పుట:Yogasanamulu.djvu/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

లంక సూర్యనారయణ


మనము చేసిన ఏనుగంత బలమును పొంద వచ్చును. తేలికయగు వస్తువులపై సంయమనము చేసిన ఆ విధముగా తన వరువును కోల్పోయి తేలిక యగును. దూది వంటి వస్తువులపై సంయమనము చేసిన గాలిలో తేల వచ్చును. సూక్ష్మమగు వస్తువులపై సంయమనము చేసిన సూక్ష్మ మయిన శరీరమును పొంద వచ్చును. శ్రీ మద్రామాయణమున వాల్మీకి మహర్షి, ఆంజనేయ స్వామి యొక్క యోగ శక్తులను సముద్ర లంగన సమయమున లంకా ప్రవేశకాలమునను, లంకను కాల్చి రావణుని ఎదుటకు వచ్చి నపుడు మరి కొన్ని ఇతర సన్నివేశముల యందు వర్ణించిన విశేషములన్నియు యోగ శాస్త్రము నందు తెల్పిన సంయమనము వలన కల్గు అణిమాది సిద్ధులే. అట్లు మనస్సును కేంద్రీకరింప చేయుటకు నిర్ణయించు కొన్న వస్తువులపై లయము చేయ గల్గుటకు ప్రాణాయామము అభ్యసించి అందు ఉత్తీర్ణత పొందవలయును. ఈ ప్రాణాయామము వలన హృదయ స్థానమున నున్న ప్రాణవాయువు మూలాధారమున వున్న అపాన వాయువుతో సంయోగ పరచిన యడల కల్గు యోగాన్ని చేత శరీరమందలి అనగా సూక్ష్మ స్థూల నాడీ మండలము నందలి మలము లన్నియు శోషించి, దహింప బడి నాడి మార్గము పరిశుద్ధమై ప్రతి బంధరహితమగును. సుషుమ్న నాడీ ముఖమున కుండలిని యను శక్తి స్వరూపిణి నిద్రావస్థలో సర్పాకృతిని చుట్టలు చుట్టలుగా చుట్టుకొని యున్నదిని చెప్పబడినది. ఆ కుండలినీ శక్తి ప్రాణాయా మాభ్యాసము వలన కల్గు ఉష్ణము వలన మేల్కాంచి ప్రతి భంధకములు లేక పరిశుద్ధమైన సుషుమ్న నాడీ మార్గమున ప్రవేశించి అందలి