జెప్పిన యెనిమిదిరసములలో మొదట శృంగారరసము చెప్పఁబడుచున్నది. విభావానుభావవ్యభిచారిసాత్వికభావములచే సదస్యస్వాద్యత్వమును బొందినరతిస్థాయిభావము శృంగారరస మని చెప్పఁబడును. ఆరతిస్థాయి నాయికానాయకులను ఆలంబనము గలది. రూపము యౌవనము లావణ్యము కులము శీలము మొదలయిన నాయికానాయకులగుణములచేతను, మధురమైన పలుకులచేతను, సంగీతవిద్య మొదలయినవానిచేతను, భుజవిన్యాసము కటాక్షము హాసము మొదలయినవానిచేతను, చేష్టలచేతను, పుష్పము గంధము వస్త్రము హస్తాభరణము మొదలయిన అలంకారములచేతను, చంద్రదీపాదులయిన తటస్థభావములచేతను, మరల నుద్దీపితయై చక్కనిచూపు ప్రసన్నముఖరాగము మొదలయిన ఆంగికములచేతను, మధురాలాపము గుణకీర్తనము మొదలయిన వాచికములచేతను, స్తంభకంపాదులయిన సాత్వికానుభావములచేతను ప్రకాశితమై ఔత్సుక్యము చింత హర్షము మొదలయినసహకారులచేతను పోషింపఁబడిన ఆరతియే భావములచే రంజితయై రసికులచే ఆస్వాద్యమానయై శృంగారస మౌటను పొందుచున్నది.

తం విభజతే

విప్రలంభశ్చ సంభోగ ఇతి స ద్వివిధా భవేత్,

ఆశృంగారరసము విప్రలంభశృంగారమని, సంభోగశృంగారమని రెండువిధము లౌను.

విప్రలంభం లక్షయతి

అప్రాప్తిర్విప్రలంభస్స్యాద్యూనోర్జాతాభిలాషయోః.

290


పాండిమగ్లానిదృష్ట్యాద్యా అనుభావా ఇహ స్మృతాః,
హర్షగర్వజుగుప్సౌగ్ర్యమదహాసశమైర్వినా.

291


అన్యే సంచారిణస్సర్వే భవంత్యత్ర యథోచితం,

అత్యంతాసక్తిగల నాయికానాయకులకు పరస్పరము చేరికలేకయుండుట విప్రలంభ మనఃబడును. ఇందు విరహపాండిమము, సోలినచూపు మొదలయినవిగలుగును. హర్షము, గర్వము, జుగుప్స, ఉగ్రభావము, మదము, హాసము, శమము ఇవివినా కడమసంచారిభావములన్నియును ప్రకృతానుగుణముగ గలుగును.

విప్రలంభం విభజతే

అయోగో విరహో మానః ప్రవాసశ్శాప ఇత్యపి.

292


విప్రలంభస్య పంచైతే హేతవః పరికీర్తితాః,

అయోగము, విరహము, మానము, ప్రవాసము, శాపము అని విప్రలంభమునకు అయిదుహేతువులు గలవు.

ఆయోగవిప్రలంభశృంగారలక్షణం

ప్రాగసంగత యోర్యూనోరనురాగే౽పి జాగ్రతి.

293


అయోగః పారతంత్రాద్యైర్విప్రలంభో౽భిలాషజః,
ప్రవేశనిర్గమౌ తూష్ణీం తద్దృష్టిపథగామితా.

294

రాగప్రకాశనపరాశ్చేష్టాస్స్వాత్మప్రకాశనం,
వ్యాజోక్తయశ్చ విజనే స్థితిరిత్యాదయో౽పి చ.

295


తత్ర సంచారిణో గ్లానిశ్శంకాసూయా భ్రమో భయం,
నిర్వేదౌత్సుక్యదైన్యాని చింతానిద్రే ప్రబుద్ధతా.

296


విషాదజడతోన్మాదా మోహో మరణమేవ చ,
తత్తత్సంచారిభావానాముచితాపి దశా భవేత్.

297


క్రమేణ ప్రాక్తనైరస్య దశావస్థాస్సమాసతః,
ప్రోక్తాస్తదసుసారేణ భరతేన మహాత్మనా.

298

అతిప్రేమగల నాయికానాయకులకు ప్రథమసమాగమమునకు మునుపు గలవిప్రలంభము అయోగవిప్రలంభ మనఁబడును. ఇందు నాయకుని జూచి యింటిలోపలికిఁ బోవుట, బయట వచ్చుట, ఊరక అతనిచూపున కగపడుట, తనఆసను బయలుపఱచుచేష్టలు, తనదేహమును ప్రకాశపఱచుట, వ్యాజోక్తులు, విజనస్థలమం దుండుట మొదలయినవి గలవు. గ్లానియు, శంకయు, అసూయయు, భ్రమము, భయము, నిర్వేదము, ఔత్సుక్యము, దైన్యము, చింత, నిద్ర, ప్రబోధము, విషాదము, జాడ్యము, ఉన్మాదము, మోహము, మరణము - ఈవ్యభిచారిభావములకు యథోచితముగ ప్రవేశము గలదు. ఈయయోగవిప్రలంభమునకు దశావస్థలు గలవని ప్రాచీనులమతము ననుసరించి భరతుని చేతను జెప్పఁబడినవి.

దశావస్థా నిరూపయతి

చక్షుఃప్రీతిశ్చింతా సంకల్పో గుణనుతిః క్రియాద్వేషః,
తాపో లజ్జాత్యాగోన్మాదౌ మూర్ఛా మృతిర్దశావస్థాః.

299
చక్షుఃప్రీతి, చింత, సంకల్పము, గుణనుతి, క్రియాద్వేషము, తాపము, లజ్జాత్యాగము, ఉన్మాదము, మూర్ఛ, మృతి అనునవి పదియవస్థలు.

చక్షుఃప్రీతిలక్షణం 1-టీది

చక్షుః ప్రీతిః స్పృహా రమ్యే దృష్టే వాలంబనే శ్రుతే,
కౌతుకస్వేదరోమాంచహర్షవిస్మయసాధ్వసైః.

300


చాపలస్తంభలజ్జాద్యైరనుభావ్యో భవేదయం,

రమ్యమైన ఆలంబనము వినఁబడినదిగాని చూడఁబడినదిగాని కాఁగా, దానియందుఁ గలిగిన ఇచ్ఛ చక్షుఃప్రీతి యనఁబడును. ఇది సంతోషము, స్వేదము, పులకరింపు, హర్షము, ఆశ్చర్యము, సాధ్వసము, చాపలము, స్తంభము, సిగ్గు మొదలయిన వానిచేత భావింపఁదగినది.

చింతాలక్షణం 2-వది

కేనోపాయేన సంసిధ్యేత్కదా తేన సమాగమః.

