పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1-ప్రకరణము

తండ్రిగారు

నెల్లూరుజిల్లా కావలితాలూకాలో నిసుకపల్లెకు సమీపమున సముద్రతీరమున మల్లయపాళెమను గ్రామమును వేదము వారు పుదూరుద్రావిడ బ్రాహ్మణులు సోమపీథులు సర్వాగ్రహారముగా బడసి చిరకాలముగా ననుభవించుచుండిరి. వేదశాస్త్రము లందు బ్రఖ్యాతులగుటచే వీరికి వేదమువా రని పౌరుషనామము. ఈ వంశమున వేంకటరాయ శాస్త్రులవా రని, "వేదశాస్త్రములందు బ్రఖ్యాతులు, అప్రతిగ్రాహకులుండిరి." వీరిసతి అనంతమ్మగారు. ఈ దంపతులకు మువ్వురుకుమారులు జనించిరి - వేంకటేశ్వర శాస్త్రిగారు, వేంకటరమణశాస్త్రులవారు, విశ్వపతిశాస్త్రులవారు నని. మువ్వురును మంచి వైదుష్యము నార్జించిరి. వీరిలో వేంకటేశ్వరశాస్త్రిగారు. అధ్వర్యులుగానుండి పెక్కు క్రతువులు జరిపించినవారు. యజ్ఞాదికములలో వారుచెప్పినదే ప్రమాణము. తండ్రిగారు, వేంకటరాయశాస్త్రిగారు, మధ్యప్రాయమునందే చనిపోయిరి. వారి పెద్దకుమారులు కుటుంబము నిర్వహింపసాగిరి. వేంకటరమణశాస్త్రులవారు పండ్రెండవయేటనే 1830 సం. ప్రాంత్యమున యిలువీడి కంచికి విద్యాభ్యాసమై తరలిపోయిరి.

కంచిలో నివర్తి వేంకటరామశాస్త్రులవారు ఆకాలమున సుప్రసిద్ధపండితులు. నాటికి కంచి యింకను తనపూర్వవిద్యా గంధమును కోలుపోలేదు; విద్యావిషయములలో దక్షిణభారత