పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2-ప్రకరణము

వేంకటరాయ శాస్త్రులువారి బాల్యము

శ్రీ వేంకటరాయశాస్త్రిగారు 1853 సం. డిసంబరు 21 రారీఖున (ప్రమాదీచసంవత్సర మార్గశీర్ష బ 6 లు బుధవారము) మదరాసులో జనించిరి. అప్పుడు వీరితండ్రిగారు, మదరాసులో సంస్కృతాంధ్ర ద్రావిడ పాఠశాలలో ప్రథానపండితులు. తర్వాత రెండేండ్లకే వేంకటరమణశాస్త్రులవారికి కాకినాడలో నుద్యోగ మైనది. వేంకటరాయశాస్త్రులవారి బాల్యమంతయు తండ్రిగారితోకూడ నాంధ్రదేశమున పలుతావుల గడచినది. బాల్యమునుండియు కంటబడిన వస్తువును కనులార జూచి చెవుల బడినవానిని చెవులారవిని ఆనందించి ఉత్తరకాలమున గ్రంథస్థములంజేసినారు. ఆ సునిశితబుద్ధికి అన్నియు జ్ఞాపకములే. రసాత్మకవాక్య మేది ఆయన చెవింబడినను మఱి యా హృదయమును వీడదు. ఆంధ్రదేశమును వర్ణింపను ఆంధ్రప్రతిభను లోకమునకు ప్రకటింపను వారికి బాల్యమందే ఆశజనించినది; ప్రతాపరుద్రీయ బొబ్బిలి యుద్ధనాటకములందు రూపు దాల్చినది.

ప్రతారుద్రీయనాటకరచనాబీజము వారి హృదయమున వారి యెనిమిదవయేటనే పడినది. ప్రతాపరుద్రీయనాటక ప్రథమముద్రణావతారికలో నిట్లు వ్రాసినారు. "ఓరుగంటి ప్రతాపరుద్ర మహారాజును తురకలు డిల్లీకి ఖయిదు కొని