పుట:Womeninthesmrtis026349mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

స్మృతికాలపుస్త్రీలు

     హీనక్రియం నిష్పురుషం నిశ్ఛందోరోమశార్శనం
     క్షయ్యామయావ్యపస్మారి శ్విత్రికుష్ఠికులానిచ.
(మను 3-6, 7)

(గోవులు, మేకలు, ధనము, ధాన్యముగల్గి సమృద్ధములై గొప్పవై యున్నను నీ క్రింది పదికులములును స్త్రీసంబంధములో విడిచిపెట్టతగినవి: (1) జాతకర్మాది సంస్కారలోపము గలది (2) పురుషసంతతిలేనిది (3) వేదములు చదువుకొననిది (4) పెద్దరోమములు గలది (5) మూలవ్యాధికలది (6) క్షయవ్యాధికలది (7) అజీర్ణముగలది (8) అవస్మారవ్యాధిగలది (9) బొల్లికలది (10) కుష్టుకలది

సోదరులు లేని కన్యను వివాహమాడరాదను నంశమును 'స్త్రీసంతతి' యను నధ్యాయమున చూచియున్నాము.

ఈ దుర్గుణములు లేక, యితరదుర్గుణములున్నచో నా కులమునుండి కన్యమంచిదైనచో తెచ్చికొనవచ్చును.

స్త్రీరత్నం దుష్కులాదపి

(మను 2-238)

(దుష్కులమునుండినను మంచిస్త్రీనితెచ్చికొనవచ్చును)

దీనినిబట్టి మహాపాతకుని కన్యనైనను చేసికొనవచ్చునని తేలుచున్నది. అట్టికన్యను నివాహమాడుచో నాపూర్వ దినమున నామె నుపవసింపజేయవలెనని యాజ్ఞవల్క్యస్మృతి చెప్పుచున్నది.