ఈ పుట ఆమోదించబడ్డది
31
ఆనంద ప్రకటనము చేయుచుండెడివారు. ఇట్లు ఉద్యోగ ప్రాథమిక దశ కొంత కాలము జరుగుచువచ్చెను.
వేంకటరామా రెడ్డి గారికి వివాహము బాల్యమందే (అనగా వారు 6-07 సంవత్సరాల వయస్సువారుగా నుండి నప్పుడు జరిగి యుండెను. వారి భార్య పేరు రంగమ్మ. వారును రాయణి పేట గ్రామమువారే. విలియం వహబ్ గారి జ్ఞాతివర్గము లోని వారు. వివాహకాల మప్పుడు వరునికి ఒక వెండి మొల తాటిని, రెండుమూడువందల రూపాయీలను వరదక్షిణగా నిచ్చుట కొప్పుకొని యుండిరట. వెండి మొలత్రాడు మాత్రము యియ్యక నేపోయిరి!!