పుట:Womeninthesmrtis026349mbp.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశాధ్యాయము

205

నరజస్వలాం

(గౌ. 9-30)

ఆమె నాలింగనము కూడ చేసికొనరాదు.

నచైనాం శ్లిష్యేత్

(గౌ. 9-31)

భార్య నైనను గూడ ప్రధమ రజోదర్శనము కాకుండ పొంద గూడదని 'ఋతావుపేయాత్‌' అనుటను బట్టియే తేలుచున్నను నట్టి స్త్రీని పొందుట మిక్కిలి నిషిద్ధమని చెప్పుటకు గౌతముడు వేరుగానిట్లు చెప్పుచున్నాడు.

నకన్యాం

(గౌ. 9-32)

(రజస్వల కాని దానిని పొందరాదు)

కన్యాశబ్దమున కిచట 'అరజస్వల'యే కాని 'యవివాహిత' కాదను నంశము ప్రకరణమును బట్తి స్పష్టము. గృహస్థు భార్య నెపుడు పొందవలెననునదియే యిచటి ప్రకరణము.

రజస్వల

వేదకాలపు స్త్రీలలో వివరింపబడిన రజస్వలా నియమములన్నియు స్మృతులలో నున్నవి. తైత్తిరీయ సంహితలో (2-5-1) ని విషయమంతయు కొంచెమించుమించుగ నామాటలతో నే వసిష్ఠస్మృతిలో చెప్పబడినది. (వసిష్ఠ. 5-17, 18, 19, 20) ఆస్మృతివాక్యముల నిటవ్రాయుట పునరుక్తియేయగును గాన వదలివేయబడినవి. రజస్వలను గూర్చి యితరస్మృతులలో మఱికొన్ని వివరములు గూడ గలవు.