పుట:Venoba-Bhudanavudyamamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7


కూడా 1932 సం||లో గాంధీజీ రౌండు టేబులు సమావేశము నుండి తిరిగివచ్చిరి. ప్రజల హింసాత్మక, వుద్రేక పూరిత కార్యములను నుంచి వినోబాజీ చాలబాధపడిరి. బహిరంగ సమావేశములో వారిచ్చిన వుపన్యాస ఫలితంగా, వారు తిరిగి ఖైదుచేయబడిరి. తాను ఆరు మాసముల జైలు జీవితమును "ధులాయి" జైలులో గడిపిరి. ఇచ్చట వారు తెల్పిన విషయములు గమనించిన , వారి నిరంహకారము, నిరాడంబరము విశదపడగలవు. వారీ విధంగా అనిరి

"ప్రజలు సాధారణంగా రామాయణ పుదహరణతో మాట్లాడుతూ వుంటారు. ఆంగ్లేయు ప్రభుత్వమును రావణునితోను, మహాత్మాజీని శ్రీరామునితోను పోలుస్తూ, వల్లభాయిని హనుమంతునితోను, జవహర్ లాల్‌ని అంగదునితోను పోలుస్తువుంటారు. నే నెవరితో పోల్చుకొనవలెనని ఆలోచించగా, రాయిగా మారిన అహల్య నాకు సరిఅయిన పోలికఅని తెలిసినది. అవిధమైప రాయి కాగల్గిన, నేను చాల అదృష్టవంతుడనని తలంచుచుందును."

బాపూజీ, వినోబాజీల మధ్య జరిగిన కొన్ని వుత్తర ప్రత్యుత్తరములను గమనించిన, వారి హృదయములు, పారిసన్నిహితత్వం భోదపడగలవు. వినోబాజీ తాను నల్వాడలో నివశించదలంచిన సమయములో మహాత్మాజీ కొక లేఖ వ్రాసియుండిరి. అందు వా రీవిధముగ వ్రాసిరి. "వార్ధా ఆశ్రమం త్వరలోనే ద్వాదశవర్ష ప్రాయమగును. వుత్తమమైన అనుభవములు కల్గినవి. భగవంతుడే సత్యమనే విశ్వాసము దృఢమవుచున్నది, మీప్రోత్సాహము లేనియెడల నేనింతకాల మిచ్చట నివశించి వుండువాడను కాదు. ఈ ప్రపంచములో మీ ఆశీర్వవచనము తప్ప, నేనేది ఆశించుటలేదు. ఈ ద్వాదశ వర్ష జీవితములో, నియమములను జాగ్రత్తగా పాటించుటకు నిరంతరము ప్రయత్నించితిని. అయినను కొన్ని లోటుపాట్లుండవచ్చును . కాని నాదీక్షార్షతకన్న అధికముగా పరమేశ్వరుని ఆశీర్వచనము నాకు లభించినది.”

"మీ ఆశీర్వచన మెప్పుడు నాకు లభించుచున్నప్పటికి, ఆశీర్వదించమని తిరిగి కోరుచున్నాను. అల్పజ్ఞనకు మీరే రక్షణ యివ్వవలసి పున్నవి. మీ పవిత్ర కార్యములో నుపయోగపడు ఆర్హత భగవంతుడు నాకు ప్రసాదించవలెనని ప్రార్ధించుచున్నాను. భవిష్యత్తుకేమైన సూచన