301


దూతీముఖేన కిం వాచ్యమిత్యాద్యూహో విచింతనం,
అత్రానుభావా నిశ్వాసధ్యానస్రస్తాంగతాదయః.

302


వలయాదిపరామర్మస్వేదాంబుపులకాదయః,
శయ్యాసనాదివిద్వేష ఇత్యాద్యాః స్మరకల్పితాః.

303


నిర్లక్ష్యవీక్షణం చైవమాద్యాస్స్యుర్విక్రియా మతాః,

కోరిక ఏయుపాయముచేత ఈడేరును? అతనితోడ నెప్పుడు కూడిక కలుగును? చెలులతో నేమి చెప్పి పంపవచ్చును? అని ఊహించుట చింత యనఁబడును. ఇందు నిట్టూర్పు, ధ్యానము, దేహము సోలుట, హస్తాభరణాదులను చేతితో తడవుట, చెమట, పులకరింపు, శయ్యాసనాదులయందు విద్వేషము, నిర్లక్ష్యవీక్షణము మొదలైనవి గలుగును.

సంకల్పావస్థాలక్షణం 3-వది

మనోరథస్స్యాత్సంకల్పస్తత్సమాగమగోచరః.

304


ఔత్సుక్యస్వేదరోమాంచ స్మృతిశ్వాసాక్షిమీలనైః,
బాహ్యార్థస్యాపరిజ్ఞానేనానుభావ్యో భవేదసౌ.

305

నాయకసమాగమగోచరమైన మనోరథము సంకల్ప మనఁబడును. ఈయవస్థయందు ఔత్సుక్యము, స్వేదము, రోమాంచము, స్మరణము, శ్వాసము, కన్నులు మూసికొనుట, బాహ్యవ్యాపారముఁ దెలియకయుండుట, మొదలైనవి గలుగును.

గుణనుతిలక్షణం 4-వది

భవేద్గుణనుతిస్తస్య రూపాదిపరికీర్తనం.

306


రోమాంచో గద్గదా వాణీ భావావరణవీక్షణం,
తత్సంగచింతనం సఖ్యా గండర్వేదాదయో౽పి చ.

307


ఔత్సుక్యహర్షస్మృత్యాద్యా అనుభావా ఇహ స్మృతాః,

నాయకుని రూపము మొదలైనగుణములను బొగడుట గుణనుతి యనఁబడును. ఇందు రోమాంచము, డగ్గుత్తుకగల పలుకులు, సాభిప్రాయముగఁ జూచుట, చెలికత్తెలతో నతనిసంగమమునుగుఱించి యోచించుట, కపోలములయందు చెమట, ఉత్సాహము, హర్షము, స్మరించుట మొదలైనవి గలుగును.

క్రియాద్వేషలక్షణం 5-వది

క్రియాద్వేషస్తతో౽న్యత్ర విద్వేషో భోజ్యవస్తుని.

308


చింతానిశ్వాసదైన్యాశ్రు కళాజాగరపాండుతాః,
విషాదో గ్లానిరీత్యాద్యా అనుభావాస్తదుద్భవాః.

309

నాయకునితప్ప ఇతరములైన భోజ్యవస్తువులయందు గలుగుద్వేషము క్రియాద్వేష మనఁబడును. ఇందు చింత, నిశ్వాసము, దైన్యము, కన్నీరు విడుచుట, నిదురలేక యుండుట, వెలవెలపోవుట, విషాదము, సోలుట మొదలైనవి గలుగును.

తాపలక్షణం. 6-వది

తత్ప్రాప్తేర్విప్రకర్షేణ తాపస్స్యాత్కామజో జ్వరః,
వైవర్ణ్యమశ్రు వైస్వర్యం శయనే పరివర్తనం.

310

నిశ్వాసముఖశోషాద్యా అనుభావాస్తదుద్భవాః,

ప్రియునిరాకయొక్క విలంబమునఁ గలుగు కామజ్వరము తాప మనఁబడును. ఇందు వైవర్ణ్యము, కన్నీరు, స్వరభంగము, పడకలో పొరలుట, నిట్టూర్పు, ముఖము వాడుట మొదలైనవి గలుగును.

లజ్జాత్యాగలక్షణం 7-వది

లజ్జాత్యాగస్త్రపాహానిరౌత్సుక్యాదిసముద్భవా.

311


ఉల్లంఘనం భవేద్వాచాం గౌరవాగణనం తథా,
విషాదో వ్యగ్రతా దై న్యమిత్యాద్యైరసుభావ్యతే.

312

ఔత్సుక్యము మొదలైనవానిచేత సిగ్గును మానుట లజ్జాత్యాగ మనఁబడును. ఇందు ఆజ్ఞను మీఱుట, గౌరవమును తలఁపకుండుట, విషాదము, వ్యగ్రత, దైన్యము మొదలైనవి గలుగును.

ఉన్మాదలక్షణం 5-వది

సర్వావస్థాసు సర్వత్ర తన్మనస్కతయా సదా,
అతస్మిన్ స్తదితి భ్రాంతిరున్మాదో విరహోద్భవః.

313


తత్ర చేష్టాస్తు విజ్ఞేయా ద్వేషస్స్వేష్టే౽పి వస్తుని,
దీర్ఘ ముహుశ్చ నిశ్వాసో నిర్నిమేషతయా స్థితిః.

314


అనిమిత్తస్మితధ్యానగానమోహాదయో౽పి చ,
అకాండగమనోత్థానశంకాద్యా అపి విక్రియాః.

315


విషాదమదరోషాద్యా అనుభావా ఇహ స్మృతాః,

ఎప్పుడును సర్వావస్థలయందును నాయకునియందు దత్తచిత్తురాలై యుండుటచేత ఒకవస్తువు మఱియొకవస్తువుగా తోఁచుట విరహమువలన గలిగిన ఉన్మాద మనఁబడును. ఇందు తనయిష్టవస్తువునందుఁగూడ ద్వేషము; నిట్టూర్పు, ఱెప్పపాటులేమి, హేతువు లేక నవ్వుట, ధ్యానించుట, పాడుట, మూర్ఛపో వుట, నిమిత్తము లేక నడచుట, లేచుట, శంక మొదలైనవి, విషాదము, మదము, రోషము ఈయనుభావములు గలుగును.

మూర్ఛాలక్షణం. 9-వది

తాపోత్కర్షాత్తదప్రాప్త్యా మూర్ఛాజ్ఞానక్షయో ముహుః.

316


ఇదమిష్టమనిష్టం తదితి వేత్తి న కించన,
నోత్తరం భాషతే ప్రశ్నే నేక్షతే న శృణోతి చ.

317


క్రమేణ మందావుచ్ఛ్వాసనిశ్వాసౌ నష్టచేష్టతా,
స్పర్శానభిజ్ఞ తేత్యాద్యా భవంత్యత్రానుభావకాః.

