పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనవినోదినీ సంపాదకత్వమును మానుకొనుట (?)

నాగానందనాటక ప్రకటనము. పాత్రోచితభాషా ప్రారంభము.

1894 కొక్కొండ వేంకటరత్నము పంతులవారి బిల్వేశ్వరీయమును పూండ్ల రామకృష్ణయ్యగారు విమర్శించుట.

1895 ధ. రా. గారి చిత్రనళీయ ప్రకటనము.

1896 శాస్త్రులవారి ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలనాటక ప్రకటనము.

1897 ప్రతాపరుద్రీయనాటక ప్రకటనము

కన్యాశుల్కము. అప్పారావుగారిది.

ఏప్రిలు - ఆంధ్ర కవి పండిత సంఘము. ప్రథమ సమావేశము.

1898 జక్కన విక్రమార్కచరిత్ర ముద్రన విమర్శనము. శారదాకాంచిక ప్రథమకింకిణి. ఆంధ్ర ప్రసన్న రాఘవనాటక విమర్శనము. శా. కా. ద్వితీయకింకిణి.

1899 జనవరి 1 తేది. ఆంధ్ర కవి పండిత సంఘ ద్వితీయ సమావేశము.

ఏప్రిలు 31 తేది. ఆంధ్ర భాషాభిమాని సమాజ ప్రారంభము నెల్లూరు.

1900 కాళహస్తి మహాత్మ్య ముద్రణ విమర్శనము. శా. కా. 3 కింకిణి.

వేంకటరమణశాస్త్రులవారి నిర్యాణము.

1901 గ్రామ్యభాషా ప్రయోగ నిబంధనము. శా. కా. 4 కింకిణి.

మోచాకుసుమామొదవిచారము శా. కా. 5 కింకిణి (?)

మార్చి - శేషగిరి శాస్త్రులవారి నిర్యాణము.

ఉషానాటక ప్రకటనము.

1902 మేఘసందేశము పదప్రయోజనిక

1904 సెప్టెంబరు 1 తేది పూండ్ల రామకృష్ణయ్యగారి నిర్యాణము.

ఆముద్రిత గ్రంథ చింతామణి నిలిచిపోవుట.

1908 అక్టోబరు. జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను మరల నెలకొల్పుపుట.