పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాదులలో చాలకుశలులు. బాల్యములో లెక్కలేని ఆటపందెములలో ప్రసిద్ధినందిరి. సాండోపద్ధతి నవలంబించి శరీర వ్యాయామమొనరించి మహాబలిష్ఠులుగాను బలవంతులుగా నుండిరి: మదరాసులో నుండిన జెట్టీలును మల్లురును వీరికి దాసులు. గుఱ్ఱముల పిచ్చియొకటి అధికముగా నుండెడిది. గుఱ్ఱపుస్వారి నేర్చుటయేగాక వానిని పందెములకు తయారుచేసిరి. ఏకకాలమున ఇంట మూడునాలుగు ఉత్తమాశ్వములను సిద్ధముగా నుంచుకొని యుండువారు. వీరపురుషోచితమైన జీవితమునుజరిపిరి. ఒకపాటి సంస్కృతాంధ్రములలో ప్రవేశముండినది. తాతగారి ఆముక్తమాల్యదా వ్యాఖ్యకు, తాతగారు చిత్తుగావ్రాసిన దాని నంతయు మరల ముద్రణోచితముగా నకలువ్రాయుచుండిరి. మొదటి నాలుగై దాశ్వాసములకు వీరువ్రాసిన దంతయు పదిల పరచియున్నాడను. తాతగారి వ్రాతకును వీరివ్రాతకును తటాలున భేదముకనిపట్టుట కష్టము. ఇంగ్లీషు వ్రాతయు నట్టిద కాని వీరివ్రాత తాతగారి వ్రాతకన్నను సుందరము. అరేబియన్‌నైట్సు ఎంటర్టేన్‌మెంట్సు కథలను సమగ్రముగా తెనుగులోనికి తర్జుమాచేసి ఏకారణముచేతనో వ్రాతప్రతిని చింపివేసిరి. కృష్ణ లీలాతరంగిణి వీరికి గుడ్డిపాఠము. కంఠస్వరము అతిమనోహరము. ఏమైననేమి, కొంతకాలమైన తర్వాత, విశేష శరీర వ్యాయామమొనరించువారికి అభ్యాసమగునట్టివికొన్ని వీరికలవడినవి. క్రమముగా అభినియలవాటైనది. 'ఎల్లమందుల గెలుపొందు నల్లమందు.' తొలుత ఇదిదేహదార్డ్యమున కుపకరించి