పుట:Womeninthesmrtis026349mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

75

(భర్తజీవించియుండగా నుపవాసముచేసి వ్రతముచేయు స్త్రీ భర్త యాయుస్సును హరించును. ఆమె నరకమునకు బోవును. తీర్థస్నానమును గోరుస్త్రీ భర్తృపాదోదకముగాని శరీరోదకముగాని త్రాగవలెను, ఆమె పరమపదము నొందును)

ఇట్లితరవ్రతముల నన్నిటినివదలి భర్తయే సమస్తవ్రతములునని భావించుస్త్రీకి పతివ్రతయని పేరు. ఇట్టి పతివ్రతలకు విష్ణులోకము గల్గుననగా వారిభర్తలకు కూడ గల్గుననియే యర్థము. ఆమెయు భర్తయు నెన్నడు నొండొరులను వీడరు.

    పతివ్రతానాం గృహమేధినీనాం సత్యవ్రతానాం
    చశుచివ్రతానాం తాసాం తులోకా: వతిభిస్సమానా:
(వసిష్ఠ. 21-14)

స్త్రీకి పతిలోకమును మించిన లోకములేదు. పతికి నప్రియము చేయుదాని కే లోకములభింపదు. కావున నెన్నడు నామె పతికప్రియము చేయరాదు.

    పాణిగ్రాహస్య సాధ్వీ స్త్రీజీవతో వామృతన్యవా
    పతిలోకమ భీపృంతీనా చరేత్కించి దప్రియం
(మను 5-156)

(భర్త జీవించియున్నను మృతిచెందిననుగూడ యోగ్యురాలగు స్త్రీ యాతని లోకమునుగోరుచు కొంచెమైనను నప్రియము చేయరాదు.)