పుట:Yogasanamulu.djvu/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

లంక సూర్యనారయణ


వచ్చిన చమటను తుడిచి వేయక శరీరములోని (చర్మములోనికి) రుద్ది అలసట పూర్తిగా తగ్గిన వెనుక అనగా అలసటకి శరీరములో కల్గిన ఉష్ణము చల్లారిన పిదప నులి వెచ్చని నీటితో స్నానము చేసి యోగాభ్యాసము చేయుటకు ఏర్పరుచు కొన్న గదిలో సువాసన ద్రవ్యములతో పరిమళించునట్లు అగర వత్తులు వంటివి వుంచి అతి ఎత్తును అతి పల్లమును గాకుండ నుండు నట్లు ఒక చక్క పీటను వేసుకొని దానిపై దర్భాసనము వేసి దానిపైన లభ్యమయినట్లయిన జింక లేక చిరుత పులి చర్మము పరచి లభించిన యడల అవసరము లేదు. దానిపై మెత్తగా నుండు గుడ్డను పరచి గది లోనికి ఎక్కువ వెలుతురు, శబ్దములు రాకుండ చేసి అట్టి స్థలములో ముందుగా సర్వాంగాసనము,శీర్ష్య, లేక విపరీత రకణీ ముద్రలలో ఒక దానిని చేసి తరువాత సరస్వతీ చాలనము చేయ వలయును.

గదిలో ఏర్పటు చేసుకొనిన పీట మీద తూర్పునకు గాని ఉత్తరమునకు గాని అభిముఖముగా పద్మ, సిద్ధ, స్వస్తిక, సుఖాసనములలో నొకదాని యందు కూర్చొని మనస్సును ఇస్ట దైవ మందు లగ్నము చేసి తరువాత కపాల భాతిని చేసి ముందుగా అష్ట కుంభకములను లేదా అందు ఒక దానిని గాని పూరక, కుంభక, రేచకములు 1: 4: 2 నిష్పత్తిలో నుండు నట్లు ఆచరించ వలయును. పర్యామమునకు ఇడా, పింగళ నాడులలో (కుడి, ఎడమ నాసికా రంద్రములలో ) 10 కుంభకముల చొప్పున ఒక వారము దినములు దినమునకు నాలుగు పర్యాయములు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అర్థ రాత్రిల యందు సాధన చేసి కుంభక కాలమును సంఖ్య