పుట:Womeninthesmrtis026349mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

స్మృతికాలపుస్త్రీలు

అనగా: గౌరీ, శాలీమున్నగు నామములో చివఱివర్ణము 'ఈ' దానికి పూర్వము రేఫల కారములున్నవిగాన యట్టి నామములు నిషిద్ధములు.

వధువుయొక్క యంగసౌష్ఠవాది విషయములో

యస్యాంమనశ్చక్షుపోర్ని బంధస్తస్యామృద్ధిర్నేత రదాద్రియే తేత్యేకే.

(ఆ.గృ.సూ. 1-3-2)

ఎవతెయందు మనస్సు, దృష్టితగుల్కొనునో యామెను వివాహమాడిననే సంపదగల్గునుగాని మఱొక యాలోచన యక్కఱలేదని కొందఱు చెప్పుచున్నారు.

వధూవరుల వయస్సునుగూర్చి పూర్వాధ్యాయమున తగినంత విపులముగ చర్చింపబడినది. కాన నాయంశమీ యధ్యాయమున నెత్తుకొనబడలేదు.


_____________