పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర భాషోజ్జీవనమే నిజజీవిత పరమార్థముగ జేసికొని నిత్యప్రకాశమానమైన కీర్తిచే విరాజిల్లునీ శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారికి దాము 'కళాప్రపూర్ణ' నామక ఉత్తమ బిరుదమును బ్రసాదింతురని నాప్రార్థన."

శాస్త్రులవారి జీవితము మఱువదగినదికాదు. ఆబాల గోపాలము ఎల్లవారును మనసున స్థిరముగ నుంచుకొనవలసినది. మహనీయుల జీవితములట్లు సన్మార్గబోధకములును పురోవృద్ధి కారణములునైన శక్తులు వేఱెవ్వియులేవు. ఈ మహనీయుని ఆశ్చర్యజనకమైన జీవితచరిత్రను అతని మనుమడును తన్నామాంకితుడునైన యువకుడు రచించియుండుట నాకు జెప్పరాని యంత ముదమును మెప్పును గలిగించుచున్నది. ఆంధ్రవాఙ్మయమున ఆంగ్లసారస్వతమునందుంబోలె జీవితచరితాది రచనలు కావలసినంత తఱుచుగా లేవు. అట్టిలోపమును పూరించు గణ్యములైన ప్రయత్నములలో నిదియొకటి. శ్రీ శాస్త్రులవారి జీవితమునందలి ఆయాదశావిశేషములను వారికడన వినియుండినందువలనను వారిగ్రంథములను పఠించుట చేతను శ్రీవారి స్వకీయ భాండాగారమునందలి వ్రాతల సాయముచేతను ఈరచనవీరికి సాధ్యమైనది. ఇతరు లింత సమగ్రమును సత్యమును అయిన చరిత్రను వ్రాసియుండ జాలరు. శైలియు మంచిది; నిర్దుష్టము; స్పష్టము. ఈయువకుడును తాత