పుట:VignanaSarvasvamuVol4.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దర్శన స్వరూప స్వభావములు 3 (ఉదా. థయము, ఆశ్చర్యము, విషాదము), సంఘర్ష జలు జీవితమునకు, లోకవ్యవహారమునకు ఆధారము లైనకల్పనలను లేదా అభ్యుపగ మములను (assump- tions) గురించి సవిమర్శకముగా ఆలోచించుటకు ప్రేరేపింపవచ్చును ఈ ఆలోచన, మననము సందేహ మునకు, విచికిత్సకు దారితీయును. ఈ సందేహములను, ప్రశ్నలను ఉపశ మనము చేయుటకు జరుగు చింతనమే దర్శనము. కొందరు వ్యక్తులలో ఈ చింతనకు నిశ్చిత పర్యవసానము రాదు. వారి సందేహములు తీరవు. ప్రత్యక్ష అనుమానములకు అందని దేదియు వారికి ఉండదు. లేదా అది వారికి శాశ్వత సందేహముగానే ఉండిపోవును. మరి కొందరిలో ఈ ధోరణి ఇంకను తీవ్రమై, ప్రత్యక్ష అనుమానములద్వారా గూడ నిశ్చిత జ్ఞానము అసాధ్య మని, ఏవో కొన్ని పునరుక్తి వాక్యములు (tautologous propositions. అవి ఏ రీతినై నను క్రొత్త జ్ఞానము నీయవు, యథార్థ తను గురించి చెప్పలేవు) తప్ప, నిరూపించుటకు యోగ్యమైన, పూర్ణముగా సత్యములైన ప్రతిపాద నలు లేవను వాదముగా ఏర్పడును. ఇట్టి వారికి లోక వ్యవహారమునకు ఆధారమైన దృష్టికి భిన్నమైన మరొక దృష్టి ఏర్పడదు. అయితే వారు దానిని పరీ క్షించి, విమర్శించి దాని అపర్యా ప్రతను మాత్రము తెలిసికొనగలుగుదురు. మరికొందరు తమ మనన చింతనలను నిశ్చిత జ్ఞానము పొందిన దనుక కొన సాగింప గల్గితి మను తృప్తిని పొందినందున వారికి తమ ఆలోచన ఫలముగా విశ్వమును గురించిన, మానవుని, అతని కర్తవ్య బాధ్యతా లక్ష్యములను గురించిన మరొక దృష్టి ఏర్పడిన దని, అది నైసర్గిక , వ్యావహారిక దృష్టి కంటే సమగ్రము, సంగతము అని విశ్వానము కల్గును. ఇట్టి దృష్టులే దర్శన ములు'*. ఫిలాసఫీ అను శబ్ధము మొదట జ్ఞాన ప్రేమ, సత్యాన్వేషణ అను అర్థములలో గ్రీసులో ఉపయోగింప బడెను. క్రమముగా అది విశాలము, గంభీరము ఆయెను. ప్రస్తుతము దానిని ఇక్కడ 'దర్శనము'ను వివరించిన రీతిగానే వివరించి అర్థముచేసికొనవచ్చును. దర్శముల ఆధారములు : దర్శనములు కేవల ప్రత్యక్ష అనుమానములపై ఆధారపడవు. అవి తర్కమును , ప్రత్యక్ష మును ఉపయోగించినను, అంత ర్దృష్టులను, ఆ యా అనుభవముల విశిష్ట వ్యాఖ్య లను, ఊహను, భావనా శ కిని ఆలంబనముగా తీసి. కొనును. అయితే కొందరు తమ తమ దర్శనములు అనుభవము పైన, బుద్ధి (reason) పైన మాత్రమే. పూర్తిగా ఆధారపడియున్న వని, అవి పూర్ణముగా హేతుబద్ధము లని అనుకొందురు. ఇతరులు ఇది. ఒప్పుకొనరు. సమగ్ర సత్య దర్శనము కేవల బుద్ధి. పైన ఆధారపడనక్కర లేదు. అది ప్రజ్ఞపైన, అంత రృష్టి పైన ఆధార పడవచ్చును. లేదా " అది ప్రత్యేక సందర్భములలో - విశిష్ట ఉద్వేగములు కలిగినపుడు, అరుదైన అనుభూతులు తారసిల్లినప్పుడు ఉద్భవించిన. మనన ఫలితము కావచ్చును. అట్టిచో అది ప్రత్యక్ష మునకు, అనుమానమునకు అందని విషయములను, విరుద్ధ విషయములను కూడ ప్రతిపాదింపవచ్చును. అయినప్పటికిని అడియు జ్ఞానమే. అయిన దాని స్వరూపము, తర్కము, పద్ధతి వ్యవహార జ్ఞాన , విజ్ఞానము (science)ల స్వరూపాదులకు భిన్నముగా నుండును. 'వీటి దృష్ట్యా దానిని రుజువు చేయుట కాని, దానిని అపహతము చేయుట కాని కూడదు' అని కొందరి మతము. దీనికి విరుద్ధముగా 'దర్శనము ఎన్నటికిని జ్ఞానము కాజాలదు. అది కేవలము శ్రద్ధ ( faith) మాత్రమే' అని కొందరి వాదము. జీవిత మునకు లక్ష్య నిర్దేశము చేయుటకు విలువలను, ప్రమాణములను (standards) నిర్ణయము చేసి వాటి కనుగుణముగ ఒక గమ్యమునకు చేరునట్లు బ్రతుకు టకు, రిక్తత, నిర్వేదము, నిస్పృహలకు పాల్పడి జీవితము విచ్ఛిన్నము కాకుండ ఉండుటకు శ్రద్ధ అవ సరము. విజ్ఞానము, ప్రత్యక్షము ఈ పనులను చేయ లేవు. శ్రద్ధ భావరూపము, ఆసందిగ్ధము, సంస్థాపకము అగు నిష్ఠ. ఆది అభావాత్మకము, నాస్తి గర్భము, సంశయాత్మకము, నిషేధాత్మకము, సంహారకము కాదు. అయితే శ్రద్ధ యొక్క నిజ స్వభావము నెరిగి, అది జ్ఞానము కాదని గ్రహించి, దానిని పరీక్షించి,