పుట:Womeninthesmrtis026349mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాధ్యాయము

23

వివాహోష్టపర్షాయాః కన్యాయా ప్రశస్యతే

(సంవ. 10 శ్లో.)

(ఎనిమిదేండ్ల పిల్లకు వివాహము చేయుట ప్రశస్తము)

పండ్రెండవయేడు వచ్చునప్పటికి కన్యకు వివాహము చేయవలెనని యమస్మృతియు పరాశరస్మృతియు చెప్పుచున్నవి.

    ప్రాప్తేతుద్వాదశేవర్షేయః కన్యాంసప్రయచ్ఛతి
    మాసిమాసి రజస్తస్యా:పితాపిబతిశోణితం

(యమ. 11-22)

(పండ్రెండవయేడు వచ్చినదగుచుండగా నెవడు కన్యను దానము చేయడో యాతండ్రి యామె రజస్సును ప్రతిమాసమునను త్రాగుచున్నాడు.)

ఈశ్లోకమే పరాశరస్మృతిలో (8-5) నున్నది.

(5) అవివాహితయై యుండగా రజస్వలయైన స్త్రీయు, నామెతండ్రియు, తల్లియు, సోదరుడును, నామెను వివాహమాడినవాడును పతితులని తెల్పుకొన్ని శ్లోకములు పై సనీయబడినవి. గౌతమ వసిష్ఠులు రజస్వలా దాతను మాత్రమే నిందించినట్లుకూడ పైన చూచియున్నాము. తండ్రి ధర్మలోపము చేతను బుద్ధిహీనతచేతను సకాలములో వివాహితకాని కన్యగతి యేమికావలెనను ప్రశ్ననువేసికొని దానికి సమాధానములను గూడ గౌతమ వసిష్ఠులిచ్చియున్నారు. అట్టికన్య