పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయి నాయనకు రు 5 జీతము తగ్గింపుడని కోరుట కొఱకంచు అనగా వారికి అర్థము తెలియక కొంతచర్చయు పరిహాసమును జరుగుట.

టైలరుదొరగారు, రోజాపుష్పములు - గోచిలేని చిన్నదట్టి. దొరవారి యాక్షేపము. అవధూతాశ్రమము అని నేను వచింపగా దొరవారు సమాధాన పడినట్లు నటించుట. ఒకనాడు రాత్రి నాయనగారు నన్ను వీథిలోనికిత్రోసి తలుపు వైచుట అంతట చింతాతయ్యాగారి యింటికి పోవుట.

మాపొరుగు ఎడమవైపున గోటేటివారు వారి యింట దొండపాదులు మెండు. సదా ఆదొండపిందెలను కాయలను నేను భక్షించుచుండుట. మాయింటికి కుడివైపు పొరుగు రేవువారు. రేవు సీతమ్మగారు మా నాయనగారికి రు 120 అప్పిచ్చుట - ఆపైకమిచ్చి నాయనగారి యుత్తమర్ణు నొక యుపాదాన బ్రాహ్మణుని, వడ్డిగొనుటయేగాక నిత్యాతిథిని తొలగించుట. పులిపాకవారు మాకు సదా వైద్యము చేయించుచుండుట.

పోడూరు - సోంభట్ల వెంకటజోగయ్యగారు మా నాయనగారియొద్ద నైషధము చదువుచుండిరి. రాజులు కొందఱు వసుచరిత్ర చదువుచుండిరి. వెంకటసుబ్బయ్యకు గడ్డి మేటి నుండి వెంటిపట్టుకొని దిగుచుండగా జాఱిపడినందున చేయి విఱిగినది. దానిని ఒడ్డూరనుగ్రామములో రాజులు కట్టి కుదిర్చినారు. అక్కడ ప్రతి తరగతిలోను నేనే మొదటివాడను. పై