పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గడిదేరినపిమ్మటనే ప్రయోగము కావింపవలయును. ఒండుచో నటులు నానావిధముల కవికిని, ఒజ్జకును అవమానముందెత్తురు."

చెకుముకిపాత్రను ధరించుటకు ప్రయత్నించుచు శిక్షనందుచుండిన శ్రీ కాళహస్తి సుబ్బయ్యశాస్త్రిగారికి తాతగారొకమా రిట్లు వ్రాసియుండిరి. The play will not be staged unless the actors are made to be thorough with their parts in every way. You should keep sound health, If necesssary Cod-liver oil will strengthen the voice. అని నటుల యారోగ్యాదివిషయములలోగూడ తాతగారు శ్రద్ధవహించుచుండిరి.

ఒద్దికలుకుదిరినవని తలంచినవెనుక నాటకప్రదర్శనమునకు ముందు ఒకమారు వేషములువేసి ఒద్దికలుజరుపువారు. తమ డైరిలో నొకమారు డ్రెస్సురిహార్సలు లేనందున నాటకము చక్కగా శోభిల్లలేదని వ్రాసికొనిరి.

1916 సం మున బొబ్బిలి యుద్ధనాటకమును క్రొత్తగా శాస్త్రులవారు రచించిరి. శాస్త్రులవారి నాటకములనేగాని ఇతరుల నాటకములను ప్రదర్శింపని ఈనట సమాజమునకు శాస్త్రులవారి క్రొత్తరచన అభిలషణీయమైనది. ఈకాలమునకు సమాజములో కొంత మార్పుకలిగినది. దొరస్వామయ్యంగారు చీలిపోయి ప్రత్యేకముగా నొక సమాజమును నిర్మించుకొనిరి. ఏవేవోనాటకములను ప్రదర్శించు కొనసాగిరి. ఆంధ్రభాషాభిమాని సమాజమునకు ఈనూతన నాటకమునకు నాయకపాత్ర