పుట:Womeninthesmrtis026349mbp.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

స్మృతికాలపుస్త్రీలు

(గాయకుల భార్యల విషయమునను భార్య మానము వలన జీవించువారి భార్యల విషయమునను పై శిక్ష వర్తింపదు. ఏలన: అట్టి పురుషులు భార్యలను తార్చి రహస్యముగ వ్యభిచారములో ప్రవర్తింపజేయుచున్నారు. కాన నీ స్త్రీలతోను, దాసిలతోను, నొకని నుంచుకొనిన వారితోను, రహస్యముగ లేచిపొయిన వారితోను మాట్లాడుచో కొంచెము మాత్రమే సువర్ణదండ ముండును.)

ఇట్టి స్త్రీలే గాక వివాహములేక కేవలము వ్యభిచారమువలన జీవించు స్త్రీలు గూడ స్మృతులలో పేర్కొని యున్నారు. వ్యభిచారముచే వారార్జించు ధనము మిగిల పాపిష్ఠము కావుననే మనుస్మృతి వేశ్యల సొమ్ము తినువాడు స్వర్గాదిపుణ్యములోకముల నుండి దూరుడగునని చెప్పుచున్నది.

గణాన్నం గణికాన్నంచలోకేభ్యః పరికృంతతి

(మను. 4-219)

వేశ్యలను పొందినందులకు మాత్రము రాజదండన లేదు. అన్నిటికంటె హెచ్చు రాజదండన కన్యలను జెరచినందులకు నుత్తమజాతి స్త్రీని పొందినందులకును విధింపబడినది.

యో౽కామాందూషయేత్కన్యాం స సద్యోవధమర్హతి

(మను.8-364)

(తనను కామింపని కన్యను చెరచిన వానిని వెంటనే వధింపవలెను.)