పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనివ్రాసినారు. 'ఇంకా వ్రాస్తున్నావా?' అని దొర సిరాబుడ్డిని ఎత్తుకొని పోయినాడు. చిటికెనవ్రేలికి ఎంగిలి తగిలించి తడిచేసి 'దినకరద్వయంబు తేటగీతి' అని పూర్తిచేసినారు. దొర యీ మారు తెలివిగా పేపరునే ఎత్తుకొని పోయినాడు. ఈ గందర గోళములో శాస్త్రులవారు తమ నెంబరు వ్రాయలేదు ఇంతటి ప్రయాసము నిష్ఫలమగును. సగముదూరము ఇంటివైపు పోయినవారు వెనుకకువచ్చి ప్యూనునుప్రార్థించి దొరలేనప్పుడు పోయి తమ నెంబరువ్రాసికొని యింటి కరిగిరి.

ఆంధ్రసారస్వత సభవారు వీరికి మహోపాధ్యాయ బిరుదమును 1116 రు., ల నొసంగి సత్కరించిన సమయమున సభలో నిట్లుచెప్పిరి. '1875 వ సం., ఎఫ్.ఎ, కై విశాఖపట్టణముజిల్లా నరిసీపట్టణము అసిస్టంటు కల్లెక్టరు కచ్చేరి లోని యుద్యోగమును మానుకొంటిని. ఆంధ్రము, ఆంగ్లము, గణితము - అను మూడే విషయములచే ఎఫ్, ఏ., లో రెండవతరగతిలో 5 వ వాడనుగా జయ మొందితిని." అని.


_________