పుట:Yogasanamulu.djvu/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

199


కుట్టినను, పాములు ప్రక్కల నుండి పోయినను గ్రహింప లేని అవస్థ గల్గును. ఒకరు ఒక లెక్కను సాధించుట యందు నిమగ్నుడై నపుడు ఆకలిని కాలమును కూడ మరచును. అట్టి స్థితిని చిత్తయికాగ్రత యని చెప్ప వచ్చును. ఒక యోగి ఇతరుల యింద్రియములపై సంయమము చేసిన యెడల యోగి అభిమతాను సారముగా యితర వ్వక్తి నడచుకొనును. ఆయా విషములపై సంయమనము చేయుట చేత అయా విషయముల శక్తి పొందును. ఏనుగు బలము పైనను, పర్వతము యొక్క బరువు పైనను, దూది రేణువు యొక్క తేలిక స్వభావము పైనను సంయమనము చేసిన యా విషములను ప్రాప్తింప చేసుకొనును. ఇట్టి సిద్ధులు యోగాభివృద్ధికి, అభివృద్ధికి నిరోధకములు. సమాధిని విడిచిన కాలమున వ్వవహార స్థితి యందు యోగి యొక్క సంకల్ప బలమే సిద్ధులుగా వున్నవి. యోగి ఇట్టి సిద్ధులను ప్రకటించి లౌకిక ప్రపంచము లందు ప్రతిష్టా వ్యాపారమున చిక్కి విషయ లోలత్వమునకు గురియై ధ్యేయమును మరచు స్థితి పట్ట వచ్చును. అందు చేత సిద్ధుల జోలికి పోవుట నిరుత్సాహ పరచ బడినది.


ఓం శాంతి, శాంతి, శాంతిః.