318

నాయకుఁడు రానందున అధికతాపముచేత జ్ఞానము క్షయించుట మూర్ఛ యనఁబడును. ఇందు ఇష్టమును అనిష్టమును దెలియకుండుట, పిలిచినను పలుకకుండుట, చూపు లేకుండుట, చెవి వినకుండుట, క్రమముగా నుచ్ఛ్వాసనిశ్వాసములు మందము లగుట, చేష్టలు లేక యుండుట, అంటినఁ దెలియకుండుట ఇవి మొదలైన యనుభావములు గలుగును.

మృతిలక్షణం 10-వది

స్మరోత్థా మరణేచ్ఛా చేన్మృతిరిత్యభిధీయతే,
లీలాశుకవినోదాదిన్యాసస్నిగ్ధసఖీకరే.

319


కలకంఠకలాలాపశ్రుతిర్మందానిలాశ్రయః,
జ్యోత్స్నాప్రవేశమాకందమంజరీప్రేక్షణాదయః.

320


ఉద్బంధనాదిసన్నాహస్సాస్రదృష్ట్యాదయస్త్విహ,

మన్మథవ్యాపారముచేఁ గలుగు మరణేచ్ఛ మృతి యనఁబడును. ఇందు విలాసపుచిలుకతోడియాట మొదలయినవానిని సఖులకు ఒప్పగించుట, కోవెలల ముద్దుపలుకులను వినుట, మందమారుతమును ఆశ్రయించుట, వెన్నెలలోనికిఁ బోవుట, మామిడిపూఁగొత్తులను జూచుట, ఉరి మొదలైనవానిని సిద్ధపఱుచుకొనుట, కన్నీటితోడిచూపు మొదలయినవి గలుగును. అతి

విరహవిప్రలంభలక్షణం

కాలక్షేపస్తు సంప్రాప్తేః కార్యాద్వా పారతంత్య్రతః.

321


ఏకగ్రామష్టయోర్యూనోర్విరహస్సో౽భిధీయతే,
ఔత్సుక్యచింతానిశ్వాసవితర్కాద్యనుభావభాక్.

322

ఒకేయూరిలోనుండెడి నాయికానాయకులకు ప్రీతి సిద్ధమైయుండఁగ కార్యవశమువలన గాని పరాధీనతవలన గాని కలియుటకు కాలహరణము కలిగెనా అది విరహవిప్రలంభశృంగార మనఁబడును. ఇందు ఉత్సాహము, చింత, నిట్టూర్పు, వితర్కము మొదలయినవి గలుగును.

మానవిప్రలంభలక్షణం

ఈక్షణాలింగనాదీనాం నిరోధో మాన ఉచ్యతే,
ప్రణయేర్ష్యాప్రభేదేన ద్వివిధస్సో౽భిధీయతే.

323

చూచుట ఆలింగనము మొదలైన వ్యాపారములను నిరోధించియుండుట మాన మనఁబడును. ఆమానము ప్రణయమానమనియు, ఈర్ష్యామానమనియు ఇరుదెచెఱఁగు లౌను.

ప్రణయమానలక్షణం. 1-టిది

తత్ర ప్రణయమానస్స్యాదాజ్ఞాలంఘనతో మిథః,
అభాషణం చ వైముఖ్యమిత్యాద్యైరనుభావ్యతే.

324

వానిలో నాయికానాయకులకు పరస్పరము ఆజ్ఞాలంఘనముచేఁ గలుగునది ప్రణయమాన మౌను. ఇందు మాటలాడకయుండుట, ముఖము త్రిప్పుకొనియుండుట మొదలైనవి కలుగును.

ఈర్ష్యామానలక్షణం

ఈర్ష్యామానస్తు యః కోపః ప్రియే జ్ఞాతాన్యసంగమే,
అభాషణ ముపాలంభో భర్త్సనం తాడనం తథా.

325

వైముఖ్యమశ్రుచామర్ష ఇత్యాద్యైరనుభావ్యతే,
తజ్ఞానం శ్రవణాదృష్టి రనుమానాచ్చ వా భవేత్.

326

అన్య స్త్రీ సంభోగము నెఱుఁగుటచే ప్రియునియందుఁ గలుగుతాపము ఈర్ష్యామాన మనఁబడును. ఇది అభాషణము, ఉపాలంభము, బెదిరించుట, కొట్టుట, వైముఖ్యము, కన్నీరు, ఓర్వమి, ఇవి మొదలైనవానిచే నెఱుఁగఁదగినది. దీని నెఱుఁగుట వినికి, చూచుట, అనుమానము (ఊహించుట) ఈమూఁటిలో దేనివలననైన నగును.

శ్రవణాదీని నిరూపయతి

,

శ్రవణం దూతికాదిభ్యో దృష్టిస్సాక్షాద్విలోకనమ్,
అనుమానం స్వప్నగోత్రస్ఖలనాదిభిరుచ్యతే.

327

శ్రవణ మనునది దూతిక మొదలయినవారివలన వినుట, దృష్టి యనునది ఎదురుగఁ జూచుట, అనుమాన మనునది స్వప్నమందు పేరు మార్చి పిలుచుట మొదలయినవానిచేతఁ గలుగునని చెప్పఁబడుచున్నది.

ప్రవాసవిప్రలంభలక్షణం

దేశాంతరస్థితిర్యాతు ప్రవాసస్సో౽భిధీయతే,
కార్శ్యపాండిమనిశ్వాసచింతాదైన్యాశ్రుగద్గదాః.

328


లంబాలకత్వమిత్యాద్యా అనుభావాస్సమీరితాః,

నాయికానాయకుల దేశాంతరస్థితి ప్రవాసవిప్రలంభ మనఁబడును. ఇందు చిక్కిపోవుట, తెల్లనౌట, నిట్టూర్పు, చింత, దైన్యము, కన్నీరు, లంబాలకత్వము మొదలయిన యనుభావములు గలుగును.

శాపవిప్రలంభలక్షణం

శాపస్తు జాడ్యజాచ్ఛాపాత్ సుదూరే వాథ సన్నిధౌ.

329


చింతాసంతాపనిశ్వాస పాండిమాద్యనుభావభాక్,

అయోగవిప్రలంభోక్తా దశావస్థా యథోచితం.

330


అన్యేషు విప్రలంభేషు భవేయు రితి కీర్తితాః,

దూరములోనుండిన సమీపములోనుండిన జాడ్యముచేఁ గలుగుకోపము శాపవిప్రలంభ మనఁబడును. ఇందు చింత, సంతాపము, నిశ్వాసము, పాండిమము మొదలయిన అనుభావములు గలుగును. అయోగవిప్రలంభమందుఁ జెప్పఁబడిన దశావస్థలు తదితరవిప్రలంభములయందును యథోచితముగఁ గలుగునని చెప్పబడియున్నది.

