పుట:Womeninthesmrtis026349mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

స్మృతికాలపుస్త్రీలు

(స్త్రీ దధిస్థాలివంటిది.)

అనగా: పెరుగు మంచిదే యైనను నపవిత్రస్థాలిలో దానినుంచినచో నది యపవిత్రమగునట్లు భార్య మంచి దేయైనను భర్త పతితుడగుచో నామెకును పతిత్వమంటి యామె స్త్రీ సంతతికూడ నపవిత్రమై గ్రహణార్హము కాకపోవునని దీనివలన తేలుచున్నది.

మొత్తముపైన పతితములగు కులములు పరస్పరము వివాహము చేసికొనుట మంచిదని యాపస్తంబుని యభిప్రాయము.

అభిశస్తా:............మిథోవివాహమానాః

(ఆపస్తం. 1-29-8)

(అభిశస్తులు పరస్పరము వివాహములు చేసికొనుచుండ వలెను.)

చాల ధర్మశాస్త్రములలో విడువకుండ చెప్పబడిన వధూలక్షణములు రెండుగలవు: (1) ఆమె కిదివఱలో వివాహమై యుండకూడదు. (2) ఆమె వరునికంటె చిన్నదై యుండవలెను.

అనన్యపూర్వాం యవీయసీం

(గౌతమ 4-1)

(పూర్వ మితరులచే పొందబడని దానిని తనకంటె చిన్న దానిని వివాహమాడవలెను.)