పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టించుటకు ముందుగ బంతులవారి యభిప్రాయముం దెలిసికొనిన మేలనియెంచి యీ ఫిబ్రవరినెల 4, 5 తేదులలో జెన్నపురికింబోయి వారికి మావిమర్శన గ్రంథమునంతయుం జూపితిమి. పంతులవారు మావిమర్శనముం గనుంగొని యే కారణముననో మీపత్రికం బ్రకటించినచో దీనికిం బ్రత్యుత్తరమిచ్చెద నని యుత్తరమిచ్చిరి. ఇయ్యుదంతమంతయు మహారాజశ్రీ పనప్పాకము శ్రీనివాసాచార్యులతో విన్నవించితిమి. పంతులవారు చెప్పినచొప్పున జేయుడని శ్రీనివాసాచార్యులవారును మాతో మందలించిరి. మేము మాస్వస్థలముం చేరినతర్వాత, 1894 సం. మార్చినెల పత్రిక ముద్రింపించుచుండగా శ్రీ పంతులవారు చెన్నపురినుండి మాకు నొక జాబువ్రాసిరి. [...ఇట జాబు ఉదాహరింప బడినది.] మా మార్చినెల పత్రిక యప్పటికే ముద్రితమై యుండినందున గాలము మిగిలినదని బదులులిడితిమి. (ఈ పద్యములలోపములను మేము పంతులవారికిం దెల్పినారము. మార్చి సంచికంజూచిన విస్పష్టమగును.) తాము వ్రాసిన పద్యముల బ్రకటింపలేదను కోపముతో మార్చినెల పత్రికయందలి మాయాక్షేపణలకు బ్రత్యుత్తరము లిచ్చుచు శ్రీ సిద్ధాంతి శివశంకరశాస్త్రులవారు వ్రాసినట్లుగ గొన్ని పద్యములువ్రాసి మమ్మునిందించిరి. ఆపద్యముల మేనెల సంచికలో బ్రకటించుచున్నారము, ఇందువలన బ్రప్రథమమున గచ్చకు గాలుద్రవ్వినవారే రైనది విజ్ఞు లెఱుంగుదురుగాత.