సంభోగశృంగారలక్షణం

అనుకూలౌ నిషేవేతే యత్రాన్యోన్యం విలాసినౌ.

331


దర్శనస్పర్శనాదీని స సంభోగ ఉదాహృతః,
స్మితభ్రూలలితా దృష్టిః లలితం మధురం వచః.

332


స్తంభాద్యాస్సాత్వికాస్సర్వే చేష్టా లీలాదయో౽పి చ,
ప్రసన్నముఖరాగశ్చ ఇత్యాద్యా అనుభావకాః.

333


జుగుప్సాశమనిర్వేద వ్యాధ్యున్మాదా మదో మృతిః,
విషాదో౽మర్ష ఆలస్యమపస్మారో౽త్రవర్జితాః.

334


ద్వివిధస్స తు సంక్షిప్త స్సంపన్న శ్చేతి కథ్యతే,
యువానౌ యత్ర సంక్షిప్తాన్ సాత్విక వ్రీడితాదిభిః.

335


ఉపచారాన్నిషేవేతే స సంక్షిప్త ఇతీరితః,
ప్రోషితాగతయోర్యూనో ర్భోగస్సంపన్న ఈరితః.

336

పరస్పరానుకూల్యము విలాసము గలవారై నాయికానాయకులు దర్శనస్పర్శనాదులను బొందునది సంభోగశృంగార మనబడును. అందు వికసించినకనుబొమలచేత నందమయినచూపు, లలితము మధురము నైనపలుకు, స్తంభాదిసాత్వికభావములన్నియు లీలాదిచేష్టలు ప్రసన్నమైనముఖకాంతియు మొదలైనవి దీనికి అనుభావములు. జుగుప్స, శమము, నిర్వేదము, వ్యాధి, ఉన్మాదము, మదము, మృతి, విషాదము, అమర్షము, ఆలస్యము, అపస్మారము వీనిని వర్జించి తదితరసంచారిభావములు గలుగును. ఈసంభోగశృంగారము సంక్షిప్త మనియు, సంపన్న మనియు ఇరుదెఱఁగు లౌను. యౌవనవంతులైన స్త్రీపురుషులు సాత్వికోదయము సిగ్గు మొదలగువానిచేత సంక్షిప్తములయిన యుపచారములను పొందినది సంక్షిప్త మనఁబడును. ఎడఁబాసియుండి కూడిన వారిసంభోగము సంపన్న మనఁబడును.

వీరరసలక్షణం

విభావై రనుభావైశ్చ సాత్వికై ర్వ్యభిచారిభిః,
నీతస్సదస్యరస్యత్వ ముత్సాహో వీర ఉచ్యతే.

337


యద్యాలంబనతస్తత్త ద్గుణదానాదిదీపితః,
ప్రసన్నముఖరాగాద్యైరనుభావ్యో భవేదయం.

338


ఔత్సుక్యచింతాహర్షాద్యైః పోష్యతే సహకారిభిః,
యుద్ధవీరో దయావీరో దానవీరశ్చ స త్రిథా.

339

విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే సదస్యరస్యత్వమును పొందింపఁబడినదై ఆలంబనగుణదానాదులచే ఉద్దీపితమైన ఉత్సాహస్థాయి వీరరస మౌచున్నది. అది ప్రసన్నమైనముఖకాంతి మొదలయినవానిచే భావింపదగినది. ఔత్సుక్యము, చింత, హర్షము మొదలయినసహకారులచే పోషింపఁబడును. ఆవీరరసము యుద్ధవీర, దయావీర, దానవీరరసములని ముత్తెఱఁగు లౌను.

యుద్ధవీరరసలక్షణం

సహాయాన్వేషణం యుద్ధే సమరోచితపాటవం,
భీతాభయప్రదానాద్యా అనుభావాః ప్రకీర్తితాః.

340


యుద్ధవీరేహర్షగర్వా మర్షాద్యావ్యభిచారిణః,

యుద్ధవీరరసమందు యుద్ధమున సహాయమును వెతకుట, యుద్ధమున కుచితమైనపటుత్వము, భయపడినవారలకు అభయమిచ్చుట మొదలయిన అనుభావములును, హర్షము, గర్వము, అమర్షము మొదలయిన వ్యభిచారిభావములును గలవు.

దయావీరరసలక్షణం

స్వార్థప్రాణవ్యయేనాపి ప్రపన్నత్రాణశీలతా.

341


ఆశ్వాసన్తోక్తయస్థైర్యమిత్యాద్యా విక్రియా మతాః,
దయావీరే మతిధృతి ప్రముఖావ్యభిచారిణః.

342

వీరరసమందు తనఅర్థము ప్రాణము పోఁగొట్టుకొనియైనను తన్ను శరణుచొచ్చినవారలను రక్షించెడిస్వభావము, ఊఱటపలుకులు, స్థిరత్వము ఇవి మొదలయిన యనుభావములును, మతి ధృతి మొదలైన వ్యభిచారిభావములును గలవు.

దానవీరరసలక్షణం

స్మితపూర్వాభిభాషిత్వం స్మితపూర్వం చ వీక్షణం,
ప్రసాదాద్బహుదాతృత్వం తద్వాచామనుమోదనం.

343


గుణాగుణవిచారాద్యా అనుభావాస్సమీరితాః,
దానవీరే ధృతిర్హర్ష ఇత్యాద్యా వ్యభిచారిణః.

344

దానవీరరసమందు మందస్మితపూర్వకమైనపలుకు, స్మితపూర్వకమయినచూపు, దయ చేసి విశేషముగ ఇచ్చుట, వారిపలుకులను అనుమోదించుట, గుణాగుణవిచారము మొదలైన అనుభావములును, ధృతియు హర్షము ఇవి మొదలైనవ్యభిచారిభావములును గలవు.

కరుణరసలక్షణం

విభావై రనుభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః,
సదస్యాస్వాద్యతాం నీతః శోకః కరుణ ఈరితః.

345

ధర్మనాశో౽ర్థనాశశ్చ బాంధవేష్టజనక్షయః,
వధోద్బంధౌ చ దారిద్ర్యం పదభ్రంశః పరాజయః.

346


దైవోపహతిధిక్కారౌ వ్యాధిశ్శాపోవశంసనం,
ఇత్యాద్యాలంబనం దృష్టమసుభూతం శ్రుతం చ వా.

347


యస్య చోద్దీపనం జ్ఞేయం ఆలంబనగుణాశ్రయం,
కేశ వాసో౽౦గసంస్కార వైధుర్యం స్రస్తగాత్రతా.

348


రక్తాభో ముఖ రాగశ్చ సబాష్పా మంధరా చ దృక్,
భూపాతో ముఖవైవర్ణ్యం బాహుపాతో వికత్థనం.

349


విన్యాసో హస్తయోర్మూర్ధ్ని నిశ్వాసోఛ్వాసదీర్ఘతా,
ఉరశ్శిరోముఖస్యాపి తాడనం లుంఠనం భువి.

350


హాహాకారస్తథాక్రందో విలాపః పరిదేవనం,
భావా స్తంభాదయస్సర్వే భవేయురనుభావకాః.

351


నిర్వేదో దైన్యమాలస్యం ఉన్మాదవ్యాధిసుఫ్తయః,
నిద్రామోహశ్శ్రమో గ్లానిశ్చింతా స్మృతిరపస్మృతిః.

352


విషాదో జాడ్యమౌత్సుక్యం శంకా మరణమేవ చ,
ఏతే సంచారిణః ప్రోక్తాః కరుణే మునిసమ్మతాః.

353


ఉత్తమాధమమధ్యేషు యథాయోగం భవంత్యమీ,

విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే సదస్యులకు అనుభవార్హత్వమును పొందింపఁబడినశోకస్థాయి కరుణరస మనఁబడును. ఇందు ధర్మనాశము, అర్థనాశము, ఇష్టజనబాంధవజనక్షయము, వధము, తూకువేయుట (ఉరిదీయుట), దారిద్ర్యము, పద్మభ్రంశము, అవమానము, దైవోపహతి, ధిక్కారము, వ్యాధియు, శాపమును చెప్పుట ఇవి మొదలయినవి చూడఁబడినను అనుభవింపఁబడినను వినఁబడినను ఆలంబనవిభావము లగును. ఉద్దీపనవిజ్ఞానములును వాని నాశ్రయించియుండును. వెండ్రుకలు వస్త్రము దేహము ఇవి వికారమును బొందుట, దేహము సోలియుండుట, ఎఱ్ఱని ముఖకాంతి, కన్నీరు గలచూపు ఈఉద్దీపనములు, నేలబడుట, ముఖవైవర్ణ్యము, చేతులు వ్రేలవేయుట, అవికత్థనము, చేతులను తలపై పెట్టుకొనుట, నిట్టూర్పు లిడుట, ఱొమ్ము తల ముఖము వీనిని కొట్టుకొనుట, నేలమీఁద పొర్లుట, హాహాకారము, రోదనము విలాపము పరిదేవనము ఈఅనుభావములును, స్తంభప్రళయాది సాత్వికభావములును, నిర్వేదము దైన్యము ఆలస్యము ఉన్మాదము వ్యాధి సుప్తి నిద్ర మోహము శ్రమము గ్లాని చింత స్మృతి అపస్మారము విషాదము జాడ్యము ఔత్సుక్యము శంక మరణము ఈవ్యభిచారిభావములును గలవు. ఈభావములు ఉత్తమమధ్యమాధమవిషయములయందు యథోచితముగ గలుగును.

అద్భుతరసలక్షణం

విభావైరనుభావైశ్చ సాత్వికై ర్వ్యభిచారిభిః.

354


ప్రాప్తస్సదస్యాస్వాద్యత్వం విస్మయో౽ద్భుతతాం వ్రజేత్,
దుష్ప్రప్యవస్తునః ప్రాప్తిః కర్మ చాప్యతిమానుషం.

355


మరీచిమానగంధర్వనగరాద్యవలోకనం,
మాయేంద్రజాలనృత్తాది యస్య చాలంబనం నుతం.

356


ప్రసన్నముఖరాగో౽క్షి విస్తారో నిర్నిమేషతా,
శిరఃకపోలచలనం సాత్వికాశ్చానుభావకాః.

357


వితర్కచాపలావేగ హర్షాద్యా వ్యభిచారిణః,

విభావానుభావసాత్వికభావవ్యభిచారిభావములచే సభవారికి ఆస్వాద్యత్వమును బొందియుండు విస్మయస్థాయి అద్భుతరస మౌను. ఈ అద్భుతరసమునకు దుష్ప్రాప్యమైనవస్తువులప్రాప్తి, మనుష్యులకు అశక్యమైన పనులను జేయుట, కాంతిచే నిర్ణయింపఁదగిన గంధర్వనగరాదులఁ జూచుట, మాయ ఇంద్రజాలవిద్య నృత్యము మొదలయినవి ఆలంబనములు. అందు ప్రసన్నమైనముఖరాగము, నేత్రవిస్తారము, ఱెప్పపాటు లేకయుండుట, తల కపోలప్రదేశము వీనిని కదలించుట ఈఅనుభావములును, స్తంభాదిసాత్వికానుభావ ములుకు, వితర్కము చాపలము ఆవేగము హర్షము మొదలయినవ్యభిచారిభావములును గలవు.

హాస్యరసలక్షణం

విభావై రనుభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః.

358


నీతస్సదస్య రస్యత్వం హాసో హాస్య ఇతీరితః,
అసౌ విదూషకో వేత్త మత్తాద్యాలంబనాశ్రయః.

359


మల్లయుద్ధాకూతకర్మ నిర్లజ్జత్వాదితద్గుణైః,
మృగపక్షిమనుష్యాణాం స్వరాసుకరణై స్తథా.

360


వేదశాస్త్రకలావిద్యాదేశభాషాదికస్య చ,
విడంబనై రసంబద్ధాసత్ప్రలాపైశ్చ దూషణైః.

361


పరక్రియానుకరణవాగాద్యైరపి చేష్టితైః,
తటస్థై స్తత్సహాచారైస్సమ్యగుద్దీపితస్తతః.

362


ఓష్ఠనాసాకపోలాస్యస్పందనైర్దంతనిర్గమైః
అనుమోదసముద్భూతై స్సాధుసాధ్వితిభాషితైః.

363


స్తంభ ప్రళయవర్జైశ్చ సాత్వికై రనుభావితః,
ఔత్సుక్యచాపలవ్రీడాహర్షస్మృతిమదశ్రమైః.

364


మతిగర్వావబోధైశ్చ విస్మయేన చ సమ్మితః,
సో౽యం స్మితాదిభేదేన షడ్విధః పరికథ్యతే.

365

విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే సదస్యాస్వాద్యత్వమును బొందింపఁబడిన హాసస్థాయి హాస్యరస మనఁబడును. ఈరసము వికటకవులు ఉన్మత్తులు మదించినవారు మొదలయినవారలను ఆశ్రయించినదై మల్లయుద్ధము ఆకూతము చేయుట సిగ్గుమానుట మొదలయినవానిగుణములచేతను, మృగపక్షిమనుష్యులస్వరములయొక్క అనుకరణములచేతను, వేదములు శాస్త్రములు కలలు విద్యలు దేశభాషలు మొదలగువాని యనుకరణములచేతను, సందర్భము లేనిమాటలచేతను, సత్ప్రలాపములచేతను, దూషణములచేతను, పరక్రియల ననుకరించు పలుకులచేతను, చేష్టలచేతను, దాని ననుసరించిన తటస్థోద్దీపనములచేతను, బాగుగ ఉద్దీపితమై పెదవులు ముక్కు చెక్కిళ్లు ముఖము వీనిని కదలించుటచేతను, దంతముల వెలిబుచ్చుటచేతను, సంతోషముచే గలిగిన లెస్సలెస్స అనుపలుకులచేతను, స్తంభప్రళయములను వర్ణించి రోమాంచాదిసాత్వికానుభవములచేతను భావింపఁబడినదై ఔత్సుక్యము, చాపలము, వ్రీడ, హర్షము, స్మృతి, మదము, శ్రమము, మతి, గర్వము, అవబోధము, విస్మయము వీనిచేత పోషింపఁబడినదై ఆహాస్యరసము స్మితాదిభేదములచే నాఱువిధము లౌనని చెప్పఁబడుచున్నది.

స్మితాదీని నిరూపయతి

స్మితమథ హసితం విహసిత ముపహసితం చాపహసితం చ,
అతిహసితం ద్వౌభేదౌ స్తాముత్తమమధ్యమాధమప్రకృతౌ.

స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అవహసితము, అతిహసితము ఈఆఱున్ను ఉత్తమమధ్యమాధమప్రకృతులయందు ఒక్కొకనికి రెండురెండువంతున గలుగును.

స్మితలక్షణం 1

ఈషద్వికసితైర్గండైః కటాక్షస్పష్టసంస్మితైః,
అలక్షితద్విజాళీకం స్మితమిత్యభిధీయతే.

367

కడకంటిచూపులచే వ్యక్తమైననవ్వులతోను కొంచెము వికాసమును బొందిన చెక్కిళ్లతోను గూడి తెలియఁబడని దంఠములు గలదిగా నుండునవ్వు ఉత్తములకు గలుగును. ఇది స్మిత మనఁబడును.

హసితలక్షణం 2

ఉత్ఫుల్లానననేత్రం తు గండైర్వికసితై స్తథా,
కించిల్లక్షితదంతం చ హసితం తద్విధీయతే.

368

వికసితమైనగండప్రదేశములతోఁ గూడి వికాసమును బొందిన ముఖనేత్రములు గలదిగాను కొంచెము చూడఁదగిన దంతములు కలదిగాను నుండునది హసిత మనఁబడును.

విహసితలక్షణం 3

ఆకుంచితాక్షిగండం యత్సస్వరం మధురం తథా,
కాలాగతం సాస్యరాగం తద్వై విహసితం భవేత్.

369

వంచఁబడినచూపును చెక్కిళ్లను గలదిగాను, మధురముగాను, ఆసమయమందు వచ్చినదిగాను, ముఖవిలాసముతోఁ గూడినదిగాను ఉండునవ్వు విహసిత మనఁబడును.

ఉపహసితలక్షణం 4

ఉత్ఫుల్లనాసికం యత్తు జిహ్వాదృష్టినిరీక్షణం,
ఆకుంచితాంసకశిరః తచ్చోపహసితం భవేత్.

370

వికసించిన ముక్కు గలిగినదై నాలుకయందు కంటిచూపు గలదై వంచఁబడిన భుజము శిరస్సును గలదిగా నున్ననవ్వు ఉపహసిత మనఁబడును.

అపహసితలక్షణం 5

సస్వానహసితం యత్తు సాశ్రునేత్రం తథైవ చ,
నిష్కంపితాంసకశిరస్తచ్చాపహసితం భవేత్.

371

ధ్వని గలిగి కన్నులనీళ్లతో గూడి భుజశిరస్సులు తలయును గదలక నవ్వెడునవ్వు అపహసిత మనఁబడును.

అతిహసితలక్షణం 6

సస్వరం సాశ్రునేత్రం చ వికృష్టస్వన ముద్ధతం,
కరోపగూఢపార్శ్వం యత్తచ్చాతిహసితం భవేత్.

372

స్వరముతో గూడినదిగాను, నేత్రమందు కన్నీరు గలదిగాను, అధికధ్వని గలదిగాను, గొప్పదిగాను, ప్రక్కలు పిసికికొనునదిగాను ఉండునవ్వు అతిహసిత మనఁబడును.

భయానకరసలక్షణం

విభావై రనుభావైశ్చ సాత్వికై ర్వ్యభిచారిభిః,
నీతస్సదస్యరస్యత్వం భయమేవ భయానకః.

373


రక్షఃపిశాచభల్లూకవ్యాఘ్రవ్యాళాదిదర్శనం,
శూన్యారణ్యగృహారామశ్మశానాదిప్రవేశనం.

374


యుద్ధదస్యునృపద్రోహవికృతోగ్రస్వనా అపి,
అస్యాలంబనముద్దీప్యై భవేయుస్స్వేద ఏవ చ.

375


ముఖోష్ఠతాలుకంపాస్యశోషౌ పార్శ్వావలోకనం,
శ్యామాభో ముఖరాగశ్చ నిష్కాంతభ్రాంతతారకాః.

376


ప్రణామః కాందిశీకత్వ మంగుళిత్రాణచర్వణం,
సహాయాన్వేషణాది స్యాదాంగికై ర్వాచికై స్తథా.

377


శరణం భష్మ మే యుష్మద్దాసో౽హం రక్ష రక్ష మాం,
అభయం దేహి మే తాతేత్యాదిరప్యస్య సాత్వికాః.

378


సర్వే౽నుభావకా యస్య త్రాసావేగౌ శ్రమో మృతిః,
విషాదశ్చాపలం మోహశ్చింతాజాడ్యమపస్మృతిః.

379


ఏతే సంచారిణః ప్రోక్తా భరతాగమవేదిభిః,

విావానుభావవ్యభిచారిసాత్వికభావములచే సదన్యరస్యత్వమును బొందింపఁబడినదై యుండుభయస్థాయి భయానకరస మౌను. ఈరసమునకు రాక్షసుఁడు, దయ్యము, భల్లూకము, వ్యాఘ్రము, పాము మొదలైనవానిని జూచుట; శూన్యమైన అడవి, ఇల్లు, తోట, శ్మశానము మొదలయినవానియందు ప్రవేశించుట, జగడము, దొంగ, రాజద్రోహము, వికారముగను ఉగ్రముగను ఉండుస్వరము మొదలయినవి ఆలంబన మౌను. దీనికి చెమట ఉద్దీపనము ముఖము పెదవులు చెక్కిళ్లు వీనికంపము, ముఖము వాడుట, ప్రక్కలను జూచుట, ముఖము నల్లనౌట, నల్లగ్రుడ్లు తిరుగుట, ఒక్కప్రక్కకు పోవుట, దండము పెట్టుట, పారిపోవుట, వ్రేళ్ల కవచమును కఱచుకొనుట, ఆంగికములచే వాచికములచే సహాయమును వెతకుట మొదలయినవి; నీకు నే దాసుఁడను నిన్ను శరణు పొందినాను నన్ను కాపాడుము కాపాడుము, అభయ మియ్యవలయును అనుట; ఇవి మొదలయిన అనుభావములును; అన్నిసాత్వికభావములును, త్రాసము, ఆవేగము, శ్రమము, మృతి, విషాదము, చాపలము, మోహము, చింతయు, జాడ్యము, అపస్మారము, ఈసంచారిభావములును గలవు.

బీభత్సరసలక్షణం

విభావాద్యైస్సదస్యానాం ప్రాపితో రస్యతామసౌ.

380


జుగుప్సాస్థాయికస్తజ్ జ్ఞైర్బీభత్స ఇతి కథ్యతే,
రక్తమాంసవసాస్థ్యాదిచ్ఛర్దిలాలాద్యుపాశ్రయః.

381


అనుభావైః పరావృత్తి ముఖదృక్కూణనాదిభిః,
శ్యామేన ముఖరాగేణ సాత్వికైః పుళకాదిభిః.

382


నిర్వేదశంకాపస్మారవిషాదజడతాదిభిః,
దీనతామోహశోకై శ్చ సహితో వ్యభిచారిభిః.

383


స పునర్ద్వివిధక్షోభీ చోద్వేగీతి చ కథ్యతే,
రక్తమాంసాదిభిః క్షోభీ ఛర్దిలాలాదిభిః పరః.

384

విభావము మొదలైనభావములచే సభవారికి ఆస్వాద్యత్వమును బొందింపఁబడినదియు జుగుప్సాస్థాయియు నైనది బీభత్సరస మనఁబడును. ఈబీభత్సరసము రక్తము, మాంసము, పులినీరు, ఎముకలు మొదలయినవియు, వాంతి, జొల్లు మొదలయినవియు, ఆశ్రయముగాఁ గలది, వెనుకకు తిరుగుట. ముఖము దృష్టియు వంకబోవుట మొదలయినవి, నల్లనిముఖముకాంతి, ఈఅనుభావములతోను, పులకము మొదలయిన సాత్వికానుభవములతోను, నిర్వేదము; శంక, అపస్మారము, విషాదము, జాడ్యము, దైన్యము, మోహము, శోకము మొద


లయిన వ్యభిచారిభావములతోను గూడియుండును. ఇది క్షోభిబీభత్సమనియు, ఉద్వేగిబీభత్సమనియు ఇరుదెఱఁగు లౌను. రక్తమాంసాదులచేఁ గలుగునది క్షోభిబీభత్సము. ఛర్దిలాలాదులచేఁ గలుగునది ఉద్వేగిబీభత్సము.

రౌద్రరసలక్షణం

విభావైరనుభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః,
నీతస్సదస్యాస్వాద్యత్వం క్రోధో రౌద్ర ఇతీరితః.

385


ఆతతాయీ చ పశునః పాతకాద్యభియోజకః,
క్షేపావమానాద్యాక్రోశవధబంధాదిఘాతకృత్.

386


యో వాన్యో ద్రోహకారీ చ తస్యాలంబనమిష్యతే,
దార్ధ్యనిర్భయతాగర్వైరౌద్ధత్యాదియుతైర్గుణైః.

387


కోభవాన్కింకరోషి త్వమిత్యాద్యాః పరుషోక్తయః,
ద్వేషవాక్చ శిరఃకంపహాసవక్రేక్షణాదయః.

388


దష్టోష్ఠతా చ భృకుటీ రక్తోద్వృత్తా చ తారకా,
భూతాడనభుజాస్ఫాలచపేటాముష్టితాడనం.

389


కపోలస్ఫురణం రక్తముఖరాగో వధోద్యమః,
భేదనాకర్షణాఘాతఛేదనం పటమోచనం.

390


భాషణం దండశస్త్రాస్త్రగ్రహణం చాభిధావనం,
మారణాశ్రువికర్షిసృక్పానాన్యత్యభిధావనం.

391


ఆఃపాప నృపశో ద్రోహి తిష్ఠతిష్ఠ క్వ ధావసి,
ఉత్పాటయామి మూర్ధానం కుర్వే వక్షోవిదారణం.

392


ఉన్మూలయామి రదనాన్గాత్రం సంచూర్ణయామి చ,
ఇత్యాదివాచికం చైవ భయవర్జమసాత్వికం.

393


యస్యానుభావతాం యాంతి యస్యామర్షో మదస్మృతిః,
ఔత్సుక్యావేగమోహాశ్చ గర్వేర్ష్యాచాపలోగ్రతాః.

394


ఉన్మాదోత్సాహబోధాశ్చ భవేయుర్వ్యభిచారిణః,

విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే దస్యాస్వాద్యత్వమును బొందింపఁబడిన క్రోధస్థాయి రౌద్రరసమని చెప్పఁబడును. ఆతతాయియు, కొండెము చెప్పువాఁడు, పాపము మొదలయినవానిని జేయుమనువాఁడు, క్షేపము అవమానము మొదలయిన ఆక్రోశమును బంధనము వధము మొదలయిన హింసను జేయువాఁడు, ద్రోహముఁ జేయువాఁడును దీనికి ఆలంబనములు. దార్థ్యము, భయము లేకయుండుట, గర్వము, ఔద్ధత్యము, మొదలైన గుణములును, ఎవఁడురా నీవు ఏమి చేయుచున్నావురా అనునవి మొదలయిన క్రూరవాక్యములును, విరోధపుపలుకులు, తలయూచుట, నవ్వుట, వంకరగఁ జూచుట మొదలైనవియు, పెదవి కొఱుకుట, కనుబొమల ముడివేయుట, గ్రుడ్లు ఎఱ్ఱనై గిరగిర తిరుగుట, నేల కొట్టుట, భుజాస్ఫాలనము చేయుట, చేయి కట్టుట, గుద్దు లిడుట, చెక్కిళ్లు అదరుట, ఎఱ్ఱనిముఖకాంతి, చంపెడుయత్నము, భేదించుట, ఈడ్చుట, కొట్టుట, నఱుకుట, వస్త్రమును నదలించుట, మాటలాడుట, దండశస్త్రాదులను గ్రహించుట, పరుగులిడుట, చంపుట, కన్నీరిడుట, నెత్తురు త్రాగుట, మిక్కిలి తఱముట, ఓరి పాపీ, మనుష్యపశువా, ద్రోహి, నిలువు నిలువు, ఎచటికిఁ బోయెదవు, నీతల పగులఁగొట్టెదను, ఱొమ్ము చీల్చెదను, దంతములు రాలఁగొట్టెదను, దేహము నలియఁగొట్టెదను, ఇవి మొదలైనపలుకులును, భయము లేక యుండుట, సాత్వికము లేక యుండుట, అనుభావము లౌను. అమర్షము, మదము, స్మృతి, ఔత్సుక్యావేగములు, మోహము, గర్వము, ఈర్ష్య, చాపలము, ఉగ్రత ఈసంచారిభావములును గలవు.

రసాద్రసోత్పత్తిర్యథా

హాస్యో భవతి శృంగారాత్కరుణో రౌద్రకర్మణః
అద్భుతశ్చతథావీరాద్బీభత్సాచ్చ భయానకః.

395
శృంగారరసమువలన హాస్యరసము గలుగుచున్నది. రౌద్రరసమువలన కరుణరసము గలుగుచున్నది. వీరరసమువలన అద్భుతరసము గలుగుచున్నది. బీభత్సమువలన భయానకరసము కలుగుచున్నది.

రసానాం విరోధో యథా

ఉభౌ శృంగారబీభత్సౌ మిథో వీరభయానకౌ.

396


రౌద్రాద్భుతౌ తథా హాస్యకరుణౌ ప్రకృతిద్విషౌ,

శృంగారరసమును భీభత్సరసమును పరస్పరవిరోధులు. వీరరసమును భయానకరసమును విరోధులు. రౌద్రరసమును అద్భుతరసమును విరోధులు. హాస్యరసమును కరుణరసమును విరోధులు.

రసాః కార్యవశాత్సర్వే మిళంత్యేవ పరస్పరం.

397


ప్రథమం యో రసః ఖ్యాతః స ప్రధానో భవిష్యతి,

అన్నిరసములును కార్యవశమువలనఁ జేరుచున్నవి. వానిలో మొదట ఏరసము చెప్పఁబడుచున్నదో అది ప్రధానరస మనఁబడును.

ముఖ్యే రసే౽పి తే౽౦గత్వం ప్రాప్నువంతి కదాచన.

398

రసములలో ముఖ్యమైనరసమందు తదితరరసములు ఒకానొకసమయమందు అంగత్వమును బొందుచున్నవి.

సుచారిణాం రసానామప్యానుకూల్యమిహోచ్యతే,

8 రసములకును 33 వ్యభిచారిభావములకును పరస్పరానుకూల్యము చెప్పఁబడుచున్నది.

1 శృంగారవ్యభిచారిణామానుకూల్యం

సర్వే భావాః ప్రయోక్తవ్యాశృంగారే వ్యభిచారిణః.

389

శృంగారరసమందు 33 వ్యభిచారిభావములును ప్రయోగింపఁదగును.

2 వీరవ్యభిచారిణామానుకూల్యం

అమర్షశ్చ నిబోధశ్చ వితర్కో౽థ మతిర్ధృతిః,
క్రోధో౽సూయాథ సంమోహ ఆవేగశ్చాపి హర్షణం.

400


గర్వో మదస్తథోగ్రత్వం భావా వీరే భవంత్యమీ,

వీరరసమందు అమర్షము, విబోధము, వితర్కము, మతి, ధృతి, క్రోధము, అసూయ, సంమోహము, ఆవేగము, హర్షము, గర్వము, మదము, ఉగ్రత్వము ఇవి గలుగును.

3 కరుణవ్యభిచారిణామానుకూల్యం

దైన్యం చింతా తథా గ్లానిర్నిర్వేదో జడతా స్మృతిః.

401


వ్యాధిశ్చ కరుణే ప్రోక్తా భావా భావవిశారదైః,

కరుణరసమందు దైన్యము, చింత, గ్లాని, నిర్వేదము, జాడ్యము, స్మృతి, వ్యాధి ఈవ్యభిచారిభావములు గలుగును.

4 అద్భుతవ్యభిచారిణామానుకూల్యం

ఆవేగో జడతా మోహో హర్షణం విస్మయః స్మృతిః.

402


ఇతి భావాః ప్రయోక్తవ్యా రసజ్ఞైరద్భుతే రసే,

ఆవేగము, జాడ్యము, మోహము, హర్షము, విస్మయము, స్మృతి, ఈభావములు అద్భుతరసమందుఁ గలుగును.

5 హాస్యవ్యభిచారిణామానుకూల్యం

శ్రమశ్చపలతో నిద్రా స్వప్నో గ్లాని స్తథైవ చ.

403


శంకాసూయావహిత్థా చ హాస్యే భావా భవంత్యమీ,

శ్రమము, చాపలము, నిద్ర, స్వప్నము, గ్లాని శంక, అసూయ, అవహిత్థ, ఈవ్యభిచారిభావములు హాస్యరసమందుఁ గలుగును.

6 భయానకవ్యభిచారిణామానుకూల్యం

సంత్రాసో మరణం దైన్యం గ్లానిశ్చైవ భయానకే.

404
సంత్రాసము, మరణము, దైన్యము, గ్లాని, ఇవి భయానకరసమందుఁ గలుగును.

7. బీభత్సవ్యభిచారిణామానుకూల్యం

అపస్మారో విషాదశ్చ భయం రోగో మృతిర్మదః,
ఉత్సాహశ్చేతి విజ్ఞేయా బీభత్సే వ్యభిచారిణః.

405

అపస్మారము, విషాదము, భయము, రోగము, మృతి, ఉత్సాహము ఈవ్యభిచారిభావములు భీభత్సరసమందుఁ గలుగును.

8. రౌద్రవ్యభిచారిణామానుకూల్యం

హర్షో౽సూయా తథా గర్వ ఉత్సాహో మద ఏవ చ,
చాపల్యముగ్రతా చేతి రౌద్రే భావాః ప్రకీర్తితాః.

406

హర్షము, అసూయ, గర్వము, ఉత్సాహము, మదము, చాపల్యము, ఉగ్రత ఈభావములు రౌద్రరసమందుఁ గలుగును.

రామాదేర్హృది కారణోపజనితః కార్యైః ప్రతీతిం గతః
సంపుష్టస్సహకారిభిర్జనయతి స్థాయీ సుఖం వాసుఖం,
భావానామనువర్ణనానుకరణైః కావ్యే౽పి నాట్యే౽పి చ,
వ్యక్తో౽యం తు నిరాశ్రయస్సుఖకరస్సభ్యైరసశ్చర్వ్యతే.

ఇతి భరతరసప్రకరణం సంపూర్ణం.

ఆలంబనభూతనాయికానాయకులమనసున కారణముచేఁ గలిగినదై, కార్యములయిన అనుభావములచే జ్ఞానవిషయమును బొంది, సహకారులవ్యభిచారిభావములచే పోషింపఁబడి సాక్షియై, సంభోగశృంగారమునందు సుఖమును, విప్రలంభశృంగారమందు దుఃఖమును గలుఁగజేసి, భావముల అనువర్ణనానుకరణములచే కావ్యమందును, నాట్యమందును, వ్యక్తమై నిరాశ్రయమై సుఖకరమైనరసము రసికులచే నాస్వాదింపఁబడుచున్నది.

ఇట్లు భరతరసప్రకరణము ముగిసినది.